పరమాత్ముడు తీర్చలేని బాధ
posted on Jun 24, 2013 @ 2:13PM
అందమైన హిమాలయాలు
అందాలన్నీ చీరగా చుట్టుకుని
కనువిందుగా మురిపించాయ్,
రా రమ్మని ఆహ్వానించాయ్...
ఆ పరమాత్ముడు ముక్తినిస్తాడంటూ... నమ్మబలికాయ్
ఆశతో ఒడి చేరి ఆనందంలో మునిగి తేలుతున్నవారందరిని
దయదాక్షిణ్యాలు లేకుండా
ముంచేసాయ్... శవాలుగా మార్చేసాయ్
ఒకటా రెండా ఇన్ని వేల
ప్రాణాలు పట్టుకుపోయి
ఏ స్వామి గుమ్మానికి తోరణాలల్లుతున్నాయో...
కళ్ళ ముందే అయినవారి ప్రాణాలు
నీటిలో కలిసిపోతుంటే ఏమి చేయలేని వారిగుండె కోత....
ఒకరి కన్నకొడుకు,
ఒకరి కన్నతల్లి,
మరొకరి భార్య,
ఇంకొకరి భర్త
ఇలా బంధాలని, అనుబంధాలని
తెంచుకుని నీటిలో కలిసి పోయాయ్...
కన్నీరుని మిగిల్చిపోయాయ్...
ఏ "నాథుడు"
ఆ అవిసిన గుండెల భాదని
తీర్చలేదు... తీర్చలేడు.
....రమ