రాజమండ్రిలో గ్లామర్ వార్
posted on Jun 25, 2013 @ 10:56AM
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరుపున ఉండవల్లి అరుణ్‌కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమండ్రి సీటుకు, ఈ సారి ఎలక్షన్స్‌లో రసవత్తర పోరు జరగనుంది.. పోయిన సారి కూడా ఉండవల్లిపై కృష్ణంరాజు, మురళీమోహన్‌లు పోటి చేయగా అది ఉండవల్లికే ప్లస్ అయింది.. ఇద్దరు సినిమా స్టార్‌లు సినిమా ఓట్లను పంచుకోగా మిగతా ఓట్లతో ఉండవల్లి ఈజీగా గట్టెక్కారు.
అయితే ఈ సారి కూడా సీటుకు ఇలాంటి పోరే జరగనుంది.. ముఖ్యంగా తమపై ఆరోపణలు చేస్తున్న ఉండవల్లి సీటు కావడంతో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాగైన అక్కడ పాగా వేయాలని చూస్తుందట.. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ సారి ఉండవల్లికి బదులుగా ఈ స్థానంలో ఇటీవలే రాష్ట్రరాజకీయాల్లోకి ప్రవేశించిన జయప్రదని పోటికి నిలపాలని చూస్తుంది.
దీంతో జయప్రద గ్లామర్‌ను ఎదుర్కోటానికి వైసిపి నాయకులు ఈ స్థానం నుంచి ప్రముఖ హాస్యనటుడు ఆలీని రంగంలోకి దించాలని భావిస్తుంది.. స్థానికంగా మంచి పేరుతో పాటు ఇప్పటికే పలు సేవకార్యక్రమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆలీ బరిలో ఉంటే గెలుపు చాలా ఈజీ అవుతుందని ఆశిస్తుంది వైసిపి.
అయితే మరో వైపు తెలుగుదేశం తరుపున పార్టీ తరుపున మురళీమోహన్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.. పోయిన సారి ఇద్దరు సినిమా స్టార్‌లు పోటిపడతంతో అది మరొకరికి ప్లస్ అయింది.. మరి ఈ సారి అందరూ సినిమా స్టార్‌లే తలపడితే ఎవరు గెలుస్తారో చూడాలి..