పాడెపై శవం లేచి కూర్చుంది.. 

ఆమె పేరు శంకుత గైక్వాడ్‌. ఆమెకు 76 ఏళ్ళు. బామ్మకు కొద్ది రోజుల క్రితం కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఇంట్లోనే హోం ఐసోలేషన్‌లో ఉంచారు. అయితే వయసు పైబడటంతో.. ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. దీంతో కుటుంబ సభ్యులు బారామతిలోని ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మే 10వ తేదీన ఓ ప్రైవేట్ వాహనంలో శంకుతల కుటుంబ సభ్యులు ఆమెను తీసుకుని బారామతి చేరుకున్నారు. ఆస్పత్రిలో బెడ్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ లాభం లేకుండా పోయింది. వారు కారులో వేచి చూడసాగారు. అయితే ఆ సమయంలో శకుంతల పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కదలం కూడా ఆపేసింది. దీంతో ఆమె చనిపోయిందని అనుకున్న కుటుంబ సభ్యులు.. అనంతరం ఊరికి తీసుకొచ్చి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.  ఆమె చనిపోయిందని కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదించారు. అంతిమ యాత్రలో భాగంగా ఆమెను పాడెపై పడుకో బెట్టారు. అయితే ఒక్కసారిగా బామ్మ తన కళ్లు తెరిచి ఏడవడం ప్రారంభించింది. దీంతో షాక్ తిన్న కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. పోలీస్ అధికారి సంతోష్ గైక్వాడ్ ఈ ఘటనను ధ్రువీకరించారు. ఇక, ప్రస్తుతం ఆ బామ్మను బారామతిలోని సిల్వర్ జూబ్లీ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఆమెకు వైద్యం అందిస్తున్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని బారామతి జిల్లాలోని ముధలే గ్రామంలో జరిగింది. 

ఏటీఎమ్ నుంచి డబ్బులే డబ్బుల్.. తీసుకునేందుకు ఎగబడ్డ జనాలు 

ఏటీఎమ్.. ఎనీ టైమ్ మనీ.. మన బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులు మనకు కావాల్సినప్పుడు తీసుకోవడానికి ఏటీఎమ్ లను ఏర్పాటు చేశారు. ఏటీఎంలోకి వెళ్లి మనం ఎంత మనీ డ్రా చేయాలనుకుంటామో అంతే కొట్టి తీసుకొని వస్తాం. కానీ వనపర్తి జిల్లాలోని ఓ ఏటీఎంలో రూ.100 కొడితే రూ.500 వచ్చాయి.. ఇకేం డబ్బులు అదనంగా వస్తుండటంతో జనాలు ఎగబడ్డారు.. విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి ఆ ఏటీఎమ్ ను సీజ్ చేశారు.  వనపర్తి జిల్లాలోని అమరచింతలో ఉన్న ఇండియా నెం.1 ఏటీఎంలో శనివారం  ఓ వింత ఘటన చేసుకుంది.  ఇండియా నెం.1 ఏటీయంలో.. రూ. 100లకు బదులు ఏకంగా రూ.500 డ్రా అయ్యాయి. అలా చేస్తున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి. స్థానికులు ఒక్కొక్కరూగా వచ్చి డబ్బులు డ్రా చేసి సంబరాల్లో మునిగిపోయారు. ఈ విషయం ఒకరి నుంచి ఒకరికి ఫోన్ల ద్వారా చెప్పుకున్నారు. (ప్రతీకాత్మక చిత్రం) స్థానికులు ఒక్కొక్కరూగా వచ్చి డబ్బులు డ్రా చేసి సంబరాల్లో మునిగిపోయారు. ఈ విషయం ఒకరి నుంచి ఒకరికి ఫోన్ల ద్వారా చెప్పుకున్నారు.ఫోన్ చేసి మరీ ఏటీఎం కార్డులు తెప్పించుకున్నారు. డ్రా చేసుకున్న వాళ్ళు ఒక్కరు కూడా అక్కడ నుంచి కదల్లేదు.  మళ్లీ మళ్లీ డ్రా చేసుకుంటూనే ఉన్నారు.  అయితే పోలీసులు పెట్రోలింగ్‌కు రావడంతో అక్కడి నుంచి అందరూ పారిపోయారు.  అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. వెంటనే సంబంధిత ఏటీయం అధికారులకు సమాచారం ఇచ్చారు. ఏటీఎమ్ సిబ్బంది  వచ్చి ఏటీయంలోని సాంకేతిక లోపాన్ని గుర్తించి సరి చేశారు. అధనంగా ఆ ఏటీఎం నుంచి ఎంత డబ్బులు డ్రా అయ్యాయనే విషయంపై ఆరా తీస్తున్నారు.అంతే కాకుండా ఎవరి అకౌంట్ హోల్డర్ నుంచి డ్రా చేసుకున్నారో వివరాలను తెలుసుకుంటున్నారు.

ఇంటి ముందు ఉన్న చెట్టు పైనే ఐసోలేషన్ ..

కరోనా వల్ల ప్రపంచం మొత్తం తలకిందుల అవుతున్నాయి. జనాలు పిట్టల రాలిపోతున్నారు. అదే విదంగా యావత్ భారత్  కన్నీటి పర్వంలో మునిగిపోతుంది. ఎక్కడ చూసిన శవాలు గుట్టల కనిపిస్తున్నాయి. ఇంకా ఈ కరోనాతో ప్రజలకు పాట్లు తప్పవా.. ఇంకా ఎన్నాళ్లు ఇలాగే ప్రాణాలకు భయపడుతూ, ఆకలికి అలమటించాలి. ఆర్థికంగా ఉన్నవాళ్లను, లేనివాళ్లను కరోనా ఇబ్బంది పట్టిన. ఉన్నవాళ్ళకి కొంత ఉపశమనంగానే ఉన్నారు. కానీ లేని వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా తయారు అవుతుంది. హాస్పిటల్ కి వెళితే బెడ్స్ దొరకవు. ఆక్సిజన్ ఉండదు. సరైన వైద్యం అందక ప్రజలు అస్తవేస్తాలు పడుతున్నారు. ఇదంతా పక్కన పెడితే ఇంట్లోనే ఉంది చికిత్స తీసుకుందాం అనుకుంటే. మన దేశంలో చాలా మందికి ఒక రూమ్లో నలుగురు నివస్తిస్తున్నారు. మరి ఆ వాళ్ళ కు ఒక్కరికి కరోనా వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి..?  వాళ్ళు ఎక్కడ తల దాచుకోవాలి. ఇంట్లో కరోనా వచ్చిన వ్యక్తి ఆ ఇంట్లోనే ఉంటే మిగతావాళ్లు పరిస్థితి ఏంటి ? ఆ కరోనా నుండి వాళ్ళను ఎవరు కాపాడాలి. తాజాగా నల్లగొండ జిల్లాలో ఇదే జరిగింది.   నల్గొండ జిల్లాలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. కరోనా బారినపడిన ఓ బీటెక్ విద్యార్థి చెట్టుపై నివాసం ఏర్పరచుకోవడం మీడియా కంటపడింది. అడవిదేవులపల్లి మండలం కొత్త నందికొండ గ్రామానికి చెందిన రమావత్ శివానాయక్ ఇంజినీరింగ్ విద్య అభ్యసిస్తున్నాడు. అయితే, కరోనా వ్యాప్తి కారణంగా తరగతులు నిలిచిపోవడంతో గత కొన్నినెలలుగా గ్రామంలోనే ఉంటూ కుటుంబసభ్యులతో కలిసి వ్యవసాయం చేస్తున్నాడు. ఇటీవలే శివానాయక్ స్థానిక ఐకేపీ కేంద్రంలో ధాన్యం విక్రయించాడు. ఆ తర్వాత జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతుండడంతో కరోనా టెస్టు చేయించగా, పాజిటివ్ అని వెల్లడైంది. అయితే, తమ ఇంట్లో ఉన్నది ఒకే గది కావడంతో ఐసోలేషన్ లో ఉండేందుకు తన ఇంటి సమీపంలోని చెట్టునే ఆవాసంగా మలుచుకున్నాడు. చెట్టుపై మంచాన్ని గట్టిగా తాళ్లతో కట్టి దానిపైనే విశ్రమిస్తూ ఐసోలేషన్ లో గడుపుతున్నాడు. గత 9 రోజులుగా ఇదే విధంగా చెట్టుపైనే శివానాయక్ మకాం ఉంటున్నాడు.

ఇక అంతా ఆన్లైన్   జగమంతా వర్చ్యువల్‌..

అప్పుడు అంతా ఆన్ లైన్. చదువులు ఆన్లైన్  ... ఉద్యోగాలు ఆన్లైన్  (వర్క్ ఫ్రమ్ హోం),  కొతిమేర కట్ట నుంచి నిత్యావసర సరుకులు, ఇంకా ఏదైనా విలాస, వినోద వస్తువులు ఏది కావాలన్నా ఏమి వాలన్నా ఆన్లైన్ ..అలాగే జాతీయ, అంతర్జాతీయ సభలు, సమావేశాలు అన్నీ వర్చ్యువల్‌ పద్దతిలో జరుగుతున్నాయి. చివరకు ఎన్నికల ప్రచారం, మంత్రి వర్గ సమావేశాలు అదే పద్దతిలో సాగుతున్నాయి. కారణం ఏమిటో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ప్రపంచాన్ని ప్రమాదం అంచులలో నిలిపిన కరోనా మహామ్మారి భౌతిక బంధాలను దూరం చేసింది.  కరోనా మహామ్మారి కారణంగా, పార్లమెంట్, శాసన సభ సమావేశాలు, మొక్కుబడి తంతుగా మారి పోయాయి. పార్లమెంట్’ బడ్జెట్ సమావేశాలు కరోనా కారణంగానే అర్ధాంతరంగా వాయిదా పడ్డాయి. ఆంధ్ర పదేశ్ ప్రభుత్వం అయితే, అసలు సమావేశాలకే పంగనామాలు పెట్టింది. ఆర్డినెన్సు ద్వారా ఆమోదించిన ఓటాన్ బడ్జెట్’తో కాలక్షేపం చేస్తోంది.  ఈ నేపధ్యంలో పార్లమెంట్ సమావేశాలు సహితం వర్చ్యువల్ పద్దతిలో జరపాలనే ప్రతిపాదనపై జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది. నిజానికి, గత సమావేశాల సందర్భంలోనే అందుకు గల సాద్యావకాశాల గురించి రాజ్యసభ చైర్మన్, లోక్ సభ స్పీకర్ సమాలోచనలు జరిపారు. యూకే నుంచి పాకిస్తాన్‌ వరకు అనేక దేశాల్లో వర్చ్యువల్‌ పార్లమెంట్ సమావేశాలను ఇప్పటికే నిర్వహిస్తునారు.    అయితే మన దేశంలో మాత్రం ఇంతవరాకు వర్చ్యువల్‌ పార్లమెంట్ సమావేశాలపై నిర్ణయం జరగలేదు. అయితే,  ప్రయోగాత్మకంగా ముందు స్థాయి సంఘం సమావేశాలను వర్చువల్ పద్దతిలో నిర్వహించాలానే విషయంలో మాత్రం పార్లమెంట్ ఉభయ సభల అధ్యక్షులు ఒకని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ముందు స్థాయి సంఘం సమావేశాలను వర్చ్యువల్‌ పద్దతిలో నిర్వహించి, ఆ అనుభవాల ఆధారంగా పార్లమెంట్ సమావేశాల విషయంలో ఒక నిర్ణయానికి రావచ్చని భావిస్తున్నారు. కాగా వర్చ్యువల్‌ పద్ధతిలో పార్లమెంటరీ స్థాయీ సంఘాల సమావేశాలు నిర్వహించడంలో సాధ్యాసాధ్యాలను చర్చించడానికి రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్య నాయుడు గురువారం సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. కరోనా నేపథ్యంలో భౌతికంగా సమావేశాలు నిర్వహించడం వీలుకానందున, వర్చ్యువల్‌ విధానంలో పార్లమెంటరీ కమిటీలను సమావేశపరచాలని అనేకమంది ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ఈ విషయం పై వెంకయ్య లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, ఇతర సీనియర్‌ అధికారులతో మాట్లాడినట్టు సమాచారం.నిజానికి, పార్లమెంట్ సమావేశాలు వర్చువల్ పద్దతిలో నిర్వహించాలనే విషయంలో రాజకీయ పార్టీలు,పార్లమెంట్ సభ్యులు కూడా సుముఖంగా ఉన్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత డెరెక్‌ ఒబ్రెయిన్‌, మరికొందరు సభ్యులు  ఇటీవల రాజ్యసభ ఛైర్మన్‌కు లేఖ రాశారు.  అయితే పార్లమెంట్ వర్చ్యువల్‌ పార్లమెంటు సమావేశాలు నిర్వహించడానికి నిబంధనలను సడలించవలసి ఉంటుందని  నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా పార్లమెంటు చర్చల గోప్యతకు సంబంధించిన నిబంధనలను,అదే విధంగా వ్యక్తిగత హాజరుకు సంబందించిన నిబంధనలను సవరించవలసి ఉంటుందని రాజ్యాంగ నిపుణులు పేర్కొంటున్నారు. రాజ్యసభ సమావేశాలు నిర్వహించడానికి నిబంధనలు సవరిస్తే అవి లోక్‌సభకు కూడా వర్తిస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పార్లమెంటు భౌతికంగా సమావేశమయ్యే అవకాశం లేనందున రాజ్యాగ నిపుణులను సంప్రదించి ప్రత్యామ్నాయాలను ఆలోచించవచ్చు. ప్రతిపక్ష పార్టీలు కూడా వర్చ్యువల్‌ సమావేశాలకు సానుకూలంగా ఉన్నాయి. అంతే కాదు ఒక విధంగా, సమావేశాలను వర్చ్యువల్‌ విధానంలో నిర్వహించాలని గట్టిగ కోరుతున్నారు. పార్లమెంటు సమావేశాల కోసం కరోనా విషయంలో రిస్క్‌ తీసుకోలేమని స్పష్టం చే శారు. ఢిల్లీలో కరోనా ఉదృతి తో పాటుగా, సమావేశాల నుంచి స్వరాష్ట్రానికి వెళ్లి అక్కడ క్వారంటైన్‌ నిబంధనలు పాటించడం తమతో అయ్యేపని కాదని, అందుకు ప్రత్యామ్నాయంగా వర్చ్యువల్‌ సమావేశాలను ఏర్పాటుచేయాలని  ఉభయసభల సభ్యులు రాజ్యసభ ఛైర్మన్‌, లోక్‌సభ స్పీకర్‌లను అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో సభాధిపతులు వర్చ్యువల్‌ సమావేశాల వైపు మొగ్గుచూపితే, అదే బాటలో రాష్ట్రాల అసెంబ్లీలు, విధానమండళ్లు కూడా వర్చ్యువల్‌ సమావేశాలను జరుపుకొనే వీలు ఏర్పడుతుంది. అంతా ఆన్లైన్,, జగమంతా వర్చ్యువల్‌..

కరోనా మూలాలు తేలాల్సిందే! 

ప్రపంచంలో ఇంతలా విద్వంసం,మారణకాండ సృష్టిస్తున్న,కరోనా మహమ్మరి, మూలాలు ఎక్కడున్నాయో, తెలుసుకోవలసిన అవసరం, హక్కు ప్రపంచ దేశాలకు ఉంది. అయితే, ఇంతవకు కొవిడ్ 19 వ్యాధికి మూలమైన కరోనా వైరస్ సృష్టి, ఎక్కడ, ఎప్పుడు, ఎలా జరిగింది అనే విషయంలో స్పష్టత లేదు. చైనా-డబ్ల్యూహెచ్‌వో ఉమ్మడి అధ్యయన బృందం జరిపిన అధ్యయనంలోనూ స్పష్టతలేదు. నిజానికి, ఆ అనేక ప్రపంచ దేశాలు ఆధ్యయనం విశ్వసనీయత పట్ల కూడా అనుమానాలు వ్యక్త చేశారు.  ఈ నేపధ్యంలో, కొవిడ్‌-19 మూలాలను తేల్చడానికి మరింత పరిశోధన జరపాలని అమెరికా, బ్రిటన్‌ శాస్త్రవేత్తలు డిమాండ్‌ చేశారు. ఈ శాస్త్రవేత్తల్లో భారత సంతతికి చెందిన ఇమ్యునాలజీ, అంటువ్యాధుల నిపుణుడు రవీంద్ర గుప్తా కూడా ఉన్నారు.ఈమేరకు రాసిన లేఖలో శాస్త్రవేత్తలు, కరోనా వైరస్, చైనాలోని వుహాన్‌ వైరాలజీ ల్యాబ్‌ నుంచి విడుదలై ఉంటుందన్న వాదనపైనా దృష్టి సారించాలని కోరారు. ఈమేరకు వారు రాసిన  లేఖ ‘సైన్స్‌’ జర్నల్‌లో ప్రచురితమైంది.ఇందులో వారు,పూర్తిస్థాయి డేటా లభ్యమయ్యేవరకూ ఈ వైరస్‌.. ల్యాబ్‌ నుంచి వెలువడిందన్న వాదనతోపాటు అది సహజసిద్ధంగా వచ్చి ఉంటుందన్న వాదననూ పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.   మరో వంక కరోనా మూలాలపై స్పష్టత అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్, అమెరికా, 13 దేశాలు, యూరోపియన్‌ యూనియన్‌ వ్యక్తంచేసిన అభిప్రాయంతో తాము ఏకీభవిస్తున్నట్లు శాస్త్రవేత్తలు లేఖలో పేర్కొన్నారు.  ఈ వైరస్‌ మూలాలను గుర్తించేందుకు చైనా-డబ్ల్యూహెచ్‌వో ఉమ్మడి అధ్యయన బృందం జరిపిన అధ్యయనంలో, కరోనా వైరస్‌ సహజసిద్ధంగా వచ్చిందా లేక ల్యాబ్‌ నుంచి లీకైందా అన్నదానిపై ఇతమిత్థంగా ఏమీ తేలలేదని, శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. చైనా-డబ్ల్యూహెచ్‌వో ఉమ్మడి అధ్యయన బృందం జరిపిన అధ్యయనం ఒక జంతువు నుంచి ఈ వైరస్‌ వచ్చి ఉండటానికే ఆస్కారం ఎక్కువగా ఉందని మాత్రమే పేర్కొంది. ల్యాబ్‌ ద్వారా లీకై ఉండటానికి అవకాశం దాదాపుగా లేదని తెలిపింది.  నిజానికి ఈ రెండు సిద్ధాంతాలపై సరైన పరిశీలన జరగలేదు,  అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ల్యాబ్‌ నుంచి లీకై ఉంటుందన్న వాదనకు మద్దతునిచ్చే ఆధారాలపై సరైన అధ్యయనం జరగలేదని, ఈ కోణాన్ని బలపరిచే అదనపు వనరులను అందించడానికి తాము సిద్ధమన్న డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ వ్యాఖ్యలను వారు గుర్తుచేశారు. ఈ నేపద్యంలో అన్ని రంగాల నిపుణులతో కూడిన సమగ్ర దర్యాప్తు అవసరమని శాస్త్రవేత్తలు తమ లేఖలో పెర్కొన్నారు. నిజానికి, కొవిడ్ 19 పై ప్రపంచ దేశాలు సాగిస్తున్న యుద్ధంలో ప్రపంచ మానవాళి విజయానికి  వైరస్ మూలాలు తేలడం .. మొదటి మెట్టు అవుతుందని, ఎప్పుడోనే శాస్త్ర వేత్తలు పేర్కొన్నారు.

వ‌సూళ్ల కోస‌మే టాస్క్‌ఫోర్స్‌.. రేవంత్‌రెడ్డి ఫైర్‌.. కాంగ్రెస్ ఫ్రీ మీల్స్..

వ‌సూళ్ల కోస‌మే క‌రోనా చ‌ర్య‌ల‌పై మంత్రుల‌ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారంటూ ఎంపీ రేవంత్‌రెడ్డి మండిప‌డ్డారు. ప్రగతి భవన్‌లో టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశంలో అవసరమైన సమస్యలను చర్చించడం లేదన్నారు. టాస్క్‌ఫోర్స్‌లో వసూల్ టీం మాత్రమే ఉందని.. వైద్యులు ఎవరూ లేరంటూ త‌ప్పుబ‌ట్టారు. కార్పొరేట్ కంపెనీలను పిలిచి.. దండుకోవడాని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.  రెమెడిషివర్ బ్లాక్ మార్కెట్ అయ్యిందంటూ దుయ్య‌బ‌ట్టారు ఎంపీ రేవంత్‌రెడ్డి. టీఆర్ఎస్ నాయకులు కంపెనీల దగ్గర స్టాక్ పెట్టుకుంటున్నారని.. కావాల్సిన వారికి రెమెడిషివర్ ఇచ్చుకుంటున్నారని ఆరోపించారు. కరోనాను ఆరోగ్య శ్రీలో ఎందుకు చేర్చడం లేదని రేవంత్‌ ప్రశ్నించారు. యశోద హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్స్ ఇష్టారాజ్యంగా కోట్ల బిల్లులు వేస్తున్నారని.. మెడిసన్ వాడకుండా బిల్స్ వేస్తున్నారని ఎంపీ రేవంత్‌రెడ్డి విమ‌ర్శించారు. సెకండ్ డోస్ అందించడానికి వ్యాక్సిన్ లేదని.. వ్యాక్సిన్ లేక డోసుల వ్యవధి పెంచుతున్నారని రేవంత్ ఆరోపించారు. టిమ్స్‌లో 8 వ ఫ్లోర్ తరువాత ఆక్సిజన్ అందడం లేదని తెలిపారు. బెడ్స్ కొరత, ఆక్సిజన్ , రెమెడిషివర్ కొరత తీవ్రంగా ఉందని చెప్పారు.  క‌రోనా చికిత్స‌కు కేంద్రంగా మారిన హైద‌రాబాద్ గాంధీ ఆస్ప‌త్రికి నిత్యం వేలాదిగా రోగులు, వారి కుటుంబ స‌భ్యులు వ‌స్తున్నారు. వారికి భోజ‌నం ల‌భించ‌డం క‌ష్టంగా మారింది. అలాంటి వారి ఆక‌లి తీర్చేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, ఎంపీ రేవంత్‌రెడ్డి ఉచిత భోజ‌న కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. గాంధీ ఆస్పత్రి ద‌గ్గ‌ర‌ కరోనా రోగులకు ప్రతీరోజు వెయ్యి మందికి ఉచిత భోజనం అందించ‌నున్నారు.  లాక్‌డౌన్ కారణంగా పేషంట్స్  కుటుంబ సభ్యులకు భోజనాలు దొరకడం లేదని.. అందుకే తాము ఉచితంగా ఆహారం అందిస్తున్నామ‌న్నారు రేవంత్‌రెడ్డి. గాంధీ హాస్పిట‌ల్‌లో ప్రభుత్వం కనీస సౌకార్యాలు ఏర్పాటు చేయలేదని విమర్శించారు. డాక్టర్లు, నర్సులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఆహారం అందించ‌డం లేద‌ని మండిప‌డ్డారు. అందుకే, డాక్టర్స్, నర్సులు, సిబ్బంది, పేషంట్స్, వారి బంధువుల కోసం.. ప్రతి రోజు 1000 మందికి ఆహారం ఏర్పాటు చేస్తున్నామన్నారు. లాక్‌డౌన్ ఉన్నంత వరకు భోజన వసతి కల్పిస్తామని చెప్పారు. 5 రూపాయలకే భోజన కార్యక్రమాన్ని కాంగ్రెస్ స్టార్ట్ చేసిందని.. అయితే ఈ టైంలో కూడా ప్రభుత్వం భోజనం ఏర్పాటు చెయ్యలేదని రేవంత్‌రెడ్డి త‌ప్పుబ‌ట్టారు. 

కరోనాతో సీఎం సోదరుడు మృతి

దేశంలో ప్రస్తుతం కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. పల్లె, పట్నం తేడా లేకుండా అంతా వైరస్ భారీన పడుతున్నారు. పేదలు, దనవంతులు అన్న  తేడా లేకుండా కరోనా కాటుకు బలవుతున్నారు. సామాన్యులతో పాటు వీవీఐపీ కుటుంబాలకు మహమ్మారి సోకుతోంది. తాజాగా కరోనాతో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరుడు కన్నుమూశారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తమ్ముడు అషిమ్ బెనర్జీ కరోనా కారణంగా మృతి చెందారు. కరోనా సోకడంతో కొన్ని రోజులుగా అషిమ్ బెనర్జీ కోల్ కతా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమించి శనివారం ఉదయం చనిపోయారు.  పశ్చిమ బెంగాల్ లో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. కేసులు పెరిగిపోతుండటంతో మమతా సర్కార్ కఠిన అంక్షలు విధించింది. అయినా పరిస్థితి దారిలోకి రాకపోవడంతో సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించింది మమతా బెనర్జీ సర్కార్. బెంగాల్ లో  మే16 ఆదివారం  నుంచి మే 31వరకు రెండు వారాలపాటు లాక్‌డౌన్ ప్రకటించింది. ఈ కాలంలో అన్ని కార్యాలయాలు, విద్యాసంస్థలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోల్‌కతా మెట్రో సహా రవాణా వ్యవస్థను కూడా మూసివేసింది. అత్యవసర సేవలకు మాత్రం అనుమతి ఇచ్చింది. కిరాణా దుకాణాలతోపాటు అత్యవసర వినియోగ వస్తువులు విక్రయించే దుకాణాలు ఉదయం ఏడు గంటల నుంచి 10 గంటల వరకు తెరిచిపెట్టుకోవచ్చని బెంగాల్  ముఖ్య కార్యదర్శి అలపన్ బందోపాధ్యాయ్ తెలిపారు. ఆశ్చర్యకరంగా మిఠాయి దుకాణాలకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనుమతి ఇచ్చింది. పెట్రోలు పంపులు, బ్యాంకులు కూడా తెరిచే ఉంటాయి. ఇవి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే.   పరిశ్రమలకు అనుమతి ఇవ్వని ప్రభుత్వం తేయాకు తోటల్లో 50 శాతం సిబ్బందితో పనిచేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. సాంస్కృతిక, రాజకీయ, విద్యాపరమైన, మతపరమైన కార్యక్రమాలకు అనుమతి నిరాకరించింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడడాన్ని నిషేధించింది. వివాహ కార్యక్రమాలకు 50 మందికి మించి అనుమతి లేదని బందోపాధ్యాయ్ తెలిపారు. 

అక్క‌డ నో మాస్క్‌.. ఇక్క‌డ మాస్క్ మ‌స్ట్‌.. క‌రోనా క‌న్ఫ్యూజ‌న్‌..

అంత‌టా క‌రోనా వైర‌సే. కానీ, దేశానికో తీరు విధ్వంసం. వైర‌స్ పుట్టిన చైనా ఇప్పుడు వ‌ర్రీ లేకుండా ఉంది. మొద‌ట్లో కంగారు ప‌డిన అమెరికా.. ఇప్పుడు ఆరామ్‌సే ఉంటోంది. మ‌ధ్య‌లో మ‌న‌మే ఆగ‌మాగం అవుతున్నాం. క‌రోనా మ‌ర‌ణ‌మృదంగంతో అల్లాడిపోతున్నాం. కోట్ల‌ల్లో కేసులు, ల‌క్ష‌ల్లో మ‌ర‌ణాల‌తో దేశం అస్థ‌వ్య‌స్థంగా మారింది. వ్యాక్సిన్ ఒక్క‌టే వైర‌స్‌ను జ‌యించే బ్ర‌హ్మాస్త్రం. ఆ వ్యాక్సిన్ అనంత‌ర‌ విధానాల్లోనూ దేశానికో ర‌క‌మైన రూల్‌. రెండు డోసుల టీకా అనంత‌రం.. మాస్క్ ధ‌రించాల్సిన అవ‌స‌రం లేద‌ని అమెరికా అంటోంది. రెండు డోసులు వేసుకున్నా.. మాస్క్ త‌ప్ప‌నిస‌రి అనేది ఇండియా విధానం. అదే క‌రోనా, అదే వ్యాక్సిన్లు.. కానీ, దేశానికో రూలు. క‌రోనా వ‌చ్చిన‌ప్ప‌టి నుంచీ ఇలా అంతా క‌న్ఫ్యూజ‌నే క‌న్ఫ్యూజ‌న్‌. సైంటిస్టుల‌కే స‌రైన‌ క్లారిటీ లేదు. ఇక సామాన్యులు గురించి చెప్పేదేముంది.  కరోనా టీకాలు తీసుకున్న అమెరిక‌న్లు ఇకపై మాస్కు అవసరం లేదని అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం (సీడీసీ) ప్రకటించింది. కొవిడ్‌-19 రెండు డోసులు తీసుకున్నవారు ఎలాంటి ఆంక్షలు లేకుండా తమ కార్యకలాపాలను కొనసాగించుకోవచ్చని తెలిపింది. అయితే, వ్యాక్సిన్‌ తీసుకోకపోయినా, పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్‌ పొందక పోయినా మాస్కు ధరించాల్సిందే. టీకా రెండో డోసు తీసుకున్న రెండు వారాల తర్వాత మాస్కులు తీసేయవచ్చు. భౌతిక దూరం కూడా అవసరం లేదు. ప్రయాణాలకు ముందు, ఆ తర్వాత కొవిడ్‌ పరీక్షలు చేయించుకోనవసరం లేదు. ప్రయాణం తర్వాత క్వారంటైన్‌, హోంక్వారంటైన్‌ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవీ.. తాజాగా అమెరికాలో అమ‌ల్లోకి వ‌చ్చిన కొవిడ్ రిలాక్సేష‌న్స్‌.      అయితే, అమెరికా మాత్రం రెండు డోసుల‌ టీకాలు తీసుకుంటే మాస్క్ అవ‌స‌రం లేదంటుంటే.. ఇండియా మాత్రం వ్యాక్సిన్ తీసుకున్నా.. మాస్క్ మ‌స్ట్ అంటోంది. ఈ మేర‌కు ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా కీలక సూచన చేశారు. టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ.. మాస్కులు ధరించాల్సిందేనని స్పష్టం చేశారు. అలాగే భౌతిక దూరం సైతం పాటించాలన్నారు. వైరస్‌ రోజురోజుకీ కొత్తరూపు సంతరించుకుంటున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిందేనన్నారు. కొత్త వేరియంట్లపై వ్యాక్సిన్ల సామర్థ్యం ఎంత అన్నది ఇంకా తెలియదన్నారు. అయితే, ఏ వేరియంట్‌ బారి నుంచైనా మాస్కు, భౌతిక దూరం రక్షిస్తాయని.. అందుకే ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని సూచించారు.   మ‌రోవైపు, టీకా తీసుకున్నవారు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదన్న అంశాన్ని ఇప్పుడప్పుడే మార్గదర్శకాల్లో చేర్చబోమని కేంద్ర ఆరోగ్య శాఖలోని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఆ దిశగా నిర్ణయం తీసుకోవడం తొందరపాటు అవుతుందన్నారు. ఇంకా వైరస్‌ వ్యాప్తి ఆందోళనకరంగానే ఉన్న నేపథ్యంలో మాస్కులు పక్కనబెట్టడం సురక్షితం కాదని తెలిపారు.  అమెరికాలో కరోనా టీకాలు తీసుకున్న వ్యక్తులకు ఇకపై మాస్కు అవసరం లేదని ప్ర‌క‌టించ‌డంతో.. భార‌త్‌లోనూ అదే నిబంధ‌న వ‌ర్తిస్తుందా? అనే చ‌ర్చ మొద‌లైంది. ఈ నేపథ్యంలో ఇండియాలో మాత్రం మాస్క్ మ‌స్ట్ అంటూ ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్ట‌ర్‌ గులేరియా తాజా సూచనలు చేశారు. 

హైదరాబాదీలకు డేంజర్ బెల్స్ .. హుస్సేన్ సాగర్ లో కరోనా  జన్యు పదార్థాలు

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ దేశమంతా పంజా విసురుతోంది. తెలంగాణలోనూ కరోనా వేగంగా విస్తరిస్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం రోజూ 4 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అనధికారిక లెక్కల ప్రకారం ఇంతకు రెండింతల కరోనా కేసులు వస్తున్నాయని చెబుతున్నారు. కరోనా థర్డ్ వేవ్ కూడా వస్తుందని వైద్య నిపుణులు, అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నారు. కరోనాపై భయాందోళన కొనసాగుతుండగానే  హైదరాబాద్ నగరవాసులకు శాస్త్రవేత్తలు ఆందోళన కలిగించే వార్తను చెప్పారు సైంటిస్టులు. హైదరాబాద్ మహానగరం మధ్యన ఉన్న హుస్సేన్ సాగర్ లో కరోనా వైరస్ జన్యు పదార్థాలు కనపడ్డాయని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ,సీసీఎంబీ సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో తేలింది. సాగర్ తో పాటు ఇతర చెరువుల్లో కూడా ఈ పదార్థాలు కనిపించాయని వెల్లడించింది. హుస్సేన్ సాగర్ తో పాటు నాచారం పెద్ద చెరువు, నిజాం చెరువులో కూడా కరోనా జన్యు పదార్థాలు కనిపించాయని చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి చెరువుల్లో ఈ జన్యు పదార్థాలు పెరగడం ప్రారంభమైందని తెలిపారు.  అయితే  కరోనా వైరస్ నీటి ద్వారా వ్యాపించదనే విషయం ఒక అధ్యయనంలో వెల్లడైందని తెలిపారు.  కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయాల్లో ఈ అధ్యయనం చేసినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే చెరువుల్లోని వైరస్ జన్యు పదార్థం మరింతగా విస్తరించలేదని చెప్పారు. భవిష్యత్తులో వస్తుందని భావిస్తున్న మూడో వేవ్ ను అధ్యయనం చేయడానికి ఇది ఉపయోగపడుతుందని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ,సీసీఎంబీ సైంటిస్టులు ప్రకటించారు. 

రఘురామ బెయిల్ పిటిషన్ డిస్మిస్.. కింద కోర్టుకు వెళ్లాలన్న హైకోర్టు 

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు హైకోర్టులో దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. బెయిల్ కోసం సీఐడీ కోర్టులో ప్రయత్నించమని  ఆదేశించింది. నేరుగా హైకోర్టును కాకుండా కింద కోర్టును సంప్రదించాలని హైకోర్టు సూచించింది. అనంతరం రఘురామ బెయిల్ దరఖాస్తుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కింద కోర్టును హైకోర్టు ఆదేశించింది. తీర్పుకాపీని కూడా వెంటనే ఇస్తామని హైకోర్టు తెలిపింది. మరోవైపు.. వెంటనే రిమాండ్‌కు పంపుతామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు. రఘురామకృష్ణరాజు ఆరోగ్యంపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజును శుక్రవారం హైదరాబాదులో ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.  ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టులో రఘురాజు బెయిల్ పిటిషన్ వేశారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రఘురాజు తరపున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు కోర్టులో వాదనలు వినిపించారు. ప్రాథమిక విచారణ కూడా జరపకుండానే లోక్ సభ సభ్యుడు రఘురాజును అరెస్ట్ చేశారని కోర్టుకు తెలిపారు. రఘురాజు అరెస్టుకు సంబంధించి సహేతుక కారణాలు కూడా లేవని వాదించారు. ఎటువంటి కారణాలు చూపకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని పేర్కొన్నారు. వాదనలు విన్న తర్వాత బెయిల్ అంశంపై జిల్లా కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నించింది. దీంతో, కేసు తీవ్రత దృష్ట్యా హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంతరం హైకోర్టు తన తీర్పును వెలువరించింది. సీఐడీ కోర్టులోనే బెయిల్ పిటిషన్ వేయాలని సూచించింది. బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. జగన్ సర్కార్‌పైనా, ప్రభుత్వ పెద్దలపైనా వరుసగా విమర్శల బాణాలు సంధిస్తున్న అధికార పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజును పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. ఈ అరెస్ట్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనమైంది. శనివారం నాడు రఘురామకృష్ణరాజుతో పాటు మరో రెండు టీవీ ఛానెల్స్ లో మంగళగిరి సీఐడీ పీఎస్‌లో 124ఏ,153ఏ, రెడ్‌విత్ 120బి, 505 సెక్షన్ల కింద కేసులు నమోదవ్వడం సంచలనం రేపుతోంది. ఈ రెండు ఛాన్సల్‌లో రఘురామకు స్లాట్స్ కేటాయించారని ఎఫ్‌ఐఆర్‌లో సీఐడీ పేర్కొంది.

డెలివ‌రీ బాయ్స్ దోపిడీలు.. ఆరుగురు ఫ్రెండ్స్‌ అరెస్ట్‌..

వాళ్లంతా ఆవారా గాళ్లు. మొత్తం ఆరుగురు ఫ్రెండ్స్‌. ముఠాగా ఏర్ప‌డ్డారు. ఒంట‌రి మ‌నుషుల‌ను టార్గెట్ చేశారు. సెల్‌ఫోన్లు, న‌గ‌దు, బంగారం దోచుకున్నారు. కొన్ని నెల‌ల‌కు మ‌స్త్ ఎంజాయ్ చేశారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఖాకీల చేతికి చిక్కి ఊచ‌లు లెక్క‌బెడుతున్నారు. హైద‌రాబాద్‌కు చెందిన ఓ దోపిడీ దోస్తుల ముఠా వ్య‌వ‌హారం ఇప్పుడు క‌ల‌క‌లంగా మారింది. త‌మ‌కు తెలిసిన వాళ్లు.. ఇంత కిలాడీ దొంగ‌లా అని స్థానికులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.  వాళ్ల చ‌దువు ఎప్పుడో అట‌కెక్కింది. ఫ్రెండ్స్‌తో మ‌స్తీ చేయ‌డం అల‌వాటైంది. ఆల‌స్యంగా ఇంటికి రావ‌డం మొద‌లైంది. జ‌ల్సాలు, పార్టీలంటూ ఫుల్‌గా ఖ‌ర్చు చేస్తున్నారు. ఎప్పుడూ వాళ్ల ద‌గ్గ‌ర ఫుల్ క్యాష్ ఉంటోంది. ఇదేంటి.. ఇంత స‌డెన్‌గా ఆ పోరగాళ్ల‌కు అంత డ‌బ్బు ఎక్క‌డి నుంచి వ‌స్తోంది? అనే అనుమానం ఇంట్లో వాళ్ల‌కి గానీ, చుట్టుప‌క్క‌ల వాళ్ల‌కి గానీ రాలేదు. ఎందుకంటే.. వాళ్లు స్విగ్గీ, జొమాటోలో డెలివ‌రీ బాయ్స్‌గా ప‌ని చేస్తున్నారు. ఏదో ప‌ని చేస్తున్నారు.. మ‌స్త్ పైస‌లు వ‌స్తున్నాయ్ అనుకున్నారు వారంతా. కానీ, ఆ లెక్క‌లేన‌న్ని డ‌బ్బులు వ‌స్తున్న‌ది స్విగ్గీ, ,జొమాటో జాబ్ నుంచి కాద‌నే విష‌యం వారికి అప్పుడు తెలీలేదు. ఇప్పుడు పోలీసులు చెబుతుంటే విని ఆశ్చ‌ర్య‌పోతున్నారు.  దారి దోపిడీల‌కు పాల్ప‌డుతున్న ముఠాను బాచుప‌ల్లి పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలోని ఆరుగురు యువ‌కుల‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా రాత్రి పూట ఒంట‌రిగా ఉన్న వారిపై దాడి చేసి దోపిడీల‌కు పాల్ప‌డుతుంద‌ని పోలీసులు తెలిపారు. దొంగిలించిన ఫోన్లు, ఇత‌ర సామ‌గ్రిని ఓఎల్ఎక్స్‌లో నిందితులు విక్ర‌యిస్తున్న‌ట్లు గుర్తించారు. నిందితులు స్విగ్గీ, జొమాటోల‌లో ప‌ని చేస్తున్న‌ట్లు వివ‌రించారు. ఇదీ ఆ ఆరుగురు దోస్తుల క్రైమ్ క‌థా చిత్ర‌మ్‌.  ప‌గ‌లంతా ఫుడ్ డెలివ‌రీ బాయ్స్‌గా ప‌ని చేసేవాళ్లు. అది వాళ్ల పార్ట్‌టైమ్ వ‌ర్క్ మాత్ర‌మే. మెయిన్ జాబ్‌.. మిడ్‌నైట్ త‌ర్వాతే. బైక్‌లు వేసుకొని.. నిర్మానుషంగా ఉండే ప్రాంతాల్లో తిరుగుతుండేవాళ్లు. పొర‌బాటున ఎవ‌రైనా అటువైపు వ‌స్తే.. ఆరుగురు క‌లిసి అడ్డ‌గించే వారు. బెదిరించి, భ‌య‌పెట్టి.. సెల్‌ఫోన్‌, గోల్డ్ ఛైయిన్‌, ప‌ర్స్‌, క్యాష్‌.. ఏది ఉంటే అది లాక్కునే వారు. వ‌స్తువులైతే వాటిని OLXలో పెట్టి అమ్మేసేవారు. అయితే, OLXలో ఇలా వ‌స్తువులు కొన్న‌వాళ్లు అనుమానంతో ఫిర్యాదు చేయ‌డంతో విష‌యం పోలీసుల దృష్టికి వ‌చ్చింది. నిఘా వేసి, ఆరా తీసి.. ఇప్పుడు ఆ ముఠాను ప‌ట్టుకున్నారు. అర్థ‌రాత్రి దోపిడీల‌కు పాల్ప‌డుతున్న స్విగ్గీ, జొమాటో డెలివ‌రీ బాయ్స్‌గా ప‌ని చేస్తున్న ఆరుగురు ఫ్రెండ్స్‌ను అరెస్ట్ చేశారు. 

వేస‌విలో తుఫాను.. ఎండ‌ల్లో వాన‌లు..

ఎండాకాలం ఎండ‌. వానాకాలం వాన‌. ఇది ప్ర‌కృతి స‌హ‌జం. అప్పుడ‌ప్పుడూ వేస‌విలోనూ చెదురుముదురు వాన‌లు ప‌డ‌టమూ కామ‌నే. కానీ, ఎండాకాలంలో తుఫాను రావ‌డం మాత్రం అస్స‌లు కామ‌న్ కానే కాదు. చాలా చాలా అరుదు. ఆ ప్ర‌భావం మ‌న తెలుగు రాష్ట్రాల‌పైనా ఉండ‌టంతో అంత‌టా కంగారు. చేతికొచ్చిన పంట నీటి పాలై పోతుంద‌నే టెన్ష‌న్‌. మామిడి కాయ‌లు రాలిపోతాయ‌నే హైరానా. ఇలా, ఎండాకాలంలో అక‌స్మాత్తుగా ఊడిప‌డిన ‘తౌక్టే’ తుఫాన్‌పై స‌ర్వ‌త్రా ఆందోళ‌న‌.  అరేబియా తీరంలో ‘తౌక్టే’ తుఫాన్ ఇండియాపై విరుచుకుప‌డ‌టానికి రెడీగా ఉంది. లక్ష్య దీప్ పరిసర ప్రాంతాల్లో  ఏర్పడిన వాయుగుండం బలపడి  శుక్రవారం రాత్రి 11:30 గంటలకు తుఫానుగా మారింది. దీని పేరు.. తౌక్టే. శ‌నివారం ఉదయం 5:30 గంటలకు అమిని దీవికి ఈశాన్య దిశగా 160 కి.మీ. దూరంలో తుఫాను కేంద్రీకృత‌మై ఉంది. ఇది మరింత బలపడి రాగల 12 గంటలలో తీవ్ర తుఫానుగా మారి.. తరువాత ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించనుంది. తదుపరి 12 గంటలలో ఇది మరింత బలపడి అతి తీవ్రతుఫానుగా రూపాంత‌రం చెంద‌నుంది.  ‘తౌక్టే’ తుఫాను గుజరాత్ తీరాన్ని పోర్బందర్ - నలియాల మధ్య 18వ తేదీ సాయంత్రం 2.30 గంటల నుంచి 8.30 గంటల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. తౌక్టే తుఫాన్ ప్రభావం ఐదు రాష్ట్రాలపై ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దాదాపు 50 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు చేరుకున్నాయి. మరోవైపు నావికా దళం కూడా రంగంలోకి దిగింది. తుఫానును ఎదుర్కోవ‌డానికి ప్ర‌భుత్వ‌ యంత్రాంగం స‌ర్వ‌ స‌న్న‌ద్ధంగా ఉంది. 

ప‌సిడి ఫ‌స‌క్‌.. గోల్డ్ బిజినెస్ ఢ‌మాల్‌..

ఓవైపు క‌రోనా.. మ‌రోవైపు లాక్‌డౌన్‌.  కొవిడ్ సెగ బంగారం అమ్మ‌కాల‌పై భారీగా ప‌డింది. ఇప్ప‌టికే పెళ్లిళ్ల గిరాకీ త‌గ్గ‌గా.. తాజాగా అక్ష‌య తృతీయ‌కు సైతం విక్ర‌యాలు లేక బులియెన్ మార్కెట్ వెల‌వెల‌పోయింది. క‌రోనా దెబ్బ‌కు బంగారం కొనాల‌నే సెంటిమెంట్ కూడా మంట గ‌లిసింది. బ‌తికుంటే చాలు.. బంగారం సంగ‌తి త‌ర్వాత అనుకున్నారేమో.. అక్ష‌య తృతీయ‌కు అమ్మ‌కాలు అస‌లే మాత్రం జ‌ర‌గ‌లేదు.  గడిచిన ఏడాదిలానే, ఈ సంవత్సరం కూడా అక్షయ తృతీయ పర్వదినం లాక్‌డౌన్‌లో కలిసిపోయింది. రూల్స్ మేర‌కు ఉద‌యం 6 నుంచి 10 వ‌ర‌కు మాత్ర‌మే జ్యువెల్ల‌రీ షాపులు తెరిచినా.. క‌నీసం బోణీ కూడా కాని షాపులు ఎన్నో. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌లు అమలవుతుండడంతో ఆభరణాల వ్యాపారం బాగా తగ్గింది.  అక్షయ తృతీయకు డిజిటల్‌, ఆన్‌లైన్‌ల ద్వారా వ్యాపారం చేద్దామ‌న్నా కుద‌ర‌లేదు. ఆన్‌లైన్ బుకింగ్స్ చాలా తక్కువ. ఎంత‌గా ట్రై చేసినా.. వీడియో కాలింగ్‌ ద్వారా వర్చువల్‌ షాపింగ్‌ సదుపాయాలు, వర్చువల్‌ ట్రయల్‌ రూములు, హోమ్‌ డెలివరీ, ఇ-క్యాటలాగ్స్ అందించినా ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. ముందస్తు బుకింగ్‌లపై రాయితీలు, వజ్రాభరణాల తయారీ ఛార్జీల మినహాయింపు లాంటి తాయిలాలూ, ప్రయత్నాలు చేసినా ఈ ఏడాది అమ్మకాలు ఏమాత్రం పుంజుకోలేదు.  బంగారం ధరలు ఈ ఏడాది ప్రారంభంతో పోలిస్తే 5% తగ్గి.. తులం బంగారం రూ.47,500 స్థాయికి చేరినా పాత కస్టమర్లు మాత్రమే అక్షయ తృతీయపై దృష్టి సారించారు. కొంద‌రు రూ.3,000-4,000 ధరలో వ‌చ్చే బంగారు నాణేలు కొనుగోలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌, ముంబయి, ఢిల్లీ, పుణె, కేరళ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో జువెల్ల‌రీ స్టోర్స్ మూతపడ్డాయి.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సార్వభౌమ పసిడి బాండ్ల పథకం ఈనెల 17న ప్రారంభం కానుంది. ఐదు రోజుల పాటు అంటే మే 21 వరకు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. పసిడి బాండ్లకు ఇష్యూ ధర గ్రాముకు రూ.4,777 గా నిర్ణయించామని ఆర్‌బీఐ తెలిపింది. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు, చెల్లింపులు చేసే వారికి గ్రాముకు రూ.50 తగ్గింపును ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

తండ్రి హ‌యాంలో ఆ రాజు..  కొడుకు పాల‌న‌లో ఈ రాజు.. 

రాజులు. వాళ్లు మామూలోళ్లు కాదు. క్ష‌త్రియులు. జ‌స్ట్‌.. పేరులోనే కాదు వాళ్లు చేసే ప్ర‌తీ ప‌నిలోనూ ప్ర‌త్యేక‌త. కింగ్‌లా ఉంటారు. కింగ్‌లానే బ‌తుకుతారు. ఆంధ్రప్రదేశ్  లో అన్ని రంగాల్లోనూ వారి పాత్ర ప్రముఖంగా ఉంటుంది. తాజాగా నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజును ఏపీ సీఐడీ అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో తెలుగునాట ఇద్ద‌రు క్ష‌త్రియ రాజుల‌కు జ‌రిగిన రెండు ఉదంతాలు చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. వాళ్లిద్ద‌రూ క్ష‌త్రియ రాజులు కావ‌డం.. ఆ రెండు ఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు వైఎస్ కుటుంబ‌మే అధికారంలో ఉండ‌టం ఆస‌క్తి క‌లిగించే అంశం.  న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణరాజును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. అదీ ఆయ‌న బ‌ర్త్‌డే రోజున‌. ఢిల్లీలో, సీఆర్‌పీఎఫ్ సెక్యూరిటీ ర‌క్ష‌ణ‌లో ఇన్నాళ్లూ సుర‌క్షితంగా ఉన్న ర‌ఘురామ‌.. పుట్టిన రోజు క‌దాని.. హ‌స్తిన నుంచి హైద‌రాబాద్‌లోని త‌న ఇంటికి వ‌చ్చారు. ఇక అంతే. ఎప్ప‌టి నుంచో ఆయ‌న కోసం కాపు కాసి చూస్తున్న‌ట్టు.. ఏపీ పోలీసులు ర‌ఘురామ‌ను క్యాచ్ చేశారు. హైద‌రాబాద్ నుంచి లిఫ్ట్ చేసి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు షిఫ్ట్ చేశారు. ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొడుతున్నారంటూ పోలీసులు ఏదేదో చెబుతున్నా.. వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిత్యం విమ‌ర్శ‌లు చేయ‌డ‌మే అస‌లు రీజ‌న్ అనేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ఇలా.. ర‌ఘురామ అరెస్ట్‌తో.. రాజు అయిన ఆయ‌న‌.. బంధీగా మారిపోయారు. వేల‌ కోట్ల వ్యాపారాలు, సంప‌ద, మందీమార్బ‌లం ఉన్నా కూడా సామాన్యుడిలా సీఐడీ చెర‌లో మ‌గ్గిపోయారు.  రాజుల‌కు ఇలాంటి దీన‌స్థితి రావ‌డం ఇదే మొద‌టిసారి కాదు. ర‌ఘురామ‌కృష్ణ‌రాజును చూస్తుంటే.. మ‌రో రాజు గారు గుర్తొస్తున్నార‌ని అంటున్నారు. ఆయ‌న ఈయ‌న‌కంటే గొప్ప రాజు. ఆయ‌నే  స‌త్యం రామ‌లింగ‌రాజు. ఒక‌ప్ప‌టి స‌త్యం కంప్యూట‌ర్స్ అధినేత‌. 1987 నుంచి 2009 వ‌ర‌కూ ఆయ‌నే సీఈవో. స‌త్యం పేరుతో వంద‌ల కోట్ల వ్యాపార సామ్రాజ్యం సృష్టించారు. వేలాది మందికి మంచి భ‌విష్య‌త్తు క‌ల్పించారు. ప్ర‌పంచంలోని అనేక దేశాల కంపెనీల‌కు సాఫ్ట్‌వేర్ సేవలు అందించారు. స‌త్యం కంప్యూట‌ర్స్ అంటే అప్ప‌ట్లో అది జ‌స్ట్ పేరు మాత్ర‌మే కాదు.. ఓ పాపుల‌ర్ బ్రాండ్‌. ఆ కంపెనీ య‌జ‌మానిగా రామ‌లింగ‌రాజు ఐటీ సెక్టార్‌కే ఐకాన్‌గా నిలిచారు. బైర్రాజు ఫౌండేష‌న్‌తో ప్ర‌జాసేవ‌లో ముందున్నారు. క‌ట్ చేస్తే.. ఆయ‌న నిర్మించిన సాఫ్ట్ సౌధం.. ఒక్క రోజులోనే పేక మేడ‌లా కుప్ప‌కూలింది. కార్పొరేట్ ఫ్రాడ్‌కు పాల్ప‌డినందుకు ఆయ‌నపై అనేక కేసులు పెట్టి అరెస్ట్ చేసింది సీబీఐ, ఈడీ. ఏడేళ్ల జైలు శిక్ష కూడా ప‌డింది. అప్ప‌టి వ‌ర‌కూ రాజులా ఉన్న రామ‌లింగ‌రాజు.. ఒక్క అరెస్టుతో అథఃపాతాళానికి ప‌డిపోయారు. చ‌రిత్ర‌లో లేకుండా క‌నుమ‌రుగు అయ్యారు.  మేటాస్ (SATYAM పేరును తిర‌గేస్తే MAYTAS) అనే రియ‌ల్ ఎస్టేట్, ఇన్ఫ్రా సంస్థ‌ను స్థాపించి.. స‌త్యం కంప్యూట‌ర్స్ నిధుల‌కు అటు దారి మ‌ళ్లించార‌నే ఆరోప‌ణ కూడా ఉంది. ఆ స‌మ‌యంలో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఉన్నారు. అప్పుడు హైద‌రాబాద్ మెట్రో ప్రాజెక్టును మేటాస్‌కే అప్ప‌గించారు. ఆ డీల్ వెనుక పెద్ద ఎత్తున గోల్‌మాల్ జ‌రిగిందంటూ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఎలాంటి అనుభ‌వం లేక‌పోయినా.. మేటాస్‌కు మెట్రో ప్రాజెక్టు కేటాయించ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తినా.. అప్ప‌టి సీఎం వైఎస్సార్ మాత్రం రామ‌లింగ‌రాజు కంపెనీ వైపే మొగ్గు చూపడం వివాదాస్ప‌ద‌మైంది. క‌ట్ చేస్తే.. కొన్నాళ్ల‌కే స‌త్యం కంప్యూట‌ర్స్‌లో రామ‌లింగ‌రాజు ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డ్డారంటూ కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు ఆయ‌న‌పై కేసులు న‌మోదు చేసి క‌ట‌క‌టాల పాలు చేశాయి.  తెలుగు వాడు.. క్ష‌త్రియుడైన‌.. రామ‌లింగ‌రాజు ఉన్న‌తి, అధోగ‌తి... ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అప్ప‌ట్లో కొన్ని నెల‌ల పాటు చ‌ర్చ‌నీయాంశం. ఓ వెలుగు వెలిగిన స‌త్యం రామ‌లింగ‌రాజు అరెస్ట్ వ్య‌వ‌హారం.. వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడే జ‌రిగింది. క‌ట్ చేస్తే.. ఇప్పుడు వైఎస్సార్ త‌న‌యుడు వైఎస్ జ‌గ‌న్ సీఎంగా ఉన్న స‌మ‌యంలో.. మ‌రో రాజు, అనేక కంపెనీల‌కు య‌జ‌మాని అయిన ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు అరెస్ట్ కావ‌డం.. కాక‌తాళీయ‌మే అయినా.. ఆస‌క్తిదాయ‌కం.  రాజులు సంఖ్యాప‌రంగా త‌క్కువే. వారి మూలాలు భీమ‌వ‌రం చుట్టుప‌క్క‌ల ప్రాంతాల‌కే ప‌రిమితం. ఉన్న‌ది గుప్పెడు జ‌నాభే అయినా.. దాదాపు అంద‌రూ గొప్పోల్లే. ఆస్తులు, వ్యాపారాలు, ప‌లుకుబ‌డి, హోదాల‌కు.. ఆనాటి రాచ‌రిక రాజుల‌కు ఏమాత్రం తీసిపోరు. క్ష‌త్రియులు కావ‌డంతో స్వ‌త‌హాగా పోరాట స్వ‌భావం. అందుకే, ర‌ఘురామ‌కృష్ణ‌రాజు సైతం అదే పోరాటం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. వైసీసీ గుర్తుపై గెలిచినా.. జ‌గ‌న్‌రెడ్డి విధానాలు న‌చ్చ‌క‌.. సొంత పార్టీ ప్ర‌భుత్వాన్ని, పాల‌కులు అవ‌లంభించే త‌ప్పుడు విధానాల‌ను నిత్యం క‌డిగిపారేస్తుంటారు. త‌న‌పై సీబీఐ, ఈడీ కేసులు పెట్టినా ర‌ఘురామ ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేదు. బ‌ల‌మైన ముఖ్య‌మంత్రిపై.. ఏమాత్రం భ‌యం లేకుండా.. ఒంట‌రి పోరాటం చేస్తున్నారు. త‌న‌కు ఎప్ప‌టికైనా ఏపీలో ముప్పు ఉంద‌ని భావించిన ఆయ‌న‌.. కేంద్రానికి ఫిర్యాదు చేసి త‌న ర‌క్ష‌ణ‌కు సీఆర్పీఎఫ్ సెక్యూరిటీని నియ‌మించుకున్నారు. రాష్ట్రంలో ఉంటే ప్ర‌మాద‌మ‌ని.. ఢిల్లీలోనే ఉంటున్నారు. ఏదో పుట్టిన రోజు క‌దాని.. పొర‌బాటున హైద‌రాబాద్ వ‌స్తే.. ఏపీ పోలీసులు ప‌క్క రాష్ట్రానికి వ‌చ్చి మ‌రీ ఇలా అరెస్ట్ చేస్తార‌ని ఆయ‌న అస్స‌లు ఊహించి ఉండ‌రు. జ‌గ‌న్‌రెడ్డి క‌క్ష క‌డితే ఇలానే ఉంటుంద‌ని అంటున్నారు.  కార‌ణం ఏదైన‌ప్ప‌టికినీ వైఎస్ కుటుంబం అధికారంలో ఉన్న‌ప్పుడే.. ఇలా ఇద్ద‌రు క్ష‌త్రియ ప్ర‌ముఖులు అరెస్ట్ కావ‌డంతో ఆ రెండు ఘ‌ట‌న‌ల‌ను పోల్చి చూస్తున్నారు. RRR అరెస్టు నేప‌థ్యంలో.. గ‌తంలో జ‌రిగిన స‌త్యం రామ‌లింగ‌రాజు ఎపిసోడ్ మ‌రోసారి గుర్తుకొస్తోంది.

టీపీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈటల! రాహుల్ గాంధీ ఆఫర్? 

కేసీఆర్ కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన  ఈటల రాజేందర్​ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. మాజీ మంత్రి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందన్న దానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈటల కాంగ్రెస్​లో చేరబోతున్నారని కొందరు, కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నారని  మరికొందరు చెబుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ పార్టీని స్థాపించి నెగ్గుకు రాగలమా అని ఈటల రాజేందర్​ మల్లగుల్లాలు పడుతున్నారట. కేసీఆర్ ను ఢీకొట్టడం అంత ఈజీ కాదని భావిస్తున్న రాజేందర్.. ఇప్పుడున్న పార్టీల్లోనే ఏదో ఒక దాంట్లో చేరి కేసీఆర్ పై రివేంజ్ తీసుకోవాలని యోచనలో ఉన్నారని అంటున్నారు. అయితే చేరితో ఏ పార్టీలో చేరాలన్నదానిపై తన సన్నిహితులతో ఈటల చర్చలు జరుపుతున్నారని అంటున్నారు.  ఈటల రాజేందర్ తాజా అడుగులు, వరుస సమావేశాలతో ఆయన కాంగ్రెస్​ పార్టీలో చేరబోతున్నారనే వార్తలు వస్తున్నాయి.  బీజేపీలో చేరాలని కూడా ఈటల మీద ఒత్తిడి ఉంది. అయితే వామపక్ష భావజాలం ఉన్న ఈటల రాజేందర్​ బీజేపీలో ఇమడం కష్టమని భావించారట. అందుకే ఆయన కాంగ్రెస్​లో చేరాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇటీవల ఆయన టీఆర్​ఎస్​ బహిషృత నేత డీఎస్​, సీఎల్పీ నేత భట్టీ విక్రమార్క తో వేరువేరుగా సమావేశం అయ్యారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డితో సమావేశం అయ్యారు. మరోవైపు రేవంత్​రెడ్డితో కూడా ఫోన్​లో టచ్​లో ఉన్నట్టు సమాచారం.  ఈటల బలమైన బీసీ నేత. అంతేకాక తెలంగాణ ఉద్యమంలోనూ కీలకంగా పనిచేశారు. దీంతో కేసీఆర్​కు ఎదుర్కొనేందుకు ఈటల రాజేందర్​ వంటి నాయకుడు అవసరమనే అభిప్రాయానికి హైకమాండ్ వచ్చిందంటున్నారు. అందుకే ఆయన్ను కాంగ్రెస్ లో చేరేలా ప్రయత్నాలు చేయాలని తెలంగాణ నేతలకు రాహుల్ గాంధీ సూచించారని అంటున్నారు. హైకమాండ్ ఆదేశాలతో టీపీసీసీ నేతలు కొందరు రాజేందర్ తో మాట్లారాని అంటున్నారు. ఈటల రాజేందర్ నిర్ణయం తీసుకున్న వెంటనే రాహుల్ గాంధీతో మాట్లాడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.  ఈటల రాజేందర్​ను టీఆర్​ఎస్​ నుంచి బయటకు పంపించడంతో అతడిపై తెలంగాణ సమాజంలో సానుభూతి నెలకొన్నది. పార్టీల కతీతంగా అందరూ ఈటలపై సింపతీ కనబరుస్తున్నారు. ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్​ యోచిస్తున్నదట. ఈటల రాజేందర్​ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే ఎలా ఉంటుందన్న విషయంపై కూడా కాంగ్రెస్​ పెద్దలు ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. అయితే ఈటల పార్టీలో చేరిన వెంబడే ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే మిగిలిన కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారు? అన్న అనుమానులు ఉన్నాయి. కాంగ్రెస్​ సీనియర్​ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, మరో ఎంపీ, వర్కింగ్ ప్రెసిడెంట్​ రేవంత్​రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఇద్దరిలో ఎవరికి పదవి ఇవ్వాలో తెలియక కాంగ్రెస్​ హైకమాండ్​ తలపట్టుకొని కూర్చున్నది. అందుకే ముందుగా ఈటల  కాంగ్రెస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ పదవి ఇచ్చి.. ఆ తర్వాత చూద్దామనే యోచనలో ఉందంటున్నారు.  ఈటల రాజేందర్ ను పార్టీలో చేర్చుకోవడానికి తెలంగాణ కాంగ్రెస్ లోని అన్ని వర్గాలు సానుకూలంగానే ఉన్నాయని చెబుతున్నారు. టీపీసీసీ రేసులో ఉన్న రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో ఈటలకు మంచి సంబంధాలు ఉన్నాయి. వీళ్లంతా ఈటలను ఆహ్వానించేవారే. ఈ పరిస్థితుల్లో ఈటలకు కాంగ్రెస్ లో ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చని అంటున్నారు.

వచ్చింది టైఫాయిడ్.. కరోనా భయంతో ఫ్యామిలీ సూసైడ్..

కరోనా కాలం లో ప్రజలు వెనక ముందు ఆలోచించడం లేదు. టెస్ట్ చేయించుకున్న రిపోర్ట్స్ రాకముందే తమకు కొరోనా వచ్చిందేమో అని ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు చాలానే చూస్తున్నాం. తాజాగా విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. టైఫాయిడ్ వస్తే కరోనా సోకిందని భయపడి ఓ కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. వేపాడ మండలంలోని నల్లబిల్లిలో నిన్న జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. గ్రామానికి చెందిన ఉడత సత్యనారాయణ గుప్తా (62) రెండు సంవత్సరాలుగా  విశాఖపట్టణం జిల్లాలోని చోడవరంలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. గుప్తాకు భార్య సత్యవతి (57), అత్త వెంకటసుబ్బమ్మ, కుమారుడు సంతోష్, కుమార్తె పూర్ణ ఉన్నారు. కుమారుడు తెలంగాణలోని నిజామామాద్‌లో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాడు. కుమార్తెకు వివాహమైంది. 2002లో తన మొదటి భార్య మరణించడంతో, 2009లో ఓ పేపరు ప్రకటన చూసి గుంటూరుకు చెందిన సత్యవతిని గుప్తా రెండో వివాహం చేసుకున్నాడు.కాగా, ఇటీవల సత్యనారాయణ అనారోగ్యానికి గురవడంతో ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకుంటే టైఫాయిడ్ అని తేలింది. దీంతో మందులు వాడుతున్నారు. అయితే, రెండు రోజుల క్రితం భార్య సత్యవతికి కూడా జ్వరం వచ్చింది. దీంతో వారికి సేవలు చేసేందుకు చుక్కపల్లిలో ఉంటున్న కుమార్తె వచ్చింది. గురువారం కుమార్తెను ఇంటికి వెళ్లిపొమ్మన్న గుప్తా.. నిన్న ఉదయం భార్య, అత్తతో కలిసి స్వగ్రామం నల్లబిల్లి వచ్చాడు. తమకు కరోనానే వచ్చిందని నిశ్చయించుకున్న గుప్తా దంపతులు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గ్రామంలోని శివాలయం వెనక భాగంలోకి వెళ్లి వెంట తెచ్చుకున్న పురుగు మందును ఓఆర్ఎస్‌లో కలిపి ముగ్గురూ తాగారు. అనంతరం సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు బావి నుంచి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కరోనా వచ్చిన ఏం కాదు. భయపడకుండా  దానితో ఫైట్ చెయ్యాలి. అప్పుడే మనం కరోనా ను జయిస్తాము. చాలా వరకు కరోనా మీద అవైర్నెస్ తీసుకువస్తున్నారు. వారికి సంబందించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుని జాగ్రత్తలు పాటించండి. అంతే అదే తగ్గిపోతుంది. అంతే గానీ కరోనా రాకముందే ప్రాణాలు తీసుకోవద్దు. ఆలోచించండి ప్రాణాలు కాపాడుకోండి.    

ఫార్వర్డ్ పోస్ట్ ప్రాణం తీసింది.. 

సోషల్ మీడియా పిచ్చోడి చేతిలో రాయిలాగా మారింది. ఎంబిబిఎస్ చదవనోడు డాక్టర్ అవుతున్నాడు. శాస్త్రం తెలియని సన్నాసి కూడా వేదాంతాలు చెపుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే కొంత మంది అనవసమైన విషయాలను క్రియేట్ చేసి మరి ప్రచారం చేస్తుంటారు. దానివల్ల  వాళ్లకు ఎలాంటి లాభం ఉంటాడో తెలీదు గానీ పొద్దున్న లేస్తే ఇది షేర్ చేయండి మీకు మంచి జరుగుతుంది. ఇది షేర్ చేయండి మీకు ఇది జరుగుతుంది. అని ప్రచారం చేస్తారు. ఇంకొంత మంది అయితే లేనిపోని అభూత కల్పితాలు క్రియేట్ చేసి వాట్స్ ఆప్ గ్రూప్స్ లో పోస్ట్ చేసి  ప్రజలను కూడా భయబ్రాంతులకు గురిచేస్తారు. తాజాగా ఒక వ్యక్తి తనకు వచ్చిన ఒక అభూతకల్పిత మెస్సేజ్ ను ఫార్వర్డ్ చేశాడు. ఇంకేముంది ఒక సారిగా పోలీసులు అతని ఇంటి ముందు వాలిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి.   తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని నారాయణపేట. అతని పేరు గుత్తుల శ్రీనివాస్‌. అతనికి పెళ్లి  కూడా అయింది. అతని భార్య పేరు వెంకటపద్మ. శ్రీనివాస్ ఆక్వా కంపెనీలో పనిచేస్తున్నాడు. అతని సెల్‌ఫోన్‌కు ‘కోళ్లకు కూడా సోకిన కరోనా మహమ్మారి’ అనే వాట్సప్‌ సందేశం వచ్చింది. దానిని ఆయన ఇతర గ్రూప్‌లకు పంపాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు శుక్రవారం శ్రీనివాస్‌కు ఫోన్‌ చేసి విచారించారు. తనకేమీ తెలియదని ఆయన ఎంత చెప్పినా వారు వినలేదు. దాంతో శ్రీనివాస్‌ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. శరీరంపై చెమటలు పట్టి కూలిపోయాడు. చికిత్స నిమిత్తం మూడు ఆసుపత్రులకు తీసుకెళ్లినా చేర్చుకోలేదు. చివరకు అమలాపురం కిమ్స్‌లో చేర్పించాం. ఆ తర్వాత గంట వ్యవధిలోనే ఆయన చనిపోయాడు’ అని పేర్కొన్నారు. ఇది చాలా పెద్ద కేసు అవుతుందని బెదిరిస్తూ శ్రీనివాస్‌ ఫోన్‌ను తీసుకెళ్లిన స్థానిక పోలీసులు. ఆయన చనిపోయిన కొద్ది సేపటికి దానిని వెనక్కి తెచ్చి ఇచ్చేశారన్నారు. హైదరాబాద్‌లోని సైబర్‌క్రైమ్‌ సీఐ రాజేష్‌, ఎస్సై రంజిత్‌కుమార్‌ తన భర్తను మానసికంగా హింసించారని ఆమె ఆరోపించారు. శ్రీనివాస్‌కు భార్య, తొమ్మిదేళ్ల కుమారుడు, ఏడేళ్ల కుమార్తె ఉన్నారు. దీనిపై అమలాపురం పట్టణ ఇన్‌ఛార్జి ఎస్సై సత్యప్రసాద్‌ను వివరణ కోరగా ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.          

ఎంపీ అరెస్టుకు అసలు కారణం ఇదే..

“ఆంధ్ర ప్రదేశ్’లో అరాచక, అవినీతి పాలన సాగుతోంది” నర్సాపురం ఎంపీ, రఘురామకృష్ణంరాజు, సంవత్సర కాలానికి పైగా రచ్చబండ సాక్షిగా ప్రతి రోజు చేస్తున్న ఆరోపణ ఇది. విషయం మారుతూ ఉండచ్చు, ఒకసారి దేవాలయాలపై దాడులు, విగ్రహాల విధ్వసం విషయం కావచ్చు మరోమారు అమరావతి రైతులకు జరిగిన అన్యాయం విషయమే కావచ్చు, లేదంటే ఇసుక, మద్యం పాలసీల విషయంలో కావచ్చు, విషయం ఏదైనా సారాంశం మాత్రం అదే. నిజానికి రఘురామకృష్ణంరాజు చేసిన ఆరోపణలు అయన మాత్రమే చేసినవి కాదు. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, మీడియా, మేధావులు, విశ్లేషకులు, సామాన్య ప్రజలు  అందరూ చేస్తున్నవే. అది సహజం. అయితే రఘురామ కృష్ణం రాజు ప్రతి పక్ష ఎంపీ కాదు. అధికార యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ) సభ్యుడు. అధికార పార్టీ సభ్యుడై ఉండి, అధికార పార్టీని, ప్రభుత్వాన్ని, ప్రతి రోజు రచ్చబండకు ఉతికి ఆరేయడం అధికార పార్టీ పెద్దలకు రుచించక పోవచ్చును. ఇంతకాలం ఆయన చేసిన, చేస్తున్న ఆరోపణలపై చట్టపరంగానే కాదు, రాజకీయంగా క్రమ శిక్షణా చర్యలు అయినా తీసుకోని, ఏపీ ప్రభుత్వం ఒక్కసారిగా ఆయనను, అరెస్ట్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. అదే విధంగా ఎంపీ అరెస్ట్’కు ఎంచుకున్న సమయం, పెట్టిన కేసులు ( ఐపీసీ 124 ఎ (రాజద్రోహం) 153ఎ (వివిధ వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చ కొట్టడం), 505 (ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయడం), అరెస్ట్ సందర్భంగా సీఐడీ అధికారులు ప్రవర్తించిన తీరు గమనిస్తే, ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కక్ష సాధిపు చర్యలకు పాల్పడుతున్నారన్న విపక్షాల ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తోంది. అలాగే,కృష్ణంరాజు చేసిన, ‘రాష్ట్రంలో అరాచక, అవినీతి  పాలన జరుగుతోందన్న’ ఆరోపణలను నిజం చేసే విధంగా ఉన్నాయని పరిశీలకులు, చివరకు ఎంపీ విధానాలతో విబేధించే రాజకీయ పార్టీలు నాయకులు  సైతం అంగీకరిస్తున్నారు.   కృష్ణం రాజు అరెస్టు కు ఆయన పుట్టిన రోజును ఎంచుకోవడం మొదలు, అరెస్టుకు సంబంధించి కుటుంబ సభ్యులకు ఎలాంటి వివరణ ఇవ్వకుండా అరెస్ట్ చేసి మంగళగిరికి తరలించడం,ఆయనపై బెయిల్ కు అవకాశం లేని దేశ ద్రోహం వంటి తీవ్రమైన కేసులు నమోదు చేయడం అన్నీ కూడా ఒక పధకం ప్రకారం సాగించిన కక్ష సాధింపు చర్య అన్న ఆరోపణలకు బలం చేకురుస్తున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.రఘురామకృష్ణంరాజుకు ఎంపీగా ఉన్న నేపథ్యంలో లోక్ సభ స్పీకర్ అనుమతి ఉండాలని చెప్పినా అవన్నీ కోర్టులో చూసుకోండి అంటూ దౌర్జన్యంగా అరెస్టు చేశారని ఆయన కుమారుడు భరత్ ఆరోపించారు. నాలుగు నెలల క్రితమే బైపాస్ సర్జరీ చేయించుకున్న తన తండ్రిని కోవిద్-19 నిబంధనలు కూడా పాటించకుండా 35 మంది సిఐడి పోలీసులు తమ ఇంట్లోకి ప్రవేశించి అరెస్టు చేశారని భరత్ మీడియాకు వివరించారు.   కృష్ణంరాజు అరెస్ట్’కు  ఆయన ప్రభుత్వం పై చేసిన ఆరోపణలు కారణమా , అంటే కాదు, అదొక సాకు మాత్రమే, అనేది అందరి అభిప్రాయంగా వుంది.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘ఏ వన్’ ముద్దాయిగా విచారణ ఎదుర్కుంటున్న  క్విట్ ప్రో కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ, కృష్ణం రాజు ఇటీవల పిటీషన్ దాఖలు చేశారు. సీబీఐ న్యాయస్థానం కృష్ణం రాజుపిటీషన్ను విచారణకు స్వీకరించింది. బెయిలు నిబంధనలను ముఖ్యమంత్రి ఉల్లంఘిస్తున్నారని, అదే విధంగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని సాక్షులను ప్రలోభాలకు గురిచేస్తున్నారని చేసిన ఆరోపణలను  పరిగణనలోకి తీసుకుని  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నోటీసు సర్వ్ చేసింది. ఈ నేపధ్యంలోనే వైసీపీ ప్రభుత్వం సిఐడీ ద్వారా కేసులు నమోదు చేసి, ఎంపీని అరెస్ట్ చేసందని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.   మరో వంక కృష్ణం రాజు అరెస్ట్’ను రాజకీయాలకు అతీతంగా వైసీపీ యేతర పార్టీలు, నాయకులు తప్పు పడుతున్నారు. తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు, ప్రజాసమస్యలపై సొంత పార్టీ ఎంపీ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఏకంగా దేశద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేయడం, ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడంతో సమానమని, రాష్ట్రంలో ఎమర్జెన్సీని మించిన అరాచక పాలన సాగుతోందని అన్నారు.అలాగే, టీడీపీ జాతీయ  ప్రధాన  కార్యదర్శి, మాజీ మంత్రి లోకేష్, నియంత కంటే ఘోరంగా, ప్రజల ప్రాణాల రక్షణ పట్టించుకోకుండా, తన కక్ష తీర్చుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుతున్న ఏకైక మూర్ఖపు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అని ఘాటుగా స్పందించారు.అదే విధంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, సొంత పార్టీ ఎంపీ అరెస్ట్’కు ఇదా సమయం అని ప్రభుతాన్ని ప్రశ్నించారు. ‘రాష్ట్రంలో కరోనా విశృంఖలంగా విభృంభిస్తోంది. ఈ తరుణంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కదిలించి ప్రజలను రక్షించాల్సి ఉండగా ఎంపీ రఘురామకృష్ణంరాజును అరెస్టు చేయడం ఏ మాత్రం సమర్థనీయం కాదు. కొంతకాలం పాటైనా రాజకీయ దమన నీతిని కట్టిపెట్టాలి’’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.   తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా రఘురామ కృష్టంరాజును అరెస్ట్ ను ఖండించారు. ఎంపీ రఘురామ కృష్టంరాజును ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేసిన తీరు చాలా దారుణమని బండి సంజయ్‌  అన్నారు. ఒక ఎంపీని ఈడ్చుకెళ్తారా..? బలవంతంగా కారులోకి తోస్తారా..? అంటూ నిప్పులు చెరిగారు. ‘‘లోక్‌సభ స్పీకర్‌ అనుమతి లేకుండా పార్లమెంటు సభ్యుడిని ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు అరెస్టు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అనుమతించిందని బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పు పట్ట్టారు.అయితే అధికార పార్టీ నాయకులు మాత్రం అరెస్టును సమర్దించే ప్రయత్నం చేస్తున్నారు. చట్ట ప్రకారమే ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రులు, పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. అయితే, ఇలాంటి చర్యల వలన ముఖ్యమంత్రి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అనే సంకేతాలు వెళతాయని, ప్రతిపక్షాలు చేసే ఆరోపణలకు బలం చేకూరుతుందని, అదే విధంగా ముఖ్యమంత్రి ఇంకేదో భయం వెంటాడుతోందని, అందుకే అరెస్తులతో ప్రశ్నించే గొంతులను నొక్కెసే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు భావించే ప్రమాదం ఉందని కొందరు అధికార పార్టీ నాయకులు కూడా అంగీకరిస్తున్నారు.  

న్యాయవ్యవస్థను అవమానించేలా మాట్లాడిన వైసీపీ నేతలను అరెస్ట్ చేశారా?

వైసీపీ రెబల్ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు ఏపీలో రాజకీయ ప్రపంకనలు రేపుతోంది. పార్టీలకతీతంగా విపక్ష నేతలంతా రఘురామ కృష్ణం రాజు అరెస్టును ఖండిస్తున్నారు. పుట్టినరోజునే కక్ష పూరితంగా ఆయన్ను అరెస్టు చేశారని ఆరోపిస్తున్నారు.గత కొంతకాలంగా రఘురామకృష్ణరాజుకు, వైసీపీ పెద్దలకు మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది.  జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఆ యుద్ధం మరింత ముదిరింది. తాజా అరెస్టుతో అది పరాకాష్ఠకు చేరింది.బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి రఘురామకృష్ణరాజు అరెస్ట్ ను ఖండిస్తున్నట్టు తెలిపారు. "రాష్ట్ర ప్రభుత్వ పరువుకు భంగం కలిగేలా ప్రసంగించారన్న ఆరోపణలపై రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేశారు... ప్రతిష్ఠకు భంగం కలిగేలా మాత్రమే కాదు, న్యాయవ్యవస్థను అవమానించేలా మాట్లాడిన అదే పార్టీకి చెందిన నేతలను ఎంతమందిని అరెస్ట్ చేశారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది" అని  పురందేశ్వరి వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా రఘురామ కృష్ణరాజు అరెస్టును తీవ్రంగా ఖండించారు. రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు పోలీసు వ్యవస్థను వాడుకోవడం దురదృష్ణకరమన్నారు. వైసీపీ ప్రభుత్వ నిరంకుశత్వానికి, అసహనానికి ఎంపీ అరెస్టు నిదర్శనమని మండిపడ్డారు. ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్టుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో స్పందించారు. కరోనాతో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతుంటే వారిని గాలికొదిలేసిన ప్రభుత్వం ఇలాంటి పనులు చేయడం ఎంతమాత్రమూ సమర్థనీయం కాదని అన్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారన్న ఏకైక కారణంతో సమయం, సందర్భం లేకుండా ఇలాంటి పనులేంటని నిలదీశారు. జనసేన పార్టీ దీనిని తీవ్రంగా ఖండిస్తోందన్నారు. రాష్ట్రం నుంచి హైదరాబాద్ వెళ్లే అంబులెన్సులను సరిహద్దుల్లో అడ్డుకుంటుంటే ఆ విషయం గురించి పట్టించుకోవడం మానేసి ఇలాంటి పనులపై దృష్టి పెట్టడం మంచిది కాదని పవన్ హితవు పలికారు.