గంటా, బొత్స టామ్ అండ్ జెర్రీ
posted on Mar 1, 2024 @ 12:51PM
రోగి, వైద్యుడూ ఒకటే కోరారన్నట్లుగా తయారైంది గంటా శ్రీనివాసరావు పరిస్థితి. ఆయన ఈ సారి ఎన్నికలలో భీమిలీ నుంచే పోటీలోకి దిగాలని భావిస్తుంటే పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం ఆయనను చీపురుపల్లి నుంచి పోటీలోకి దిగమంటున్నారు. అధినేత నిర్ణయం శిరసావహిస్తానని గంటా సమాధానపడ్డారు. అయితే అసలు గంటాను భీమిలీ నుంచి చీపురుపల్లికి మార్చాలని చంద్రబాబు భావించడం వెనుక అసలు కారణం, అక్కడ వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగుతారనీ, ఆయనకు దీటైన అభ్యర్థి గంటా అవుతారన్న ఉద్దేశింతోనే.
అయితే ఇప్పుడు స్వయంగా గంటా బొత్స సత్యనారాయణే వైసీపీ అధినేతను తనను భీమిలికి మార్చమని కోరుతున్నారు. సొంత నియోజకవర్గం వదిలి పారిపోవాలని బొత్స కోరుకోవడానికి కారణం ఆయన సతీమణి బొత్స ఝాన్సీ. ఆమె ఎలా కారణమయ్యారంటే.. జగన్ ఈసారి విశాఖ పార్లమెంటు స్థానం నుంచి ఆమెను బరిలోకి దింపాలని నిర్ణయించారు. దీంతో గంటా బొత్స ఝాన్సీ విశాఖ పార్లమెంటు స్థానం నుంచి వైపీసీ అభ్యర్థిగా పోటీ చేయాలంటే ఆ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లన్నిటిలోనూ తాను చెప్పిన అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలన్న షరతు విధించారు. అందులో భాగంగానే తాను కూడా ఆ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని భీమిలీ నుంచి పోటీ చేస్తానని కోరారనీ, అందుకు జగన్ ఓకే అన్నారనీ వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
దీంతో గంటా ఇప్పుడు ఎక్కడ నుంచి బరిలోకి దిగుతారన్నది ఆసక్తికరంగా మారింది. బొత్సకు ప్రత్యర్థిగా గంటాను భీమిలి నుంచి చీపురుపల్లికి మార్చాలని చంద్రబాబు భావించారు. అయితే ఇప్పుడు గంటాయే చీపురుపల్లి వదిలి భీమిలీకి మారుతుంటే.. ఇక గంటాను చీపురుపల్లికి మార్చడం ఎందుకు అని చంద్రబాబు భావించి గంటా కోరిన విధంగా భీమిలి టికెట్ ఇస్తారా అన్న చర్చ అయితే తెలుగుదేశంలో జరుగుతోంది. అదే జరిగితే.. చీపురుపల్లిలో తెలుగుదేశం ఆశావహుడు కిమిడీ నాగార్జున అక్కడ నుంచి పోటీకి ఎటూ రెడీగా ఉన్నారు. అయితే గంటా భీమిలి నుంచి రంగంలోకి దిగుతున్నారని తెలిస్తే అక్కడ నుంచి పోటీకి బొత్స ఒకటికి రెండు సార్లు ఆలోచించే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉంచితే ఇప్పటి వరకూ గంటా శ్రీనివాసరావు ఒకసారి పోటీ చేసి గెలిచిన స్థానం నుంచి రెండో సారి పోటీ చేసిన చరిత్ర లేదు. ఈ సారి ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా, లేక బోత్సకు చెక్ పెట్టేందుకు బొత్స ఒక వేళ భీమిలి నుంచి రంగంలోకి దిగితే.. గంటా కూడా అక్కడ నుంచే పోటీ చేస్తారా చూడాల్సి ఉంది.