మోడీ ఇమేజ్ డ్యామేజ్ చేసిన కొవిడ్
కొవిడ్ 19 సెకండ్ వేవ్ కట్టడిలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. విమర్శలు ఎదుర్కుంటోంది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,ఇమేజ్ జాతీయంగానే కాదు, అంతర్జాతీయంగానూ మసక బారింది.రాజకీయంగానూ ఆ ప్రభావం కనిపిస్తోంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో, బీజేపీ/ఎన్డీఎ కూటమి పోగొట్టుకున్నది ఏదీ లేక పోయినా, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ లో జరిగిన గ్రామీణ స్థానిక ఎన్నికల్లో, కరోనా దెబ్బ పడింది. చివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి పరిధిలో సైతం బీజీపీ ఓటమి చవి చూసింది.
దేశంలో కరోనా సృష్టించిన భయంకర వాతావరణం ఎన్నికల ఫలితాలతో పాటుగా సాధారణ ప్రజల్లో సైతం కేంద్ర ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంచింది.ఒకప్పుడు బీజేపీనీ, మోడీని నెత్తిన పెట్టుకున్న అభిమానులు సైతం,మోడీ రాజీనామా చేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్’తో గొంతు కలుపుతున్నారు. చివరకు అనుపంఖేర్ వంటి మోడీ హార్డ్ కోర్ సపోర్టర్ కూడా, ఎక్కడో ఏది తప్పు జరిగింది, ఆ తప్పును తక్షణం సరిదిద్దుకోవాలి అని అన్నారు. నిజానికి ఒక్క అనుపం ఖేర్ మాత్రమే కాదు, బీజేపే కార్యకర్తలు,అభిమానులను కూడా సెకండ్ వేవ్ కట్టడి విషయంలో మోడీ,మోడీల వ్యవహరించలేదని అసంతృప్తిని వ్యక్త పరుస్తున్నారు.
ఇటు బీజేపీ, అటు సంఘ్ పరివార్, డ్యామేజి కంట్రోల్, నష్ట నివారణ చర్యలకు శ్రీకారం చుట్టింది. శనివారం క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, దేశంలో పరిస్థితిని సమీక్షించారు. ఇంతకూ ముందు కూడా ప్రధానమంత్రి ముఖ్యమంత్రులతో, అధికారులతో పరిస్థితిని సమీక్షించారు.సూచనలు, సలహాలు ఇచ్చారు. అయితే శనివారం శనివారం నిర్వహించిన సమావేశంలో ప్రధాన మంత్రి గతానికి కొంత భిన్నంగా మాట్లాడారు. సమస్యల పట్ల కొంత భిన్నంగా స్పందించారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ( ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్ తొలిసారిగా, దేశంలో నెలకొన్న కొవిడ్ పరిస్తితులతో పాటుగా , కొవిడ్ రాజకీయలు, స్వయం సేవకుల కర్తవ్యం సహా అనేక సంబందిత విషయాల గురించి సమగ్రంగా చర్చించారు.సంఘ్ పరివార్ సంస్థలు ఏర్పాటు చేసిన, ‘కొవిడ్ రెస్పాన్స్ టీమ్’ అధ్వర్యంలో ‘పాజిటివ్ అన్ లిమిటెడ్’ పేరిట ప్రారంభమైన ఉపన్యాస పరం పరలో మోహన్ భగవత్’ తొలి ఉపన్యాసం చేశారు. ప్రస్తుత సంక్షోభానికి, ప్రభుత్వాలు,పాలకులు,ప్రభుత్వ యంత్రాంగం, ప్రజలు అందరికి అందరం, బాధ్యులమే అన్నారు. కరోనా తొలి వేవ్ సర్దుకున్న తర్వాత, అందరికి అందరం, కరోనాను నిర్లక్ష్యం చేశామని, ఫలితంగానే ప్రస్తుత సంక్షోభం తలెత్తిందని,అన్నారు. అయితే అదే సమయంలో భగవత్, ఉపన్యాస నిర్వాహకులు, కోరిన విధంగా ‘పాజిటివిటీ’ గురించి మాట్లాడడం కష్టమని, అనేక కుటుంబాలు ఆప్తులను, కుటుంబ పోషకులను కోల్పోయి దిక్కు తోచని స్థితిలో, తీవ్ర విషాదంలో ఉన్నప్పుడు సానుకూల ఉపన్యాసం చేయడం కష్టమని అన్నారు. వాస్తవ పరిస్థితి నుంచి తప్పించుకోలేమని,అన్నారు.
ప్రతి విషయాన్ని వ్యతిరేక, నిరాకరణ ధోరణితో చూడడం కూడా తగదని అన్నారు. అసలు ఎమీ జరగలేదనీ అనలేము. పరిస్థితి భయంకరంగా, విషాద భరితంగా వుంది. ప్రజల హృదయాలలో నిరాశ, నిస్పృహ అలుముకున్నాయి. వాస్తవ పరిస్థితిని అంగీకరిస్తూనే మనం మన మనసులలో,ఆలోచనలో నిరాకరణ (నెగటివ్) ధోరణికి చోటివ్వరాదని అన్నారు. మనం మన శరీరాలను కరోనా నెగిటివ్’గా ఉంచుకోవాలి, మనసులో మాత్రం కరోనాపై విజయం సాధిస్తామనే విశ్వాసాన్ని, సానుకూల దృక్పధాన్ని నిలుపోకోవాలని సూచించారు. అలాగే దేశం అంతా ఒక టీమ్’గా పనిచేయాలని , సెకండ్ వేవ్ విషయంలో చేసిన తప్పును వస్తుందని అంటున్న థర్డ్ వేవ్ విషయంలో చేయరాదని హెచ్చరించారు. అయితే, మనం థర్డ్ వేవ్ గురించి భయపడవలసిన అవసరం లేదని,కొవిడ్ 19 పై సాగించే పోరాటంలో స్థిరత్వం ఉండాలని అన్నారు.అయితే కాంగ్రెస్ పార్టీ, మోహన్ భగవత్’ ఉపన్యాసాని పుబ్లిసిటీ స్టంట్ గా కొట్టివేసింది. రోజువారీ ప్రాతిపదికిన ప్రధానమంత్రి నరేంద్ర మోడిని విమర్శించడమే పనిగా పెట్టుకున్న రాహుల్ గాంధీ అయితే, బీజేపీ, సంఘ్ పరివార్. వారికి పరజల కష్టాలు,బాధలు అర్థం కావని అన్నారు.
కొవిడ్ సెకండ్ వేవ్ విషయంలో ప్రతిపక్షాల నుంచే కాకుండా, స్వపక్షం నుంచి కూడా విమర్శలు ఎదుర్కుంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కొంత ఉరట, ఉపసమనం కలిపించెందుకు ఆర్ఎస్ఎస్ రంగప్రవేశం చేసిందని పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా మరి ఆరేడు నెలలలో 2022 సంవత్సరం ప్రారంభంలో ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్ శాసన సభ ఎన్నికలను దృష్టిలో ఉంచికుని సంఘ్ పరివార్ నష్ట నివారణ చర్యలకు శ్రీకారం చుట్టిందని అనుకోవచ్చును.