రోజా కొత్త పేరు.. అదిరిందిగా!
posted on Feb 29, 2024 @ 1:11PM
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జాక్‌పాట్ ముఖ్యమంత్రి అయ్యాడంటూ.. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొనడంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ భవన్‌లో ఆయన ప్రెస్‌మీట్ పెట్టి మంత్రి రోజా వ్యాఖ్యలను ఖండించడమే కాదు.. ఆమెపై తనదైన శైలిలో పంచ్‌లతో విరుచుకు పడ్డారు. రోజా డైమెండ్ రాణి.. ఆమెకు వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి టికెట్ వస్తుందో రాదో డౌటే. రేవంత్ రెడ్డి కాదు, రోజా ఎవరి నాయకత్వంలో అయితే పని చేస్తున్నారో ఆ నాయకుడే ఒక యాక్సిడెంటల్ సీఎం అని బండ్ల గణేష్ అన్నారు.
అంతే కాకుండా రేవంత్ రెడ్డి ఫైటర్.. పోరాడిన యోధుడు. భారతదేశంలో ఇలాంటి యోధులు అతి తక్కువ మంది ఉన్నారని.. ఆయన యోధుడని.. పోరాడి కష్టపడి.. తానేంటో కష్టపడి నిరూపించుకొని.. ముఖ్యమంత్రి పదవి తీసుకున్నారు.. యాక్సిడెంటల్ సీఎం అయితే.. నాన్నగారు చనిపోతేనో.. నాన్న గారి వారసత్వం వస్తేనో.. ఇంకోటి వస్తేనో.. లేదా మీలా పులుసు వండి పెడితేనో.. వస్తుంది అంటూ బండ్ల గణేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేపో మాపో.. మీరు మాజీలు అవుతారు, అప్పుడు ఆ మాజీ ఈ మాజీ కలిసి.. ఇక్కడకొచ్చి జబర్దస్త్ పొగ్రామ్ చేసుకుంటారని ఎద్దేవా చేశారు. పగలు జబర్దస్గ్ షూటింగ్.. నైట్ పూటేమో... మాజీతో కలిసి తాజాగా కేజీలు కేజీలు పులుసు ఒండుకొని పెట్టుకోండి.. అంతేకానీ.. మా ముఖ్యమంత్రిని అనే స్థాయి మీకు లేదన్న విషయం తెలుసుకో తల్లి అన్న బండ్ల గణేష్ రోజాను ఐటెం రాణి అంటూ, ఐటెం రాణివి.. ఐటెం రాణిలాగానే ఉండాలంటూ సూచించారు.
అయితే ఆర్కే రోజా, బండ్ల గణేష్ ఇద్దరూ ఇద్దరే. ఇద్దరి బ్యాక్ గ్రౌండ్ ఒక్కటే.. ఈ ఇద్దరు సినిమాల్లో నటించి.. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరు ఫైర్ బ్రాండ్లే. అలాగే ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. గతంలో సైతం వీరిద్దరు ఒకరిపై ఒకరు మీడియా ముందుకు వచ్చి.. విమర్శలు ప్రతి విమర్శలే కాదు... బుల్లి తెరలో ఓ చర్చ వేదిక కార్యక్రమం సాక్షిగా వీరిద్దరు బండ బూతులు తిట్టుకొన్న సంగతి తెలిసిందే.
ఇక మంత్రి పదవిలో ఉండి.. ఓ మహిళ అయి ఉండి ఆర్కే రోజా ఇలా వ్యవహరించడం పట్ల.. ప్రజల్లో ఆమెపై ఓ విధమైన వ్యతిరేకత వ్యక్తమవుతోందని... అలాగే ముచ్చటగా మూడోసారి కూడా నగరిలో పోటీ చేసి గెలుపొందేందుకు ఆర్కే రోజా.. తన వంతు ప్రయత్నాలు చేసుకొంటున్నారనీ, కానీ ఆమెకు ఈసారి టికెట్ వచ్చే అవకశాలు చాలా తక్కువగా ఉన్నాయని... ఇంకా చెప్పాలంటే.. నగరి నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ నేతలంతా.. ఆర్కే రోజా ఓటమి కోసం ముకుమ్మడి ప్రయత్నాలు చేస్తున్నారని.. అలాంటి పరిస్థితిలో ఈ సారి ఆమెకు ఎమ్మెల్యే టికెట్ దక్కక పోవచ్చుననే ఓ ప్రచారం అయితే ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైరల్ అవుతోంది.
ఏదీ ఏమైనా.. ఆర్కే రోజా, బండ్ల గణేష్ ఇద్దరూ మీడియా ముందుకు వచ్చి.. విమర్శల దాడికి దిగితే మాత్రం.. ఆ తర్వాత.. ఇద్దరి పరువు ఎవరికి వారు.. వారికి తెలియకుండానే తీసుకుంటున్నారని ఓ ప్రచారం అయితే హల్‌చల్ చేస్తోంది. అదీకాక ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో వీరిద్దరు.. ఇలా ప్రెస్ మీట్ పెట్టి..ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం.. రానున్న ఎన్నికల్లో ఆయా పార్టీల నేతల మనస్సు చొరగొని.. సీట్లు కొట్టేసే ప్లాన్‌లో భాగమేననే ఓ ప్రచారం అయితే ఇప్పటికే జనబాహుళ్యంలో దూసుకు పోతుంది.