గోదావరి జిల్లాల్లో గాలాడక ఫ్యాన్ కు ఉక్కపోత!

ఉభయ గోదావరి జిల్లాల్లో ఫ్యాన్ పార్టీకి గాలి ఆడక ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది. వచ్చే ఎన్నికలలో ఇక్కడ కనీసం ఖాతా తెరవగలమా అన్న ఆందోళన ఫ్యాన్ పార్టీ అగ్రనాయకత్వాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నది. ఉభయ గోదావరి జిల్లాల్లో మరీ ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక స్థానాలలో విజయం సాధించిన పార్టీయే రాష్ట్రంలో అధికారం చేపడుతుందన్న నమ్మకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  రాష్ట్రం నుంచీ ఉంది. ఇప్పటి వరకూ అలాగే జరిగింది కూడా. గత ఎన్నికలలో అంటే 2019 ఎన్నికలలో వైసీపీ ఉభయ గోదావరి జిల్లాల ప్రజల ఆశీర్వాదంతోనే అధికారంలోకి రాగలిగింది. గత ఎన్నికలలో పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాలకు గాను 13 స్థానాలలో, తూర్పుగోదావరిలో 19 స్థానాలకు గానూ 14 స్థానాలలో  వైసీపీ విజయ కేతనం ఎగురవేసింది.  అయితే ఈ సారి అంటే 2024 ఎన్నికలలో ఆ పరిస్థితి లేదని పరిశీలకులు విశ్లేషించడమే కాదు, స్వయంగా వైసీపీ శ్రేణులు కూడా చెబుతున్నాయి. అసలు గత ఎన్నికలలో జగన్ ముఖ్యమంత్రిగా అధికార పీఠం అధిరోహించిన ఆరు నెలల వ్యవధిలోనే ఈ రెండు జిల్లాల్లో వైసీపీ పట్ల అసంతృప్తి ఆరంభమైంది. ముఖ్యంగా ఈ జిల్లాల్లో అధిక సంఖ్యాకంగా ఉన్న కాపు సామాజిక వర్గం జగన్ పై తీవ్ర ఆగ్రహంతో ఉంది. అధికారంలోకి రాగానే జగన్ కాపు రిజర్వేషన్లు అయ్యే పని కాదని చెప్పడంతో కాపు సామాజిక వర్గం జగన్ పై తీవ్ర ఆగ్రహంతో ఉంది. దానికి తోడు ఆయన పాలనా తీరు కూడా ఆ ఆగ్రహాన్ని మరింత పెంచేదిగానే ఉంది. సామాన్య ప్రజలలో జగన్ పాలన పట్ల అసంతృప్తి ప్రజా వ్యతిరేకతగా మారితే.. జిల్లాలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న కాపు సామాజిక వర్గం ఆసంతృప్తికి తోడు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ పార్టీకి ఈ సారి మద్దతు ఇచ్చేది లేదని కంకణం కట్టుకున్నారని పరిశీలకులు అంటున్నారు. ఇంతటి వ్యతిరేకతకు తోడు పార్టీలో అంతర్గత పోరు వైసీపీ పుట్టి ముంచడం ఖాయంగా కనిపిస్తోంది.  తొలుత వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు జగన్‌పై తిరుగుబాటు చేశారు. ఆయన పార్టీలోనే ఉంటూ జగన్ కు పక్కలో బల్లెంగా మారారు. జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను, అసంబద్ధ విధానాలను రచ్చబండలో ఎండగడుతూ వస్తున్నారు. ఇక మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మధ్య వైరం పార్టీకి మరింత చేటు తీసుకువచ్చేలా మారింది. అలాగే  అమలాపురంలో  మంత్రి పినిపె విశ్వరూప్‌, ఎంపీ చింతా అనూరాథ మధ్య యుద్ధం తార స్థాయికి చేరింది. ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీకి పంపుతున్న రాజమహేంద్రవరం ఎంపీ భరత్ పనితీరుపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. పిఠాపురం నుంచి దొరబాబును కాదని ఎమ్మెల్యేగా పోటీకి దింపుతున్న కాకినాడ ఎంపీ వంగా గీతపై కూడా సొంత పార్టీలోనే  తీవ్ర అసంతృప్తి ఉంది. అలాగే మరో అరడజను స్థానాలలో కూడా వైసీపీది అదే పరిస్థితి. సరిగ్గా  ఈ పరిస్థితిని తెలుగుదేశం, జనసేన కూటమి క్యాష్ చేసుకుంది. గోదావరి జిల్లాల్లో సంఖ్యాపరంగా అత్యధికంగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని కూటమివైపు తిప్పేందుకు పవన్ కళ్యాణ్ క్యాష్ చేసుకొనేందుకు రంగంలోకి దిగారు. ఈ జిల్లాల్లో వైసీపీకి కనీస స్థానాలు కూడా దక్కకూడదన్న పట్టుదలతో తెలుగుదేశం, జనసేనలు పని చేస్తున్నాయి. అందులో భాగంగానే జనసేనాని పవన్ కల్యాణ్ ఈ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించారు.   పవన్ ఇప్పటికే  ఉభయగోదావరి జిల్లాల నేతలతో  పలు మార్లు భేటీ అయ్యారు.  నియోజకవర్గాల సమీక్ష కూడా చేశారు. కాకినాడ లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలతో విడివిడిగా మాట్లాడారు. న్యాయవాదులు, వైద్యులు, నియోజకవర్గ ప్రముఖులతో కూడా సమావేశమై వారి సలహాలు, సూచనలను తీసుకున్నారు. సీట్ల సర్దుబాటు, ఓట్ల బదలాయింపు విషయంలో కూడా పవన్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రెండు పార్టీల మధ్య పొత్తుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో ఉభయగోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవకుండా చేయాలనే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీతో కలిసి అడుగులు వేస్తున్నారు.  ప్రజలలో వైసీపీపై తీవ్ర అసంతృప్తికి తోడు పవన్ దూకుడు చూస్తుంటే అధికార పార్టీలో ఇప్పటికే  కలవరం ప్రారంభమైంది. తెలుగుదేశం, జనసేన పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరకపోవడంతో ఈ జిల్లాల్లో విజయంపై వైసీపీ ఆశలు వదిలేసుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

గంటా, బొత్స టామ్ అండ్ జెర్రీ

రోగి, వైద్యుడూ ఒకటే కోరారన్నట్లుగా తయారైంది గంటా శ్రీనివాసరావు పరిస్థితి. ఆయన ఈ సారి ఎన్నికలలో భీమిలీ నుంచే పోటీలోకి దిగాలని భావిస్తుంటే పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం ఆయనను చీపురుపల్లి నుంచి పోటీలోకి దిగమంటున్నారు. అధినేత నిర్ణయం శిరసావహిస్తానని గంటా సమాధానపడ్డారు. అయితే అసలు గంటాను భీమిలీ నుంచి చీపురుపల్లికి మార్చాలని చంద్రబాబు భావించడం వెనుక అసలు కారణం, అక్కడ వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగుతారనీ, ఆయనకు దీటైన అభ్యర్థి గంటా అవుతారన్న ఉద్దేశింతోనే. అయితే ఇప్పుడు స్వయంగా గంటా బొత్స సత్యనారాయణే వైసీపీ అధినేతను తనను భీమిలికి మార్చమని కోరుతున్నారు. సొంత నియోజకవర్గం వదిలి పారిపోవాలని బొత్స కోరుకోవడానికి కారణం ఆయన సతీమణి  బొత్స ఝాన్సీ. ఆమె ఎలా కారణమయ్యారంటే.. జగన్ ఈసారి విశాఖ పార్లమెంటు స్థానం నుంచి ఆమెను బరిలోకి దింపాలని నిర్ణయించారు. దీంతో గంటా బొత్స ఝాన్సీ విశాఖ పార్లమెంటు స్థానం నుంచి వైపీసీ అభ్యర్థిగా పోటీ చేయాలంటే ఆ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లన్నిటిలోనూ తాను చెప్పిన అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలన్న షరతు విధించారు. అందులో భాగంగానే తాను కూడా ఆ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని భీమిలీ నుంచి పోటీ చేస్తానని కోరారనీ, అందుకు జగన్ ఓకే అన్నారనీ వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.  దీంతో గంటా ఇప్పుడు ఎక్కడ నుంచి బరిలోకి దిగుతారన్నది ఆసక్తికరంగా మారింది. బొత్సకు ప్రత్యర్థిగా గంటాను భీమిలి నుంచి చీపురుపల్లికి మార్చాలని చంద్రబాబు భావించారు. అయితే ఇప్పుడు గంటాయే చీపురుపల్లి వదిలి భీమిలీకి మారుతుంటే.. ఇక గంటాను చీపురుపల్లికి మార్చడం ఎందుకు అని చంద్రబాబు భావించి గంటా కోరిన విధంగా భీమిలి టికెట్ ఇస్తారా అన్న చర్చ అయితే తెలుగుదేశంలో జరుగుతోంది. అదే జరిగితే..  చీపురుపల్లిలో తెలుగుదేశం ఆశావహుడు  కిమిడీ నాగార్జున అక్కడ నుంచి పోటీకి ఎటూ రెడీగా ఉన్నారు.  అయితే గంటా భీమిలి నుంచి రంగంలోకి దిగుతున్నారని తెలిస్తే అక్కడ నుంచి  పోటీకి బొత్స ఒకటికి రెండు సార్లు ఆలోచించే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉంచితే   ఇప్పటి వరకూ గంటా శ్రీనివాసరావు ఒకసారి పోటీ చేసి గెలిచిన స్థానం నుంచి రెండో సారి పోటీ చేసిన చరిత్ర లేదు. ఈ సారి ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా, లేక బోత్సకు చెక్ పెట్టేందుకు బొత్స ఒక వేళ భీమిలి నుంచి రంగంలోకి దిగితే.. గంటా కూడా అక్కడ నుంచే పోటీ చేస్తారా చూడాల్సి ఉంది. 

జగన్ కు, వైసీపీకి ఓటు వేయవద్దు.. డాక్టర్ సునీత

తన అన్న జగన్ రెడ్డికి, ఆయన పార్టీ వైసీపీకి ఓటు వేయవద్దని వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత అన్నారు. తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో జరుగుతున్న జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన డాక్టర్ సునీత ఈ రోజు హస్తినలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్ వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి శిక్ష పడాల్సిందేనన్నారు. వివేకా హత్య కేసులో తీవ్ర జాప్యం వెనుక తన సొదరుడు జగన్ రెడ్డి ఉన్నారని ఆమె ఆరోపించారు.  తన తండ్రి హత్య అనంతరం తాను జగన్ రెడ్డిని కలిశాననీ, అయితే అప్పట్లో ఆయన మోటివ్ పై ఎటువంటి అనుమానం రాలేదన్నారు. సొంత వాళ్లను అంత తేలిగ్గా అనుమానించలేమని సునీత చెప్పారు. అయితే క్రమంగా తనకు విషయాలు బోధపడుతూ, అర్ధమౌతూ వచ్చాయని సునీత వివరించారు. ఈ కేసులో తన తండ్రి గుండెపోటుతో మరణించారని తొలుత మీడియాకు చెప్పిన వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిని సీబీఐ ఇప్పటి వరకూ ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. ఆయనను కూడా విచారించాలని అన్నారు. అంతే కాదు తన తండ్రి హత్య కేసులో జగన్ పాత్రపై కూడా విచారణ జరగాలని సునీత అన్నారు.   ఇంత దారుణంగా తన తండ్రి వివేకాను హత్య చేసిన వారిని వదిలేయడం అంటే ప్రజలలో ఎలాంటి సందేశం పంపుతున్నట్లు అని ప్రశ్నించారు. ఇటువంటి నేరాలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితులకు శిక్ష పడాల్సిందేనని అన్నారు.  తన తండ్రి వివేకా జగన్ కు సొంత చిన్నాన్న అనీ, అలాంటిది సొంత చిన్నాన్న హత్య కేసు విషయంలో ఆయన వ్యవహరిస్తున్న తీరు దారుణమన్నారు. దీనిపై జగన్ ను గట్టిగా నిలదీస్తే.. ఆయన తన మీద ఇప్పటికే 11 కేసులు ఉన్నాయని... ఆ కేసుల మాదిరే ఇది పన్నెండో కేసు అవుతుందనీ అన్నారనీ, వివేకా హత్య కేసు అలా కాకూడదనే న్యాయం కోసం పోరాడుతున్నానని సునీత అన్నారు.  వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే... తన తండ్రికి న్యాయం జరగదని సునీత విస్పష్టంగా చెప్పారు. జగన్ మళ్లీ సీఎం అయితే కష్టాలు మరింత ఎక్కువవుతాయన్నారు. వివేకా హత్య కేసులో తనకు న్యాయం జరగాలని అన్నారు. నాన్న హత్యలో అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉందని... అవినాశ్ కు శిక్ష పడాల్సిందేనని చెప్పారు.  ఈ కేసులో జగన్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు అవసరం లేదని అన్నప్పుడు తాను అభ్యంతరం చెప్పానని అన్న సునీత, అప్పుడు జగన్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తుకు  వెళ్తే అవినాశ్ బీజేపీలోకి వెళ్తాడనితనతో అన్నారనీ, దీంతో జగన్ తో లాభం లేదన్న నిర్ణయానికి వచ్చి   తానే వెళ్లి సీబీఐకి ఫిర్యాదు చేశానని చెప్పారు. సీబీఐని కలిసిన తర్వాత తనకు, తన భర్తకు వేధింపులు ఎక్కువయ్యాయని అన్నారు. అనుమానితులందరినీ సీబీఐ విచారించాల్సిందేనని చెప్పారు. తనను, తన భర్తను కూడా అనుమానితులుగానే సీబీఐ విచారించిందని తెలిపారు. తనను విచారించినట్టే ప్రతి ఒక్కరినీ విచారించాలని అన్నారు. ఏది ఏమైనా తన తండ్రి హత్య కేసులో సూత్రధారులు, పాత్రధారులకు శిక్ష పడే వరకూ, తనకు న్యాయం జరిగే వరకూ విశ్రమించనని స్పష్టం చేశారు. తాను రాజకీయాలలోకి రావడం, ఎన్నికలలో పోటీ చేయడంపై ఇప్పటి వరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సునీత అన్నారు. 

ఏపీకి 465 కంపెనీల కేంద్ర ఆర్మ్ డ్ పోలీసు బలగాలు

 వచ్చే ఎన్నికలలో ఏపీలో పటిష్ట భద్రత, బందోబస్తు కోసం  465 కంపెనీల కేంద్ర ఆర్మ డ్ పోలీసు బలగాలు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శిని ఈ మేరకు ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కోరారు. ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన జవహర్ రెడ్డి ఈ మేరకు కోరారు. వచ్చే ఎన్నికలలో భద్రత బందోబస్తు కోసం 58 కంపెనీల స్పెషల్ ఆర్మ్ డ్ బలగాలు అవసరమని, ప్రస్తుతం అయితే 32 కంపెనీలు మాత్రమే ఉన్నాయన్నారు. మరో 26 కంపెనీలు పంపాలనీ కోరారు. వివిధ రాష్ట్రాల సీఎస్ లు, సీఈవోలు హోం శాఖ కార్యదర్శులతో అజయ్ భల్లా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఏపీ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికార ముఖేశ్ కుమార్ మీనా, హోం శాఖ కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. 

బీఆర్ఎస్ చలో మేడిగడ్డపై కాంగ్రెస్ చలోక్తులు

లోక్ సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ మేడిగడ్డ పేరు చెప్పి బీఆర్ఎస్ తో ఓ ఆటాడుకుంటోంది.  బీఆర్ఎస్ చలో మేడిగడ్డ పిలుపుపై చలోక్తులు విసురుతోంది. కల్వకుంట్ల కనస్ట్రక్షన్స్  మేడిగడ్డ అన్న టైటిల్ తో రిలీజ్ చేసిన ఓ పోస్టర్ కు బలే మేసినవ్ బిడ్డా అంటూ ట్యాగ్ లైన్ పెట్టి సామాజిక మాధ్యమంలో పోస్టు చేసింది. మేడిగడ్డ ఫిల్లర్ల కుంగుబాటును అదేమంత పెద్ద విషయం కాదంటూ కవరింగ్ ఇచ్చుకోవడానికి బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలను సెటైర్లతో ఎద్దేవా చేస్తూ ఓ ఆటాడుకుంటోంది. కేటీఆర్ చలో మేడిగడ్డ పిలుపుపై సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన పోస్టర్ లో కాంగ్రెస్ మేత మేసిన మేడిపండ్లన్నీ మేడిగడ్డకు బయల్దేరాయ్ అంటూ ఎకసెక్కాలాడింది.  మేడిగడ్డ లోపాలను బయటపెట్టిన కాగ్, నేషనల్ సేఫ్టీ అథారిటీల నివేదికలను ఉటంకిస్తూ  బీఆర్ఎస్ చలో మేడిగడ్డ కార్యక్రమంపై విమర్శలు గుప్పించింది. కాగ్ కు ఏం తెలుసు కాకరకాయ్, నేషనల్ సేష్టి అథారిటీకేం తెలుసు అరటికాయ్ అంటూ అసలు విషయాలన్నీ  బీఆర్ఎస్ బిల్డప్ బాబాయ్ లకే తెలుసు, ఎందుకంటే వాళ్ల అధినేత 80 వేల పుస్తకాలు చదివి మరీ ఇంజనీర్లను పక్కన పెట్టి డిజైన్ చేశారంటూ సెటైర్లు గుప్పించింది.   ఇక ఇప్పుడు ఆ అజ్ణానంతో లోపాలు సహజమే అని సమర్ధించుకోవడానికి బయలు దేరారంటూ విమర్శలు గుప్పించింది. నిజంగా మేడి గడ్డ బ్రహ్మాండంగా ఉంటే అప్పుడే ప్రభుత్వ ఆహ్వానాన్ని మన్నించి వచ్చి ఉండాల్సింది. అలా కాకుండా ఇప్పుడు దొంగల్లా మేడిగడ్డకు వచ్చి పోవడం ఎందుకని ప్రశ్నించింది.  

పార్టీల ఫేట్ మార్చేస్తున్న క్రాస్ ఓటింగ్.. ఇంతకీ బీజేపీది బలుపా.. వాపా?

తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ కాంగ్రెస్, బీజేపీలకు తలనొప్పిగా మారింది. అయితే ఈ క్రాస్ ఓటింగ్ వల్ల ఎక్కుల లబ్ధి పొందింది మాత్రం భారతీయ జనతాపార్టీయే అనడంలో  సందేహం లేదు. మోడీ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టక ముందు వరకూ బీజేపీకి ఒక ప్రత్యేక రాజకీయ పార్టీ అన్న గుర్తింపు ఉండేది. పార్టీలు మారడం, ప్రభుత్వాలను కూల్చడానికి ఎమ్మెల్యేలను గంపగుత్తగా ఆకర్షించేందుకు వ్యూహాలు పన్నడం, ప్రలోభాలకు గురి చేయడం ఇవన్నీ కాంగ్రెస్ కల్చర్ అనీ, అయితే బీజేపీ అటువంటి వాటికి దూరంగా ఉండే   విలువలు ఉన్న పార్టీగా బీజేపీకి ఒక ఇమేజ్ ఉండేది.  క్రమశిక్షణ కలిగి, విలువలు పాటించే విషయంలో బీజేపీ ముందుంటుందన్న భావన జనబాహుల్యంలో కూడా ఉండేది. అయితే 2014 ఎన్నికలలో బీజేపీ విజయం సాధించి కేంద్రంలో అధాకరం చేపట్టిన తరువాత క్రమంగా ఆ పార్టీకి ఉన్న స్పెషల్ ఇమేజ్ కనుమరుగౌతూ వచ్చింది.  అధికారం, అందుకోసం ఏం చేసినా ఫరవాలేదన్న భావన ఇప్పుడు ఆ పార్టీలో నిలువెల్లా కనిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు అయితే అధికారం ఒక్కటే చాలదు, చట్టసభల్లో మూడింట రెండు వంతుల మెజారిటీయే లక్ష్యం అంటోంది. అంతే కాదు.. దేశంలో ఇన్ని పార్టీలు ఎందుకు బీజేపీ ఒక్కటే చాలు అన్న భావన కూడా ఆ పార్టీ అగ్రనేతల్లో బలంగా వ్యక్తం అవుతోంది. కేంద్రంలో అధికారంతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ అధికారాన్ని గుప్పెట ఉంచుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. బీజేపీ తరువాత అంతటి బలం, సంస్థాగత నిర్మాణం ఉన్న కాంగ్రెస్ ను తుడిచిపెట్టేయాలన్న లక్ష్యన్ని బాహాటంగానే ప్రకటించి అందుకు అనుగుణంగా రాజకీయ అడుగులు వేస్తున్నది. అసలిప్పుడు మోడీ అండ్ కో నినాదమే కాంగ్రెస్ ముక్త భారత్.  అంటే ఆ పార్టీ లక్ష్యమేమిటో, ఉద్దేశమేమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా కాసేపు పక్కన పెట్టి ప్రస్తుతానికి వస్తే.. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ బెడదను బీజేపీ కూడా ఎదుర్కొన్నప్పటికీ, దాని వల్ల ఆ పార్టీకి ఏ మంత నష్టం వాటిల్లలేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి రాజస్థాన్ లో కోలుకోలేని దెబ్బ తగిలింది.  అసలింతకీ క్రాస్ ఓటింగ్ కు పాల్పడితే అనర్హత వేటు పడుతుందని తెలిసీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందుకు సాహసించడం వెనుక  నిస్సందేహంగా  బీజేపీ ప్రోత్సాహం ఉందని పరిశీలకులు అంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ వారి క్రాస్ ఓటింగ్ కారణంగా రాజ్యసభలో బీజేపీ బలం పెరిగింది. దీంతో ఆ పార్టీకి రాజ్యసభలో మరెవరి తోడ్పాటూ లేకుండా తన మాట చెల్లించుకోవడానికి అవసరమైన మెజారిటీని నాలుగడుగుల దూరంలో  నిలిచింది.  అయితే ఇప్పుడున్న ప్రాంతీయ పార్టీల్లో చాలా వరకూ.. బీజేపీకి పరోక్ష మద్దతుదారులుగానే ఉన్నాయి కనుక భవిష్యత్ లో  సభలో మాట నెగ్గించుకోవడం, బిల్లులు ఆమోదింప చేసుకోవడంలో బీజేపీకి ఎటువంటి ఇబ్బందులు, అడ్డంకులు ఉండవని చెప్పొచ్చు. ఇక యూపీలో కూడా బీజేపీ ఇతర పార్టీల సభ్యుల క్రాస్ ఓటింగ్ వల్ల లబ్ధి పొందింది.  అయితే కర్నాటకలో మాత్రం బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు.   మొత్తంగా 56  రాజ్యసభ సీట్లకు ఎన్నిక జరిగితే బీజేపీ 30 గెలుచుకుని, రాజ్యసభ లో 97 సీట్ల తో పెద్ద పార్టీ గా నిలిచింది. నామినేటెడ్ సభ్యులతో కలిసి ఎన్డీయే బలం 117 కి చేరింది.  ఖాళీ స్థానాలు వదిలేస్తే రాజ్యసభ బలం 240, అంటే 121 సాధారణ మెజార్టీ కి  ఎన్డీయే కేవలం నాలుగు స్థానాల దూరంలో ఉంది.   అదే  మూడింట రెండోంతుల మెజారిటీకి 39 స్థానాలు తక్కువ. అయినా అదేమీ పెద్ద అవరోథం కాదు. ఎందుకంటే వైసీపీ, బీజేడీ ,  బీఎస్పీ, బీఆర్ఎస్, ఏడిఎంకే లు ఎన్డీయేకే మద్దతు పలుకుతున్నాయి. పలుకుతాయి.  ఇలా చూసుకుంటే మరో పది మంది మద్దతు చూరగొంటే చాలు  రాజ్యసభ లో  ఎన్డీయేకు మూడింట రెండొంతుల మెజారిటీ ఉన్నట్లే. సో ఇప్పుడు ఇక బీజేపీ దృష్టంతా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఒంటరిగానే సంపూర్ణ మెజారిటీ సాధించడంపై దృష్టి కేంద్రీకరించింది. ఈ సారి లోక్ సభ ఎన్నికలలో బీజేపీ  ఒంటరిగానే 370 గెలవాలి,  అదే ఎన్డీయే స్థానాల సంఖ్య  400దాటాలి అని మోడీ పిలుపు వెనుక అర్ధం, ఉద్దేశం, లక్ష్యం ఇదే.    లోక్ సభలో మూడింట రెండోంతుల మెజారిటీ అంటే 362 స్థానాలు. ఆ బెంచ్ మార్క్ ను దృష్టిలో ఉంచుకునే మోడీ బీజేపీ గెలవాల్సిన స్థానాల సంఖ్య 370గా టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు.  ఆ లక్ష్యాన్ని సాధిస్తే   బిజెపికి ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీ  వచ్చేస్తుంది. అంటే ఇక ఇష్టారాజ్యంగా రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశ పెట్టి ఆమోదింప చేసుకోవడానికి మోడీ అండ్ కోకు ఎటువంటి ఇబ్బందులూ ఉండవు.   విపక్షాలు కూడా ఇదే భయంతో మోడీ హఠావో అంటూ జాతీయ స్థాయిలో ఐక్య కూటమి కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. మరో సారి మోడీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారన్న ఆందోళనలో బీజేపీయేతర పార్టీలున్నాయి. ఇప్పటికే 2024లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వస్తే 2029 నుంచి దేశంలో జమిలి ఎన్నికలే జరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతోంది. అయితే క్రాస్ ఓటింగ్ తో రాజ్యసభలో బీజేపీకికి పెరిగిన సంఖ్య బలుపా, వాపా అంటూ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. 

బిజెపి హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి యమునాపాఠక్ ? 

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కోసం ప్రధాని మోదీ అధ్యక్షతన  బీజేపీ కేంద్ర ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌లతో పాటూ ఇతర కీలక నేతలైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దియో సాయ్ తదితరులు పాల్గొన్నారు.  ఏప్రిల్ - మే నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల తొలిజాబితాను ఈసీ నోటిఫికేషన్ కు ముందే విడుదల చేయాలని పార్టీ యోచిస్తోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం హైదరాబాద్ ఎంపీ  బిజెపి అభ్యర్థి ప్రముఖ సామాజిక కార్యకర్త, ఆధ్యాత్మిక వేత నడింపల్లి యమునా పాఠక్ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ విషయమై చర్చించేందుకు బీజేపీ కీలక నేతలు అమిత్ షా, పార్టీ చీఫ్ జేపీ నడ్డా గతవారం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో సమావేశమయ్యారు. తెలంగాణలో పార్టీకి గట్టి పోటీ ఎదురయ్యే స్థానాలపై చర్చలు జరిపారు.హైద్రాబాద్ ఎంపీగా మజ్లిస్ పార్టీ నుంచి వరుసగా గెలుపొందుతున్న అసదుద్దీన్ ఓవైసీకి చెక్ పెట్టడానికి బలమైన అభ్యర్థిని రంగంలో దించాలని పార్టీ అధిష్టానం యోచిస్తోంది. పార్టీ నిర్వహించిన సర్వే నివేదికల్లో యమునాపాఠక్ పేరు వెల్లడయ్యింది. మతోన్మాదపార్టీగా  బిజెపికి బలమైన ముద్ర ఉంది. కేవలం హిందూ ఓట్లతో ఆ పార్టీ గెలుపొందే అవకాశాలు తక్కువే. ఇప్పటివరకు  ముస్లిం ఓట్లతో మజ్లిస్ పార్టీ గెలుపొందుతూ వస్తోంది. ఓవైసీని ఎదుర్కోవడం అంత ఆషామాషీ కాదు. ఓల్డ్ సిటీ అడ్డా మజ్లిస్ అనే అభిప్రాయాన్ని ఆమె చెరిపి వేసే ప్రయత్నం చేస్తున్నారు మజ్లిస్ పార్టీకి కంచుకోట అయిన ఓల్డ్ సిటీలో బిజెపి గెలుపుసాధ్యమేనా అని ఎవరైనా ప్రశ్నిస్తే ఆమె ఇచ్చే సమాధానం వింటే ప్రతీ భారతీయుడు ఔననే  అంటారు. ఎవరు చెప్పారు  అండి ఓల్డ్ సిటీ అడ్డా మజ్లిస్ అని ఆమె వాదనకు దిగుతారు. హైదరాబాద్ మజ్లిస్ అడ్డా  కాదని కేంద్రంలో మోదీ ప్రభుత్వం నిరూపించింది. ముస్లింల సంక్షేమం , అభివృద్ది కోసం బిజెపి ప్రభుత్వం చేస్తున్న కృషి అంతా ఇంతా కాదని ఆమె అంటున్నారు. హైదరాబాద్ ఏ కులానికో, మతానికో, ప్రాంతానికో, జాతికో పరిమితం కాదు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక హైదరాబాద్ అని నిరూపణ అయ్యింది. హైదరాబాద్ అందరి సొత్తు అంటారామె. గంగా జమున తెహజీబ్ హైదరాబాద్ అని అంటున్నారు. బిజెపి అధికార ప్రతినిధి హోదాలో  ఆమె తన గళాన్ని ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నారు. విద్య, వైద్యం అందించడంలో మజ్లిస్ పార్టీ వైఫల్యం చెందిందని యమునాపాఠక్ ఆరోపించారు. పాత బస్తీ పురవీధుల్లో నిరక్షరాస్యత తాండవిస్తుందని, ప్రతీసారి మజ్లిస్ గెలుపొందడానికి ఇదే కారణమని ఆమె అంటున్నారు. ఓవైసీ హాస్పిటల్స్ లో పేదముస్లింలకు చికిత్స జరగడం లేదని, అమాయక ప్రజలకు ఓవైసీ దోచుకుంటున్నాడని యమునాపాఠక్ బలంగా వినిపిస్తున్నారు. ముస్లింల ఎంపవర్ మెంట్ కోసం ఆమె అనెక కార్యక్రమాలు చేపడుతున్నారు. మానవ సేవయే మాధవ సేవ అనే సిద్దాంతాన్ని బలంగా నమ్మే వారిలో యమునా పాఠక్ అగ్రస్థానంలో నిలిచారు. అధికారికంగా ఆమె పేరు శుక్ర, శనివారాల్లో వెల్లడి కానుందని పార్టీ వర్గాలు తెలిపాయి. 

వివేకా హత్య కుట్రదారులెవరు?..హస్తిన వేదికగా సునీత ప్రెస్ మీట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడు  జగన్ సొంత చిన్నాన్న  వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం (మార్చి 1) న్యూఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ ఆప్ ఇండియా వేదికగా..  వివేకా హత్య.. కుట్రదారులు ఎవరు?.. అనే అంశంపై ఆమె ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ఈ ప్రెస్ మీట్‌కు సంబంధించిన ఆహ్వానం అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.  దేశ రాజధాని న్యూఢిల్లీలో తన తండ్రి హత్యపై నర్రెడ్డి సునీత ప్రెస్‌మీట్‌ ఏర్పాటుపై ఉమ్మడి కడప జిల్లా వాసులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.  వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైన నాటి నుంచి ఈ హత్య కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. బుల్లితెరలో ప్రసారమయ్యే మాంఛి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సీరియల్‌ను తలపిస్తోందని వారు సోదాహరణగా వివరిస్తున్నారు.  హత్య జరిగిన రోజు తొలుత.. వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారంటూ.. వైసీపీ  కీలక నాయకుడు, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీడియా ఎదుట ప్రకటించారు. దీంతో  వివేకా మరణ వార్త ప్రపంచానికి తెలిసింది. అయితే  కొద్ది సేపటికే.. ఆయన గుండెపోటుతో మరణించ లేదు.. దారుణ హత్యకు గురయ్యారంటూ.. మీడియాలో వరుస వార్తా కథనాలు వెల్లువెత్తడం.. దానిని సైతం పోలీసులు ధృవీకరించడంతో.. వైయస్ వివేకా దారుణ హత్యకు గురయ్యారని విషయం ప్రపంచానికి తెలిసింది. ఇక ఈ హత్య జరిగిన రోజు సాయంత్రం హైదరాబాద్ నుంచి తాపీగా పులివెందుల చేరుకున్న అప్పటి  ప్రతిపక్ష నేత   జగన్.. తన చిన్నాన్నను దారుణంగా హత్య చేశారని.. అందులో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్ర ఉందంటూ.. నర్రెడ్డి సునీత,  షర్మిల, వైయస్ అవినాష్ రెడ్డి సమక్షంలోనే ప్రకటించారు. అంతటితో ఆగకుండా  వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగిస్తేనే కానీ.. ఈ కేసులో ఉన్న పాత్రధారులు, సూత్రధారులు బహిర్గతం అవ్వరని పేర్కొన్నారు. వివేకా హత్య కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఆ మేరకు కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ కడప జిల్లా వాసులు సునీత హస్తిన వేదికగా ప్రెస్ మీట్ లో సంచలన విషయాలు వెల్లడించడం ఖాయమంటున్నారు.   అప్పట్లో జగన్ నారాసుర రక్త చరిత్ర అంటూ హడావుడి చేసిన సంగతి తెలిసిందే. సొంత బాబాయ్ హత్య అప్పటి ఎన్నికలలో వైసీపీకి సానుభూతి పవనాలు వీచడానికి కారణమై విజయానికి దోహదపడింది. దరిమిలా జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. జగన్  పాలనలో.. తన తండ్రి హత్య కేసులో  తప్పక న్యాయం జరుగుతుందన్న విశ్వాసాన్ని అప్పట్లో సునీత వ్యక్తం చేశారు. అయితే.. ఇంతలో వివేకా హత్య కేసు సీబీఐతో దర్యాప్తు చేయాలంటూ విపక్ష నేతగా తాను కోర్టులో   దాఖలు చేసిన పిటిషన్‌ను సీఎం అవ్వగానే జగన్ వెనక్కి తీసుకోవడంతో పాటు.. ఈ హత్య కేసు దర్యాప్తును దాదాపుగా నీరు గార్చేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో తన తండ్రి హత్య ఎందుకు జరిగింది.. ఎవరు చేశారు.. దీనిలో ప్రమేయం ఉన్న పాత్రధారులు, సూత్రధారులు ఎవరో బయటకు రావాలంటూ.. సోదరుడు ప్లస్ సీఎం   జగన్‌ను సునీత పలుమార్లు కోరారు.  ఆ క్రమంలో వారి మధ్య చోట చేసుకున్న సంభాషణతో.. సునీత తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం..  తన తండ్రి హత్య కేసులో దాగి ఉన్న అన్ని కోణాలు బయటకు రావాలంటే,  అందుకు సీబీఐ దర్యాప్తు ఒక్కేటే మార్గమని బావించి, న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.   ఆమె అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.     దాంతో ఈ కేసు సీబీఐ విచారణలో భాగంగా.. పలువురిని ప్రశ్నించగా.. వివేకా కారు మాజీ డ్రైవర్ దస్తగిరి ఈ కేసులో అప్రూవర్‌గా మారి.. ఈ హత్యలో ఉన్న పాత్రధారులు... తెర వెనుక ఉన్న సూత్రధారుల పేర్లు వరుసగా సీబీఐకి వివరించడమే కాకుండా...  ఈ హత్యకు కోట్లాది రూపాయిల డీల్ కుదిరిందని వెల్లడించండంతో వివేకా హత్య  ఇంటి దొంగల పనేననే విషయం ప్రపంచానికి తెలిసింది.  ఆ తర్వాత చోటు చేసుకున్న వరుస పరిణామాలలో అంటే.. కడప ఎంపీ   అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి  భాస్కరరెడ్డితోపాలు పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. అలాగే సీబీఐ విచారణకు  అవినాష్ రెడ్డి హైదరాబాద్‌లో తొలిసారి హాజరైనప్పుడు  వైసీపీ అధినేత, సీఎం   జగన్ వ్యవహరించిన తీరు దగ్గర నుంచి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డితోపాటు, భారతీ పీఏను సైతం కడపకు పిలిపించి సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించడం వరకూ ఒకెత్తు అయితే... ఆ తర్వాత సీబీఐ అధికారులకు స్థానికంగా బెదిరింపులు ఎదురు కావడం.. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలన్నీ మరొకెత్తని కడప వాసులు అంటున్నారు. అలాగే ముఖ్యమంత్రి  గన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి.. వచ్చిన ప్రతీసారి.. ఈ కేసు దర్యాప్తులో వేగం మందగించిందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా కడప వాసులు గుర్తు చేసుకుంటున్నారు.   ఇక ఆ తర్వాత ఇదే హత్య కేసులో  అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు మరోసారి విచారణకు పిలవడం.. ఆ క్రమంలో తన తల్లి తీవ్ర అనారోగ్యంతో ఉందంటూ.. కర్నూలు ఆసుపత్రిలో చేర్చడం.. దీంతో ఆ పరిసరాలకు సీబీఐ అధికారులు వెళ్లలేక పోవడం.. ఆ తర్వాత.. ఈ కేసు దర్యాప్తు ఎంత వరకు వచ్చిందంటే.. సీబీఐ అధికారులు సైతం చెప్పలేని పరిస్థితి నెలకొందనే ఓ ప్రచారం   జిల్లాలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోందని జిల్లా వాసులే ఈ సందర్బంగా పేర్కొంటున్నారు.   మరోవైపు ఇదే వివేకా హత్య కేసులో సీఎం జగన్ సొంత సోదరి వైయస్ షర్మిల.. ఢిల్లీ వెళ్లి సీబీఐ అధికారులకు వాంగ్మూలం ఇవ్వడమే కాదు.. ఆ తర్వాత ఇదే కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ప్రెస్‌మీట్ పెట్టి.. కడప ఎంపి టికెట్ విషయంలోనే వివేకా హత్య జరిగిందంటూ.. ఓ క్లూను ఆమె బాణంలా వదిలారు.  అదీకాక ఆస్తి కోసమే  వివేకా హత్య జరిగిందంటూ ఓ వాదన తెరపైకి వచ్చిన నేపథ్యంలో, షర్మిల ఆ వాదనను ఖండించడమే కాదు.. తమ చిన్నాన్నా.. తన ఆస్తులన్నీ ఎప్పుడో ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతకు రాసేశారని.. అలా అయితే ఆస్తుల కోసమే ఈ హత్య జరిగి ఉంటే.. ముందు సునీతను కదా హత్య చేయాల్సిందంటూ.. ఓ లాజిక్ జనంలోకి వదిలారు. ఆమె లాజిక్‌తో..   వివేకా హత్యపై ప్రజల్లో ఉన్న అన్ని సందేహాలు దాదాపుగా పటాపంచలు అయిపోయాయని.. ఇంకా చెప్పాలంటే.. వివేక హత్యపై ప్రజలకు ఫుల్ క్లారిటీ   వచ్చిందని.. దీంతో ఒంటరి పోరాటం చేస్తున్న సునీతకు   షర్మిల బాసటగా నిలిచినట్లు అయిందనే భావన కడప వాసులలో వ్యక్తం అవుతోంది. అయితే  వివేకా హత్యపై .. అదీ ఢిల్లీ వేదికగా ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత.. ప్రెస్ మీట్ పెట్టడం చూస్తుంటే.. తన తండ్రి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ప్రస్తుతం ఎక్కడుంది, తన తండ్రి హత్యలో పాత్రధారులు, సూత్రధారులు అరెస్ట్ కావడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది.. న్యాయస్థానాలు ఆదేశించినా, దర్యాప్తు సంస్థలు చేస్తున్న విచారణకు మోకాలడ్డుతున్నది ఎవరు?.. ఈ దేశంలో న్యాయం అనేది సామాన్యులకే కాదు.. కొంత మంది పెద్దవాళ్లు.. అందునా ఒంటరి పోరాటం చేస్తున్న వారికి అందని ద్రాక్షగానే మిగిలి పోతుందా? ఇంకా క్లారిటీగా చెప్పాలంటే.. అధికారమనే అందలం ఎక్కిన వారి ఇంటి వసారాలో న్యాయం అనేది గూటిలో రామ చిలకలాగా బందీ అయిపోయిందా? అని  కడప  జిల్లా వాసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.  ఇక సునీత నర్రెడ్డి .. ప్రెస్‌మీట్ పెట్టి.. తన తండ్రి హత్య .. కుట్రదారులు ఎవరు అని ప్రశ్నిస్తే.. కనీసం ఎన్నికల వేళ అయినా.. ఆమెకు న్యాయం జరుగుతుందా? అని జిల్లా వాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు ఈ ఏడాది మార్చి 15కు వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురై అయిదేళ్లు పూర్తి అవుతుందని వారు  ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.

ఎన్నికల బరిలో లిక్కర్ కింగ్స్!

ఎన్నికలు సమీపిస్తున్నాయి.. అభ్యర్థుల ఎంపికలో రాజకీయ పార్టీలు  సీరియస్  కసరత్తులు  చేస్తున్నాయి. ఆ క్రమంలో అంగ బలం, అర్థం బలం ఉన్నవాళ్లకు ఆ యా పార్టీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. అయితే శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లి వచ్చిన వారి పేర్లను సైతం అభ్యర్థులుగా ప్రకటించే పనిలో పార్టీలు ఉన్నాయనే ఓ ప్రచారం  పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది. నెల్లూరు లోక్‌సభ వైసీపీ అభ్యర్థిగా శరత్ చంద్రారెడ్డిని ఎంపిక చేసినట్లు ఇప్పటికే అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన.. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి సమీప బంధువు. అంతేకాదు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ ప్రధాన నిందితుల్లో ఆయన ఒకరు. అయనపై సీబీఐ, ఈడీ కేసు నమోదు చేశాయి. ఈ కేసులో ఆయన తీహార్ జైలుకు  వెళ్లి,  అప్రూవర్‌గా మారి బెయిల్‌పై బయటకు వచ్చారు.   ఇదే స్కామ్‌లో సౌత్ గ్రూప్ తరపున ఆయన అన్నీ తానై వ్యవహరించారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి.  అయితే.. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్నఅనిల్ కుమార్ యాదవ్‌ను నరసారావుపేట ఎంపీగా బరిలో దిగుతుండగా, నెల్లూరు జిల్లాలోని పలువురు వైసీపీ  ఎమ్మెల్యేలు ఇప్పటికే ఆ పార్టీకి రాజీనామా చేసి.. తెలుగుదేశంలోకి జంప్ కొట్టేశారు. అలాగే ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ బాబాయి రూప్ కుమార్‌తో పాటు పలువురు నగరపాలక సంస్థ కార్పొరేటర్లు సైతం.. వైసీపీకి  బై బై గుడ్ బై చెప్పేసి.. త్వరలో తమ రాజకీయ భవిష్యత్తు ప్రకటిస్తామని ప్రకటించేశారు.  ఇక జగన్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా  పార్టీని వీడడంతో.. నెల్లూరు జిల్లాలో ఫ్యాన్ పార్టీ పరిస్థితి పూర్తి ఆధ్వానంగా మారిపోయింది. దాంతో ఎంపీగా శరత్ చంద్రారెడ్డిని బరిలో దింపేందుకు తాడేపల్లి ప్యాలెస్‌లోని పెద్దలు పావులు కదుపుతోన్నట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ పరిస్థితి ఇలా ఉంటే.. ఆ పక్కనే ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి.. వైసీపీకి  రాం రాం చెప్పేయడమే కాదు,  రానున్న ఎన్నికల్లో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఒంగోలు ఎంపీగా బరిలో దిగుతున్నారని.. అయితే ఆయన ఏ పార్టీ తరఫున బరిలో దిగేది త్వరలో వెల్లడిస్తామని ప్రకటించారు.  ఇక ఈ మాగుంట రాఘవరెడ్డి కూడా ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో పీకల్లోతూ ఇరుక్కొని ఉండడమే కాదు.. ఆయన కూడా ఈ కేసులో తీహార్ జైలుకు వెళ్లి వచ్చారు. అయితే ఈ కేసులో తన కుమారుడిని బయటకు తీసుకు రావడంలో అధికార జగన్ పార్టీ ప్రత్యేక శ్రద్ద పెట్ట లేదంటూ.. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆడపా దడపా తన అనుచరుల వద్ద గోడు వెళ్ల బోసుకోనే వారని.. ఆయన వైసీపీకి రాజీనామా చేయడానికి అది కూడా ఒక కారణమని పోలిటికల్ సర్కిల్‌లో ఓ ప్రచారం జరుగుతోంది.  మరో వైపు..  త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులుగా మాగుంట రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డికి టికెట్లు కేటాయిస్తే.. వారు గెలుస్తారా? అనే ఓ చర్చ సైతం వాయువేగంతో పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది. ఎందుకంటే, తెలంగాణ మాజీ సీఎం, గులాబీ బాస్ కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత.. ఇదే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిండా మునిగిపోవడం... అందులోభాగంగా ఆమె మాజీ ఆడిటర్ బుచ్చిబాబు సైతం తీహార్ జైలుకు వెళ్లి.. రావడం..జరిగిందని.. కానీ ఇదే కేసులో పలుమార్లు ఈడీ, సీబీఐ విచారణకు వెళ్లి వచ్చిన కల్వకుంట్ల కవిత మాత్రం.. నేటికి జైలుకు వెళ్ల లేదు,  అయితే ఆమె జైలుకు వెళ్లక పోవడం వెనుక బీఆర్ఎస్, బీజేపీలు తెరచాటు ఒడంబడిక కారణమన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  ఈ విషయాన్ని తెలంగాణ ఓటర్లు పసిగట్టే.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఫామ్ హౌస్‌కు సాగనంపారని.. అలాంటి పరిణామాలు చోటు చేసుకొంటున్న క్రమంలో..  రానున్న ఎన్నికల్లో శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ రెడ్డి బరిలో దిగితే.. ఆయా నియోజకవర్గ ప్రజలు.. వారికి ఓటు వేసి గెలిపిస్తారా? లేకుంటే స్కామర్లు, అవినీతి పరులకు ఓటు వేసేది లేదు.. వారిని ఇంటికి సాగనంపుతామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు... తమ ఓటు హక్కు ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తారా? అన్న చర్చ కూడా  పోలిటికల్ సర్కిల్‌లో జోరుగా సాగుతోంది.

బాబు గారు.. మీరు సూపరండి!

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా  ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అరకులో  ఆమె బుధవారం (ఫిబ్రవరి 28) పర్యటించారు.  ఆ క్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకొంది. అరకులో.. అరకు కాఫీ షాప్ వద్ద నారా భువనేశ్వరి కాఫీ తాగారు. ఆమె కాఫీ తాగుతున్న పోటో తీసి.. తన అధికారిక ఎక్స్ ఖాతాలో భువనేశ్వరి పోస్ట్ చేశారు. ఆ తరువాత  కొద్దిసేపటికే  నారా చంద్రబాబు నాయుడు ఈ ఫొటో చూసి.. తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా మన గిరిజన సోదర సోదరీమణులు  ఉత్పత్తి చేసిన అరకు కాఫీ ఎలా ఉంది భువనేశ్వరీ అంటూ ప్రశ్నించారు.   ఆ వెంటనే నారా భువనేశ్వరి తన భర్త చేసిన ట్వీట్ కు తనదైన శైలిలో ఎక్స్‌లో స్పందించారు. ఈ కాఫీ బాగా నచ్చిందండి. మన వంట గదిలో ఈ అరకు కాఫీ ప్యాకెట్లు ఉన్నప్పటికీ.. అరుకు లాంటి అందమైన ప్రదేశాల్లో ఇక్కడి ప్రజల మధ్య కూర్చుని కాపీ తాగుతుంటే.. ఈ అరకు కాఫీ రుచి మరింత మధురంగా ఉందండి. ఈ కాఫీ ఇంత అద్భుతంగా ఉండడం వెనుక దాగి ఉన్న రహస్యం.. మన గిరిజన సోదర సోదరీమణులు పెంచుకున్న ప్రేమేనని ఆమె అభివర్ణించారు. అలాగే అరకు కాఫీని ప్రపంచ బ్రాండ్‌గా మార్చిన ఘనత మీదేనని.. అందుకు తాను గర్వపడుతున్నానని.. ఎక్స్ వేదికగా చంద్రబాబుకు నారా భువనేశ్వరి తెలిపారు.  ఎక్స్  వేదికగా వీరిరువురి మధ్యా చోటు చేసుకున్న సంభాషణ.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.. అవుతోంది.   చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అరకు కాఫీ బ్రాండ్ అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రవేశ పెట్టి.. ఆ కాఫీ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేసే అవకాశాన్ని కల్పించారు. ఈ కాఫీ సాగు ద్వారా గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో.. వారంతా కాఫీ సాగు పట్ల  ఆసక్తి కనబరిచారు. దీంతో అరకు కాఫీకి అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి గిరాకీ ఏర్పడింది.   ఈ అరకు కాఫీ రుచికి ప్రపంచంలోని కాఫీ ప్రేమికులంతా ఫిదా అయిపోయారు. అరకు రైతులు.. కెమికల్స్  ఉపయోగించకుండా.. అరకులో కాఫీ పంట సాగు చేస్తున్నారు. ఇంకా స్పష్టంగా చేప్పాలంటే.. సేంద్రియ పద్దతుల్లో కాఫీ తోటలను పెంచుతున్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని కొండ ప్రాంతాలైన అనంతగిరి, పాడేరు, పెద్ద బయలు, జి మాడుగులతోపాటు ఒడిశాలోని కోరాపుట్ ప్రాంతాల్లో ఈ కాఫీ పంటను సాగు చేస్తున్నారు.  ఇక్కడ పండిన పంటను పలు యూరోపియన్ దేశాలతోపాటు.. పలు ఇతర దేశాలకు  ఎగుమతి అవుతోంది. అమెరికా బ్రిటన్ తదితర దేశాల్లో ఇప్పటికే అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేశారంటే.. అరకు కాపీ రుచిలో ఉన్న మత్తు.. గమ్మత్తు ఏంటో అర్థమవుతోంది. ఇక గతేడాది సెప్టెంబర్‌లో దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా జీ 20 సదస్సు జరిగింది. ఈ సదస్సుకు విచ్చేసిన వివిధ దేశాధ్యక్షులు అరకు కాఫీ రుచి చూసి.. మనస్సు పారేసుకున్నారు. అదీ అరకు కాఫీకి ఉన్న పవర్.

రుషికొండ‌లో క్షుద్ర పూజ‌లు?.. నరబలి?

రుషికొండ‌లో క్షుద్ర పూజ‌లు జ‌రిగాయా? అందుకే మీడియాను సైతం అనుమ‌తించ‌లేదా? వంద‌ల కోట్ల‌ ప్ర‌భుత్వ భ‌వ‌నాల‌ను సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాకుండా మంత్రి రోజా, వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు అంత ర‌హ‌స్యంగా ఎందుకు ప్రారంభించాల్సి వ‌చ్చింది? రుషికొండ‌పై నిర్మించిన భ‌వ‌నాలు టూరిజంకోసం వినియోగించేందుకా? ప్ర‌చారం జ‌రుగుతున్న‌ట్లు సీఎం క్యాంప్ కార్యాలయానికా? రుషి కొండ‌పై అస‌లేం జ‌రుగుతోంది..? ప్ర‌స్తుతం ఈ అంశాల‌పై ఏపీ ప్ర‌జ‌ల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతుంది. మ‌రి కొద్ది రోజుల్లో ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఎన్నిక‌ల ముందు హ‌డావిడిగా ఈ భ‌వ‌నాల‌ను మంత్రి రోజా ప్రారంభించారు. అందులోనూ స్వ‌రూపానంద స్వామీజీ కూడా ఉన్నారు. దీంతో అనేక అనుమానాలు త‌లెత్తుతున్నాయి. ప్ర‌జాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అయితే రుషికొండ భ‌వ‌నాల్లో న‌ర‌బ‌లి జ‌రిగింద‌ని, అందుకే స్వ‌రూపానంద వెళ్లారంటూ ఆరోపించారు. పాల్ వ్యాఖ్య‌ల‌కు ఎలాంటి ఆధారాలు లేక‌పోయినా.. ప్ర‌భుత్వ భ‌వ‌నాల‌ను ర‌హ‌స్యంగా ప్రారంభించ‌డంపై ఏపీ ప్ర‌జ‌ల్లో ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. విశాఖ‌లో ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌. ఈ కొండ‌ను అక్ర‌మంగా త‌వ్వేసిన తీరుపై మొద‌టి నుంచి విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌తిప‌క్షాల‌తోపాటు విశాఖ ప్ర‌జ‌లు సైతం రుషికొండ‌పై త‌వ్వ‌కాల‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. రుషికొండ‌పై అనుమ‌తులు ఒక‌లా.. ప‌నులు మ‌రోలా జ‌ర‌గ‌డం వివాదాస్ప‌దంగా మారింది. రుషికొండ‌పై రిసార్ట్స్ పున‌రుద్ద‌ర‌ణ‌కు ఏపీటీడీసీ కేంద్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ నుంచి 9.88 ఎక‌రాల‌కు సీఆర్‌జ‌డ్ అనుమ‌తి తీసుకుంది. జీవీఎంసీ నుంచి మాత్రం భ‌వ‌న నిర్మాణాల ప్లాన్‌కోసం 65 ఎక‌రాల‌కు అనుమ‌తి కోర‌డం అప్ప‌ట్లో వివాదాస్ప‌దంగా మారింది. జీవీఎంసీకీ స‌మ‌ర్పించిన ప్లాన్‌లోని భ‌వ‌నాల‌కు సంబంధించిన ఆకృతులు ప‌ర్యాట‌క వ‌స‌తుల‌కు వీలుగా లేవు. దాదాపు అన్ని నిర్మాణాల ఆకృతులు కార్యాల‌యాల‌ను పోలి క‌నిపించ‌డం అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీనికి తోడు మొద‌టి నుంచి ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు రుషికొండ‌పై త‌వ్వ‌కాల‌ను త‌ప్పుబ‌డుతూ వ‌చ్చారు. హైకోర్టు, జాతీయ హ‌రిత ట్రైబ్యున‌ల్ (ఎన్‌జీటీ)లో కేసులు దాఖ‌ల‌య్యాయి. హైకోర్టు ఆదేశాల మేర‌కు అయిదుగురు స‌భ్యుల నిపుణుల క‌మిటీ రుషికొండ మీద స‌ర్వే చేప‌ట్టి ప‌లు ఉల్లంఘ‌న‌లు జ‌రిగాయ‌ని తేల్చింది. ఆ త‌రువాత హైకోర్టు కేంద్ర అట‌వీ ప‌ర్యావ‌ర‌ణ మంత్రిత్వ శాఖ ను ప‌రిశీల‌న‌కు ఆదేశించింది. ఎంవోఈఎఫ్ సైతం నిపుణుల క‌మిటీతో ప‌రిశీలించింది. దీనికి సంబంధించి తుది తీర్పు త్వ‌ర‌లో రానుంది. తీర్పు రాక‌ముందే.. ఈ భ‌వ‌నాలు ప్రారంభించ‌డం వివాదాస్ప‌దంగా మారింది. కోర్టు ఈ అంశాన్ని సిరీయ‌స్ గా తీసుకుంటే రోజాకు ఇబ్బందులు త‌ప్ప‌వ‌నే వాద‌న ఉంది. రుషికొండ వద్ద పలు భవనాలను ప్రభుత్వం ప్రారంభించిన నేపథ్యంలో ఆ ప్రాంతానికి ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ వెళ్లారు. అయితే  పోలీసులు ఆయ‌న్ను అడ్డుకున్నారు. ఈ సంద‌ర్భంగా పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.. రుషికొండ లోపల ఏం జరుగుతుందో తెలియాలి. ప్రభుత్వ కార్యక్రమానికి ఎందుకు అంత రహస్యం అని ప్రశ్నించారు. శారదా పీఠం స్వామిని పిలిచారు. లోపల నరబలి ఏమయినా జరిగిందేమో అని అనుమానం ఉంది. ఇదే స్వ‌రూపానంద తెలంగాణ‌లో కేసీఆర్ కోసం న‌ర‌బ‌లి ఇచ్చారని ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పుడు జ‌గ‌న్ కోసం అదే చేస్తున్నారని అనుమానంగా ఉంది. న‌ ర‌బ‌లి ఇచ్చాడు కాబ‌ట్టే ఎవ‌ర్నీ రానివ్వ‌డం లేదంటూ పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రుషికొండ అక్రమాలు, ప్రారంభోత్సవాలపై కోర్టుకు వెళ్లి పిల్ వేస్తానని కేఏపాల్ స్పష్టం చేశారు. అయితే, భ‌వ‌నాల ప్రారంభం త‌రువాత టూరిజం మంత్రి రోజా మాట్లాడుతూ.. రుషికొండ‌లో హ‌రిత రిసార్ట్స్ పాత‌వి ఉండేవి.. వాటి స్థానంలో అత్యంత ఆధునిక ప‌ద్ద‌తుల్లో ఏడు బిల్డింగ్ లు నిర్మాణం చేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. టూరిజం కోసం అన్ని అనుమతులూ తీసుకొని వాటిని నిర్మాణం చేయ‌టం జ‌రిగింది. విశాఖ నుంచి  పాల‌న ప్రారంభ‌మైతే సీఎం జ‌గ‌న్ క్యాంప్ కార్యాల‌యం ఎక్క‌డ నుంచి అయితే బాగుంటుంద‌ని త్రీమెన్ క‌మిటీ ప‌లు ప్రాంతాల‌ను చూసింద‌ని, రుషికొండను క్యాంప్ కార్యాల‌యంగా చేసుకొని పాల‌న సాగిస్తే బాగుంటుంద‌ని చెప్ప‌డం జ‌రిగింద‌ని రోజా తెలిపారు. అయితే, అది సీఎం జ‌గ‌న్ ఇష్ట‌మ‌ని, సీఎం క్యాంప్ కార్యాల‌యంగా అది వినియోగించుకోక‌పోతే టూరిజం భ‌వ‌నాలుగా కొన‌సాగుతాయ‌ని రోజా చెప్పారు. మొత్తానికి జ‌గ‌న్ క్యాంప్ కార్యాల‌యం కోస‌మే ఈ భ‌వ‌నాలు నిర్మాణం చేసిన‌ట్లు రోజా చెప్ప‌క‌నే చెప్పారు. ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ హ‌డావుడిగా రుషికొండ‌పై భ‌వ‌నాల‌ను ర‌హ‌స్యంగా ప్రారంభించ‌డం వెనుక జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పెద్ద ప్లాన్ ఉంద‌ని తెలుస్తోంది. అమ‌రావ‌తిని నిర్వీర్యం చేసేందుకు రాష్ట్రంలో మూడు రాజ‌ధానుల‌ను ఏర్పాటు చేస్తాన‌ని, అందులో విశాఖ‌ను ప‌రిపాల‌న రాజ‌ధానిగా ఉంటుంద‌ని జ‌గ‌న్ చెబుతూ వ‌స్తున్నారు. మూడు రాజ‌ధానుల కాన్సెప్ట్ ను ఏపీ ప్ర‌జ‌లు తీవ్రంగా వ్యతిరేకించారు.   అయినా.. జ‌గ‌న్ త‌న మొండి వైఖ‌రితో విశాఖ నుంచి పాల‌న సాగించేందుకు అనేక ప్ర‌య‌త్నాలు చేస్తూ వ‌చ్చారు. కానీ కోర్టులు మొట్టికాయ‌లు వేస్తుండ‌టంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వం వెనుక‌డుగు వేసింది. తాజాగా కోర్టుల‌ను ధిక్క‌రించేలా జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తున్నద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. రుషికొండ‌పై నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా సుమారు 500 కోట్ల‌తో నిర్మాణం చేసిన భ‌వ‌నాలను మంత్రి రోజా, వైసీపీ నేత‌లు మీడియాను సైతం అనుమ‌తించ‌కుండా ప్రారంభించారు. రోజా టూరిజం మంత్రి కాబ‌ట్టి ఆమె ప్రారంభిస్తే అవి టూరిజం భ‌వ‌నాలేన‌ని ప్ర‌జ‌ల‌ను నమ్మించవచ్చని జగన్ అండ్ కో వ్యూహాత్మకంగా వీటిని ఆమె చేత ప్రారంభింపచేశారు. అయితే ఆ వ్యూహం వికటించింది. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం ఎన్నిక‌ల స‌మ‌యం వ‌ర‌కు సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వారంలో మూడు రోజులు ఈ భ‌వ‌నాల్లో ఉంటార‌ని తెలుస్తోంది. త‌ద్వారా విశాఖ నుంచి పాల‌న చేస్తాన‌న్న త‌న మాట‌ను నెగ్గించుకునేందుకు జ‌గ‌న్ ఇలాంటి ఎత్తుగ‌డ వేశార‌ని పరిశీలకులు అంటున్నారు.

సిక్కోలులో వైసీపీ సీన్ సితారే!.. తెలుగుదేశం, జనసేన కూటమి క్లీన్ స్వీప్ ఖరారే!

ఉమ్మ‌డి శ్రీ‌కాకుళం జిల్లాలో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీకి గ‌ట్టి షాకిచ్చేందుకు ప్ర‌జ‌లు రెడీ అయిపోయారు. జిల్లాలో మొత్తం 10 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి.  గ‌త ఎన్నిక‌ల్లో రెండు నియోజ‌క‌వ‌ర్గాలు మిన‌హా మిగిలిన అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ విజయం సాధించింది. అయితే నాలుగున్న‌రేళ్ల జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌జావ్య‌తిరేక‌ పాల‌న‌పై ఉమ్మడి సిక్కోలు జిల్లా ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ ఉద్దండులు ఉన్నారు. త‌మ్మినేని సీతారాం, ధ‌ర్మాన సోద‌రుల‌తో పాటు తెలుగుదేశం ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు వంటి బ‌డా రాజ‌కీయ నేత‌లు ఉన్నారు. వైసీపీ నుంచి సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన నేత‌లు విజ‌యం సాధించినా జిల్లాలో అభివృద్ధి ఆశించిన స్థాయిలో జ‌ర‌గ‌లేద‌ని ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  వైసీపీ హ‌యాంలో ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ నేత‌లు భూక‌బ్జాలకు పాల్ప‌డంతోపాటు, దౌర్జ‌న్యాల‌కు దిగినట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో కుటుంబ స‌భ్యుల పెత్త‌నం.. ఇలా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో నూ  వైసీపీపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుని పెల్లుబుకుతోంది. నాలుగున్న‌రేళ్ల వైసీపీ పాల‌న‌పై ఆగ్ర‌హంతో ఉన్న ప్ర‌జ‌లు తెలుగుదేశంకు మ‌ద్ద‌తుగా నిలుస్తామని బాహాటంగానే చెబుతున్నారు. అంతే కాకుండా టీతెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మిగా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతుండ‌టంతో ఉమ్మ‌డి శ్రీ‌కాకుళం జిల్లాలో ఈ కూట‌మి క్లీన్ స్వీప్ చేయ‌డం ఖాయ‌మ‌ని ప‌రిశీల‌కులు విశ్లేషిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా పరిస్థితి ఎలా ఉందంటే..  ఇచ్ఛాపురం:  ఇచ్ఛాపురం నియోజ‌క‌వ‌ర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట‌. ఈ నియోజ‌క‌వ‌ర్గంనుంచి తెలుగుదేశం  అభ్యర్థిగా  2014, 2019 ఎన్నిక‌ల్లో బెందాళం అశోక్ విజ‌యం సాధించారు. రానున్న ఎన్నికలలో కూడా ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ, జ‌న‌సేన కూట‌మి అభ్య‌ర్థిగా అశోక్ మ‌రోసారి బ‌రిలోకి దిగుతున్నారు. 2024 ఎన్నిక‌ల్లో అశోక్ ను ఓడించాల‌ని వైసీపీ అధిష్టానం ప‌ట్టుద‌ల‌తో ఉంది.  ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా పిరియా సాయిరాజ్ పోటీచేసి ఓడిపోయారు.  వైసీపీ అధిష్టానం సాయిరాజ్ ను త‌ప్పించి ఈసారి ఎన్నిక‌ల్లో ఆయ‌న స‌తీమ‌ణి పిరియ విజ‌య‌ను బరిలోకి దింపింది. అయితే  నియోజ‌క‌వ‌ర్గం వైసీపీలో అంత‌ర్గ‌త విభేదాల‌కు తోడు, జ‌గ‌న్ ప్ర‌భుత్వ ప్ర‌జావ్య‌తిరేక‌ పాల‌న‌పై  ప్ర‌జ‌ల్లో తీవ్ర‌వ్య‌తిరేక‌త ఆ పార్టీ విజయానికి అవరోధాలుగా మారియి. ఇచ్ఛాపురం అంటేనే తెలుగుదేశం పార్టీకి కంచుకోట‌. దీనికి తోడు  జ‌గ‌న్ పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త కలిసి  బెందాళం అశోక్ హ్యాట్రిక్ విజ‌యం సాధించడం ఖాయ‌మ‌న్న భావన స్థానికంగా బలంగా వ్యక్తమౌతోంది.  పలాస: ప‌లాస నియోజ‌క‌వ‌ర్గంలో ఈసారి  తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మి విజ‌యం ఖాయంగా క‌నిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా సీదిరి అప్ప‌ల‌రాజు బ‌రిలో నిలిచి టీడీపీ అబ్య‌ర్థి గౌతు శిరీష‌పై విజ‌యం సాధించారు. ప్ర‌స్తుతం అప్ప‌ల‌రాజుపై నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తమ‌వుతోంది. నాలుగున్న‌రేళ్ల కాలంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో ఆయ‌న పూర్తిగా విఫలమయ్యారు.  దీనికితోడు భూక‌బ్జాల ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వైసీపీలోనూ అప్ప‌ల‌రాజుపై వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. గౌతు శిరీష గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన‌ప్ప‌టికీ.. నాలుగున్న‌రేళ్లుగా ప్ర‌జ‌ల్లోనే ఉంటూ,  నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో కీల‌క భూమిక పోషిస్తున్నారు. మ‌రోవైపు తెలుగుదేశం శ్రేణుల‌కు అండ‌గా ఉంటూ వస్తున్నారు. ఆమెపై నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల్లో సానుభూతి ఉండ‌టంతోపాటు ఆమెను గెలిపిస్తే నియోజ‌క‌వ‌ర్గం  అబివృద్ధి జ‌రుగుతుంద‌ని   భావిస్తున్నారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో గౌతు శిరీష్ తెలుగుదేశం, జ‌న‌సేన కూటమిఅభ్య‌ర్థిగా బ‌రిలో నిలిస్తే విజయం నల్లేరు మీద బండినడకేనంటున్నారు.  టెక్కలి:  టెక్క‌లి నియోజ‌క‌వ‌ర్గం కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోటేనని చెప్పాలి. రాష్ట్ర విభజన తరువాత జరిగిన రెండు ఎన్నికలలోనూ అంటూ  2014, 2019 ఎన్నిక‌ల్లో ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు ఈ నియోజకవర్గం నుంచి విజ‌యం సాధించారు. మ‌రోసారి అచ్చెన్నాయుడు ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఇక వైసీపీ నుంచి  దువ్వాడ శ్రీ‌నివాస్ రావు బ‌రిలో దిగుతున్నారు.  వైసీపీ అధిష్టానం ఆయ‌న్ను నియోజ‌క‌వ‌ర్గ పార్టీ ఇంచార్జిగా నియ‌మించింది.  దువ్వాడ‌కు మాస్ లీడ‌ర్‌గా పేరున్న‌ప్ప‌టికీ, వైసీపీలో  ఒక బలమైన వర్గానికి ఆయన పొడగిట్టదు.   ఆయ‌న స‌తీమ‌ణి దువ్వాడ వాణి నియోజ‌క‌వ‌ర్గ  వైసీపీలో కీల‌క నేత‌గా ఉన్నారు. ఆమెతోనూ దువ్వాడ శ్రీ‌నివాస్ కు విబేధాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. దీనికితోడు జ‌గ‌న్ పాల‌న‌పై నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో తీవ్ర అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది. ఏ విధంగా చూసినా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో  తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి విజయం తథ్యమని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదని స్థానికులే బాహాటంగా చెబుతున్నారు.  పాతపట్నం: పాత‌ప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నికల్లో వైసీపీ అభ్య‌ర్థిగా రెడ్డి శాంతి విజ‌యం సాధించారు. అయితే  ఆమెకు ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గంలో ఎదురుగాలి వీస్తోంది. వైసీపీలో వ‌ర్గ విబేధాల‌కు తోడు, నాన్ లోక‌ల్ ముద్ర కారణంగా ఈసారి ఆమె ఎన్నిక‌ల బ‌రిలో నిలిస్తే ఓట‌మి ఖాయ‌మ‌ని వైసీపీ నేత‌లే బాహాటంగా చెబుతున్నారు. దీంతో వైసీపీ అధిష్టానం ఆమెను మార్చి కొత్త వారికి అవ‌కాశం ఇస్తుందన్న ప్ర‌చారం విస్తృతంగా జరుగుతోంది. ఇక తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మి అభ్యర్థిగా  కలమట వెంకటరమణ మూర్తి బ‌రిలోకి దిగే అవ‌కాశం ఉంది.  ప్ర‌స్తుతం ఆయ‌న నియోజకవర్గ తెలుగుదేశం   ఇంచార్జిగా ఉన్నారు.  పొత్తులో భాగంగా పాతపట్నం నియోజకవర్గం జనసేనకు కేటాయిస్తే ఏమో కానీ, లేకుంటే తెలుగుదేశం అభ్యర్థిగా  కలమట వెంకటరమణ మూర్తి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌డం ఖాయంగా క‌నిపిస్తున్నది. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మి అభ్య‌ర్థిగా ఎవ‌రు పోటీలోకి దిగినా విజ‌యం న‌ల్లేరుపై బండినడకేనని అంటున్నారు.  శ్రీకాకుళం:  శ్రీ‌కాకుళం నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. మ‌రోసారి వైసీపీ నుంచి ఆయ‌నే పోటీచేయ‌నున్నారు. అయితే, ఈసారి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ఓట‌మి ఖాయ‌మ‌న్న వాద‌న నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల నుంచే బలంగా వినిపిస్తోంది. ప్ర‌భుత్వ వ్యతిరేకతకు తోడు ధ‌ర్మాన గ్రాఫ్ కూడా రోజురోజుకు ప‌డిపోతుండటం స్పష్టంగా తెలుస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నియోజకవర్గంలో అ భివృద్ధి అన్నదే లేకపోవడం, ధర్మాన నియోజకవర్గ సమస్యలను పట్టించుకోకపోవడంతో ప్రజాగ్రహం తీవ్రంగా ఉంది.  దీనికి తోడు వైసీపీలోని వ‌ర్గ‌ విభేదాలులు ధ‌ర్మాన‌కు మరిన్ని తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి.  ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం, జ‌న‌సేన కూటమి అభ్య‌ర్థిగా గుండ ల‌క్ష్మీదేవి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే అవ‌కాశం ఉంది. ఆమెపై నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో సానుభూతి ఉంది. పొత్తులో భాగంగా జ‌న‌సేన ఓట్లు కూడా బ‌దిలీ అయితే ఆమె విజయం సునాయాసమే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.      ఆమదాలవలస:  ఆముదాల వ‌ల‌స నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఎన్నిక‌ల్లో త‌మ్మినేని సీతారాం వైసీపీ అభ్య‌ర్థిగా విజ‌యం సాధించారు. ఆయ‌న ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ గా కొన‌సాగుతున్నారు. అయితే, నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌నపై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. అభివృద్ధిని గాలికొదిలేశాన్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. దీనికితోడు నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న కుటుంబ స‌భ్యుల జోక్యం ఎక్కువైంద‌న్న ఆరోప‌ణ‌లూ ఉన్నాయి. అలాగే త‌మ్మినేని తీరుప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గంలోని వైసీపీ నేత‌లు సైతం తీవ్ర ఆగ్రహంతో  ఉన్నారు. తెలుగుదేశం అభ్యర్థిగా ఇక్కడ నుంచి కూన ర‌వికుమార్  మ‌రోసారి బ‌రిలోకి దిగుతున్నారు. త‌మ్మినేని ప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల నుంచి వ్య‌క్త‌మ‌వుతున్న వ్య‌తిరేక‌త కూన ర‌వికుమార్ విజ‌యానికి దోహ‌దం కానుంది.  వైసీపీ ప్ర‌భుత్వంపైనా ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. దీనికితోడు తెలుగుదేశం, జ‌న‌సేన పొత్తు రవికుమార్ విజయాన్ని ఖాయం చేసేసిందని పరిశీలకులు అంటున్నారు.  ఎచ్చెర్ల: ఎచ్చెర్ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా గొర్లె కిరణ్ కుమార్ పోటీ చేసి విజ‌యం సాధించారు. టీడీపీ అభ్య‌ర్థి కిమిడి కళా వెంకటరావు ఓట‌మి పాల‌య్యారు. ప్ర‌స్తుతం వైసీపీపై నియోజ‌క‌వ‌ర్గంలో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంది. జ‌గ‌న్ ప్ర‌జావ్య‌తిరేక‌త విధానాల‌కుతోడు స్థానిక ఎమ్మెల్యే తీరుపైనా ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.  నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ఆనవాలే లేకపోవడం,  వైసీపీలో వ‌ర్గ విభేదాలు వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి ఓట‌మికి కార‌ణాలుగా మార‌నున్నాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో  తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మి ప‌ట్ల ప్ర‌జ‌ల్లో సానుకూలత ఉంది. అయితే  టీడీపీ అభ్య‌ర్థిగా కిమిడి క‌ళా వెంక‌ట‌రావు బ‌రిలోకి దిగుతారా లేదా పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గం ఈ సారి జనసేనకు కేయాయిస్తారా అన్న విషయంలో స్పష్టత లేదు. అయితే తెలుగుదేశం, జ‌న‌సేన కూటమి అభ్య‌ర్థిగా ఎవ‌రు బ‌రిలో నిలిచినా విజ‌యం త‌ధ్య‌మ‌న్నభావన నియోజకవర్గ ప్రజలలో వ్యక్తం అవుతోంది.  నరసన్నపేట: న‌ర‌స‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గ  సిట్టింగ్ ఎమ్మెల్యేగా ధ‌ర్మాన కృష్ణ దాస్ ఉన్నారు. మ‌రోసారి ఆయ‌నే వైసీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగ‌బోతున్నారు. అయితే, వైసీపీ ప్ర‌భుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకత ఆయన విజయానికి పెద్ద అవరోధంగా మారనుంది. అలాగే నియోజకవర్గంలో వైసీపీలోని గ్రూపు తగాదాలు కూడా ధర్మాన కృష్ణదాస్ కు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. మ్మెల్యేగా  ధ‌ర్మాన కృష్ణదాస్ నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదన్న ఆగ్రహం కూడా జనంలో వ్యక్తం అవుతున్నది.  నరసన్న పేట నుంచి గత ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థిగా బగ్గు రమణ మూర్తి పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి ఇక్కడ నుంచి  రామ్మోహ‌న్ నాయుడు బ‌రిలోకి దిగుతార‌న్న చ‌ర్చ జ‌రుగుతున్నది. తెలుగుదేశం, జనసేనల నుంచి  అభ్య‌ర్థిగా ఎవ‌రు బ‌రిలోకి దిగినా విజ‌యం ఖాయ‌మ‌ని ప‌రిశీల‌కులు విశ్లేషిస్తున్నారు.  రాజాం: రాజాం నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి కంబాల జోగులు విజ‌యం సాధించారు. 2014, 2019 ఎన్నిక‌ల్లో రెండుసార్లు వైసీపీ అభ్య‌ర్థిగా ఆయ‌నే విజ‌యం సాధించారు. అయితే ప్రస్తుతం నియోజకవర్గంలో ఆయనకు ఎదురుగాలి వీస్తున్నది. ఎమ్మెల్యే పని తీరు పట్ల నియోజకవర్గ ప్రజలలో  తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీంతో జగన్ కంబాల జోగులును తప్పించి  డాక్టర్ తాలె రాజేష్ ను అభ్యర్థిగా బరిలోకి దింపుతోంది.  ఈ నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం పార్టీకి  బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉంది. దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది. రాజం నుంచి  కొండ్రు ముర‌ళి లేదా మాజీ స్పీకర్ ప్ర‌తిభాభార‌తి కుమార్తె గీష్మ‌ పోటీలో నిలిచే అవకాశం ఉంది. వీరిద్దరిలో ఎవరు అభ్యర్థిగా నిలిచినా విజయం నల్లేరు మీద బండినడకేనంటున్నారు.   పాలకొండ: పాల‌కొండ నియోజ‌క‌వ‌ర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేగా విశ్వ‌స‌రాయి క‌ళావ‌తి ఉన్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల్లో వైసీపీ పట్ల తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. విశ్వ‌స‌రాయి వైసీపీ అభ్య‌ర్థిగా మ‌రోసారి బ‌రిలోకి దిగే అవ‌కాశం ఉంది. అయితే  ఆమె హ‌యాంలో నియోజ‌క‌వ‌ర్గంలో ఎలాంటి అభివృద్ధి జ‌ర‌గ‌లేద‌ని ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. దీనికితోడు వైసీపీలో ఆమె వ‌ర్గ‌ పోరును ఎదుర్కొంటున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ  అభ్య‌ర్థిగా నిమ్మక జయకృష్ణ మ‌రోసారి బ‌రిలోకి దిగే అవ‌కాశం ఉంది.   జ‌న‌సేన బ‌లంకూడా తోడుకానుండ‌టంతో నిమ్మక జయకృష్ణ విజ‌యం ఖాయ‌మ‌ని ప‌రిశీల‌కులు విశ్లేషిస్తున్నారు.

తెలుగుదేశం జనసేన కూటమిదే అధికారం.. తేల్చేసిన మరో సర్వే?

మరో పది పదిహేను రోజులలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఏ విధంగా చూసినా మరో నెలా పదిహేను రోజులలో ఏపీలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజకీయ టెంపరేచర్ ను పీక్స్ కు చేర్చేసింది. ముఖ్యంగా అధికార వైసీపీలో ఓటమి భయం రోజు రోజుకూ పెరిగిపోతున్నది. ఇప్పటికే పలు సర్వేలు రాష్ట్రంలో వైసీపీ విజయం అసాధ్యమంటూ తేల్చేశాయి. రాబోయే సర్కార్ తెలుగుదేశం, జనసేన కూటమిదేనని ఢంకా బజాయించేశాయి. తాజాగా మరో సర్వే కూడా అదే విషయాన్ని చెప్పింది. ఏబీపీ నిర్వహించిన తాజా సర్వేలే తెలుగుదేశం, జనసేన కూటమి 142 స్థానాలలో విజయం సాధించి రాష్ట్రంలో  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ఆ సర్వే పేర్కొంది. ఇక అధికార వైసీపీ కేవలం 32 స్థానాలకే పరిమితమౌతుందని తేల్చిందని సామాజిక మాధ్యమంలో విస్తృతంగా సర్క్యులేట్ అవుతోంది. అయితే ఏబీపీలైవ్. కామ్ ఏపీ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి సర్వే విడుదల చేయలేదని వివరణ ఇచ్చింది. అయినా సామాజిక మాధ్యమంలో మాత్రం ఏబీపీ సీఓటర్ సర్వే విస్తృతంగా సర్క్యలేట్ అవుతున్నది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే పలు సర్వేలు ఏపీలో జగన్ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమని తేల్చేశాయి. వాటిలో అత్యం ప్రతిష్టాత్మకమైన రైజ్ సంస్థ సర్వే అయితే రాష్ట్రంలో పాతిక లోక్ సభ స్థానాలకు గానూ తెలుగుదేశం జనసేన కూటమి 15 స్థానాలలో విజయం సాధిస్తుందని ఓటింగ్ శాతం ఎలా ఉండబోతోంది తదితర గణాంకాలతో సహా పక్షం రోజుల కిందట వెల్లడించింది. ఆ మేరకు చూసుకున్నా తెలుగుదేశం, జనసేన కూటమి కనీసం 100కు పైగా అసెంబ్లీ నియోజకవర్గాలలో విజయం కేతనం ఎగురవేయడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఏపీలో ఎన్నికలకు ఇంకా గట్టిగా రెండు నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో సర్వే సంస్థలు కూడా ప్రజల నాడిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో సర్వే సంస్థలు ఏపీలో తన ఫలితాలను వెల్లడించేయగా.. ఒకటీ రెండు మినహా దాదాపు అన్ని సంస్థలు ఏపీలో ఈసారి టీడీపీదే అధికారం అని తేల్చేశాయి. కాగా, ఇప్పుడు మరో సంస్థ కూడా టీడీపీ-జనసేనలు ఏపీ అధికారం దక్కించుకోవడం ఖాయంగా చెప్తున్నాయి. అలాగే వైసీపీ కేవలం ఐదు లోక్ సభ స్థానాలలోనే విజయం సాధిస్తుందని రైజ్ సర్వే పేర్కొన్నది. ఆమేరకు చూసుకుంటే ఆ పార్టీ కేవలం 35 అసెంబ్లీ స్థానాలలోనే విజయం సాధిస్తుందని అంటున్నారు. స్థానాలలోనే గెలుస్తుందని పరిశీలకులు చెబుతున్నారు. ఇక రాష్ట్రంలో మిగిలిన ఐదు లోక్ సభ నియోజకవర్గాలలోనూ తెలుగుదేశం, జనసేన కూటముల మధ్య తీవ్ర పోటీ ఉంటుందనీ, మళ్లీ ఇందులో మూడు స్థానాలలో తెలుగుదేశం, జనసేన కూటమి వైపే మొగ్గు ఉందని సర్వే పేర్కొన్నది. ఆ మేరకు చూసుకున్నా తాజాగా ఏబీపీ సర్వే అంటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫలితాలు పక్షం రోజుల కిందట రైజ్ విడుదల చేసిన ఫలితాలకు చాలా వరకూ దగ్గరగానే ఉండటం గమనార్హం. రైజ్ సర్వే ప్రకారం తెలుగుదేశం, జనసేన కూటమి  ఉభయ గోదావరి జిల్లాలలో రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, ఏలూరు, నరసాపురం, కోస్తాంధ్రలో గుంటూరు, విజయవాడ, నెల్లూరు, రాయలసీమలో చిత్తూరు, కర్నూలు, అనంతపురం, హిందూపురం, ఉత్తరాంధ్రలోని  శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి లోక్ సభ స్థానాలలో  తెలుగుదేశం, జనసేన కూటమి విజయం సాధించడం పక్కా. ఇక తెలుగుదేశం కూటమి, వైసీపీ మధ్య తీవ్రమైన పోటీ ఉన్న నియోజకవర్గాల విషయానికి వస్తే.. ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, కోస్తాంధ్రలో నరసరావుపేట, మచిలీపట్నం, బాపట్ల, రాయలసీమలో తిరుపతి పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. అయితే  వీటిలో అసెంబ్లీ స్థానాల ప్రభావాన్ని బట్టి బాపట్ల, తిరుపతి, విశాఖపట్నం స్థానాలలో తెలుగుదేశం, జనసేన కూటమి అభ్యర్థులకే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయని సర్వే పేర్కొంది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉన్న సర్వే ఫలితం కూడా దాదాపుగా రైజ్ సర్వే ఫలితానికి దగ్గరగా ఉండటంతో పరిశీలకులు ఇప్పుడు ప్రచారంలో ఉన్నది ఫేక్ సర్వే అన్న వాదనను పక్కన పెట్టి, మూడ్ ఆఫ్ ఏపీ జగన్ కు వ్యతిరేకంగా ఉందని మాత్రం చెప్పవచ్చునని అంటున్నారు.   అంతే కాకుండా వైసీపీ జాబితాల మీద జాబితాలు విడుదల చేస్తూ కూడా ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థిని ఖరారు చేయాలో తేల్చుకోలేక సతమతమౌతుండటం కూడా ఆ పార్టీ ఓటమికి ఇప్పటికే మానసికంగా ప్రిపేర్ అయిపోయిందా అన్న అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. జగన్ తో సహా ఆ పార్టీ సీనియర్ నేతలే ఇప్పుడు నియోజకవర్గాల ఇన్ చార్జీలుగా నియమించిన వారినే అభ్యర్థులుగా రంగంలోకి దింపుతామన్నగ్యారంటీ లేదని చెబుతుండటం కూడా ఆ పార్టీ పరిస్థితిని తెలియజేస్తోందని అంటున్నారు. 

వాలంటీర్లకు ఎన్నికల విధులపై కోర్టుకు నిమ్మగడ్డ

వాలంటీర్లకు ఎన్నికల విధులు అప్పగించడంపై కోర్టుకు వెళ్లనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రిటైర్డ్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు. కాకినాడ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ ఆధ్వర్యంలో ఓటు వేద్దం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దా అన్న నినాదంతో నిర్వహించిన కళాజాతా కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరగడం రాజ్యాంగ ప్రక్రియలో భాగమని చెప్పారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలకు సంబంధించి సుమారు 30 వేల దొంగ ఓట్లు నమోదయ్యాయని  ఇటీవలఆ విషయం బయటపడడంతో ఇద్దరు ఉన్నత అధికారులను సస్పెండ్‌ చేసి ఎన్నికల కమిషన్‌ చేతులు దులిపేసుకుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాలలోనూ దొంగ ఓట్లు ఉన్నాయన్న నిమ్మగడ్డ కనుక ప్రజలు జాగ్రత్తగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఓటర్ల జాబితాలో తమ ఓట్లను తనిఖీ చేసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులను ఎన్నికల విధులలోకి తీసుకోవాలని ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. వాలంటీర్ల ద్వారా సేకరించిన ప్రజల వ్యక్తిగత వివరాలను ప్రభుత్వంలో ఉన్న కొందరు పెద్దలకు చేర్చడం ప్రజాస్వామ్య విదుద్ధమన్న నిమ్మగడ్డ, వాలంటీర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకుంటామంటూ ఏపీ సీఎం జగన్, ఆయన కేబినెట్ సహచరులు చెప్పడం ఎన్నికల కమిషన్ ను అవమానించడమేనన్న ఆయన వాలంటీర్లను, సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధుల్లో ఉపయోగించుకోరాదని కోరుతూ సుప్రీంలో కేసు వేయనున్నట్లు వెల్లడించారు. యువత తమ ఓటు హక్కును తప్పని సరిగా వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.  

రోజా కొత్త పేరు.. అదిరిందిగా!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జాక్‌పాట్‌ ముఖ్యమంత్రి అయ్యాడంటూ.. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొనడంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ భవన్‌లో ఆయన ప్రెస్‌మీట్ పెట్టి  మంత్రి రోజా వ్యాఖ్యలను ఖండించడమే కాదు.. ఆమెపై తనదైన శైలిలో పంచ్‌లతో విరుచుకు పడ్డారు. రోజా డైమెండ్ రాణి.. ఆమెకు వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి టికెట్ వస్తుందో రాదో డౌటే.  రేవంత్ రెడ్డి కాదు, రోజా ఎవరి నాయకత్వంలో అయితే పని చేస్తున్నారో ఆ నాయకుడే ఒక యాక్సిడెంటల్ సీఎం అని బండ్ల గణేష్ అన్నారు. అంతే కాకుండా రేవంత్ రెడ్డి  ఫైటర్.. పోరాడిన యోధుడు. భారతదేశంలో ఇలాంటి యోధులు అతి తక్కువ మంది ఉన్నారని.. ఆయన యోధుడని.. పోరాడి కష్టపడి.. తానేంటో కష్టపడి నిరూపించుకొని.. ముఖ్యమంత్రి పదవి తీసుకున్నారు.. యాక్సిడెంటల్ సీఎం అయితే.. నాన్నగారు చనిపోతేనో.. నాన్న గారి వారసత్వం వస్తేనో.. ఇంకోటి వస్తేనో.. లేదా మీలా పులుసు వండి పెడితేనో.. వస్తుంది అంటూ బండ్ల గణేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేపో మాపో.. మీరు మాజీలు అవుతారు, అప్పుడు ఆ మాజీ ఈ మాజీ కలిసి.. ఇక్కడకొచ్చి జబర్దస్త్ పొగ్రామ్ చేసుకుంటారని ఎద్దేవా చేశారు.  పగలు జబర్దస్గ్ షూటింగ్.. నైట్ పూటేమో... మాజీతో కలిసి తాజాగా కేజీలు కేజీలు పులుసు ఒండుకొని పెట్టుకోండి.. అంతేకానీ.. మా ముఖ్యమంత్రిని అనే స్థాయి  మీకు లేదన్న విషయం తెలుసుకో తల్లి అన్న బండ్ల గణేష్ రోజాను ఐటెం రాణి అంటూ,  ఐటెం రాణివి.. ఐటెం రాణిలాగానే ఉండాలంటూ సూచించారు.  అయితే  ఆర్కే రోజా, బండ్ల గణేష్ ఇద్దరూ ఇద్దరే.  ఇద్దరి  బ్యాక్ గ్రౌండ్ ఒక్కటే.. ఈ ఇద్దరు సినిమాల్లో నటించి.. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరు ఫైర్ బ్రాండ్లే. అలాగే ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. గతంలో సైతం వీరిద్దరు ఒకరిపై ఒకరు మీడియా ముందుకు వచ్చి.. విమర్శలు ప్రతి విమర్శలే కాదు... బుల్లి తెరలో ఓ చర్చ వేదిక కార్యక్రమం సాక్షిగా వీరిద్దరు బండ బూతులు తిట్టుకొన్న సంగతి తెలిసిందే.  ఇక మంత్రి పదవిలో ఉండి.. ఓ మహిళ అయి ఉండి ఆర్కే రోజా ఇలా వ్యవహరించడం పట్ల.. ప్రజల్లో ఆమెపై ఓ విధమైన వ్యతిరేకత వ్యక్తమవుతోందని... అలాగే ముచ్చటగా మూడోసారి కూడా నగరిలో పోటీ చేసి గెలుపొందేందుకు ఆర్కే రోజా.. తన వంతు ప్రయత్నాలు చేసుకొంటున్నారనీ, కానీ ఆమెకు ఈసారి టికెట్ వచ్చే అవకశాలు చాలా తక్కువగా ఉన్నాయని... ఇంకా చెప్పాలంటే.. నగరి నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ నేతలంతా.. ఆర్కే రోజా ఓటమి కోసం ముకుమ్మడి ప్రయత్నాలు చేస్తున్నారని.. అలాంటి పరిస్థితిలో ఈ సారి ఆమెకు ఎమ్మెల్యే టికెట్ దక్కక పోవచ్చుననే ఓ ప్రచారం అయితే ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైరల్ అవుతోంది.    ఏదీ ఏమైనా.. ఆర్కే రోజా, బండ్ల గణేష్ ఇద్దరూ మీడియా ముందుకు వచ్చి.. విమర్శల దాడికి దిగితే మాత్రం.. ఆ తర్వాత.. ఇద్దరి పరువు ఎవరికి వారు.. వారికి తెలియకుండానే తీసుకుంటున్నారని ఓ ప్రచారం అయితే హల్‌చల్ చేస్తోంది. అదీకాక ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో వీరిద్దరు.. ఇలా ప్రెస్ మీట్ పెట్టి..ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం.. రానున్న ఎన్నికల్లో ఆయా పార్టీల నేతల మనస్సు చొరగొని.. సీట్లు కొట్టేసే ప్లాన్‌లో భాగమేననే ఓ ప్రచారం అయితే ఇప్పటికే జనబాహుళ్యంలో దూసుకు పోతుంది.

జంబ్లింగ్ స్టార్ విడదల రజనీ!

ఎన్నికలు దగ్గర కొస్తున్నాయంటే.. రాజకీయ నాయకుల్లో అలజడి మొదలవుతుంది.  అధికారంలో ఉన్న వారికి అయితే.. మళ్లీ అధికారం అందుకుంటామో? లేదో?.. ఓ వేళ అధికారంలోకి రాకుంటే.. అందునా మంత్రి పదవి లేకుంటే.. కార్ల కాన్వాయి, గన్‌మెన్లు, కెమెరామెన్లతో ఇన్నాళ్లు చేసిన హడావుడి అంతా.. వచ్చే ఎన్నికల ఫలితాల తర్వాత గాలికి కొట్టుకు పోయినట్లు కొట్టుకు పోతే.. ఆ తర్వాత పరిస్థితి ఏమిటి.? అన్న అలజడి. అందుకే.. ఎమ్మెల్యేగా గెలిచినా తర్వాత.. మంత్రి పదవి చేపట్టిన తర్వాత.. ఏం చేసినా.. చేయకున్నా.. ఎన్నికలకు జస్ట్ వంద రోజుల ముందు జనంలోకి వెళ్లి ఓ షో చేస్తే.. అంటే.. ఆటోలు నడపడం.. ట్రాక్టర్లు నడపడం.. సైకిళ్లు తొక్కడం.. బైక్ ర్యాలీలో బైక్ నపడం వంటి షోలన్నమాట.  ఆ షో సక్సెస్ అయితే.. అనంతరం శతదినోత్సవ వేడుకలే వేడుకలు. ఆ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ బాగానే పసిగట్టి.. ప్రజలను ఆకట్టుకోనేందుకు జనం మధ్యకు వస్తున్నారన్న   చర్చ గుంటూరు నగరంలో వైరల్ అవుతోంది.  తాజాగా మంత్రి విడదల రజనీ.. ఆటో డ్రైవర్ షర్ట్ వేసుకొని ఆటో నడుపుతున్న ఓ వీడియో అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో కీ ఇచ్చిన బొంగరంలా గిర్రా గిర్రా తిరుగుతోంది. దీనిపై గుంటూరు నగర వాసులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.  ఆసుపత్రిలో విధులకు వచ్చే వైద్యులు తెల్ల కోటు వేసుకున్నారో లేదో?   వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ పట్టించుకున్నారో లేదో తెలియదు కానీ ఆటో డ్రైవర్ షర్ట్ మాత్రం ఆమె  వేసుకున్నారంటున్నారు. 2019 ఎన్నికల సమయంలో సైతం చిలకలూరిపేట నియోజకవర్గంలో ఆమె ఆటో నడిపారని .. అందుకు సంబంధించిన చిత్ర రాజాలు నేటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని గుంటూరు నగర వాసులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.  బాషా సినిమాలో సూపర్ స్టార్ రజనీ కాంత్‌లా  విడదల రజినీ సైతం ఆటో డ్రైవ్ చేస్తున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు. ఆటో నడపడం ఇలా చూసి ఆలా పట్టేసి.. అలా అలా నడిపేస్తున్నారని నవ్వుకుంటున్నారు.  2014 ఎన్నికల వేళ.. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ విజయం  కోసం యూఎస్ నుంచి వచ్చిన వారిలో విడదల రజనీ ఒకరు. ఆ సమయంలో ఆ పార్టీ విజయం కోసం ఆమె సహకరించారని.. ఆ క్రమంలో 2017లో  విశాఖ వేదికగా జరిగిన ఆ పార్టీ మహానాడులో.. సైబరాబాద్‌లో చంద్రబాబు నాటిన సైబరాబాద్ మొక్కను తానంటూ చెప్పుకొచ్చారు.  ఆ తర్వాత ఆమె చిలకలూరిపేట నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసేందుకు  టికెట్ కోసం ప్రయత్నించి విఫలమై.. ఆ వెంటనే జగన్ పార్టీలోకి జంప్ కొట్టేశారు. ఆ పార్టీ తరఫున  బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రి పదవి సైతం సంపాదించేశారు.  అయితే వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచేందుకు ఆమె.. తన వంతు ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు.  అందులోభాగంగా ఈ సారి తన అదృష్టాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నిలబడి పరీక్షించు కొంటున్నారు. అయినా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు...ఆటో నడిపి.. బాషా సినిమాలో రజనీ కాంత్‌ను గుర్తు చేస్తున్నారని.. ఏమైనా రజనీ.. రజనీనేనని.. ఆయన వెండి తెర మీద సూపర్ స్టార్ అయితే.. ఆమె పోలిటికల్ జంబ్లిగ్ స్టార్ అని గుంటూరు వాసులు తమదైన శైలిలో వ్యంగ్యంగా అంటున్నారు.      ఇక గత ఎన్నికల్లో విడదల రజనీ జగన్ వేవ్‌లో చాలా సునాయాసంగానే గెలిచారనీ, అయితే  ఈ సారి మాత్రం ఆమె గెలుపు అంత సులువేమి కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట,  గత ఎన్నికల వేళ  జగన్ వేవ్‌లో సైతం ఆ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ గెలుచుకున్న సంగతిని ఈ సందర్భంగాగుర్తు చేస్తున్నారు.  అదీకాక ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థిగా గల్లా మాదవి పేరు ఖరారు చేయనున్నారనే ఓ ప్రచారం అయితే ఇప్పటికే స్థానికంగా ఊపందుకొంది. ఇక ఈ నియోజకవర్గంలో బీసీల ఓట్లు అధికం. అలాంటి వేళ ఈ నియోజకవర్గంలో మళ్లీ పసుపు పార్టీ జెండా రెపరెపలాడడం కోసం తెలుగుదేశం అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మరోవైపు రానున్న ఎన్నికల్లో చిలకలూరిపేటలో విడదల రజనీకి ఓటమి తప్పదని సర్వేలు రావడంతో.. ఆమెను జంబ్లింగ్ విధానంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ పంపారు. ఏదీ ఏమైనా.. విడదల రజనీ.. రజనీ కాంత్‌లా ఆటో నడిపినా.. బాషా ఒక్క సారి చెబితే వంద సార్లు చెప్పినట్లేనంటూ డైలాగులు పేల్చినా.. రానున్న ఎన్నికల్లో ఆమె గెలుపు అంత ఈజీ కాదనే ఓ చర్చ అయితే గుంటూరు వాసుల్లో వైరల్ అవుతోంది.

మన బలం ఇదే.. పొత్తు అందుకే.. ఎనీ డౌట్.. జనసైనికులకు క్లారిటీ ఇచ్చేసిన పవన్

24 సీట్లేనా..!  చంద్ర‌బాబు వ‌ద్ద ప‌వ‌న్ జ‌న‌సైనికుల‌ను తాక‌ట్టు పెట్టారు.. ప‌వ‌న్ అస‌లు రాజ‌కీయ నాయకుడేనా?,  పొత్తులో భాగంగా ఇన్ని త‌క్కువ సీట్లకు ఒప్పుకుంటారా? ఇవీ గ‌త మూడు రోజులుగా అధికార పార్టీ వైసీపీ నేత‌లు ప‌వ‌న్ క‌ల్యాణ్ పై చేస్తున్న విమ‌ర్శ‌లు.. ప‌నిలో ప‌నిగా జ‌న‌సైనికుల‌నూ రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేశారు, చేస్తున్నారు. సొంత ఇల్లు చ‌క్క‌బెట్టుకోండయ్యా బాబు అంటే.. అది మానేసి ప‌క్కింట్లో ఏం జ‌రుగుతుందో తొంగి చూడ‌టం వైసీపీ నేత‌ల‌కు బాగా అల‌వాటైపోయింది..  వైసీపీ నేతలకు ప్ర‌జ‌ల‌కు మేలు చేద్దాం ఆనే ఆలోచ‌న కంటే.. తెలుగుదేశం,  జ‌న‌సేన కూట‌మిలో ఏం జ‌రుగుతున్నదో చూడ‌టం, అందుకు త‌గ్గ‌ట్లు విమ‌ర్శ‌లు చేయ‌డ‌మే టాస్క్ గా మారిపోయింది. వైసీపీ నేత‌ల విమ‌ర్శ‌లు.. ప‌లువురు జ‌న‌సేన మ‌ద్ద‌తుదారుల‌ ప్ర‌శ్న‌ల‌కు జన‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్  తాడేప‌ల్లిలో జ‌రిగిన జ‌న‌సేన, తెలుగుదేశం ఉమ్మ‌డి బ‌హిరంగ స‌భ‌లో స‌మాధానం ఇచ్చారు. ప‌వ‌న్ ప్ర‌సంగం మొత్తం చూస్తే.. ఆవేశం, ఆలోచనల మేలు కలయికగా అనిపించింది. ఆయ‌న ప్ర‌సంగం తీరులో మార్పు క‌నిపించింది. ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌ జ‌రుగుతున్న ప్ర‌తీ అంశాన్ని ప‌వ‌న్ త‌న ప్ర‌సంగంలో ప్ర‌స్తావించారు. ముఖ్యంగా వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి టార్గెట్ గా విమ‌ర్శ‌లు చేసిన ప‌వ‌న్‌, జ‌న‌సేన మ‌ద్ద‌తుదారుల‌కు చిన్న‌పాటి క్లాస్ తీసుకున్నారు.. మ‌రోవైపు చంద్ర‌బాబుపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ప్ర‌ధానంగా పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ సీట్లు ఎందుకు తీసుకోవాల్సి వ‌చ్చిందో  క్లారిటీ ఇచ్చారు.  24 సీట్లేనా అని వైసీపీ విమ‌ర్శ‌లు చేస్తుంది.. 24 సీట్ల‌తో మ‌మ్మ‌ల్ని ఏం చేస్తావ‌ని వాళ్లు ప్ర‌శ్నిస్తున్నారు.. బ‌లి చ‌క్ర‌వ‌ర్తి కూడా వామ‌నుడిని చూసి ఇంతేనా అన్నారు. నెత్తిన కాలుపెట్టి తొక్కితే ఎంతో  తెలిసింది.. జ‌గ‌న్‌ను అథఃపాతాళానికి తొక్క‌క‌పోతే నా పేరు ప‌వ‌న్ కాదు అంటూ జనసేనాని స‌వాల్ చేశారు. పొత్తులో భాగంగా 24 సీట్లు మాత్ర‌మే తీసుకున్నారంటూ అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న జ‌న‌సేన మ‌ద్ద‌తుదారుల‌కు కూడా ప‌వ‌న్ చిన్న‌పాటి క్లాస్ పీకారు.   జ‌న‌సైనికులూ న‌న్ను న‌మ్మండి.. నాకు వ్యూహం ఉంది. ప‌దేళ్లుగా క‌ష్ట‌ప‌డుతున్నాం.. ఒక్కో ఇటుక పేర్చుకుంటూ వ‌స్తున్నాం. జ‌న‌సేనకు తెలుగుదేశం త‌ర‌హాలో క్షేత్ర‌స్థాయిలో పూర్తి బ‌లం లేదు. ఇప్పుడిప్పుడే అన్నింటినీ స‌మ‌కూర్చుకుంటున్నాం. కోట కూడా క‌డ‌తాం.. జ‌గ‌న్ తాడేప‌ల్లి కోట కూడా బ‌ద్ద‌లు కొడ‌తాం.. స‌ల‌హాలు ఇచ్చేవాళ్లు నాకు అక్క‌ర్లేదు. న‌న్నున‌మ్మి నాతో యుద్ధం చేసేవాళ్లే నా వాళ్లు అంటూ.. జ‌నసేన  సానుభూతి ప‌రుల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు క్లారిటీ ఇచ్చారు. మ‌రోవైపు మాజీ సీఎం, తెలుగుదేశం అధినేత‌ చంద్ర‌బాబు నాయుడు గురించి ప‌వ‌న్ చాలా గొప్ప‌గా చెప్పారు. రాజ‌కీయ దుర‌ంధరుడుగా అభివర్ణించారు. నాలుగు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల‌ను ఎంతో అభివృద్ధి చేశార‌ని ప‌వ‌న్ కొనియాడారు. మొత్తానికి తాడేప‌ల్లిలో జ‌రిగిన జ‌న‌సేన , తెలుగుదేశం కూట‌మి భారీ బ‌హిరంగ స‌భ జ‌న‌సైనికులు, తెలుగుదేశం శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇరు  పార్టీల అధినేత‌లు రాష్ట్ర భ‌విష్య‌త్తు మాకు ముఖ్యం  అంటూ స‌భావేదిక‌గా ప్ర‌జ‌ల‌కు క్లారిటీగా చెప్పారు. రాష్ట్రాభివృద్ధికోసం, రాష్ట్రంలోని యువ‌త‌కు ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించేందుకే జ‌న‌సేన‌, తెలుగుదేశం పొత్తు అంటూ స్ప‌ష్టం చేశారు. బ‌హిరంగ స‌భ విజ‌య‌వంతం కావ‌డం, చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎలాంటి ఇగోల‌కు పోకుండా మేమిద్ద‌రం ఒక‌టే అంటూ చాటిచెప్ప‌డం ద్వారా వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సైనికులు, టీడీపీ శ్రేణులు ఇలానే క‌లిసిప‌నిచేయాల‌ని సూచించారు. దీంతో జ‌న‌సేన , టీడీపీ కార్య‌క‌ర్త‌లను రెచ్చ‌గొట్టి చిచ్చుపెడుతున్న వైసీపీ నేత‌ల వ్యూహాల‌కు చంద్ర‌బాబు, ప‌వ‌న్ ఈ స‌భ ద్వారా చెక్ పెట్టినట్లైంది.

కలిసి నడుద్దాం.. కలిసి గెలుద్దాం! దేశం, జనసేన శ్రేణులకు పవన్ పిలుపు

తెలుగుదేశంతో జనసేనకు పొత్తు ఎందుకు అవసరమో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తాడేపల్లి గూడెం సభ వేదికగా విస్పష్టంగా చాటారు. అదే సమయంలో జగన్ కు పరాజయ పరాభవం ఎలా ఉండబోతోందో కళ్లకు కట్టారు. చొక్కాలు మడతపెట్టి, ప్రభుత్వ హింసతో అధికారంలోకి రావాలనుకుంటే జన చైతన్యం ఇంటికి దారి చూపడం ఖాయమని అర్ధమయ్యేలా చేశారు. పొత్తులో భాగంగా జనసేనకు అన్యాయం జరిగిందంటూ.. మొత్తంగా పొత్తు లక్ష్యానికే తూట్లు పొడిచేలా మాట్లాడుతున్న వారి అసలు ఉద్దేశమేమిటో తన పార్టీ క్యాడర్ కే కాదు, జన బాహుల్యానికి కూడా అర్ధమయ్యే విధంగా జగన్ వివరించి చెప్పారు. జగన్ పాలనలో అధ్వానంగా మారిన రాష్ట్రం తిరిగి గాడిన పడి అభివృద్థి పథంలో దూసుకుపోవాలంటే చంద్రబాబులాంటి విజనరీ, ప్రజా సంక్షేమం పట్ల, ప్రగతి, అభివద్ధి పట్ల స్పష్టమైన అవగాహనే కాకుండా, చిత్తశుద్ధి, సంకల్పం ఉన్న చంద్రబాబు ముఖ్యమంత్రి అయి తీరాలని చెప్పారు.  కుట్రలు, కుతంత్రాలతో అధికారంలోకి వచ్చేద్దామని కలలు కంటూ ప్రజా వ్యతిరేకతను అణచివేయడానికి సిద్ధం అంటూ వాలంటీర్లతో సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్న జగన్ కు  తాడేపల్లిగూడెం సభలో పవన్ కల్యాణ్ ప్రసంగం కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం తప్పిన కౌరవసేన ఎలా మట్టి కరిచిందో జగన్ కు కళ్ల ముందు ఆవిష్కృతమయ్యేలా చేసింది.   ఇక పొత్తులో భాగంగా జనసేనకు తీరని నష్టం జరిగిందంటూ జగన్ అండ్ కో చేస్తున్న ప్రచారాన్ని ఈ సభ ద్వారా అత్యంత ప్రతిభామంతంగా తిప్పి కొట్టారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్. అసలు దేశంలో పొత్తులు, సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటులో కీలక పాత్ర వహించిన చంద్రబాబు ఈ సభ ద్వారా పొత్తు ధర్మాన్ని ఎలా పాటించాలి, అరమరికలు లేకుండా ఎలా ముందుకు సాగాలి అనేది తమ తమ పార్టీల నేతలకు, క్యాడర్ కు బలంగా చాటారు. సభలో ఒకరికి ఒకరు ఇచ్చుకున్న గౌరవం, ఒకరి ప్రతిభను మరొకరు ప్రశంసించిన తీరు అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఈ రీతి సమన్వయం వైసీపీ క్యాడర్ కూడా విస్తుపోయేలా చేసింది. తమ ఎత్తులు ఇక పారవన్న విషయాన్ని కూడా వారికి తేటతెల్లమయ్యేలా చేసింది.  రాష్ట్ర భవిష్యత్ కోసం పవన్ చేసిన త్యాగాన్ని చంద్రబాబు, అదే రాష్ట్ర భవిష్యత్తు కోసం  చంద్రబాబు పడ్డ కష్టాన్ని, శ్రమను పవన్ ప్రస్తావించి ప్రశంసించిన తీరు.. ఇరు పార్టీల మధ్యా పొరపొచ్చాలు లేవనీ, నేతల మధ్య అరమరికలు లేవనీ చాటింది. నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీతో పోటీ పడి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చుదామా?  సంస్థాగతంగా అత్యంత బలమైన తెలుగుదేశం పార్టీకి.. సంస్థాగతంలో బలం లేని జనసేన పోటీ పడగలదా?   ప్రతి నియోజకవర్గం లోనూ మనకు బూత్ స్థాయిలో  కార్యకర్తలు ఉన్నారా? అంటూ పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో  జనసేనకు  24 సీట్లేనా అంటున్న వారిని ప్రశ్నించి నిలదీశారు.  జనసేన పార్టీ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పార్టీ. మనం సంస్థాగతంగా బలోపేతమయ్యేలోపు  వైసీపీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తుంది. అలా జరగకూడదు కాబట్టే.. మనకు తెలుగుదేశంతో పొత్తు అవసరం, అనివార్యం అని ధైర్యంగా  పవన్ కల్యాణ్ చాటారు. ప్రస్తుతం రాష్ట్రానికి  చంద్రబాబు లాంటి  విజనరీ లీడర్ షిప్ అవసరం. ఆయన అయితేనే వైసీపీ పాలనతో అన్ని విధాలుగా అధ్వాన స్థితికి చేరుకున్న రాష్ట్రాన్ని గాడిన పెట్టగలరు అని చెబుతూ చంద్రబాబు గొప్పతనం గురించి అలిపిరి వద్ద ఆయనపై జరిగిన క్లైమోర్ దాడి తరువాత చంద్రబాబు ప్రదర్శించిన స్థైర్యాన్ని, ధైర్యాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు సీఎం గా ఉన్న సమయంలోనే క్లైమర్ మైన్ తో ఆయన వస్తున్న జీప్ పై తిరుపతిలో దాడి జరిగి ఆ జీప్ 16 అడుగులు ఎత్తున లేచింది. ఈ  సంఘటన జరిగిన వెంటనే ఆయన ఆ జీపు శిథిలాల మధ్య నుంచి లేచి  చొక్కా దులుపుకుని  పదండి రాజకీయం చేద్దామని నాలుగు దశాబ్దాల నుంచి రాజకీయం చేస్తున్న దురంధరుడు చంద్రబాబు అంటూ ప్రస్తుతించారు. అటువంటి నాయకుడితో కలిసి ముందుకెళ్లడం ఎప్పటికీ తప్పు నిర్ణయం కాదు. ఇప్పటి సీఎం గా ఉన్న జగన్ పరదాలు కట్టుకుని, చెట్లు నరికించి తనకు ఓట్లేసి ప్రజల మధ్యకు వస్తుంటే బాబు మాత్రం తన పై జరిగిన దాడిని కూడా లెక్కచేయకుండా ప్రజాసేవకై అడుగు ముందుకు వేసారు. తన ప్రత్యర్థుల మీదకు  చొక్కాలు మడతపెట్టాల్సిన సమయం వచ్చింది’ అంటూ తన సైన్యానికి హింట్ ఇస్తున్న నాయకుడ్ని ఇప్పటి తరం చూస్తుంటే తనపై క్లైమోరే మైన్ తో దాడి జరిగినా.. చొక్కా దులుపుకుని రాష్ట్ర ప్రగతి కోసం అడుగులు వేసిన నాయకుడిని ఆ తరం చూసిందంటూ  బాబు పై జరిగిన దాడి గురించి, రాజకీయాల మీద ఆయనకు ఉన్న ఆసక్తి, ప్రజా సేవ పట్ల ఆయనకు ఉన్న అంకిత భావం,  నిబద్దత గురించి నిండు సభలో  చెప్పి బాబు అభిమానులలోనే కాదు, జనసైనికులలోనూ ఉత్తేజం ఉత్సాహం నింపారు. జనేనాని ప్రసంగం  వేదిక మీద ఉన్న చంద్రబాబునీ, నేతలనే కాదు.. సభకు హాజరైన లక్షలాది మందినీ ఒక్కసారిగా ఉద్వేగానికి గురి చేసింది.  జగన్ పార్టీ పరాజయాన్ని ఈ సభ సక్సెస్ ఖరారు చేసేసిందని పరిశీలకులు అంటున్నారు.