డెలివ‌రీ బాయ్స్ దోపిడీలు.. ఆరుగురు ఫ్రెండ్స్‌ అరెస్ట్‌..

వాళ్లంతా ఆవారా గాళ్లు. మొత్తం ఆరుగురు ఫ్రెండ్స్‌. ముఠాగా ఏర్ప‌డ్డారు. ఒంట‌రి మ‌నుషుల‌ను టార్గెట్ చేశారు. సెల్‌ఫోన్లు, న‌గ‌దు, బంగారం దోచుకున్నారు. కొన్ని నెల‌ల‌కు మ‌స్త్ ఎంజాయ్ చేశారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఖాకీల చేతికి చిక్కి ఊచ‌లు లెక్క‌బెడుతున్నారు. హైద‌రాబాద్‌కు చెందిన ఓ దోపిడీ దోస్తుల ముఠా వ్య‌వ‌హారం ఇప్పుడు క‌ల‌క‌లంగా మారింది. త‌మ‌కు తెలిసిన వాళ్లు.. ఇంత కిలాడీ దొంగ‌లా అని స్థానికులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.  వాళ్ల చ‌దువు ఎప్పుడో అట‌కెక్కింది. ఫ్రెండ్స్‌తో మ‌స్తీ చేయ‌డం అల‌వాటైంది. ఆల‌స్యంగా ఇంటికి రావ‌డం మొద‌లైంది. జ‌ల్సాలు, పార్టీలంటూ ఫుల్‌గా ఖ‌ర్చు చేస్తున్నారు. ఎప్పుడూ వాళ్ల ద‌గ్గ‌ర ఫుల్ క్యాష్ ఉంటోంది. ఇదేంటి.. ఇంత స‌డెన్‌గా ఆ పోరగాళ్ల‌కు అంత డ‌బ్బు ఎక్క‌డి నుంచి వ‌స్తోంది? అనే అనుమానం ఇంట్లో వాళ్ల‌కి గానీ, చుట్టుప‌క్క‌ల వాళ్ల‌కి గానీ రాలేదు. ఎందుకంటే.. వాళ్లు స్విగ్గీ, జొమాటోలో డెలివ‌రీ బాయ్స్‌గా ప‌ని చేస్తున్నారు. ఏదో ప‌ని చేస్తున్నారు.. మ‌స్త్ పైస‌లు వ‌స్తున్నాయ్ అనుకున్నారు వారంతా. కానీ, ఆ లెక్క‌లేన‌న్ని డ‌బ్బులు వ‌స్తున్న‌ది స్విగ్గీ, ,జొమాటో జాబ్ నుంచి కాద‌నే విష‌యం వారికి అప్పుడు తెలీలేదు. ఇప్పుడు పోలీసులు చెబుతుంటే విని ఆశ్చ‌ర్య‌పోతున్నారు.  దారి దోపిడీల‌కు పాల్ప‌డుతున్న ముఠాను బాచుప‌ల్లి పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలోని ఆరుగురు యువ‌కుల‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా రాత్రి పూట ఒంట‌రిగా ఉన్న వారిపై దాడి చేసి దోపిడీల‌కు పాల్ప‌డుతుంద‌ని పోలీసులు తెలిపారు. దొంగిలించిన ఫోన్లు, ఇత‌ర సామ‌గ్రిని ఓఎల్ఎక్స్‌లో నిందితులు విక్ర‌యిస్తున్న‌ట్లు గుర్తించారు. నిందితులు స్విగ్గీ, జొమాటోల‌లో ప‌ని చేస్తున్న‌ట్లు వివ‌రించారు. ఇదీ ఆ ఆరుగురు దోస్తుల క్రైమ్ క‌థా చిత్ర‌మ్‌.  ప‌గ‌లంతా ఫుడ్ డెలివ‌రీ బాయ్స్‌గా ప‌ని చేసేవాళ్లు. అది వాళ్ల పార్ట్‌టైమ్ వ‌ర్క్ మాత్ర‌మే. మెయిన్ జాబ్‌.. మిడ్‌నైట్ త‌ర్వాతే. బైక్‌లు వేసుకొని.. నిర్మానుషంగా ఉండే ప్రాంతాల్లో తిరుగుతుండేవాళ్లు. పొర‌బాటున ఎవ‌రైనా అటువైపు వ‌స్తే.. ఆరుగురు క‌లిసి అడ్డ‌గించే వారు. బెదిరించి, భ‌య‌పెట్టి.. సెల్‌ఫోన్‌, గోల్డ్ ఛైయిన్‌, ప‌ర్స్‌, క్యాష్‌.. ఏది ఉంటే అది లాక్కునే వారు. వ‌స్తువులైతే వాటిని OLXలో పెట్టి అమ్మేసేవారు. అయితే, OLXలో ఇలా వ‌స్తువులు కొన్న‌వాళ్లు అనుమానంతో ఫిర్యాదు చేయ‌డంతో విష‌యం పోలీసుల దృష్టికి వ‌చ్చింది. నిఘా వేసి, ఆరా తీసి.. ఇప్పుడు ఆ ముఠాను ప‌ట్టుకున్నారు. అర్థ‌రాత్రి దోపిడీల‌కు పాల్ప‌డుతున్న స్విగ్గీ, జొమాటో డెలివ‌రీ బాయ్స్‌గా ప‌ని చేస్తున్న ఆరుగురు ఫ్రెండ్స్‌ను అరెస్ట్ చేశారు. 

వేస‌విలో తుఫాను.. ఎండ‌ల్లో వాన‌లు..

ఎండాకాలం ఎండ‌. వానాకాలం వాన‌. ఇది ప్ర‌కృతి స‌హ‌జం. అప్పుడ‌ప్పుడూ వేస‌విలోనూ చెదురుముదురు వాన‌లు ప‌డ‌టమూ కామ‌నే. కానీ, ఎండాకాలంలో తుఫాను రావ‌డం మాత్రం అస్స‌లు కామ‌న్ కానే కాదు. చాలా చాలా అరుదు. ఆ ప్ర‌భావం మ‌న తెలుగు రాష్ట్రాల‌పైనా ఉండ‌టంతో అంత‌టా కంగారు. చేతికొచ్చిన పంట నీటి పాలై పోతుంద‌నే టెన్ష‌న్‌. మామిడి కాయ‌లు రాలిపోతాయ‌నే హైరానా. ఇలా, ఎండాకాలంలో అక‌స్మాత్తుగా ఊడిప‌డిన ‘తౌక్టే’ తుఫాన్‌పై స‌ర్వ‌త్రా ఆందోళ‌న‌.  అరేబియా తీరంలో ‘తౌక్టే’ తుఫాన్ ఇండియాపై విరుచుకుప‌డ‌టానికి రెడీగా ఉంది. లక్ష్య దీప్ పరిసర ప్రాంతాల్లో  ఏర్పడిన వాయుగుండం బలపడి  శుక్రవారం రాత్రి 11:30 గంటలకు తుఫానుగా మారింది. దీని పేరు.. తౌక్టే. శ‌నివారం ఉదయం 5:30 గంటలకు అమిని దీవికి ఈశాన్య దిశగా 160 కి.మీ. దూరంలో తుఫాను కేంద్రీకృత‌మై ఉంది. ఇది మరింత బలపడి రాగల 12 గంటలలో తీవ్ర తుఫానుగా మారి.. తరువాత ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించనుంది. తదుపరి 12 గంటలలో ఇది మరింత బలపడి అతి తీవ్రతుఫానుగా రూపాంత‌రం చెంద‌నుంది.  ‘తౌక్టే’ తుఫాను గుజరాత్ తీరాన్ని పోర్బందర్ - నలియాల మధ్య 18వ తేదీ సాయంత్రం 2.30 గంటల నుంచి 8.30 గంటల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. తౌక్టే తుఫాన్ ప్రభావం ఐదు రాష్ట్రాలపై ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దాదాపు 50 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు చేరుకున్నాయి. మరోవైపు నావికా దళం కూడా రంగంలోకి దిగింది. తుఫానును ఎదుర్కోవ‌డానికి ప్ర‌భుత్వ‌ యంత్రాంగం స‌ర్వ‌ స‌న్న‌ద్ధంగా ఉంది. 

ప‌సిడి ఫ‌స‌క్‌.. గోల్డ్ బిజినెస్ ఢ‌మాల్‌..

ఓవైపు క‌రోనా.. మ‌రోవైపు లాక్‌డౌన్‌.  కొవిడ్ సెగ బంగారం అమ్మ‌కాల‌పై భారీగా ప‌డింది. ఇప్ప‌టికే పెళ్లిళ్ల గిరాకీ త‌గ్గ‌గా.. తాజాగా అక్ష‌య తృతీయ‌కు సైతం విక్ర‌యాలు లేక బులియెన్ మార్కెట్ వెల‌వెల‌పోయింది. క‌రోనా దెబ్బ‌కు బంగారం కొనాల‌నే సెంటిమెంట్ కూడా మంట గ‌లిసింది. బ‌తికుంటే చాలు.. బంగారం సంగ‌తి త‌ర్వాత అనుకున్నారేమో.. అక్ష‌య తృతీయ‌కు అమ్మ‌కాలు అస‌లే మాత్రం జ‌ర‌గ‌లేదు.  గడిచిన ఏడాదిలానే, ఈ సంవత్సరం కూడా అక్షయ తృతీయ పర్వదినం లాక్‌డౌన్‌లో కలిసిపోయింది. రూల్స్ మేర‌కు ఉద‌యం 6 నుంచి 10 వ‌ర‌కు మాత్ర‌మే జ్యువెల్ల‌రీ షాపులు తెరిచినా.. క‌నీసం బోణీ కూడా కాని షాపులు ఎన్నో. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌లు అమలవుతుండడంతో ఆభరణాల వ్యాపారం బాగా తగ్గింది.  అక్షయ తృతీయకు డిజిటల్‌, ఆన్‌లైన్‌ల ద్వారా వ్యాపారం చేద్దామ‌న్నా కుద‌ర‌లేదు. ఆన్‌లైన్ బుకింగ్స్ చాలా తక్కువ. ఎంత‌గా ట్రై చేసినా.. వీడియో కాలింగ్‌ ద్వారా వర్చువల్‌ షాపింగ్‌ సదుపాయాలు, వర్చువల్‌ ట్రయల్‌ రూములు, హోమ్‌ డెలివరీ, ఇ-క్యాటలాగ్స్ అందించినా ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. ముందస్తు బుకింగ్‌లపై రాయితీలు, వజ్రాభరణాల తయారీ ఛార్జీల మినహాయింపు లాంటి తాయిలాలూ, ప్రయత్నాలు చేసినా ఈ ఏడాది అమ్మకాలు ఏమాత్రం పుంజుకోలేదు.  బంగారం ధరలు ఈ ఏడాది ప్రారంభంతో పోలిస్తే 5% తగ్గి.. తులం బంగారం రూ.47,500 స్థాయికి చేరినా పాత కస్టమర్లు మాత్రమే అక్షయ తృతీయపై దృష్టి సారించారు. కొంద‌రు రూ.3,000-4,000 ధరలో వ‌చ్చే బంగారు నాణేలు కొనుగోలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌, ముంబయి, ఢిల్లీ, పుణె, కేరళ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో జువెల్ల‌రీ స్టోర్స్ మూతపడ్డాయి.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సార్వభౌమ పసిడి బాండ్ల పథకం ఈనెల 17న ప్రారంభం కానుంది. ఐదు రోజుల పాటు అంటే మే 21 వరకు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. పసిడి బాండ్లకు ఇష్యూ ధర గ్రాముకు రూ.4,777 గా నిర్ణయించామని ఆర్‌బీఐ తెలిపింది. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు, చెల్లింపులు చేసే వారికి గ్రాముకు రూ.50 తగ్గింపును ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

తండ్రి హ‌యాంలో ఆ రాజు..  కొడుకు పాల‌న‌లో ఈ రాజు.. 

రాజులు. వాళ్లు మామూలోళ్లు కాదు. క్ష‌త్రియులు. జ‌స్ట్‌.. పేరులోనే కాదు వాళ్లు చేసే ప్ర‌తీ ప‌నిలోనూ ప్ర‌త్యేక‌త. కింగ్‌లా ఉంటారు. కింగ్‌లానే బ‌తుకుతారు. ఆంధ్రప్రదేశ్  లో అన్ని రంగాల్లోనూ వారి పాత్ర ప్రముఖంగా ఉంటుంది. తాజాగా నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజును ఏపీ సీఐడీ అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో తెలుగునాట ఇద్ద‌రు క్ష‌త్రియ రాజుల‌కు జ‌రిగిన రెండు ఉదంతాలు చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. వాళ్లిద్ద‌రూ క్ష‌త్రియ రాజులు కావ‌డం.. ఆ రెండు ఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు వైఎస్ కుటుంబ‌మే అధికారంలో ఉండ‌టం ఆస‌క్తి క‌లిగించే అంశం.  న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణరాజును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. అదీ ఆయ‌న బ‌ర్త్‌డే రోజున‌. ఢిల్లీలో, సీఆర్‌పీఎఫ్ సెక్యూరిటీ ర‌క్ష‌ణ‌లో ఇన్నాళ్లూ సుర‌క్షితంగా ఉన్న ర‌ఘురామ‌.. పుట్టిన రోజు క‌దాని.. హ‌స్తిన నుంచి హైద‌రాబాద్‌లోని త‌న ఇంటికి వ‌చ్చారు. ఇక అంతే. ఎప్ప‌టి నుంచో ఆయ‌న కోసం కాపు కాసి చూస్తున్న‌ట్టు.. ఏపీ పోలీసులు ర‌ఘురామ‌ను క్యాచ్ చేశారు. హైద‌రాబాద్ నుంచి లిఫ్ట్ చేసి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు షిఫ్ట్ చేశారు. ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొడుతున్నారంటూ పోలీసులు ఏదేదో చెబుతున్నా.. వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిత్యం విమ‌ర్శ‌లు చేయ‌డ‌మే అస‌లు రీజ‌న్ అనేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ఇలా.. ర‌ఘురామ అరెస్ట్‌తో.. రాజు అయిన ఆయ‌న‌.. బంధీగా మారిపోయారు. వేల‌ కోట్ల వ్యాపారాలు, సంప‌ద, మందీమార్బ‌లం ఉన్నా కూడా సామాన్యుడిలా సీఐడీ చెర‌లో మ‌గ్గిపోయారు.  రాజుల‌కు ఇలాంటి దీన‌స్థితి రావ‌డం ఇదే మొద‌టిసారి కాదు. ర‌ఘురామ‌కృష్ణ‌రాజును చూస్తుంటే.. మ‌రో రాజు గారు గుర్తొస్తున్నార‌ని అంటున్నారు. ఆయ‌న ఈయ‌న‌కంటే గొప్ప రాజు. ఆయ‌నే  స‌త్యం రామ‌లింగ‌రాజు. ఒక‌ప్ప‌టి స‌త్యం కంప్యూట‌ర్స్ అధినేత‌. 1987 నుంచి 2009 వ‌ర‌కూ ఆయ‌నే సీఈవో. స‌త్యం పేరుతో వంద‌ల కోట్ల వ్యాపార సామ్రాజ్యం సృష్టించారు. వేలాది మందికి మంచి భ‌విష్య‌త్తు క‌ల్పించారు. ప్ర‌పంచంలోని అనేక దేశాల కంపెనీల‌కు సాఫ్ట్‌వేర్ సేవలు అందించారు. స‌త్యం కంప్యూట‌ర్స్ అంటే అప్ప‌ట్లో అది జ‌స్ట్ పేరు మాత్ర‌మే కాదు.. ఓ పాపుల‌ర్ బ్రాండ్‌. ఆ కంపెనీ య‌జ‌మానిగా రామ‌లింగ‌రాజు ఐటీ సెక్టార్‌కే ఐకాన్‌గా నిలిచారు. బైర్రాజు ఫౌండేష‌న్‌తో ప్ర‌జాసేవ‌లో ముందున్నారు. క‌ట్ చేస్తే.. ఆయ‌న నిర్మించిన సాఫ్ట్ సౌధం.. ఒక్క రోజులోనే పేక మేడ‌లా కుప్ప‌కూలింది. కార్పొరేట్ ఫ్రాడ్‌కు పాల్ప‌డినందుకు ఆయ‌నపై అనేక కేసులు పెట్టి అరెస్ట్ చేసింది సీబీఐ, ఈడీ. ఏడేళ్ల జైలు శిక్ష కూడా ప‌డింది. అప్ప‌టి వ‌ర‌కూ రాజులా ఉన్న రామ‌లింగ‌రాజు.. ఒక్క అరెస్టుతో అథఃపాతాళానికి ప‌డిపోయారు. చ‌రిత్ర‌లో లేకుండా క‌నుమ‌రుగు అయ్యారు.  మేటాస్ (SATYAM పేరును తిర‌గేస్తే MAYTAS) అనే రియ‌ల్ ఎస్టేట్, ఇన్ఫ్రా సంస్థ‌ను స్థాపించి.. స‌త్యం కంప్యూట‌ర్స్ నిధుల‌కు అటు దారి మ‌ళ్లించార‌నే ఆరోప‌ణ కూడా ఉంది. ఆ స‌మ‌యంలో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఉన్నారు. అప్పుడు హైద‌రాబాద్ మెట్రో ప్రాజెక్టును మేటాస్‌కే అప్ప‌గించారు. ఆ డీల్ వెనుక పెద్ద ఎత్తున గోల్‌మాల్ జ‌రిగిందంటూ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఎలాంటి అనుభ‌వం లేక‌పోయినా.. మేటాస్‌కు మెట్రో ప్రాజెక్టు కేటాయించ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తినా.. అప్ప‌టి సీఎం వైఎస్సార్ మాత్రం రామ‌లింగ‌రాజు కంపెనీ వైపే మొగ్గు చూపడం వివాదాస్ప‌ద‌మైంది. క‌ట్ చేస్తే.. కొన్నాళ్ల‌కే స‌త్యం కంప్యూట‌ర్స్‌లో రామ‌లింగ‌రాజు ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డ్డారంటూ కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు ఆయ‌న‌పై కేసులు న‌మోదు చేసి క‌ట‌క‌టాల పాలు చేశాయి.  తెలుగు వాడు.. క్ష‌త్రియుడైన‌.. రామ‌లింగ‌రాజు ఉన్న‌తి, అధోగ‌తి... ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అప్ప‌ట్లో కొన్ని నెల‌ల పాటు చ‌ర్చ‌నీయాంశం. ఓ వెలుగు వెలిగిన స‌త్యం రామ‌లింగ‌రాజు అరెస్ట్ వ్య‌వ‌హారం.. వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడే జ‌రిగింది. క‌ట్ చేస్తే.. ఇప్పుడు వైఎస్సార్ త‌న‌యుడు వైఎస్ జ‌గ‌న్ సీఎంగా ఉన్న స‌మ‌యంలో.. మ‌రో రాజు, అనేక కంపెనీల‌కు య‌జ‌మాని అయిన ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు అరెస్ట్ కావ‌డం.. కాక‌తాళీయ‌మే అయినా.. ఆస‌క్తిదాయ‌కం.  రాజులు సంఖ్యాప‌రంగా త‌క్కువే. వారి మూలాలు భీమ‌వ‌రం చుట్టుప‌క్క‌ల ప్రాంతాల‌కే ప‌రిమితం. ఉన్న‌ది గుప్పెడు జ‌నాభే అయినా.. దాదాపు అంద‌రూ గొప్పోల్లే. ఆస్తులు, వ్యాపారాలు, ప‌లుకుబ‌డి, హోదాల‌కు.. ఆనాటి రాచ‌రిక రాజుల‌కు ఏమాత్రం తీసిపోరు. క్ష‌త్రియులు కావ‌డంతో స్వ‌త‌హాగా పోరాట స్వ‌భావం. అందుకే, ర‌ఘురామ‌కృష్ణ‌రాజు సైతం అదే పోరాటం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. వైసీసీ గుర్తుపై గెలిచినా.. జ‌గ‌న్‌రెడ్డి విధానాలు న‌చ్చ‌క‌.. సొంత పార్టీ ప్ర‌భుత్వాన్ని, పాల‌కులు అవ‌లంభించే త‌ప్పుడు విధానాల‌ను నిత్యం క‌డిగిపారేస్తుంటారు. త‌న‌పై సీబీఐ, ఈడీ కేసులు పెట్టినా ర‌ఘురామ ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేదు. బ‌ల‌మైన ముఖ్య‌మంత్రిపై.. ఏమాత్రం భ‌యం లేకుండా.. ఒంట‌రి పోరాటం చేస్తున్నారు. త‌న‌కు ఎప్ప‌టికైనా ఏపీలో ముప్పు ఉంద‌ని భావించిన ఆయ‌న‌.. కేంద్రానికి ఫిర్యాదు చేసి త‌న ర‌క్ష‌ణ‌కు సీఆర్పీఎఫ్ సెక్యూరిటీని నియ‌మించుకున్నారు. రాష్ట్రంలో ఉంటే ప్ర‌మాద‌మ‌ని.. ఢిల్లీలోనే ఉంటున్నారు. ఏదో పుట్టిన రోజు క‌దాని.. పొర‌బాటున హైద‌రాబాద్ వ‌స్తే.. ఏపీ పోలీసులు ప‌క్క రాష్ట్రానికి వ‌చ్చి మ‌రీ ఇలా అరెస్ట్ చేస్తార‌ని ఆయ‌న అస్స‌లు ఊహించి ఉండ‌రు. జ‌గ‌న్‌రెడ్డి క‌క్ష క‌డితే ఇలానే ఉంటుంద‌ని అంటున్నారు.  కార‌ణం ఏదైన‌ప్ప‌టికినీ వైఎస్ కుటుంబం అధికారంలో ఉన్న‌ప్పుడే.. ఇలా ఇద్ద‌రు క్ష‌త్రియ ప్ర‌ముఖులు అరెస్ట్ కావ‌డంతో ఆ రెండు ఘ‌ట‌న‌ల‌ను పోల్చి చూస్తున్నారు. RRR అరెస్టు నేప‌థ్యంలో.. గ‌తంలో జ‌రిగిన స‌త్యం రామ‌లింగ‌రాజు ఎపిసోడ్ మ‌రోసారి గుర్తుకొస్తోంది.

టీపీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈటల! రాహుల్ గాంధీ ఆఫర్? 

కేసీఆర్ కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన  ఈటల రాజేందర్​ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. మాజీ మంత్రి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందన్న దానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈటల కాంగ్రెస్​లో చేరబోతున్నారని కొందరు, కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నారని  మరికొందరు చెబుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ పార్టీని స్థాపించి నెగ్గుకు రాగలమా అని ఈటల రాజేందర్​ మల్లగుల్లాలు పడుతున్నారట. కేసీఆర్ ను ఢీకొట్టడం అంత ఈజీ కాదని భావిస్తున్న రాజేందర్.. ఇప్పుడున్న పార్టీల్లోనే ఏదో ఒక దాంట్లో చేరి కేసీఆర్ పై రివేంజ్ తీసుకోవాలని యోచనలో ఉన్నారని అంటున్నారు. అయితే చేరితో ఏ పార్టీలో చేరాలన్నదానిపై తన సన్నిహితులతో ఈటల చర్చలు జరుపుతున్నారని అంటున్నారు.  ఈటల రాజేందర్ తాజా అడుగులు, వరుస సమావేశాలతో ఆయన కాంగ్రెస్​ పార్టీలో చేరబోతున్నారనే వార్తలు వస్తున్నాయి.  బీజేపీలో చేరాలని కూడా ఈటల మీద ఒత్తిడి ఉంది. అయితే వామపక్ష భావజాలం ఉన్న ఈటల రాజేందర్​ బీజేపీలో ఇమడం కష్టమని భావించారట. అందుకే ఆయన కాంగ్రెస్​లో చేరాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇటీవల ఆయన టీఆర్​ఎస్​ బహిషృత నేత డీఎస్​, సీఎల్పీ నేత భట్టీ విక్రమార్క తో వేరువేరుగా సమావేశం అయ్యారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డితో సమావేశం అయ్యారు. మరోవైపు రేవంత్​రెడ్డితో కూడా ఫోన్​లో టచ్​లో ఉన్నట్టు సమాచారం.  ఈటల బలమైన బీసీ నేత. అంతేకాక తెలంగాణ ఉద్యమంలోనూ కీలకంగా పనిచేశారు. దీంతో కేసీఆర్​కు ఎదుర్కొనేందుకు ఈటల రాజేందర్​ వంటి నాయకుడు అవసరమనే అభిప్రాయానికి హైకమాండ్ వచ్చిందంటున్నారు. అందుకే ఆయన్ను కాంగ్రెస్ లో చేరేలా ప్రయత్నాలు చేయాలని తెలంగాణ నేతలకు రాహుల్ గాంధీ సూచించారని అంటున్నారు. హైకమాండ్ ఆదేశాలతో టీపీసీసీ నేతలు కొందరు రాజేందర్ తో మాట్లారాని అంటున్నారు. ఈటల రాజేందర్ నిర్ణయం తీసుకున్న వెంటనే రాహుల్ గాంధీతో మాట్లాడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.  ఈటల రాజేందర్​ను టీఆర్​ఎస్​ నుంచి బయటకు పంపించడంతో అతడిపై తెలంగాణ సమాజంలో సానుభూతి నెలకొన్నది. పార్టీల కతీతంగా అందరూ ఈటలపై సింపతీ కనబరుస్తున్నారు. ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్​ యోచిస్తున్నదట. ఈటల రాజేందర్​ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే ఎలా ఉంటుందన్న విషయంపై కూడా కాంగ్రెస్​ పెద్దలు ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. అయితే ఈటల పార్టీలో చేరిన వెంబడే ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే మిగిలిన కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారు? అన్న అనుమానులు ఉన్నాయి. కాంగ్రెస్​ సీనియర్​ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, మరో ఎంపీ, వర్కింగ్ ప్రెసిడెంట్​ రేవంత్​రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఇద్దరిలో ఎవరికి పదవి ఇవ్వాలో తెలియక కాంగ్రెస్​ హైకమాండ్​ తలపట్టుకొని కూర్చున్నది. అందుకే ముందుగా ఈటల  కాంగ్రెస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ పదవి ఇచ్చి.. ఆ తర్వాత చూద్దామనే యోచనలో ఉందంటున్నారు.  ఈటల రాజేందర్ ను పార్టీలో చేర్చుకోవడానికి తెలంగాణ కాంగ్రెస్ లోని అన్ని వర్గాలు సానుకూలంగానే ఉన్నాయని చెబుతున్నారు. టీపీసీసీ రేసులో ఉన్న రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో ఈటలకు మంచి సంబంధాలు ఉన్నాయి. వీళ్లంతా ఈటలను ఆహ్వానించేవారే. ఈ పరిస్థితుల్లో ఈటలకు కాంగ్రెస్ లో ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చని అంటున్నారు.

వచ్చింది టైఫాయిడ్.. కరోనా భయంతో ఫ్యామిలీ సూసైడ్..

కరోనా కాలం లో ప్రజలు వెనక ముందు ఆలోచించడం లేదు. టెస్ట్ చేయించుకున్న రిపోర్ట్స్ రాకముందే తమకు కొరోనా వచ్చిందేమో అని ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు చాలానే చూస్తున్నాం. తాజాగా విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. టైఫాయిడ్ వస్తే కరోనా సోకిందని భయపడి ఓ కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. వేపాడ మండలంలోని నల్లబిల్లిలో నిన్న జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. గ్రామానికి చెందిన ఉడత సత్యనారాయణ గుప్తా (62) రెండు సంవత్సరాలుగా  విశాఖపట్టణం జిల్లాలోని చోడవరంలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. గుప్తాకు భార్య సత్యవతి (57), అత్త వెంకటసుబ్బమ్మ, కుమారుడు సంతోష్, కుమార్తె పూర్ణ ఉన్నారు. కుమారుడు తెలంగాణలోని నిజామామాద్‌లో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాడు. కుమార్తెకు వివాహమైంది. 2002లో తన మొదటి భార్య మరణించడంతో, 2009లో ఓ పేపరు ప్రకటన చూసి గుంటూరుకు చెందిన సత్యవతిని గుప్తా రెండో వివాహం చేసుకున్నాడు.కాగా, ఇటీవల సత్యనారాయణ అనారోగ్యానికి గురవడంతో ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకుంటే టైఫాయిడ్ అని తేలింది. దీంతో మందులు వాడుతున్నారు. అయితే, రెండు రోజుల క్రితం భార్య సత్యవతికి కూడా జ్వరం వచ్చింది. దీంతో వారికి సేవలు చేసేందుకు చుక్కపల్లిలో ఉంటున్న కుమార్తె వచ్చింది. గురువారం కుమార్తెను ఇంటికి వెళ్లిపొమ్మన్న గుప్తా.. నిన్న ఉదయం భార్య, అత్తతో కలిసి స్వగ్రామం నల్లబిల్లి వచ్చాడు. తమకు కరోనానే వచ్చిందని నిశ్చయించుకున్న గుప్తా దంపతులు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గ్రామంలోని శివాలయం వెనక భాగంలోకి వెళ్లి వెంట తెచ్చుకున్న పురుగు మందును ఓఆర్ఎస్‌లో కలిపి ముగ్గురూ తాగారు. అనంతరం సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు బావి నుంచి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కరోనా వచ్చిన ఏం కాదు. భయపడకుండా  దానితో ఫైట్ చెయ్యాలి. అప్పుడే మనం కరోనా ను జయిస్తాము. చాలా వరకు కరోనా మీద అవైర్నెస్ తీసుకువస్తున్నారు. వారికి సంబందించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుని జాగ్రత్తలు పాటించండి. అంతే అదే తగ్గిపోతుంది. అంతే గానీ కరోనా రాకముందే ప్రాణాలు తీసుకోవద్దు. ఆలోచించండి ప్రాణాలు కాపాడుకోండి.    

ఫార్వర్డ్ పోస్ట్ ప్రాణం తీసింది.. 

సోషల్ మీడియా పిచ్చోడి చేతిలో రాయిలాగా మారింది. ఎంబిబిఎస్ చదవనోడు డాక్టర్ అవుతున్నాడు. శాస్త్రం తెలియని సన్నాసి కూడా వేదాంతాలు చెపుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే కొంత మంది అనవసమైన విషయాలను క్రియేట్ చేసి మరి ప్రచారం చేస్తుంటారు. దానివల్ల  వాళ్లకు ఎలాంటి లాభం ఉంటాడో తెలీదు గానీ పొద్దున్న లేస్తే ఇది షేర్ చేయండి మీకు మంచి జరుగుతుంది. ఇది షేర్ చేయండి మీకు ఇది జరుగుతుంది. అని ప్రచారం చేస్తారు. ఇంకొంత మంది అయితే లేనిపోని అభూత కల్పితాలు క్రియేట్ చేసి వాట్స్ ఆప్ గ్రూప్స్ లో పోస్ట్ చేసి  ప్రజలను కూడా భయబ్రాంతులకు గురిచేస్తారు. తాజాగా ఒక వ్యక్తి తనకు వచ్చిన ఒక అభూతకల్పిత మెస్సేజ్ ను ఫార్వర్డ్ చేశాడు. ఇంకేముంది ఒక సారిగా పోలీసులు అతని ఇంటి ముందు వాలిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి.   తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని నారాయణపేట. అతని పేరు గుత్తుల శ్రీనివాస్‌. అతనికి పెళ్లి  కూడా అయింది. అతని భార్య పేరు వెంకటపద్మ. శ్రీనివాస్ ఆక్వా కంపెనీలో పనిచేస్తున్నాడు. అతని సెల్‌ఫోన్‌కు ‘కోళ్లకు కూడా సోకిన కరోనా మహమ్మారి’ అనే వాట్సప్‌ సందేశం వచ్చింది. దానిని ఆయన ఇతర గ్రూప్‌లకు పంపాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు శుక్రవారం శ్రీనివాస్‌కు ఫోన్‌ చేసి విచారించారు. తనకేమీ తెలియదని ఆయన ఎంత చెప్పినా వారు వినలేదు. దాంతో శ్రీనివాస్‌ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. శరీరంపై చెమటలు పట్టి కూలిపోయాడు. చికిత్స నిమిత్తం మూడు ఆసుపత్రులకు తీసుకెళ్లినా చేర్చుకోలేదు. చివరకు అమలాపురం కిమ్స్‌లో చేర్పించాం. ఆ తర్వాత గంట వ్యవధిలోనే ఆయన చనిపోయాడు’ అని పేర్కొన్నారు. ఇది చాలా పెద్ద కేసు అవుతుందని బెదిరిస్తూ శ్రీనివాస్‌ ఫోన్‌ను తీసుకెళ్లిన స్థానిక పోలీసులు. ఆయన చనిపోయిన కొద్ది సేపటికి దానిని వెనక్కి తెచ్చి ఇచ్చేశారన్నారు. హైదరాబాద్‌లోని సైబర్‌క్రైమ్‌ సీఐ రాజేష్‌, ఎస్సై రంజిత్‌కుమార్‌ తన భర్తను మానసికంగా హింసించారని ఆమె ఆరోపించారు. శ్రీనివాస్‌కు భార్య, తొమ్మిదేళ్ల కుమారుడు, ఏడేళ్ల కుమార్తె ఉన్నారు. దీనిపై అమలాపురం పట్టణ ఇన్‌ఛార్జి ఎస్సై సత్యప్రసాద్‌ను వివరణ కోరగా ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.          

ఎంపీ అరెస్టుకు అసలు కారణం ఇదే..

“ఆంధ్ర ప్రదేశ్’లో అరాచక, అవినీతి పాలన సాగుతోంది” నర్సాపురం ఎంపీ, రఘురామకృష్ణంరాజు, సంవత్సర కాలానికి పైగా రచ్చబండ సాక్షిగా ప్రతి రోజు చేస్తున్న ఆరోపణ ఇది. విషయం మారుతూ ఉండచ్చు, ఒకసారి దేవాలయాలపై దాడులు, విగ్రహాల విధ్వసం విషయం కావచ్చు మరోమారు అమరావతి రైతులకు జరిగిన అన్యాయం విషయమే కావచ్చు, లేదంటే ఇసుక, మద్యం పాలసీల విషయంలో కావచ్చు, విషయం ఏదైనా సారాంశం మాత్రం అదే. నిజానికి రఘురామకృష్ణంరాజు చేసిన ఆరోపణలు అయన మాత్రమే చేసినవి కాదు. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, మీడియా, మేధావులు, విశ్లేషకులు, సామాన్య ప్రజలు  అందరూ చేస్తున్నవే. అది సహజం. అయితే రఘురామ కృష్ణం రాజు ప్రతి పక్ష ఎంపీ కాదు. అధికార యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ) సభ్యుడు. అధికార పార్టీ సభ్యుడై ఉండి, అధికార పార్టీని, ప్రభుత్వాన్ని, ప్రతి రోజు రచ్చబండకు ఉతికి ఆరేయడం అధికార పార్టీ పెద్దలకు రుచించక పోవచ్చును. ఇంతకాలం ఆయన చేసిన, చేస్తున్న ఆరోపణలపై చట్టపరంగానే కాదు, రాజకీయంగా క్రమ శిక్షణా చర్యలు అయినా తీసుకోని, ఏపీ ప్రభుత్వం ఒక్కసారిగా ఆయనను, అరెస్ట్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. అదే విధంగా ఎంపీ అరెస్ట్’కు ఎంచుకున్న సమయం, పెట్టిన కేసులు ( ఐపీసీ 124 ఎ (రాజద్రోహం) 153ఎ (వివిధ వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చ కొట్టడం), 505 (ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయడం), అరెస్ట్ సందర్భంగా సీఐడీ అధికారులు ప్రవర్తించిన తీరు గమనిస్తే, ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కక్ష సాధిపు చర్యలకు పాల్పడుతున్నారన్న విపక్షాల ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తోంది. అలాగే,కృష్ణంరాజు చేసిన, ‘రాష్ట్రంలో అరాచక, అవినీతి  పాలన జరుగుతోందన్న’ ఆరోపణలను నిజం చేసే విధంగా ఉన్నాయని పరిశీలకులు, చివరకు ఎంపీ విధానాలతో విబేధించే రాజకీయ పార్టీలు నాయకులు  సైతం అంగీకరిస్తున్నారు.   కృష్ణం రాజు అరెస్టు కు ఆయన పుట్టిన రోజును ఎంచుకోవడం మొదలు, అరెస్టుకు సంబంధించి కుటుంబ సభ్యులకు ఎలాంటి వివరణ ఇవ్వకుండా అరెస్ట్ చేసి మంగళగిరికి తరలించడం,ఆయనపై బెయిల్ కు అవకాశం లేని దేశ ద్రోహం వంటి తీవ్రమైన కేసులు నమోదు చేయడం అన్నీ కూడా ఒక పధకం ప్రకారం సాగించిన కక్ష సాధింపు చర్య అన్న ఆరోపణలకు బలం చేకురుస్తున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.రఘురామకృష్ణంరాజుకు ఎంపీగా ఉన్న నేపథ్యంలో లోక్ సభ స్పీకర్ అనుమతి ఉండాలని చెప్పినా అవన్నీ కోర్టులో చూసుకోండి అంటూ దౌర్జన్యంగా అరెస్టు చేశారని ఆయన కుమారుడు భరత్ ఆరోపించారు. నాలుగు నెలల క్రితమే బైపాస్ సర్జరీ చేయించుకున్న తన తండ్రిని కోవిద్-19 నిబంధనలు కూడా పాటించకుండా 35 మంది సిఐడి పోలీసులు తమ ఇంట్లోకి ప్రవేశించి అరెస్టు చేశారని భరత్ మీడియాకు వివరించారు.   కృష్ణంరాజు అరెస్ట్’కు  ఆయన ప్రభుత్వం పై చేసిన ఆరోపణలు కారణమా , అంటే కాదు, అదొక సాకు మాత్రమే, అనేది అందరి అభిప్రాయంగా వుంది.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘ఏ వన్’ ముద్దాయిగా విచారణ ఎదుర్కుంటున్న  క్విట్ ప్రో కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ, కృష్ణం రాజు ఇటీవల పిటీషన్ దాఖలు చేశారు. సీబీఐ న్యాయస్థానం కృష్ణం రాజుపిటీషన్ను విచారణకు స్వీకరించింది. బెయిలు నిబంధనలను ముఖ్యమంత్రి ఉల్లంఘిస్తున్నారని, అదే విధంగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని సాక్షులను ప్రలోభాలకు గురిచేస్తున్నారని చేసిన ఆరోపణలను  పరిగణనలోకి తీసుకుని  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నోటీసు సర్వ్ చేసింది. ఈ నేపధ్యంలోనే వైసీపీ ప్రభుత్వం సిఐడీ ద్వారా కేసులు నమోదు చేసి, ఎంపీని అరెస్ట్ చేసందని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.   మరో వంక కృష్ణం రాజు అరెస్ట్’ను రాజకీయాలకు అతీతంగా వైసీపీ యేతర పార్టీలు, నాయకులు తప్పు పడుతున్నారు. తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు, ప్రజాసమస్యలపై సొంత పార్టీ ఎంపీ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఏకంగా దేశద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేయడం, ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడంతో సమానమని, రాష్ట్రంలో ఎమర్జెన్సీని మించిన అరాచక పాలన సాగుతోందని అన్నారు.అలాగే, టీడీపీ జాతీయ  ప్రధాన  కార్యదర్శి, మాజీ మంత్రి లోకేష్, నియంత కంటే ఘోరంగా, ప్రజల ప్రాణాల రక్షణ పట్టించుకోకుండా, తన కక్ష తీర్చుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుతున్న ఏకైక మూర్ఖపు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అని ఘాటుగా స్పందించారు.అదే విధంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, సొంత పార్టీ ఎంపీ అరెస్ట్’కు ఇదా సమయం అని ప్రభుతాన్ని ప్రశ్నించారు. ‘రాష్ట్రంలో కరోనా విశృంఖలంగా విభృంభిస్తోంది. ఈ తరుణంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కదిలించి ప్రజలను రక్షించాల్సి ఉండగా ఎంపీ రఘురామకృష్ణంరాజును అరెస్టు చేయడం ఏ మాత్రం సమర్థనీయం కాదు. కొంతకాలం పాటైనా రాజకీయ దమన నీతిని కట్టిపెట్టాలి’’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.   తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా రఘురామ కృష్టంరాజును అరెస్ట్ ను ఖండించారు. ఎంపీ రఘురామ కృష్టంరాజును ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేసిన తీరు చాలా దారుణమని బండి సంజయ్‌  అన్నారు. ఒక ఎంపీని ఈడ్చుకెళ్తారా..? బలవంతంగా కారులోకి తోస్తారా..? అంటూ నిప్పులు చెరిగారు. ‘‘లోక్‌సభ స్పీకర్‌ అనుమతి లేకుండా పార్లమెంటు సభ్యుడిని ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు అరెస్టు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అనుమతించిందని బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పు పట్ట్టారు.అయితే అధికార పార్టీ నాయకులు మాత్రం అరెస్టును సమర్దించే ప్రయత్నం చేస్తున్నారు. చట్ట ప్రకారమే ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రులు, పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. అయితే, ఇలాంటి చర్యల వలన ముఖ్యమంత్రి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అనే సంకేతాలు వెళతాయని, ప్రతిపక్షాలు చేసే ఆరోపణలకు బలం చేకూరుతుందని, అదే విధంగా ముఖ్యమంత్రి ఇంకేదో భయం వెంటాడుతోందని, అందుకే అరెస్తులతో ప్రశ్నించే గొంతులను నొక్కెసే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు భావించే ప్రమాదం ఉందని కొందరు అధికార పార్టీ నాయకులు కూడా అంగీకరిస్తున్నారు.  

న్యాయవ్యవస్థను అవమానించేలా మాట్లాడిన వైసీపీ నేతలను అరెస్ట్ చేశారా?

వైసీపీ రెబల్ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు ఏపీలో రాజకీయ ప్రపంకనలు రేపుతోంది. పార్టీలకతీతంగా విపక్ష నేతలంతా రఘురామ కృష్ణం రాజు అరెస్టును ఖండిస్తున్నారు. పుట్టినరోజునే కక్ష పూరితంగా ఆయన్ను అరెస్టు చేశారని ఆరోపిస్తున్నారు.గత కొంతకాలంగా రఘురామకృష్ణరాజుకు, వైసీపీ పెద్దలకు మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది.  జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఆ యుద్ధం మరింత ముదిరింది. తాజా అరెస్టుతో అది పరాకాష్ఠకు చేరింది.బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి రఘురామకృష్ణరాజు అరెస్ట్ ను ఖండిస్తున్నట్టు తెలిపారు. "రాష్ట్ర ప్రభుత్వ పరువుకు భంగం కలిగేలా ప్రసంగించారన్న ఆరోపణలపై రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేశారు... ప్రతిష్ఠకు భంగం కలిగేలా మాత్రమే కాదు, న్యాయవ్యవస్థను అవమానించేలా మాట్లాడిన అదే పార్టీకి చెందిన నేతలను ఎంతమందిని అరెస్ట్ చేశారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది" అని  పురందేశ్వరి వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా రఘురామ కృష్ణరాజు అరెస్టును తీవ్రంగా ఖండించారు. రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు పోలీసు వ్యవస్థను వాడుకోవడం దురదృష్ణకరమన్నారు. వైసీపీ ప్రభుత్వ నిరంకుశత్వానికి, అసహనానికి ఎంపీ అరెస్టు నిదర్శనమని మండిపడ్డారు. ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్టుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో స్పందించారు. కరోనాతో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతుంటే వారిని గాలికొదిలేసిన ప్రభుత్వం ఇలాంటి పనులు చేయడం ఎంతమాత్రమూ సమర్థనీయం కాదని అన్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారన్న ఏకైక కారణంతో సమయం, సందర్భం లేకుండా ఇలాంటి పనులేంటని నిలదీశారు. జనసేన పార్టీ దీనిని తీవ్రంగా ఖండిస్తోందన్నారు. రాష్ట్రం నుంచి హైదరాబాద్ వెళ్లే అంబులెన్సులను సరిహద్దుల్లో అడ్డుకుంటుంటే ఆ విషయం గురించి పట్టించుకోవడం మానేసి ఇలాంటి పనులపై దృష్టి పెట్టడం మంచిది కాదని పవన్ హితవు పలికారు.

కొడుకును అమ్మీ కారును తీసుకుని.. 

అందరికి  కి సొంత ఇల్లు కట్టుకోవాలి. సొంత కారు కొనుకోవాలి అనే డ్రీమ్స్ ఉంటాయి. చాలా మంది కష్టపడి తమ డ్రీమ్స్ ని సాదించాలనుకుంటారు. కానీ కొందరు అయితే ఏం పని చేయకుండానే అవన్నీ కావాలని అనుకుంటారు. ఒక అతనికి సొంతంగా కారు కొనుకోవాలని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన అందరి వస్తుంది అందులో ఏముంది అని అనుకుంటున్నారా ? అలా అనుకుంటే మీరు కరోనా మీద కాలు వేసినట్లే ఎందుకంటే. ఎవరైనా కొత్త కారు తీసుకోవాలంటే వాళ్ళు సంవత్సరాల తరబడి దాచుకున్న డబ్బులతో తీసుకుంటారు. లేదంటే బంగారు అమ్మి తీసుకుంటారు అది కూడా ఒకే సారి అంత డబ్బు లేకపోతే కారు లోనే తీసుకుని కారు తీసుకుంటారు. కానీ ఆ వ్యక్తి ఏం చేశాడో మీరే చూడండి.  యూపీలో షాకింగ్‌ ఘటన వెలుగులోకి వచ్చింది. కారు కొనేందుకు ఓ జంట తమ కన్నపేగునే అమ్మకానికి పెట్టిన హృదయ విదారక ఘటన కన్నౌజ్‌ జిల్లా తిర్వా కొట్వాలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఆ పసికందు అమ్మమ్మ, తాతయ్య గురువారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..   సతౌర్‌కి చెందిన ఓ మహిళ మూడు నెలల క్రితం మగ శిశువుకి జన్మనిచ్చింది. అయితే, కారు కొనుగోలు చేసేందుకు గురుసాహైగంజ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తకు తన కుమార్తె, అల్లుడు కలిసి పసివాడిని రూ.1.5లక్షలకు విక్రయించినట్టు ఆ మహిళ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఆ శిశువు ఇప్పటికీ వ్యాపారి వద్దే ఉన్నాడని ఇన్‌స్పెక్టర్‌ శైలేంద్ర కుమార్‌ మిశ్రా తెలిపారు. శిశువును అమ్మకానికి పెట్టిన ఆ దంపతులను విచారణ కోసం పిలిచినట్టు ఆయన వెల్లడించారు. ఇటీవలే ఆ దంపతులు పాత కారును కొనుగోలు చేసినట్టు గుర్తించామన్నారు.  

ప్రశ్నిస్తే దేశద్రోహం కేసా? రాజా రెడ్డి రాజ్యాంగమా? 

మూడు అరెస్టులు.. ఆరు కేసులు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పాలనంతా ఇలానే సాగుతుందనే చర్చ జనాల్లో సాగుతోంది. జనాలు అనుకుంటున్నట్లుగానే ఏపీలో వరుస పరిణామాలు జరుగుతున్నాయి. కొవిడ్ కల్లోల సమయంలోనూ కక్ష రాజకీయాలు ఆగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవలే టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టయ్యారు. మాజీ మంత్రి దేవినేని ఉమపైనా కేసు నమోదైంది. అంతకుముందు చాలా మంది టీడీపీ నేతలు అరెస్టయ్యారు. తాజాగా వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజును ఏపీ సీఐడీ అరెస్ట్ చేయడం ఏపీలో కలకలం రేపుతోంది. రఘురామ పుట్టినరోజునే ఆయన్ను అరెస్ట్ చేయడం రాజకీయ రచ్చగా మారింది.  రఘురామ రాజు అరెస్టుపై విపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. కరోనా వైఫల్యాలను ప్రశ్నించిన ఎంపీపై దేశద్రోహం కేసు వేస్తారా? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. కరోనా విపత్కర సమయాల్లోనూ కక్ష సాధింపు చర్యలే ముఖ్యమా? అని ఆయన అన్నారు. జగన్‌ పాలనలో ప్రశ్నించే గొంతుకకు సంకెళ్లే బహుమతా?అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని పగ, ప్రతీకారానికి వాడటం దుర్మార్గమని,  కరోనా వేళ ప్రజల ప్రాణాలపై దృష్టి సారించాలని చంద్రబాబు హితవు పలికారు.  నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు అరెస్టు పూర్తిగా అప్రజాస్వామికమని టీడీపీ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు.  ఏపీలో జగన్‌రెడ్డి పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో రూల్ ఆఫ్ లా లేదు.. అంతా రాజారెడ్డి రాజ్యాంగమే నడుస్తోందంటూ మండిపడ్డారు. రఘురామ అరెస్ట్ కక్ష సాధింపులో భాగంగానే జరిగిందని ఆరోపించారు. వారెంట్ లేకుండా ఎంపీని ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నించారు. పోలీసులు ఖాకీ డ్రెస్సును పక్కనపెట్టి అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.  మరోవైపు ఎంపీ రఘురామకృష్ణ రాజు అరెస్టుపై  సీఐడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఎంపీ రఘురామకృష్ణరాజును  శుక్రవారం సాయంత్రం అరెస్టు చేశామని, ఆయనపై ఐపీసీ 124ఎ, 153ఎ, 505, 120బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని ఆ ప్రకటనలో వెల్లడించింది. కొన్ని వర్గాలకు వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇవ్వడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసంతప్తిని ప్రేరేపించేలా రెచ్చగొడుతుండడం వంటి ఆరోపణలతో ఆయనపై ఫిర్యాదులు అందాయని, వాటి ప్రకారమే అరెస్టు చేశామని సీఐడీ వెల్లడించింది.

కరోనాపై చంద్రబాబు వార్! కుప్పంలో ఆక్సిజన్ ప్లాంట్ 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. చిత్తూరు జిల్లాల్లో వైరస్ విజృంభణ రోజురోజుకు పెరిగిపోతోంది. హాస్పిటల్స్ లో బెడ్లు లేక, ఆక్సిజన్ అందక కరోనా రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో కుప్పంలో కరోనా మహమ్మారిపై సమరశంఖం పూరించారు చంద్రబాబు. కుప్పం నియోజకవర్గంలో పలు కార్యక్రమాల కోసం కోటి రూపాయలు ఖర్చు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.  కుప్పం టీడీపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. స్థానికంగా కరోనా పరిస్థితులపై ఆందోళన వెలిబుచ్చారు. తన సొంత నిధులతో కుప్పం ప్రజలను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. మొదట కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.35 లక్షల ఖర్చుతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కొరత ఉంటే ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ద్వారా తక్షణమే నియామకాలు చేపట్టాలని స్థానిక అధికారులకు సూచించారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా కుప్పం నియోజకవర్గంలోని 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అవసరమైన ఔషధాలను పంపిస్తామని చంద్రబాబు తెలిపారు. కరోనా రోగుల ఐసోలేషన్ కు ఉపయోగపడేలా కుప్పం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 200 బెడ్లు, ఒకేషనల్ జూనియర్ కాలేజీ న్యూ బిల్డింగ్ లో 200 బెడ్లు ఏర్పాటు చేయాలని పార్టీ నేతలను ఆదేశించారు. దీనిపై చిత్తూరు జిల్లా కలెక్టర్ కు కూడా లేఖ ద్వారా వివరిస్తానని తెలిపారు. చంద్రబాబు ఆదేశాలతో కుప్పం నియోజకవర్గ టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. 

సీఐడీ అధికారులా.. రౌడీలా! వారెంట్ లేకుండానే అరెస్ట్? 

కోర్టులకు వరుసగా మూడు రోజు సెలవులు.. రఘురామ కృష్ణం రాజు పుట్టిన రోజు... ఇకేం తమ కక్ష తీర్చుకోవడానికి ఇదే కరెక్ట్ సమయం అనుకున్నారో ఏమో పక్కాగా స్కెచ్ వేశారు వైసీపీ నేతలు. ఏపీ సీఐడీ  పోలీసులను రంగంలోకి దింపారు. జగన్ రెడ్డి సర్కార్ అదేశాలతో హైదరాబాద్ లోని ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఇంటికి చేరుకున్న ఏపీ సీఐడీ పోలీసులు... ఆయన్ను అరెస్ట్ చేసి విజయవాడ తీసుకెళ్లారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేశారు. అయితే మొదట్లో వారిని సీఆర్పీఎఫ్ పోలీసులు అడ్డుకున్నారు. తమ ఉన్నతాధికారుల అనుమతి ఉంటేనే అదుపులోకి తీసుకునేందుకు ఒప్పుకుంటామని తేల్చి చెప్పారు.  రఘురామకృష్ణరాజుపై 124/ఏ, 153/బీ, 505 ఐపీసీ, 120(బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు సమాచారం. సెక్షన్ 50 కింద రఘురామ భార్య రమాదేవికి సీఐడీ నోటీసులు ఇచ్చింది ఏపీ సీఐడీ.  గత కొంతకాలంగా ఏపీ సర్కార్‌పై రఘురామ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.  సీఎం జగన్, సజ్జల, వైవీ సుబ్బారెడ్డి తదితరులపై ఆయన పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ తప్పులను ఎండగడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు రావడం.. అరెస్ట్ చేయడం రాజకీయంగా తీవ్ర దుమారాన్ని లేపుతోంది. పుట్టినరోజునే రఘురామ కృష్ణం రాజును అరెస్ట్ సంచలనంగా మారింది.  నర్సాపురం ఎంపీ రఘురామ అరెస్టుపై ఆయన కుమారుడు భరత్ స్పందించారు. వారెంట్‌ లేకుండా తన తండ్రిని అరెస్ట్‌ చేశారని ఆరోపించారు. రఘురామకృష్ణరాజు అరెస్ట్‌కు కారణాలు కూడా చెప్పకుండా.. కోర్టులో చూసుకోండని సీఐడీ అధికారులు అన్నారని భరత్‌ చెప్పారు. ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియదని, అధికారం చేతిలో ఉందని ఏమైనా చేస్తారా? అని ప్రశ్నించారు. పుట్టినరోజు నాడే అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.‘‘కరోనా సమయంలో ఒక ఎంపీని ఎలా అరెస్ట్‌ చేస్తారు? రఘురామకు ఆరోగ్యం కూడా బాగాలేదు. ఆయనకు మూడు నెలల కిందటే గుండె శస్త్రచికిత్స జరిగిందని చెప్పారు. ఇదంతా ఓ స్కెచ్. వాళ్లు సీఐడీ ఆఫీసర్‌లో.. రౌడీలో అర్థం కావడం లేదన్నారు.  కనీసం న్యాయవాదితో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని తెలిపారు. ఈ అరెస్ట్ అన్యాయం అని, కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తామని భరత్ వెల్లడించారు. 

ఎంపీ రఘురామ రాజు అరెస్ట్.. కోర్టు వరుస సెలవుల్లోస్కెచ్ 

కరోనా కల్లోలంలోనూ  ఆంధ్రప్రదేశ్ లో పోలీసుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. నర్సాపురం ఎంపీ, వైసీపీ రెబెల్  రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ అయ్యారు. ఆయన్ను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నీరు ఏపీ పోలీసులు. ఐపి సి 124B సెక్షన్ కింద రఘురామ రాజుపై కేసు నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించారని రఘురామపై అభియోగాలు మోపారు. ప్రభుత్వంపై ఇటీవల పలు అవినీతి ఆరోపణలు చేశారు ఎంపీ రఘురామ కృష్ణం రాజు.  రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ ని అడ్డుకునేందుకు ప్రయత్నించింది సీఆర్పీఎఫ్ సిబ్బంది. తమ ఉన్నతాధికారుల అనుమతి ఉంటేనే అదుపులోకి తీసుకునేందుకు ఒప్పుకుంటామని సీఆర్పీఎఫ్ పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులకు  సమాచారం ఇచ్చి రఘురామ కృష్ణంరాజు ని అదుపులోకి తీసుకున్నారు సిఐడి పోలీసులు. ఆయన్ను విజయవాడకు తరలించారు.  ఏపీ సీఐడీ పోలీసులు  పక్క ప్లాన్ తో నే రఘురామకృష్ణం రాజు అరెస్ట్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. రఘురామ పుట్టినరోజు నాడే సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం సర్వత్రా చర్చ జరుగుతోంది.కొంత  కాలంగా ఏపీ సర్కార్ వైఫల్యాలను ఎండ గడుతున్నారు రఘురామ కృష్ణం రాజు. రచ్చబండ పేరుతో మీడియా సమావేశం నిర్వహిస్తూ జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు. ప్రతిరోజు యూట్యూబ్ లైవ్ లో ప్రభుత్వం కు వ్యతిరేకంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయినట్లుగా రాజు మాట్లాడేవారు.దీంతో తమకు తలనొప్పిగా మారిన  రఘురామకృష్ణం రాజును cid అధికారులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు.   ఈ రోజు ఫ్రైడే రంజాన్ కావటంతో కోర్టులకు సెలవు.శనివారం కూడా హాలీడేనే. మరుసటిరోజు ఆదివారం. అంటే 3 రోజులు వరుసగా కోర్టుకు సెలువులు రావడంతో.. అదను చూసి అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. రఘురామ కృష్ణం రాజును కచ్చితంగా మూడు రోజులు జైలులో ఉంచవచ్చనే కారణంతో పక్కాగా స్కెచ్ వేసి శుక్రవారం సాయంత్రం రఘురామ కృష్ణం రాజును అరెస్ట్ చేశారు.  సోమవారం రాజు కి సంబంధించిన  లాయర్లు బెయిల్ కోసం ప్రయత్నాలు చేయవచ్చు. అయితే కేసు గ్రావిటీ ఎంత?... నిలబడుతుందా లేదా అనే విషయాన్ని ప్రక్కకు పెడితే రఘురామను మూడు రోజులు జైలులో ఉంచేలా జగన్ రెడ్డి సర్కార్ ఆదేశాలతో ap cid తమ ప్లాన్ అమలు చేశారు.   

కుట్రలు కాదు వ్యాక్సిన్లు కావాలి! జగన్ కు లోకేష్ లేఖ 

ఆంధ్రప్రదేశ్ లో కొవిడ్ వ్యాక్సిన్లపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. జగన్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే ఏపీకి ఎక్కువగా వ్యాక్సిన్లు రావడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ స్లోగా సాగుతుండటం పట్ల టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ సీఎం జగన్ కు లేఖ రాశారు. వ్యాక్సిన్ పై ప్రభుత్వ నిర్లక్ష్యం ఖరీదు ప్రజల ప్రాణాలు అని ఆయన అందులో తెలిపారు. ఇప్పటికైనా స్పందించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని సీఎం జగన్ కు సూచించారు లోకేష్. కరోనా మరణాల సంఖ్య 9 వేలు దాటుతున్న వేళ, ప్రాణాలు నిలిపే వ్యాక్సిన్ల కోసం సీఎం జగన్ కేంద్రాన్ని  డిమాండ్ చేయలేకపోవడం విచారకరం అన్నారు నారా లోకేష్. వ్యాక్సిన్ తయారీదారుల నుంచి నేరుగా డోసులు సేకరించేందుకు ఏప్రిల్ 20 నుంచి 29వ తేదీ మధ్యన మన రాష్ట్రానికి అవకాశం వచ్చినా స్పందించలేదని లోకేశ్ ఆరోపించారు. అదే సమయంలో రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలు ఒక్కొక్కటి 3 కోట్ల వ్యాక్సిన్ డోసులకు పైగా ఆర్డర్లు చేశాయని వెల్లడించారు.ఏపీలోని ప్రతి పౌరుడికి టీకా ఇవ్వడంలో ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళికపై సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయాలని కోరుతున్నామని లోకేశ్ స్పష్టం చేశారు. "రాష్ట్ర ప్రజలు మీ నుంచి వ్యాక్సిన్లు కోరుకుంటున్నారు... కుట్రలు కాదు. మేం మీ నుంచి సమాధానాలు కోరుకుంటున్నాం... ప్రకటనలు కాదు. మేం మీ మంత్రుల నుంచి చర్యలను కోరుతున్నాం... వాక్చాతుర్యం, సహజీవనం కాదు. మీరు పరిస్థితులకు తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవాలని మేం కోరుకుంటున్నాం... కుంటిసాకులు చెప్పడంకాదు" అని పేర్కొన్నారు.

ఏపీ అంబులెన్సులకు లైన్ క్లియర్.. టీఎస్ సర్కార్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వస్తున్న కోవిడ్ పేషెంట్లపై ఆంక్షలు విధిస్తూ ఇచ్చిన ఉత్తుర్వులపై హైకోర్టు స్టే ఇచ్చింది. అంబులెన్సులను తెలంగాణలోకి అనుమతి ఇవ్వాలని ఆదేశించింది. తెలంగాణ సర్కార్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ సర్కార్ తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో తము ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్‌ల వివాదంపై చీఫ్ జస్టిస్ హిమాకోహ్లీ నేతృత్వంలో విచారణ జరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి కరోనా పేషెంట్లు ఎక్కువగా వస్తున్నారని, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ నుంచి కరోనా బాధితులు వస్తున్నారని కోర్టుకు ఏజీ విన్నవించారు. ప్రతి పేషేంట్‌కు ఆస్పత్రి అడ్మిషన్‌ ఉండాలని ఏజీ అన్నారు. తాము ఆదేశాలు ఇచ్చినా... సర్క్యులర్ ఎలా జారీ చేస్తారంటూ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరికి ప్రాణాలు కాపాడుకునే హక్కు ఉందని, విజయవాడ, హైదరాబాద్ మార్గం నేషనల్‌ హైవే.. దానికి కేంద్ర ప్రభుత్వంపై అధికారం ఉంటుందని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి అధికారం ఉండదని పేర్కొంది. అంబులెన్స్‌లను ఆపడానికి తెలంగాణ సర్కార్‌కు హక్కు లేదని, ఇప్పటి వరకు దేశంలో ఎక్కడ కూడా.. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ లాంటిది ఇవ్వలేదని తెలిపింది. కోర్ట్ చెప్పినా కూడా ఆదేశాలు పాటించలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఈ సందర్భంగా ఏజీ వాదనలు వినిపిస్తూ.. తెలంగాణకు నాలుగు రాష్ట్రాల సరిహద్దులు ఉన్నాయని తెలిపారు. ఈనెల 11వ తేదీన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సర్కులర్‌పై హైకోర్ట్ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై మాట్లాడిన ఏజీ.. రాష్ట్ర ప్రజల బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తెలంగాణ అధికారులు కరోనాపై రివ్యూ చేసి.. ఇతర రాష్ట్రాలకు ఈ సర్క్యులర్ జారీ చేశారని ధర్మాసనానికి తెలిపారు. ఏజీ వాదనలను ఖండిస్తూ.. ఇతర రాష్ట్రాల ప్రజలను నిలువరించడం దేనికని హైకోర్టు ప్రశ్నించింది.  ‘‘పేషంట్లను తీసుకొస్తున్న అంబులెన్స్‌లు ఆపడం ఎక్కడైనా చూశామా? రైట్ టు లైఫ్‌ను ఆపడానికి మీకు ఏం అధికారం ఉంది? ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి నిబంధన మేం చూడలేదు. రోగులు సరిహద్దుల్లోనే చనిపోతున్నారు. పేషెంట్లు చనిపోతుంటే మీరు సర్క్యులర్లు జారీ చేస్తారా?సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లోనూ జనరల్‌ బెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల ప్రజలకే కాదు.. హైదరాబాద్‌లో ప్రజలకు సైతం అడ్మిషన్ ఉండట్లేదు. హైదరాబాద్‌లో పేషెంట్లకు ఆక్సిజన్ అవసరమైతే.. చిన్న ఆస్పత్రుల నుంచి పెద్ద ఆస్పత్రులకు వెళ్లడం లేదా? గద్వాల్, ఖమ్మం, నిజామాబాద్ నుండి కూడా.. 300 కి.మీ ప్రయాణం చేసి పేషంట్లు వస్తున్నారు, వారిని ఆపుతున్నారా? రాజ్యాంగాన్ని మీరు మార్చలేరు’’ అంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసింది.  హైకోర్టు వ్యాఖ్యలకు ఏజీ సమాధానమిస్తూ.. అంబులెన్స్‌లను నిలువరించే ముందు సర్క్యులర్ జారీ చేశామని చెప్పారు. ఢిల్లీ, మహారాష్ట్రలో కూడా ఇలాంటి నిబంధన ఉందన్నారు. ఇతర రాష్ట్రాల్లో పోలిస్తే తెలంగాణ చాలా మేలు చేస్తుందని, ఇతర రాష్ట్రాల్లో నెగిటివ్ రిపోర్ట్ లేకుంటే అసలు ఎంట్రీ లేదని కోర్టుకు తెలిపారు. ఆస్పత్రి అనుమతి ఉంటేనే అనుమతి ఇస్తున్నామని తెలిపారు.

18 ఏనుగులు మృతి.. 

ఒకేసారి 18 ఏనుగులు మృత్యువాత పడ్డాయి.  అక్కడి అటవీ అధికారుల సమాచారం ప్రకారం, కత్తైటోలి రిజర్వ్‌ ఫారెస్ట్‌ సమీపంలో ఏనుగుల సమూహాలు విగత జీవులుగా పడివుండడాన్ని గుర్తించిన స్థానిక ప్రజలు అధికారులకు సమాచారమిచ్చారు. కొండ ప్రాంతంలో ఒకచోట 14 ఏనుగులు, మరోచోట నాలుగు ఏనుగులు మృత్యువాతపడ్డట్లు అధికారులు గుర్తించారు. పిడుగుపాటు వల్ల ప్రాణలు కోల్పోయి ఉండవచ్చని అనుమానిస్తున్నప్పటికీ.. పోస్టుమార్టంలోనే పూర్తి కారణాలు తెలుస్తాయన్నారు. అయితే, అక్కడి ఏనుగుల నిపుణులు మాత్రం విషప్రయోగం వల్లే 18 ఏనుగులు ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఏదేమైనా, పోస్టుమార్టం నివేదికలో పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. ఈ స్థాయిలో ఒకేసారి 18 ఏనుగులు మృత్యువాతపడడం దేశంలో ఇదే తొలిసారి అని అటవీశాఖ నిపుణులు చెబుతున్నారు. ఈ ఘటన అస్సాంలోని నాగావన్‌ జిల్లాలో చోటుచేసుకుంది.    ఈ ఘటనపై విచారణ వ్యక్తం చేసిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ.. ఏనుగుల మృతికి గల కారణాలపై పూర్తి దర్యాప్తు జరపాలని అటవీశాఖ మంత్రి పరిమల్‌ శుక్ల బైద్యకు సూచించారు. సీఎం ఆదేశాల ప్రకారం ఘటనా ప్రాంతాన్ని స్వయంగా సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకుంటామని మంత్రి వెల్లడించారు. మరోవైపు, దేశంలో ఏనుగుల సంఖ్య అధికంగా ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక తొలిస్థానంలో ఉండగా, అస్సాం రెండో స్థానంలో ఉంది. 2017 లెక్కల ప్రకారం, అస్సాంలో దాదాపు 5700 ఏనుగులు ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే, ఏనుగులను వేటాడడం, రైలు ప్రమాదాలు, విష ప్రయోగంతో పాటు విద్యుదాఘాతం వంటి కారణాల వల్ల ఏనుగుల ప్రాణాలు కోల్పోవడం గతకొన్నేళ్లుగా పెరిగిపోయింది. 

మరో కేంద్ర మంత్రి  మరో వివదాస్పద వ్యాఖ్య 

దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తూ, సామాన్య ప్రజలనే కాకుండా, అన్ని వర్గాల వారిని ఆందోళనకు, ప్రాణ భయానికి గురిచేస్తున్న కరోనా విషయంలో, కొందరు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నాయకులు  చేస్తున్న వ్యాఖ్యలు వివాదానికి దారి తీస్తున్నాయి. విమర్శలకు తావిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్, ప్రతి రోజూ, ప్రతి ఒక్కరూ  గోమూత్రం తాగితే కరోనా ఖతమై పోతుందని అంటే, మరొకరు యజ్ఞ యాగాదులతో, కరోనా కష్టాలు తొలిగి పోతాయని అన్నారు. అలాగే, రెండు రోజుల క్రితం ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్, కరోనా కూడా మనిషిలాంటి మరో జీవని, మనిషిలానే జీవిచేందుకు పోరాటం చేస్తోందని, ఆ క్రమంలో కరోనా వైరస్ తన రూపాన్ని మార్చుకుంటోందని అన్నారు. ఇలా, బీజేపీ నాయకులు ఏ ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేసినా అవి వివాదాస్పదం లేదా నవ్వుల పాలవుతున్నాయి.  ఇప్పుడు తాజాగా కర్నాటకకు చెందిన కేంద్ర మంత్రి, సదానంద గౌడ్, మరో మెట్టెక్కి సుప్రీం కోర్టు వ్యాఖ్యలనే తప్పు పట్టే విధంగా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రతి ఒక్కరికీ వాక్సిన్ ఇవ్వాలని సుప్రీం కోర్టు చేసిన సూచనను మంత్రి స్వాగతించారు. కోర్టు మంచి సూచన చేసిందని అన్నారు.నిజానికి కేంద్ర ప్రభుత్వం సంకల్పం కూడా అదేనని,అందుకోసం ప్రభుత్వం చిత్త శుద్దితో కృషి చేస్తోందని చెప్పారు. అయినా, ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు.అయితే, అంతటితో అగకుండా ఆయన మరో అడుగు ముందుకు వేశారు. అయితే అది ఆయన ఉద్దేసపూర్వకంగా వేసిన  అడుగు, చేసిన వ్యాఖ్య కాదు. నిజానికి ఆయ ఆగ్రహం వ్యక్తపరిచింది, న్యాయస్థానంఆపి కాదు,  దేశ ప్రజలు అందరికీ, వాక్సిన్ ఇవ్వాలని కోర్టు ఆదేశించిన విషయాన్నే, విలేకరులు పదే పదే ప్రస్తావించి,  ప్రభుగ్వం ఏమి చేస్తుందని గుచ్చి గుచ్చి అడగడంతో మంత్రి బాలన్స్ తప్పారు. కోర్టు చెప్పినన్ని వాక్సిన్’లు ఇవ్వకపోతే ఏమి చేయాలి, ఉరేసుకోవాలా? అని అసహనం వ్యక్తపరిచారు.  అయితే, సదానంద గౌడ్ కానీ ఇంతక ముందు గోమూత్రం చిట్కా చెప్పిన యూపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యాలు, కానీ అదే విధంగా యగ్నయాగాదులతో కరోనాను నియంత్రిచవచ్చని మరొకరు చేసిన వ్యాఖ్యలు కానీ, గీతదాటి చేసిన విచిత్ర వ్యాఖ్యలు కాదు. నిజానికి, గోమూత్రంలో ఔషధ గుణాలు ఉన్నాయని,మన వేదాలే కాదు పాశ్చాత్య శాస్త్రవేత్తలు కూడా అంగీకరించారు. అంగీకరించడమే కాదు, గోమూత్రంపై అనేక పరిశోధనలు చేసి, కాన్సర్ సహా అనేక భయకర వ్యాధుల చికిత్సకు ఉపయోగించే ఔషధాల తయారీలో వినియోగిస్తున్నారు.  అంతేకాదు, ఇటీవల జరిపిన పరిశోధనల్లో గోమూత్రం వల్ల ఉదర సంబంధ సమస్యలు సమసిపోతాయి అని తేలింది. గోమూత్రం వాత పిత్తాలను సమతౌల్యం చేస్తుంది. ఇందులో పొటాషియం, కాల్షియం, క్లోరైడ్, యూరియా, అమ్మోనియా, సల్ఫర్, యూరిక్ యాసిడ్, ఫాస్పేట్, మాంగనీస్, కార్బోలిక్ యాసిడ్, క్యాల్షియం లాంటి మూలకాలే కాదు విటిమిన్ ఎ, బి, డి ఈ కూడా ఉన్నట్లు ఆధునిక పరిశోధనలో గుర్తించారు. కేవలం గ్యాస్టిక్ర్, ఎసిడిటీ సమస్యలనే కాదు చర్య వ్యాధులను కూడా గోమూత్రం దూరం చేస్తుంది. కేన్సర్, హిస్టీరియా, క్షయ లాంటి భయంకర వ్యాధులను కూడా నయం చేసే గుణాలు గోమూత్రంలో ఉన్నాయని ఇటీవల అధ్యయనంలో వెల్లడైంది.అలాగే, గోమూత్రం తీసుకోవడం వలన, ఆక్సీకరణ జరుగుతుందని (శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి), అధిక రక్తపోటును నియంత్రించి గుండె పనితీరును మెరుగు పరుస్తుంది. ఇవ్వన్నీ, మన వాళ్ళు కాదు, పాశ్చాత్య శాస్త్రవేత్తలు, వైద్యులు పరిశోధనల సారంగా చెపుతున్న మాటలు. అయితే, ప్రస్తతం ప్రాణాపాయ స్థితికి చేరుకున్న రోగికి, గోమూత్రం పనిచేస్తుందా అంటే చేయక పోవచ్చును. కాబట్టి, గోమూత్రం చిట్కాగా పనిచేయక పోవచ్చును కానీ, దీర్ఘకాలంలో గోమూత్రం ఒక కరోనాకు మాత్రమే కాదు, ఇంకా చాలా వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది. నిజానికి, సుమారు వందేళ్ళు బతికిన మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ ఎప్పుడోనే తమ ఆరోగ్య రహస్యం, తు రోజూ తీసుకునే గోమూత్రం అని చెప్పారు. అలాగే, యజ్ఞ యాగాదుల వలన పర్యావరణ సమతుల్యత ఏర్పడడంతో ఏర్పడడంతో కాలుష్యం కట్టడి అవుతుంది . ఇది మనదరికీ అనుభవంలో ఉన్న విషయమే. అయితే, కరోనా భయం కమ్ముకున్న ప్రస్తుత పరిస్థితిలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అనేదే ప్రశ్న. అక్కడే కమల దళం నాయకుకులు తప్పులో కాలేసి, మిడిమిడి జ్ఞానంతో మిడిసిపడే మీడియాకు దొరికి పోతున్నారు.నవ్వుల పాలవుతున్నారు.

అంబులెన్సులు ఆపడం అమానుషం! సీఎంలే పరిష్కరించాలన్న రేవంత్ 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య వివాదం ముదురుతోంది. ఏపీ నుంచి వచ్చే కొవిడ్ పేషెంట్లను తెలంగాణ సరిహద్దుల్లో అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. తెలంగాణ పోలీసుల తీరుతో సరిహద్దుల్లో వందలాది అంబులెన్సులు నిలిచిపోయాయి. తమకు పంపించాలంటూ కొవిడ్ రోగుల బంధువులు వేడుకుంటున్నా తెలంగాణ పోలీసులు కనికరించడం లేదు. దీంతో సీరియస్ ఉన్న రోగులు ప్రాణాలు కోల్పోతున్నారని తెలుస్తోంది.  తెలంగాణ ప్రభుత్వ ఆంక్షలపై ఏపీ రాజకీయ నేతలు, ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ముఖ్యమంత్రి అసమర్ధతవల్ల ఏపీ ప్రజలకు పొరుగు రాష్ట్రాల్లోనూ వైద్యం అందడం లేదన్నారు. తెలంగాణ సరిహద్దులో ఏపీ అంబులెన్సులను ఆపితే సీఎం జగన్‌ కనీసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కూడా మాట్లాడలేదని విమర్శించారు. జగన్‌కు కేసీఆర్‌ చేసిన ఎన్నికల సాయంతో ప్రశ్నించలేని పరిస్థితి నెలకొందన్నారు. నాణ్యమైన వైద్యం అందక అమరావతి లేని లోటు ప్రజలకు తెలుస్తోందన్నారు.  హైకోర్టు చెప్పినా తెలంగాణ ప్రభుత్వం ఇలా వ్యవహరించడం సరికాదన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఇది అత్యంత అమానవీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ భారత దేశంలో అంతర్భాగంగా ఉందా? లేక ప్రత్యేక దేశమా? అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తన చేతగాని తనాన్ని  చూపించుకోడానికి ఈ రకంగా అంబులెన్స్‌లు ఆపడమంటే ఇంతకంటే ఘోరమైన విషయం మరొకటిలేదని రామకృష్ణ వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా రోగులపై కరుణ, మానవత్వం చూపడం లేదని ఏపీసీసీ చీఫ్ డా సాకే శైలజానాథ్ పేర్కొన్నారు. ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల వద్ద అంబులెన్సులు అటు ఇటు స్వేచ్ఛగా అనుమతించాలన్నారు. తెలంగాణ, ఆంధ్ర ముఖ్యమంత్రులు కలసి ప్రజల ప్రాణాలు కాపాడడానికి తక్షణమే నిర్ణయం తీసుకోవాలన్నారు.  తెలంగాణలోకి ఏపీకి చెందిన అంబులెన్స్‌ను అనుమతించకపోవడంపై కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ స్పందించారు. వెంటనే జిల్లాలోని పుల్లూరు టోల్‌ప్లాజా వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే... తెలంగాణ పోలీసులతో మాట్టాడారు. పర్మిషన్ ఉన్న అంబులెన్స్‌లను తెలంగాణలోకి పంపించాలని కోరారు. హైదరాబాద్ హాస్పిటల్‌లలో చేరేందుకు పర్మిషన్ లేని రోగులను ఆసుపత్రిలో చేర్చుకొని చికిత్స చేయాల్సిందిగా జీజీహెచ్ అధికారులకు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సూచించారు.  ఏపీ నుంచి హైద‌రాబాద్‌కు చికిత్స కోసం వ‌చ్చే క‌రోనా రోగుల అంబులెన్సుల‌ను చెక్‌పోస్టుల్లో అడ్డుకోవ‌డం స‌రికాదని ఎంపీ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మాన‌వత్వంతో ఆలోచించి ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు త‌క్ష‌ణమే ఈ స‌మ‌స్య ప‌రిష్కారంపై దృష్టి సారించాలన్నారు. ఏపీ క‌రోనా రోగుల‌కు తెలంగాణ‌లోకి అనుమ‌తి లేక పోవ‌డంతో య‌స్‌.శివారెడ్డి అనే వ్య‌క్తిని క‌ర్నూలు ఆస్ప‌త్రిలో చేర్పించ‌డం జ‌రిగిందన్నారు. క‌రోనా రోగుల అనుమ‌తి విష‌యంలో నెల‌‌కొన్న ప్ర‌తిష్టంభ‌న తొల‌గించే దిశ‌గా రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని రేవంత్ డిమాండ్ చేశారు.