జైలుకు రఘురామ.. కోర్టు ఆదేశాలు బేఖాతరు?
posted on May 16, 2021 @ 5:29PM
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. వైద్యపరీక్షల అనంతరం జీజీహెచ్ క్యాన్సర్ ఆస్పత్రి నుంచి నేరుగా జైలుకు తీసుకెళ్లారు. రఘురామ తరలింపు నేపథ్యంలో జిల్లా జైలు వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
రఘురామ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో సరైన వైద్యం అందించాలని కోర్టు సూచించింది. మొదట జీజీహెచ్, ఆ తర్వాత రమేశ్ హాస్పిటల్‌లో ఆయనకు చికిత్స అందించాలని ఆదేశించింది. అయినా కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ రఘురామను జైలుకు తరలించారు పోలీసులు.
మరోవైపు రఘురామకృష్ణరాజుకు అయిన గాయాలపై జిల్లా కోర్టుకు మెడికల్ బోర్డు నివేదిక ఇవ్వనుంది. జీజీహెచ్‌లో ఎంపీకి వైద్య పరీక్షలు పూర్తిచేసిన మెడికల్ బోర్డు.. కోర్టుకు సమర్పించే నివేదికను సిద్ధం చేసింది. కోర్టు ఆదేశాలతో రఘురామ గాయాలపై గత రాత్రి నుంచి పరీక్షలు కొనసాగాయి. అనంతరం నివేదికను తయారు చేసేందుకు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి నేతృత్వంలో మెడికల్ బోర్డు ఏర్పాటైంది. బోర్డు సభ్యులుగా జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ నరసింహం, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ వరప్రసాద్, జనరల్ సర్జన్ సుబ్బారావు ఉన్నారు. ఉదయం 10.30 గంటలకే జిల్లా కోర్టుకు.. మధ్యాహ్నం 12 గంటల్లోపు హైకోర్టు డివిజన్ బెంచ్‌కు మెడికల్ బోర్డు నివేదిక ఇవ్వాల్సి ఉండగా.. పరీక్షలు ముగియకపోవపడంతో జాప్యం జరిగింది. పరీక్షల జాప్యంపై రఘురామ కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.