పీఎం మోదీకి 12 కోట్ల ఖరీదైన బెంజ్ కార్.. హైఎండ్ సెక్యూరిటీ ఫీచర్స్..
posted on Dec 28, 2021 @ 3:14PM
భారత ప్రధాని నరేంద్ర మోదీ. దేశంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే హైప్రొఫైల్ వ్యక్తి. ఉగ్రవాదుల భయం పొంచి ఉంటుంది. మావోయిస్టుల ముప్పు తక్కువేం కాదు. అంతర్గత-బాహ్య శక్తుల నుంచి పెను ప్రమాదం. అందుకే, స్పెషల్ ప్రొటెక్షన్ గార్డ్స్ రక్షణలో ప్రైమ్ మినిస్టర్ సురక్షితంగా ఉంటారు. ఆయన భద్రతా ప్రోటోకాల్‌లో ఏమాత్రం చిన్నపొరపాటు, బలహీనత లేకుండా అత్యంత అప్రమత్తతతో మెదులుతుంది ఎస్‌పీజీ. లేటెస్ట్‌గా.. పీఎం మోడీ సెక్యూరిటీ కోసం సరికొత్త ‘మెర్సిడీస్-మైబహ్ ఎస్-650 గార్డ్’ని తీసుకొచ్చింది. ఈ కారు ఖరీదు 12 కోట్ల కంటే ఎక్కువే. ప్రస్తుతం మోదీ ఈ కారునే వాడుతున్నారు.
--‘మెర్సిడీస్-మైబహ్ ఎస్-650 గార్డ్’ కారు విఆర్-10 స్థాయి భద్రత ప్రమాణాలతో ఉంటుంది. సాయుధ దాడుల నుంచి బలమైన రక్షణ ఇస్తుంది. కారు బాడీ, అద్దాలు.. ఏకే-47 తూటాలను తట్టుకోగలవు. కారు విండోస్‌కు పాలీకార్బొనేట్ ప్రొటెక్షన్ ఉంటుంది.
--కారుకు ఈవీఆర్ (ఎక్సప్లోజీవ్ రెసిస్టెటంట్ వెహికల్ ) 2010 రేటింగ్ ఉంది. అంటే, రెండు మీటర్ల దూరంలోపు జరిగే 15 కిలోల టీఎన్‌టీ పేలుడును సైతం తట్టుకునే శక్తి ఉంటుంది. కారు కింద జరిగే పేలుడు నుంచి తట్టుకొనేలా ప్రత్యేక రక్షణ కవచం ఫిక్స్ చేశారు. ఈ కారుకు ప్రత్యేకమైన ఫ్లాట్ టైర్లను వినియోగించారు. పంక్చర్లు పడినా.. దెబ్బతిన్నా ఇబ్బంది లేకుండా ప్రయాణించగలదు.
--విషవాయువులతో దాడి జరిగినా.. వాహనం లోపల ఉన్న వారిని రక్షించేలా కారులోపలే ప్రత్యేకమైన ఆక్సిజన్ సరఫరా విభాగం ఉంది.
--గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోదీ మహీంద్రా స్కార్పియో వాహనం వాడేవారు. పీఎం అయ్యాక BMW 7 సిరీస్ హైసెక్యూరిటీ ఎడిషన్.. రేంజిరోవర్ వోగ్.. టయోటా ల్యాండ్ క్రూయిజర్‌లను యూజ్ చేశారు. లేటెస్ట్‌గా రెండు మెర్సిడెస్ ఎస్-650 గార్డ్ కార్లను కొనుగోలు చేశారు. ఒక దానిలో ప్రధాని ఉండగా.. మరో కారును డికాయ్ (ప్రధాని ఉన్నట్లు తలపించే వాహనం)గా వినియోగిస్తారు.