రోజా కొత్త పేరు.. అదిరిందిగా!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జాక్‌పాట్‌ ముఖ్యమంత్రి అయ్యాడంటూ.. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొనడంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ భవన్‌లో ఆయన ప్రెస్‌మీట్ పెట్టి  మంత్రి రోజా వ్యాఖ్యలను ఖండించడమే కాదు.. ఆమెపై తనదైన శైలిలో పంచ్‌లతో విరుచుకు పడ్డారు. రోజా డైమెండ్ రాణి.. ఆమెకు వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి టికెట్ వస్తుందో రాదో డౌటే.  రేవంత్ రెడ్డి కాదు, రోజా ఎవరి నాయకత్వంలో అయితే పని చేస్తున్నారో ఆ నాయకుడే ఒక యాక్సిడెంటల్ సీఎం అని బండ్ల గణేష్ అన్నారు. అంతే కాకుండా రేవంత్ రెడ్డి  ఫైటర్.. పోరాడిన యోధుడు. భారతదేశంలో ఇలాంటి యోధులు అతి తక్కువ మంది ఉన్నారని.. ఆయన యోధుడని.. పోరాడి కష్టపడి.. తానేంటో కష్టపడి నిరూపించుకొని.. ముఖ్యమంత్రి పదవి తీసుకున్నారు.. యాక్సిడెంటల్ సీఎం అయితే.. నాన్నగారు చనిపోతేనో.. నాన్న గారి వారసత్వం వస్తేనో.. ఇంకోటి వస్తేనో.. లేదా మీలా పులుసు వండి పెడితేనో.. వస్తుంది అంటూ బండ్ల గణేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేపో మాపో.. మీరు మాజీలు అవుతారు, అప్పుడు ఆ మాజీ ఈ మాజీ కలిసి.. ఇక్కడకొచ్చి జబర్దస్త్ పొగ్రామ్ చేసుకుంటారని ఎద్దేవా చేశారు.  పగలు జబర్దస్గ్ షూటింగ్.. నైట్ పూటేమో... మాజీతో కలిసి తాజాగా కేజీలు కేజీలు పులుసు ఒండుకొని పెట్టుకోండి.. అంతేకానీ.. మా ముఖ్యమంత్రిని అనే స్థాయి  మీకు లేదన్న విషయం తెలుసుకో తల్లి అన్న బండ్ల గణేష్ రోజాను ఐటెం రాణి అంటూ,  ఐటెం రాణివి.. ఐటెం రాణిలాగానే ఉండాలంటూ సూచించారు.  అయితే  ఆర్కే రోజా, బండ్ల గణేష్ ఇద్దరూ ఇద్దరే.  ఇద్దరి  బ్యాక్ గ్రౌండ్ ఒక్కటే.. ఈ ఇద్దరు సినిమాల్లో నటించి.. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరు ఫైర్ బ్రాండ్లే. అలాగే ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. గతంలో సైతం వీరిద్దరు ఒకరిపై ఒకరు మీడియా ముందుకు వచ్చి.. విమర్శలు ప్రతి విమర్శలే కాదు... బుల్లి తెరలో ఓ చర్చ వేదిక కార్యక్రమం సాక్షిగా వీరిద్దరు బండ బూతులు తిట్టుకొన్న సంగతి తెలిసిందే.  ఇక మంత్రి పదవిలో ఉండి.. ఓ మహిళ అయి ఉండి ఆర్కే రోజా ఇలా వ్యవహరించడం పట్ల.. ప్రజల్లో ఆమెపై ఓ విధమైన వ్యతిరేకత వ్యక్తమవుతోందని... అలాగే ముచ్చటగా మూడోసారి కూడా నగరిలో పోటీ చేసి గెలుపొందేందుకు ఆర్కే రోజా.. తన వంతు ప్రయత్నాలు చేసుకొంటున్నారనీ, కానీ ఆమెకు ఈసారి టికెట్ వచ్చే అవకశాలు చాలా తక్కువగా ఉన్నాయని... ఇంకా చెప్పాలంటే.. నగరి నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ నేతలంతా.. ఆర్కే రోజా ఓటమి కోసం ముకుమ్మడి ప్రయత్నాలు చేస్తున్నారని.. అలాంటి పరిస్థితిలో ఈ సారి ఆమెకు ఎమ్మెల్యే టికెట్ దక్కక పోవచ్చుననే ఓ ప్రచారం అయితే ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైరల్ అవుతోంది.    ఏదీ ఏమైనా.. ఆర్కే రోజా, బండ్ల గణేష్ ఇద్దరూ మీడియా ముందుకు వచ్చి.. విమర్శల దాడికి దిగితే మాత్రం.. ఆ తర్వాత.. ఇద్దరి పరువు ఎవరికి వారు.. వారికి తెలియకుండానే తీసుకుంటున్నారని ఓ ప్రచారం అయితే హల్‌చల్ చేస్తోంది. అదీకాక ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో వీరిద్దరు.. ఇలా ప్రెస్ మీట్ పెట్టి..ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం.. రానున్న ఎన్నికల్లో ఆయా పార్టీల నేతల మనస్సు చొరగొని.. సీట్లు కొట్టేసే ప్లాన్‌లో భాగమేననే ఓ ప్రచారం అయితే ఇప్పటికే జనబాహుళ్యంలో దూసుకు పోతుంది.

జంబ్లింగ్ స్టార్ విడదల రజనీ!

ఎన్నికలు దగ్గర కొస్తున్నాయంటే.. రాజకీయ నాయకుల్లో అలజడి మొదలవుతుంది.  అధికారంలో ఉన్న వారికి అయితే.. మళ్లీ అధికారం అందుకుంటామో? లేదో?.. ఓ వేళ అధికారంలోకి రాకుంటే.. అందునా మంత్రి పదవి లేకుంటే.. కార్ల కాన్వాయి, గన్‌మెన్లు, కెమెరామెన్లతో ఇన్నాళ్లు చేసిన హడావుడి అంతా.. వచ్చే ఎన్నికల ఫలితాల తర్వాత గాలికి కొట్టుకు పోయినట్లు కొట్టుకు పోతే.. ఆ తర్వాత పరిస్థితి ఏమిటి.? అన్న అలజడి. అందుకే.. ఎమ్మెల్యేగా గెలిచినా తర్వాత.. మంత్రి పదవి చేపట్టిన తర్వాత.. ఏం చేసినా.. చేయకున్నా.. ఎన్నికలకు జస్ట్ వంద రోజుల ముందు జనంలోకి వెళ్లి ఓ షో చేస్తే.. అంటే.. ఆటోలు నడపడం.. ట్రాక్టర్లు నడపడం.. సైకిళ్లు తొక్కడం.. బైక్ ర్యాలీలో బైక్ నపడం వంటి షోలన్నమాట.  ఆ షో సక్సెస్ అయితే.. అనంతరం శతదినోత్సవ వేడుకలే వేడుకలు. ఆ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ బాగానే పసిగట్టి.. ప్రజలను ఆకట్టుకోనేందుకు జనం మధ్యకు వస్తున్నారన్న   చర్చ గుంటూరు నగరంలో వైరల్ అవుతోంది.  తాజాగా మంత్రి విడదల రజనీ.. ఆటో డ్రైవర్ షర్ట్ వేసుకొని ఆటో నడుపుతున్న ఓ వీడియో అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో కీ ఇచ్చిన బొంగరంలా గిర్రా గిర్రా తిరుగుతోంది. దీనిపై గుంటూరు నగర వాసులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.  ఆసుపత్రిలో విధులకు వచ్చే వైద్యులు తెల్ల కోటు వేసుకున్నారో లేదో?   వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ పట్టించుకున్నారో లేదో తెలియదు కానీ ఆటో డ్రైవర్ షర్ట్ మాత్రం ఆమె  వేసుకున్నారంటున్నారు. 2019 ఎన్నికల సమయంలో సైతం చిలకలూరిపేట నియోజకవర్గంలో ఆమె ఆటో నడిపారని .. అందుకు సంబంధించిన చిత్ర రాజాలు నేటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని గుంటూరు నగర వాసులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.  బాషా సినిమాలో సూపర్ స్టార్ రజనీ కాంత్‌లా  విడదల రజినీ సైతం ఆటో డ్రైవ్ చేస్తున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు. ఆటో నడపడం ఇలా చూసి ఆలా పట్టేసి.. అలా అలా నడిపేస్తున్నారని నవ్వుకుంటున్నారు.  2014 ఎన్నికల వేళ.. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ విజయం  కోసం యూఎస్ నుంచి వచ్చిన వారిలో విడదల రజనీ ఒకరు. ఆ సమయంలో ఆ పార్టీ విజయం కోసం ఆమె సహకరించారని.. ఆ క్రమంలో 2017లో  విశాఖ వేదికగా జరిగిన ఆ పార్టీ మహానాడులో.. సైబరాబాద్‌లో చంద్రబాబు నాటిన సైబరాబాద్ మొక్కను తానంటూ చెప్పుకొచ్చారు.  ఆ తర్వాత ఆమె చిలకలూరిపేట నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసేందుకు  టికెట్ కోసం ప్రయత్నించి విఫలమై.. ఆ వెంటనే జగన్ పార్టీలోకి జంప్ కొట్టేశారు. ఆ పార్టీ తరఫున  బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రి పదవి సైతం సంపాదించేశారు.  అయితే వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచేందుకు ఆమె.. తన వంతు ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు.  అందులోభాగంగా ఈ సారి తన అదృష్టాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నిలబడి పరీక్షించు కొంటున్నారు. అయినా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు...ఆటో నడిపి.. బాషా సినిమాలో రజనీ కాంత్‌ను గుర్తు చేస్తున్నారని.. ఏమైనా రజనీ.. రజనీనేనని.. ఆయన వెండి తెర మీద సూపర్ స్టార్ అయితే.. ఆమె పోలిటికల్ జంబ్లిగ్ స్టార్ అని గుంటూరు వాసులు తమదైన శైలిలో వ్యంగ్యంగా అంటున్నారు.      ఇక గత ఎన్నికల్లో విడదల రజనీ జగన్ వేవ్‌లో చాలా సునాయాసంగానే గెలిచారనీ, అయితే  ఈ సారి మాత్రం ఆమె గెలుపు అంత సులువేమి కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట,  గత ఎన్నికల వేళ  జగన్ వేవ్‌లో సైతం ఆ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ గెలుచుకున్న సంగతిని ఈ సందర్భంగాగుర్తు చేస్తున్నారు.  అదీకాక ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థిగా గల్లా మాదవి పేరు ఖరారు చేయనున్నారనే ఓ ప్రచారం అయితే ఇప్పటికే స్థానికంగా ఊపందుకొంది. ఇక ఈ నియోజకవర్గంలో బీసీల ఓట్లు అధికం. అలాంటి వేళ ఈ నియోజకవర్గంలో మళ్లీ పసుపు పార్టీ జెండా రెపరెపలాడడం కోసం తెలుగుదేశం అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మరోవైపు రానున్న ఎన్నికల్లో చిలకలూరిపేటలో విడదల రజనీకి ఓటమి తప్పదని సర్వేలు రావడంతో.. ఆమెను జంబ్లింగ్ విధానంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ పంపారు. ఏదీ ఏమైనా.. విడదల రజనీ.. రజనీ కాంత్‌లా ఆటో నడిపినా.. బాషా ఒక్క సారి చెబితే వంద సార్లు చెప్పినట్లేనంటూ డైలాగులు పేల్చినా.. రానున్న ఎన్నికల్లో ఆమె గెలుపు అంత ఈజీ కాదనే ఓ చర్చ అయితే గుంటూరు వాసుల్లో వైరల్ అవుతోంది.

మన బలం ఇదే.. పొత్తు అందుకే.. ఎనీ డౌట్.. జనసైనికులకు క్లారిటీ ఇచ్చేసిన పవన్

24 సీట్లేనా..!  చంద్ర‌బాబు వ‌ద్ద ప‌వ‌న్ జ‌న‌సైనికుల‌ను తాక‌ట్టు పెట్టారు.. ప‌వ‌న్ అస‌లు రాజ‌కీయ నాయకుడేనా?,  పొత్తులో భాగంగా ఇన్ని త‌క్కువ సీట్లకు ఒప్పుకుంటారా? ఇవీ గ‌త మూడు రోజులుగా అధికార పార్టీ వైసీపీ నేత‌లు ప‌వ‌న్ క‌ల్యాణ్ పై చేస్తున్న విమ‌ర్శ‌లు.. ప‌నిలో ప‌నిగా జ‌న‌సైనికుల‌నూ రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేశారు, చేస్తున్నారు. సొంత ఇల్లు చ‌క్క‌బెట్టుకోండయ్యా బాబు అంటే.. అది మానేసి ప‌క్కింట్లో ఏం జ‌రుగుతుందో తొంగి చూడ‌టం వైసీపీ నేత‌ల‌కు బాగా అల‌వాటైపోయింది..  వైసీపీ నేతలకు ప్ర‌జ‌ల‌కు మేలు చేద్దాం ఆనే ఆలోచ‌న కంటే.. తెలుగుదేశం,  జ‌న‌సేన కూట‌మిలో ఏం జ‌రుగుతున్నదో చూడ‌టం, అందుకు త‌గ్గ‌ట్లు విమ‌ర్శ‌లు చేయ‌డ‌మే టాస్క్ గా మారిపోయింది. వైసీపీ నేత‌ల విమ‌ర్శ‌లు.. ప‌లువురు జ‌న‌సేన మ‌ద్ద‌తుదారుల‌ ప్ర‌శ్న‌ల‌కు జన‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్  తాడేప‌ల్లిలో జ‌రిగిన జ‌న‌సేన, తెలుగుదేశం ఉమ్మ‌డి బ‌హిరంగ స‌భ‌లో స‌మాధానం ఇచ్చారు. ప‌వ‌న్ ప్ర‌సంగం మొత్తం చూస్తే.. ఆవేశం, ఆలోచనల మేలు కలయికగా అనిపించింది. ఆయ‌న ప్ర‌సంగం తీరులో మార్పు క‌నిపించింది. ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌ జ‌రుగుతున్న ప్ర‌తీ అంశాన్ని ప‌వ‌న్ త‌న ప్ర‌సంగంలో ప్ర‌స్తావించారు. ముఖ్యంగా వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి టార్గెట్ గా విమ‌ర్శ‌లు చేసిన ప‌వ‌న్‌, జ‌న‌సేన మ‌ద్ద‌తుదారుల‌కు చిన్న‌పాటి క్లాస్ తీసుకున్నారు.. మ‌రోవైపు చంద్ర‌బాబుపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ప్ర‌ధానంగా పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ సీట్లు ఎందుకు తీసుకోవాల్సి వ‌చ్చిందో  క్లారిటీ ఇచ్చారు.  24 సీట్లేనా అని వైసీపీ విమ‌ర్శ‌లు చేస్తుంది.. 24 సీట్ల‌తో మ‌మ్మ‌ల్ని ఏం చేస్తావ‌ని వాళ్లు ప్ర‌శ్నిస్తున్నారు.. బ‌లి చ‌క్ర‌వ‌ర్తి కూడా వామ‌నుడిని చూసి ఇంతేనా అన్నారు. నెత్తిన కాలుపెట్టి తొక్కితే ఎంతో  తెలిసింది.. జ‌గ‌న్‌ను అథఃపాతాళానికి తొక్క‌క‌పోతే నా పేరు ప‌వ‌న్ కాదు అంటూ జనసేనాని స‌వాల్ చేశారు. పొత్తులో భాగంగా 24 సీట్లు మాత్ర‌మే తీసుకున్నారంటూ అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న జ‌న‌సేన మ‌ద్ద‌తుదారుల‌కు కూడా ప‌వ‌న్ చిన్న‌పాటి క్లాస్ పీకారు.   జ‌న‌సైనికులూ న‌న్ను న‌మ్మండి.. నాకు వ్యూహం ఉంది. ప‌దేళ్లుగా క‌ష్ట‌ప‌డుతున్నాం.. ఒక్కో ఇటుక పేర్చుకుంటూ వ‌స్తున్నాం. జ‌న‌సేనకు తెలుగుదేశం త‌ర‌హాలో క్షేత్ర‌స్థాయిలో పూర్తి బ‌లం లేదు. ఇప్పుడిప్పుడే అన్నింటినీ స‌మ‌కూర్చుకుంటున్నాం. కోట కూడా క‌డ‌తాం.. జ‌గ‌న్ తాడేప‌ల్లి కోట కూడా బ‌ద్ద‌లు కొడ‌తాం.. స‌ల‌హాలు ఇచ్చేవాళ్లు నాకు అక్క‌ర్లేదు. న‌న్నున‌మ్మి నాతో యుద్ధం చేసేవాళ్లే నా వాళ్లు అంటూ.. జ‌నసేన  సానుభూతి ప‌రుల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు క్లారిటీ ఇచ్చారు. మ‌రోవైపు మాజీ సీఎం, తెలుగుదేశం అధినేత‌ చంద్ర‌బాబు నాయుడు గురించి ప‌వ‌న్ చాలా గొప్ప‌గా చెప్పారు. రాజ‌కీయ దుర‌ంధరుడుగా అభివర్ణించారు. నాలుగు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల‌ను ఎంతో అభివృద్ధి చేశార‌ని ప‌వ‌న్ కొనియాడారు. మొత్తానికి తాడేప‌ల్లిలో జ‌రిగిన జ‌న‌సేన , తెలుగుదేశం కూట‌మి భారీ బ‌హిరంగ స‌భ జ‌న‌సైనికులు, తెలుగుదేశం శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇరు  పార్టీల అధినేత‌లు రాష్ట్ర భ‌విష్య‌త్తు మాకు ముఖ్యం  అంటూ స‌భావేదిక‌గా ప్ర‌జ‌ల‌కు క్లారిటీగా చెప్పారు. రాష్ట్రాభివృద్ధికోసం, రాష్ట్రంలోని యువ‌త‌కు ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించేందుకే జ‌న‌సేన‌, తెలుగుదేశం పొత్తు అంటూ స్ప‌ష్టం చేశారు. బ‌హిరంగ స‌భ విజ‌య‌వంతం కావ‌డం, చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎలాంటి ఇగోల‌కు పోకుండా మేమిద్ద‌రం ఒక‌టే అంటూ చాటిచెప్ప‌డం ద్వారా వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సైనికులు, టీడీపీ శ్రేణులు ఇలానే క‌లిసిప‌నిచేయాల‌ని సూచించారు. దీంతో జ‌న‌సేన , టీడీపీ కార్య‌క‌ర్త‌లను రెచ్చ‌గొట్టి చిచ్చుపెడుతున్న వైసీపీ నేత‌ల వ్యూహాల‌కు చంద్ర‌బాబు, ప‌వ‌న్ ఈ స‌భ ద్వారా చెక్ పెట్టినట్లైంది.

కలిసి నడుద్దాం.. కలిసి గెలుద్దాం! దేశం, జనసేన శ్రేణులకు పవన్ పిలుపు

తెలుగుదేశంతో జనసేనకు పొత్తు ఎందుకు అవసరమో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తాడేపల్లి గూడెం సభ వేదికగా విస్పష్టంగా చాటారు. అదే సమయంలో జగన్ కు పరాజయ పరాభవం ఎలా ఉండబోతోందో కళ్లకు కట్టారు. చొక్కాలు మడతపెట్టి, ప్రభుత్వ హింసతో అధికారంలోకి రావాలనుకుంటే జన చైతన్యం ఇంటికి దారి చూపడం ఖాయమని అర్ధమయ్యేలా చేశారు. పొత్తులో భాగంగా జనసేనకు అన్యాయం జరిగిందంటూ.. మొత్తంగా పొత్తు లక్ష్యానికే తూట్లు పొడిచేలా మాట్లాడుతున్న వారి అసలు ఉద్దేశమేమిటో తన పార్టీ క్యాడర్ కే కాదు, జన బాహుల్యానికి కూడా అర్ధమయ్యే విధంగా జగన్ వివరించి చెప్పారు. జగన్ పాలనలో అధ్వానంగా మారిన రాష్ట్రం తిరిగి గాడిన పడి అభివృద్థి పథంలో దూసుకుపోవాలంటే చంద్రబాబులాంటి విజనరీ, ప్రజా సంక్షేమం పట్ల, ప్రగతి, అభివద్ధి పట్ల స్పష్టమైన అవగాహనే కాకుండా, చిత్తశుద్ధి, సంకల్పం ఉన్న చంద్రబాబు ముఖ్యమంత్రి అయి తీరాలని చెప్పారు.  కుట్రలు, కుతంత్రాలతో అధికారంలోకి వచ్చేద్దామని కలలు కంటూ ప్రజా వ్యతిరేకతను అణచివేయడానికి సిద్ధం అంటూ వాలంటీర్లతో సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్న జగన్ కు  తాడేపల్లిగూడెం సభలో పవన్ కల్యాణ్ ప్రసంగం కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం తప్పిన కౌరవసేన ఎలా మట్టి కరిచిందో జగన్ కు కళ్ల ముందు ఆవిష్కృతమయ్యేలా చేసింది.   ఇక పొత్తులో భాగంగా జనసేనకు తీరని నష్టం జరిగిందంటూ జగన్ అండ్ కో చేస్తున్న ప్రచారాన్ని ఈ సభ ద్వారా అత్యంత ప్రతిభామంతంగా తిప్పి కొట్టారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్. అసలు దేశంలో పొత్తులు, సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటులో కీలక పాత్ర వహించిన చంద్రబాబు ఈ సభ ద్వారా పొత్తు ధర్మాన్ని ఎలా పాటించాలి, అరమరికలు లేకుండా ఎలా ముందుకు సాగాలి అనేది తమ తమ పార్టీల నేతలకు, క్యాడర్ కు బలంగా చాటారు. సభలో ఒకరికి ఒకరు ఇచ్చుకున్న గౌరవం, ఒకరి ప్రతిభను మరొకరు ప్రశంసించిన తీరు అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఈ రీతి సమన్వయం వైసీపీ క్యాడర్ కూడా విస్తుపోయేలా చేసింది. తమ ఎత్తులు ఇక పారవన్న విషయాన్ని కూడా వారికి తేటతెల్లమయ్యేలా చేసింది.  రాష్ట్ర భవిష్యత్ కోసం పవన్ చేసిన త్యాగాన్ని చంద్రబాబు, అదే రాష్ట్ర భవిష్యత్తు కోసం  చంద్రబాబు పడ్డ కష్టాన్ని, శ్రమను పవన్ ప్రస్తావించి ప్రశంసించిన తీరు.. ఇరు పార్టీల మధ్యా పొరపొచ్చాలు లేవనీ, నేతల మధ్య అరమరికలు లేవనీ చాటింది. నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీతో పోటీ పడి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చుదామా?  సంస్థాగతంగా అత్యంత బలమైన తెలుగుదేశం పార్టీకి.. సంస్థాగతంలో బలం లేని జనసేన పోటీ పడగలదా?   ప్రతి నియోజకవర్గం లోనూ మనకు బూత్ స్థాయిలో  కార్యకర్తలు ఉన్నారా? అంటూ పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో  జనసేనకు  24 సీట్లేనా అంటున్న వారిని ప్రశ్నించి నిలదీశారు.  జనసేన పార్టీ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పార్టీ. మనం సంస్థాగతంగా బలోపేతమయ్యేలోపు  వైసీపీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తుంది. అలా జరగకూడదు కాబట్టే.. మనకు తెలుగుదేశంతో పొత్తు అవసరం, అనివార్యం అని ధైర్యంగా  పవన్ కల్యాణ్ చాటారు. ప్రస్తుతం రాష్ట్రానికి  చంద్రబాబు లాంటి  విజనరీ లీడర్ షిప్ అవసరం. ఆయన అయితేనే వైసీపీ పాలనతో అన్ని విధాలుగా అధ్వాన స్థితికి చేరుకున్న రాష్ట్రాన్ని గాడిన పెట్టగలరు అని చెబుతూ చంద్రబాబు గొప్పతనం గురించి అలిపిరి వద్ద ఆయనపై జరిగిన క్లైమోర్ దాడి తరువాత చంద్రబాబు ప్రదర్శించిన స్థైర్యాన్ని, ధైర్యాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు సీఎం గా ఉన్న సమయంలోనే క్లైమర్ మైన్ తో ఆయన వస్తున్న జీప్ పై తిరుపతిలో దాడి జరిగి ఆ జీప్ 16 అడుగులు ఎత్తున లేచింది. ఈ  సంఘటన జరిగిన వెంటనే ఆయన ఆ జీపు శిథిలాల మధ్య నుంచి లేచి  చొక్కా దులుపుకుని  పదండి రాజకీయం చేద్దామని నాలుగు దశాబ్దాల నుంచి రాజకీయం చేస్తున్న దురంధరుడు చంద్రబాబు అంటూ ప్రస్తుతించారు. అటువంటి నాయకుడితో కలిసి ముందుకెళ్లడం ఎప్పటికీ తప్పు నిర్ణయం కాదు. ఇప్పటి సీఎం గా ఉన్న జగన్ పరదాలు కట్టుకుని, చెట్లు నరికించి తనకు ఓట్లేసి ప్రజల మధ్యకు వస్తుంటే బాబు మాత్రం తన పై జరిగిన దాడిని కూడా లెక్కచేయకుండా ప్రజాసేవకై అడుగు ముందుకు వేసారు. తన ప్రత్యర్థుల మీదకు  చొక్కాలు మడతపెట్టాల్సిన సమయం వచ్చింది’ అంటూ తన సైన్యానికి హింట్ ఇస్తున్న నాయకుడ్ని ఇప్పటి తరం చూస్తుంటే తనపై క్లైమోరే మైన్ తో దాడి జరిగినా.. చొక్కా దులుపుకుని రాష్ట్ర ప్రగతి కోసం అడుగులు వేసిన నాయకుడిని ఆ తరం చూసిందంటూ  బాబు పై జరిగిన దాడి గురించి, రాజకీయాల మీద ఆయనకు ఉన్న ఆసక్తి, ప్రజా సేవ పట్ల ఆయనకు ఉన్న అంకిత భావం,  నిబద్దత గురించి నిండు సభలో  చెప్పి బాబు అభిమానులలోనే కాదు, జనసైనికులలోనూ ఉత్తేజం ఉత్సాహం నింపారు. జనేనాని ప్రసంగం  వేదిక మీద ఉన్న చంద్రబాబునీ, నేతలనే కాదు.. సభకు హాజరైన లక్షలాది మందినీ ఒక్కసారిగా ఉద్వేగానికి గురి చేసింది.  జగన్ పార్టీ పరాజయాన్ని ఈ సభ సక్సెస్ ఖరారు చేసేసిందని పరిశీలకులు అంటున్నారు. 

తాడేపల్లిగూడెం సభతో వైసీపీ గుండెల్లో భూకంపం!.. ఓటమి ఖాయమన్న నిర్వేదం!

తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమిగా ఏర్పడ్డాయి. సీట్ల సర్దుబాటు కూడా చేసేసుకున్న తరువాత జనసేన పేరుతో వైసీపీ వాయిస్ పెంచింది. జనసైనికులం అని చెప్పుకుంటున్న కొందరిని తీసుకొచ్చి పవన్ కల్యాణ్ పై విమర్శలు చేయిస్తోంది. పొత్తులో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ 24 సీట్లు చాలు అన్న ప్రకటనకు వక్రభాష్యాలు చెబుతూ, ఆయన జనసేనను అమ్మేశారంటూ  వారు ఓ రేంజ్ లో గొంతు చించుకుంటున్నారు. సహజంగానే  అలా మాట్లాడే వాళ్లకు వైసీపీ సోషల్ మీడియా ఎనలేని ప్రాధాన్యత ఇస్తోంది. ఇక జగన్ మీడియా కూడా అటువంటి వారితో ఇంటర్వ్యూలను రిపీట్ ల మీద రిపీట్ లు చేస్తున్నది.  ఇక హరిరామ జోగయ్య వంటి స్వయం ప్రకటిత కాపు మేధావులు అయితే.. బాగు కోరి చెప్పినా పట్టించుకోవడం లేదు ఇక వారి ఖర్మ అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఇంతకీ వారిదంతా ఎందుకు చేస్తున్నారంటే.. పొత్తులో భాగంగా ఇరు పార్టీల మధ్యా ఓటు ట్రాన్స్ ఫర్ జరగదు అన్న భావనను వ్యాప్తి చేయడానికే. అయితే తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా బహిరంగ సభలో తన స్ఫూర్తిదాయక ప్రసంగంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వీటన్నిటికీ స్పష్టమైన సమాధానం ఇచ్చారు.   తాడేపల్లిగూడెం సభలో పవన్, చంద్రబాబు… తమ మధ్య ఎలాంటి సమన్వయం, అవగాహన ఉందో  ప్రత్యక్షంగా చూపించారు. ఎక్కడా అనుమానాలు… సందేహాలకు చోటు లేదని స్పష్టం చేశారు. ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని కూడా చెప్పారు. . సహజంగా ఆ సభలో ముఖ్య నేత చివరిలో మాట్లాడతారు. ఆయన మాట్లాడితే సభ ముగిస్తుంది. వచ్చిన వాళ్లు వెళ్లిపోతారు. కానీ తాడేపల్లిగూడెం సభలో చంద్రబాబు పవన్ కంటే ముందు మాట్లాడారు. ఉమ్మడి సభ అయినా .. చంద్రబాబు సభలో చివరిగా మాట్లాడే గౌరవాన్ని  పవన్ కల్యాణ్‌కే ఇచ్చారు. పొత్తులో పొరపొచ్చాలు లేవని ఇది విస్పష్టంగా చాటింది. పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు   గౌరవం ఇస్తారన్న స్పష్టత వచ్చింది. చంద్రబాబు తన ప్రసంగంలో పవన్ కల్యాణ్‌ ను ప్రశంసించారు. రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసం తాము అరమరికలు లేకుండా పని చేయాలన్న కృత నిశ్చయంతో ఉన్నామని విస్పష్టంగా చెప్పారు. అలాగే పవన్ కల్యాణ్ కూడా తన ప్రసంగంలో చంద్రబాబును రాజకీయ దురంధరుడిగా అభివర్ణించారు. అలాగే  జనసేన పార్టీకి సంస్థాగత బలం లేదని ఎలాంటి శషబిషలకూ తావివ్వకుండా చెప్పారు. తెలుగుదేశం బలం ఇదీ అని జనసైనికులకు అర్ధమయ్యేలా చెప్పారు. రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసం, యువత భవిష్యత్ కోసం కలిసి పోరాడాల్సిన అవశ్యకతను కళ్లకు కట్టారు. చంద్రబాబు సమర్థతను.. సీనియారిటీని వివరించారు. మొత్తంగా ఓ అద్భుతమైన సమన్వయం తమ మధ్య ఉందన్న సందేశాన్ని ఈ సభ ద్వారా ఇరువురు నేతలూ తమ తమ పార్టీల క్యాడర్ కే కాదు.. పొత్తుపై ఏ మూలో ఇంకా సందేహం ఉన్న వారందరి సందేహాలనూ పటాపంచలు చేశారు.  ఓటు బదిలీ జరగదంటూ వైసీపీ కుట్రపూరితంగా చేస్తున్న ప్రచారానికి చెక్ పెట్టారు. పొత్తులో భాగంగా జనసేన ఓట్లు తెలుగుదేశంకు, తెలుగుదేశం ఓట్లు  జనసేనకు బదిలీ అయితే.. ఏకపక్ష విజయాలు వస్తాయి, అది జరగకుంటే.. తేడా వస్తుంది. ఆ తేడా రాకుండా, ఓట్ల బదలీ సజావుగా సాగేందుకు ఇరువురు నేతలూ చక్కటి వ్యూహంతో ఈ సభ ద్వారా పొత్తులో ఎలాంటి పొరపొచ్చాలూ లేవని విస్పష్టంగా చాటారు.  మొత్తంగా తాడేపల్లి గూడెం సభ ద్వారా అధికార పక్షం కుట్రలను ఇరువురు నేతలూ బహిర్గతం చేశారు. వాటిని విచ్ఛిన్నం చేయాలన్న భావనను రెండు పార్టీల నేతలూ, క్యాడర్ లో కలిగించారు. మొత్తంగా సభకు వచ్చిన జనస్పందన, బాబు, పవన్ కల్యాణ్ ప్రసంగాలు ఇరు పార్టీల క్యాడర్ లోనే కాదు, ప్రజలలో కూడా ఇరువురి కలయికతో రాష్ట్రం ఉజ్వల భవిష్యత్ దిశగా పరుగులు తీస్తుందన్న నమ్మకం కలిగించారు. అదే సమయంలో అధికార వైసీపీలో  ఇప్పటికే ఉన్న భయం ద్విగుణీకృతమై, ఓటమి ఖాయమన్న భావన కలిగేలా చేశారు. 

రాజ్యసభ ఎన్నికలు.. రాజస్థాన్ లో కాంగ్రెస్ కి , కర్ణాటకలో బిజెపికి  క్రాస్ ఓటింగ్ షాక్ 

రాజ్యసభ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా సాగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీకి బలం లేకున్నా ఆ పార్టీ గెలవడం సంచలనంగా మారింది. ఇక కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ప్రతిపక్ష బీజేపీ-జేడీఎస్ కూటమికి షాక్ ఇచ్చింది. కూటమి అభ్యర్థికి కాకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి బీజేపీ నేతలు ఓటు వేసినట్లు సమాచారం. రాజ్యసభలో ఖాళీ కానున్న 56 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా.. అందులో 41 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే మిగిలిన 15 రాజ్యసభ స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరిగాయి. ఈ 15 స్థానాలకు కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లలో ఎన్నికలు నిర్వహించారు. ఈ క్రమంలోనే రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌లో క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ సందర్భంగానే పలు పార్టీలకు క్రాస్‌ ఓటింగ్‌ ప్రభావం చూపించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే హిమాచల్‌ ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చినట్లు సమాచారం. ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీకి అనుకూలంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఓటు వేయగా.. కర్ణాటకలో మాత్రం బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో 10 రాజ్యసభ స్థానాలకు ఓటింగ్‌ జరిగింది. ఈ 10 స్థానాలకు బీజేపీ 8 మంది అభ్యర్థులను పోటీలో నిలిపింది. సమాజ్‌వాదీ పార్టీ ముగ్గురిని బరిలో ఉంచింది. అయితే యూపీలో ఏడుగురు సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీకి అనుకూలంగా క్రాస్‌ ఓటింగ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇక హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పటికీ.. అక్కడ బీజేపీకి అనుకూలంగా క్రాస్‌ ఓటింగ్‌ జరగడం పెను సంచలనంగా మారింది. హిమాచల్ ప్రదేశ్‌లో అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలతోపాటు మరో ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీకి మద్దతుగా ఓటు వేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా పోటీలో ఉన్న అభిషేక్‌ మను సింఘ్వీకి నిరాశ తప్పలేదు.   ఇక కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఓటు వేయడం సంచలంగా మారింది. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ-జేడీఎస్‌ కూటమికి గట్టి షాక్ తగిలింది. బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ఎస్‌టీ సోమశేఖర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌ మాకెన్‌కు ఓటేసినట్లు తెలుస్తోంది. మరో ఎమ్మెల్యే శివరాం హెబ్బర్‌ ఓటింగ్‌కు దూరంగా ఉండిపోవడం కూడా బీజేపీకి ఎదురుదెబ్బగా మారింది. దీంతో కాంగ్రెస్‌ 3 స్థానాల్లో విజయం ఖాయం కాగా.. బీజేపీకి ఒకచోట గెలిచే అవకాశం ఉంది. కర్ణాటక బీజేపీపై గత కొన్ని రోజులుగా అసంతృప్తితో ఉన్న ఈ ఇద్దరు రెబల్‌ ఎమ్మెల్యేలు ఎస్‌టీ సోమశేఖర్, శివరాం హెబ్బర్.. గత కొంతకాలంగా కాంగ్రెస్‌ పార్టీతో సన్నిహితంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ నేపథ్యంలో ఎస్‌టీ సోమశేఖర్‌పై చట్టప్రకారం చర్యలు తీసుకునే అంశంపై స్పీకర్‌తో మాట్లాడతామని విపక్ష నేత, కర్ణాటక మాజీ ఉపముఖ్యమంత్రి ఆర్‌ అశోకా తెలిపారు. ఓటింగ్‌ అనంతరం విలేకర్లతో మాట్లాడిన ఎస్‌టీ సోమశేఖర్‌.. ఈ రాజ్యసభ ఎన్నికల్లో తన మనస్సాక్షికి అనుగుణంగానే ఓటు వేశానని చెప్పడం మరిన్ని ఊహాగానాలకు దారి తీస్తోంది.

వైజాగ్ తీరానికి కొట్టుకొచ్చిన భారీ పాము 

వైజాగ్ తీరానికి మంగళవారం ఓ భారీ పాము కళేబరం కొట్టుకువచ్చింది. నగర పరిధిలోని సాగర్ నగర్ బీచ్ దగ్గర్లో ఈ కళేబరం కనిపించింది. సముద్రంలో అరుదుగా కనిపించే ఈ పామును నలపాముగా వ్యవహరిస్తారని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారుల వలలకు చిక్కిన పామును తిరిగి సముద్రంలో విడిచిపెట్టే క్రమంలో ఇది చనిపోయి ఉంటుందని చెప్పారు. వలలో చిక్కుకోవడంతో భయాందోళనలకు గురై ఈ పాములు చనిపోతాయని వివరించారు. ఈ భారీ పాము కళేబరాన్ని చూసేందుకు చుట్టుపక్కల వారు గుడ్లవాని పాలెం అమ్మవార్ల ఆలయాల తీరానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవికాస్తా వైరల్ గా మారాయి.  అక్కడే ఉన్న మత్స్యకారులు దానిని గమనించి వెంటనే తమ వలతో పామును పట్టుకున్నారు. ఈ పాము గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.   

లోక్ సభ ఎన్నికల ముందు అజెండా లేక బీఆర్ఎస్ డీలా!

భారత రాష్ట్ర సమితిని  తెలంగాణ ప్రజలు పూర్తిగా విస్మరించారా? ఎప్పుడైతే పార్టీ పేరులోంచి తెలంగాణను తొలగిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారో అప్పటి నుంచే కేసీఆర్ ప్రభుత్వాన్ని వదిలించేసుకోవాలని తెలంగాణ జనం డిసైడైపోయారా అంటే పరిశీలకుల నుంచి ఔననే సమాధానమే వస్తోంది.  అదలా ఉంటే.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలై  కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన క్షణం నుంచీ బీఆర్ఎస్ కు వరుసగా షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వలసలూ పెరిగాయి. వలసల జోరు చూస్తుంటే.. బీఆర్ఎస్ మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయింది. పార్టీ మారుతున్న వారిపై విమర్శలు చేయడానికి కూడా ఆ పార్టీ అధినేతకు అవకాశం లేని పరిస్థితి కనిపిస్తోంది. ఆయన పార్టీ మారుతున్న వారిపై ఏమైనా విమర్శలు చేస్తే.. తాను అధకారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికి తలుపులు బార్లా తెరిచి మరీ స్వాగతం పలకడమే కాకుండా, వారికి పదవులు కట్టబెట్టిన సంగతి గుర్తు చేసి నిలదీస్తారన్న భయం ఆయనను మౌనం వహించేలా చేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అసెంబ్లీ ఎన్నికలలో ఎదురైన పరాభవాన్ని పక్కన పెట్టి కనీసం లోక్ సభ ఎన్నికలలోనైనా పుంజుకునేలా పార్టీనీ, క్యాడర్ ను సమాయత్తం చేద్దామంటే అందుకూ పరిస్థితులు సానుకూలంగా కనిపించడం లేదు. రాష్ట్రంలో ఉన్న 17 లోక్ సభ నియోజకవర్గాలకూ అభ్యర్థులను ఎంపిక చేయడమే కష్టంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ దశలో పదేళ్ల పాటు రాష్ట్రాన్ని కనుసైగతో కంట్రోల్ చేసిన, ప్రత్యర్థుల అంచనాలకు అందకుండా వ్యూహరచనలు చేసిన కేసీఆర్ ఇప్పుడు ఇంత డీలా పడిపోయారేమిటి? అని పరిశీలకులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  కేసీఆర్ పరిస్థితి ఇలా ఉంటే మరో వైపు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం తనకు మాత్రమే ప్రత్యేకమైన దూకుడుతో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండగా చేసిన పొరపాట్లు, తప్పిదాలను కడిగి పారేస్తున్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జరిగిన అవకతవకలు, అవినీతి, అక్రమాలపై బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పుకోలేని విధంగా ఆధారాలతో సహా చెరిగిపారేస్తున్నారు. ఈ తరుణంలో  లోక్ సభ ఎన్నికలలో కనీసం కొన్ని స్థానాలలోనైనా విజయం సాధించి ఆబోరు కాపాడుకోవాలని కేసీఆర్ తహతహలాడుతున్నట్లు కనిపిస్తోంది. ఏదో విధంగా లోక్ సభ ఎన్నికలలో పుంజుకోవాలని చూస్తున్న ఆయన బీజేపీతో పొత్తుపై పార్టీ పరంగా లీకులు ఇచ్చారు. అయితే కేసీఆర్ ఈ ఎత్తుగడ కూడా ఘోరంగా విఫలమైంది. బీజేపీతో పొత్తు వార్తలపై ఆ పార్టీ సీనియర్ నేత బండి సంజయ్ ఘాటుగా బదులిచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ పొత్తు అని ఎవరైనా అంటే చెప్పు తీసుకు కొట్టండి అంటూ ఆయన బహిరంగంగా ప్రకటించారు. దీనికి బీఆర్ఎస్ నుంచి గట్టిగా బదులిచ్చే నేతే లేకపోయారు. దీంతో బీజేపీతో పొత్తు కోసం బీఆర్ఎస్ మాత్రమే తహతహలాడుతోందని అందరికీ తెలిసిపోయింది. ఈ తరుణంలో  రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి అయ్యే విధంగా   లోక్ సభ ఎన్నికలలో కనీసం ఒక్క స్థానంలోనైనా విజయం సాధించి చూపండి అంటూ సవాల్ విసిరారు.  అయినా కూడా కేసీఆర్ నుంచి కానీ, బీఆర్ఎస్ కీలక నేతలైన కేటీఆర్, హరీష్ రావుల నుంచి స్పందన లేదు.  దీంతో పార్టీ క్యాడర్ లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. మరో వైపు ఎన్నికల ముందు రేవంత్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలనూ ఒకదాని వెంట ఒకటి గా అమలు చేస్తూ తనది మాటల సర్కార్ కాదు, చేతల ప్రభుత్వమని చాటుతున్నారు. తద్వారా లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ కు పూర్తి సానుకూల వాతావరణం ఏర్పడేలా చేసుకున్నారు. అదే సమయంలో  బీఆర్ఎస్ పరిస్థితి రోజు రోజుకూ అగమ్య గోచరంగా మారిపోతోంది. లోక్ సభ ఎన్నికలలో పోటీకి అభ్యర్థులనే ఎంపిక చేసుకోలేని దయనీయ స్థితికి ఆ పార్టీ దిగజారిపోయింది. అలాగే ఎన్నికల అజెండా కూడా ఇప్పటికీ ఖరారు చేసుకోలేని పరిస్థితిలో ఉంది.  మేడిగడ్డ కుంగుబాటు, కాళేశ్వరం వైఫల్యాలు ఆ పార్టీని వదలకుండా వెంటాడుతున్నాయి.  మేడిగడ్డ విషయంలో బీఆర్ఎస్ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది. ఎంతగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ సందర్శనకు ఆహ్వానించినప్పుడు నిరాకరించిన బీఆర్ఎస్.. ఇప్పుడు అదే మేడిగడ్డ సందర్శనకు ముహూర్తం ఖరారు చేసింది.  తన వైఫల్యాన్ని జనంలో మరోసారి భూతద్దంలో చూపే ప్రయత్నంగా బీఆర్ఎస్ మేడిగడ్డ సందర్శన కార్యక్రమాన్ని పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.  సరిగ్గా ఎన్నికల ముందు.. ఏం చెప్పి ప్రజలను ఓట్లడగాలన్న విషయంలో స్పష్టత లేని అయోమయ స్థితిలో బీఆర్ఎస్ ఉంటే.. అధికార కాంగ్రెస్ కొలువుదీరిన ఈ మూడు నెలలలో అమలు చేసిన వాగ్దానాలను విస్తృతంగా ప్రచారం చేసుకోవడంతో పాటు, అధికారంలో ఉండగా బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతోంది. ఇక బీజేపీకి అయితే రామమందిరం ప్రధాన ప్రచారాస్త్రంగా ఉంది. ఏ అజెండా లేకుండా ఉన్న పార్టీ బీఆర్ఎస్ మాత్రమే.  పార్టీ ఈ పరిస్థితిలో ఉన్నా కేసీఆర్ మౌనం వీడకపోవడంతో ఆయన నాయకత్వంపై పార్టీ నేతలే కాదు, క్యాడర్ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 

కవితపై ఈడీ కేసు...సుప్రీంలో విచారణ 

తెలంగాణలో బిఆర్ఎస్ పరాజయం పాలైన తర్వాత ఆ పార్టీకి కష్టాలు తీవ్రమవుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ తనయ మీద ఉన్న ఈడీ  కేసు మళ్లీ తిరగతోడుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణకు హాజరు కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నోటీసులను సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. గత ఏడాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మహిళనైన తనను ఈడీ విచారణకు పిలవడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. తనపై ఈడీ ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టును ఆమె కోరారు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు నేడు విచారణ జరపనుంది. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం పిటిషన్ ను విచారించనుంది.  మరోవైపు ఇదే స్కామ్ లో కవితకు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటి వరకు సాక్షిగా ఉన్న కవితను... సీబీఐ నిందితురాలిగా మార్చింది. దీంతో, ఈ కేసులో కవితకు ఉచ్చు బిగుస్తోందనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి. అయితే, ముందే నిర్ణయించిన కార్యక్రమాల దృష్ట్యా విచారణకు హాజరు కాలేనని సీబీఐకి కవిత లేఖ రాశారు. గతంలో ఇచ్చిన సెక్షన్ 160 నోటీసుకు 41ఏ నోటీసు పూర్తి విరుద్ధంగా ఉందని లేఖలో ఆమె పేర్కొన్నారు. ఇది తన ప్రజాస్వామిక, రాజ్యాంగ హక్కులకు భంగం కలిగిస్తోందని చెప్పారు.

గుంటూరులో ప్రభుత్వ వ్యతిరేకత ఘాటు.. జగన్ ఉక్కిరిబిక్కిరి!

ఉమ్మ‌డి గుంటూరు నియోజ‌క‌వ‌ర్గంలో  తెలుగుదేశం  హ‌వా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఉమ్మ‌డి జిల్లాలో మొత్తం ప‌దిహేడు నియోజ‌క‌వ‌ర్గాలు ఉండ‌గా.. ప‌న్నెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో  తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మి మొద‌టి జాబితాలోనే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా మెజార్టీ ప్ర‌జ‌ల్లో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై తీవ్ర‌వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ముఖ్యంగా  రాజ‌ధాని అమరావతిని నిర్వీర్యం చేయ‌డం ప‌ట్ల ఉమ్మ‌డి గుంటూరు జిల్లా ప్ర‌జ‌లు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై తీవ్ర ఆగ్ర‌హం తో ఉన్నారు. దీంతో ఈ జిల్లాలో మెజార్టీ నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ అభ్య‌ర్థుల ఓట‌మికి అమ‌రావ‌తి రాజ‌ధాని అంశం   కార‌ణంగా మార‌బోతుంద‌న్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతుంది. ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలో  తెలుగుదేశంకు బ‌ల‌మైన క్యాడ‌ర్ ఉంది. ఒక‌విధంగా చెప్పాలంటే ఈ జిల్లాలోని అత్యధిక నియోజ‌క‌వ‌ర్గాలు తెలుగుదేశం పార్టీకి కంచుకోట‌లు. ఈసారి ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలో అత్య‌ధిక స్థానాల్లో  తెలుగుదేశం అభ్య‌ర్థులు విజ‌యం సాధిచండం ఖాయంగా క‌నిపిస్తోంది.  తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థులను ప్రకటించిన నియోజకవర్గాలలో ఏ పార్టీ విజయావకాశాలు ఎలా ఉన్నాయంటే.. మంగ‌ళ‌గిరి ..  ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలో  తెలుగుదేశం భారీ మెజార్టీతో గెలిచే నియోజ‌క‌వ‌ర్గం మంగ‌ళ‌గిరి అని టీడీపీ ఢంకా బజాయించి మరీ చెబుతోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్  మ‌రోసారి బ‌రిలోకి దిగుతున్నారు. 2019 ఎన్నిక‌ల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన లోకేష్ ఆళ్ల రామ‌కృష్ణారెడ్డిపై పరాజయం పాలయ్యారు. అయితే అప్ప‌టి నుంచి నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటూ వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి లోకేశ్ కృషి చేస్తున్నారు. మ‌రోవైపు అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంలో వైసీపీ ప్ర‌భుత్వం అవ‌లంబిస్తున్న విధానం ఈ నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం పార్టీకి  క‌లిసొచ్చే ప్ర‌ధాన అంశంగా చెప్పొచ్చు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల‌ను వైసీపీ అధిష్టానం తొల‌గించి గంజి చిరంజీవి ఇంచార్జి బాధ్య‌త‌లు అప్ప‌గించింది. అయితే, చిరంజీవిని సైతం త‌ప్పించి మ‌రొక‌రికి ఇంచార్జి బాధ్య‌త‌లు ఇస్తార‌ని తెలుస్తోంది. ఇక్క‌డి నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా ఎవ‌రు బ‌రిలో నిలిచినా మంగ‌ళ‌గిరిలో నారా లోకేశ్ భారీ విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని దాదాపు అన్ని స‌ర్వేలు తేల్చి చెప్పాయి.   పొన్నూరు.. పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఈసారి తెలుగుదేశం విజ‌యం ఖాయ‌మ‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు పేర్కొంటున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కిలారి రోశ‌య్య‌ను మ‌రోసారి వైసీపీ అధిష్టానం బ‌రిలోకి దించుతోంది. తెలుగుదేశం నుంచి మ‌రోసారి దూళిపాళ్ల న‌రేంద్ర పోటీ చేస్తున్నారు. ఇప్ప‌టికే తెలుగుదేశం, జ‌న‌సేన మొద‌టి జాబితాలో  దూళిపాళ్ల న‌రేంద్ర పేరును చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. దూళిపాళ్ల న‌రేంద్ర 2019లో మిన‌హా గ‌తంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. 2024 ఎన్నిక‌ల్లో దూళిపాళ్ల విజ‌యం ఖాయంగా క‌నిపిస్తుంది.  వైసీపీ ప్ర‌భుత్వంపై నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. దీనికితోడు అమ‌రావ‌తి రాజ‌ధానిపై జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌పై ఈ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీనికితోడు తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీల‌కు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉండ‌టంతో ఈసారి దూళిపాళ్ల న‌రేంద్ర విజ‌యం నల్లేరు మీద బండి నడకేనని పరిశీలకులు సైతం చెబుతున్నారు.  వేమూరు..  వేమూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి  గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా మేరుగు నాగార్జున బ‌రిలో నిలిచి విజ‌యం సాధించారు. జగన్ కేబినెట్ లో మంత్రిగానూ కొన‌సాగారు. ఈసారి వైసీపీ అధిష్టానం ఆయ‌నను  ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తప్పించి వ‌రికూటి అశోక్ బాబును పార్టీ అభ్యర్థిగా తీసుకువచ్చింది. ఇక్కడ నుంచి తెలుగుదేశం అభ్య‌ర్థిగా న‌క్కా ఆనందబాబు బ‌రిలోకి దిగుతున్నారు. ఈ ఎన్నిక‌ల్లో ఆనంద బాబు విజ‌యం ఖాయ‌మ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. వైసీపీ అభ్య‌ర్థి అశోక్ బాబుకు వ‌ర్గ పోరు ఇబ్బందిక‌రంగా మారింది. దీనికితోడు నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌జ‌లు నాలుగున్న‌రేళ్ల జ‌గ‌న్ పాల‌న‌పై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంలో జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించిన తీరు కూడా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీపై ప్రతి కూల ప్ర‌భావం చూప‌నుంది. ఈ ప‌రిణామాల‌న్నీ క‌లిసి వేమూరు నుంచి న‌క్కా ఆనంద‌బాబు విజ‌యం ఖాయ‌మ‌ని అంటున్నారు. రేప‌ల్లె..  రేప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో  తెలుగుదేశం అభ్య‌ర్థి అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ విజ‌యం సాధించారు. మ‌రోసారి తెలుగుదేశం అభ్యర్థిగా ఆయనే పోటీ చేయనున్నారు.  వైసీపీ తరఫున ఈవూరి గ‌ణేశ్ ఇక్కడ నుంచి పోటీ చేయనున్నారు. ఇక్కడ నుంచి పోటీలో ఉన్న ఇద్దరూ కూడా  గౌడ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో గౌడ సామాజిక వ‌ర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి. అయితే  నియోజ‌క‌వ‌ర్గంలో నాలుగున్న‌రేళ్ల వైసీపీ ప్ర‌భుత్వ పాల‌న ప‌ట్ల అధిక‌శాతం మంది ప్ర‌జ‌లు అసంతృప్తి  వ్య‌క్తం చేస్తున్నారు. దీనికితోడు తెలుగుదేశం, జ‌న‌సేన క‌లిసి పోటీ చేస్తుండ‌టంతో మ‌రోసారి అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ విజ‌యం ఖాయ‌మ‌ని ప‌రిశీల‌కులు పేర్కొంటున్నారు.  బాప‌ట్ల..  బాప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కోన ర‌ఘుప‌తి ఉన్నారు. మ‌రోసారి వైసీపీ అధిష్టానం కోన ర‌ఘుప‌తినే బ‌రిలో నిలిపే అవ‌కాశం ఉంది. తెలుగుదేశం అభ్య‌ర్థిగా వేగ్వేశ న‌రేంద్ర వ‌ర్మ బ‌రిలోకి దిగుతున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతుంది. ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త‌తో పాటు తెలుగుదేశం, జ‌న‌సేన  క‌లిసి పోటీ చేస్తుండ‌టంతో ఇక్కడ తెలుగుదేశం అభ్య‌ర్థి విజ‌యం ఖాయ‌మ‌న్న భావన స్థానికంగా బలంగా వ్యక్తం అవుతోంది.  ప్ర‌తిప్తాడు..  ప్ర‌తిపాడు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి మేక‌తోట సుచ‌రిత విజ‌యం సాధించారు. వైసీపీ అధిష్టానం ఆమెను ప‌క్క‌కు త‌ప్పించి బాల‌సాని కిర‌ణ్ కుమార్ ను ఈ సారి బరిలోకి దింపుతోంది. తెలుగుదేశం నుంచి  మాజీ ఐఏఎస్ అధికారి బి. రామాంజ‌నేయులు బ‌రిలోకి దిగుతున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో ఉన్న వ్య‌తిరేక‌త తెలుగుదేశం అభ్య‌ర్థి విజ‌యాన్ని సునాయాసం చేస్తుందని అంటున్నారు.   చిల‌క‌లూరి పేట..  చిల‌క‌లూరి పేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి విడద‌ల ర‌జ‌నీ విజ‌యం సాధించారు. ప్ర‌స్తుతం ఆమెను వైసీపీ అధిష్టానం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి త‌ప్పించి మ‌ల్లెల రాజేశ్ నాయుడును రంగంలోకి దించింది. తెలుగుదేశం  ఈ నియోజ‌క‌వ‌ర్గంలో సీనియ‌ర్ నేత‌ ప్ర‌త్తిపాటి పుల్లారావుకు మ‌రోసారి అవ‌కాశం క‌ల్పించింది. ఈ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జావ్య‌తిరేక‌త పాల‌న‌పై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. మ‌రోవైపు టీడీపీ,జ‌న‌సేన పొత్తు  ప్ర‌త్తిపాటి పుల్లారావు విజ‌యాన్ని లాంఛనం చేసేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  స‌త్తెన‌ప‌ల్లి..  స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా అంబ‌టి రాంబాబు విజ‌యం సాధించారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగానూ కొన‌సాగుతున్నారు. మ‌రోసారి వైసీపీ అధిష్టానం స‌త్తెన‌ప‌ల్లి నుంచి అంబ‌టి రాంబాబును బ‌రిలోకి దింపుతున్నది. తెలుగుదేశం అభ్య‌ర్థిగా ఈసారి మాజీ మంత్రి, సీనియ‌ర్  నేత క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ బ‌రిలోకి దిగుతున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో  తెలుగుదేశం, జ‌న‌సేన  కూటమి అభ్య‌ర్థి విజ‌యం ఖాయ‌మ‌ని   ప‌లు స‌ర్వేలు పేర్కొన్నాయి. ల‌క్ష్మీనారాయణ విజ‌యానికి దోహ‌ద‌ప‌డే అంశాల‌ను ప‌రిశీలిస్తే.. నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో అంబ‌టి రాంబాబుపై వ్య‌తిరేక‌త ఉంది. తెలుగుదేశం, జ‌న‌సేన అధినేత‌ల‌పై అంబ‌టి రాంబాబు అభ్యంత‌ర‌క‌ర భాష‌ను ఉప‌యోగించిన సంద‌ర్భాలు ఉన్నాయి. దీంతో అంబ‌టి భాష‌తీరుపై నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. దీనికి తోడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాలుగున్న‌రేళ్ల పాల‌న తీరుపై స్థానిక‌ ప్ర‌జ‌ల్లో తీవ్ర అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది. అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ్యవహరించిన తీరు, అంబ‌టి రాంబాబు వ్యాఖ్య‌ల ప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గంలోని మెజార్టీ ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నారు. మ‌రోవైపు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో ఉన్న మంచి అభిప్రాయం, తెలుగుదేశం, జ‌న‌సేన పొత్తు కలిసి కన్నా విజయం సునాయసమేనన్న భావన నియోజకవర్గంలో బలంగా వ్యక్తమౌతోంది.   వినుకొండ..  వినుకొండ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు విజ‌యం సాధించారు. మ‌రోసారి ఆయ‌న్నే వైసీపీ అధిష్టానం బ‌రిలోకి దింప‌నుంది. తెలుగుదేశం అభ్య‌ర్థిగా జీవీ ఆంజ‌నేయులు బ‌రిలోకి దిగుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలోని మెజార్టీ ప్ర‌జ‌ల్లో బ్ర‌హ్మానాయుడుపై వ్య‌తిరేక‌త ఉంది. వైసీపీలో వ‌ర్గ‌పోరు చాప‌కింద‌నీరులా విస్త‌రిస్తోంది. దీనికితోడు ఈసారి తెలుగుదేశం, జనసేన పొత్తు ఉండటంతో  టీడీపీ అభ్య‌ర్థి జీవీ ఆంజ‌నేయులు విజ‌యం ఖాయ‌మ‌ని ప‌రిశీల‌కులు పేర్కొంటున్నారు.    మాచ‌ర్ల..  మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి విజ‌యం సాధించారు. మ‌రోసారి ఆయ‌న్నే వైసీపీ అధిష్టానం బ‌రిలోకి దింప‌నుంది. తెలుగుదేశం, జ‌న‌సేన ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా జూల‌కంటి బ్ర‌హ్మానంద‌రెడ్డిని చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌టించారు. పిన్నెల్లిపై నియోజ‌క‌వ‌ర్గంలో మెజార్టీ ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. దీనికితోడు జ‌గ‌న్ పాల‌న‌పైనా ప్ర‌జ‌లు అసంతృప్తితో ఉన్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో  తెలుగుదేశం, జ‌న‌సేన క‌లిసి పోటీచేస్తుండ‌టం జూలకంటి విజయానికి దోహదం చేస్తుందని అంటున్నారు.  తెనాలి..  తెనాలి నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా అన్నాబ‌త్తుల శివ‌కుమార్ బ‌రిలో నిలిచి విజ‌యం సాధించారు. మ‌రోసారి ఆయ‌నే వైసీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగ‌బోతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో  తెలుగుదేశంఅభ్య‌ర్థిగా ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్‌, జ‌న‌సేన అభ్య‌ర్థిగా నాదెండ్ల మ‌నోహ‌ర్ పోటీచేశారు. ఈసారి తెలుగుదేశం, జనసేన పొత్తులో భాగంగా  తెనాలి నియోజ‌క‌వ‌ర్గం నుంచి జనసేన నాయకుడు నాదెండ్ల మ‌నోహ‌ర్ పోటీ చేస్తున్నారు. ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్ తొలుత కొంత అసంతృప్తి వ్య‌క్తం చేసినా చంద్ర‌బాబుతో భేటీ త‌రువాత నాదెండ్ల మ‌నోహ‌ర్ అభ్య‌ర్ధిత్వాన్ని బ‌ల‌ప‌రుస్తున్నారు. నాదెండ్ల విజ‌యానికి తాను, త‌న అనుచ‌రులు పూర్తి స్థాయిలో స‌హ‌క‌రిస్తామ‌ని చెప్పారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ ఎమ్మెల్యే అన్నాబ‌త్తుల శివ‌కుమార్ పై నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. శివ‌కుమార్‌పై ఇసుక మాఫియా ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ప్ర‌శ్నిస్తున్న వారిని ఆయ‌న అనుచ‌రులు బెదిరిస్తున్నార‌న్న విమర్శలూ  ఉన్నాయి. దీనికితోడు వైసీపీలోని ఓ వ‌ర్గం శివ‌కుమార్ తీరుపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉంది. వీట‌న్నింటికితోడు టీడీపీ, జ‌న‌సేన క‌లిసి పోటీచేస్తుండ‌టంతో శివ‌కుమార్ ఓట‌మి ఖాయ‌మ‌న్నభావన స్థానికంగా వ్యక్తం అవుతోంది. నాదెండ్ల మ‌నోహ‌ర్ విజ‌యం ఈ నియోజ‌క‌వ‌ర్గంలో దాదాపు ఖాయ‌మ‌ని ఇప్ప‌టికే ప‌లు స‌ర్వేలు పేర్కొన్నాయి.  తాటికొండ..  తాటికొండ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మి అభ్య‌ర్థిగా తెనాలి శ్రావ‌ణ్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఆయ‌న తెలుగుదేశం అభ్యర్థిగా   2009లో ఓడిపోగా.. 2014లో  విజయం సాధించారు. అయితే  2019లో ఓట‌మి పాల‌య్యారు. మ‌రోసారి తెలుగుదేశం అభ్యర్థిగా శ్రావ‌ణ్ కుమార్  ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా విజ‌యం సాధించిన ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవి తెలుగుదేశంలో చేరిన సంగతి విదితమే. దీంతో ఈసారి తాటికొండ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా జ‌గ‌న్ కేబినెట్ లో హోమంత్రిగా ప‌నిచేసిన మేక‌తోటి సుచ‌రిత బ‌రిలోకి దిగుతున్నారు.  ఈ నియోజ‌క‌వ‌ర్గ  ప్ర‌జ‌ల్లో వైసీపీ ప్ర‌భుత్వంపై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. దీనికి తోడు వైసీపీలో వ‌ర్గ విబేధాలు, తెలుగుదేశం, జనసేన పొత్తు శ్రావణ్ కుమార్ విజ‌యానికి క‌లిసొచ్చే అంశాలుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

రోడ్‌షోను నిర్వహించిన పి&జి హైదరాబాద్ ప్లాంట్

ఇతరత్రా సామర్థ్యాలు గల వారు (వికలాంగులు) రూపొందించిన పెయింటింగ్‌లను ఆవిష్కరించడం ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభమైంది, 'అందరికీ ఇక్కడ స్వాగతం' అనే సైనేజ్ ను ప్రదర్శించడం ద్వారా ప్లాంట్‌లో అందరికీ స్థానం ఉంటుందనే  బలమైన సందేశాన్ని అందించింది. హైదరాబాద్, 26 ఫిబ్రవరి, 2024: టైడ్, ఏరియల్, ప్యాంపర్స్ మొదలైన బ్రాండ్‌ల తయారీ సంస్థ ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ ఇండియా (P&G ఇండియా) హైదరాబాద్ లో దేశంలోని తన అతిపెద్ద తయారీ కేంద్రం వద్ద 'ఈక్వాలిటీ అండ్ ఇన్‌క్లూజన్ రోడ్‌షో' రెండవ ఎడిషన్‌ను నిర్వహించింది. అందరికీ అవకాశాలు కల్పించడంపై అవగాహనను పెంపొందించే లక్ష్యంతో జరిగిన ఈ రోడ్‌షో సంస్థలోని అన్ని స్థాయిల నుండి విభిన్న ఉద్యోగుల సమూహాన్ని ఒక్క చోటుకు తీసుకువచ్చింది. సాంకేతిక నిపుణులు, లైన్ వర్కర్ల నుండి మేనేజర్ల వరకు వివిధ స్థాయిలకు చెందిన ఉద్యోగులు ఇందులో పాల్గొన్నారు. కొత్త నియమించబడిన వారి నుంచి నుండి దశాబ్దాల అనుభవంకంపెనీ సీనియర్ ఉద్యోగులు దీనికి హాజరయ్యారు.  ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ ఆకర్షణీయమైన సెషన్‌లు, చర్చలు జరిగాయి.   పక్షపాతాలను గుర్తించడానికి, అడ్డంకులను అధిగమించడానికి ఇవి వారికి తోడ్పడ్డాయి. సమాజంలోని భిన్న వర్గాలను మరింతగా కూడగట్టుకుంటూ తమ ప్రయాణంలో ముందుకు సాగుతామని వారు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. పి అండ్ జి చేపట్టిన సమానత్వం, చేకూర్పు వ్యూహం సంపూర్ణమైనది, సమగ్రమైనది. లింగ సమానత్వం, ఎల్జీబీటీక్యూ ప్లస్ తది తరులను చేర్చడం, వైకల్యాలున్న వ్యక్తులను చేర్చడం వంటి వాటిపై దృష్టి కేంద్రీకరించే ప్రయత్నాలతో అందరినీ చేర్చడం లక్ష్యంగా పెట్టుకుంది. సంస్థ మునుపటి ఎడిషన్ సాధించిన విజయం నేపథ్యంలో ఈ సంవత్సరం నిర్వహించిన కార్యక్రమం కూడా ప్రఖ్యాత నిపుణులు,  అతిధులను ఒకచోట చేర్చింది. భారతదేశంలో మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులో చేరిన మొదటి లింగమార్పిడి వ్యక్తి డాక్టర్ రూత్ జాన్ పాల్, సెన్స్ – ఇట్ –ఐస్ వ్యవస్థాపకురాలు, శిక్షకురాలు, సున్నిత అంశాలపై వర్క్ షాప్స్ నిర్వాహకురాలు శ్రీమతి పాయల్ కపూర్,  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈ కార్యక్రమం  ప్రెగ్నెన్సీ సిమ్యులేటర్‌ల నుండి భారతీయ సైన్ లాంగ్వేజ్    ప్రాథమిక విషయాలపై  ఉద్యోగుల్లో అవగాహన మరియు సానుభూతిని పెంపొందించడానికి తోడ్పడింది.  పి అండ్ జి ఇండియా  మావన వనరుల విభాగం అధిపతి శ్రీనివాస్ పి.ఎం. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘ఒక కంపెనీగా మేం ప్రపంచవ్యాప్తంగా మరియు భారతదేశంలోని బిలియన్ల మంది వినియోగదారులకు సేవలందించడానికి ప్రగాఢంగా కట్టుబడి ఉన్నాం. మేం మా వినియోగదారుల వైవిధ్యాన్ని గౌరవించి, దానిని ప్రతిబింబించేటపుడు, వారి ప్రత్యేక అవసరాలను పూర్తిగా అర్థం చేసుకున్న ప్పుడు వారికి అత్యుత్తమ ఉత్పత్తులు, సేవలతో అందించడాన్ని మేం మరింత ఉత్తమంగా చేస్తాం అనే దాన్ని మేం నిజంగా విశ్వసిస్తు న్నాం. ఇది పి అండ్ జి లో మా సంస్కృతిలో పొందుపరచబడింది. మా వినియోగదారుల వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడం మరియు ప్రతిబింబించడం ఇక్కడే - మా కార్యాలయంలోనే ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరికీ అత్యుత్తమ బ్రాండ్ అనుభవాలను అందించడానికి లోతైన దృక్పథాలను పొందడంలో ఇక్కడ మా ఉద్యోగులు మాకు సహాయపడతారు. దీనికి అనుగుణంగా, మా సంస్కృతికి మూలస్తంభంగా ఉన్న సమానత్వం, చేరికను మేం ప్రోత్సహించడం కొనసాగించాం. ప్రతి ఉద్యోగి తమ సొంత వ్యక్తిత్వాలతో కార్యాలయానికి రావచ్చు. మా విభిన్న ఉద్యోగుల యొక్క విభిన్న జీవిత దశ అవసరాలను తీర్చడానికి అందించబడిన అనేక ప్రత్యేక కార్యక్రమాలు మరియు కార్యాలయ విధానాల ద్వారా ఇది మరింత బలపడుతుంది’’ అని అన్నారు. ఆయన ఇంకా ఇలా అన్నారు, ‘‘ ఈ సంవత్సరం రోడ్‌షో రెండవ ఎడిషన్‌తో మేము మా ఉద్యోగులను చేకూర్పు యొక్క  నిజమైన ప్రచారకర్తలుగా మార్చడానికి ప్రయత్నించాం. ఇక్కడి విధానాలు మరియు రూపుదిద్దుకున్న అనుసంధానతలు ప్రతి ఒక్కరూ తమ ఉత్తమమైన సహకారాన్ని అందించే నిర్దిష్ట చర్యలుగా మారుతాయని మేం విశ్వసిస్తున్నాం. మా ఉద్యోగులు వారి కమ్యూనిటీలకు తిరిగి వచ్చినప్పుడు, వారు చేకూర్పులకు ప్రచారకర్తలుగా మారారు.  వారుఈ సందర్భాన్ని వేగాన్ని ముందుకు తీసుకువెళతారు మరియు పి అండ్ జి వెలుపల సైతం సానుకూల మార్పును ప్రేరేపిస్తారు’’. సంవత్సరాలుగా పి అండ్ జి హైదరాబాద్ సైట్ చేకూర్పుపై ఆలోచనలు చేసే అగ్రగామిగా అభివృద్ధి చెందింది. నైట్ షిఫ్టుతో సహా అన్ని తయారీ షిఫ్టులలో మహిళా సాంకేతిక నిపుణులను కలిగి ఉన్న మొదటి కంపెనీలలో P&G ఇండియా ఒకటి. ప్రభుత్వంతో కలసి పని చేయడం ద్వారా మహిళా టెక్నీషియన్ సిబ్బందికి అవసరమైన అనుమతులు సాధించింది. వారి వృద్ధికి అవకాశాలను తెరిచింది.    ప్రతి ఒక్కరూ విలువైన మానవవనరుగా పరిగణించబడే కార్యాలయంలో విశ్వసనీయ, చేకూర్పు సంస్కృతిని సంస్థ కొనసాగించింది.   అభివృద్ధి చెందడానికి సమానమైన అవకాశాలను అందించడాన్ని ప్లాంట్ కొనసాగించింది. పి అండ్ జి ఇండియా తన ప్రధాన కార్పొరెట్ సామాజిక బాధ్యత కార్యక్రమం అయిన ‘పి అండ్ జి శిక్షా’ ద్వారా  కూడా తాను సేవలందిస్తున్న కమ్యూనిటీలను అర్ధవంతంగా ప్రభావితం చేయడం కొనసాగించింది. హైదరాబాదులో సంవత్సరాలుగా, పి అండ్ జి శిక్షా ద్వారా, కంపెనీ విద్యాపరమైన మౌలిక సదుపాయాల పెంపుదల, పిల్లలలో అభ్యాస ఫలితాలను మెరుగుపరచడానికి మరియు అట్టడుగు వర్గాలకు సాధికారత కల్పించడానికి గాను వారి చదులుకు సహాయం చేసింది. ఈ సంవత్సరం, పి అండ్ జి శిక్షా తన డిజిటల్ రెమెడియల్ లెర్నింగ్ ప్రోగ్రాం - మైండ్‌పార్క్‌ ని తెలంగాణలోని గిరిజన సంఘాలకు చెందిన వేలాది మంది పిల్లలపై కూడా ప్రభావం చూపేలా విస్తరించింది. ఇది తెలంగాణ, మహారాష్ట్రలో రాష్ట్ర గిరిజన శాఖల భాగస్వామ్యంతో ప్రత్యేకంగా నిర్వహించబడిన కార్యక్రమం. ఇంకా, పి అండ్ జి ఇండియా ‘పి అండ్ జి శిక్షాబేటియన్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్’ ద్వారా రాష్ట్రంలోని కళాశాలల్లో స్టెమ్  విద్యను అభ్యసిస్తున్న బాలికలకు ఆర్థిక సహాయం, మార్గదర్శకత్వం కూడా అందిస్తుంది. సమానత్వం, చేరికను ముందుకు తీసుకెళ్లేందుకు కంపెనీ చేస్తున్న నిరంతర ప్రయత్నాల పైన ఈ కార్యక్రమాలు రూపొందించబడ్డాయి. ఏరియల్ #ShareTheLoad వంటి ఉద్యమాల ద్వారా అవగాహన పెంచడం మరియు మూస పద్ధతులను సవాలు చేయడం కావచ్చు, అలాగే టెక్ మరియు ఐటీలో అపోహలను బద్దలు కొట్టడం మరియు లింగ సమానత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంపై సంభాషణలను నడిపించే వార్షిక ‘ఉమెన్ ఇన్ టెక్’ సమ్మిట్ వంటి సమగ్ర చర్యల ద్వారా కావచ్చు. కంపెనీ తన శ్రామిక శక్తి కోసం విభిన్న సమ్మిళిత విధానాలను కూడా అందిస్తుంది మరియు తన ఎల్జీబీటీక్యూ ప్లస్ తదితర ఉద్యోగుల భాగస్వాములకు అన్ని ప్రయోజనాలను అందిస్తుంది. ఉదాహరణకు, ‘షేర్ ది కేర్’ అనేది  సొంత తల్లిదండ్రులు, డొమెస్టిక్ పార్ట్ నర్స్, పెంపుడు తల్లిదండ్రులు, స్వలింగ జంటలలోని తల్లిదండ్రులతో సహా కొత్త తల్లిదండ్రులందరికీ 8 వారాల పూర్తి చెల్లింపు పేరెంటల్ లీవ్‌ను అందించే పేరెంటల్ లీవ్ పాలసీ  

వైఎస్సార్  సిపికి షాక్ ... ఒంగోలు ఎంపీ మాగుంట పార్టీకి  రాజీనామా 

వైఎస్సార్‌సీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇవాళ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.. భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో చర్చించి త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తాను అంటున్నారు. ఇటీవల పరిణామాలు తనను ఎంతగానో బాధించాయని.. అనివార్య పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీని వీడాల్సి వస్తోందన్నారు. తన కుమారుడు రాఘవరెడ్డిని ఎన్నికల్లో పోటీలో ఉంచాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఎంతో బాధతో పార్టీకి రాజీనామా చేస్తున్నానని.. అన్ని విషయాలను త్వరలోనే వెల్లడిస్తానన్నారు.33 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని.. 11 సార్లు చట్టసభలకు పోటీ చేశానన్నారు. ప్రకాశం జిల్లాలో మాగుంట అంటే.. ఒక బ్రాండ్‌ ఉందన్నారు. తమ కుటుంబానికి అహం లేదని.. ఉన్నది ఆత్మాభిమానం మాత్రమే అన్నారు. జగన్‌ను తమ కుటుంబసభ్యుడిగా భావించాంమని.. ఐదేళ్లు సహాయ సహకారాలు అందించిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఎన్నికల బరిలో ఉండే మాగుంట కుటుంబాన్ని ప్రకాశం జిల్లా ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని కోరారు.

దోపిడీ సొమ్ము నుంచి చిల్లర పంచితే ఓట్లు రాల్తాయా?

జగన్ హయాంలో ఏపీలో పాలన అంటే అధికార పార్టీ దోపిడీగా మారిపోయింది. అధికారంలో ఉన్నంత కాలం వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా  దోచుకున్నారు. జగన్ ప్రభుత్వ తీరుపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత, ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. అసలు జగన్ పాలనను అంతం చేయడానికి ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని జనం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.  ప్రజాగ్రహం వైసీపీ నేతలు గ్రహించినా, ఎన్నికల ముందు తాము దోచుకున్న సోమ్ముల నుంచి కొంత చిల్లర పారేస్తే ఓట్లు అవే రాలుతాయన్న అహంభావాన్ని ప్రదర్శిస్తున్నారు. మరో పది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే అప్పుడే నియోజకవర్గాలలో సొమ్ముల పంపిణీని వైసీపీ నేతలు ప్రారంభించేశారు. అధికార పార్టీలో ఇంకా అభ్యర్థుల ఎంపిక పూర్తి కాలేదు. ఎన్నికల షెడ్యూలే ఇంకా విడుదల కాలేదు. అప్పుడే సొమ్ముల పంపిణీ మొదలు పెట్టేశారు. ఓట్ల కొనుగోలు కోసం దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీ నేతలు బహిరంగంగా బరి తెగించి మరీ సోమ్ములు, మద్యం పంపిణీ చేస్తున్నారు.  టిక్కెట్లపై క్లారిటీ లేని చోట కూడా ఈ పంపిణీ కార్యక్రమం యథేచ్ఛగా సాగుతోందంటే వైసీపీ నేతలు ఈ ఐదేళ్ల కాలంలో ఎంతగా దోచుకున్నారో అవగతమౌతోంది.  కాగా ఇప్పటికే అభ్యర్థిత్వాలు ఖరారైన నియోజకవర్గాలలో అయితే  పోటీలో నిలబడే  అభ్యర్థులే స్వయంగా రంగంలోకి.. ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసుకుని మరీ కానుకల పందేరాన్ని ప్రారంభించేశారు.  చీరలు, వాచీలు, ప్యాంట్ షర్టులు, కుక్కర్లు బరితెగించేసి మరీ ఇంటింటికీ కానుకలు పంపిణీ చేస్తున్నారు.  వాలంటీర్లకు..సచివాలయ సిబ్బందికి పెద్ద ఎత్తున కానుకలు ఇవ్వగా, ఇప్పుడు ఓటర్ల పంచుతున్నారు. ఇందు కోసం ఒక్కో నియోజకవర్గంలో రూ. కోట్లు పంచుతున్నారు. ఈ పంపిణీ ఏమీ రహస్యంగా జరగడం లేదు. బహిరంగంగా బాహాటంగా ఓటర్లను కొనేస్తున్నాం అని చాటుకునే విధంగా వైసీపీ నేతల ప్రలోభాల పర్వం కొనసాగుతోంది.   అయితే ఈ ఐదేళ్ల కాలంలో వారు దోచుకున్న దానితో పోలిస్తే.. ఇప్పుడు పంపిణీ చేస్తున్నది చిల్లర కాసులతో సమానమని పరిశీలకులు అంటున్నారు.  ఇష్టారీతిన దోచుకుని ఇప్పుడు.. మళ్లీ అధికారం కోసం సొమ్ముల పందేరానికి తెగబడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ కేంద్ర కార్యాలయం కనుసన్నలలోనే ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతోందని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. ఎప్పటికప్పుడు ఏ నియోజకవర్గంలో ఎంత మందికి  కానుకలు పంపిణీ చేశారన్న వివరాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి అందే విధంగా పకడ్బందీ ఏర్పాటు చేశారని అంటున్నారు.   పార్వతీపురంలో అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే జోగారావు అయితే రెండు చేతులా ఈ పంపిణీని బాహాటంగా నిస్సిగ్గుగా బరి తెగించి మరీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారాయి. ఓ చేత్తో జేబులో నుంచి నోటు, మరో చేత్తో చీరా పంచేస్తున్నారు.   ఏకంగా షామియానా వేసి మరీ ఈ పంపిణీ సాగిస్తున్నారు. ఈ ఐదేళ్లలో పంచభూతాలను కూడా వదిలిపెట్టకుండా ఇష్టారాజ్యంగా దోచుకున్న వైసీపీ.. కనీసం రోడ్లపై తట్టెడు మట్టి కూడా వేయలేదు. కానీ ఎన్నికల సమయం వచ్చే సరికి జనాలకు తాయిలాల్లా, పప్పుబెల్లాళ్లీ చిల్లర పంచేస్తే ఓట్లు అవేపడిపోతాయన్న అహంభావంతో వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఈ నేతల అహంకారంపై ఓటుతో చావుదెబ్బ కొట్టాల్సిన బాధ్యత ప్రజలదే. 

తెలుగు వన్ కు ప్రతిష్టత్మక డైమండ్ క్రియేటర్ అవార్డు

దక్షిణ భారతదేశంలో అతిపెద్ద సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ గా  అగ్రస్థానంలో నిలిచిన తెలువన్ ఇప్పుడు మరో ఘనత సాధించింది. కోటి మంది సబ్ స్క్రైబర్లు ఉన్న యూట్యూబ్ చానెల్ గా న్యూయార్క్ సొసైటీ ద్వారా డైమండ్ క్రియేటర్ అవార్డును దక్కించుకుంది. కోటి మంది సబ్ స్క్రైబర్లు ఉన్న యూట్యూబ్ చానళ్లకు న్యూయార్క్ కోటి మంది సబ్‌స్క్రైబర్‌లను చేరుకున్న యూట్యూబ్ ఛానళ్ళకు  మాత్రమే ఈ అవార్డు ప్రదానం చేస్తారు.  ఈ అవార్డును 2012లో ప్రవేశ పెట్టారు. 2013లో సిల్వర్ క్రియేటర్, 2015లో డైమండ్ క్రియేటర్ అవార్డును ప్రవేశ పెట్టారు. . తెలుగువన్ చానల్ కు దక్కిన ఈ గౌరవం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ దక్కిన గౌరవంగా పలువురు అభివర్ణిస్తున్నారు. తెలుగువన్ చానల్ అధినేత, రాజధాని ఫైల్స్ నిర్మాత కంఠమనేని రవిశంకర్ కు ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు అభినందించారు.  

స్థంభించిన యూట్యూబ్ సేవలు 

జీమెయిల్.. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఉపయోగించే ఈమెయిల్ సర్వీస్. అనేక సంస్థలు, కోట్లాది మంది యూజర్లు జీమెయిల్​ను, గూగుల్​ వర్క్​స్పేస్​ను రోజువారీ కార్యకలాపాల కోసం వినియోగిస్తుంటారు. యూట్యూబ్​ కూడా కోట్లాది మంది యూజర్లను కలిగి ఉంది. ఈ రెండింటి సేవల్లో అంతరాయం ఏర్పడడం వల్ల వారంతా ఇబ్బంది పడ్డారు. జీమెయిల్, యూట్యూబ్​.. రెండూ గూగుల్​లో భాగమే. సమస్యకు కారణం ఏంటనే విషయంపై గూగుల్ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.  ప్రముఖ వీడియో  ఫ్లాట్ ఫామ్ యూట్యూబ్  స్తంభించిపోయింది. మంగళవారం నాడు మధ్యాహ్న 3 గంటల సమయంలో 20 నిమిషాల పాటు పనిచేయలేదు. ఈ విషయాన్ని యూజర్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు. యూట్యూబ్ పనిచేయలేదని వంద మంది కామెంట్ రాశారు. యూట్యూబ్  పనిచేయలేదని ఇంటర్నెట్ సమస్యలకు సంబంధించి పరిష్కారం కనుగొనే డౌన్ డిటెక్టర్ నిర్ధారించింది. యూట్యూబ్‌లో  80 శాతం మంది వీడియోలు చూడటంలో ఇబ్బంది పడ్డారు. మరికొందరు వీడియోలు అప్ లోడ్ చేయడంలో సమస్యలను ఎదుర్కొన్నారు. యూట్యూబ్‌లో  అంతరాయం భారతదేశంలో ఏర్పడిందా..? మిగతా దేశాల్లో వచ్చిందానే అంశానికి సంబంధించి మాత్రం స్పష్టత లేదు అని’ డౌన్ డిటెక్టర్ పేర్కొంది. యూట్యూబ్‌లో వీడియోలు అప్ లోడ్ చేయడంలో సమస్య ఏర్పడిందని కొందరు యూజర్లు, కంటెంట్ క్రియేటర్లు సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. యూట్యూబ్  సర్వర్ డౌన్ అయ్యిందా.? ఇతర సమస్యలు ఉన్నాయా..? స్పష్టత ఇవ్వండి. తాను లైవ్, షార్ట్స్ అప్ లోడ్ చేయాల్సి ఉంది. తన వైటీ స్టూడియోలో ఏమీ కనిపించడం లేదు. యూట్యూబ్ డౌన్ అనే హ్యాష్ ట్యాగ్‌తో పోస్ట్ చేశారు. యూట్యూబ్‌ డౌన్‌కు సంబంధించి ఇప్పటివరకు యాజమాన్యం మాత్రం ప్రకటన చేయలేదు. జీమెయిల్, యూట్యూబ్​ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా అనేక దేశాల్లోని నెటిజన్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గూగుల్​ వర్క్​స్పేస్​లోకి లాగిన్​ కాలేకపోతున్నామని వేర్వేరు సోషల్ మీడియా ప్లాట్​ఫామ్స్​లో ఫిర్యాదులు చేశారు. యూట్యూబ్​లోనూ వీడియోలు చూడడంలో ఇబ్బందులు ఎదురైనట్లు వాపోయారు. యూట్యూబ్ సహా జీమెయిల్ పని చేయట్లేదని యూజర్లు స్క్రీన్​ షాట్లు పెట్టారు. అలాగే ట్విట్టర్​లో తమ జీమెయిల్​ను సైన్ ఇన్ చేయగా ఓపెన్ కావట్లేదని ట్వీట్లు చేశారు. అంతకుముందు 2022 అక్టోబరు 25న ప్రముఖ మెసేజింగ్​ యాప్​ వాట్సాప్​ సేవలకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు గంటలపాటు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా రంగంలోకి దిగిన వాట్సాప్ మాతృ సంస్థ 'మెటా' సర్వీసులను పునరుద్ధరించింది. మధ్యాహ్నం 12.30 నుంచి వాట్సాప్​ ద్వారా మెసేజ్​లు పంపడం, అందుకోవడంలో ఇబ్బందులు ఎదురైనట్లు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాట్సాప్‌ వెబ్‌కు కనెక్ట్‌ చేస్తున్నప్పుడు 'కనెక్టింగ్‌' అని వచ్చిందని, ఆ తర్వాత ఎలాంటి పురోగతి లేదని యూజర్లు వాపోయారు. ట్విట్టర్​లో 'వాట్సాప్​ డౌన్'​ హ్యాష్​ట్యాగ్​ సైతం ట్రెండ్ అయ్యింది. దీనిపై సోషల్​ మీడియాలో ఫన్నీ మీమ్స్ హల్​చల్​ చేశాయి.అప్పట్లో వాట్సాప్ సేవలకు అంతరాయం కలగడంపై వాట్సాప్​ మాతృసంస్థ 'మెటా' అధికార ప్రతినిధి స్పందించారు. 'వాట్సాప్ సేవలు ఆగాయని మా దృష్టికి వచ్చింది. వీలైనంత త్వరగా సేవలకు పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నాం' అని తెలిపారు. కాసేపటికే సేవలు పునరుద్ధరించినట్లు ప్రకటించారు. వాట్సాప్, ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​ సేవలు 2021 అక్టోబరు 5న 6 గంటలపాటు నిలిచిపోయాయి. ఫలితంగా మెటా సంస్థ షేర్ల విలువ భారీగా పతనమైంది. ఈ క్రమంలో ఫేస్​బుక్, వాట్సాప్, ఇన్​స్టాగ్రామ్ సేవలకు అంతరాయం కలగడంపై మార్క్ జుకర్​బర్గ్ క్షమాపణ చెప్పారు. ప్రస్తుతం సేవలు పునరుద్ధరణ అయినట్లు తెలిపారు. ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్, వాట్సాప్, మెసెంజర్ ఆన్​లైన్​లోకి వచ్చినట్లు ఫేస్​బుక్ పోస్ట్​లో వెల్లడించారు. అలాగే వాట్సాప్ సైతం తన వినియోగదారులకు క్షమాపణ చెప్పింది. ప్రస్తుతం యాప్ సాధారణంగా పనిచేస్తోందని వెల్లడించింది. అంతర్జాల సమస్యలపై దృష్టి సారించే డౌన్​డిటెక్టర్.. ఫేస్​బుక్ అంతరాయంపై కీలక ప్రకటన చేసింది. ఫేస్​బుక్ సమస్యపై ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా కోటికి పైగా ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. అమెరికా, జర్మనీ, నెదర్లాండ్ దేశాల్లో ఎక్కువ ప్రభావం కనిపించిందని చెప్పింది. ఫేస్​బుక్​ సేవల్లో ఏర్పడిన సుదీర్ఘ అంతరాయం ఇదేనని వెల్లడించింది.

వివేకా హత్య కేసు.. ఇక విచారణ వాయిదాలకే పరిమితమా?

ఏపీ సీఎం జగన్ రెడ్డి సొంత చిన్నాన్న వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మంగళవారం (ఫిబ్రవరి 27)న సీబీఐ కోర్టులో హాజరయ్యారు. కోర్టు కేసు విచారణను మార్చి 12కు వాయిదా వేసింది. పెద్దగా ప్రాముఖ్యత లేని వ్యవహారంలా వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు విచారణ మారిపోయిందనడానికి ఈ కేసు విచారణ జరుగుతున్న తీరే నిదర్శనం. కానీ గత ఏడాది ఫిబ్రవరి నుంచి మే నేలాఖరు వరకూ  మాత్రం ఇహనో ఇప్పుడు అవినాష్ రెడ్డి అరెస్టు అన్న వాతావరణమే ఉండింది. అప్పట్లో రాజకీయ వర్గాలు కూడా అవినాష్ అరెస్టు కాకుండా అడ్డుకోవడం ఇక ఎవరి తరం కాదన్నట్లుగానే భావించాయి.  గత ఏడాది ఫిబ్రవరి 24న  వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హైదరాబాద్‌లో సీబీఐ విచారణకు హాజరయ్యారు. అప్పట్లోనే కోర్టు హాలు నుంచి బయటకు రాగానే అవినాష్ ను అరెస్టు చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.   వివేకా హత్య జరిగిన సమయంలో చోటు చేసుకున్న వరుస ఘటనలను నిరూపించేందుకు   సాక్ష్యాలున్నాయంటూ ఓ వైపు  ఫోన్ కాల్స్ ఆధారంగా తీగ లాగడంతో.. ఈ హత్య కేసులో డొంకంతా కదిలి..సూత్రదారులు ఎవరో తెలిపోయిందని, అలాగే మరోవైపు తెలంగాణ హైకోర్టుకు సీబీఐ తేల్చి చెప్పిడం చూస్తుంటే.. ఇక ఈ  హత్య కేసులో వరుస బెట్టి ఆరెస్ట్‌లే తరువాయి అన్న ప్రచారం కూడా అప్పట్లో జోరుగా సాగింది. వాస్తవానికి వివేకా హత్య కేసులో అవినాష్ ను 2023 జనవరిలోనే అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేసింది.  అయితే ఆయన కాల్ డేటాను పరిశీలించి.. వాటి వివరాల ఆధారంగా కాల్స్ వెళ్లిన వారిని ఓ సారి విచారిస్తే.. ఆ తర్వాత తమ పని మరింత సులువు అవుతుందన్న ఓ ఆలోచనతో అప్పటికి వెనక్కు తగ్గిన సీబీఐ  ఆయన ఫోన్ నుంచి వెళ్లిన కాల్స్ ఆధారంగా.. నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, జగన్ సతీమణీ వైయస్ భారతి పీఏ నవీన్‌లకు నోటీసులు జారీ చేసి.. వారిని విచారించింది. వారిని విచారించిన అనంతరం అవినాష్ రెడ్డిని విచారణకు రావాల్సిందిగా సీబీఐ  నోటీసులు పంపింది.  దీంతో ఇక అవినాష్ అరెస్టే అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.  అప్పట్లో సీఎం జగన్ సైతం తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమయ్యారు. అవినాష్ అరెస్టు తరువాత సీబీఐ తట్టేది తాడేపల్లి ప్యాలెస్ తలుపులేనన్న చర్చ కూడా అప్పట్లో జోరుగా సాగింది.  జగన్ హస్తిన పర్యటనతో పరిస్థితి సద్దుమణిగిందన్న వార్తలు కూడా అప్పట్లో హల్ చల్ చేశాయి.  ఆ తరువాత మళ్లీ గత ఏడాది మేలో కూడా అవినాష్ రెడ్డి అరెస్టునకు సీబీఐ విశ్వ ప్రయత్నం చేసింది. తల్లికి గుండెపోటు కారణంగా సీబీఐ విచారణకు రాలేను అంటూ అవినాష్ విజ్ణప్తిని సీబీఐ తోసిపుచ్చింది. దీంతో హైదరాబాద్ లోని తన నివాసం నుంచి సీబీఐ కార్యాలయానికి బయలు దేరిన అవినాష్ రెడ్డి అంతలోనే మనసు మార్చుకుని కడపకు పయనమయ్యారు. దీంతో సీబీఐ ఆయనను సినీ ఫక్కీలో ఛేజ్ చేసింది. మార్గ మధ్యంలో ఆయన రూటు మార్చి తన తల్లిని కర్నూలులోని ఓ అసుపత్రిలో చేర్చారంటూ అక్కడకు వెళ్లారు. ఆ తరువాత గంటల తరబడి డ్రామా కొనసాగింది. అవినాష్ రెడ్డి ఆసుపత్రి లోపల, సీబీఐ అధికారులు ఆసుపత్రి బయట మధ్యలో వందల సంఖ్యలో అవినాష్ అనుచరులు. అప్పట్లో అక్కడ యుద్ధ వాతావరణమే నెలకొంది. అవినాష్ అరెస్టు కు సీబీఐ స్థానిక పోలీసుల సహాయం కోరితే.. వారు శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమౌతుందంటూ చేతులెత్తేశారు. దీంతో చేసేదేమీ లేక సీబీఐ వెనుదిరిగింది. ఆ తరువాత కోర్టు ఆదేశాల మేరకు ఆయనను అరెస్టు చూపి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.  అంతే ఆ తరువాత నుంచీ వివేకా హత్య కేసులో పురోగతి ఏమిటి అన్న విషయంపై ఇసుమంతైనా సమాచారం లేదు.  అవినాష్ ను అరెస్టు చేయడానికి నానా హడావుడీ చేసి చివరకు చేతులెత్తేసిన సీబీఐ కేంద్ర దర్యాప్తు సంస్థ.   కానీ రాష్ట్ర దర్యాప్తు సంస్థ అయిన ఏపీ సీఐడీ మాత్రం జగన్ రాజకీయ ప్రత్యర్థులను అరెస్టు చేసే విషయంలో నిబంధనలను తుంగలోకి తొక్కేసింది. అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టుకు వెళ్లి మరీ అరెస్టులు చేసింది. గోడలు దూకి వెళ్లి మరీ అరెస్టులు చేసింది. ఇలా ఏపీ సీఐడీ అరెస్టు చేసిన వారిలో తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెంనాయుడు, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు, మాజీ మంత్రి నారాయణ, తెలుగుదేశం సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడు చివరాఖరికి మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా ఉన్నారు. వీళ్లెవరూ టెర్రరిస్టులు కారు.   రాత్రికి రాత్రి  పరారైపోతారన్న అనుమానాలూ లేవు. అయినా కూడా ఏపీ సీఐడి, పోలీసులు యుద్ధ వాతావరణాన్ని సృష్టించి మరీ అరెస్టులు చేశారు. వందల మైళ్లు కార్లలో తిప్పారు.  వైసీపీ రెబల్ ఎంపీపై అయితే ధర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారు.    అయితే కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ మాత్రం వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని అరెస్టు చేయలేక చోద్యం చూసిన తీరు ఆ సంస్థ ఇంటిగ్రిటీపైనే అనుమానాలు కలిగేలా చేసింది.  

చంద్రబాబుతో నారాయణ భేటీ 

టీడీపీ అధినేత చంద్రబాబుతో మాజీ మంత్రి నారాయణ భేటీ అయ్యారు. వచ్చే నెల 2వ తేదీన చంద్రబాబు నెల్లూరు పర్యటనపై వీరు చర్చించారు. భేటీ అనంతరం మీడియాతో నారాయణ మాట్లాడుతూ... నెల్లూరు జిల్లాలో పోటీ చేయడానికి వైసీపీకి అభ్యర్థులే లేరని చెప్పారు. టీడీపీ క్లీన్ స్వీప్ చేయబోతోందని అన్నారు. 2వ తేదీన చంద్రబాబు సమక్షంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరుతారని తెలిపారు. నెల్లూరు జిల్లాలో జనసేనకు ఏ సీటు కేటాయిస్తారో తనకు తెలియదని... సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. బీజేపీతో కూడా చర్చలు జరుగుతున్నాయని... దీనిపై చంద్రబాబు క్లారిటీ ఇస్తారని అన్నారు. సీట్ల విషయంలో చంద్రబాబు ఇచ్చే ఆదేశాలను అందరం పాటిస్తామని చెప్పారు.