సి.ఎం. ఎక్కడా?
posted on Jun 25, 2013 @ 1:11PM
ఉత్తరాఖండ్ లో తెలుగు యాత్రికుల అవస్థలు వర్ణనాతీతం. అలాగే మిగిలన రాష్ట్రాల వారి అవస్థలు చెప్పనలవి కాదు. కాని ఆయా రాష్ట్రాల వారిని వారి వారి ముఖ్యమంత్రులు దగ్గరుండి పర్యవేక్షించారు. కాని మన ముఖ్యమంత్రి గారు అటు మోడల్ స్కూల్స్ ఓపెనింగ్ లలోను,వైన్ షాపులను బార్లగా మార్చే ప్రయత్నంలో చాలా బిజీగా ఉన్నారు. పర్యాటక మంత్రి చిరంజీవికి ఆపదవి ఎదుకున్నదో కూడా ఆయనకు తెలియనంతగా బాపట్ల బీచ్ లో,ఏరువాక ప్రారంభోత్సవంలో చాలా హడావిడిగా ఉన్నారు. పది రోజులుగా చార్ధామ్ వరదల్లో చిక్కుకున్న వారిని గురించి రాష్ట్ర ప్రరభుత్వం కార్యాచరణ ఏమిటి అని ఇప్పటివరకు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేని నేత కిరణ్ కుమార్ రెడ్డి,ఆయన ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కేవలం తనకు నచ్చిన పధకాలను అమలు చేసుకోవడానికే ఉన్నట్లు ఉంది. మాటకు ముందు డిల్లి పయనమయ్యె ముఖ్యమంత్రి,పదిరోజులుగా వరదల్లో చిక్కుకున్న వారిని పరామర్శించ టానికి ప్రయత్నించలేదు. మరోపక్క నుండి తెలంగాణ మీద ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతూప్రజలను అసహనానికి గురిచేస్తున్నారు. పక్కరాష్ట్రాల ముఖ్యమంత్రులను చూసైన వీరు నేర్చుకోరా?ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఎలాంటి భావోద్వేగాలలో ఉన్నారో వారికి పట్టదా?ప్రజలు వీరి నుండి ఎలాంటి భరోసాను కోరుకుంటున్నారో వారికీ తెలియదా?
10 కోట్లమంది ప్రజానీకానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక ముఖ్యమంత్రి నడుచుకునే తీరు ఇదేనా?రేపు ఎమొహం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతారు. అంటే ఇప్పుడు ఎలా ప్రవర్తించినా రేపు వారి ప్రజాకర్షక పధకాలు వారికున్నాయి అనే వారి మొండి ధైర్యమా?కనీసం ఇప్పటి వరకు ఎంతమంది రాష్ట్రం నుండి యాత్రకు వెళ్ళారనే లెక్కలు కూడా ప్రభుత్వం దగ్గర లేవు. వీధికొకటిగా పుట్టుకొస్తున్న ట్రావెల్ ఏజెన్సీల మీద చేపట్టే చర్యలు గానీ,వారినుండి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నాలు గానీ పర్యాటకశాఖ మంత్రి చెయ్యరు,రవాణా శాఖామంత్రి అసలేచేయ్యరు.