హైద‌రాబాద్‌కు కొత్త ట్రాఫిక్ బాస్‌.. ఇక రూల్స్ మరింత ఖ‌త‌ర్నాక్...

ఏవీ రంగ‌నాథ్‌. ఐపీఎస్‌. ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్‌. గ‌తంలో హైద‌రాబాద్ ట్రాఫిక్ డీసీపీగా ఉండేవారు. ఆ టైమ్‌లో ట్రాఫిక్ రూల్స్‌ను ప‌క్కాగా, ప‌టిష్టంగా అమ‌లు చేశారు. కుప్ప‌ల‌కు కుప్ప‌లుగా చ‌లానాలు వ‌సూలు చేశారు. డ్రంకెన్ డ్రైవ్‌ల‌పై ఉక్కుపాదం మోపడం మొద‌లైంది ఆయ‌న హ‌యాంలోనే. అప్ప‌ట్లో ఆయ‌న ప‌నితీరుకు మెచ్చిన ప్ర‌భుత్వం.. ఆ త‌ర్వాత త‌ప్పనిస‌రి ట్రాన్స్‌ఫ‌ర్స్‌లో భాగంగా న‌ల్గొండ జిల్లా ఎస్పీగా నియ‌మించింది. అక్క‌డా స‌మ‌ర్థ‌వంతంగా రాణించారు. విశాఖ మ‌న్యంలో దాడి చేసి మ‌రీ గంజాయి స్మ‌గ్ల‌ర్ల‌ను అరెస్ట్ చేసేలా చేశారు. డ్ర‌గ్స్ దందాకు చెక్ పెట్టారు. బైక్స్ సైలెన్స‌ర్లు క‌ట్ చేసి.. పెద్ద సౌండ్‌తో రోడ్ల‌పై హ‌ల్‌చ‌ల్ చేస్తున్న యువ‌కుల‌ను ప‌ట్టుకొని కేసులు పెట్టారు. సైలెన్సర్లు లేని బండ్లు సీజ్ చేశారు. ప‌లు కేసుల‌ను చాక‌చ‌క్యంగా డీల్ చేశారు రంగ‌నాథ్‌. అందుకే, మీడియాలో రంగ‌నాథ్ గురించి ఎప్పుడూ ఏదో ఒక‌ న్యూస్ వ‌స్తూనే ఉంటుంది. టీవీలు, వైబ్‌సైట్లు చూసే వారంద‌రికీ రంగ‌నాథ్ బాగా తెలిసిన పోలీస్‌ అధికారే.  ఏవీ రంగ‌నాథ్ ప‌నితీరుకు ప్ర‌మోష‌న్ ద‌క్కింది. ఆయ‌న్ను మ‌రోసారి ట్రాఫిక్‌కు తీసుకున్నారు. తాజాగా, హైద‌రాబాద్ జాయింట్ ట్రాఫిక్ కమిషనర్‌గా చార్జ్ తీసుకున్నారు ఏవీ రంగ‌నాథ్. ట్రాఫిక్ ఇబ్బందులపై గతంలో డీసీపీగా పని చేసిన అనుభవం ఉందన్నారు ఆయ‌న‌. అన్ని శాఖల సమన్వయంతో ట్రాఫిక్ ఇబ్బందులు తొలిగే ప్రయత్నం చేస్తానని తెలిపారు.  వ‌చ్చీరాగానే న్యూఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్‌పై ఫోక‌స్ పెట్టారు. డిసెంబర్ 31 ట్రాఫిక్ ఆంక్షలపై మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు. స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీలు చేప‌డ‌తామ‌ని హెచ్చ‌రించారు. నిబంధనలు అతిక్రమిస్తే వాణిజ్య సముదాయాలపై చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు. హైదరాబాద్‌లో గ్రీన్ ఛాలెంజ్, వీవీఐపీ మూమెంట్స్ కొరకు స్పెషల్ చర్యలు చేపడుతున్నారని రంగ‌నాథ్‌ అన్నారు.   

రాధాకు బాబు ఫోన్.. సోముపై సెటైర్లు.. ఇదేందయా కేసీఆర్.. ఎంపీల ఫైటింగ్.. టాప్ న్యూస్@1PM

టీడీపీ అధినేత చంద్రబాబు వంగవీటి రాధాకు ఫోన్ చేసి మాట్లాడారు. రెక్కీ నిర్వహించిన వ్యవహారంపై వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. గన్‌మ‌న్లు వ‌ద్దంటూ వంగ‌వీటి రాధా చెప్ప‌డం సరికాదని, వ్యక్తిగత భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇచ్చారు. వంగవీటి రాధాకు టీడీపీ మ‌ద్ద‌తుగా నిలుస్తుందని తెలిపారు.డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు చంద్ర‌బాబు నాయుడు లేఖ రాశారు. వంగవీటి రాధా హత్యకు జరిగిన రెక్కీపై సమగ్ర విచారణ జరపాలని, నిందితుల‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ----------- రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం జరిగి ఏడాదవుతున్నా నిందితులను ఎందుకు పట్టుకోలేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు అన్నారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి హిందూవుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేటెస్ట్ టెక్నాలజీ వచ్చినా.. శ్రీరాముడి విగ్రహం ధ్వంసం చేసిన నిందితులను ఎందుకు పట్టుకోవడం లేదని ప్రశ్నించారు.  వైసీపీ ప్రభుత్వ చేతకానితనం, జగన్ రెడ్డి హిందూమతం పట్ల అనుసరిస్తున్న పక్షపాత వైఖరికి నిదర్శనమన్నారు. ------ మద్యంపై చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేత సోమువీర్రాజు సమర్థించుకున్నారు. తాను తక్కువ ధరకే మద్యం అమ్ముతానని చెప్పింది తన ఆడుపడుచుల కోసమే అని తెలిపారు. 250 రూపాయలకు మందు అమ్మి పేదవాడి రక్తం తాగుతున్నారని మండిపడ్డారు. పేదల బలహీనతలను  వైసీపీ నాయకులు సొమ్ము చేసుకుంటున్నారన్నారు. మందు రెట్లు తగ్గిస్తా అన్నది... వచ్చే కూలీ డబ్బుల్లో కొంతైనా ఇంట్లో ఇస్తారని మాత్రమే అని చెప్పుకొచ్చారు. ---------- విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కాంట్రాక్టర్లు ధర్నాకు దిగారు. నల్ల చొక్కా లతో నాడు పోషకులం, నేడు యాచకులం అంటూ నిరసన తెలిపారు. దీర్ఘకాలిక పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నవరత్నాల్లో మమ్మల్ని కూడా ఒక రత్నం కింద చేర్చి.. దఫ దఫాలుగా, బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు.  ------- నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో గంద‌ర‌గోళం ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఆనందయ్య వ్యవహారంపై ఇప్ప‌టికే ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఆనందయ్యకు జిల్లా జాయింట్ కలెక్టర్ గణేశ్‌ కుమార్ నోటీసులు జారీ చేశారు. ఒమిక్రాన్ కు ఆనందయ్య మందు అని వచ్చిన ప్రకటనపై వివరణ ఇవ్వాలని ఆయ‌న‌ కోరారు. ఆ మందు పంపిణీ చేసేందుకు ఏయే అనుమతులు తీసుకున్నారో తెల‌పాల‌ని ఆదేశించారు. ---- ఓటీఎస్ పథకాన్ని వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లా కొంగలవీడు గ్రామ వాలంటీర్ గోళ్ల విష్ణువర్ధన్ రాజీనామా చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక రాజీనామా చేసినట్లు చెప్పారు. ఇప్పటికే పెరిగిన ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఓటిఎస్ పేరుతో ప్రభుత్వం ముక్కుపిండి రూ. 10వేలు వసూలు చేయడం తనకు నచ్చలేదన్నారు. జగనన్నప్రభుత్వ విధానాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు ------ డిసెంబర్ 31న అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలను పొడిగిస్తూ కేసీఆర్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరిగిపోతున్నా.. ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తుందని జనాలు మండిపడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల కంటే పైసలే ముఖ్యమని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.  కేసీఆర్ సర్కార్ పై జనాలు తీవ్రంగా స్పందిస్తున్నారు.  ------- ట్యాంక్‌బండ్‌పై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, కారు ఢీకొనడంతో మూడేళ్ల చిన్నారి శ్రీ అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ప్రమాదంలో తల్లి సామాన్య, తండ్రి శివకుమార్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం యశోద ఆస్పత్రికి తరలించారు. ------- కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకు అదిష్టానం మద్దతు లభించింది. నాయకత్వ మార్పు ప్రతిపాదనను అధిష్టానం తోసిపుచ్చింది. ప్రస్తుత సభాకాలం పూర్తయ్యే వరకు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని స్పష్టం చేసింది.బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్  కమిటీ సమావేశానికి బీజేపీ జాతీయ కార్యదర్శి  అరుణ్ సింగ్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి హాజరయ్యారు. నాయకత్వ మార్పు లేదని ప్రకటించారు.  ---- ప్రజల సమస్యలపై కొట్లాడాల్సిన ఎంపీలు.. చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ ఘటన జోర్డాన్ లో జరిగింది. సమాన హక్కులపై ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా..  ఓ ప్రతిపక్ష ఎంపీ దానిని పనికిమాలిన బిల్లు అంటూ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై అధికార పార్టీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తర్వాత ఎంపీలు సీట్ల నుంచి లేచొచ్చి పరస్పరం దాడులు చేసుకున్నారు. చొక్కాలు పట్టుకుని ముష్టి ఘాతాలు కురిపించుకున్నారు. --- సినీ హీరో మంచు మ‌నోజ్‌కు క‌రోనా సోకింది. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలుపుతూ ప‌లు సూచ‌న‌లు చేశాడు. ప్ర‌స్తుతం త‌న ఆరోగ్యం బాగానే ఉంద‌ని తెలిపాడు మంచు మనోజ్. ఇటీవ‌ల తనను క‌లిసిన వారంచా వెంట‌నే క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సూచించారు. 

యూపీ ఎలక్షన్స్ 2022.. బ్రాహ్మణ ఓటు కమలం కొంప ముంచుతుందా? 

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం తధ్యమని సర్వేలు సూచిస్తున్నాయి.అయితే బీజేపీ,నాయకత్వం మాత్రం భయపడుతోంది. ఓటమి భయంతోనే పరుగులు తీస్తోంది.   ముఖ్యంగా బ్రాహ్మణ ఓటు అటూ ఇటూ అయితే, లెక్క తప్పుతుందని బీజేపే నాయకత్వం కొంచెం ఆలస్యంగానే అయినా గుర్తించింది.ఒక విధంగా బీజీపీ అగ్ర నాయకత్వాన్ని బ్రాహ్మణ ఓటు బ్యాంకు చేజారిపోతోందనే భయం వెంటాడుతోంది  ఈ భయంతోనే  బీజేపీ నాయకులు కిందామీద అవుతున్నారని పరిశీలకులు అంటున్నారు.  నిజానికి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఉన్న బ్రాహ్మణ సామాజిక వర్గం, 1990 దశకంలో మండల్ – కమండల్ ఆందోళనల నేపధ్యంగా కమల దళం వైపు మొగ్గు చూపడం మొదలైంది.ఆ తర్వాతనే రాష్ట్రంలో బీజేపీకి పునాదులు ఏర్పడ్డాయి. ఆ పునాదుల ఆధారంగానే 1990వ దశకంలో బీజేపీకి నాలుగుసార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది. అయినా, బీజేపీ ఒక్కాసరి కూడా ముఖ్యమంత్రి పదవిని బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఇవ్వలేదు. రెండు సార్లు బీసీవర్గానికి చెందిన కళ్యాణ్ సింగ్’ను ముఖ్యమంత్రిని చేసింది. మరోమారు వైశ్య వర్గానికి చెందిన రాంప్రకాష్ గుప్తాను, ఇంకోసారి  రాజ్‌పుత్ నాయకుడు రాజ్‌నాథ్ సింగ్’ను ముఖ్యమంత్రిని చేసింది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి మొండి చేయి చూపించింది.  ఈ నేపధ్యంలో 2005లో మాయావతి, నూతన సామాజిక సమీకరణ ప్రయోగం చేశారు. దళిత బ్రాహ్మణ కూటమిని తెర మీదకు తెచ్చారు. ఆ ప్రయోగం సక్సెస్ అయింది. మాయ చేసిన  సోషల్ ఇంజనీరింగ్ ఫలితంగా 2007 ఎన్నికలలో బీఎస్పీ ఘనవిజయం సాధించింది.  సంపూర్ణ మెజారిటీతో మాయావతి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.అయితే మాయావతి స్వయం కృతం కారణంగా, ఆమె చేసిన సోషల్ ఇంజినీరింగ్ ప్రయోగం విఫలమైంది. 2012లో సమాజ్‌వాదీ పార్టీ సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది.ఇక 2017 లోకి వస్తే, 2014 లోక్‌సభ ఎన్నికలలో నరేంద్ర మోడీ వేవ్’లో యూపీ బ్రాహ్మణులు మరోసారి బీజేపీకి మద్దతు ఇచ్చారు. బ్రాహ్మణ ఓటు బ్యాంక్ సాలిడ్’గా కమలదళం వైపు మొగ్గు చూపింది. అందు వల్లనే, 2014లోక్ సభ, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ యూపీని స్వీప్  చేసింది. అయితే, బ్రాహ్మణేతర సామాజిక వర్గానికి చెందిన యోగీ అదిత్యనాథ్’ను  సీఎం చేసి, కేశవ్ ప్రసాద్ మౌర్యతో పాటు , బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన దినేష్ శర్మను డిప్యూటీ సీఎం చేసి బ్రాహ్మణులను సంతోషపెట్టాలని ప్రయత్నించింది. అయితే గడచిన ఐదేళ్లలో,  యోగీ ప్రభుత్వం బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వలేదనే బావన ఆ సామజిక వర్గం వుంది. అందుకే  2017 ఎన్నికల్లో బీజీపీ వైపు సాలిడ్’గా నిలించిన బ్రాహ్మణ సామాజిక వర్గం, ఈసారి ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్’ ప్రభుత్వ పట్ల గుర్రుగా ఉన్నారు. అందుకు చాలానే కారణాలున్నా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బ్రాహ్మణులను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలుచాలా బలంగా వినిపిస్తున్నాయి. నిజానికి యోగి ఆదిత్యనాథ్’ ప్రభుత్వంలో, మంత్రి వర్గంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి సముచిత స్థానమే లభించింది, ప్రభుత్వ అధికారులలోనూ బ్రాహ్మణ సామాజిక వార్గానికి సముచిత స్థానమే దక్కింది. అయినా  బ్రాహ్మణులలో, యోగి ప్రభుత్వం పట్ల అసంతృప్తి, వ్యతిరేకత ఉన్నాయంటే, అందుకు మూలా కారణం క్రింది స్థాయిలో బ్రాహ్మణులకు సానుకూల సంకేతాలు ఇవ్వడంలో బిజెపి విఫలమైంది. మరోవైపు, బ్రాహ్మణుల ఈ అసంతృప్తిని పసిగట్టిన బీఎస్పీ, సమాజ్‌వాదీ పార్టీలతో పాటు కాంగ్రెస్ కూడా బ్రాహ్మణ నేతలను తమ వైపుకు తిప్పుకునేందుకు బ్రాహ్మణ సమ్మేళనాలు  ఏర్పటు చేసి వరాల జల్లు కురిపిస్తున్నాయి.   మరో వంక బీజేపీలోని సీనియర్  బ్రాహ్మణ నాయకులు ప్రత్యేకంగా సమావేసమై,తమ వర్గానికి అసెంబ్లీలో ప్రాతినిధ్యం పెరిగే విధంగా, ఎక్కువ సంఖ్యలో టిక్కెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.అలాగే, తమకు పట్టున్న నియోజక వర్గాల్లో ఇతర సామాజిక వర్గాలను నిలబెడితే సహించేంది లేదని అంటున్నారు. బీజేపీ నాయకత్వం తమ డిమాండ్లను అంగీకరించాలని లేదంటే తమ దారి తాము చుసుకుంటామని హెచ్చరించారు.బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన గ్యాంగెస్టర్(గూండా)వికాస్ దుబే, ఆయన అనచరుల ఎన్కౌంటర్’ను కూడా బ్రాహ్మణ సమాజం ఆగ్రహానికి ఒక కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా క్రింది స్థాయిలో దుబే ఎన్కౌంటర్ తీవ్ర ప్రభావం చూపుతోంది. అందుకే, దుబే ఎన్కౌంటర్’ను నేతలు ప్రశ్నిస్తున్నారు. సుల్తాన్ పూర్ ఎమ్మెల్యే దియోమణి ద్వివేది, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది బ్రాహ్మలు హత్యకు గురయ్యారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బ్రాహ్మణ సామాజిక వర్గంలో అసంతృప్తిని చల్లార్చేందుకు  లఖిం పూర్ ఖేదీ ఎంపీ అజయ్ కుమార్ మిశ్రాను కేంద్రంలో, కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన జితిన్ ప్రసాదాను రాష్ట్రంలో యోగీ మంత్రి వర్గం లోకి తీసుకున్నారు. అంతే కాదు, లఖింపూర్ ఖేరీ సంఘటనకు సంబంధించి మిశ్రాను మంత్రి వర్గం నుంచి తొలిగించాలని ప్రతిపక్షాలు ముక్త కంఠంతో డిమండ్ చేస్తున్నా,ప్రధాని మోడీ పట్టించుకోవడం లేదు. అంటే బీజేపీ నాయకత్వంపై  బ్రాహ్మణ నాయకుల వత్తిడికి ఎంత బలంగా పనిచేస్తోందో, అర్థం చేసుకోవచ్చును, అంటున్నారు, పరిశీలకులు.     ఈనేపధ్యంలోనే బీజేపీ నాయకత్వం అప్రమత్తమైంది.బ్రాహ్మణ నాయకులను బుజ్జగించేందుకు, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏకంగా ఒక  కమిటీనే ఏర్పాటు చేశారు.  అంతకు ముందు కేంద్ర మంత్రి, యూపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్ రాష్ట్రంలోని పార్టీ బ్రాహ్మణ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. అయితే, బీజేపీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి శివ ప్రతాప్ శుక్లా బ్రాహ్మణులకు పార్టీపై కోపం లేదని, దిద్దుబాటు చర్యలకు ఇంకు సమయముందని అంటున్నారు. పార్టీ నాయకత్వం సకాలంలో సరియైన నిర్ణయం తీసుకుంటే, సమస్య సామరస్య పూర్వకంగా పరిష్కారం అవుతుందని, నాయకత్వం ఉపేక్ష వహిస్తే మాత్రం   ఎన్నికలలో ఎదురుదెబ్బ తగిలే అవకాశాన్ని కొట్టివేయలేమని అన్నారు.  మరో వంక, ప్రస్తుతానకి, అసంతృప్తి దశలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత ఆగ్రహంగా మారితే మాత్రం ఎన్నికల ఫలితాలపై ప్రభావం పడే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు కూడా పరిస్తితిని విశ్లేషిస్తున్నారు.

వంగ‌వీటిపై రెక్కీ చేసింది అత‌నేనా? బెజ‌వాడ‌లో అస‌లేం జ‌రుగుతోంది?

చాలాకాలంగా బెజ‌వాడ పాలిటిక్స్ స్త‌బ్దుగా ఉన్నాయ్‌. ప్ర‌శాంత చెరువులో రాయి వేసిన‌ట్టు.. ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా అల‌జ‌డి. గంట‌ల వ్య‌వ‌ధిలోనే హైటెన్ష‌న్‌. త‌న‌పై రెక్కీ చేశార‌ని వంగ‌వీటి రాధ వైసీపీ నేత‌ల స‌మ‌క్షంలో ప్ర‌క‌టించ‌డం క‌ల‌క‌లం రేపాయి. వెంట‌నే సీఎం జ‌గ‌న్ స్పందించి విచార‌ణ‌కు ఆదేశించడం.. వంగ‌వీటికి 2+2 గ‌న్‌మెన్లు ఇవ్వ‌డం.. ఆయ‌న వాటిని తిర‌స్కరించ‌డం.. చంద్ర‌బాబు సైతం డీజీపీకి లేఖ రాయ‌డం.. ఇలా వేగంగా ప‌రిణామాలు మారిపోతున్నాయి. ఒక్క స్టేట్‌మెంట్‌తో ఓవ‌ర్‌నైట్ వంగ‌వీటి రాధాకృష్ణ సంచ‌ల‌నంగా మారారు. కొంత‌కాలంగా సైలెంట్‌గా ఉంటున్న‌ ఆయ‌న‌.. స‌డెన్‌గా లైమ్‌లైట్‌లోకి వ‌చ్చారు. రాజ‌కీయంగా సెంట‌ర్ పాయింట్‌గా నిలిచారు. ఇంత‌టి పొలిటిక‌ల్ మ‌సాలాకు కార‌ణం.. త‌న‌పై రెక్కీ జ‌రిగిన‌ట్టు వంగ‌వీటి ప్ర‌క‌టించ‌డం. ఇంత‌కీ.. రాధాపై రెక్కీ చేసింది ఎవ‌రు? వంగ‌వీటిని చంపాల్సిన అవ‌స‌రం ఎవ‌రికి ఉంటుంది? కొడాలి నాని, వంశీల స‌మ‌క్షంలో ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం వ్యూహాత్మ‌క‌మా? ఇదంతా వైసీపీ స్కెచ్చా? టీడీపీ నేత వంగ‌వీటిపై జ‌గ‌న్‌కు స‌డెన్‌గా అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? రెక్కీ వెనుకున్న రాజ‌కీయం ఏంటి? కాపులను కాపు కాస్తున్న‌ది ఎవ‌రు? ఇవ‌న్నీ ఇంట్రెస్టింగ్ పాయింట్స్‌.  వంగ‌వీటిపై రెక్కీ అంటే వెంట‌నే అంద‌రి దృష్టి దేవినేని వైపే మ‌ళ్ల‌డం కామ‌న్‌. ఇప్పుడు సైతం దేవినేని వ‌ర్గాన్నే అనుమానిస్తున్నారు అంతా. వంగ‌వీటి రాధా ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్నారు. ఆయ‌న‌తో టీడీపీ లీడ‌ర్లు ఎవ‌రికీ ఎలాంటి శ‌త్రుత్వం లేదు. ఆ లెక్క‌న వంగ‌వీటిపై రెక్కీ చేయాల్సిన అవ‌స‌రం టీడీపీకి గానీ, ఆ పార్టీ లీడ‌ర్ల‌కు కానీ లేనే లేదు. అందుకే అనుమాన‌మంతా వైసీపీ వారిమీదే. అందులోనూ దేవినేని అవినాశ్ వైపే. త‌న‌కు గాలం వేయాల‌ని భావించిన కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీల‌కు చెక్ పెట్టేందుకే.. వారి స‌మ‌క్షంలోనే కావాల‌నే రెక్కీ విష‌యం బ‌య‌ట‌పెట్టార‌ని అంటున్నారు. "మీరేమో పార్టీలోకి లాగాల‌ని చూస్తున్నారు.. మ‌రి, మీ పార్టీ నాయ‌కులేమో న‌న్ను చంపాల‌ని చూస్తున్నారు".. అనే మెసేజ్ ఇచ్చేందుకే ఇలా ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చి ఉంటార‌ని అంటున్నారు. వంగ‌వీటి ప్ర‌క‌ట‌న‌తో వైసీపీకి జ‌రిగే డ్యామేజ్‌ను గుర్తించే సీఎం జ‌గ‌న్ సైతం వెంట‌నే రియాక్ట్ అయ్యార‌ని.. త‌మ వారిపై అనుమానం రాకుండా ఉండేందుకే.. గంట‌ల వ్య‌వ‌ధిలోనే గ‌న్‌మెన్ల‌ను కూడా కేటాయించార‌ని అంటున్నారు. టీడీపీ నేతలపై కుట్రలు చేసి కేసులు పెట్టి వేధించే వైసీపీ ప్రభుత్వం.. వంగవీటి విషయంలో మాత్రం ఇంత పాజిటివ్ గా క్విక్ రెస్పాన్స్ ఇవ్వడం వెనుక అసలు ఉద్దేశం, దురుద్దేశం తెలియంది కాదు. జ‌గ‌న్ స్ట్రాట‌జీని ప‌సిగ‌ట్టిన వంగ‌వీటి.. త‌న‌కు ప్ర‌జాబ‌లం చాల‌ని.. గ‌న్‌మెన్ల అవ‌స‌రం లేదంటూ వారిని తిప్పిపంపి.. జ‌గ‌న్‌కు రాధాకృష్ణ‌ జ‌బ‌ర్ద‌స్త్ ఝ‌ల‌క్ ఇచ్చారని చెబుతున్నారు. వెంట‌నే చంద్ర‌బాబు సైతం జోక్యం చేసుకొని.. వంగ‌వీటి భ‌ద్ర‌త త‌మ‌కు, త‌మ పార్టీకి అత్యంత ముఖ్య‌మ‌ని.. గ‌న్‌మెన్ల‌ను తీసుకోమ‌ని రాధాకు సూచించారు. ఇలా బెజ‌వాడ‌లో వంగ‌వీటి పొలిటిక‌ల్ ఎపిసోడ్ హాట్ హాట్‌గా సాగుతోంది. ఇదంతా స‌రే.. ఇంత‌కీ వంగ‌వీటిపై రెక్కీ చేసింది ఎవ‌రు?  దేవినేని అవినాశ్‌కు లింకుందా? బెజ‌వాడ‌లో అస‌లేం జ‌రుగుతోంది?  వంగ‌వీటి రాధాకృష్ణ‌పై రెక్కీ చేసింది.. దేవినేనికి అత్యంత స‌న్నిహితుడైన వైసీపీ ఫ్లోర్ లీడ‌ర్ అర‌వ‌ వెంక‌ట స‌త్య‌నారాయ‌ణ...అని బెజ‌వాడ‌లో విస్తృత ప్ర‌చారం జ‌రుగుతోంది. దేవినేని అవినాశ్ డైరెక్ష‌న్లోనే స‌త్యం రెక్కీ చేశారంటూ.. సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. నిప్పులేనిదే పొగ రాదుగా! ఏదో జ‌రిగే ఉంటుంది అనే చ‌ర్చ న‌డుస్తోంది. వంగ‌వీటి రెక్కీ ఆరోప‌ణ‌లు చేసిన వెంట‌నే పోలీసులు వెంకట సత్యాన్ని అదుపులోకి తీసుకున్నారని.. విచార‌ణ‌లో ఖాకీలు చిత‌క్కొట్ట‌డంతో.. సత్యం అపస్మారకస్థితిలోకి వెళ్లి ఆసుపత్రిలో చేరారనే ప్రచారం బెజవాడలో కలకలం రేపింది. అయితే, ఈ ఆరోప‌ణ‌ల‌ను వెంక‌ట స‌త్యనారాయ‌ణ కుమారుడు చ‌ర‌ణ్ ఖండిస్తున్నారు. త‌న తండ్రి బ్రెయిన్ స్ట్రోక్‌తో తీవ్ర అస్వస్థతకు గురై ఆసుప‌త్రిలో చేరార‌ని అంటున్నారు. బెజ‌వాడ లోక‌ల్ టాక్ ఎలా ఉన్నా.. వంగ‌వీటిపై రెక్కీ చేసే అవ‌స‌రం.. వైసీపీ గ్రూపుల‌కు గానీ, దేవినేని వ‌ర్గానికి గానీ మాత్ర‌మే ఉంటుంద‌ని.. ఇత‌రులెవ‌రికీ వంగ‌వీటిని చంపాల్సినంత అవ‌స‌రం ఉండ‌ద‌ని బెజ‌వాడ గొడ‌వ‌ల గురించి తెలిసివారంతా అంటున్నారు.  మ‌రోవైపు.. రెండు నెలల క్రితం వంగ‌వీటి చేసిన వ్యాఖ్య‌లు మ‌రోసారి తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. అప్ప‌డు ఖమ్మం జిల్లా కొత్తపాలెం గ్రామంలో జరిగిన రంగా విగ్రహావిష్కరణలో వంగవీటి మాట్లాడుతూ.. "ఐకమత్యమే మన బలం.. ఉన్నవాళ్లనైనా ఆవేశంతో, ఆలోచనతో కాపాడుకోవాలి" అని పిలుపునిచ్చారు. ఆనాడు చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగానే, తన హత్యకు కుట్ర జరుగుతోందని తాజాగా రంగా వర్ధంతి సందర్భంగా రాధా స్టేట్‌మెంట్ ఇచ్చి ఉంటార‌ని అంటున్నారు. ఏపీలో జనాభా పరంగానే కాకుండా అతిపెద్ద ఓటు బ్యాంకుగా ఉన్న కాపు సామాజిక వర్గానికి నాయకత్వం వహించేందుకు వంగ‌వీటి రాధాకృష్ణ రెడీ అయ్యార‌ని.. అందులో భాగంగానే పొలిటిక‌ల్ అటెన్ష‌న్ త‌న‌వైపు డైవ‌ర్ట్ చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌నే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. కార‌ణం, రాజ‌కీయం ఏదైనా.. వంగ‌వీటి రాధా రెక్కీ ఆరోప‌ణ‌లు మాత్రం బెజ‌వాడ‌ను మ‌రోసారి ఉలిక్కిప‌డేలా చేస్తున్నాయి. విజ‌య‌వాడ పాలిటిక్స్ మ‌ళ్లీ హాట్ హాట్‌గా మారాయి. 

ప్రజల ప్రాణాల కంటే పైసలే ముఖ్యమా కేసీఆర్! 

ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వైరస్ మన దేశంలోనూ క్రమంగా విస్తరిస్తోంది. దేశంలో ఇప్పటికే ఒమిక్రాన్ కేసులు 7 వందలు దాటేశాయి. ఢిల్లీ, మహారాష్ట్ర తర్వాత తెలంగాణలో అత్యధిక ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కొత్త వేరియంట్ విస్తరిస్తుండటంతో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తో వైరస్ మరింతగా విస్తరించే అవకాశం ఉండటంతో కఠిన ఆంక్షలు విధించాయి. చాలా రాష్ట్రాలు డిసెంబర్ 31, జనవరి1న ఆంక్షలు విధించాయి. న్యూ ఇయర్ వేడుకలను రద్దు చేశాయి. ఢిల్లీ సర్కార్ ఏకంగా సినిమా థియేటర్లు, స్కూళ్లను బంద్ చేసింది. మాల్స్, వైన్స్ ను సరి-బేసి విధానంలో అనుమతి ఇస్తోంది. రాత్రి పూట కర్ఫ్యూ విధించింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్ లో నైట్ కర్ఫ్యూ అమలవుతోంది. కేరళ సర్కార్ కూడా న్యూఇయర్ వేడుకలపై నిఘా పెట్టింది.  అయితే దేశంలో ఒమిక్రాన్ కేసుల్లో మూడో స్థానంలో ఉన్న తెలంగాణ సర్కార్ మాత్రం ఏమి పట్టనట్లుగా వ్యవహరిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. మిగితా రాష్ట్రాలు డిసెంబర్ 31న జనాలు రోడ్లపై రాకుండా ఆంక్షలు విధిస్తే.. తెలంగాణ సర్కార్ మాత్రం అంతా గుమిగూడేలా చర్యలు తీసుకుంది. అర్ధరాత్రి వరకు  మద్యం అమ్మ‌కాల వేళలు పొడిగించింది. న్యూ ఇయ‌ర్ సందర్భంగా డిసెంబరు 31న.. అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్స్‌ తెరిచేందుకు ప‌ర్మిష‌న్ ఇచ్చేసింది. 31వ తేదీ రాత్రి ఒంటి గంట వరకు న్యూఇయ‌ర్‌ ఈవెంట్ల నిర్వహణకు ప్రత్యేక అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి ఈవెంట్ల నిర్వహణకు ఎక్సైజ్‌శాఖ తాత్కాలిక లైసెన్స్‌లు జారీ చేయనుంది.  అర్థ‌రాత్రి అంద‌రికీ హ్యాపీ న్యూఇయ‌ర్ చెప్పేవ‌ర‌కూ.. ఫుల్‌గా తాగొచ్చు. తాగినోళ్ల‌కి తాగినంత మందు అందుబాటులో ఉంచ‌డ‌మే కేసీఆర్ స‌ర్కారు ల‌క్ష్యంగా కనిపిస్తోంది. దీనిపైనే ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరిగిపోతున్నా.. ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తుందని జనాలు మండిపడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల కంటే పైసలే ముఖ్యమైన్నట్లుగా ఉందని ఆరోపిస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఘాటుగా స్పందించారు. కేసీఆర్ కు ప్రజల ప్రాణాలంటే లెక్కలేకుండా పోయిందంటూ ఆయన ట్వీట్ చేశారు.    

చొక్కాలు పట్టుకుని కొట్టుకున్న ఎంపీలు.. 

పార్లమెంట్ అంటే ఆ దేశానికి అత్యున్నత చట్టసభ. పాలనకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు, చట్టాలు చేయడానికి వేదిక. పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య చర్చలు హాట్ హాట్ గా సాగుతుంటాయి. పరస్పర విమర్శలు.. సవాళ్లు కూడా ఉంటాయి. ప్రభుత్వం తీరును నిరసిస్తూ విపక్షాల ఆందోళనలు చేస్తుంటాయి. అయితే పార్లమెంట్ లో జరిగే చర్చలు హుందాగా ఉండాలని జనాలు కోరుకుంటారు. కాని అక్కడ ప్రజా ప్రతినిధులే రెచ్చిపోయారు. గౌరవరప్రదమైన పదవుల్లో ఉన్నామని మర్చిపోయి, విచక్షణ మరిచి చిల్లరగా వ్యవహరించారు.  జోర్డాన్‌ పార్లమెంట్‌లో ఎంపీలు కొట్టుకున్నారు.  ఓ అంశంపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులు పరస్పర దాడికి దిగారు. చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. సమానహక్కులపై తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లుపై జోర్డాన్‌ పార్లమెంట్‌లో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఓ ప్రతిపక్ష ఎంపీ మాట్లాడుతూ.. ఈ బిల్లు పనికిరానిదంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో అధికార పార్టీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఎంపీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇందుకు సదరు సభ్యుడు నిరాకరించడంతో ఇరు పక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.    ఇది కాస్తా చినికి చినికి తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఎంపీలు తమ సీట్లలో నుంచి లేచి ఒకరినొకరు తోసుకున్నారు. కొందరు ఎంపీలు చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. ఇదంతా అక్కడి మీడియా ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారమైంది. ఎంపీల బాహాబాహీతో సభ వాయిదా పడింది. ఎంపీల కొట్లాటకు సంబంధించిన దృశ్యాలను కొందరు మీడియా ప్రతినిధులు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయగా.. ప్రస్తుతం ఈ వీడియోలు వైరలయ్యాయి. అయితే ఈ ఘర్షణల్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పార్లమెంటరీ వర్గాలు వెల్లడించాయి. 

వైసీపీ ఎమ్మెల్యేలపై కార్యకర్తల తిరుగుబాట్లు.. ఓటమి భయం పట్టేసిందా? 

ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుందా? ఎమ్మెల్యేలకు భవిష్యత్ చిత్రం కనిపిస్తోందా? వైసీపీ కార్యకర్తలు ఎవరి దారి వాళ్లు చూసుకుంటున్నారా? అంటే ఆ పార్టీలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో అవుననే తెలుస్తోంది. నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ అసంతృప్తి కనిపిస్తోంది. స్థానిక నేతలు బహిరంగంగానే బయటికి వచ్చి ఏకంగా జగన్ పాలనపై విమర్శలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలను ఎదిరిస్తున్నారు. పదేళ్లుగా జెండా మోసిన కార్యకర్తలకు విలువ లేదంటూ తిరుగుబాటు చేస్తున్నారు.  అధికారుల వద్ద గౌరవం లేదని, వాలంటీర్లు మాట వినడం లేదని, అధికారంలో ఉన్నామా.. ప్రతిపక్షంలో ఉన్నామో అర్థం కాని పరిస్థితి ఉందంటున్నారు వైసీపీ స్థానిక నేతలు. ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తమను పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.  విశాఖపట్నం జిల్లా పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబురావుపై స్థానిక వైసీపీ నేతలు తిరుగుబాటు చేశారు. బంగారమ్మపాలెంలో ఎంపీపీ శారదాకుమారి వర్గానికి చెందిన సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సమావేశమయ్యారు. ఎన్నికల్లో ఎంతో కష్టపడి ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. ఆయన మనకిస్తున్న విలువ ఏదీ?’అంటూ పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. 13 ఏళ్లుగా ఎమ్మెల్యేగా చేసినా మంత్రి పదవి రాలేదంటున్నారు.. మా ఆయన 21 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు.. ఇప్పటికీ తగిన గుర్తింపు రాలేదు.. ఇకపై కూడా రాకుండా చేయాలని చూస్తున్నారు.. మా గోడు ఎవరికి చెప్పుకోవాలంటూ ఎంపీపీ  కంటతడి పెట్టారు. కులం, డబ్బుకు ఎమ్మెల్యే ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం కావడం లేదన్నారు ఎంపీపీ భర్త బొలిశెట్టి గోవిందరావు. బాబూరావు ఓడిపోతారని పందెం కాసిన వారికి ప్రాధాన్యం ఇస్తూ.. ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన నాయకులను చులకనగా చూస్తున్నారని ఆరోపించారు. ఇకపై తాను ఎమ్మెల్యే ముఖం చూడనని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఒత్తిడితో తిమ్మాపురం పంచాయతీ రికార్డులను డీఎల్‌పీవో తీసుకువెళ్లడం ఏంటని ప్రశ్నించారు. సర్పంచుల చెక్‌ పవర్‌ రద్దు చేయాలని చూస్తున్న ఎమ్మెల్యే మనకు అవసరం లేదన్నారు.  సీఎం జగన్ సొంత గడ్డ కడప జిల్లాలోనూ వైసీపీలో వర్గ పోరు రోడ్డెక్కింది. రాజంపేట నియోజకవర్గంలో ఇరువర్గాల మధ్య విభేదాలు కాసేపు ఉద్రిక్తతకు దారితీశాయి. రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథరెడ్డి సమక్షంలోనే  సుండుపల్లి మండలంలో  ఆయా వర్గాలు తోపులాటకు దిగాయి. వైఎస్‌ఆర్‌ ఆసరా చెక్కుల పంపిణీ సభ ముగియగానే  ఎమ్మెల్యే వెంట ఆయనకు వరుసకు సోదరుడయ్యే, మండలంలో పార్టీ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న మేడా విజయశేఖర్‌రెడ్డి, మరికొందరు లోపలికి ప్రవేశించారు. అప్పటికే లోపల నేతలు... తాము ఎంపీ, ఎమ్మెల్యేలతో మాట్లాడాలని, మీరు కాసేపు బయటికి వెళ్లండని విజయశేఖర్‌రెడ్డిని కోరారు. ఆయన బయటికి వెళుతుండగా.. ‘మా నాయకుడినే వెళ్లమంటారా? అంత ధైర్యం ఎవరికి ఉంది?’ అంటూ ఆయన అనుచరుడు నాగేంద్ర నాయక్‌ గట్టిగా కేకలు వేశారు. ప్రజాప్రతినిధుల ముందే పరస్పరం తోపులాటకు దిగాయి. కేకలు, అరుపులతో గొడవకు దిగారు.  పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు.  

రాధాకు ఏం జరిగినా జగన్ సర్కార్ దే బాధ్యత! డీజీపీకి చంద్రబాబు లేఖ.. 

తన హత్యకు కుట్ర జరుగుతోందని, ఇందుకోసం రెక్కీ నిర్వహించారని విజయవాడ టీడీపీ నేత వంగవీటి రాధా చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. వంగవీటి రాధాకు ప్రభుత్వం సెక్యురిటీ కల్పించింది. అయితే ప్రభుత్వం కేటాయించిన గన్ మెన్లను వెనక్కి పంపారు రాధా. తనకు కార్యకర్తలే రక్షణగా ఉంటారన్నారు. వంగవీటి రాధా కామెంట్లు, తర్వాత జరుగుతున్న పరిణామాలతో బెజవాడలో ఉద్రిక్తత పరిస్థితులు కనిపిస్తున్నాయి.  టీడీపీ అధినేత చంద్రబాబు వంగవీటి రాధాకు ఫోన్ చేసి మాట్లాడారు. రెక్కీ నిర్వహించిన వ్యవహారంపై చంద్రబాబు వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు.గన్‌మ‌న్లు వ‌ద్దంటూ వంగ‌వీటి రాధా చెప్ప‌డం సరికాదని, వ్యక్తిగత భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇచ్చారు. వంగవీటి రాధాకు టీడీపీ మ‌ద్ద‌తుగా నిలుస్తుందని తెలిపారు. ఎవ‌రైనా కుట్రల‌కు పాల్ప‌డితే అందుకు వ్య‌తిరేకంగా తమ పార్టీ పోరాడుతుంద‌ని చెప్పారు. ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు చంద్ర‌బాబు నాయుడు లేఖ రాశారు. వంగవీటి రాధా హత్యకు జరిగిన రెక్కీపై సమగ్ర విచారణ జరపాలని, నిందితుల‌పై చర్యలు తీసుకోవాలని చంద్ర‌బాబు లేఖలో డిమాండ్‌ చేశారు. ఒక‌వేళ‌ రాధాకు ఏమైనా జ‌రిగితే అందుకు ప్రభుత్వమే బాధ్యత వ‌హించాల‌ని అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి బాగోలేద‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.కొంద‌రు బెదిరింపులకు పాల్ప‌డుతున్నార‌ని, ఇప్పుడు వంగవీటి రాధాను టార్గెట్‌గా చేసుకున్నారని చంద్రబాబు చెప్పారు.  ఏపీలో ఇటువంటి ఘ‌ట‌న‌లు ఆటవిక పాలనను తలపిస్తున్నాయని చంద్రబాబు విమర్శించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చోటు చేసుకుంటోన్న‌ హింసాత్మక ఘటనలపై చర్యలు తీసుకోక‌పోవ‌డంతోనే ఇటువంటివి చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. ఇటువంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటుండ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని చంద్రబాబు అన్నారు. నేర‌స్థుల‌పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. క‌ఠిన చ‌ర్య‌లే రాష్ట్రంలో ప్ర‌జ‌ల ప్రాథ‌మిక హ‌క్కుల‌ను కాపాడ‌తాయ‌ని చంద్రబాబు చెప్పారు.   

సరదాగా.. బొత్స బాబుకు కొట్టాల్సిందే చప్పట్లు...

బొత్స సత్యనారాయణ ఉరఫ్ సత్తి బాబు తెలుసు కదా.. తెలియకుండా ఎందుకుంటారు.. ఆయన పరిచయం అవసంరం లేని పొలిటీషియన్. అంతేకాదు, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో  మంత్రి. అదికూడా అలాంటి .. ఇలాంటి మంత్రి కాదు... సీనియర్ మినిస్టర్. అంతోటి అయన నోటినుంచి ఏదైనా మాట వచ్చిందంటే, అందులో ఎన్నో అర్థాలు, తాత్పర్యాలు ఉంటాయి. అప్పుడెప్పుడో, ఆయన గారు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ కాబినెట్’లో మంత్రిగా ఉన్న రోజులల్లో వోక్సువాగను కార్ల కంపెనీ పట్టుకొస్తామంటే ఓ రూ.11 కోట్లు ప్రజల సొమ్ము వశిష్ట వాహన్ అనే అడ్రసులేని కంపెనీ కిచ్చేశారు. తీరామోసి ఆ సూట్ కేసు కంపెనీ, ఆ సొమ్ములట్టుకుని ఎగిరి పోయింది. అప్పుడు, మన బొత్స బాబు ఏమ్మన్నారు, చాలా సింపుల్’గా, సొమ్ములు పోనాయి అయితే ఏంటంట..అని అసెంబ్లీ సాక్షిగా సెలవీయ లేదు. శ్రీ బొత్స బాబు ఇచ్చిన ఆ సందేశంలో ఎంత విషయముంది.. ఎంత ఇది .. ఎంత అది ఉంది, అందుకే కదా ఇన్నేళ్ళ తర్వాత కూడా ‘సొమ్ములు పోనాయండి’ అన్న శ్రీ బోత్సవారి సందేశం, డామిట్ కథ అడ్డంతిరిగింది న్న గిరీశం డైలాగులా  మనకు గుర్తుండి పోయింది.  ఆ కథను అక్కడ కట్ చేసి ... ప్రెజంట్ ... ప్రస్తుతంలోకి వస్తే, బొత్స వారు మళ్ళీ ఇంతకాలానికి అంతటి ఆణిముత్యం లాంటి మాట ఒకటి వదిలారు .. మూడేళ్ల తర్వాత ఇప్పుడు జగన్‌ పరిపాలన బాగోలేదని గుర్తొచ్చిందా? అని బీజేపీ వాళ్ళను సూటిగా, చాలా స్ట్రెయిట్’ గా ప్రశ్నించారు. నిజమే కదా.. జగన్మోహన్ రెడ్డి పాలన కొత్తగా ఈరోజు చెడిపోయింది ఏముంది? ప్రమాణ స్వీకారం చేసిన తొలి క్షణం నుంచే జగన్ రెడ్డి తానేమిటో .. తన ఒక్క ఛాన్స్ కథేమిటో .. ఎక్కడా ...ఏమాత్రం దాచుకోకుండా, దాపరికం లేకుండా చెపుతూనే ఉన్నారు. చూపిస్తూనే ఉన్నారు. అధికారంలోకి వస్తూ వస్తూనే ప్రజా వేదికను కూల్చేశారు. ఇక అక్కడి నుంచి అన్నీ కూల్చివేతలే. భవనాలే కాదు వ్యవస్థలను కూల్చి వేస్తూనే  ఉన్నారు. వ్యవస్థలనే కాదు .. దేవుళ్ళను .. దేవాలయాలను ... గుళ్ళూ గోపురాలను కూల్చి వేస్తునే ఉన్నారు.ఆర్థిక వ్యవస్థ విషయం అయితే చెప్పనే అక్కరలేదు .. రాష్ట్రానికి  రాజధాని లేదు కానీ, రాష్ట్ర అప్పులు నాలుగు నుంచి ఆరులక్షల కోట్ల రూపాయల వరకు ఉంటాయని అంటున్నారు. ఇవ్వన్నీ కూడా బహిరంగ రహస్యాలే.  కేంద్ర ప్రభుత్వం ఎప్పుడోనే కళ్ళు తెరవవలసింది. ఎందుకైతే ఏం గానీ కల్లు తెరవలేదు. అందుకే .. ఇప్పుడు శ్రీ సత్తిబాబు గుర్తు చేశారు. జగన్ పాలన, ఇప్పుడేమిటి, మూడేళ్ళుగా ఇలాగే ఇలాగే, ఇంతే సుందర ముదనష్టంగానే సాగింది. అవును   మూడేళ్ళుగా బాగాలేదండి .. ఏటి సేత్తాం .. అని ... చక్కగా ఉత్తరాద్ర యాసలో  అడిగారు.అంతే కాదు ఏదైనా తప్పుటే సెప్పండని కూడా ఆఫర్ ఇచ్చారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి జగన్ రెడ్డి అరాచక పాలన చూడమని కేంద్ర ప్రభుత్వానికి చెప్పకనే చెప్పారు. ఇంత చక్కని నిజాన్ని చక్కగా చెప్పిన బొత్స బాబుకు కొట్టాల్సిందే ...చప్పట్లు. ఏమంటారు. 

అవును.. ఆ రెండు పార్టీలు ఒకటయ్యాయి! 

తెలంగాణ రాజకీయాలలో మూడు ముక్కలాట సాగుతోంది. ఓ వంక అధికార తెరాస,అధికారాన్ని నిలుపుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. మరో వంక కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రంపై పట్టు బిగించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో హుజూరాబాద్ ఓటమి పర్యవసానంగా తెరపై కొచ్చిన ‘వరి’ వివాదం, గత నెలరోజులకు పైగా రాష్ట్ర రాజకీయాన్ని కుదిపేస్తోంది. ఏరోజుకారోజు కొత్త మలుపు తిరుగుతోంది. అయితే, వరి విషయంగా బీజేపీ, తెరాసల మది సాగుతున్న, సో ..కాల్డ్ ‘యుద్దం’ నిజం యుద్ధమా ? ఉత్తుత్తి పోరాటమా?  అంటే రెండోదే నిజం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.  రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజీపీ, ఒకరి పై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇంపుగా బురద జల్లుకుంటున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలు, తిట్లు, చీవాట్లు, శాపనార్ధాలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు .. ఇలా ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎవరి ‘పోరాట’ పటిమను వారు చూపుతున్నారు. మొత్తానికి రాష్ట్రంలో కారు, కమలం తప్పించి మూడో పార్టీ లేదనే  భ్రమలను సృష్టించేందుకు, రెండు పార్టీల నాయకులు  పొలిటికల్ డ్రామాను ఇంతవరకూ అద్భుతంగ రక్తి కట్టించారు. డమ్మీ ఫైట్’ని ఒరిజినల్ అనిపించేలా రెండు పార్టీల నాయకులు మహా నటులను మరిపించే విధంగా డ్రామాను పండించారు. అయితే, మొదటి నుంచి కూడా టీపీసీసీ  అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రనిది అద్దంకి దయాకర్ ఇతర నాయకులు, ఇది కేంద్రంలో అధికారంలో ఉన్న కమల దళం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న గులాబీ పార్టీ, ‘సంయుక్తం’ గా ఆడుతున్న నాటకమని, మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారమని చెపుతూనే ఉన్నారు. ‘నేను కొట్టి నట్టు చేస్తాను .. నువ్వు ఏడ్చి నట్లు చేయి’ అన్నట్లుగా ఢిల్లీ బాసులు, గల్లీ లీడర్లు కలిసి ఆడుతున్న దొంగ నాటకమని రేవంత్ రెడ్డి పలు సందర్భాలలో ఆరోపించారు.  అలాగే, రేవంత్ రెడ్డి సారధ్యంలో జనంలోకి దూసుకు పోతున్న కాంగ్రెస్ పార్టీని  నిర్వీర్యం చేసేందుకే, వరి వివాదం విషయంలో బీజేపీ తెరాస రాజకీయ  ‘జుగల్ బందీ’ నడిపించారని పరిశీలకులు పేర్కొంటున్నారు. నిజానికి  బీజేపీ, తెరాసల మధ్య ఫెవికాల్ సీక్రెట్ బంధం ఉందనేది అందరికీ తెలిసిన విషయమే అంటున్నారు.ఇంతకాలం బీజేపీ,తెరాసల మధ్య ఉన్న చీకటి బంధం ఇప్పుడు ఓపెనైపోయింది  కేంద్ర ప్రభుత్వం వానా కాలం పంటను పూర్తిగా కొంటామని, లిఖితపూర్వకంగా లేఖ ఇస్తేనే కానీ, ఢిల్లీ వదిలేది లేదని ప్రగల్బాలు పలికిన మంత్రులు ... ఆ తర్వాత కొద్ది గంటలకే  ఎవరికీ చెప్పాపెట్టకుండా, తట్టాబుట్టా సర్దేశారు.అక్కడితోనే సగం డ్రామా తేలిపోయింది.ఇక ఆ తర్వాత బీజేపీని వెంటాడతాం, వేటాడటం అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు తెరాస నాయకులు ఎవరూ కూడా వరి మాటే తీయలేదు. ఎత్తిన కత్తులను మడిచేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ‘ఫార్మర్’  హౌస్ ‘వరి’ గుట్టును బయట పెట్టడంతో కుక్కిన పేనులా ఉండి పోయారు’  నిన్న మొన్నటి  వరకు వరి పేరున వీరంగం వేసిన బీజేపీ నాయకులు,  ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించారు. ‘వరి’ సమస్యను పక్కన పెట్టి, నిరుద్యోగ సమస్యను తెరమీదకు తెచ్చారు. బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ  చేయాలానే డిమాండ్’తో పార్టీ  కార్యాలయంలో ఒక రోజు దీక్ష చేశారు. అలాగని నిరుద్యోగ సమస్యను అడ్రస్ చేయడం, సమస్య పరిష్కారం కోసం దీక్ష చేయడం తప్పని కాదు. కానీ, అందుకు ఎంచుకున్న సమయం మీదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి . ఓ వంక పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి  ఎర్రవల్లి ‘ఫార్మ్ హౌస్’  వద్ద వరి రైతులకు న్యాయం చేయాలనే డిమాండ్’తో రచ్చ బండ కార్యక్రమం నిర్వహిస్తున్న రోజునే బండి సంజయ్ దీక్ష చేయడం, వరి సమస్యను పక్కదారి పట్టించేందుకే అనుకోవలసి వస్తోంది. అందుకే రేవంత్ రెడ్డి రైతుల సమస్యల విషయంలో బీజేపీ, తెరాస మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని ఆరోపించారు. నిజానికి ఒక్క వరి  విషయంలోనే కాదు, ఇంకా అనేక  విషయాల్లో కూడా బీజేపీ, తెరాస రహస్య మిత్రులు అనేది  అందరికి తెలిసిన బహిరంగ రహస్యం. ఇప్పుడు అదే నిజం మరోమారు రుజువైంది .. అందుకే రాజకీయ విశ్లేషకులు కాంగ్రెస్ పార్టీని మట్టు పెట్టేందుకు అ రెండు పార్టీలు ఒకటయ్యాయని అంటున్నారు.

బీజేపీని గెలిపిస్తే రూ.50కే చీప్ లిక్కర్.. సోము వీర్రాజు బంపర్ ఆఫర్

మందు బాబులకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు బంపర్ ఆఫర్ ఇచ్చారు. బీజేపీకి అధికారం ఇస్తే 70 రూపాయలకే చీప్ లిక్కర్ అందిస్తామని హామీ ఇచ్చారు. విజయవాడ లో నిర్వహించిన బీజేపీ జనాగ్రహ సభలో  సోము వీర్రాజు ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో ప్రభుత్వమే పచ్చిసారా కాస్తూ.. రూ.3రూపాయల మద్యాన్ని రూ.25 రూపాయలకు కొని రూ.250కి విక్రయిస్తున్నారు. బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్ పేరుతో చెత్త బ్రాండ్లను తీసుకొచ్చి అమ్మేస్తున్నారన్నారు. బీజేపీకి ఓటు వేస్తే రూ.70 చీప్ లిక్కర్ ఇస్తాం... ఆదాయం బాగుంటే రూ.50కే ఇస్తామని హామీ ఇచ్చారు. మద్యం రూపంలో ప్రజలను దోచి మళ్లీ వారికే ఇస్తున్నారని ఆరోపించారు. ప్రజల కోరికను తీర్చే సత్తా బీజేపీకే ఉందని సోము వీర్రాజు ధీమావ్యక్తం చేశారు. బీజేపీకి అధికారం ఇస్తే మూడేళ్లలో రాజధాని అమరావతిని పూర్తి చేస్తామని సోము వీర్రాజు చెప్పారు. రాజధానిలో రైతుల సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు.  అమరావతిని రాజధానిగా బీజేపీ నమ్మిందని.. అందుకే ఇక్కడే తాము రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మించామని..ఎయిమ్స్ ను కూడా మంగళగిరిలో నిర్మించామన్నారు. అలాగే రాజధాని కోసం వేలకోట్లు ఇచ్చామన్నారు. ఇక ఉత్తరాంద్ర, రాయలసీమను అభివృద్ధి చేసే పార్టీ బీజేపీ అన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామన్నారు.సంక్షేమం అమలులో వైసీపీ కంటే బీజేపీనే ముందుందని వీర్రాజు అన్నారు. జగన్ దగ్గర నవరత్నాలుంటే.. మోదీ దగ్గర 90 రత్నాలున్నాయని చెప్పారు. సీఎం జగన్ పాలన చేతగాక అప్పులు చేస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. సంక్షోభాన్ని ఎదుర్కొని వ్యాక్సిన్ తయారు చేయించి ప్రజల ప్రాణాలు కాపాడిన ఘనత బీజేపీదన్నారు. ఆత్మనిర్భర భారత్ కింద ఏపీకి రూ.50వేల కోట్లు ఇచ్చామని సోము గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం కడితే.. ఏపీ పాలకులు కాంట్రాక్టర్ల వద్ద నుంచి డబ్బులు తీసుకుంటున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. 

మందుబాబుల‌కు గుడ్‌న్యూస్‌.. మిడ్‌నైట్ 12pm వ‌ర‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌..

మందుపార్టీ ముందు ఒక్క పెగ్గుతో స్టార్ట్ అవుతుంది. ఆ త‌ర్వాత పెగ్గు మీద పెగ్గు. పార్టీ రేంజ్‌ను బ‌ట్టి.. ఒక్కొక్క‌రూ వ‌చ్చి చేరుతుంటారు. అలా అలా మందు బాటిళ్లు ఖాళీ అవుతుంటాయి. తాగిందెంతో.. టైమ్ ఎంత అయిందో తెలీనే తెలీదు. మత్తులో.. మ‌జాలో మునిగిపోతుంటారు మందుబాబులంతా. అదేంటో గానీ.. ఉన్న‌ మందంతా అయిపోయాక‌.. ఇంకో పెగ్గు తాగాల‌నిపిస్తుంది. కానీ, అప్ప‌టికే టైమ్ అయిపోతే..?  షాపులు క్లోజ్ అయితే..? ఆ టార్చ‌ర్ మామూలుగా ఉండ‌దు.. అప్ప‌టివ‌ర‌కూ తాగిందంతా దిగిపోతుంది.. ఎలాగైనా ఇంకో బాటిల్ సంపాదించాల‌ని ఎంత ట్రై చేసినా.. మందు దొర‌క‌డం కాస్త క‌ష్ట‌మే. అక్క‌డ‌క్క‌డా, అప్పుడ‌ప్పుడూ బ్లాక్‌లో స‌రుకు దొరికినా.. ఆ అదృష్టం కొంద‌రికే. ఇక‌, ఆ రోజు డిసెంబ‌ర్ 31 అయితే.. మిడ్‌నైట్‌.. మాంచి జోష్ మీదున్న‌ప్పుడు వైన్స్ మూసేస్తే..? అబ్బో ఊహించుకోవ‌డ‌మే చానా క‌ష్టం. ఆ బాధ ఎలా ఉంటుందో.. మందుబాబుల‌కే తెలుసు. అందుకే, మందుబాబుల మన‌సెరిగి న‌డుచుకునే తెలంగాణ స‌ర్కారు వారికో బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది. అదేంటంటే..... తెలంగాణలో మందుబాబులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. న్యూ ఇయ‌ర్ సందర్భంగా మద్యం అమ్మ‌కాల వేళలు పొడిగించింది. డిసెంబరు 31న.. అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్స్‌ తెరిచేందుకు ప‌ర్మిష‌న్ ఇచ్చేసింది. అర్థ‌రాత్రి అంద‌రికీ హ్యాపీ న్యూఇయ‌ర్ చెప్పేవ‌ర‌కూ.. ఫుల్‌గా తాగొచ్చు. తాగినోళ్ల‌కి తాగినంత మందు అందుబాటులో ఉంచ‌డ‌మే కేసీఆర్ స‌ర్కారు ల‌క్ష్యం. అందుకే, మా మంచి సీఎం అంటున్నారు మందుబాబులంతా. తాగుబోతుల క‌ష్టాలు కేసీఆర్‌కే క‌రెక్ట్‌గా తెలుసంటూ జేజేలు ప‌లుకుతున్నారు. 31వ తేదీ రాత్రి ఒంటి గంట వరకు న్యూఇయ‌ర్‌ ఈవెంట్ల నిర్వహణకు ప్రత్యేక అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి ఈవెంట్ల నిర్వహణకు ఎక్సైజ్‌శాఖ తాత్కాలిక లైసెన్స్‌లు జారీ చేయనుంది. అయితే, ఈవెంట్లలో పాల్గొనేవారి సంఖ్యను బట్టి  లైసెన్స్‌ఫీజు రూ.50వేల నుంచి 2.5లక్షలుగా ఎక్సైజ్‌శాఖ నిర్ణయించింది. అంటే, డిసెంబ‌ర్ 31 నైట్ ఇటు గ్లాసుల గ‌ల‌గ‌ల‌.. అటు స‌ర్కారు ఖ‌జానాకు కాసుల గ‌ల‌గ‌ల‌.

జైలు ఖాయమట.. వివేకా కేసులో ట్విస్ట్.. బార్ ఓపెన్.. టాప్ న్యూస్@7PM

విజయవాడలో బీజేపీ నిర్వహించిన ప్రజా ఆగ్రహ సభలో పాల్గొన్న కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ పార్టీలు అవినీతికి పాల్పడుతున్నాయని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, వైసీపీ పాలనలో  విచ్చలవిడిగా అవినీతి జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చాలామంది నేతలు బెయిల్‌పై బయట ఉన్నారని, వారంతా త్వరలోనే జైలుకు వెళ్తారంటూ హాట్ కామెంట్స్ చేశారు ప్రకాశ్ జవదేకర్-------ఏపీ ప్రభుత్వంపై బీజేపీ నేత, ఎంపీ సుజనాచౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఏం జరుగుతోందని కేంద్ర హోంశాఖ నిత్యం నిఘా వేస్తోందన్నారు. అధికార పార్టీ తప్పిదాలకు సహకరించే పారిశ్రామిక వేత్తలపైనా కేంద్రం కన్నేసిందని తెలిపారు. చట్ట విరుద్ధంగా వ్యవహరించే అధికారులపైనా నిఘా పెట్టిందని అన్నారు.ప్రతిపక్షంగా ఏం చేయాలో టీడీపీ అది చేస్తే మంచిదని సుజనాచౌదరి హితవుపలికారు.  ------ జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ముఖ్యమంత్రి జేబులో నుంచి ఇస్తున్నారా? అని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. కేంద్రం కూడా నిధులు ఇస్తోందని, మరి జగనన్న పేరు ఏంటని నిలదీశారు. ప్రభుత్వం ఖర్చుతో ఇష్టానుసారంగా పార్టీ పేరు మీద ప్రకటనలు ఇస్తున్నారని ఆరోపించారు. సమాచార శాఖ కార్యదర్శికి అసలు బుద్ధి ఉందా? అని ప్రశ్నించారు. - జగన్ ప్రభుత్వానికి ఎవరైనా ఒకటేనని మంత్రి పేర్ని నాని అన్నారు. సినిమా థియేటర్లపై కక్షసాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించడం సరికాదని అన్నారు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే వ్యత్యాసం తమ ప్రభుత్వానికి లేదని చెప్పారు. చంద్రబాబు తన బామ్మర్ది తీసిన చారిత్రాత్మక చిత్రానికి పన్ను మినహాయింపులు ఇచ్చారని.. చిరంజీవి సినిమాకు అడిగినా మినహాయింపులు ఇవ్వలేదని తెలిపారు. ---- మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తోంది. తాజాగా వైఎస్ వివేకా మాజీ పీఏ కృష్ణారెడ్డి మరో సంచలన ఆరోపణలు చేశారు. సీబీఐ అధికారులు కొందరి పేర్లు చెప్పాలని తనను బెదిరించారని పులివెందుల కోర్టులో  ఫిర్యాదు చేశారు. సిబిఐ అధికారులు తనను అనేకమార్లు పులివెందుల నుంచి ఢిల్లీకి పిలిచి విచారణ చేసి తనను ఇబ్బందులకు గురి చేశారని, తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగం చేశారని కోర్టుకు ఇచ్చిన ఫిర్యాదులో  పేర్కొన్నారు.  ------ మంత్రి గుమ్మనూరు జయరాం వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హోళగుంద మండలం పెద్ద గోనేహల్ రహదారి విషయంలో మంత్రి స్థానికుడితో మాట్లాడారు. ‘‘కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ కాపీపై సంతకం చేయమని ఎంపీడీవోకు చెప్తానని, వినకపోతే రివర్స్ కేసు పెట్టిస్తానని ఎంపీడీవోను బెదిరిస్తానంటూ మంత్రి గుమ్మనూరు జయరాం ఆడియోపై స్థానికంగా విమర్శలు గుప్పిస్తున్నారు. మంత్రి  బీసీ సామాజిక వర్గానికి మద్దతు పలుకుతున్నారంటూ ఆలూరులో దళితులు ధర్నాకు దిగారు.  ---- తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం వైకుంఠ ద్వారాలు 10 రోజుల పాటు తెరుచుకోబోతున్నాయి. జనవరి 13 నుంచి 22వ తేదీ వరకు వైకుంఠ ద్వారాలను తెరుస్తున్నామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. భక్తులకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార ప్రవేశం కల్పిస్తామని చెప్పారు.ప్రతి ఏడాది వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఏకాదశి, ద్వాదశి రెండు రోజులు మాత్రమే ఈ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు.  --- ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి మరో ఆరు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అదనంగా తెలంగాణ నుంచి కేంద్రం సేకరించనుంది. ఇదే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వానికి  కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ సమాచారం ఇచ్చారు. రాష్ట్రం నుంచి 46 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేంద్రం తీసుకోనుంది. దాంతో కేంద్రం కోసం 68.65 లక్షల టన్నుల వరిధాన్యాన్నిరాష్ట్ర ప్రభుత్వం సేకరించనుంది.  ----- తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ పెంచని చార్జీలు లేవంటూ వైఎస్ షర్మిల విమర్శించారు. మొన్న ఆర్టీసీ చార్జీలు, ఇవాళ కరెంట్ చార్జీలు పెంచారని ఆరోపించారు. 50 యూనిట్లలోపు విద్యుత్‌ వాడుకునే పేదలను కూడా వదలడం లేదని మండిపడ్డారు. ఏడాదికి రూ.6,800 కోట్ల లోటును పూడ్చేందుకే.. సామాన్యుడిపై విద్యుత్‌ భారాన్ని మోపారన్నారు. దొర పోకడల వల్ల తెచ్చిన అప్పులపై.. మిత్తిని ప్రజల నుంచే వసూల్ చేస్తున్నారన్నారు ---- నిమ్మళంగా ఉండే పరిస్థితుల్లో ఉండాలని కోరుకోవడానికి బదులుగా సవాళ్ళను ఎంచుకోవాలని విద్యార్థులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇప్పుడు కొత్తవాటి గురించి భయం అనేదే లేదన్నారు. యావత్తు ప్రపంచాన్ని తెలుసుకునే సత్తా విద్యార్థులకు ఉందన్నారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ   కాన్పూరు 54వ స్నాతకోత్సవంలో ప్రధాని మోడీ మాట్లాడారు.

అమ‌రావ‌తి పేరెత్త‌వా వీర్రాజు? బెజ‌వాడ బీజేపీ స‌భ అట్ట‌ర్‌ఫ్లాప్‌!

'థు' అంటారో.. 'థు' 'థు' అంటారో అనుకున్నారంత‌. అంత‌న్నారు.. ఇంత‌న్నారు.. విజ‌య‌వాడ స‌భ‌తో జ‌గ‌న్ దుమ్ముదులిపేస్తామ‌న్నారు. కానీ, ర‌హ‌స్య స్నేహితుడిని నోటికొచ్చిన‌ట్టు తిట్ట‌డానికి బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజుకు నోరు రాలేన‌ట్టుంది. పైపైన నాలుగు మాట‌లు అనేసి మైకు ప‌క్క‌న‌పెట్టేశారు. ఎప్ప‌టిలానే టీడీపీపై నోరు పారేసుకున్నారు. ఈసారి క‌మ్యూనిస్టుల‌పై వీర్రాజు వారు వీరంగం వేయ‌డం ఇంట్రెస్టింగ్ పాయింట్.  టీడీపీ, వైసీపీ ప్ర‌భుత్వాలు ఏపీని అభివృద్ధికి దూరం చేశాయ‌ని సోము వీర్రాజు అన్నారు. ప్ర‌త్యేక హోదాను వ‌ద్ద‌న్న‌దీ చంద్రబాబేన‌ట‌. ఇలా సాగింది సోము స్పీచ్‌. ఇంత‌కీ, విజ‌య‌వాడ స‌భ‌లో టీడీపీ టాపిక్ ఎందుకో ఆయ‌న‌కే తెలియాలంటున్నారు. విజ‌య‌వాడ‌లో బీజేపీ స‌భ పెట్టింది టీడీపీని తిట్ట‌డానికో.. వైసీపీని తిట్ట‌డానికో..? ఎప్ప‌టిలానే అల‌వాటు ప్ర‌కారం ఫ్లోలో వీర్రాజు నోటి నుంచి రొటీన్ డైలాగ్స్ వ‌చ్చాయంటున్నారు.  ఇక‌, టీడీపీతో పాటు.. క‌మ్యూనిస్టుల వెన‌కా ప‌డ్డారు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు వీర్రాజు. యూనియన్ల పేరుతో పాఠశాలలను సర్వనాశనం చేసింది కమ్యూనిస్టులే. పేదపిల్లల ఆహార నిధులనూ దోచుకున్నారు. ట్రేడింగ్‌ పార్టీలకు ఏజెంట్లు కమ్యూనిస్టు పార్టీలు.. ఇలా విశాఖ‌లో మిన‌హా ఏపీలో అంత‌గా యాక్టివ్‌గా లేని కామ్రేడ్ల గురించి ఏవేవో ఆరోప‌ణ‌లు చేశారు వీర్రాజు. ఏ ర‌హ‌స్య స్నేహితుడికి అనుకూలంగా ఇలా టీడీపీ, క‌మ్యూనిస్టుల‌పై విరుచుకుప‌డ్డారో? అంటున్నారు. నిధులిస్తున్న‌ది కేంద్ర‌మేన‌ని.. ప‌థ‌కాల‌న్నీ కేంద్రానివేన‌ని.. బీజేపీదే అధికార‌మ‌ని.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుతున్నదీ బీజేపీనే అని..  ఇలా చెప్పుకుంటూ పోయారే కానీ.. మిగ‌తా బీజేపీ నాయ‌కుల్లా సోము వీర్రాజు నేరుగా జ‌గ‌న్‌రెడ్డిని అటాక్ చేసింది లేద‌నే విమ‌ర్శలు వెల్లువెత్తుతున్నాయి.   ఇక, విజ‌య‌వాడ‌లో బీజేపీ భారీ బ‌హిరంగ స‌భ అంటే.. బెజ‌వాడ ద‌ద్ద‌రిల్లేలా "జై అమ‌రావ‌తి" నినాదాలు చేస్తార‌ని అనుకున్నారంతా. కానీ, బీజేపీ నేత‌ల నోటినుంచి.. స్ప‌ష్టంగా చెప్పాలంటే రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు.. అస‌లేమాత్రం అమ‌రావ‌తి పేరే ఎత్త‌క‌పోవ‌డం.. రాజ‌ధాని ఊసే ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం దారుణ‌మైన విష‌యం అని మండిప‌డుతున్నారు. అమ‌రావ‌తి స‌మీపంలో మీటింగ్ పెట్టి.. కీల‌క‌మైన రాజ‌ధాని టాపిక్ మాట్లాడ‌క‌పోవ‌డాన్ని అంతా త‌ప్పుబ‌డుతున్నారు. అమిత్‌షా అంత గ‌ట్టిగా చెప్పిన త‌ర్వాత కూడా.. సోము వీర్రాజు లాంటి నేత‌లు మార‌రా? అమ‌రావ‌తికి అంతఃక‌ర‌ణశుద్ధితో మ‌ద్ద‌తు ప‌ల‌క‌రా? రాజ‌ధాని అంశం లేకుండా.. విజ‌య‌వాడ స‌భ‌కు ఇక అర్థం ఏముంటుంది? జ‌గ‌న్‌ను దోషిగా నిల‌బెట్ట‌కుండా.. టీడీపీ, సీపీఐ, సీపీఎంల‌ను టార్గెట్ చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం? అంటూ నిల‌దీస్తున్నారు రాజ‌ధాని ప్ర‌జ‌లు. అందుకే, బీజేపీ నైజం తెలిసే.. భారీ బ‌హిరంగ స‌భ అని ప్ర‌గ‌ల్బాలు ప‌లికినా.. జ‌నం ఎవ‌రూ రాలేద‌ని.. వ‌చ్చిన ఆ వంద‌ల మంది కూడా బీజేపీ కార్య‌క‌ర్త‌లు, సానుభూతిప‌రులేన‌ని పెద‌వి విరుస్తున్నారు. వైసీపీకి బీజేపీ 'బి' టీమ్ అని.. జ‌గ‌న్‌-వీర్రాజు-విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డిలు అంతా ఒకే బ్యాచ్ అని తెలిసే.. ప్ర‌జ‌లు బీజేపీని ఎప్పుడో ప‌క్క‌న‌పెట్టేశార‌ని.. అంటున్నారు. అందుకే, జ‌నాద‌ర‌ణ లేక బెజ‌వాడ బీజేపీ స‌భ వెల‌వెల‌పోయింద‌ని చెబుతున్నారు. ముందు బీజేపీ మారాలి.. లేదంటే వీర్రాజు-విష్ణుల‌ను మార్చాలి.. అమ‌రావ‌తికి ముక్త‌కంఠంతో జై కొట్టాలి.. అని జ‌నాలే డిమాండ్ చేస్తున్నారు.

బెయిల్ పై ఉన్నవాళ్లకి త్వరలో జైలు! కేంద్ర మాజీ మంత్రి కామెంట్లతో జగన్ పార్టీ షేక్..

ఏపీలోని వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయా? సీఎం జగన్ త్వరలో జైలుకు పోవడం ఖాయమా? ఈ ప్రచారం ఏపీలో చాలా రోజులుగా సాగుతోంది. అక్రమాస్తుల కేసులో ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్న జగన్మోహన్ రెడ్డి.. త్వరలోనే జైలుకు వెళతారని ప్రతిపక్ష టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందని, త్వరలోనే కేంద్రం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ప్రకటిస్తుందనే వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ రెండు ప్రచారాలకు బలం చేకూరేలా బీజేపీ జాతీయ నేతలు కామెంట్లు చేయడం కలకలం రేపుతోంది. ఏపీలో సంచలనం జరగబోతుందన్న చర్చకు తావిచ్చింది.  విజయవాడలో బీజేపీ నిర్వహించిన ప్రజా ఆగ్రహ సభలో పాల్గొన్న  బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ పార్టీలు అక్రమాలకు పాల్పడుతున్నాయని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని టీఆర్ఎస్, వైసీపీ పాలనలో  విచ్చలవిడిగా అవినీతి జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చాలామంది నేతలు బెయిల్‌పై బయట ఉన్నారని, వారంతా త్వరలోనే జైలుకు వెళ్తారంటూ హాట్ కామెంట్స్ చేశారు ప్రకాశ్ జవదేకర్. ఏపీలో విధ్వంసకర పాలన సాగుతోందని, మద్య నిషేదం  అని చెప్పి మద్యంపై వచ్చిన డబ్బుతోనే  పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, కేంద్ర పథకాలకు రాష్ట్ర స్టిక్కర్లు అంటిస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ కట్టించేది జగనన్న కాలనీలు కాదు.. మోడీ కాలనీలని చెప్పారు. ఏపీలో  నాయకత్వ మార్పు జరిగి తీరుతుందన్నారు జవదేకర్.  వైసీపీ అంటే ఏమీ చేతకాని ప్రభుత్వమని ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు. కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్న నిదులు ఏమవుతున్నాయని ఆయన ప్రశ్నించారు. జగన్ పాలన వల్లే రాష్ట్రం  ఆర్థిక సంక్షోభంలో పడిందని విమర్శించారు. అవినీతిమయం కాని రంగం రాష్ట్రంలో ఏదీ లేదన్నారు జీవీఎల్. ఏపీ ప్రభుత్వంపై బీజేపీ నేత సుజనాచౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫైనాన్షియ‌ల్ ఎమ‌ర్జెన్సీ పెడితే.. రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తి పాల‌న ఖాయమన్నారు. ఏపీలో ఏం జరుగుతోందని కేంద్ర హోంశాఖ నిత్యం నిఘా వేస్తోందన్నారు. అధికార పార్టీ తప్పిదాలకు సహకరించే పారిశ్రామిక వేత్తలపైనా కేంద్రం కన్నేసిందని తెలిపారు. చట్ట విరుద్ధంగా వ్యవహరించే అధికారులపైనా నిఘా పెట్టిందన్నారు సుజనా చౌదరి.  సీఎం జగన్, వైసీపీ పాలనపై  విజయవాడ సభలో ప్రకాశ్ జవదేకర్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో కాక రేపుతున్నాయి. బెయిల్ పై ఉన్న నేతలంతా త్వరలో జైలుకు వెళతారంటూ  సీఎం జగన్ ను ఉద్దేశించే కేంద్ర మంత్రి మాట్లాడారని అంటున్నారు. బీజేపీ సీనియర్ నేత మాటలను బట్టి జగన్ ను కేంద్రం టార్గెట్ చేసినట్లు అర్ధమవుతోందని, త్వరలోనే ఏపీలో సంచనాలు జరగబోతున్నాయనే చర్చ మొదలైంది. ఏపీలో ఫైనాన్షియ‌ల్ ఎమ‌ర్జెన్సీ పెడతారన్న సుజనా వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. అదే జరిగితే ఏపీలో రాష్ట్రపాతన పాలన రావడం ఖాయమని అంటున్నారు. మొత్తంగా విజయవాడ సభలో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ జవదేకర్ చేసిన కామెంట్లు వైసీపీలో కలవరం రేపుతున్నాయని తెలుస్తోంది. బెయిల్, జైలు వ్యాఖ్యలపై సీఎం జగన్ శిబిరం ఆరా తీస్తుందని సమాచారం. 

సీబీఐ అధికారులపైనే కోర్టుకు కంప్లైంట్.. వివేకా కేసులో అసలేం జరుగుతోంది? 

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తోంది. తాజాగా వైఎస్ వివేకా మాజీ పీఏ కృష్ణారెడ్డి మరో సంచలన ఆరోపణలు చేశారు. సీబీఐ అధికారులు కొందరి పేర్లు చెప్పాలని తనను బెదిరించారని పులివెందుల కోర్టులో  ఫిర్యాదు చేశారు. సిబిఐ అధికారులు తనను అనేకమార్లు పులివెందుల నుంచి ఢిల్లీకి పిలిచి విచారణ చేసి తనను ఇబ్బందులకు గురి చేశారని,  కొందరు వ్యక్తుల పేర్లు చెప్పాలని తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగం చేశారని కోర్టుకు ఇచ్చిన ఫిర్యాదులో కృష్ణారెడ్డి తరపు అడ్వకేట్ పేర్కొన్నారు. సీబీఐ అధికారులు తనను వేధిస్తున్నారని పులివెందుల పోలీస్ స్టేషన్ లో, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు లేకపోవడంతో కోర్టులో ఫిర్యాదు చేశామని కృష్ణారెడ్డి తరపు లాయర్ లోకేశ్వర్ రెడ్డి తెలిపారు వివేకా హత్య కేసులో సీఎం జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడైన దేవి రెడ్డి శివశంకర్ రెడ్డిని నవంబర్ 17న అరెస్ట్ చేసింది సీబీఐ. వివేకా హత్య కేసులో మొదటి నుంచి అనుమానితుడిగా ఉన్నారు శివశంకర్ రెడ్డి. వివేకా కూతురు సునీత హైకోర్టుకు ఇచ్చిన అనుమానితుల లిస్టులో ఇతని పేరు ఉంది. కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే శివశంకర్ రెడ్డిని పలు మార్లు విచారించారు సీబీఐ అధికారులు. నవంబర్ 17న హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. శివశంకర్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఈ కేసులో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. నవంబర్ లోనే గంగాధర్‌ రెడ్డి అనే వ్యక్తి వివేకా హత్య కేసుతో నాకు సంబంధం లేదంటూ అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్పను ఆశ్రయించాడు. రూ.10 కోట్లు సుపారీ తీసుకొని అవినాష్‌రెడ్డి, శంకర్‌రెడ్డిలు నాతో వివేకా హత్య చేయినట్లు చెప్పాలంటూ వివేకా కుమార్తె సునీత, సీబీఐ, మడకశిర ఎస్సై, సీఐ శ్రీరామ్‌ లు నన్ను వేధిస్తున్నారని గంగాధర్‌ రెడ్డి ఎస్పీకి వెల్లడించారు. తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని ఎస్పీని కోరాడు. తాజాగా వివేకా పీఏ కృష్ణారెడ్డి సీబీఐపై ఆరోపణలు చేస్తూ కోర్టుకు వెళ్లడం సంచలనంగా మారింది. ఈ కేసులో ఏదో జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సాక్షులు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమై ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తున్నారు. కొత్త కొత్త పేర్లు తెరపైకి తీసుకొస్తున్నారు. దీంతో దర్యాప్తును పక్కదారి పట్టించాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారనే చర్చ సాగుతోంది. హత్య కుట్రకు సంబంధించిన దర్యాప్తు ప్రస్తుతం చాలా కీలక దశలో ఉందని, ఈ సమయంలో వెలుగు చూస్తున్న పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి.  మరోవైపు వివేకా హత్య కేసులో సీబీఐకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. శివశంకర్ రెడ్డికి నార్కో పరీక్షలు చేయాలన్న పిటిషన్​ను ఏపీలోని పులివెందుల కోర్టు కొట్టివేసింది. ఇటీవలే శివశంకర్ రెడ్డిపై అభియోగాలు మోపుతూ న్యాయస్థానానికి నివేదిక ఇచ్చింది సీబీఐ. అందులో సంచలన నిషయాలు వెల్లడించింది. వివేకానందరెడ్డి హత్యకు కుట్ర, ఆయన గుండెపోటుతో చనిపోయారంటూ ప్రచారం చేయాలనే సిద్ధాంతానికి రూపకల్పన చేసిన వారిలో దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ప్రధాన భాగస్వామి అని సీబీఐ తేల్చింది. వివేకా మృతదేహం రక్తపు మడుగులో పడి ఉండటంతో పాటు శరీరంపై తీవ్ర గాయాలు కనిపిస్తున్నప్పటికీ ఆయన గుండెపోటుతో చనిపోయారంటూ ప్రచారం మొదలుపెట్టింది శివశంకర్‌రెడ్డేనని స్పష్టం చేసింది. అదే విషయాన్ని ఆయనే ‘సాక్షి’ టీవీకి కూడా చెప్పారని వెల్లడించింది. వివేకా గుండెపోటుతోనే మరణించినట్లు నమ్మించేందుకు వీలుగా పడక గది, స్నానపు గదిలోని రక్తపు మరకలన్నింటినీ తుడిపించేశారని, ఘటనా స్థలంలో హత్యకు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేశారని వివరించింది. ఆ క్రమంలోనే వివేకా శరీరంపై ఉన్న గాయాలన్నింటికీ గజ్జల జై ప్రకాశ్‌రెడ్డి అనే కాంపౌండర్‌తో బ్యాండేజీ వేయించి కట్లు కట్టించారని తెలిపింది.   

పాత స్కూట‌ర్‌పై షికార్లు.. ఇంట్లో 257 కోట్ల న‌గ‌దు..

ఈ ఫోటో చూసే ఉంటారుగా. యూపీలో జ‌రిగిన ఐటీ రైడ్స్‌లో దొరికిన న‌గ‌దు. బ్యాంక్ అధికారులు 20 క్యాష్ కౌంటింగ్ మిష‌న్ల‌తో నాలుగు రోజులు క‌ష్ట‌ప‌డి లెక్క‌పెడితే.. ఆ మొత్తం 257 కోట్లుగా తేలింది. ఇంతటి సొమ్ము.. అదికూడా నోట్ల క‌ట్ట‌ల‌ రూపంలో ఇంట్లో పెట్టుకోవ‌డంతో ఐటీ సిబ్బందే అవాక్క‌య్యారు. అంతేనా.. నోట్ల క‌ట్ట‌ల‌తో పాటు 23 కిలోల బంగారం.. 250 కిలోల వెండి.. 600 కిలోల గంధపు చెక్కల నూనె.. స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా ప‌ర్‌ఫ్యూమ్ త‌యారీ కంపెనీ య‌జ‌మాని, స‌మాజ్‌వాదీ పార్టీ నేత పియూష్ జైన్ న‌ల్ల దందా అని తేల్చారు.  కాన్పుర్‌కు చెందిన పీయూష్‌ జైన్ 20 ఏళ్లుగా ప‌ర్‌ఫ్యూమ్ బిజినెస్ చేస్తున్నాడు. యూపీతో పాటు ముంబై, గుజరాత్‌లోనూ వ్యాపారాలు ఉన్నాయి. కోట్ల సంపాద‌న ఉన్నా.. పైకి మాత్రం సింపుల్‌గానే ఉంటారు. ఆయ‌న టయోటా క్వాలిస్‌, మారుతి కారులోనే తిరుగుతుంటారు. తన పూర్వీకుల ఊరు కన్నౌజ్‌కు వెళ్లినప్పుడు.. పాత బజాజ్‌ ప్రియ స్కూటర్‌పైనే తిరిగేవాడు. అలాంటి పీయూష్ జైన్ ఇంట్లో 257 కోట్ల న‌గ‌దు ప‌ట్టుబ‌డింద‌ని తెలిసి.. ఆయ‌న స‌న్నిహితులే ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అంత సాదాసీదాగా ఉండేవాడు పీయూష్ జైన్‌. ఇక‌, ఇంత‌టి ఘరానా మోసం ఎలా బయటపడింది? తప్పుడు బిల్లులతో పన్ను ఎగవేతకు పాల్పడిన పీయూష్ జైన్ బండారం ఎలా బ‌ట్ట‌బ‌య‌లైంది? అస‌లు ఐటీ దృష్టి ప‌ర్‌ఫ్యూమ్ కంపెనీపై ఎందుకు ప‌డింది? అనే విష‌యాలు మ‌రింత ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.  కాన్పుర్‌లో జీఎస్‌టీ చెల్లించకుండా సరఫరా చేస్తోన్న, నాలుగు పొగాకు, పాన్‌ మసాలా ట్రక్కులను డీజీజీఐ అధికారులు ప‌ట్టుకున్నారు. ఆ ట్రక్కులు గణపతి రోడ్‌ క్యారియర్‌కు చెందినవని గుర్తించారు. విచారణలో భాగంగా అధికారులు శిఖర్‌ పాన్‌ మసాలా ఫ్యాక్టరీకి వెళ్లారు. అక్కడ గణపతి రోడ్‌ క్యారియర్‌ పేరుతో దాదాపు 200లకు పైగా నకిలీ ఇన్‌వాయిస్‌లు ఉన్నాయి. దీనిపై శిఖర్‌ పాన్‌ మసాలా కంపెనీ యాజమాన్యాన్ని విచారించగా.. పన్ను చెల్లించలేదని వారు అంగీకరించారు. అప్పటికప్పుడు రూ.3.09కోట్లను కూడా డిపాజిట్ చేశారు. అయితే, శిఖర్‌ పాన్‌ మసాలాలో ఒడోకామ్‌ ఇండస్ట్రీస్‌ వాటాలు ఉన్నట్టు అధికారుల దృష్టికి వ‌చ్చింది. ఒడోకామ్ సంస్థ య‌జ‌మానే.. ఈ పీయూష్‌ జైన్‌.  ఒడోకామ్‌ ఇండస్ట్రీస్.. నకలీ ఇన్‌వాయిస్‌లు, ఈ-వే బిల్లులతో ఆ రెండు కంపెనీల ఉత్పత్తులను సరఫరా చేస్తున్నట్టు తేలింది. అల‌ర్ట్ అయిన ఐటీ అధికారులు ఓడోకామ్ కంపెనీ రిజిస్ట్రర్డ్‌ అడ్రస్‌ అయిన పీయూష్ జైన్‌ ఇంటికి వెళ్లారు. తనిఖీలు చేయ‌గా.. రెండు అల్మారాలను తెరిచి చూడగా.. అందులో నీట్‌గా ప్యాక్‌ చేసిన నోట్ల కట్టలు కన్పించాయి. లెక్కిస్తే.. రూ.257 కోట్లుగా తేలింది. అలా పాన్ మ‌సాలా ట్ర‌క్కుల తీగ లాగితే.. ఎస్పీ నేత, ఒడోకామ్ య‌జ‌మాని పీయూస్ జైన్ ఇంట్లో డొంక క‌దిలింది. వంద‌ల కోట్ల న‌ల్ల ధ‌నం వెలుగుచూసింది. 

బలుపు కాదు వాపు! దేశంలో బీజేపీకి 37శాతం ఎమ్మెల్యేలే.. 

దేశంలో ప్రస్తుతం బీజేపీదే హవా.. ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకునే కాంగ్రెస్ కనీసం బీజేపీకి దరిదాపుల్లో కూడా లేదు.. ఇది దేశ జనాల్లో ఉన్న అభిప్రాయం. పార్లమెంట్ ఉభయ సభల సభ్యుల లెక్కలతో పాటు వివిధ రాష్ట్రాల్లోని రూలింగ్ పార్టీల జాబితా తీసినా ఇదే నిజమేనని అనిపిస్తుంది. దేశంలో 29 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ లో ప్రెసిడెంట్ రూల్ అమలులో ఉంది. మిగితా 30 రాష్ట్రాల్లో 18 రాష్ట్రాల్లో బీజేపీనో, దాని మిత్రపక్షమే అధికారంలో ఉంది. అంటే మొత్తంగా దాదాపు 60 శాతానికి పైగా అధికారం కమలం చేతిలోనే ఉంది. కాంగ్రెస్ మాత్రం కేవలం పంజాబ్, ఛత్తీస్ గఢ్ లో మాత్రమే అధికారంలో ఉంది. రాజస్ఖాన్ లో కాంగ్రెస్ పవర్ లో ఉన్నా.. ఆర్జేడీ మిత్రపక్షంగా ఉంది. అంటే కాంగ్రెస్ వాటా కేవలం 10 శాతం మాత్రమే. మిగితా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు, కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నారు.   ఈ జాబితా చూస్తే దేశంలో బీజేపీకి తిరుగేలేదని అర్ధమవుతోంది. అయితే సమగ్రంగా విశ్లేషిస్తే మాత్రం దేశ వ్యాప్తంగా బీజేపీకి కేవలం 37 శాతం ఎమ్మెల్యేలే ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.  దేశంలో  మొత్తం 4139 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అందులో  బిజెపికి 1516 సీట్లే ఉన్నాయి. ఈ లెక్కన దేశంలోని 63 శాతం అసెంబ్లీ సీట్లతో బీజేపీ ఓడిపోయిందని స్పష్టమవుతోంది. బీజేపీకి ఉన్న ఎమ్మెల్యేల్లోనూ 950 సీట్లు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, యూపి, ఎంపి, రాజస్థాన్ వంటి 6 రాష్ట్రాల నుండే ఉన్నారు.అంటే ఈ ఆరు రాష్ట్రాల్లోనే బీజేపీ 65 శాతం మంది ఎమ్మెల్యేలున్నారు. మిగితా 24 రాష్టాల్లో కేవలం 35 శాతం మంది బీజేపీ ఎమ్మెల్యేలే.  31 రాష్ట్రాల్లో బిజెపికి స్పష్టమైన మెజారిటీ ఉంది తొమ్మిది రాష్ట్రాల్లోనే. ఈ లెక్కలనే చూపుతూ కమలం పార్టీకి కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు.  సిక్కిం,  మిజోరం,  తమిళనాడు అసెంబ్లీలో కమలం పార్టీ ఖాతా కూడా తెరవలేదు. 175 సీట్లున్న ఆంధ్రప్రదేశ్ లోనూ బీజేపీకి గుండు సున్నానే. కేరళలో 140 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీజేపీ ఒక్క చోట మాత్రమే గెలిచింది. పంజాబ్ లో 117కు మూడు,  బెంగాల్‌లో 294 అసెంబ్లీ సీట్లకుగాను  3, ఢిల్లీలో 70కి మూడు సీట్లు బీజేపీకి ఉన్నాయి. తెలంగాణలో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక స్థానంలోనే గెలిచినా.. తర్వాత జరిగిన దుబ్బాక, హుజురాబాద్ రెండు ఉప ఎన్నికల్లో గెలవడంతో బీజేపీ బలం మూడుకు పెరిగింది. ఒడిషాలో 147 స్థానాలుండగా 10 మంది బీజేపీ అభ్యర్థులు గెలిచారు. నాగాలాండ్ లో 60 సీట్లు ఉండగా... బీజేపీకి 12 స్థానాలున్నాయి.  బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లోనూ ఆ పార్టీకి పెద్దగా సీట్లు లేవు.  మేఘాలయలో బీజేపీ కూటమి పవర్ లో ఉన్నా.. అక్కడ కమలానికి ఉన్న ఎమ్మెల్యేలు ఇద్దరు మాత్రమే. బీహార్ లో 243 సీట్లు ఉండగా 53 స్థానాలు గెలిచిన బీజేపీ.. జేడీయూతో కలిసి అధికారం పంచుకుంటోంది. గోవాలో బీజేపీ ముఖ్యమంత్రి ఉన్నా... ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఆ పార్టీకి ఉన్న బలం 13 మాత్రమే. ఇక ప్రస్తుతం ప్రెసిడెంట్ రూల్ ఉన్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీ 87 సీట్లు ఉండగా.. బీజేపీ 25 సీట్లు గెలిచింది. ఈ వివరాల ప్రకారం దేశంలో బీజేపీ అత్యంత శక్తివంతంగా ఉందని జరుగుతున్న ప్రచారమంతా ఉత్తదేనని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. 

పీఎం మోదీకి 12 కోట్ల ఖ‌రీదైన బెంజ్‌ కార్‌.. హైఎండ్ సెక్యూరిటీ ఫీచ‌ర్స్‌..

భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ. దేశంలోనే అత్యంత క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఉండే హైప్రొఫైల్ వ్య‌క్తి. ఉగ్ర‌వాదుల భ‌యం పొంచి ఉంటుంది. మావోయిస్టుల ముప్పు త‌క్కువేం కాదు. అంత‌ర్గ‌త‌-బాహ్య శ‌క్తుల నుంచి పెను ప్ర‌మాదం. అందుకే, స్పెష‌ల్ ప్రొటెక్ష‌న్ గార్డ్స్ ర‌క్ష‌ణ‌లో ప్రైమ్ మినిస్ట‌ర్ సుర‌క్షితంగా ఉంటారు. ఆయ‌న భ‌ద్ర‌తా ప్రోటోకాల్‌లో ఏమాత్రం చిన్న‌పొర‌పాటు, బ‌ల‌హీన‌త లేకుండా అత్యంత అప్ర‌మ‌త్త‌త‌తో మెదులుతుంది ఎస్‌పీజీ. లేటెస్ట్‌గా.. పీఎం మోడీ సెక్యూరిటీ కోసం స‌రికొత్త ‘మెర్సిడీస్‌-మైబహ్‌ ఎస్‌-650 గార్డ్‌’ని తీసుకొచ్చింది. ఈ కారు ఖ‌రీదు 12 కోట్ల కంటే ఎక్కువే. ప్ర‌స్తుతం మోదీ ఈ కారునే వాడుతున్నారు.  --‘మెర్సిడీస్‌-మైబహ్‌ ఎస్‌-650 గార్డ్‌’ కారు విఆర్‌-10 స్థాయి భద్రత ప్ర‌మాణాల‌తో ఉంటుంది. సాయుధ దాడుల నుంచి బ‌ల‌మైన ర‌క్ష‌ణ ఇస్తుంది. కారు బాడీ, అద్దాలు.. ఏకే-47 తూటాలను తట్టుకోగ‌ల‌వు. కారు విండోస్‌కు పాలీకార్బొనేట్‌ ప్రొటెక్షన్ ఉంటుంది.  --కారుకు ఈవీఆర్‌ (ఎక్సప్లోజీవ్‌ రెసిస్టెటంట్‌ వెహికల్ ) 2010 రేటింగ్ ఉంది. అంటే, రెండు మీటర్ల దూరంలోపు జరిగే 15 కిలోల టీఎన్‌టీ పేలుడును సైతం తట్టుకునే శక్తి ఉంటుంది. కారు కింద జరిగే పేలుడు నుంచి తట్టుకొనేలా ప్ర‌త్యేక ర‌క్ష‌ణ‌ క‌వ‌చం ఫిక్స్ చేశారు. ఈ కారుకు ప్రత్యేకమైన ఫ్లాట్‌ టైర్లను వినియోగించారు. పంక్చర్లు పడినా.. దెబ్బతిన్నా ఇబ్బంది లేకుండా ప్రయాణించ‌గ‌ల‌దు.  --విషవాయువులతో దాడి జరిగినా.. వాహ‌నం లోపల ఉన్న వారిని రక్షించేలా కారులోపలే ప్రత్యేకమైన ఆక్సిజన్‌ సరఫరా విభాగం ఉంది.   --గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోదీ మహీంద్రా స్కార్పియో వాహ‌నం వాడేవారు. పీఎం అయ్యాక BMW 7 సిరీస్‌ హైసెక్యూరిటీ ఎడిషన్‌‌.. రేంజిరోవర్‌ వోగ్‌.. టయోటా ల్యాండ్‌ క్రూయిజర్‌లను యూజ్ చేశారు. లేటెస్ట్‌గా రెండు మెర్సిడెస్‌ ఎస్‌-650 గార్డ్‌ కార్లను కొనుగోలు చేశారు. ఒక దానిలో ప్రధాని ఉండగా.. మరో కారును డికాయ్ (ప్రధాని ఉన్నట్లు తలపించే వాహనం)గా వినియోగిస్తారు.