సోనియా తలుపు తట్టిన...ఓటు చోర్ వివాదం !
కాంగ్రెస్ అధినాయకుడు, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ), ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం పై ఏక కాలంలో కత్తులు దూస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం, మోడీ ప్రభుత్వంతో కుమ్ముక్కై, ఓటు చోరీ (ఓట్ల దొంగతనం)కి పాల్పడుతోందని ఆరోపిస్తూ,ఆటం బాంబు పేల్చారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్’లో, ఓట్ చోర్ – గడ్డీ చోడ్’ నినాదంతో, పక్షం రోజుల పాటు, ఓటరు అధికార యాత్ర సాగించారు.
నెక్స్ట్ హైడ్రోజన్ బాంబుతో మరో బ్రహ్మాండం బద్దలు కొడతానని రాహుల్ గాంధీ ప్రకటించారు. అయితే,కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని గద్దేదించడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ సాగిస్తున్న ఓటు చోరీ యుద్ధ తత్రం ఎంతవరకు ఫలిస్తుంది, ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేది. ఈ సంవత్సరం చివర్లో, జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెల్చేస్తాయి.
అయితే, ఓ వంక కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘం పై యుద్ధం చేస్తుంటే, మరో వంక కాంగ్రెస్ పార్టీ ఓటు చోరీ’ కథలు ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి.కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, పవన్ ఖేరా,అయన సతీమణి ఇద్దరి పేర్లు రెండేసి నియోజక వర్గాల ఓటరు జాబితాలో ఉన్నాయని, బీజేపీ ఐసెల్’ చీఫ్ అమిత్ మాలవీయ బయట పెట్టారు. కేవలం నోటి మాటలతో కాకుండా. పవన్ ఖేరాకు దేశ రాజధాని ఢిల్లీలోని జంగుపుర, న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజక వర్గాల ఓటరు జాబితాలలో నమోదైన ఎపిక్ నెంబర్’తో సహా జారీ అయిన ఓటరు గుర్తింపు కార్డును బయట పెట్టారు.
మాలవీయ ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం, విచారణ చేపట్టింది. పవన్ ఖేరాకు నోటీసులు జారీ చేసింది. అదలా ఉంటే, రాహుల్ గాంధీ ఓటు చోర్’ నినాదం, ఆయన కన్నతల్లి, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్య సభ సభ్యురాలు,సోనియా గాంధీ ఇంటి తలుపులు తట్టింది. సోనియా గాంధీ,భారతీయ పౌరసత్వం పొందక ముందే,1980లోనే ఓటర్ల జాబితాలో ఆమె పేరు ఉందని ఆరోపిస్తూ ఢిల్లీ కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. 1983లో సోనియా అధికారికంగా భారత పౌరసత్వం పొందినట్లు డాక్యుమెంట్లు చెబుతున్నాయి. కానీ అంతకు ముందే ఆమె ఓటరు ఎలా అయ్యారనే సందేహంతో, వికాస్ త్రిపాఠి అనే వ్యక్తి సీనియర్ అడ్వకేట్ పవన్ నారంగ్ ద్వారా ఈ పిటిషన్‌ను కోర్టులో దాఖలు చేశారు.
ఇందులో ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం సోనియా గాంధీ 1983 ఏప్రిల్ 30న భారత పౌరసత్వం పొందారు. కానీ 1980లో న్యూఢిల్లీలో ఓటర్ల జాబితాలో ఆమె పేరు నమోదైంది. 1982లో ఆ పేరు జాబితా నుంచి తొలగించారు 1983లో మళ్లీ ఆమె పేరు జాబితాలో చేరింది. దీనిపై పిటిషనర్ అనుమానం వ్యక్తం చేస్తూ, ఆమెకు అప్పట్లో ఏ డాక్యుమెంట్లు ఉన్నాయని, ఆ సమయానికి పౌరసత్వం లేని స్థితిలో ఓటర్ల జాబితాలో ఆమె పేరు ఎలా వచ్చిందని ప్రశ్నించారు.
సీనియర్ అడ్వకేట్ పవన్ నారంగ్ కోర్టులో మాట్లాడుతూ ఇది సరైన ప్రక్రియ కాదని, ఇందులో ఏదో తేడా ఉందన్నారు. ఓటరుగా నమోదు కావడానికి భారత పౌరసత్వం తప్పనిసరి. ఆ సమయానికి ఆమె పౌరురాలు కాకపోయినా, ఆమె పేరు ఎలా జాబితాలోకి వచ్చిందని ప్రశ్నించారు. ఇందులో వేరే వ్యక్తులు ప్రమేయం ఉండొచ్చని, ఎలక్షన్ కమిషన్ అధికారులపై కూడా అనుమానం ఉందన్నారు. ఇది ఓ పబ్లిక్ అథారిటీని మోసం చేసే ప్రయత్నంగా పరిగణించి దర్యాప్తు జరిపించాలని కోరారు.
ఈ అంశాన్ని విచారించిన ఢిల్లీ కోర్టు, తదుపరి విచారణను సెప్టెంబర్ 10కి వాయిదా వేసింది. ఆ రోజున తదుపరి విచారణ జరగనుంది. అయితే, ఇది కోటగా వెలుగు చూసిన విషయం కాదు, గత కొంత కాలంగా, సోనియా ఒరు చోర్’ వ్యవహరం సోషల్ మీడియాలో, వైరల్ అవుతూనే వుంది. కాంగ్రెస్ పార్టీ, ‘బుల్ షీట్’ అంటూ కొట్టేసింది. అయితే ఇప్పడు,సోనియా ఓటు చోర్’ ఫిర్యాదును విచారణకు స్వీకరించడంతో, కోర్టు తీర్పు ఎలా ఉంటుందనే విషయంలో ఆసక్తి నెలకొంది.