షర్మిల పార్టీలో చేరిన టీఆర్ఎస్ కీలక నేత గట్టు 

వైఎస్ షర్మిల పార్టీలోకి మళ్లీ వలసలు మొదలయ్యాయి. టీఆర్ఎస్ కీలక నేత గట్టు రామచంద్రరావు వైఎస్సార్ టీపీలో చేరారు. పార్టీ అధినేత్రి షర్మిల సమక్షంలో  గట్టు రామచంద్రరావు వైస్సార్‌టీపీ తీర్థం పుచ్చుకున్నారు. గట్టుకు పార్టీ కండవా కప్పి సాదరంగా ఆహ్వానించారు షర్మిల. టీఆర్ఎస్ కీలక నేతగా ఉన్నారు గట్టు రామచంద్రరావు. అధికార ప్రతినిధిగా పార్టీ వాయిస్ ను వివిధ వేదికలపై బలంగా వినిపించారు. ఎమ్మెల్సీ సీటును ఆశించిన ఆయనకు కేసీఆర్ హ్యాండిచ్చారు. దీంతో గులాబీ పార్టీ గుడ్ బై చెప్పి షర్మిల పార్టీలో చేరారు గట్టు రామచంద్రరావు.  వైసీపీ టీపీలో చేరిక తర్వాత మీడియాతో మాట్లాడిన గట్టు.. తెలంగాణలో జాతీయ పార్టీలు ప్రత్యామ్నాయం కావన్నారు. టీఆర్‌ఎస్‌కు వైఎస్సార్ తెలంగాణ పార్టీనే ప్రత్యామ్నాయమని తేల్చిచెప్పారు. షర్మిల చేస్తున్న పోరాటం బీజేపీ, కాంగ్రెస్‌లు చేయడం లేదన్నారు. తెలంగాణలో వైఎస్సార్ లెగసీ ఎక్కడకు పోలేదని తెలిపారు. వైఎస్సార్‌కి జిరాక్స్ కాపిలా షర్మిల కనిపిస్తోందని చెప్పారు. షర్మిల పార్టీలో మహిళలకు ప్రాధాన్యత  పెరుగుతోందన్నారు. బండి సంజయ్‌ను రాజకీయంగా కేసీఆర్ ఎందుకు హైలెట్ చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీతో దోస్తీ కోసమే కేసీఆర్ తపన పడుతున్నారని విమర్శించారు. అందుకే తెలంగాణలో బీజేపీని కేసీఆర్ హైలెట్ చేస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ, కేసీఆర్ కలిసి పని చేస్తారని గట్టు రామచంద్రరావు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు గట్టు రామచంద్రరావు వైఎస్సార్ టీపీలో చేరడంపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. షర్మిల పార్టీలో చేరిన నేతల్లో కొందరికి నెలవారీగా వేతనాలు ఇస్తున్నారనే టాక్ ఉంది. దీంతో గట్టు రామచంద్రరావుకు ప్యాకేజీ ఎంతో అన్న సెటైర్లు టీఆర్ఎస్ వర్గాల నుంచి  వస్తున్నాయి. 

జ‌గ‌న్ మంత్రుల‌కు ఆర్జీవీ స్ట్రాంగ్ కౌంట‌ర్‌.. ప‌రువంతా తీసేశాడుగా...

రామ్‌గోపాల్‌వ‌ర్మ‌. ప‌క్కా వైసీపీ స‌పోర్ట‌ర్‌. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ ఎన్నిక‌ల ముందు టీడీపీని కెలికారు. జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారానికీ హాజ‌ర‌య్యారు. క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు అంటూ మ‌రింత క‌వ్వించారు. ఆ రెండు సినిమాల్లానే ఆర్జీవీ సైతం అట్ట‌ర్‌ఫ్లాప్‌. అప్ప‌టి నుంచీ జ‌గ‌న్-వైసీపీ స‌పోర్ట‌ర్‌గానే ఉంటూ వ‌చ్చారు వ‌ర్మ‌. కాలం గ‌డుస్తున్న కొద్దీ.. జ‌గ‌న్ ఎంత ఖ‌త‌ర్నాకో అంద‌రికీ తెలుసొస్తోంది. ఆర్జీవీకి కూడా బాగా క‌నువిప్పు క‌లిగింది. ఏపీలో సినిమా టికెట్ల రేట్లు త‌గ్గించ‌డాన్ని.. వ‌ర్మ‌ త‌నదైన స్టైల్‌లో విశ్లేషించారు. మంత్రులు పేర్ని నాని, అనిల్ కుమార్ యాద‌వ్‌ల‌కు సినిమా గురించి అసలేమీ తెలీద‌ని తీసిపారేశారు. వాళ్లు చేస్తున్న‌ది ముమ్మాటికీ త‌ప్పు. టికెట్ రేట్లు త‌గ్గించ‌డం ఇల్లాజిక‌ల్‌.. అని సూటిగా, సుత్తిలేకుండా చెప్పేశారు.  ప్రొడ‌క్ట్ త‌యారు చేసిన వాడే.. దాని వాల్యూని, ఎమ్ఆర్పీని నిర్ణ‌యించ‌డం న్యాయం. మ‌ధ్య‌లో గ‌వ‌ర్న‌మెంట్‌కు ఏం అవ‌స‌రం? 100 కోట్ల బ‌డ్జెట్‌కు.. కోటి బ‌డ్జెట్‌కు.. ఒకే టికెట్ ధ‌ర ఉండ‌టం దారుణం. ప్ర‌పంచ స్థాయికి టాలీవుడ్ ఎదుగుతున్న క్ర‌మంలో.. జ‌గ‌న్ ప్ర‌భుత్వ నిర్ణ‌యం ముమ్మాటికి తెలుగు సినిమా పరిశ్ర‌మ‌ను అణిచివేసే ప‌రిణామ‌మేన‌ని ఆర్జీవీ అన్నారు. మంత్రులు పేర్ని నాని, అనిల్ కుమార్ యాద‌వ్‌లు చేసిన కామెంట్లను ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు. వారికి సినిమాల గురించి అసలేమీ తెలీద‌ని అర్థ‌మ‌వుతోంద‌న్నారు. హీరో రెమ్యున‌రేష‌న్ సైతం సినిమా బ‌డ్జెట్‌లో భాగ‌మేన‌ని.. హీరోను బ‌ట్టే సినిమా ఆడుతుంద‌ని.. సినిమా బ‌డ్జెట్‌ను, హీరో రెమ్యున‌రేష‌న్‌ను వేరుగా చూడ‌లేమ‌ని.. మంత్రి అనిల్‌కు అవ‌గాహ‌న లేద‌ని వ‌ర్మ తేల్చేశారు.  టికెట్ ధ‌ర‌ల త‌గ్గింపుతో కొంద‌రు హీరోల‌కు చెక్ పెడ‌దామ‌నుకుంటే అది వ‌ర్క‌వుట్ కాద‌న్నారు వ‌ర్మ‌. హీరోల రెమ్యున‌రేష‌న్‌ను ఎవ‌రూ త‌గ్గించ‌లేర‌ని.. టికెట్ ధ‌ర‌ల‌తో వారి డిమాండ్ ఏమీ త‌గ్గ‌ద‌ని.. ఆ మేర‌కు మిగ‌తా వారికి ఇచ్చే సొమ్ము.. వ‌చ్చే లాభం త‌గ్గిపోతుంద‌ని చెప్పారు. ప్రభుత్వ నిర్ణ‌యం ఎవ‌రికీ లాభం చేకూర్చ‌ద‌ని.. ఇది సినిమా ప‌రిశ్ర‌మ‌ను నాశ‌నం చేసే శాపమ‌ని ఆర్జీవీ తీవ్ర స్థాయిలో త‌ప్పుబ‌ట్టారు. త‌మ వాడైన వ‌ర్మ చెప్పాకైనా.. వైసీపీ దిగొస్తుందా?  టికెట్ రేట్ల‌పై పున‌రాలోచ‌న చేస్తుందా?  లేదంటే, త‌గ్గేదే లే.. అంటుందా?  

కరీంనగర్ జైలుకు బండి సంజయ్.. బెయిల్ పిటిషన్ తిరస్కరణ

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు 14 రోజుల రిమాండ్ విధించింది జిల్లా జిల్లా సెషన్స్ కోర్టు. సంజయ్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై విచారించిన కోర్టు.. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. సంజయ్ కు  ఈనెల 17 వరకు జ్యూడీషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కరీంనగర్ జిల్లా సెషన్స్ కోర్టు మెజిస్ట్రేట్.  బండి సంజయ్ సహా మరో ఐదుగిరికి రిమాండ్ విధించింది కరీంనగర్ న్యాయ స్థానం. దీంతో సంజయ్ కు కరీంనగర్ జైలుకు తరలించారు పోలీసులు. బండి సంజయ్‌పై కరీంనగర్ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కోవిడ్ నిబంధనల ఉల్లంఘన, పోలీసుల విధులకు ఆటంకం  కలిగించడంపై  బండి సంజయ్ సహా మొత్తం 12 మందిపై కేసులు నమోదు అయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల కోసం సర్కారు జారీ చేసిన జీవో 317ను సవరించాలనే డిమాండ్‌తో జిల్లాలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో బండి సంజయ్‌ చేపట్టిన జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేసి.. అరెస్ట్ చేశారు.  మరోవైపు ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పక్షాన సంజయ్ చేస్తున్న పోరాటం భేష్ అని మెచ్చుకున్నారు. కేసుల గురించి భయపడాల్సి అవసరం లేదన్నారు. బండి వెనక జాతీయ నాయకత్వం ఉందని.. ఇదే విధంగా ప్రజల సమస్యలపై పోరాడాలని.. సంజయ్ జీకి తన మాటగా చెప్పాలని జేపీ నడ్డా ఫోన్‌లో తెలిపారు. 

అల్లర్లు స్పష్టించేందుకే ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం.. డీజీపీకి చంద్రబాబు లేఖాస్త్రం 

వివిధ వర్గాల ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే పెద్ద కుట్రలో భాగంగానే ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇలాంటి విధ్వంసాలను ప్రోత్సహించడంలో పోలీసులు నిందితులకు సహకరిస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోందన్నారు.గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవవర్గం దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహం విధ్వంసం లాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డీజీపీకి లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.ఇవి ఇలానే కొనసాగితే భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలపై ప్రజలు తిరుగుబాటు చేయవచ్చన్నారు. దుర్గిలో వైసీపీ జెడ్పీటీసీ సభ్యుడు శెట్టిపల్లి యలమంద కుమారుడు శెట్టిపల్లి కోటేశ్వర్ రావ్ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేశారని తన లేఖలో తెలిపారు చంద్రబాబు. 2019 జూన్ లో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇలాంటి సంఘటనలు వరుసగా జరుగుతున్నాయన్నారు.ఇలాంటి సంఘటనలు అధికార వైసీపీ నాయకుల ఆదేశాల మేరకే జరుగుతున్నాయనడానికి వైసీపీ జెడ్పీటీసీ సభ్యుడు కుమారుడు ఎన్టీఆర్ విగ్రహ విధ్వంసమే నిదర్శనమన్నారు టీడీపీ అధినేత. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కే ప్రయత్నంలో జాతీయ నాయకులైన ఎన్టీఆర్, డా. బి.ఆర్‌ అంబేడ్కర్, పొట్టి శ్రీరాములు లాంటి విగ్రహాలను ధ్వంసం చేసే చర్యలకు అధికారపార్టీ గూండాలను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసానికి నిరసనగా ఆందోళనలు చేస్తున్న టీడీపీ నేతలను అరెస్ట్ చేయడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు శాంతియుతంగా నిరసన చేస్తున్న ప్రజలను అదుపులోకి తీసుకోవడం మాని.. సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నియంత్రించాలని సూచించారు. విగ్రహం ధ్వంసం ఘటనపై  పోలీసులు సమగ్ర విచారణ జరిపి దోషులకు చట్ట ప్రకారం శిక్ష పడేలా చూడాలన్నారు. నేరస్తులపై పోలీసులు తీసుకునే కఠినమైన చర్యలు మాత్రమే భవిష్యత్తులో ఇటువంటి విధ్వంసకర చర్యలు పునరావృతం కాకుండా అడ్డుకుంటాయని తన లేఖలో తెలిపారు చంద్రబాబు.

ఏపీలో ష‌ర్మిల పార్టీ.. చెల్లి క్లారిటీ.. జ‌గ‌న‌న్న‌కు ఝ‌ల‌కేనా?

ఇడుపుల‌పాయ గెస్ట్‌హౌజ్‌లో అన్నాచెల్లి గొడ‌వ ప‌డ్డారు. త‌ల్లి సాక్షిగా త‌గ‌వులాడుకున్నారు. తెలంగాణ‌లో పార్టీ పెట్టి త‌న‌ను న‌వ్వుల పాలు చేస్తున్నావంటూ అన్న.. చెల్లిపై చిందులేశారు. తండ్రి ఆస్థులు త‌న‌కు స‌మానంగా పంచివ్వాల‌ని చెల్లి నిల‌దీశారు. చిల్లి గ‌వ్వ కూడా ఇచ్చేది లేదుపో.. ఏం చేసుకుంటావో చేసుకో పో.. అంటూ అన్న నిష్టూరంగా మాట్లాడారు. ఏం చేయాలో నాకు బాగా తెలుసు.. చేసి చూపిస్తా..అంటూ చెల్లి శ‌ప‌థం చేసి.. ఇడుపుల‌పాయ నుంచి ఏడ్చుకుంటూ అర్థ‌రాత్రి ఒంట‌రిగా వ‌చ్చేశారు. క్రిస్మ‌స్ వేడుక‌ల స‌మ‌యంలో.. వైఎస్సార్ స‌మాధి సాక్షిగా.. త‌ల్లి విజ‌య‌మ్మ స‌మ‌క్షంలో.. జ‌గ‌న్‌కు, ష‌ర్మిల‌కు తీవ్రస్థాయిలో గొడ‌వ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ఆ ర‌చ్చ‌.. మ‌రింత రాజుకుంద‌ని.. అన్న‌కు చెక్ పెట్టేందుకు ష‌ర్మిల వేగంగా పావులు క‌దుపుతున్నార‌ని అంటున్నారు.  రెండు విధాలుగా జ‌గ‌న్‌కు కార్న‌ర్ చేసేందుకు ష‌ర్మిల సై అంటున్నారు. బాబాయ్ వివేకానందరెడ్డి హ‌త్య కేసులో సాక్షం చెప్పేందుకు ష‌ర్మిల సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది. హ‌త్య‌కు సంబంధించి అవినాష్‌రెడ్డి, జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తిరెడ్డిల ద‌గ్గ‌ర త‌గు స‌మాచారం ఉంద‌ని.. ఆ వివ‌రాలు సీబీఐకి ష‌ర్మిల చెప్ప‌నున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇలా వివేకా కేసు.. ష‌ర్మిల ఎంట్రీతో కీల‌క మ‌లుపు తిర‌గ‌నుంద‌ని.. ఆ మ‌లుపు జ‌గ‌న్ వైపే దారి తీస్తుంద‌ని అంటున్నారు.  అంతేనా. ఇంకా చాలాఉంది. త‌న‌కు జ‌రిగిన అవ‌మానాన్ని అంత ఈజీగా వ‌దిలిపెట్టే ర‌కం కాదు ష‌ర్మిల‌. జ‌గ‌న‌న్న ఎంత మొండినే.. ష‌ర్మిల అంత‌కంటే జ‌గ‌మొండి.. అంటున్నారు. చిల్లిగ‌వ్వ ఇచ్చేది లేదు.. ఏం చేసుకుంటావో చేసుకో పో.. అంటే ఊరుకుంటుందా?  తండ్రి సంపాద‌నలో త‌న వాటా ఇవ్వ‌కుండా అంతా తానే స్వాహా చేద్దామ‌నుకుంటే చేతులు ముడుచుకు కూర్చుంటుందా? ఇప్ప‌టికే త‌న ప్ర‌త్యేక‌త‌ను, ఉనికిని బ‌లంగా చాటుకునేందుకు.. తెలంగాణ‌లో వైఎస్సార్‌టీపీ స్థాపించారు ష‌ర్మిల‌. కేసీఆర్ దొర‌త‌నంపై ఒంట‌రిగా పోరాడుతున్నారు. అయితే, జ‌గ‌న్‌ది సైతం దొర‌ల పాల‌నేన‌ని.. జ‌గ‌న్ ఏలుబ‌డిలో ప్ర‌జ‌లంతా త‌న‌లానే వ‌ల‌వ‌ల ఏడుస్తున్నార‌ని గుర్తించారు ష‌ర్మిల‌. అటు, అన్న‌పై ప‌గ ఎలానూ ఉండ‌నే ఉంది. అందుకే, జ‌గ‌న్‌కు ఝ‌ల‌క్ ఇవ్వాలంటే.. తెలంగాణ‌లో మాదిరే ఏపీలోనూ పార్టీ పెట్టాల‌నే ఆలోచ‌న‌లో ష‌ర్మిల ఉన్న‌ట్టు తెలుస్తోంది. కొన్నిరోజులుగా ఆ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ వార్త‌ల‌పై ష‌ర్మిల వ‌ర్గం నుంచే లీకులు వ‌స్తున్నాయ‌ని.. ఏపీలో కొత్తపార్టీ దిశ‌గా ష‌ర్మిల స‌మాలోచ‌న‌లు చేస్తున్నార‌ని అంటున్నారు.  తాజాగా, ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పెడతారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాజకీయ పార్టీ ఏర్పాటుపై మీడియా అడిగిన ప్రశ్నకు షర్మిల వ్యూహాత్మకంగా సమాధానం చెప్పారు. రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టవచ్చు... పెట్టకూడదనే రూల్ ఏమీ లేదుకదా? అంటూ మ‌రింత గుస‌గుసకు ఛాన్స్ ఇచ్చారు.  గ‌తంలో ఇదే ప్ర‌శ్న అడిగితే.. ఏపీలో పార్టీ పెట్టే ఆలోచ‌న ఉందా అని అడిగితే.. వెంట‌నే అలాంటిదేమీ లేద‌ని తేల్చి చెప్పారు. ఇప్పుడు మాత్రం అలా కాదు.. రాజ‌కీయ‌పార్టీ ఎక్కడైనా పెట్ట‌వ‌చ్చు.. పెట్ట‌కూడ‌ద‌నే రూల్ ఏమీ లేదుక‌దా? అంటూ న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానించి.. పార్టీ పెడ‌తారా.. అనే ఊహాగానాల‌కు మ‌రింత బ‌లం చేకూర్చేలా ష‌ర్మిల స‌మాధానం ఉందంటున్నారు విశ్లేష‌కులు. ఏమో.. రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మే. అన్న‌పై కోపంతో చెల్లి.. ఏపీలో సొంత‌పార్టీ పెట్ట‌నూ వ‌చ్చు!  ఇంతకీ షర్మిల ఏపీలో పెట్టబోయే పార్టీ పేరు ఏమై ఉండొచ్చు.. తెలంగాణలో వైఎస్సార్‌టీపీ లానే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్సార్ఏపీనా?

యుగపురుషుడి విగ్రహంపైనే దాడినా? వైసీపీ పతనానికి నాందినా? 

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ అరాచకాలకు అంతే లేకుండా పోతోంది. ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఇంటిపైకే వైసీపీ ఎమ్మెల్యే దాడికి దిగడం గతంలో కలకలం రేపింది. అసెంబ్లీ వేదికగా నారా భువనేశ్వరిపై అందరూ తలదించుకునేలా అసభ్యకర కామెంట్లు చేశారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు. టీడీపీ కార్యకర్తలు దేవాలయంగా కొలుచుకునే పార్టీ ప్రధాన కార్యాలయంపైనా వైసీపీ అల్లరి మూకలు దాడులకు తెగబడ్డాయి. ఇవన్ని వైసీపీ నేతలు, కార్యకర్తల దురాగాతాలకు కొన్ని ఉదాహారణలు మాత్రమే. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నేతలే టార్గెట్ గా దాడులు జరుగుతూనే ఉన్నాయి. టీడీపీ కార్యాలయాలపైనా దాడులు జరిగాయి. టీడీపీ నేతలు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు మాత్రం చర్యలు తీసుకోలేదనే విమర్శలు ఉన్నాయి. తాజాగా ఏకంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని టార్గెట్ చేశారు వైసీపీ నేతలు. మాచర్ల నియోజకవర్గంలోని దుర్గిలో పట్టపగలే ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు వైసీపీ నేత. ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేసిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. దుర్గి ఘటనకు నిరసనగా టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపిచ్చింది. మాచర్లకు వెళ్లేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేయడంతో పాటు టీడీపీ నేతల అరెస్టులపై టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్ర‌భుత్వంపై వెల్లువెత్తుతోన్న‌ ప్ర‌జాగ్ర‌హాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు దివంగ‌త‌  తార‌క‌రామారావు విగ్ర‌హాల ధ్వంసానికి వైసీపీ తెగ‌బ‌డ‌టం చాలా దుర్మార్గమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. దుర్గి, తాడికొండలో మ‌హానాయకుడు ఎన్టీఆర్ విగ్ర‌హాలని విద్వేషంతో ప‌గ‌ల‌గొట్టారన్నారు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ప్ర‌తిప‌క్షంపైనా, ప్ర‌శ్నించే ప్ర‌జ‌ల‌పైనే కాదు.. దేవతామూర్తులు, మ‌హ‌నీయుల విగ్ర‌హాల‌పైనా దాడులు స‌ర్వ‌సాధార‌ణ‌మైపోయాయని నారా లోకేష్ విమర్శించారు. ఎన్టీఆర్ విగ్ర‌హాల విధ్వంసంతో వైసీపీ త‌న ప‌త‌నాన్ని తానే కొని తెచ్చుకుంటోందన్నారు. అధికార‌ మ‌దంతో ర‌హ‌దారిపై ఉన్న విగ్ర‌హాల‌ను కూల‌గొడుతున్న జ‌గ‌న్‌రెడ్డి అండ్ కో... ప్ర‌జ‌లు త‌మ గుండె గుడిలో క‌ట్టుకున్న ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ఎప్ప‌టికీ కూల‌దోయ‌లేరని నారా లోకేష్ అన్నారు.  దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని వైసీపీ నేత ధ్వంసం చేయడంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  రాష్ట్రంలో నీ తండ్రి విగ్రహాలు తప్ప మహానుభావులవి ఉండకూడదా అంటూ సీఎం జగన్‌ను ప్రశ్నించారు. విగ్రహ ధ్వంసానికి పాల్పడి, మారణాయుధాలతో ప్రజలను భయపెట్టిన వారిపై ఐపీసీ 294, 427 లాంటి నామమాత్రపు కేసులు పెట్టారన్నారు. హత్యాయత్నం కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు.  విగ్రహ ధ్వంసాన్ని నిరసిస్తూ ఆందోళన తెలిపిన వారిపై క్రిమినల్ కేసులు బనాయిస్తారా అని మండిపడ్డారు. టీడీపీ వారిపై పెట్టిన కేసులను తక్షణమే పోలీసులు వెనక్కి తీసుకుని, అరెస్టు చేసిన వారిని వదిలిపెట్టాలని డిమాండ్ చేశారు.  రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. పరిపాలన చేతగాక దుర్మార్గాలకు సీఎం జగన్ విధ్వంసాలకు పాల్పడుతున్నాడన్నారు. వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ని రంగంలోకి దించి రాష్ట్రంలో విధ్వంసాలకు కుట్ర చేస్తున్నారన్నారు. తాడికొండ, దుర్గి లలో ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేయడం... చిత్తూరులో టీడీపీ దిమ్మె ధ్వంసం వంటి ఘటనలే దీనికి సాక్ష్యమని ప్రత్తిపాటి పేర్కొన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని బెదిరించాలని చూస్తే భయపడేది లేదన్నారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం తెలుగు ప్రజల మనోభావాలను దేబ్బతీయడమేనని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. వైసీపీ విధ్వంసక చర్యల కొనసాగింపుగానే విగ్రహాన్ని ధ్వంసం చేశారన్నారు. జగన్ ఆటవిక పాలనలో సామాన్యులతో పాటు మహానుభావుల విగ్రహాలకూ రక్షణ కరవైందన్నారు. సీఎం జగన్ తెలుగు ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పి, ప్రభుత్వ ఖర్చుతో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు.  దుర్గి గ్రామంలో అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని పట్టపగలు జనం చూస్తూ ఉండగా ఇనుప మలాట్‌తో పగులకొట్టడం అమానుషమని టీడీపీ పొలిట్‌‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. అక్కడ పోలీసులు ఏమీ చేయరన్న ధైర్యంతో చేసిన పని అది అని అన్నారు. స్థానిక పోలీసులు అధికార పార్టీతో కుమ్ముక్కవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ ఘటనపై స్థానిక అధికారులపై  జిల్లా ఎస్పీ విషాల్ గున్ని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎస్‌ఐపై ఇప్పటికే చాల ఆరోపణలున్నాయని వర్ల రామయ్య తెలిపారు.  

బండిపై పోలీస్ యాక్ష‌న్ అందుకేనా? జాగ‌..ర‌ణం కావాల‌నేనా? రేవంతే టార్గెట్‌?

వెరీ సింపుల్‌. చాలా క్లియ‌ర్ క‌ట్‌గా తెలిసిపోతోంది. రేవంత్‌రెడ్డి ర‌చ్చ‌బండ‌కు వెళ‌తానంటే హౌజ్ అరెస్ట్ చేశారు. రైతు ప‌రామ‌ర్శ‌కు పోతానంటే ఇంట్లోనే అడ్డుకున్నారు. రేవంత్‌రెడ్డి న్యూస్‌లో లేకుండా.. ఎలాంటి హ‌డావుడి క్రియేట్ కాకుండా.. స్మూత్‌గా, సైలెంట్‌గా హ్యాండిల్ చేసింది తెలంగాణ స‌ర్కారు. కానీ, అదే బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్.. ఉపాధ్యాయుల‌కు మ‌ద్ద‌తుగా జీవో 317 ర‌ద్దు కోసం జాగ‌ర‌ణ దీక్ష చేస్తానంటే ర‌చ్చ రంబోలా చేశారు. ముందుగానే ప్ర‌క‌టించిన షెడ్యూలే క‌దా.. రేవంత్‌రెడ్డిలానే బండి సంజ‌య్‌నూ హౌజ్ అరెస్ట్ చేసుంటే స‌రిపోయేదిగా? ఇంత హంగామా జ‌రిగేది కాదుగా? మ‌రి, ఇంత చిన్న లాజిక్ ప్ర‌భుత్వానికి-పోలీసుల‌కు తెలీద‌నుకోవాలా? లేక‌, అంతా తెలిసే.. కావాల‌నే.. ఇలా చేశారా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది.  ఆదివారం రాత్రి క‌రీంన‌గ‌ర్ బీజేపీ కార్యాల‌యంలో తీవ్ర ఉద్రిక్త‌త‌. పోలీసుల క‌న్న‌గ‌ప్పి బండి సంజ‌య్ ఆఫీసు గేట్ల‌కు తాళాలేసుకొని దీక్ష‌కు దిగారు. చుట్టూ అనుచ‌రుల‌తో ర‌క్ష‌ణ వ‌ల‌యంలో దీక్ష చేప‌ట్టారు. పోలీసులు ఆప‌రేష‌న్ అటాక్ చేప‌ట్టారు. తాళాలు ప‌గ‌ల‌గొట్టి.. గేట్లు క‌ట్ చేసి.. ఫైర్ ఇంజిన్‌తో నీళ్లు చ‌ల్లి.. లాఠీఛార్జి చేసి.. నానా ర‌చ్చ క్రియేట్ చేసి బండి సంజ‌య్‌ను అరెస్ట్ చేశారు. జాగ‌ర‌ణ దీక్ష‌ను భ‌గ్నం చేశారు. ఇక అంతే. మీడియాలో తెగ హంగామా. పోలీస్ యాక్ష‌న్‌, బండి అరెస్ట్‌ల‌పై గంట‌ల కొద్దీ టీవీ ఛానెళ్లు ఊద‌ర‌గొట్టారు. సోమ‌వారం కూడా ఇవే వార్త‌లు. సంజ‌య్‌పై నాన్‌బెయిల‌బుల్ కేసు పెడ‌తారంటూ లీకులు. దీక్ష భ‌గ్న‌మైనా.. అంత‌కంటే ఎక్కువే ప్ర‌చారం వ‌చ్చిందంటున్నారు.  దీక్ష చేసుంటే మ‌రీ ఇంత‌లా హైప్ వ‌చ్చేది కాక‌పోవ‌చ్చు. బండి త‌న మానాన తాను రాత్రంతా జాగ‌ర‌ణ చేసి.. ఉద‌యాన్నే విర‌మించి.. త‌నింటికి తాను వెళ్లిపోయేవాడు. ఏదో రొటీన్ న్యూస్‌లా క‌వ‌రేట్ వ‌చ్చేది. కానీ, పోలీసులు ఆయ‌న దీక్ష‌ను భ‌గ్నం చేయ‌డం వ‌ల్ల‌నే.. అది గంట‌ల త‌ర‌బ‌డి బ్రేకింగ్ న్యూస్‌గా మారింది. రేవంత్‌రెడ్డికి రాని మైలేజ్‌.. బండి సంజ‌య్‌కు వ‌చ్చేసింది. ప్ర‌భుత్వంపై దూకుడుగా పోరాడేది.. పోలీసుల‌తో త‌ల‌ప‌డేది.. కేసీఆర్ భ‌య‌పడేది.. బండి-బీజేపీనే అంటూ ప్ర‌జ‌ల్లోకి మెసేజ్ వెళ్లాల‌నే ఇంత సీన్ అయ్యేలా చేశార‌నే అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. రేవంత్‌రెడ్డికి ఎక్క‌డా హైప్ రాకుండా.. జాగ్ర‌త్త‌గా బండిని, బీజేపీని న్యూస్‌లో ఉంచుతున్నార‌ని.. ఇదంతా కేసీఆర్ పొలిటిక‌ల్ గేమ్ అంటున్నారు.  కేసీఆర్‌ను గ‌ద్దె దించే స‌త్తా.. కాంగ్రెస్‌కు, రేవంత్‌రెడ్డికే ఉంద‌ని గ్ర‌హించే.. హ‌స్తం పార్టీ-రేవంత్‌రెడ్డి ఎద‌గ‌కుండా చేసేందుకే.. బీజేపీని, బండి సంజ‌య్‌ను ఫుల్‌గా ప్ర‌మోట్ చేస్తున్నార‌ని చెబుతున్నారు. ఆ రాజ‌కీయ వ్యూహంలో భాగంగానే.. కేసీఆర్ కావ‌ల‌నే వ‌రి కొనుగోళ్ల అంశాన్ని ఇష్యూ చేశార‌ని.. ప‌దే ప‌దే ప్రెస్‌మీట్లు పెట్టి బండి సంజ‌య్‌ను, బీజేపీని క‌వ్వించార‌ని.. అలా ఓ నెలా-రెండు నెల‌ల పాటు రేవంత్‌రెడ్డిని సైలెంట్‌మోడ్‌లోకి నెట్టేశార‌ని అంటారు. అయితే, పార్ల‌మెంట్ స‌మావేశాలు ముగియ‌గానే రేవంత్‌రెడ్డి మ‌ళ్లీ యాక్టివ్ కావ‌డం.. ఎర్ర‌వ‌ల్లిలో ర‌చ్చ‌బండ‌, ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతు ప‌రామ‌ర్శ ప్రొగ్రామ్స్‌తో లైమ్‌లైట్‌లోకి రావ‌డంతో.. కేసీఆర్ మ‌ళ్లీ అల‌ర్ట్ అయ్యార‌ని.. అంత‌లోనే అందివ‌చ్చిన అవ‌కాశంగా.. బండి సంజ‌య్ జాగ‌ర‌ణ దీక్ష‌ను వాడుకున్నార‌ని విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ స్కెచ్ ఆయ‌కే బూమ‌రాంగ్ అవుతుందా? బీజేపీ బాగా బ‌ల‌ప‌డితే అస‌లుకే ఎస‌రు వ‌చ్చే ప్ర‌మాదం లేదా? ఇక‌, రేవంత్‌రెడ్డి దూకుడును అడ్డుకోవ‌డం అంత ఈజీనా? అంటున్నారు. 

వైసీపీలో తిరుగుబాట్లు అందుకేనా? ముందస్తు ముందర పోరాడితే పోయేదేంలే...

రెండున్న‌రేళ్లు వైసీపీ ప్ర‌శాంతంగా ఉంది. పెద్ద‌గా గొడ‌వ‌లేమీ లేకుండా ఉంది. అధికారాన్ని అంతా ఎంజాయ్ చేశారు. అక్క‌డ‌క్క‌డ‌.. ఏ న‌గ‌రిలోనో, ఒంగోలులోనో మిన‌హా పార్టీలో అంత‌ర్గ‌త విభేదాలు ఇన్నాళ్లూ త‌క్కువే అని చెప్పాలి. కానీ, ఆశ్చ‌ర్యంగా గ‌త నెల రోజులుగా వైసీపీలో కోల్డ్‌వార్ బాగా పెరిగిపోయింది. అదికాస్తా బ‌హిరంగంగానే భ‌గ్గుమంటోంది. ఈ జిల్లా.. ఆ జిల్లా అనే తేడా లేకుండా.. ఏపీలోని 13 జిల్లాల్లో పార్టీలో కుమ్ములాట‌లతో క‌ల్లోలం చెల‌రేగింది. స‌డెన్‌గా ఇప్పుడే ఇలా వ‌ర్గ‌భేదాలు బ‌య‌ట‌ప‌డ‌టానికి కార‌ణ‌మేంటి? ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని.. పోరాడితే పోయేదేమీ లేద‌ని వైసీపీ శ్రేణులు డిసైడ్ అయిపోయారా? ఆ ల‌క్ష్యం కోస‌మేనా ఇలా లెక్క‌లేసుకొని మ‌రీ చిచ్చు పెడుతున్నారా?  సీఎం జ‌గ‌న్‌రెడ్డి. మంత్రి పెద్దిరెడ్డి. జ‌గ‌న్ త‌ర్వాత జ‌గ‌న్ అంత‌టి స్థాయి ఉన్న నాయ‌కుడు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు పార్టీకి ఫండింగ్ చేసిందంతా పెద్దిరెడ్డినే అంటారు. అందుకే అధికారంలోకి వ‌చ్చాక గ‌నుల శాఖ అప్ప‌గించి.. కావాల్సినంత త‌వ్వేసుకోమ‌ని ప‌ర్మిష‌న్ ఇచ్చార‌ని చెబుతారు. ఆ పెద్దిరెడ్డికి.. న‌గ‌రి ఎమ్మెల్యే రోజాకి ఎప్ప‌టినుంచో కోల్డ్‌వార్. వాళ్ల సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ఇక‌... మంత్రి పెద్దిరెడ్డికి అత్యంత స‌న్నిహితుడు, కుటుంబ స‌భ్యుడు అయిన‌.. తంబ‌ళ్ల‌ప‌ల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వార‌కానాథ్‌రెడ్డిపై తాజాగా వైసీపీ జెడ్పీటీసీ భ‌ర్త కొండ్రెడ్డి తిరుగుబాటు చేయ‌డం మామూలు విష‌యం కానేకాదు. వైసీపీ రాజ‌కీయాల్లో ఇది అత్యంత సంచ‌ల‌నం. రోజా ఏదో అన్నారంటే అది వేరే సంగ‌తి.. కానీ ద్వార‌కానాథ్‌రెడ్డి.. అవినీతి, అరాచ‌కాలు, ఆధిపత్యంపై కొండ్రెడ్డి నిల‌దీయ‌డం చిత్తూరు జిల్లాలో సంచ‌ల‌న‌మే. ద్వార‌కానాథ్‌రెడ్డిని ప్ర‌శ్నించారంటే.. ప‌రోక్షంగా మంత్రి పెద్దిరెడ్డిని చొక్కాప‌ట్టుకొని అడిగిన‌ట్టే. క‌ట్ చేస్తే.. ఆ ప్ర‌శ్నించిన గొంతును.. పోలీసులు అరెస్ట్ చేయ‌డం మ‌రింత క‌ల‌క‌లం. సొంత‌పార్టీ నాయ‌కుడినే అరెస్ట్ చేయించిన ఘ‌నులు ఈ పెద్దారెడ్డి బ్ర‌ద‌ర్స్ అంటున్నారు.  ఒక చిత్తూరు జిల్లాలో వైసీపీలోనే పెద్దిరెడ్డి.. రోజారెడ్డి.. నారాయ‌ణ‌స్వామి, తాజాగా కొండ్రెడ్డి.. ఇలా నాలుగు ముక్క‌లాట కొన‌సాగుతోంది. అన్ని జిల్లాలు.. అన్ని నియోజ‌క వ‌ర్గాల్లోనూ వర్గ పోరు ముదిరి రోడ్డున పడుతోంది. వైసీపీ ప్రజా ప్రతినిధులపై సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు తిరగబడుతున్నారు. అవినీతికి పాల్పడుతున్నారంటూ ఎక్కడిక్కడ నిలదీస్తున్నారు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ.. ఇలా అన్ని ప్రాంతాల్లోనూ వైసీపీలో కల్లోలం కనిపిస్తోంది. మాగుంట శ్రీనివాసులురెడ్డి, క‌ర‌ణం బ‌ల‌రాం, ఆమంచి, వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాస‌రెడ్డి, ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డి, కాకాని గోవ‌ర్థ‌న్‌రెడ్డి, విడ‌ద‌ల ర‌జినీ, మ‌ర్రి రాజ‌శేఖ‌ర్, ఎమ్మెల్యే శ్రీదేవి, ఎంపీ సురేష్, దేవినేని అవినాష్‌, వ‌ల్ల‌భ‌నేని అవినాశ్‌, ఎంపీ భ‌ర‌త్‌, ఎమ్మెల్యే జ‌క్కంపూడి.. విజ‌య‌సాయిరెడ్డి, ధ‌ర్మాన కృష్ణ‌దాసు, త‌మ్మినేని.. ఇలా ప్రాంతాలు, జిల్లాల‌నే తేడా లేకుండా.. దాదాపు వైసీపీ నేత‌లంద‌రి మ‌ధ్యా వ‌ర్గ‌విభేదాలు భ‌గ్గుమంటున్నాయి. తాజాగా, ఎమ్మెల్యేలు, ఎంపీల స్థాయిలోనే కాకుండా ద్వితియ శ్రేణి నాయ‌కులు సైతం నేరుగా ప్ర‌జా ప్ర‌తినిధుల‌పై తిరుగుబాటు చేయ‌డం కీల‌క ప‌రిణామం.  ఈ ధిక్కార స్వ‌రానికి కార‌ణాలూ లేక‌పోలేదంటున్నారు. అవినీతి సంపాద‌న కోసం పోటీ ప‌డుతూ.. నేత‌లంతా ఇలా కుమ్ములాడుకుంటున్నార‌నేది ఒక రీజ‌న్‌. ఇక రెండున్న‌రేళ్ల త‌ర్వాత మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో త‌మ‌కు అవ‌కాశం కోసం కొంద‌రు ఇలా ఫైర్‌బ్రాండ్‌గా మారార‌ని అన్నారు. ఇప్పుడు కేబినెట్ విస్త‌ర‌ణ లేదుగానీ.. ఏకంగా ముంద‌స్తు ఎన్నిక‌లు రాబోతున్నాయ‌నే లీకుల‌తో.. ఈసారి ద్వితీయ శ్రేణి నాయ‌క‌గ‌ణ‌మూ రంగంలోకి దిగింది. ఎప్పుడూ మిమ్మ‌ల్నే గెలిపించాలా?  మీ కోస‌మే ప‌ని చేయాలా?  మాకూ అవ‌కాశం ఇవ్వ‌రా? అనే రెబెల్ ఎజెండాతో.. సెకండ్ గ్రేడ్ లీడ‌ర్లు సైతం వాయిస్ పెంచేసి త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నార‌ని చెబుతున్నారు. జ‌గ‌న్‌రెడ్డి ముందస్తు ఎన్నిక‌లకు వెళ్లే ఆలోచ‌న‌లో ఉన్నార‌నే ప్ర‌చారంతోనే.. వైసీపీలో ఎల‌క్ష‌న్ ఫీవ‌ర్ ప‌ట్టుకుంద‌ని.. అందుకే గ్రూప్ త‌గాదాలు, ఎత్తుల‌కు పైఎత్తులు పెరుగుతున్నాయ‌ని భావిస్తున్నారు. ఏకంగా వైసీపీ నేత‌ల‌పైనే కేసులు పెట్టి.. అరెస్టులు చేయించేదాకా.. ఆ అధికార పార్టీ రాజ‌కీయం ముదురుతోంది..అంటున్నారు.

ఢిల్లీకి సీఎం.. అల్లర్లకు కుట్ర.. జైలుకు సంజయ్.. వైరస్ వర్రీ.. టాప్ న్యూస్@1PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఆయనకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్లు ఖరారయ్యాయని తెలుస్తోంది. మూడు రాజధానులు, పోలవరం,  విభజన హమీలు, ప్రత్యేక హోదాపై కేంద్రం పెద్దలతో సీఎం జగన్ చర్చిస్తారని వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అయితే ఏపీ సమస్యలపై కాకుండా తన వ్యక్తిగత పనుల కోసమే జగన్ ఢిల్లీ వెళ్లారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి------- రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. పరిపాలన చేతగాక దుర్మార్గాలకు సీఎం జగన్ విధ్వంసాలకు పాల్పడుతున్నాడన్నారు. వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ని రంగంలోకి దించి రాష్ట్రంలో విధ్వంసాలకు కుట్ర చేస్తున్నారన్నారు. తాడికొండ, దుర్గి లలో ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేయడం... చిత్తూరులో టీడీపీ దిమ్మె ధ్వంసం వంటి ఘటనలే దీనికి సాక్ష్యమని ప్రత్తిపాటి పేర్కొన్నారు. -------- ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నందమూరి రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. తెలుగు ప్రజలు దేవుడిగా ఆరాధించే ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడమంటే... యావత్ తెలుగు జాతిని అవమానించినట్టేనని అన్నారు. ఎన్టీఆర్ అభిమానులుగా చెప్పుకునే వైసీపీ నేతలు ఈ ఘటనపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ------- అమరావతిని బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి అభివృద్ధి జరగలేదన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిశానిర్దేశం లేకుండా పని చేస్తోందన్నారు. పెనుగంచిప్రోలులో తిరుపతమ్మ గోపయ్య దేవాలయం సందర్శించి సోము వీర్రాజు పూజలు నిర్వహించారు. ------- వంగవీటి రాధా హత్యకు రెక్కీ జరిగినట్టు ఆధారాలు లేవు.. చంద్రబాబువి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా చెప్పారు. ఈ ఘటనపై సమగ్రంగా, లోతుగా విచారణ జరిపామని తెలిపారు. విజయవాడ పోలీసులతో పాటు ఇతర దర్యాప్తు ఏజెన్సీలు కూడా రెక్కీపై దర్యాప్తు చేశాయని చెప్పారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా  వెంటనే స్పందించిందని... రాధాకు గన్ మెన్లను ఏర్పాటు చేసిందని చెప్పారు.  ------ రాష్ట్ర అప్పులు, అభివృద్ధిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీ అప్పులు, ఖర్చుల లెక్కలు రాశామని చెబుతున్నారన్నారు. గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా పీఏసీ ఛైర్మన్‌గా ఉన్న బుగ్గన టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అప్పుల గురించి విమర్శలు గుప్పించారని గుర్తు చేశారు.  --------- సీఎం జగన్ తీరు సొమ్ము ఒకడిది సోకు ఒకడిది అన్నట్టుందని.. ప్రజాధనాన్ని ప్రభుత్వం  దుర్వినియోగం చేస్తోందని బీజేపీ నాయకుడు లంకా దినకర్ పేర్కొన్నారు. అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రైతు భరోసా కోసం ఇచ్చే 13,500 రూపాయలలో 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు కాదా? అని ప్రశ్నించారు. పీఏం కిసాన్ నిధులు కలిపి ఇస్తున్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో పెట్టకపోవడం లో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.  ----- బీజేపీ తెలంగాణ‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై హైద‌రాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు నమోదయింది. ఐపీసీ 504, 55(2), 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన‌ట్లు పోలీసులు వివ‌రించారు. గ‌త ఏడాది నవంబరు 8న నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో కేసీఆర్‌పై ఆయ‌న అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బోయిన్‌పల్లికి చెందిన వ్యాపారి కల్యాణ్‌ సందీప్‌ ఫిర్యాదు చేశారని, ఈ మేరకే తాము కేసు నమోదు చేశామ‌ని పోలీసులు చెప్పారు.  -- మాజీ టీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు వైస్సార్‌టీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ అధినేత్రి షర్మిల నేతృత్వంలో గట్టు రామచంద్రరావు పార్టీ కండువా కప్పుకున్నారు. తెలంగాణలో జాతీయ పార్టీలు ప్రత్యామ్నాయం కావన్నారు. టీఆర్‌ఎస్‌కు వైఎస్సార్ తెలంగాణ పార్టీనే ప్రత్యామ్నాయమని తేల్చిచెప్పారు. షర్మిల చేస్తున్న పోరాటం బీజేపీ, కాంగ్రెస్‌లు చేయడం లేదన్నారు. తెలంగాణలో వైఎస్సార్ లెగసీ ఎక్కడకు పోలేదని తెలిపారు.  ---- దేశంలో 15 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య‌ వయసు కలిగిన పిల్లలకు నేటి నుంచి క‌రోనా వ్యాక్సిన్ల పంపిణీ కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైంది. హైద‌రాబాద్‌లో ఈ కార్యక్ర‌మాన్ని ప్రారంభించిన తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హ‌రీశ్ రావు ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా 1,014 కేంద్రాల్లో పిల్ల‌ల‌కు వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని కొన‌సాగిస్తున్న‌ట్లు చెప్పారు.అర్హులైన పిల్ల‌లంద‌రికీ కొవాగ్జిన్ వ్యాక్సిన్లు ఇస్తామ‌ని తెలిపారు

కేసుల భయమా? ఎన్నికల చర్చలా? జగన్ ఢిల్లీ టూర్ ఎందుకు? 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఆయనకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్లు ఖరారయ్యాయని తెలుస్తోంది. మూడు రాజధానుల అంశం, అమరావతి భవిష్యత్, పోలవరం,  విభజన హమీలు, ప్రత్యేక హోదాపై కేంద్రం పెద్దలతో సీఎం జగన్ చర్చిస్తారని వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అయితే ఏపీ సమస్యలపై కాకుండా తన వ్యక్తిగత పనుల కోసమే జగన్ ఢిల్లీ వెళ్లారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. గతంలోనూ జగన్ చాలా సార్లు ఢిల్లీకి వెళ్లారని, కాని ఏపీ కోసం ఏమైనా సాధించారా అని ప్రశ్నిస్తున్నారు. వరదలతో వేలాది కోట్ల రూపాయల నష్టం జరిగినా.. కేంద్రం ఇంతవరకు రాష్ట్రానికి పైసా విదల్చలేదని చెబుతున్నారు. తన సొంత అవసరాల కోసం ఏపీ ప్రయోజనాలను జగన్ ఢిల్లీకి తాకట్టు పెట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ తాజా ఢిల్లీ పర్యటన ఏపీలో కాక రాజేస్తోంది. ఏపీ ప్రభుత్వానికి చాలా సమస్యలు ఉన్నాయి. అందులో మొదటిది ఆర్థిక సమస్యలు. ఇప్పటికిప్పుడు ఆర్బీఐ నుంచి తీసుకునే బాండ్ల అప్పుల కోసం అనుమతి రావాల్సి ఉంది. ఇవాళ అది రాకపోతే మంగళవారం ఆర్బీఐ వేసే బాండ్ల వేలంలో పాల్గొనడానికి అవకాశం ఉండదు. అదే జరిగితే ఇప్పటికీ జీతాలు, పెన్షన్లు అందని వారికి ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలనేది పెద్ద సమస్య అవుతుంది. ముందు ఈ గండం అధిగమించాలి. భారీ వర్షాలు - వరదల కారణంగా ఏపీలోని మూడు జిల్లాలు భారీగా నష్టపోయాయి. దాదాపుగా ఆరు వేల కోట్ల రూపాయాలకు పైగా నష్టం వాటిట్లింది.అయితే రెండు రోజుల క్రితం కేంద్రం వరదల కారణంగా నష్టపోయిన ఇతర రాష్ట్రాలకు సాయం ప్రకటించింది. ఏపీ ఊసెత్తలేదు. ప్రధాని హామీ ఇచ్చారని .. సీఎం తక్షణ సాయంగా వెయ్యి కోట్లు ఇవ్వాలని లేఖ రాసినా స్పందన లేదు. ఈ అంశం పైనా సీఎం చర్చించే ఛాన్స్ ఉంది.  అయితే జగన్ పర్యటనలో రాష్ట్ర సమస్యల కంటే రాజకీయ అంశాల పైన సీఎం చర్చిస్తారని తెలుస్తోంది. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఆ కేసులో తీర్పు రిజర్వులో ఉంది. ఆ కేసులో జగన్ కు వ్యతిరేకంగా తీర్పు వస్తే ఆయన రాజీనామా చేసే అవకాశాలుంటాయి. అదే సమయంలో జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు వేసిన పిటిషన్ పైనా హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసులో వ్యతిరేక తీర్పు వచ్చినా జగన్ పదవికి గండమే. ఒకవేళ హైకోర్టులో జగన్ కు అనుకూలంగా తీర్పు వచ్చినా.. సుప్రీంకోర్టుకు వెళతానని ప్రకటించారు ఎంపీ రఘురామ. ఇది కూడా జగన్ కు ఇబ్బందికరమే.  వైఎస్సార్ కుటుంబంలో విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయని అంటున్నారు. ఫ్యామిలీలో జగన్ ఒంటరి అయ్యారని తెలుస్తోంది. క్రిస్మస్ సందర్భంగా ఇడుపాలపాయకు వెళ్లిన జగన్... కుటుంబంతో కాకుండా సింగిల్ గానే వైఎస్సార్ ఘాట్ దగ్గర నివాళి అర్పించారు. తల్లి విజయమ్మ కూడా ఆయనతో కనిపించలేదు. ఇడుపుల పాయ గెస్ట్ హౌజ్ లో జగన్ తో షర్మిల గొడవ పడ్డారని, రాత్రికి రాత్రే అక్కడినుంచి వచ్చేసిందనే ప్రచారం జరిగింది. ఆస్తి విషయంలో కొన్ని రోజులుగా జగన్ తో గొడవ పడుతున్న షర్మిల.. ఇప్పుడు తాడోపేడో తేల్చుకోవాలని డిసైడ్ అయిందని అంటున్నారు. ఇన్ని సమస్యలు ఉన్న జగన్ కు వైఎస్ వివేకా హత్య కేసు మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టడం ఖాయమని అంటున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో  సాక్ష్యం చెప్పమని సీబీఐ అధికారులు షర్మిలను సంప్రదించారని తెలుస్తోంది. దానికి ఆమె అంగీకరించి ప్రాథమికంగా కొన్ని వివరాలు చెప్పారని.., స్టేట్ మెంట్ ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నారని సమాచారం.  వివేకా హత్య కేసులోకి భారతీరెడ్డిని షర్మిల లాగేసిందని తెలుస్తోంది. వివేకా హత్య జరిగిన తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డి ఎవరెవరికి ఫోన్లు చేశారో బయటకు తీసిన సీబీఐ.. వారిలో భారతీరెడ్డి కూడా ఉన్నారని తేల్చారట. దీంతో భారతీరెడ్డిని కూడా సీబీఐ ప్రశ్నించడానికి రెడీ అవుతోందని అంటున్నారు. భారతీరెడ్డికి సంబంధించిన మరిన్ని కీలక అంశాలను సీబీఐకి చెప్పేందుకు షర్మిల సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. దీంతో  వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐ చేధిస్తే .. జగన్ కు అక్రమాస్తుల కేసు కన్నా ఇదే పెద్ద సమస్య అయ్యే అవకాశ ఉందంటున్నారు. మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీబీఐ కేసులు తేలుతాయో లేదో కానీ ఈడీ కేసులు మాత్రం త్వరలోనే తేలిపోతాయన్న అభిప్రాయం కొంత కాలంగా ఉంది. ఈ నేపథ్యంలో తన కేసుల గురించే కేంద్ర పెద్దలతో మాట్లాడేందుకు జగన్ హస్తినకు వెళ్లారని విపక్షాలు అరోపిస్తున్నాయి. కేసులు కీలక దశకు రావడంతో ఎలాగైనా భయటపడేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శలు చేస్తున్నాయి.  

మరీ ఇంత దారుణమా.. తప్పతాగి జూనియర్ పై 25 మంది మెడికోల ర్యాగింగ్ 

తెలంగాణలోని సూర్యాపేట మెడికల్ కాలేజీలో వెలుగు చూసిన ర్యాగింగ్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బాధిత విద్యార్థి చెప్పిన వివరాలు విన్నవారు షాకవుతున్నారు. ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అని అవాక్కవుతున్నారు. మెడికల్ స్టూడెంట్స్ గా ఉంటూ ఇంత కిరాతకంగా ఎలా ఉంటారనే చర్చ కూడా వస్తోంది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారడంతో ఉన్నతాధికారులు కదిలిపోయారు. కాలేజీలో జరిగిన ర్యాగింగ్ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నారు.  వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ కు చెందిన బాధిత విద్యార్థి సూర్యాపేట మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. వారం రోజుల క్రితం ఇంటికి వెళ్లిన అతడు శనివారం రాత్రి హాస్టల్ కు చేరుకున్నాడు. అప్పటికే సెకండ్ ఇయర్ చదువుతున్న 25 మంది మెడికోలు మద్యం తాగి ఉన్నారు. జూనియర్ విద్యార్థిపై దాడికి పాల్పడ్డారు. తాము చెప్పినట్లుగా వినాలని హెచ్చరిస్తూ.. తమ గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ అతడి దుస్తులు విప్పించి సెల్ ఫోన్ లో వీడియో తీశారు. అనంతరం అతడికి గుండు గీసే ప్రయత్నం చేశారు. దీంతో ప్రతిఘటించిన సదరు విద్యార్థి వారి నుంచి తప్పించుకొని తన రూంకు వెళ్లాడు. అనంతరం తండ్రికి ఫోన్ చేసిన తనకు ఎదురైన పరిస్థితి గురించి చెప్పాడు. దీంతో బాధితుడు తండ్రి డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. స్పందించిన స్థానిక పోలీసులు హాస్ట్లల్ కు చేరుకొని టెన్షన్ లో ఉన్న బాధితుడ్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే బాధిత విద్యార్థిని స్టేషన్ కు తరలించిన పోలీసులు.. ర్యాగింగ్ కు పాల్పడిన సీనియర్ మెడికోల మాత్రమే చర్యలు తీసుకోలేదు. దీంతో పోలీసుల తీరుపై బాధితుడి తండ్రి ఫైరవుతున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం విద్యార్థులు ఘర్షణ పడ్డారని.. ర్యాంగింగ్ కు పాల్పడినట్లుగా ఆధారాలు లేవని చెబుతున్నారు. ఒకవేళ అది నిజమని తేలితే కేసు నమోదు చేయాలని పోలీసులకు చెబుతామని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీధర్ రెడ్డి తెలిపారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. ర్యాంగింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోకపోవటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు.  

బండి సంజయ్ పై నాన్ బెయిలబుల్ కేసు? 

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడానికి కరీంనగర్ పోలీసులు సిద్దమైనట్లు సమాచారం. వైద్య పరీక్షల అనంతరం బండి సంజయ్‌ను రిమాండ్‌కు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు, కార్యకర్తలు పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు తరలి వస్తున్నారు. ఇప్పటికే కూన శ్రీశైలం గౌడ్, తుల ఉమ సహా పలువురు బీజేపీ నేతలు పీటీసీకి చేరుకున్నారు. పోలీసుల విధులకు ఆటంకం కల్గించడంతో పాటు కొవిడ్ రూల్స్ ఉల్లంఘించినందున డిజాస్టర్ మేనేజ్ మెంట్  ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల కోసం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317ను సవరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన జాగరణదీక్షను పోలీసులు భగ్నం చేశారు. గత రాత్రి ఏడున్నర గంటల నుంచే దీక్ష కోసం  ఏర్పాట్లు చేయగా, మధ్యాహ్నం నుంచే బీజేపీ నేతలు, కార్యకర్తలు, ఉద్యోగ, ఉపాధ్యాయలు పెద్ద సంఖ్యలో దీక్షా స్థలికి చేరుకున్నారు. అయితే, ఈ దీక్షకు అనుమతి లేదన్న పోలీసులు వచ్చిన వారిని వచ్చినట్టు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.  అరెస్టులతో అక్కడ ఉద్రిక్త  పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పార్టీ శ్రేణులతో కలిసి బండి సంజయ్ బైక్‌పై కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసులు ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే, ఆయన వారి నుంచి తప్పించుకుని లోపలికి వెళ్లి దీక్ష చేపట్టారు. రాత్రి 8 గంటల సమయంలో దీక్ష ప్రారంభం కాగా, కార్యాలయ ప్రధాన ద్వారాన్ని పార్టీ నేతలు మూసివేశారు. దీక్షను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులు రాత్రి 10 గంటల సమయంలో లైట్లు ఆఫ్ చేసిన పోలీసులు కిటీకీల గుండగా లోపల దీక్ష చేస్తున్న వారిపై ఫైర్ ఇంజిన్లతో నీళ్లు చల్లారు. ఆ తర్వాత తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్లి బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలు, పోలీసులు మధ్య తోపులాట జరిగింది. బండి సంజయ్ తలకు గాయమైంది.  అరెస్ట్ చేసిన సంజయ్‌ను మానకొండూరు పోలీస్ స్టేషన్‌కు తరలించగా, అక్కడ కూడా ఆయన దీక్ష కొనసాగించారు. దీక్ష భగ్నం చేయడంపై బండి సంజయ్ మాట్లడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం, అహంకారంతో కేసీఆర్ కళ్లు నెత్తికెక్కినట్టు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వ్యవహరించిన తీరుపైనా మండిపడిన ఆయన పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సమయంలో ఎంతోమంది గాయపడ్డారని, వారికేమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఊపిరితిత్తుల వరకు చేరని వైరస్.. ఒమిక్రాన్ తో నో డేంజర్ 

కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను కమ్మేసింది. యూపర్ దేశాలతో పాటు యూఎస్ఏను అల్లకల్లోలం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రోజుకు 10 లక్షలకు పైగా కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. రెండు వారాల క్రితం వరకు డెల్టా వేరియంట్ కేసులు ఎక్కువుండగా.. ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయి. మన దేశంలోనూ ఇది శరవేగంగా వ్యాప్తి చెందుతూ భయపెడుతోంది. ఆదివారం దేశంలో  33 వేల 759 కొత్త కేసులు వచ్చినట్లు వైద్య శాఖ వెల్లడించింది. గత సెప్టెంబర్ తర్వాత ఇదే అత్యధికం. రానున్న రోజుల్లో దేశంలో కొవిడ్ కేసులు ప్రమాదకరంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే దేశంలోని 12 రాష్ట్రాల్లో రాత్రి పూట కర్ప్యూ అమలవుతోంది. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ లో విద్యా సంస్థలు మూతపడ్డాయి.  ఒమిక్రాన్ విజృంభిస్తుండటంతో డెల్టా వేరియంట్‌‌లానే ఇది కూడా విరుచుకుపడి ప్రాణాలను హరిస్తుందా? దీని వల్ల పెను విపత్తు సంభవించబోతోందా? అన్న భయాందోళన వ్యక్తమవుతోంది. ఈ వేరియంట్ చాలా డేంజరని కొందరంటుంటే, భయపడాల్సింది ఏమీ లేదని మరికొందరు నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వద్ద కూడా ఈ వేరియంట్‌పై కచ్చితమైన సమాచారం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలిన ఫలితాలు ఊరటనిస్తున్నాయి. కరోనాలోని గత వేరియంట్లతో పోలిస్తే ఇది ఏమంత ప్రమాదకారి కాదని అధ్యయన నివేదిక చెబుతోంది. ఒమిక్రాన్ అంటే భయపడాల్సిందేమీ లేదని వెల్లడించింది. గతంలోని కరోనా వైరస్‌లు ఊపిరితిత్తులపై ప్రభావం చూపించి ఊపిరాడనివ్వకుండా చేసి ప్రాణాలు హరించాయి. అయితే, ఒమిక్రాన్ వల్ల మాత్రం అలాంటి ప్రమాదమేమీ లేదన్న విషయం తాజాగా వెలుగుచూసింది. ఇది శరీరంలోని పైభాగానికే పరిమితమవుతున్నట్టు గుర్తించారు. ఇది ప్రధానంగా ముక్కు, గొంతు, శ్వాసనాళానికే పరిమితమవుతోందని, ఊపిరితిత్తుల వరకు చేరుకోవడం లేదని ఎలుకలు, చిట్టెలుకలపై నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఒమిక్రాన్ వేరియంట్ ఎగువ శ్వాసకోశ వ్యవస్థకే పరిమితం అవుతోందని బెర్లిన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కంప్యుటేషనల్ బయాలజిస్ట్ రోనాల్డ్ ఈల్స్ తెలిపారు. శ్వాసకోశ వ్యవస్థకు కరోనా వైరస్‌లు ఎలా సంక్రమిస్తాయన్న దానిపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్టు తెలిపారు. అయితే గత పరిశోధనల ఫలితాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉండడం గమనార్హం. కరోనా వైరస్‌లు కణాలను గట్టిగా పట్టుకుంటాయని, శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ నుంచి కూడా అవి తప్పించుకోగలవని తేల్చాయి. అయితే, ఒకసారి అవి శరీరంలోకి ప్రవేశించాక లోపల ఎలా ప్రవర్తిస్తాయన్నది అంతుబట్టకుండా ఉండిపోయింది. తాజా పరిశోధన ఫలితాలు మాత్రం ఒమిక్రాన్ వల్ల ఏమంత భయం లేదని, ఆందోళన చెందాల్సిన పని అసలే లేదని తేల్చింది. ఒమిక్రాన్ సోకినప్పటికీ ఊపిరితిత్తులపై ఎలాంటి ప్రమాదం ఉండదు కాబట్టి త్వరగానే దాని బారి నుంచి బయటపడొచ్చని పేర్కొంది. ఒమిక్రాన్ భూతంలా భయపెడుతున్న వేళ తాజా అధ్యయన ఫలితాలు పెద్ద ఊరటే. 

రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌

తెలంగాణలో కొవిడ్ మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారి కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రజా ప్రతినిధులు ఎక్కువగా వైరస్ భారీన పడుతున్నారు. తాజాగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘‘స్వల్ప లక్షణాలతో నేను కోవిడ్ బారిన పడ్డాను. గత కొద్ది రోజులుగా నన్ను కాంటాక్ట్ అయినవారు.. తప్పనిసరిగా కావల్సిన జాగ్రత్తలు తీసుకోండి’’ అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇటీవలి కాలంలో రచ్చబండ కార్యక్రమంతో పాటు బాధిత రైతు కుటుంబాలను పరామర్శించడం వంటివి చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే హౌస్ అరెస్ట్‌లు, పెద్ద ఎత్తున కార్యకర్తలు రేవంత్ ఇంటికి రావడం, ఆయనను కలవడం వంటివి జరుగుతున్నాయి. ఇటీవలే తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావుకు కొవిడ్ సోకింది. ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ బృందంలో చాలా మంది వైరస్ భారీన పడ్డారని తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరధిలో వైరస్ వేగంగా విస్తరిస్తోందని వైద్య వర్గాలు చెబుతున్నాయి.

అసెంబ్లీ బరిలో పోటీకి ఓడి గెలిచిన ఎంపీలు రెడీ?

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో, అంబర్‌పేట అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే, 2019 ఎన్నికల్లో అదే కిషన్ రెడ్డి సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి లక్కీ గా గెలిచారు. అనూహ్యంగా కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రిగా ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో అమిత్ షా సరసన స్థానం సంపాదించారు. అంతలోనే కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ కేబినెట్ మంత్రిగా పదోన్నతి పొందారు. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో కేబినేట్  స్థానం దక్కించుకున్న తొలి మంత్రిగా, ప్రత్యేక గుర్తింపు పొందారు. అంతే కాదు,ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ నుంచి బీజేపీ సారధ్యంలోని  ఎన్డీఎ ( అప్పటి వాజపేయి, ఇప్పటి మోడీ) ప్రభుత్వాలలో కేబినేట్ హోదా పొందిన తొలి తెలుగోడుగా మరో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.  నిజానికి, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి 2019 లోక్ సభ ఎన్నికల్లో లక్కీ’ గెలిచింది ఒక్క కిషన్ రెడ్డి మాత్రమే కాదు, బీజేపే రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధింగారు.అయితే ఈ లక్కీ’ ఎంపీలు అందరిలో కిషన్ రెడ్డి త్రీ ఫోర్  టైమ్స్ ఎక్కువ లక్కీ.  అదలా ఉంటే’ ఓడి గెలిచిన ఎంపీలతో పాటుగా, బీజేపీ ఎంపీలు నలుగురిలో ముగ్గురు, కాంగ్రెస్ ఎంపీలు ముగ్గురు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ అసెంబ్లీ బరిలో నిలిచే అవకాశాలు లేక లేక పోలేదని తెలుస్తోంది. నిజానికి 2018 అసెంబ్లీ ఎన్నికలలో తెరాస, కాంగ్రెస్ కూటమి (కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్) మధ్యనే పోటీ జరిగింది. కానీ 2023 ఎన్నికలలో సత్తచాటేందుకు, కాంగ్రెస్’తో పాటుగా బీజేపీ కూడా గట్టి ప్రయత్నమే చేస్తోంది. ఇదే పరిస్థితి ఎన్నికల వరకు కొనసాగితే, తెరాస, కాంగ్రెస్, బీజేపీల మధ్య ముక్కోణపు పోటీ అనివార్యంగా కనిపిస్తోంది. అదే జరిగితే, కాంగ్రెస్, బీజేపీ బలమైన నాయకుల అందరీని అసెంబ్లీ ఎన్నికల బరిలో దించేయాలని అలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎంపీలుగా ఉన్నవారు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తారని సమాచారం.    కాంగ్రెస్‌లో ఉన్న ముగ్గురు ఎంపీలు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు మళ్ళీ  గత ఎన్నికల్లో పోటీచేసిన స్థానాల నుంచే తిరిగి ఎమ్మెల్యేలుగా పోటీ చేయనున్నారు. రేవంత్ కొడంగల్‌ నుంచి, నల్గొండ ఎంపీగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి...హుజూర్‌నగర్‌ నుంచి, భువనగిరి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి...నల్గొండ అసెంబ్లీ స్థానంలో పోటీకి దిగుతారని పార్టీ వర్గాలు చెపుతున్నాయి.  కేంద్ర మంత్రి  సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, గత అసెంబ్లీ ఎన్నికల్లో పోతెచేసి ఓడిన అంబర్‌పేట నుంచి,  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ, గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిన కరీమానగర్ అసెంబ్లీ స్థానం నుంచి, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు... గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బోథ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దిగుతారు. అయితే బీజేపీ నాలుగో ఎంపీ (నిజామాబాద్) ధర్మపురి అరవింద్...మాత్రం మళ్ళీ లోక్ సభకే పోటీ చేస్తారని, పార్టీ వర్గాల సమాచారం. అయితే, ఎన్నికల సమయానికి ఉన్న పరిస్థితులను బట్టి తుది నిర్ణయం ఉంటుదని అంటున్నారు.

బీజేపీ కార్యాలయం గేట్లు బద్దలు.. తలకు గాయమైనా బండి సంజయ్ అరెస్ట్

కరీంనగర్ లో రాత్రి తీవ్ర ఉద్రిక్తత తలెత్తంది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల కోసం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317ను సవరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన జాగరణదీక్షను పోలీసులు భగ్నం చేశారు. గత రాత్రి ఏడున్నర గంటల నుంచే దీక్ష కోసం  ఏర్పాట్లు చేయగా, మధ్యాహ్నం నుంచే బీజేపీ నేతలు, కార్యకర్తలు, ఉద్యోగ, ఉపాధ్యాయలు పెద్ద సంఖ్యలో దీక్షా స్థలికి చేరుకున్నారు. అయితే, ఈ దీక్షకు అనుమతి లేదన్న పోలీసులు వచ్చిన వారిని వచ్చినట్టు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.  అరెస్టులతో అక్కడ ఉద్రిక్త  పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పార్టీ శ్రేణులతో కలిసి బండి సంజయ్ బైక్‌పై కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసులు ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే, ఆయన వారి నుంచి తప్పించుకుని లోపలికి వెళ్లి దీక్ష చేపట్టారు. రాత్రి 8 గంటల సమయంలో దీక్ష ప్రారంభం కాగా, కార్యాలయ ప్రధాన ద్వారాన్ని పార్టీ నేతలు మూసివేశారు. దీక్షను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులు రాత్రి 10 గంటల సమయంలో లైట్లు ఆఫ్ చేసిన పోలీసులు కిటీకీల గుండగా లోపల దీక్ష చేస్తున్న వారిపై ఫైర్ ఇంజిన్లతో నీళ్లు చల్లారు. ఆ తర్వాత తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్లి బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలు, పోలీసులు మధ్య తోపులాట జరిగింది. బండి సంజయ్ తలకు గాయమైంది.  అరెస్ట్ చేసిన సంజయ్‌ను మానకొండూరు పోలీస్ స్టేషన్‌కు తరలించగా, అక్కడ కూడా ఆయన దీక్ష కొనసాగించారు. దీక్ష భగ్నం చేయడంపై బండి సంజయ్ మాట్లడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం, అహంకారంతో కేసీఆర్ కళ్లు నెత్తికెక్కినట్టు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వ్యవహరించిన తీరుపైనా మండిపడిన ఆయన పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సమయంలో ఎంతోమంది గాయపడ్డారని, వారికేమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అంతేకాదు, ‘‘నువ్వు జైలుకెళ్లే సమయంలో నీ కుటుంబ సభ్యులు కూడా పోలీసుల తీరుతో ఇలాగే ఇబ్బంది పడతారు’’ అని కేసీఆర్‌ను హెచ్చరించారు.  తన కార్యాలయంలోకి వచ్చి దౌర్జన్యం చేసిన పోలీసులకు సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు ఇస్తానని హెచ్చరించారు. బండి సంజయ్ అరెస్ట్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. కేసీఆర్ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. బండి సంజయ్ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. తలపులు బద్దలుగొట్టి మరీ ఆయనను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని అన్నారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదితరులు కూడా సంజయ్ అరెస్ట్‌ను ఖండించారు.

పట్టపగలు NTR విగ్రహం ధ్వంసం.. వైసీపీ నేత దుశ్చర్యతో మాచర్లలో హై టెన్షన్ 

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. దారుణాలకు తెగబడుతున్నారు వైసీపీ నేతలు. గుంటూరు జిల్లాలో పట్టపగలు తెలుగు దేశం పార్టీ వ్యవస్థపాకులు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. మాచర్ల నియోజకవర్గం పరిధిలోని దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు  ఓ వ్యక్తి యత్నించాడు. పట్టపగలు, అందరూ చూస్తుండగానే జరిగిన ఈ ఘటన పల్నాడులో తీవ్ర అలజడి రేపింది.  పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దుర్గి గ్రామానికి చెందిన శెట్టిపల్లి కోటేశ్వరరావు గ్రామ ప్రధాన రహదారిపై ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహాన్ని సుత్తితో పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. స్థానికులు గమనించే సరికే విగ్రహం స్వల్పంగా పగిలింది. సమాచారమందుకున్న దుర్గి ఎస్‌.ఐ పాల్‌ రవీందర్‌ ఘటనాస్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కోటేశ్వరరావు మాజీ మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ యలమంద కుమారుడిగా పోలీసులు గుర్తించారు. విగ్రహం ధ్వంసం చేసేందుకు యత్నించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.  ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసానికి యత్నించిన కోటేశ్వరరావుపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. మహనీయుల విగ్రహాలు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు.  వైసీపీ నేతలు అచ్చోసిన ఆంబోతుల్లా రెచ్చిపోతున్నారంటూ లోకేశ్ మండిపడ్డారు. దోపిడీలు, దందాలు, దాడులతో ప్రజలపై తెగబడడమే కాకుండా, ఇప్పుడు ఏకంగా మహనీయుల విగ్రహాలు కూలగొడుతున్నారని ఆరోపించారు. మాచర్ల నియోజకవర్గం దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని వైసీపీ నేతల శెట్టిపల్లి కోటేశ్వరరావు ధ్వంసం చేశాడని లోకేశ్ వెల్లడించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. 

13 జిల్లాల్లోనూ అదే సీన్.. నేతలపై కేడర్ తిరుగుబాట్లు.. వైసీపీలో ఎందుకీ కల్లోలం! 

మూడు గ్రూపులు.. ఆరు ఘర్షణలు.. 12 రాజీనామాలు. ఇదీ ప్రస్తుతం ఏపీలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అధికారం ఇంకా రెండున్నర ఏండ్లు ఉన్నా అప్పుడే వైసీపీలో అంతర్గత పోరు భగ్గమంటోంది. అన్ని జిల్లాల్లోనూ వర్గ పోరు ముదిరి రోడ్డున పడుతోంది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి. వైసీపీ ప్రజా ప్రతినిధులపై సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు తిరగబడుతున్నారు. అవినీతికి పాల్పడుతున్నారంటూ ఎక్కడిక్కడ నిలదీస్తున్నారు. ఇందులో మంత్రులకు కూడా మినహాయింపు లేదు. ఉప ముఖ్యమంత్రులు, సీనియర్ మంత్రులకు వైసీపీ కార్యకర్తల నుంచి సెగ తప్పడం లేదు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ.. ఇలా అన్ని ప్రాంతాల్లోనూ వైసీపీలో కల్లోలం కనిపిస్తోంది.  ఇదంతా జగన్ రెడ్డి పాలన వల్లేనని తెలుస్తోంది. జగన్ పాలనలో రాష్ట్రం అథోగతి పాలవుతుందనే చర్చ జనాల్లో సాగుతోంది. రాష్ట్ర పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉండటంతో దివాళా తీసే పరిస్థితి ఉందనే భయాలు జనాల్లో కనిపిస్తున్నాయి. అదే సమయంలో వైసీపీ ప్రజాప్రతినిధులు ఇష్టారాజ్యంగా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్ని చూస్తున్న వైసీపీ ద్వితియ శ్రేణి నేతలకు భవిష్యత్ చిత్రం కనిపించిందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలవడం అసాధ్యమని భావించి ఇలా తిరుగుబాట్లు చేస్తున్నారని చెబుతున్నారు. పూర్తిగా ప్రజల్లో చులకన కాకముందే ఎవరి దారి వాళ్లు చూసుకునే పనిలో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఉన్నారని తెలుస్తోంది. అందుకే మంత్రులపైనా తిరగబడుతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అందుకే శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఎక్కడచూసినా అధికార పార్టీలో అసంతృప్తి గళాలే వినిపిస్తున్నాయి.  ప్ర‌కాశం జిల్లాలో ఓ వైపు తెలుగుదేశం బ‌లం పుంజుకుంటుంటే వైసీపీ రోజుకో గ్రూపు..పూట‌కో వివాదంగా బ‌ల‌హీన‌ప‌డుతోంది. ఇప్ప‌టికే ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పూర్తిగా పార్టీకి దూరం అయ్యారు. కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మ‌హీధ‌ర్‌రెడ్డి వైసీపీతో త‌న‌కు సంబంధ‌మే లేన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సంత‌నూత‌ల‌పాడు ఎమ్మెల్యే త‌న గ‌న్‌మెన్ల‌ను స‌రెండ‌ర్ చేసి ఫోన్ల‌కి కూడా అందుబాటులో లేకుండా వెళ్లిపోయారు. చీరాల‌లో టిడిపి నుంచి వ‌చ్చిన క‌ర‌ణం బ‌ల‌రాం..అంత‌కుముందే వైసీపీలో చేరిన ఆమంచి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి కూడా వేయ‌కుండా భ‌గ్గుమంటోంది. ఇక జ‌గ‌న్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి, ఆయ‌న బావ‌మ‌రిది బాలినేని శ్రీనివాస‌రెడ్డి మ‌ధ్య వైరం ప్ర‌త్యేకించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. గిద్ద‌లూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఏ క్ష‌ణంలోనైనా రాజీనామా చేయొచ్చ‌ని హింట్ ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో తంబ‌ళ్ల‌ప‌ల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వార‌కానాథ్‌రెడ్డిని ప్ర‌శ్నిస్తే చాలు సొంత పార్టీ వారైనా లోప‌లేయిస్తున్నార‌ని వైసీపీ జెడ్పీటీసీ భ‌ర్త కొండ్రెడ్డి రోడ్డెక్కారు. నియోజ‌క‌వ‌ర్గం మొత్తం వైసీపీ నేత‌ల‌దీ ఇదే మాట‌. పెద్దిరెడ్డి బ‌స్సుల్లో ఓట్లు త‌ర‌లించినా వారితో ఓట్లేయించేది మేమేనంటూ తొడ‌గొడుతున్నారు.న‌గ‌రి ఎమ్మెల్యే రోజాది మ‌రీ దారుణ‌మైన ప‌రిస్థితి. త‌న‌కు పోటీగా ఎదుగుతున్నార‌ని వైసీపీ నేత‌ల్ని స‌స్పెండ్ చేయిస్తే, వారు పెద్దిరెడ్డి ఆశీస్సుల‌తో సొంతంగా కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. దీనిపై రోజా ఏకంగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంత‌పురం జిల్లాలో వైసీపీ నేత‌లు మ‌ధ్య వైరం తీవ్రం అవుతోంది. ఎంపీ రంగ‌య్య‌, క‌ళ్యాణ‌దుర్గం ఎమ్మెల్యే ఉష‌శ్రీచ‌ర‌ణ్ మ‌ధ్య గొడ‌వ‌లు ముదిరి పాకాన‌ప‌డ్డాయి. క‌దిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ప‌ద‌వులు అమ్ముకున్నార‌ని వైసీపీ నేత‌లే ఆరోపించ‌డంతో వివాదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డి... త‌మ ప్ర‌భుత్వ పాల‌న‌లో లోక‌ల్ మాఫియాలు దోచుకుంటున్నాయ‌ని ఆరోపించారు. జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేల‌కు- మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్‌కి అస్స‌లు పొస‌గ‌డంలేదు.  గూడురు, ఉదయగిరి నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని.. సెకండ్‌ క్యాడర్‌ నేతలు ఆరోపించారు. స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాని గోవ‌ర్థ‌న్‌రెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట‌కి మ‌ధ్య వివాదం కేసుల వ‌ర‌కూ చేరింది. గుంటూరు జిల్లాలో న‌ర‌స‌రావుపేట ఎంపీ లావు కృష్ణ‌దేవ‌రాయలు చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జినితో విభేదాలు తీవ్ర‌మ‌య్యాయి. కృష్ణ‌దేవ‌రాయ‌లు పూర్తిగా పార్టీకి దూర‌మ‌య్యే ఆలోచ‌న‌లో వున్నార‌ని స‌మాచారం. వైసీపీలో  మొద‌టి నుంచీ ఉన్న మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై వైరాగ్యంతో తిరిగి న్యాయ‌వాదిగా ప్రాక్టీసుకి వెళ్లిపోయారు. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, బాప‌ట్ల ఎంపీ సురేష్ మ‌ధ్య వాటాల తేడాతో గొడ‌వ‌లు ముదిరి రోడ్డున‌ప‌డ్డాయి. శ్రీదేవిని హైద‌రాబాద్‌కే ప‌రిమితం కావాల‌ని అధినేత ఆదేశించార‌ని వైసీపీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.  కృష్ణా జిల్లాలో వైసీపీలో చేరిన టిడిపి నేత‌ల మ‌ధ్య విభేదాల‌తో ఒక‌రినొక‌రు త‌మ‌కే సాధ్య‌మైన పాత‌త‌రం పాలిటిక్స్‌తో త‌ప్పించుకోవాల‌ని చూస్తున్నారు. కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీలు....దేవినేని అవినాష్‌ని టార్గెట్ చేసి మ‌రీ కొట్టారు. వంగ‌వీటి రాధ హ‌త్య‌కి అవినాష్ ఆంత‌రంగికుడు అర‌వ స‌త్యం రెక్కీ నిర్వ‌హించ‌డంతో పార్టీలో లుక‌లుక‌లుని బ‌య‌ట‌పెట్టింది. మ‌రోవైపు పెడ‌న ఎమ్మెల్యే జోగి ర‌మేష్‌, మైల‌వ‌రం ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌ల మ‌ధ్య విభేదాలు తీవ్ర‌మ‌య్యాయి.ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఎంపీ కోట‌గిరి శ్రీధ‌ర్‌, ఎమ్మెల్యే ఎలీజా మ‌ధ్య ఉన్న గ్యాప్ స్థానికసంస్థ ఎన్నిక‌ల్లో బ‌ట్ట‌బ‌య‌లైంది. మంత్రి ఆళ్ల‌నానితోనూ ఎమ్మెల్యేలు, నేత‌ల‌కు బాగా దూరం పెరిగింది. తూర్పుగోదావ‌రి జిల్లాలో ఎంపీ భ‌ర‌త్‌, ఎమ్మెల్యే జ‌క్కంపూడి రాజా మ‌ధ్య వివాదం రాజుకుంది. ఒక‌రినొక‌రు ఎప్పుడు దెబ్బ‌కొట్టుకుందామా అని ఎదురు చూస్తున్నారు.  విశాఖ‌లో విజ‌య‌సాయిరెడ్డి దెబ్బ‌కి వైసీపీ నేత‌లు పూర్తిగా తెర‌మ‌రుగ‌య్యారు. ఇటీవ‌లే వైసీపీ జెండా క‌ప్పుకున్న వాసుప‌ల్లి గ‌ణేష్ అల‌క‌బూనారు. అలాగే మంత్రి అవంతి తీవ్ర అసంతృప్తితో వున్నారు. పాయ‌క‌రావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకి స్థానిక వైసీపీ నేత‌ల‌కి మ‌ధ్య చాలారోజుల్నించి వివాదాలు న‌డుస్తూనే వున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ధ‌ర్మాన కృష్ణ‌దాసు వ‌ర్గం, త‌మ్మినేని వ‌ర్గం, సీదిరి స్వ‌తంత్రంగా రాజ‌కీయాలు చేస్తున్నారు. ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతూ...ఇది మునిగిపోయే ప‌డ‌వ‌...మీ దారి మీరు చూసుకోండ‌ని అనుచ‌రుల‌కు చెబుతున్నార‌ని స‌మాచారం.విజ‌య‌న‌గ‌రం జిల్లాలో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ హ‌వాకి అడ్డుక‌ట్ట వేయ‌డానికి ఆయ‌న మేన‌ల్లుడు చిన్న‌శ్రీనుని జ‌గ‌న్ పావులా వాడుకోవ‌డంతో ఒకే ఇంట్లో రెండు కుంప‌ట్లులా రాజుకుంటోంది రాజ‌కీయం.   

వైసీపీలో వర్గ పోరు.. ముందస్తు ముచ్చట.. కేటీఆర్ కోవర్టు కాడట.. శ్రీవారి అలర్ట్.. టాప్ న్యూస్@7PM

పెట్రోల్, డీజిల్ ధరలు ఏపీలో ఉన్నంతగా దేశంలో మరెక్కడా లేవని టీడీపీ సీనియర్ నేత ధూళిపాల నరేంద్ర విమర్శించారు. సినిమా టికెట్లపై ఉన్న శ్రద్ధ సామాన్య ప్రజలపై లేదని అన్నారు. రూ.3 వేలు పెన్షన్ ఇస్తానన్న జగన్ మాటతప్పారని, దశల వారీగా అంటున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ పర్యటనలో 2 కిలోమీటర్ల వరకు బారికేడ్లు ఏర్పాటు చేశారని... భారత్, పాకిస్థాన్ దేశాల మధ్యన కూడా ఇంత ఎత్తు బారికేడ్లు ఏర్పాటు చేయరని ఎద్దేవా చేశారు.  ------- ముందస్తు ఎన్నికలు వస్తే తాము సిద్ధంగా ఉన్నామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించడంపై వైసీపీ యువ ఎంపీ మిథున్ రెడ్డి స్పందించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఐదేళ్ల పాటూ తాము అధికారంలో ఉంటామని తెలిపారు. పార్టీని కాపాడుకునేందుకే చంద్రబాబు ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడుతున్నారని మిథున్ రెడ్డి విమర్శించారు. ------ పాయకరావుపేట వైసీపీలో కుమ్ములాటలు రోజురోజుకు ముదురుతున్నాయి.ఎమ్మెల్సే బాబూరావు తీరుపై సొంత పార్టీ నేతలే భగ్గుమన్నారు. ఎమ్మెల్యే బాబూరావుకు వ్యతిరేకంగా వైసీపీ నేతల పాదయాత్రకు చేశారు. ఎంసీటీసీ బొలిశెట్టి గోవింద్‌ ఆధ్వర్యంలో పెద్దగుమ్ములూరు దగ్గర పాదయాత్ర చేశారు. బాబూరావు వద్దు జగన్ ముద్దు అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. జాతీయ రహదారిపై నేతలు బైఠాయించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు --------- విజయవాడ శివార్లలోని ఇబ్రహీంపట్నం వద్ద జుంబా డే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ కూడా డ్యాన్స్ చేశారు. టాలీవుడ్ హీరో సంపూర్ణేశ్ బాబుతో కలిసి ఆయన జుంబా డ్యాన్స్ చేశారు. యువతను జుంబా డ్యాన్స్ పట్ల ప్రోత్సహించేందుకు ఎమ్మెల్యే జోగి రమేశ్, హీరో సంపూ వేదికపై ఉత్సాహంగా కాలు కదిపారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ------- తాను కేటీఆర్ కోవర్టునంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ నేతలు ఎవరూ కేటీఆర్ ను కలవలేదా? అని ప్రశ్నించారు. ప్రత్యర్థి పార్టీల నేతలు ఎదురుపడినప్పుడు పలకరించడం, మాట్లాడడం సంస్కారం అని స్పష్టం చేశారు. కేటీఆర్ తోనూ ఆ విధంగానే మాట్లాడానని అన్నారు. కేటీఆర్ తన భుజంపై చేయి వేసినా, తాను ఆయన భుజంపై చేయి వేయలేదని వివరణ ఇచ్చారు. ---- ఒపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ 'గిట్ హబ్' వేదికగా కార్యకలాపాలు నిర్వహించే 'బుల్లి బాయి' అనే యాప్ లో ముస్లిం మహిళల ఫొటోలు పోస్టు చేస్తూ వారిని వేలం వేస్తున్నట్టు ప్రచారం చేస్తుండడంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని ఊరికే వదలరాదని మండిపడ్డారు. ఇలాంటి చెదపురుగులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ తెలంగాణ సీఎం కార్యాలయాన్ని, మంత్రి కేటీఆర్ ను, తెలంగాణ డీజీపీని, హైదరాబాద్ సీపీని డిమాండ్ చేశారు. ----- శ్రీశైల దేవస్థానం మర్యాదను కాపాడటంలో సీఎం జగన్‌ విఫలమయ్యారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆరోపించారు.హిందూ దేవాలయాల పరిధిలో అన్యమతస్తులు వ్యాపారాలు చేయకూడదని, మాజీ సీఎం వైఎస్‌ హయాంలో 426 జీవో తీసుకొచ్చారని గుర్తుచేశారు. జగన్ పాలనలో 426 జీవోను పక్కన బెట్టి.. ఇతర మతస్తులు వ్యాపారాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ హిందువులు హైకోర్టుకు వెళితే ఇతర మతస్తులు సుప్రీంకోర్టుకు వెళ్లారని తెలిపారు. -------- ఈసారి జనవరి 13 నుంచి 22 వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నట్టు టీటీడీ  వెల్లడించింది. ఈసారి వైకుంఠద్వార దర్శనానికి సిఫారసు లేఖలు తీసుకోబోమని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. వీఐపీలు స్వయంగా వస్తేనే వైకుంఠద్వార దర్శన టికెట్లు జారీ చేస్తామని చెప్పారు. వీఐపీలకు నందకం, వకుళమాత వసతి భవనంలో గదులు కేటాయిస్తామని, తిరుమలలో గదులు లభ్యం కాకపోతే తిరుపతిలోనే వసతి ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. --- ఆర్కే బీచ్‌లో విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో నలుగురు గల్లంతయ్యారు. ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. మృతులు సునీత త్రిపాఠి(ఒడిషా), శివ(హైదరాబాద్)గా గుర్తించారు. సునీత త్రిపాఠి.. పిక్‌నిక్ కోసం ఒడిషా నుంచి వచ్చినట్లు గుర్తించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.  ----------- ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్, దాని పరిసర ప్రాంతాలు స్వతంత్ర భారత దేశానికి నూతన దిశానిర్దేశం చేస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశ రక్షణ, క్రీడా రంగాల్లో దేశ భక్తి జ్వాలను రగిలిస్తున్నారన్నారు. మేజర్ ధ్యాన్‌చంద్ క్రీడా విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. భరత మాత ముద్దు బిడ్డ మేజర్ ధ్యాన్‌చంద్ పుట్టిన గడ్డ మీరట్ అని పేర్కొన్నారు.  కొద్ది నెలల క్రితం క్రీడా రంగంలో దేశంలో అత్యున్నత స్థాయి పురస్కారానికి ఆయన పేరు పెట్టామని చెప్పారు --