Karthika Deepam2 : వాళ్ళిద్దరి పెళ్లి చేసిన దీప.. షాక్ లో కార్తీక్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -159 లో.... శ్రీధర్ ని దీప లోపలికి రాకుండా చేసి.. స్వప్న, శ్రీకాంత్ ల పెళ్లి ఆగిపోయేలా చేస్తుంది. పెళ్లి కొడుకు అమ్మాయి పోయే ఆస్తి పోయే అంటూ అక్కడ నుండి వెళ్లిపోతాడు. ఇక ఇంటికి వెళ్ళండి అని దీప అనగానే.. ఇప్పుడు మా డాడ్ ని ఎలా ఆపారో తెలియదు కానీ ఆపారు.. కానీ ఇప్పుడు కాకపోయినా మళ్ళీ నాకు పెళ్లి చేస్తాడని స్వప్న అనగానే.. ఇప్పుడు మా పెళ్లి చేస్తేనే దీనికి సొల్యూషన్ అని కాశీ అంటాడు. దాంతో దీప షాక్ అవుతుంది. ఆ తర్వాత మాకు ఇప్పుడు పెళ్లి చెయ్యండి అంటూ దీపని ఇద్దరు రిక్వెస్ట్ చేస్తారు.