సిద్దం సిద్దం అన్నారు... అసెంబ్లీకి వచ్చేందుకు సిద్దమా!
సిద్ధం సిద్ధం అని నినాదాలు చేసిన వారికి ఓ సవాల్ విసురుతున్నాను. వైసీపీని సూటిగా అడుగుతున్నాను. అసెంబ్లీకి వచ్చేందుకు వైసీపీ సిద్ధమా ?అసెంబ్లీకి రండి ఎవరిది అభివృద్ధో.. సంక్షేమం ఎవరు అందించగలరో చర్చకు నేను సిద్ధం. వైసిపి వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు నేను సిద్ధం. చర్చించడానికి వైసిపి సిద్ధమా అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైసీపీపై ఫైర్ అవుతూ సవాలు విసిరారు .
అంతేకాదు పులివెందుల,ఒంటిమిట్ట ఎన్నికైపైనా చర్చకు సిద్ధం, బాబాయి హత్య పైనా చర్చకు సిద్ధం, దళిత డ్రైవర్ ను డోర్ డెలివరీ చేసిన ఘటన పైనా చర్చకు సిద్ధం ,కోడి కత్తి డ్రామా.. గులకరాయి డ్రామాల పైనా సిద్ధిమంటూ సవాల్ విసిరారు. ప్రజల సేవలో కార్యక్రమంలో భాగంగా పింఛన్లు పంపిణీ ,బంగారు కుటుంబాలు ,తదితర కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నమయ్య జిల్లా రాజంపేటకు వచ్చారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టిన అనంతరం ఆయన ప్రజా వేదికపై నుంచి మాట్లాడుతూ వైసిపి పలు అంశాలపై చర్చించేందుకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.ఇందుకోసం వైసీపి వారు అసెంబ్లీ కి వచ్చి చర్చించాలన్నారు.
ఏనాడు విశ్రాంతి తీసుకోలేదు
రాజకీయ జీవితంలో నేను ఏనాడూ విశ్రాంతి తీసుకోలేదు. పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించాలనేదే నా ఆశయంమని, ఎవరైనా పింఛను తీసుకోకున్నా వచ్చే నెల అందిస్తున్నామని పేదవాడి జీవితాల్లో వెలుగులు నింపాలనేదే మా లక్ష్యంమని అన్నారు .అభివృద్ధి జరగాలి.. ఆదాయం పెరగాలి - ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తేనే మార్పులు వస్తాయిని పేర్కొన్నారు .రాయలసీమ ఇకనుంచి రాళ్ల సీమ కాదు, రతనాల సీమను చేస్తామన్నారు. 2014-19 మధ్య దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధిని చేసి చూపించామని,కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు మళ్లీ స్వేచ్ఛ వచ్చిందన్నారు.మొన్నటి ఎన్నికల్లో ప్రజలు కూడా ఎంతో విజ్ఞత చూపించాన్నారు.
*గత పాలకు రక్తం పాలించారు.
గత పాలకులు రాయలసీమలో రక్తం పారించారని,మేం వచ్చాక రాయలసీమలో సాగునీరు పారిస్తున్నామని అన్నారు.కష్టాల్లో ఉన్న మామిడి రైతులను మేం ఆదుకున్నామని మామిడికాయలు రోడ్డుపై పోసి వైసీపీ నేతలు డ్రామాలు ఆడారని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టేముందు పదిసార్లు ఆలోచించాలని,మహిళల ఆత్మగౌరవం దెబ్బతిస్తే కఠిన చర్యలు తప్పవని ఆడవాళ్ళు పై అఘాయిత్యాలకు పాల్పడితే అదే మీకు చివరి రోజని హెచ్చరించారు.
*రాజంపేట మీదుగా కోడూరు కు నీళ్ళు
కడప, రాజంపేట మీదుగా కోడూరుకు నీళ్లు తీసుకెళ్తామని, రాజంపేటలో వ్యవసాయం తగ్గి ఉద్యానపంటలు పెరిగాయని అన్నారు .రాజంపేటలో డెయిరీ, పశుసంపద బాగా పెరిగిందని అన్నారు. ఒంటిమిట్టను టిడిపి దత్తత తీసుకుందని, అనే కార్యక్రమాలు చేపడతామని, మా దృష్టిలో అభివృద్ధి వేరు రాజకీయాలు వేరని అన్నారు.
*నదులు అను సంధానం
గంగానది నుంచి కావేరి వరకు నదుల అనుసంధానం జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వంశధార నుంచి గోదావరి, కృష్ణా, పెన్నా నదులు అనుసంధానం చేస్తామని తెలిపారు. మీరు ఆశీర్వదిస్తే చాలు కొండలనైనా పిండి చేస్తామని అన్నారు.
*ప్రజల ఆరోగ్యం కోసం సంజీవిని
సంజీవని పేరుతో ప్రాజెక్టు తెస్తున్నామని,ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో ఈ ప్రాజెక్టు తీసి కొలుస్తున్నారు.
*అనర్హులకు పించన్లు సరైనదేనా!
అవయవాలన్నీ సక్రమంగా ఉన్న వారికి కూడా గత ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ ఇచ్చిందని,అలాంటి వారికి వారికి పెన్షన్లు ఇవ్వడం సరైందేనా...? ప్రజలు ఆలోచించాలని చంద్రబాబు కోరారు. అనర్హులకు పెన్షన్ తీసేయండని చెప్పే ధైర్యం ప్రజలకు రావాలని అన్నారు. వైసీపీ వాళ్ళు పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుపడతారు, పోలవరం, అమరావతిని ఆపేస్తున్నారు. రోడ్లకు గుంతలు పెట్టారని అన్నారు. వాళ్ల కారుతోనే సింగయ్యను తొక్కించి చంపేశారని,తిరిగి మనపైనే నెపాన్ని నెడుతున్నారని,మామిడి రైతుల విషయంలోనూ డ్రామాలు ఆడారని అన్నారు.
*సీమకు నీళ్ళిచ్చే దారి చూపిన ఎన్టీ ఆర్
రాయలసీమకు నీళ్లిచ్చే దారి చూపిన నాయకుడు ఎన్టీఆర్ అని,రాయలసీమకు నీళ్లు తెస్తామని,నిన్ననే కుప్పానికి నీళ్లు తీసుకెళ్లానని భవిష్యత్తులో రాజంపేట, కోడూరుకు నీళ్లు తెస్తామని,రాయలసీమకు కరవు లేకుండా చేస్తామని బరోసా ఇచ్చారు. కరవు జిల్లా అనంతపురానికి కియా తెచ్చాని,ఇవాళ ఆ జిల్లా రూపు రేఖలు మారిపోయాయని అన్నారు. రాయలసీమకు పెద్ద ఎత్తున పెట్టుబడులు తెస్తున్నాం. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందన్నారు.
సంక్షేమానికి సాటి లేదు, అభివృద్ధికి అడ్డు లేదు, సుపరిపాలనకు పోటీ లేదని అన్నారు.నా బలం బలగం ప్రజలే అన్నారు. స్త్రీ శక్తి ఏంటో ప్రపంచానికి చూపుతాం లక్ష మంది మహిళలను పారిశ్రామిక వేత్తలుగా చేస్తామని అన్నారు.
*ఎన్నో వడిదుడుకులు ఎదుర్కొన్నా
ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ చంద్రబాబు నాయుడు సమైఖ్య రాష్ట్రంలో నేనే ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పారు. 30 ఏళ్ల కాలంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని,అయినా పేదల సంక్షేమం కోసం పని చేస్తున్నాని,పేదల అభ్యున్నతి కోసం నిరంతరం పని చేస్తూనే ఉంటానని అన్నారు. ఈ 30 ఏళ్ల కాలంలో సంపద సృష్టించి,సంక్షేమం చేయడమే నాకు తృప్తి కలిగిందన్నారు.
అప్పులు చేసి బాగుపడ్డ వారు లేరని,అప్పు చేసి పప్పు కూడు తింటే... చిప్పే మిగులుతుందని అన్నారు.ఆదాయాన్ని పెంచిపేదలకు సంక్షేమం అందించాలి.. అదే నేను చేస్తున్నానన్నారు.
ఐటీ, హైటెక్ సిటీ అంటే ఎగతాళి చేశారని,కానీ చాలా కుటుంబాలను ఆర్థికంగా ఎదిగేలా చేసింది ఐటీనే అని,
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వాళ్లు విస్తరించడానికి కారణం ఐటీనే కారణమన్నారు.హైదరాబాద్ విశ్వనగరంగా మారిందని,బాగా అభివృద్ధి జరిగిందని అన్నారు. టీడీపీ ప్రభుత్వాలు చేసినవి గుర్తు పెట్టుకోండి.. అభివృద్ధి వైంకుఠపాళి కాకూడదని అన్నారు.
2019-24లో ప్రభుత్వం మారిందిని, రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని, పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కలిసి పోటీ చేశామని అన్నారు. ఎమ్మెల్యేలు తప్పు చేస్తే నిలదీయగలుగుతున్నారని ఇదీ మేం ఇచ్చిన స్వేచ్ఛ అని అన్నారు . రాజంపేట చంద్రబాబు పర్యటనలో అన్నమయ్య జిల్లా ఇన్చార్జి మంత్రి బిసి జనార్ధన్ ,రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జి జగన్మోహన్ రాజులతో పాటు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఇతర అధికారులు, అనధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు