Congress MLC list

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధుల లిస్ట్ రెడీ

        కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపిక ఎట్టకేలకు రెడీ అయింది. ఈ రోజు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, సోనియా గాంధీ తో సమావేశమై అభ్యర్ధులను ఖరారు చేశారు. అభ్యర్థుల పేర్లను ఇంకా బయటపెట్టలేదు.శనివారం రాత్రి లేదా ఆదివారం ఉదయం ప్రకటించే అవకాశాలున్నాయి.   ఎమ్మెల్సీ అభ్యర్థులకు రేపు బీఫామ్స్ ఇవ్వనున్నట్లు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. నామినేషన్ల దాఖలుకు అమావాస్య అడ్డంకి కాదని ఆయన అన్నారు. పొంగులేటి సుధాకర్ రెడ్డి, ధీరావత్ భారతి, వాణి, రఘురామిరెడ్డి, కంతేటి సత్యనారాయణ రాజు, దయాసాగర్, షబ్బీర్ అలీ పేర్లు వినిపిస్తున్నాయి. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే షబ్బీర్ ఆలీకు టిక్కెట్‌కోసం అజాద్ గట్టిగా పట్టుపట్టినట్లు తెలియవచ్చింది.   ఎమ్మెల్సీ జాబితాను ఖరారు చేయించుకోవడానికి ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి శనివారం సాయంత్రం హైదరాబాదు తిరిగి వస్తున్నారు. బొత్స సత్యనారాయణ మాత్రం ఈ రాత్రి అక్కడే మకాం వేస్తున్నారు. కాంగ్రెసు ఐదుగురు అభ్యర్ధులను మాత్రమే పోటీకి దింపుతున్నట్లు తెలుస్తోంది.  

 cm chandrababu

చంద్రబాబును సీఎం చేసిన అభిమానులు

        గుడివాడలో టిడిపి అభిమానులు చంద్రబాబు నాయుడు ను ముఖ్యమంత్రి చేశారు. అదేంటి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఏంటి అనుకుంటున్నారా? ప్రస్తుతం చంద్రబాబు "వస్తున్నా...మీ కోసం" పాదయాత్ర గుడివాడలో జరుగుతున్న నేపథ్యంలో ఆయన అభిమానులు ఆయన ముఖ్యమంత్రి అయినట్లు, కుర్చీ మీద కూర్చున్నట్లు …రుణ మాఫీ ప్రకటించినట్లు..తొలిసంతకం ఆ ఫైలు మీద పెట్టినట్లు ఫ్లెక్సీలు తయారు చేసి కట్టేశారు. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబేనని అభిమానులు చెబుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఇవన్నీ ఖాయం అని అంటున్నారు. ఇది సహజంగానే టిడిపి అభిమానులకు సంతోషం కలిగించే వార్తే.

venkaiah naidu bjp

వెంకయ్య బిజెపిని బలోపేతం చేస్తారా?

        పార్లమెంటు సమావేశాల తరువాత తాను ఆంధ్రప్రదేశ్ అంతా పర్యటించి పార్టీని బలోపేతం చేస్తానని వెంకయ్య నాయుడు చెబుతున్నారు. ఎన్నికలు ఎప్పుడైన వచ్చే అవకాశం ఉందని, ఎన్నికల్లో ఎన్డీఎ అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని అన్నారు. ఆయన సొంత ఊరులో పార్టీని బలోపేతం చేయడం మానేసి, రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేస్తాననడం కార్యకర్తలకు నవ్వు తెప్పిస్తోంది. ఇక ఆయన కేంద్రంలో చక్రం తిప్పినా ఆయన ఊరులో బిజెపి తరపున వార్డు మెంబరు కూడా గెలిచే పరిస్థితి లేదని అంటున్నారు. మరీ పార్లమెంటు సమావేశాల తరువాత పార్టీని ఎలా బలోపేతం చేస్తారో?

 chandrababu padayatra

రాజకీయ అవినీతిని వివరించేందుకు వచ్చా: బాబు

        తాను అధికారంలోకి వస్తే మీ బాధలు తీరుస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు కొల్లేటి ప్రజలకు భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ చేస్తున్న దారుణాలను చూడలేక, అవినీతి రాజకీయాలను ప్రజలకు వివరించేందుకు మీముందుకు వచ్చానన్నారు. సేవదృక్పదమైన ప్రభుత్వాన్ని ఎంపికచేసుకోవాలని,అవినీతి పరులను తమిరికొట్టలని చంద్రబాబు కోరారు. మీ పిల్లలు చక్కటి చదువులు సాగాలన్న, ఉద్యోగాలు రావాలన్న టీడీపీ వల్లే సాధ్యమని స్పష్టం చేశారు. వృద్దులను, వికలాంగులను, చిరువ్యాపారులను, వ్యవసాయ కూలీలను, చేతివృత్తివారిని చంద్రబాబు పలకరిస్తూ ముందుకుసాగారు. మిమ్మల్ని ముఖ్యమంత్రిగా మళ్ళీ చేస్తాం. మా కష్టాలు మీరే తీర్చాలి అంటూ పలువురు చంద్రబాబుతో అన్నారు.

hyderabad bomb blast

సైకిళ్లకు బాంబులు పెట్టిన వారిని గుర్తించాం: డీజీపీ

        దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంట పేలుళ్ల ఘటనలో కీలక ఆధారాలు లభ్యమయినట్లు రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డి తెలిపారు. ఈ జంట పేలుళ్లకు సంబంధించి పోలీసులు ముగ్గురు నిందితులను గుర్తించారన్నారు. సిసి కెమెరాలలో సైకిళ్లపైన బాంబులు తీసుకువెళుతున్న ముగ్గురు వ్యక్తులను గుర్తించారని, వారిలో ఒకరిని స్పష్టంగా గుర్తించామని, మరో ఇద్దరు అస్పష్టంగా కనిపిస్తున్నారని దినేష్‌రెడ్డి తెలిపారు. సైకిళ్లు అక్కడ పెట్టిన మూడు నిమిషాల్లోనే బాంబులు పేలినట్లు గుర్తించినట్లు డీజీపీ తెలిపారు. రద్దీ ప్రాంతాల్లో శివరాత్రి వరకు తనిఖీలు చేస్తామని చెప్పారు. ఎన్ఐఏ బృందంతోపాటు రాష్ట్ర పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారని దినేష్‌రెడ్డి పేర్కొన్నారు.

jayasudha karthika reddy

కాంగ్రెస్ పై జయసుధ రాజీనామాస్త్రం

        ఎమ్మెల్సీ ఎన్నికలు నగర కాంగ్రెస్ లో సెగలు రేపుతున్నాయి. నగర మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి ఎమ్మెల్సీ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుండగా, కార్తీక రెడ్డికి ఎంఎల్సీ పదవి ఇస్తే తాను రాజీనామా చేస్తానని జయసుధ హెచ్చరించినట్లు తెలుస్తోంది. గతంలో జయసుధ ఎంఎల్ఏగా ఉన్న సికింద్రాబాద్ పరిధిలో ఆమె అనుమతి లేకుండా కార్తీకరెడ్డి భర్త చంద్రారెడ్డి పలు కార్యక్రమాలు చేశారు. దీంతో అప్పటి నుండి జయసుధకు వారికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.   కార్తీకరెడ్డి కి ముఖ్యమంత్రి కిరణ్ కు ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో వారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడితో భేటీ అయిన జయసుధ తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు తెలుస్తోంది.

Manmohan Singh praising growth

ఆర్థికాభివృద్ధికి పూలబాట వేశా౦: ప్రధాని మన్మోహన్

        ఆర్థికాభివృద్ధికి పూలబాట వేశామని, దేశంలో అమలు చేస్తున్న ఆర్థిక సంస్కరణల అమలులో ఎలాంటి మార్పు లేదని ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. ఆర్థిక సంస్కరణలు అలాగే కొనసాగుతాయని ఆయన చెప్పారు. వచ్చే మూడేళ్ళలో 8 శాతం ఆర్థిక వృద్ధి సాధ్యమని ప్రధాని అన్నారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రసంగానికి రాజ్యసభలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలను ఆయన సమర్థిస్తూ ప్రసంగించారు. యూపీఏ ప్రభుత్వం సంక్షేమ రంగానికి పెద్దపీఠ వేసిందని ఆయన అన్నారు. యూపీఏ హయాంలో దేశం అభివృద్ధి బాట పట్టిందని తెలిపారు. దేశాభివృద్ధికి ప్రభుత్వం చేస్తోన్న సంస్కరణలకు ప్రతిపక్షాలు సహకరించాలని మన్మోహన్ సింగ్ కోరారు. దేశంలో పేదరికాన్ని నిర్మూలించడం, నిరుద్యోగం లేకుండా చేయడమే యూపీఏ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. మన దేశానికి 8 నుంచి 9 శాతం అభివృద్ధిరేటు అవసరమని, అది సాధించడమే యుపీఏ లక్ష్యమని ప్రధానమంత్రి తెలిపారు.

nara lokesh jagan

అవినీతికి ప్రతిరూపం జగన్ పార్టీ: లోకేష్

        టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు పల్లె పల్లెకు టిడిపి కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అవినీతికి ప్రతిరూపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ...అసమర్ధతకు నిదర్శనం కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, తిరిగి గాడిలో పడాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలు టిడిపిని అందలమెక్కిస్తే రాష్ట్రం తిరిగి అభివృద్ధిలో పుంజుకుంటుందన్నారు.రాజకీయాల్లో సామాజిక న్యాయం పాటించిన ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమే అన్నారు. పార్టీ కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో వందమంది బిసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని తెలిపారు.

political news

మళ్ళీ ఫిరాయింపుల సీజను మొదలయిందా?

  నదులన్నీ వెళ్లి సముద్రంలో కలిసినట్లు, గతంలో చిన్నాచితకా రాజకీయ పార్టీలన్నీ వెళ్లి కాంగ్రెస్ మహాసముద్రంలో కలిసేవి. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీల నేతలందరూ వెళ్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకలుస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుండి ఆ వలసలు ఎక్కువగా కనిపించాయి. గత కొద్ది రోజులుగా ఆ వలసల జోరు కొంత తగ్గింది. కానీ, మళ్ళీ నేడు ఆ పార్టీకి చెందిన పరకాల మాజీ శాసన సభ్యుడు బొజ్జపల్లి రాజయ్య పార్టీకి రాజీనామాచేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో జేరుతున్నట్లు ప్రకటించడంతో మళ్ళీ వలసల సీజను మొదలయినట్లుంది.   ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి పక్కలో బల్లెంలా ఉన్న మరో 9మంది జగన్ వర్గానికి చెందిన శాసన సభ్యులు కూడా, తమపై అనర్హతవేటు పడదని రూడీ అయితే, చంచల్ గూడా జైలు బాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే, చంచల్ గూడా జైలు తలుపులు మూసి ఉన్నపటికీ, పార్టీ తలుపులు బార్లా తెరిచి అందరికీ స్వాగతం పలుకుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు పార్టీలో చేర్చుకొంటున్న వారందరికీ రేపు ఎన్నికల సమయంలో పార్టీ టికెట్ కేటాయించడం సాధ్యమేనా? అప్పుడు పార్టీలో చెలరేగే అసమ్మతి గురించి ఏమయినా ఆలోచన చేస్తోందా?   ఇప్పుడు పార్టీలో చేరుతున్న వారు మళ్ళీ తిరుగు ప్రయాణమయితే, అప్పుడు పార్టీ పరిస్థితి ఏమిటి? ఒకనాడు ప్రజారాజ్యం పార్టీ కూడా ఇటువంటి పరిస్థితులవల్లనే కుప్పకూలిన సంగతి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి గుర్తులేదా?అనే సందేహాలున్నాయి.   ప్రస్తుతం పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి జైల్లో ఉన్నందున, పార్టీలోకి వస్తున్నరాజకీయనేతల ప్రవాహమే పార్టీకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ పార్టీకి శ్రీరామ రక్షగా ఉంటుందని బహుశః వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తునందునే అందరికీ ఆహ్వానం పలుకుతున్నట్లుంది. జగన్ మోహన్ రెడ్డి జైల్లోంచి బయటకి వస్తే పార్టీ వ్యవహారాలన్నీ ఆయనే ఎలాగు చక్కబెడతారు గనుక, ఇప్పుడు వచ్చే వారిని ఆపడం ఎందుకని అందరికీ ఆపార్టీ స్వాగతం పలుకుతునట్లు ఉంది.

sirish baradwaj

చిరంజీవి చిన్నల్లుడు శిరీష్ ప్రసంగం

  కేంద్రమంత్రి చిరంజీవి చిన్నల్లుడు శిరీష్ భరద్వాజ్ భార్య శ్రీజతో విడిపోయిన తరువాత, ఆమె ఆయనపై పోలీసు స్టేషన్లో వరకట్న వేధింపుల కేసు కూడా నమోదుచేసినట్లు ఆ మద్యన వార్తలు వచ్చాయి. అయితే, ఆ తరువాత ఆ కేసు కధ ఏమయిందో గానీ, శిరీష్ చాలారోజులుగా బయట ఎక్కడా కనబడలేదు. శిరీష్ కధ ఇక ముగిసిపోయినట్లేనని అందరూ భావిస్తున్న తరుణంలో అకస్మాత్తుగా ఆకాశం లోంచి ఊడిపడినట్లు వచ్చి కొద్ది రోజుల క్రితమే బీజేపీలోచేరిపోయారు.   మళ్ళీ మద్యలో కొంత విరామం తరువాత ఈ మద్యనే హైదరాబాదులో జరిగిన పార్టీ సమావేశంలో పాల్గొని, తొలి రాజకీయ ప్రసంగం కూడా చేసారు. ఆయన ప్రసంగం అనగానే చిరంజీవిని తిట్లు లంకించుకొంటారని, చిరంజీవిపై విసుర్లు ఉంటాయని అందరూ ఆశించడం సహజం. కానీ, ఆయన తన మొట్టమొదటి ప్రసంగాన్ని కేవలం బీజేపీ అధిష్టానాన్ని భజన చేయడానికే అంకితం చేసేయడంతో కార్యకర్తలు కొంచెం నిరాశకు గురయారని సమాచారం. తనవంటి యువతకు రాజకీయాలలో చేరెందుకు చక్కటి అవకాశం కల్పించిన బీజేపీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపి, నరేంద్ర మోడీ ఒక సమర్దుడయిన నాయకుడని పొగుడుతూ ఆకాశానికి ఎత్తేసారు. చప్పగా సాగిన ఈ చిరనజీవి చిన్నల్లుడి ప్రసంగం చూసిన కార్యకర్తలు, ‘ఈయన కూడా మామగారిలాగే ఆచితూచి మాట్లాడితే ఎవరు వింటారు’ అని గొణిగారుట.

Delhi gang rape nirbhaya

'నిర్భయ'కు స్త్రీ శక్తి పురస్కారం

        ఢిల్లీలో గ్యాంగ్ రేప్ కు గురై ప్రాణాలు కోల్పోయిన వైద్య విద్యార్ధిని 'నిర్భయ'ను స్త్రీ శక్తి పురస్కారంతో గౌరవించనున్నారు. విపత్కర పరిస్థితుల్లో ఆమె చూపిన తెగువ, ఆత్మస్థైర్యాన్ని కి నివాళిగా మరణాంతరం ఈ అవార్డ్ ను అందజేయనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ చేతులు మీదుగా 'నిర్భయ' ఫ్యామిలీ ఈ అవార్డు ను స్వికరించనున్నారు.   ప్రతి సంవత్సరం అసాధారణ మహిళలకు ఇచ్చే స్త్రీ శక్తి పురస్కారాన్ని 'నిర్భయ'కు ఇవ్వాలని మహిళ, శిశుసంక్షేమ మంత్రిత్వశాఖ బావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ''మానవ మృగాలతో పోరాటంలో 'నిర్భయ' అసాధారణ తెగువను ప్రదర్శించారు. ఆమె దేశంలో చైతన్య జ్వాలను రగిలించింది'' అని వివరించాయి. ప్రభుత్వం జాతీయ అవార్డులను స్త్రీ శక్తి పురస్కారాల కింద ప్రధానం చేస్తుంది. వీటిలో ఝాన్సీ లక్ష్మిభాయి అవార్డును నిర్భయ కు ప్రధానం చేస్తారు. 

brother anil kumar

బ్రదర్ అనిల్ కు క్లీన్ చిట్ ఇచ్చిన వెంకటరెడ్డి

  గత కొద్ది రోజులుగా బీజేపీ వైయస్సార్ కుటుంబం సభ్యులపై ముఖ్యంగా మతప్రచారకుడిగా పనిచేస్తున్న బ్రదర్ అనిల్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నసంగతి అందరికి తెలిసిందే. మళ్ళీ, ఇటీవల బ్రదర్ అనిల్ కుమార్ కు చెందిన మైనింగ్ కంపెనీకి బినామి యజమానిగా పేర్కొంటున్న తేళ్లూరి వీరభద్రారెడ్డి అనుమానాస్పద మరణానికి బ్రదర్ అనిలే కారకుడని ఆ పార్టీ ఆరోపించడంతో వైయస్సార్ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురయినట్లు కనిపిస్తోంది.   గత మూడు రోజులుగా పోలీసులు తమ దర్యాప్తులో భాగంగా మృతుడు వీరభద్రారెడ్డి స్వహస్తాలతో వివిధ సంస్థలకు వ్రాసిన ఉత్తరాలను, ఫైళ్ళను స్వాదీనం చేసుకొని తమ కార్యాలయానికి తరలించడంతో, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు బ్రదర్ అనిల్ కుమార్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై తమ దాడి మరింత తీవ్రతరం చేసాయి.   వారి దాడిని తిప్పికొట్టే ప్రయత్నంలో ఈ రోజు వైయస్సార్ కుటుంబ పత్రిక ‘సాక్షి’ లో మృతుడు వీరభద్రారెడ్డి తండ్రి వెంకటరెడ్డి మీడియాతో చెప్పిన విషయలంటూ ఒక కధనం ప్రచురించింది. ‘తన కుమారుడు వీరభద్రారెడి గతనెల 25వ తేదిన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండల పరిధిలోని పోచంపల్లి గ్రామశివార్లలో మృతి చెందాడని, తన కుమారుడి మరణానికి బ్రదర్ అనిల్‌కుమార్‌కు ఎటువంటి సంబంధం లేదని, కానీ కొందరు రాజకీయ నాయకులూ వారి పార్టీలు తన కొడుకు మరణాన్ని రాజకీయం చేస్తున్నట్లు తెలిసి చాల బాధపడుతున్నానని వెంకటరెడ్డి తెలిపారు. కుమారుడుని పోగొట్టుకొని దుఃఖంతో ఉన్న తమ కుటుంబం పట్ల, మీడియా కూడా నిర్దయగా వ్యవహరిస్తూ, తన కుమారుడికీ బ్రదర్ అనిల్ కుమార్ కి ఏమి సంబంధాలున్నాయని ఆరాలు తీయడం చాలా బాధ కలిగించిందని అన్నారు. తన కుమారుడు చనిపోయేవరకు కూడా బ్రదర్ అనిల్ ఎవరో తమకు తెలియదన్నారు. తానూ నిరక్షరాస్యుడినని, అందువల్ల కాగితాలు, డాక్యుమెంట్ల గురించి తనకు ఏమి తెలియదని, పోలీసులే విచారణ చేసి తన కొడుకు మృతికి కారకులను, కారణాలను కనిపెట్టాలని ఆయన అన్నారు.”   అయితే, ఇప్పుడు మృతుడు తండ్రి వెంకట రెడ్డి చెప్పిన విషయాన్నే పోలీసులు, కోర్టులు కూడా ద్రువీకరిస్తే దానికి విలువుంటుంది తప్ప ఈ విధంగా వైయస్సార్ కుటుంబానికే చెందిన సాక్షి పత్రిక ద్వారా తమ కుటుంబానికే చెందిన వ్యక్తి బ్రదర్ అనిల్ కుమార్ కి క్లీన్ సర్టిఫికేట్ జారి చేయడంవల్ల ఏ ప్రయోజనం ఉండదు.   వైయస్సార్ కుటుంబంపై బీజేపీ మరియు తెలుగుదేశం పార్టీలు చేస్తున్నఆరోపణలను ఈ విధంగా పత్రికల ద్వారా ఎదుర్కోవడం కంటే నేరుగా కోర్టులో వారిపై కేసులు వేసి వారు చేస్తున్న ఆరోపణలను నిరూపించమని సవాలు చేయడం ద్వారా వైయస్సార్ కుటుంబము తన నిజాయితీని రుజువు చేసుకోవడం మంచిది.

nara lokesh tdp

అవినీతి నాయకుడు లేక సమర్ధవంతమైన నేత

        టిడిపి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుమారుడు 'నారా లోకేష్' చిత్తూరు జిల్లాలోని కుప్పంలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగిన కార్యకర్తల సమావేశంలో లోకేష్ మాట్లాడారు. “ఒకరు అసమర్ధ నాయకుడు, మరొకరు అవినీతి నాయకుడు, వారిని ఎంపిక చేసుకుంటారా?లేక సమర్ధవంతమైన నేతను ఎన్నుకుంటారా అని ప్రశ్నించారు. చంద్రబాబు సుధీర్ఘ పాదయాత్ర చేస్తూ ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకుంటున్నారని, అధికారం కోల్పోయి పదేళ్లు అవుతున్నా తెలుగుదేశం పార్టీ అభివృద్దిని నినాదంగా చెబుతుందని అన్నారు. గత మూడేళ్లలో ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా కుప్పం నియోజకవర్గంలో అనేక అభివృద్ది పనులు కోట్లు వెచ్చించి చేపట్టామని అన్నారు. అప్పుడప్పుడు చిత్తూరు జిల్లాకు వచ్చి కార్యకర్తలతో భేటీ అవుతున్న నారా లోకేష్ పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది.

శ్రీలక్ష్మి విచారణ: కేంద్రం మరో అస్త్రం..?

  కేంద్రం ఈ రోజు ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి ప్రాసిక్యూషన్ కు అనుమతి మంజూరు చేయడంతో దివంగత ముఖ్యమంత్రి వైయస్. రాజశేఖర్ రెడ్డి హయంలో ఒక వెలుగు వెలిగి చక్రం తిప్పిన రాజకీయ నాయకులలో, ప్రభుత్వ అధికారులలో మళ్ళీ కలవరం మొదలయింది. గనుల శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన శ్రీలక్ష్మి ఓబులాపురం మైనింగ్ కంపెనీకి ఉదారంగా గనుల త్రవ్వకాలకి అనుమతులు మంజూరు చేసినందున ఆమె జైలు పాలయ్యారు.   ఆమె కొద్ది నెలల క్రితం బెయిలు కోసం దరఖాస్తు చేసుకొన్నపుడు, తానూ కేవలం ప్రభుత్వాదేశాలను తూచా తప్పకుండా అమలు జేసానే తప్ప, తనంతట తానుగా ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదని, గాలి జనార్ధన్ రెడ్డి సంస్థలకి గనుల త్రవ్వకాలకి అనుమతులు జారీ చేయాలని పైనుండి వచ్చిన ఆదేశాలను ప్రభుత్వాదికారిగా అమలుచేయడం వల్లనే నేడు తనకీ దుస్థితి కలిగిందని ఆమె కోర్టులో విలపించారు కూడా. అయితే, కోర్టులు వ్యక్తుల భావోద్వేగాలను కాక సాక్ష్యాలనే ప్రామాణికంగా తీసుకొంటాయి గనుక ఆమె నిస్సహాయతను అర్ధం చేసుకొన్నపటికీ, ఆమెపై కేసు మాత్రం కొనసాగించాయి.   వైయస్. రాజశేఖర్ రెడ్డి సూచనలు లేదా సలహాల మేరకు శ్రీలక్ష్మి వ్యవహరించినందున ఆమెకు ఓబులాపురం గనుల అక్రమ త్రవ్వకాలలో గాలి జనార్ధన్ రెడ్డి కాకుండా ఇంకా లబ్ది పొందినవారి వివరాలు కూడా సహజంగానే తెలిసి ఉంటాయి, గనుకనే ఆమెను విచారించేందుకు సీబీఐ అనుమతి కోరుతోంది. కేంద్రం ఈ రోజు అందుకు అనుమతించడంతో నేడో రేపో సీబీఐ ఆమెకు సమన్లు జారీ చేయవచ్చును. ఈ కేసులో ఆమె నిర్దోషిగా బయటపడుతుందా లేదా? అనే విషయాన్నీ పక్కన పెడితే, విచారణలో ఆమె ఇంకా ఎవరిరెవరి పేర్లు బయటపెడతారోనని ఈ గనుల కుంభకోణంలో ‘తీర్ధ ప్రసాదాలు’ స్వీకరించిన వారందరూ ఇప్పుడు బెంగ పెట్టుకొన్నారు.   ఈ వ్యవహారం యావత్తు దివంగత ముఖ్యమంత్రి వైయస్. రాజశేఖర్ రెడ్డి హయంలోనే జరిగింది గనుక, తొలుత కాంగ్రెస్ పార్టీలో పెద్దలు, ఆతరువాత వైయస్ కుటుంబ సభ్యుల పేర్లు బయటపడే అవకాశం ఉంది.   ఓబులాపురం కేసు కధ ఇంకా కోర్టుల్లో నలుగుతున్నందున దోషుల పేర్ల పట్టిక ఇంకా బయటపడనప్పటికీ, కేంద్రం గనుల అక్రమార్కుల పేర్లు తెలుసుకోలేనంత అమయుకురాలు కాదు. అందువల్ల కేంద్రం శ్రీలక్ష్మిని విచారించేందుకు కాకతాళీయంగా అనుమతినిచ్చినట్లు పైకి కనిపిస్తున్నపటికీ, ఇంకా లోతయిన కారణాలతోనే అనుమతినిచ్చి ఉండవచ్చును. తెలంగాణా అంశం మరియు రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే పార్టీలో, విపక్షంలో తనను ఇబ్బందిపెడుతున్న కొందరు రాజకీయ నాయకులను, ప్రభుత్వాధికారులను దారికి తెచ్చుకొనే ప్రయత్నంలో భాగంగానే కేంద్రం ‘శ్రీలక్ష్మిని విచారించేందుకు తగిన సమయంగా’ భావించి ఈ విధంగా ‘తగిన నిర్ణయం’ తీసుకొని ఉండవచ్చును.   బహుశః కేంద్రం అమ్ములపొదిలో ఇటువంటి అస్త్రాలు చాలానే ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. రానున్న రోజుల్లో శ్రీలక్ష్మి బయట పెట్టే వ్యక్తుల పేర్లను బట్టి కేంద్రం ఎవరిమీదకి ఈ బాణం ప్రయోగించిందో అర్ధం అవుతుంది.

ఏ భార్య పై ప్రమాణం చేస్తావు?: రేవంత్

        మొదటి భార్యను మోసం చేసి రెండో భార్యను చేసుకున్నావు. ఇప్పుడు అక్రమాల ఆరోపణలు వస్తే బైబిల్ మీద, భార్యాపిల్లల మీద ప్రమాణం చేస్తా అని అంటున్నావు. మరి ఏ భార్యా బిడ్డల మీద ప్రమాణం చేస్తావు. మొదటి భార్య, పిల్లల మీదా ? రెండో భార్యా పిల్లల మీదా” అని వైఎస్ అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ ను టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.   బ్రదర్ అనిల్ కుమార్ చేసే ప్రమాణాల మీద నమ్మకం లేదని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డిగానీ అక్రమాలు చేయలేదని షర్మిల, భారతి, విజయమ్మ, అనిల్ లు బైబిల్ మీద ప్రమాణం చేస్తారా ? అని ప్రశ్నించారు. వైఎస్ జగన్, బ్రదర్ అనిల్ కుమార్ లు అబద్దాలు చెప్పడం మాని నిజాలు వెల్లడిస్తే వారికి కొంత శిక్ష అయినా తగ్గుతుందని అన్నారు. రాజకీయాలు, మత ప్రచారంతో ద్విపాత్రాభినయం చేస్తున్నాడని, మత ప్రచారమా, రాజకీయాలా ? ఏదో ఒకటి నిర్ణయించుకోవాలని సూచించారు.

నందమూరివారికి పార్టీని అప్పగించితేనే బెటర్!

  ‘తెలుగుదేశం పార్టీకి నందమూరి కుటుంబ సభ్యులు నాయకత్వం వహిస్తేనే మేలు!’ జరుగుతుందని ఒక పెద్దాయన అభిప్రాయ పడ్డారు. కాకపొతే ఆ మాటన్నది వయా ప్రజారాజ్యం-కాంగ్రెస్ పార్టీలో చేరి దేవాదాయశాఖ తీర్ధం పుచ్చుకొన్నసి.రామచంద్రయ్య కావడమే విశేషం.   ఇటీవల ఆయన వైజాగ్ వచ్చినప్పుడు మీడియావారితో మాట్లాడుతూ “చంద్రబాబు నాయుడు రోజుకొక కొత్త వాగ్దానం చేస్తూ ఎలాగయినా ప్రజలను మభ్యపెట్టి తిరిగి అధికారంలోనికి రావాలని పాపం ఆయన ఆశ పడుతున్నారు. అయితే, ఆయన కల కలగానే మిగిలిపోక తప్పదు. నిజంగా ఆయన తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని కోరుకొంటే, పార్టీ బాధ్యతలను నందమూరి కుటుంబ సభ్యులెవరికయినా అప్పగించి తానూ పార్టీ నుండి తప్పుకొంటే ఆ పార్టీకి గెలిచే అవకాశాలు ఉంటాయి. లేదంటే ఆయన ఇప్పుడు చేస్తున్న వాగ్దానాలతో పాటు మరో ప్రకటన కూడా చేయడం మంచిది. అది ‘త్వరలో తెలుగు దేశం పార్టీ చచ్చిపోబోతోందని’ ప్రకటించడం. ఆయన నేతృత్వంలో ఆ పార్టీ అధికారంలోకి రాదని నేను ఖచ్చితంగా చెప్పగలను,” అని అన్నారు.   తరువాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ, “అసలు ఆ పార్టీ నేతలు తమ పార్టీ అధికారం లోకి రాగలదని ఎలా విశ్వసిస్తున్నారో నాకు అర్ధం కావడం లేదు. ఒకపక్క వారి అధినేత అక్రమాలకూ పాల్పడి జైల్లో ఉన్నపటికీ, ప్రజలు అవేమి పట్టించుకోకుండా ఆయన పార్టీకే ఓటేస్తారని ఎలా నమ్ముతున్నారు? ప్రజలకి ఆయన అక్రమార్జనల గురించి ఏమీ తెలియదని భావిస్తున్నారా లేక వాటిని పట్టించుకోరని భావిస్తున్నారా? వారే చెప్పాలి.”   “వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాదించడం ఖాయం అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల ప్రయోజనాలను కాపాడగలదు. దేశాన్ని ముందుకు నడిపించగల శక్తి గలది,” అని తెలిపారు.   రామచంద్రయ్య గారు ప్రస్తుతం కాంగ్రెస్ గొడుగు క్రింద సేద తీరుతున్నారు గనుక, కాంగ్రెస్ పార్టీకి ‘టముకు’ వేసుకొంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ, ప్రతిపక్ష పార్టీ ఎవరిని అధినేతగా పెట్టుకొవాలో ఆయన చెప్పడం మాత్రం చాలా హాస్యాస్పదంగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో తనకు తగిన గౌరవం లేదని నిత్యం వాపోయే ఆయన, ముందు తన సంగతి గురించి ఆలోచించక ప్రతిపక్ష నేతల గురించి,వారి పార్టీల గురించి ఆలోచించి ఎందుకు శ్రమ పడుతున్నారో ఆయనకే తెలియాలి.   ప్రజారాజ్యం పార్టీ గత ఎన్నికల సమయంలో దాదాపు కుప్పకూలిపోయే స్థితిలో ఉన్నపుడు ఆపార్టీకి చెందిన ప్రభాకర్, హరిరామ జోగయ్యవంటి అనేక మంది సీనియర్లు చిరంజీవికి తగిన సలహా ఇచ్చేందుకు ప్రయత్నించినప్పుడు, రామచంద్రయ్య గారు మాత్రం తన టికెట్టు, గెలుపు సంగతే చూసుకొన్నారు. తత్ఫలితంగా చిరంజీవికి మంచి చెప్పినవారు బయటకిపోవలసి వచ్చింది. రామచంద్రయ్యవంటివారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ గంగలో కలిపేందుకు మాత్రం చాలా శ్రమ పడినందుకు మంత్రి పదవులు పుచ్చుకోగలిగారు.   స్వంత పార్టీ అధినేతకు కనీసం మాట సహాయం కూడా చేయని ఆ పెద్దమనిషి ఇప్పుడు ప్రతిపక్షం గురించి అడగకుండా ఉచిత సలహాలు ఎందుకు ఇస్తున్నారు? ఒకవేళ, వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కానీ, ఆయనకు టికెట్ ఈయకపోతే ఆయన కాంగ్రెస్ పార్టీనే అంటిపెట్టుకొని ఉంటారని హామీ ఈయగలారా?అని తెదేపా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లు అడగితే ఆయన ఏమి సమాధానం చెపుతారు?

వాయలార్ దోశపై కేసిఆర్ నిప్పులు

        ఒకవైపు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి నేతలు తెలంగాణ గురించి తమకు తోచిన పదజాలంతో మాట్లాడుతుంటే…ఇన్ని రోజులూ మౌనంగా ఉండిన టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఇకపై తెలంగాణ గురించి దోశ, వడ అంటే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించాడు. ఇలాంటి మాటలు మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు ఆజాద్‌, వయలార్‌ రవిలపై కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. వారి మాట తీరును తప్పుపడుతూ… తెలంగాణను దోశ, వడ అంటూ కించపరుస్తూ మాట్లాడితే ఊరుకునేదిలేదని ఘాటుగా హెచ్చరించారు. తెలంగాణ ఆర్టీసీ మహిళా ఉద్యోగులు ఏర్పాటు చేసిన సమావేశానికి కేసీఆర్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. యధావిధిగా ఆర్టీసీ రిక్రూట్‌మెంట్‌లోనూ తెలంగాణకు అన్యాయమే జరుగుతోందని కేసీఆర్ ఆందోళనవ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగితే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని చెప్పారు.