English | Telugu

నీతోనే డాన్స్ సీజన్ 2 రెడీ...

నీతోనే డాన్స్ 2 . 0 రెడీ ఐపోయింది. ఇక డాన్స్ లవర్స్ కి పండగే పండగ. ఈ షో నెక్స్ట్ సీజన్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. దీనికి ఇంతకుముందులాగే శ్రీముఖి హోస్ట్ గా చేస్తోంది. ఈ నెల 23 న గ్రాండ్ గా లాంచ్ కాబోతోంది ఈ సీజన్. అలాగే ప్రతి శని-ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు స్టార్ మాలో ప్రసారం కాబోతోంది. ఇందులో 10 జోడీలను తీసుకొచ్చారు. మళ్ళీ జడ్జ్ గా రాధ, సదా, తరుణ్ మాష్టర్ వచ్చేసారు. జోడీస్ గా మానస్-శుభశ్రీ రాయగురు, నయని పావని-ప్రిన్స్ యావర్, విశ్వ-నేహా, బాలాదిత్య -పూజా మూర్తి, దర్శినిగౌడ-పృథ్వీ శెట్టి, విష్ణు-వరలక్ష్మి, ఏక్ నాథ్-హరిక ప్రస్తుతానికి ఈ జంటలు తెలుస్తున్నాయి. ఇక మరో మూడు జంటలు ఎవరు అని తెలియాల్సి ఉంది.

ఈ జంటలు చేసిన పెర్ఫామెన్స్ మాములుగా లేదు. మంచి మాస్ మసాలా స్టెప్పులతో, రొమాంటిక్ డాన్స్ లతో అదరగొట్టారు. ఇలా కొంతమంది బిగ్ బాస్ సీజన్ 7 వాళ్ళు కొంతమంది సీరియల్ యాక్టర్స్ కనిపించరు. నీతోనే డాన్స్ సీజన్ 1 మంచి ఎంటర్టైన్ తో పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. సీజన్ 1 ఆట సందీప్-జ్యోతి రాజ్ టైటిల్ ని గెలుచుకున్నారు. ఇక ఈ సీజన్ 2 ప్రోమోలో మానస్ ని ఆట పట్టించింది శ్రీముఖి. "డ్యాన్స్ షో కదా మరి.. రొమాన్స్‌లు ఉంటాయి.. మన వైఫ్‌కి ఓకేనా " అనేసరికి "మన వైఫ్ ఏంటి" అంటూ షాకింగ్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు మానస్. ఐతే సీజన్ 1 లో నటరాజ్ మాష్టర్ తో ఐన గొడవలు చూసాం.. ఆయన మంచి కంటెంట్ ఇచ్చారు. మరి ఈ సీజన్ లో చూడబోతే కంటెస్టెంట్స్ అంతా కూడా చాలా సాఫ్ట్ గా కనిపిస్తున్నారు. అంత గొడవలు పెట్టేవాళ్ళు ఎవరూ లేరు. మరి ఆ గొడవలు పెట్టే కాండిడేట్ ఎవరై ఉంటారు అని ఆడియన్స్ ఆలోచిస్తున్నారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.