దర్శనానికి వచ్చిన.. మహిళపై గ్యాంగ్ రేప్..
posted on Jul 13, 2021 @ 10:17AM
మనుషుల్లో పక్కవారంటే గౌరవం.. దేవుడు అంటే భక్తి, చట్టాలు అంటే భయం లేకుండా పోతుంది.. ఇక అమ్మాయిల పై దాడుల విషయానికి వస్తే.. ఎక్కడైనా, ఎప్పుడైనా ఒంటరిగా అమ్మాయిలు కనిపిస్తే పిల్లి లాంటివాడు పులి అవుతాడు.. వాళ్లపై నోటు పారేసుకోవడం.. చేతులు వేయడం.. చివరికి ఎవరు అడ్డుపడకపోతే అత్యాచారంకి పాల్పడం. మహిళా రక్షణకోసం ఎన్ని చట్టాలు వచ్చిన వాటిని లెక్కచేయడంలేదు కొంత మంది దుర్మార్గులు.. మహిళలపై నిత్యం దాడి చేస్తూనే ఉన్నారు.. తాజాగా ఒక రాష్ట్రము నుండి మరొక రాష్ట్రానికి ఆయాల దర్శనానికి వచ్చిన అమ్మాయి పై గ్యాంగ్ రేప్ చేశారు. వివరాలు తెలుసుకుందాం..
తమిళనాడులో ని పళణి ఆలయ దర్శనానికి వచ్చిన కేరళ యువ జంటపై వచ్చారు.. ఈ యువ జంట పై స్థానికుల కళ్ళు పడ్డాయి.. పధకం వేశారు.. ఆ తర్వాత ఆ పధకాన్ని అమలు చేశారు. వాళ్లపై ఆ దుండగులు దాడి చేశారు. రూమ్ లో ఉన్న భర్తను కొట్టి యువతీ పై పలుమార్లు గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆమె భర్త వాపోతున్నాడు. ఒకటి కాదు రెండు కాదు గత ఇరవై రోజులుగా న్యాయం కోసం ఒంటరిగా పోరాడుతున్నాడు. ఎవరూ పట్టించుకోలేదు.. సహకరించలేదు. ఇలా ఐతే తనకు న్యాయం జరగదని చివరికి సీఎం స్టాలిన్‌ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని తెలియజేశాడు. ఆ విషయాన్నీ తెలుసుకున్న సీఎం వెంటనే స్పందిస్తూ.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు అతడి కేసును పట్టించుకోని పోలీసులపై విచారణకు ఆదేశించారు.
ఎన్ని చట్టాలు తెచ్చినా ఎన్ని శిక్షలు వేసినా మహిళలు, యువతులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. రోజురోజుకి మగాళ్లు మృగాళ్ల రెచ్చిపోతున్నారు. మానవత్వం మరిచి అత్యంత నీచమైన పనులు వడిగడుతున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు. ఆలయ దర్శనం కోసం వచ్చిన జంటపై ఇలా చేయడం అమానుషమని తమిళనాడు మహిళ సంఘాలు ఆగ్రహిస్తున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసు ఇప్పుడు సీఎం స్టాలిన్ పరిధిలోకి వెళ్లడంతో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.