వాట్సాప్ స్టేటస్‌లో ఫొటో బాలిక ఆత్మహత్య..
posted on May 15, 2021 @ 8:52PM
స్మార్ట్‌ఫోన్, తక్కువ ధరకే ఆన్లైన్ లో అందుబాటులోకి వచ్చాక సదువుతో సంబంధం లేదు, వయసు పరిమితి కూడా అవసరం లేకుండా సోషల్ మీడియాని కిరాణం వస్తువులు వినియోగించినట్లు వినియోగిస్తున్నారు. మొబైల్ వినియోగం విపరీతంగా పెరిగింది. అయినదానికి, కాని దానికీ సోషల్ మీడియాలో రెచ్చిపోయి పోస్ట్‌లు, వాట్సాప్‌లో స్టైల్ కొడుతూ స్టేటస్‌లు పెట్టడం కొందరికి అలవాటుగా మారింది. ఆనవాయితీగా మారింది. అలా ఓ అబ్బాయి వాట్సాప్‌లో తనకు పరిచయమైన బాలిక ఫొటోను స్టేటస్‌గా పెట్టుకున్నాడు. దాంతో ఆ అమ్మాయి తీవ్ర మనస్తాపం చెందింది.. ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడింది.
అది నల్గొండ జిల్లా. బొమ్మలరామారం మండలం. బోయిన్‌పల్లి గ్రామం. ఆ అమ్మాయి పేరు సాభావత్ శిల్ప. తన వయసు 14 సంవత్సరాలు. కూలి పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. మూడు చింతలపల్లి మండలం పోతారం గ్రామంలో ఉన్న కూరగాయల తోటలో కూలీగా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు బోటిమీది తండాకు చెందిన తేజావత్ మధు అనే బాలుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో గత కొన్ని నెలలుగా ఇద్దరూ సన్నిహితంగా ఉంటున్నారు. ఇద్దరూ ఒకరి ఫోన్ నంబర్లు ఒకరు తీసుకున్నారు. గంటల కొద్దీ ఫోన్లు మాట్లాడుకునేవారు. వాట్సాప్‌లో చాటింగ్ చేసుకుంటూ కాలక్షేపం చేసేవారు. ఇలా ఇద్దరికీ పరిచయం ఉన్నట్లు ఎవరికీ చెప్పొద్దని శిల్ప షరతు పెట్టింది. మధు కూడా అలాగేనని ఆమెకు చెప్పాడు. శిల్ప, మధు కలిసి అతని స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు, ఫొటోలు దిగేవారు. ఆ ఫొటోలను ఒకరికొకరు వ్యక్తిగతంగా పంపుకుంటూ ఇద్దరూ తెలిసీతెలియని వయసులో మురిసిపోయారు. అయితే.. శిల్ప పరిచయమైన తర్వాత మధు వాట్సాప్ స్టేటస్‌లో రోజూ లవ్ పాటలు, కొటేషన్లను పోస్ట్ చేసేవాడు. శిల్ప కూడా మధు స్టేటస్‌లు చూసి సంతోషించేది. అయితే.. శిల్ప ఫొటోలను మాత్రం మధు ఎప్పుడూ స్టేటస్‌లో పోస్ట్ చేయలేదు. కానీ.. శుక్రవారం ఆపుకోలేని తాపత్రయంతో శిల్ప ఫొటోను మధు తన వాట్సాప్ స్టేటస్‌లో పోస్ట్ చేశాడు. గతంలో మధు ఫోన్‌లో శిల్ప కొన్ని ఫొటోలు దిగింది. ఆ ఫొటోల్లో ఒక ఫొటోను మధు వాట్సాప్ స్టేటస్‌గా పెట్టాడు. తన ఫొటోను వాట్సాప్ స్టేటస్‌గా మధు పెట్టడంతో శిల్ప ఒక్కసారిగా షాకయింది.
మధుతో తనకు ఉన్న పరిచయం గురించి అందరికీ తెలిసిపోయిందని ఆ బాలిక తీవ్ర మనస్తాపం చెందింది. మధుకు ఫోన్ చేసి ఎందుకిలా చేశావని, ఫొటోలు పోస్ట్ చేయొద్దని చెప్పా కదా అని అడిగింది. ‘ఏం కాదులే’ అంటూ మధు సముదాయించే ప్రయత్నం చేశాడు. ఫోన్ కాంటాక్ట్స్‌లో ఉన్న వాళ్లందరూ ఫొటోను చూస్తారని, ఆ అమ్మాయి ఎవరని అడుగుతారని మధుతో చెప్పిన శిల్ప క్షణికావేశంలో ఊహించని నిర్ణయం తీసుకుంది. మధు తన ఫొటోను స్టేటస్‌లో పెట్టడాన్ని భరించలేకపోయిన శిల్ప తీవ్ర మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తాను పనిచేసే తోటలో దొరికిన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తన కూతురు చనిపోవడానికి మధు అనే అబ్బాయే కారణమని శిల్ప తల్లి జయమ్మ షామీర్‌పేట్‌లోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.