అల్లం కాదు..3 వేల కిలోల గంజాయి.. తెలిస్తే షాక్ అవుతారు..
posted on Jul 12, 2021 @ 2:32PM
ఈ ప్రపంచం నడిచేది డబ్బు మొదటిది అయితే.. మానవుడు బతకడానికి అవసరం అనే అంశం రెండోవది అని చెప్పాలి.. ఈ రెండు విషయాల కోసం మానవుడు అనేక రకాలుగా అక్రమాలకు పాటుపడుతున్నారు. వాళ్ళు డబ్బులు సంపాదించడం కోసం పక్కవాడిని మోసం చేయడానికి.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడదానికి కూడా వెనకాడం లేదు.. షార్ట్ టైములో ఎక్కువ డబ్బులు సంపాదించడానికి. షార్ట్ టైములో సెట్టిల్ అవ్వాలని స్మగ్లింగ్ లాంటి దారులను ఎంచుకుంటున్నారు.
ఈ మధ్య కాలంలో స్మగ్లింగ్ రాయుడ్లు రెచ్చిపోతున్నారు. ఒక వైపు బంగారు స్మగ్లింగ్ మరో వైపు బంగారు స్మగ్లింగ్, మరో వైపు గంజాయి స్మగ్లింగ్ రకరకాలుగా పోలీసుల కళ్ళు కప్పి జోరుగా చేస్తున్నారు. కానీ చివరికి వేటగాడు వేసిన వలకు చేప చిక్కినట్లు ఈ స్మగ్లింగ్ బ్యాచ్ కూడా పోలీసులకు పట్టుపడుతున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలో గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసుల పట్టుకున్నారు. నిందితుల నుంచి ఒకటి కాదు రెండు కాదు సుమారు రూ.1.50 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అల్లాన్నీ అడ్డంగా పెట్టుకుని గంజాయి తరలిస్తున్నారంటూ స్పెషల్ బ్రాంచ్ పోలీసులకి సమాచారం రావడంతో విజయనగరం రూరల్ స్టేషన్ పరిధిలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, రూరల్ పోలీసులు సమూహంగా కలిసి రంగంలోకి దిగారు.. వారి వాహనాన్ని ఛేదించారు. చివరికి ఆ వాహనాన్ని పట్టుకున్నట్లు విజయనగరం ఎస్పీ బి.రాజకుమారి తెలిపారు. అంతే కాదు లారీ డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, పట్టుబడిన ముగ్గురు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అరవింద్ కుమార్, భరత్‌సింగ్, సత్యబాన్‌సింగ్‌గా పోలీసులు గుర్తించారు.
వాహనాల తనిఖీ నేపధ్యంలో ఒడిస్సా నుండి గంజాయి ఎక్కించుకొని విజయనగరం ఏజెన్సీ మీదుగా విశాఖ వైపు వెళ్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. అల్లం మాటున గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు, ఆ వాహనంలో అల్లం కాకుండా ఒకటి కాదు రెండు కాదు 3 వేల కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారని ఎస్పీ తెలిపారు. సిమిలిగూడలో గంజాయి లోడు చేసినట్టు నిందితులు అంగీకరించారని..దీన్ని ఢిల్లీకి తరలిస్తున్నట్టు చెప్పారని అన్నారు. కేసు నమోదు చేసి రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొనుగోలుదారుడు, విక్రయదారుడుపై వివరాలు సేకరిస్తున్నామని, త్వరలోనే వారిని పట్టుకుంటామని ఎస్పీ బి.రాజకుమారి తెలిపారు.