బీజేపీ నేత అన్నామలైతో మంత్రి లోకేశ్‌ భేటీ

  తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైను మంత్రి నారా లోకేష్ ఇవాళ భేటీ అయ్యారు.  కోయంబత్తూరులో వీరిద్దరి మధ్య ఈ మర్యాదపూర్వక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను లోకేష్ వివరించారు. డబుల్ ఇంజన్ సర్కారు అధికారంలో ఉన్నందున ఏపీ వేగవంతంగా అభివృద్ధి సాధిస్తున్నట్లు చెప్పారు.  కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, విద్యారంగంలో తాము చేపడుతున్న సంస్కరణలు దేశంలోనే రోల్ మోడల్ గా నిలుస్తున్నాయని అన్నామలైతో లోకేష్ చెప్పారు. ఒకసారి ఆంధ్రప్రదేశ్ ను సందర్శించాల్సింగా అన్నామలైని లోకేష్ ఆహ్వానించారు. ముఖ్యంగా విద్యారంగంలో తాము అమలు చేస్తున్న సంస్కరణలు, కూటమి ప్రభుత్వం సాధిస్తున్న విజయాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయని లోకేశ్ తెలిపారు.

కవిత విషయంలో స్పందించిన కేటీఆర్‌..ఏమన్నారంటే?

  తన సోదరి కవిత విషయంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ తొలిసారి స్పందించారు. బీఆర్‌ఎస్ పార్టీలో చర్చించిన తర్వాతే తమ అధినేత ఆ నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్‌ స్పష్టత ఇచ్చారు. ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత తాను మాట్లాడేది ఏమి లేదని స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితం కవిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి హారీశ్ రావు స్పందిస్తూ వారి విజ్ఞతకే వదిలేస్తున్నాని చెప్పిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కవిత తొలిసారి మీడియాతో మాట్లాడుతూ.. హరీష్‌రావు, సంతోష్ రావు టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేశారు.  ఈ క్రమంలో ‘‘రామన్నా.. హరీష్‌, సంతోష్‌ మీతో ఉన్నట్టు కనిపించవచ్చు కానీ.. మీ గురించి, తెలంగాణ గురించి ఆలోచించే వ్యక్తులు కాదు .. వాళ్లను పక్కనపెడితేనే పార్టీ బతుకుతుంది.. నాన్న పేరు నిలబడుతుంది..’’ అంటూ కవిత పేర్కొన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కనీసం ఫోన్ చేసి అడగాల్సిన బాధ్యత కూడా తీసుకోలేదు. 103 రోజులుగా కేటీఆర్ తనతో మాట్లాడలేదని అన్నారామె. అయితే తనకు నోటీసు ఇవ్వడంపై బాధ కలగడం లేదని.. ఈ వ్యవహారంపై  తెలంగాణ భవన్‌లో మహిళా బీఆర్‌ఎస్ నేతలు స్పందించడంపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎనిమిది నెలల వ్యవధిలో మోడీతో లోకేష్ భేటీలు ఐదు... సంకేతమేంటి?

ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ కు ప్రధాని మోడీ అప్పాయింట్ మెంట్ అడగనవసరం లేకుండానే దొరికేస్తోందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. మోడీయే స్వయంగా నారా లోకేష్ ను కుటుంబంతో సహా ఢిల్లీ వచ్చి తనను కలవాలంటూ ఆహ్వానించిన సంగతిని గుర్తు చేస్తున్నారు. మహామహా సీనియర్లు, దిగ్గజ నేతలకు సైతం ఇంత తక్కవ వ్యవధిలో ఇన్ని సార్లు ప్రధాని మోడీ అప్పాయింట్ మెంట్ లభించిన దాఖలాలు లేవు. అంతెందుకు హిందుత్వను భుజాన వేసుకుని నిత్యం మోడీ విధానాలను పొగిడే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఇప్పటి వరకూ లోకేష్ కు లభించిన  అప్పాయింట్ మెంట్లలో సగం కూడా దొరకలేదు. లోకేష్ కు ఇంత తక్కువ వ్యవధిలో ఇన్ని సార్లు మోడీ అప్పాయింట్ మెంట్లు లభించడంపై దేశ వ్యాప్తంగా విస్మయం వ్యక్తం అవుతోంది. ఇది దేనికి సంకేతమన్న చర్చ కూడా విస్తృతంగా జరుగుతోంది. అప్పాయింట్ మెంట్లు లభించడమే కాదు.. ఆ సందర్భంగా ఇరువురి మధ్యా సుదీర్ఘ చర్చలు కూడా జరుగుతున్నాయంటున్నారు. సాధారణంగా ఎంత కీలకమైన వ్యక్తి అయినా సరే మోడీ అప్పాయింట్ మెంట్ ఇచ్చేది పావు గంట.. మహా అయితే మరో పది నిముషాలు. అయితే లోకేష్ ఆయనతో భేటీ అయిన ప్రతిసారీ ఆ భేటీ గంట, ముప్పావుగంట సాగుతోంది.అయితే ఢిల్లీ బీజేపీ వర్గాలు మాత్రం ప్రధాని మోడీ ప్రతి రాష్ట్రంలోనూ ప్రతిభ, పరిణితి ఉన్న యువనేతలకు గుర్తించి, వారిని ప్రోత్సహిస్తుంటారనీ, సీనియర్ నేతల కంటే వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మామూలేనని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి లోకేష్ లో అటువంటి పరిణితి చెందిన, ప్రతిభావంతుడైన యువనేత లోకేష్ అని గుర్తించిన మోడీ ఆయనకు ప్రాధాన్యత ఇస్తున్నారని అంటున్నారు. అదే సమయంలో పోలిటికల్ సర్కిల్స్ లో ప్రధాని మోడీతో లోకేష్ వరుస భేటీలు రాష్ట్ర రాజకీయాలలో రాబోతున్న మార్పునకు కూడా సంకేతమని అంటున్నారు. లోకేష్ కు పార్టీలో పదోన్నతి విషయంలో గతంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కారణాలేమైతేనేం.. ఆ తరువాత ఆ ప్రస్తావన పెద్దగా రాలేదు. ఇప్పుడు ప్రధాని మోడీతో లోకేష్ వరుస భేటీలు.. లోకేష్ కు ప్రమోషన్ విషయంలో బీజేపీ నుంచి ఎటువంటి అభ్యంతరాలూ ఉండవన్న సంకేతాన్ని ఇస్తున్నదని, ఆ సంకేతం జనసేన కూడా లోకేష్ కు పదోన్నతికి అంగీకారం తెలిపేలా చేస్తుందని చెబుతున్నారు.  

డిప్యూటీ సీఎం పవన్‌పై విచారణ వాయిదా

  ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని   హైకోర్టులో  దాఖలైన పిటిషన్‌పై ఈనెల 15కు వాయిదా పడింది. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ సినిమా షూటింగ్‌లో పాల్గొనడంపై మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.  కాగా పవన్ కల్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా  ప్రమోషన్‌లో ప్రభుత్వ నిధులు, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం ఉంటూ సినిమాల్లో నటిస్తున్నారని తెలిపారు. ఈ పిటిషపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది.   

పులివెందులకు ఉప ఎన్నిక.. తెలుగుదేశం అభ్యర్థి రెడీ?

ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేశారు. అక్రమాలకు పాల్పడ్డారు, అధికార దుర్వినియోగం జరిగింది.. అంటే వైసీపీ ఎంతగా బుకాయించినా.. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో ఆ పార్టీ పరాజయాన్ని జీర్ణించుకోవడం ఆ పార్టీకి కానీ, ఆ పార్టీ అధినేత జగన్ కు కానీ ఇప్పట్లో సాధ్యం కాదన్నది వాస్తవం. అయితే ఆ పరాజయం స్వయంకృతాపరాధమేనని కూడా చెప్పక తప్పదు. గత ఏడాది జరిగగిన ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత ఆ పార్టీ లో రాజకీయ శూన్యత నెలకొన్నట్లుగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అవకాశం లేని, ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడుతూ జగన్ అసెంబ్లీకి గైర్హాజరు అవ్వడానికి తీసుకున్న నిర్ణయాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు.  జగన్ అసెంబ్లీకి హాజరై సామాన్య ఎమ్మెల్యేగా కూర్చోవలసి రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే అవకాశం లేదని తెలిసీ ఆయన విపక్ష హోదా పేరు చెప్పి అసెంబ్లీకి ముఖం చాటేస్తున్నారు. తనతో పాటు తన పార్టీ ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీకి దూరంగా ఉంచుతున్నారు. ప్రజలు జగన్ ను పులివెందుల నియోజకవవర్గానికి తమ ప్రతినిథిగా ఓట్లేసి గెలిపించారు. రాజ్యాంగం ప్రకారం ఆయన అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలను లేవనెత్తడం ఆయన విధి. బాధ్యత. అయితే వ్యక్తిగత అహం, ఆభిజాత్యంతో జగన్ అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నారు. అయితే పైకి మాత్రం ప్రతిపక్ష హోదా అంటూ.. ప్రభుత్వం ఆ హోదా తనకు ఇవ్వడం లేదని ఆరోపణలు గుప్పిస్తూ ప్రజల సానుభూతి పొందాలని ప్రాకులా డుతున్నారు. సంఖ్యాబలం లేకుండా, హోదా లేకుండా సభకు వెడితే పరాభవంఎదురౌతుందన్న భయంతోనే ఆయన ఇలా వ్యవహరిస్తున్నారు. అంతే కానీ..వ్యక్తిగత ప్రతిష్ఠ కంటే సభకు హాజరై తనను ఎన్నుకున్న ప్రజల తరఫున గొంతు వినిపించాల్సిన కనీస బాధ్యతను విస్మరిస్తున్నారు. ఈ తీరు కారణంగానే ఆయన సొంత నియోజకవర్గ ప్రజలకు దూరమయ్యారని పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితం రుజువుచేసింది. వాస్తవానికి జగన్ అసెంబ్లీ గైర్హాజర్ నిర్ణయం ఆయన అవకాశవాదాన్నీ, బాధ్యతను స్వీకరించలేని దుర్బలత్వానికీ నిదర్శనంగా నిలుస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఉప ఎన్నికల భయం వైసీపీ అధినేత జగన్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలను వణికించేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ భయం వణుకుతోనే, ఆ డిస్పరేషన్ తోనే వైసీపీ నేతలు గతంలో చంద్రబాబు అసెంబ్లీని బాయ్ కాట్ చేయలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆయన నాడు అసెంబ్లీ బహిష్కరణ ప్రకటన చేసిన సందర్భం, సమయం పూర్తిగా వేరు. అయితే ఇప్పుడు జగన్, ఆయన పార్టీ సభ్యుల బహిష్కరణకు ఒక కారణం, ఒక విధానం, ఒక ప్రాతిపదిక అంటూ ఏమీ లేదు. ఉన్నదల్లా నిరాశ, నిస్ఫృహ మాత్రమే.  విశ్వసనీయ సమాచారం మేరకు వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజర్ ను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.  ఈ సారి సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరైతే వారిపై అనర్హత వేటు వేయాలన్న నిర్ణయానికి వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే పులివెందులకు సపోజ్ ఫర్ సపోజ్ ఉప ఎన్నిక వస్తే తెలుగుదేశం అభ్యర్థిని రెడీ చేసేసిందంటున్నారు. . అంటే వైసీపీ బాధ్యతల నుంచి పారిపోయి దాక్కోవాలని ప్రయత్నిస్తుంటే.. తెలుగుదేశం ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి సిద్ధమౌతోందని అవగతమౌతోంది.  

రాజారెడ్డి రాజ‌కీయ అరంగేట్రం

  ఎవ‌డు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు అనేది పోకిరీ డైలాగ్. అలాంటి పోరికీ డైలాగ్ క‌న్నా మించిన దృశ్యం ఒక‌టి సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. అదే వైయ‌స్ రాజారెడ్డి పొలిటిక‌ల్ ఎంట్రీ. ఎవ‌రీ రాజారెడ్డి.. ఏమా అంరంగేట్రం క‌థ‌.. క‌మామిషు అంటే.. రాజారెడ్డి మ‌రెవ‌రో కాదు, వైఎస్ ష‌ర్మిళ‌- అనిల్ కుమారుడు. ప్ర‌స్తుతం వైఎస్ ఫ్యామిలీలో జ‌గ‌న్ షర్మిళ‌గా రెండుగా చీలిన దృశ్యం చూస్తూనే ఉన్నాం. త‌న అన్న‌తో వేరు ప‌డ్డ ష‌ర్మిళ మొద‌ట వైయ‌స్ఆర్టీపీ అనే పార్టీని తెలంగాణ‌లో స్థాపించిన.. ఆ త‌ర్వాత త‌మ మాతృ పార్టీ కాంగ్రెస్ లో దాన్ని విలీనం చేసి అటు పిమ్మ‌ట 2024 ఎన్నిక‌ల్లో ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా ఎంట్రీ ఇచ్చారామె. ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాల్లో అన్న‌కు గుంట‌కు గుక్కెడు నీళ్లు తాగిస్తున్న ష‌ర్మిళ, త‌న డోస్ స‌రిపోవ‌డం లేద‌ని కొత్త‌గా ఓ ఆర‌డుగులు బుల్లెట్ ని త‌న అన్న గుండెల్లోకి నేరుగా దింపాల‌ని ట్రై చేస్తోంది. ఆ బుల్లెట్ పేరే వైయ‌స్ రాజారారెడ్డి జూనియ‌ర్. ఎస్. ఈ జూనియ‌ర్ రాజారెడ్డి దెబ్బ‌కు వైయ‌స్ జగ‌న్ కాకీ ఫ్యాంట్ త‌డిసిపోతోంద‌ట‌.. ఇటు భార‌తీరెడ్డి సైతం.. త‌న ప్ర‌య‌త్నాల‌న్నిటినీ తిప్పి కొట్ట‌డానికి వ‌స్తోన్న ఈ రాజారెడ్డి జూనియ‌ర్‌ను చూసి త‌ల ప‌ట్టుకుంటున్నార‌ట‌. కార‌ణ‌మేంటంటే.. జ‌గ‌న్ ద్వారా వైఎస్ ఫ్యామిలీ లెగ‌సీని మామ భాస్క‌ర్ రెడ్డి, బావ అవినాష్ తో క‌ల‌సి ఇటు వైపు తిప్పుకునే య‌త్నం చేస్తున్న భారతీరెడ్డికి రాజారెడ్డి అనే పేరుగ‌ల ఈ బుల్లెట్ లాంటి కుర్రోడు త‌ల్లి నీడ‌లో రాజ‌కీయంగా ఎదిగేందుకు అడుగుల వేస్తున్న దృశ్యం తెగ క‌ల‌వ‌ర పెడుతోంద‌ట‌. ఇప్ప‌టికే రాజారెడ్డిలో ఇటు బ్రాహ్మ‌ణ‌, అటు రెడ్డితో పాటు భార్య ద్వారా క‌మ్మ ర‌క్తం కూడా క‌ల‌గ‌ల‌సి ఉండ‌టంతో ఇతడు మూడుర‌క్తాల ముద్దుల బుల్లెట్ గా పేరు సాధిస్తున్నాడు. ఆపై రాన్రాను త‌ల్లి వెంట తిరిగి ఇక్క‌డి రాజ‌కీయాల‌కు అల‌వాటు ప‌డితే క‌ష్ట‌మే అన్న‌ది తాడేప‌ల్లి ప్యాలెస్ టాక్ గా తెలుస్తోంది. ఇప్ప‌టికే లోకేష్, ప‌వ‌న్ రూపంలో తీవ్ర రాజ‌కీయ అంత‌రాయం ఎదుర్కుంటోన్న జ‌గ‌న్ వ‌చ్చే రోజుల్లో త‌న‌కు సాటి రాగ‌ల రాజారెడ్డి కూడా ఎంట్రీ ఇస్తే.. ఆయ‌న పాతికేళ్ల ఆశ‌లు ఆవిర‌యిన‌ట్టుగానే ఫీల‌వుతున్నట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం త‌ల్లితో క‌ల‌సి.. రాజారెడ్డి క‌ర్నులు ఉల్లి యార్డు ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌బోతూ అమ్మ‌మ్మ విజ‌య‌మ్మ ఆశీర్వాదం తీస్కుంటున్న దృశ్యాలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయ్. రాజారెడ్డి రాజకీయ ఆరంగేట్రం త్వరలో ఉంటుందని షర్మిల ప్రకటన..వ‌చ్చే రోజుల్లో రాజారెడ్డి రాజ‌కీయంగా మ‌రింత రాటు దేలితే.. ఇక జ‌గ‌న్ కి మేన‌మామ‌గండం ఉన్న‌ట్టే అని భావిస్తున్నారు. అల‌నాడు శ్రీకృష్ణుడు త‌న మేన‌మామ కంసుడ్ని ఏ విధంగా తుద‌ముట్టించాడో.. ఈ జ‌గ‌న్ మామ‌ను రాజారెడ్డి అనే మేన‌ల్లుడు కూడా స‌రిగ్గా అలాగే రాజ‌కీయంగా నామ‌ రూపాల్లేకుండా చేస్తారా? అన్న ఉత్కంఠ చెల‌రేగుతోంది.  ఇప్ప‌టి వ‌ర‌కూ చంద్ర‌బాబును ముస‌లోడు ముస‌లోడంటోన్న జ‌గ‌న్.. లోకేష్- ప‌వ‌న్- రాజారెడ్డి త్ర‌యం ముందు ముస‌లోడు కాక త‌ప్ప‌దు. ఆపై మూల‌కు చేర‌కా త‌ప్ప‌ద‌న్న కామెంట్లు సైతం సామాజిక మాధ్య‌మాల్లో పేలుతున్నాయంటే ప‌రిస్థితేంటో అర్ధం చేసుకోవ‌చ్చు. మ‌రి చూడాలి జ‌గ‌న్ మామ రాజ‌కీయ ముఖ‌చిత్ర‌మేంటో అన్న కామెంట్లు సైతం వినిపిస్తున్నాయ్.

ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లో అదే కీల‌కం

ఎన్డీయే, ఇండియా కూట‌ములు ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు సంబంధించిన వ‌ర్క్ షాపులు, అవ‌గాహ‌న స‌ద‌స్సులు నిర్వహించాయి. వీటిలో ముఖ్యంగా గ‌మ‌నించాల్సింది ఏంటంటే.. మొద‌టి ప్రాధాన్య‌తా ఓటు త‌ప్ప‌నిస‌రి, రెండో ప్రాధాన్య‌తా ఓటు ఐచ్ఛికం. ఆ త‌ర్వాత ఈ ఓటింగ్ విధానంలో పాల్గొన‌డానికి ఒక ప్ర‌త్యేక‌మైన పెన్ను ఇస్తారు. దీని ద్వారా మాత్ర‌మే బ్యాలెట్ పేప‌ర్ పై గుర్తులు పెట్టాలి. ఇక బ్యాలెట్ పేప‌ర్ లో మొద‌టి పేరు కూట‌మి అభ్య‌ర్ధి జ‌స్టిస్ బి. సుద‌ర్శ‌న్ రెడ్డిది ఉండ‌గా.. రెండో పేరు ఎన్డీయే కూట‌మి అభ్య‌ర్ధి సీపీ రాధాకృష్ణ‌న్ పేరు ఉంటుంది. అందుకే బీజేపీ త‌న ఎంపీల‌తో పాటు ఎన్డీయే కూట‌మి ఎంపీల‌ను క‌లిపి జేపీ న‌డ్డా అధ్వ‌ర్యంలో  వేర్వేరు వ‌ర్క్ షాపులు నిర్వ‌హించింది. ఆ త‌ర్వాత ఇండియా కూట‌మి సైతం   మాక్ పోల్ నిర్వ‌హించింది. ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లో పాల్గొనే ఇండియా కూట‌మి పార్టీల ఎంపీల‌కు ఈ విష‌యంపై ఒక అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్న‌దే ఈ మాక్ పోల్ ముఖ్య ఉద్దేశం. ఇక మంగళవారం (సెప్టెంబ‌ర్ 9)  పోలింగ్  జరుగుతుంది. అదే రోజున ఫలితం కూడా వెలువడుతుంది. ఉభయ సభల్లో ఇప్ప‌టి వ‌ర‌కూ ఉన్న బ‌లాబ‌లాలు  చూస్తే ఎన్డీఏకి 422 సీట్ల బ‌లం ఉంది. ఇక ఇండియా కూట‌మికి 323 సీట్ల స‌పోర్ట్ ఉంది. ఆప్ కూడా త‌న 11 సీట్ల‌ను ఇండియా కూట‌మి అభ్య‌ర్ధికే ఇస్తోంది. దీంతో ఈ బ‌లం 334గా మారింది. చివ‌ర్లో కొన్ని త‌ట‌స్త పార్టీల ఎంపీలు ఇటు వైపు మొగ్గితే ఈ సంఖ్య కొంత పెరిగినా పెర‌గొచ్చు. అలాగ‌ని ఎన్డీఏ అభ్య‌ర్ధిని క్రాస్ చేయ‌గ‌లిగేంత కాదు. ఇప్ప‌టికే ఎన్డీయే అభ్య‌ర్ధి గెలుపు దాదాపు లాంఛ‌నం అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎందుకంటే విజయానికి అవసరమైన మేజిక్ ఫిగ‌ర్ 392 క‌న్నా ఎన్డీయే కూటమి సభ్యుల సంఖ్య ఎక్కువే ఉంది. దీంతో ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ విజయం నల్లేరు మీద బండినడకే అంటున్నారు.   ఇదిలా ఉంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలుగువాడైన సుద‌ర్శ‌న్ రెడ్డికి తెలుగు పార్టీల‌న్నీ క‌ల‌సి ఓట్లు వేయాల‌ని కోరింది. ఈ ఎన్నిక‌లో ఫ‌లానా అభ్య‌ర్ధికే ఓటు వేయాల‌ని ఎవ‌రూ విప్ జారీ చేయ‌రు కాబ‌ట్టి.. ఈ దిశ‌గా స్థానిక బీఆర్ఎస్, టీడీపీ, జ‌న‌సేన‌, వైసీపీల‌కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది మ‌రి చూడాలి.. ఏదైనా మేజిక్ జ‌రుగుతుందో లేదో?

మొన్న తుగ్ల‌క్.. నిన్న జ‌గ్ల‌క్.. నేడు ట్రంప్ల‌క్!

ఒక‌ప్పుడు తుగ్ల‌క్- ఆ త‌ర్వాత జ‌గ్ల‌క్- ఇప్పుడు ట్రంప్ల‌క్. ఏంటీ కొత్త పద ప్ర‌యోగాలంటారా?  మొన్న‌టి వ‌ర‌కూ నాటి తుగ్ల‌క్ వార‌సుడు జ‌గ‌న్ మాత్ర‌మేన‌ని అనుకున్నారు చాలా మంది. ఎందుకంటే ఆయ‌న ఒక‌టి  చెప్పి మ‌రొక‌టి చేస్తారు.  ఉదాహ‌ర‌ణ‌కు సినీ ప‌రిశ్ర‌మ‌ను ఏపీకి ఎలాగైనా ర‌ప్పించాల‌ని చెప్పి సినిమా వారితో చ‌ర్చ‌లు సాగిస్తే.. ఆ సినిమా ప‌రిశ్ర‌మ కాస్తా మ‌రో మూడ‌డుగులు వెన‌క్కు వెళ్ల‌డం మాత్ర‌మే  కాదు.. చిరంజీవిలాంటి హేమా హేమీలు చేతులు క‌ట్టుకుని అభ్య‌ర్ధించాల్సి వ‌చ్చింద‌న్న మెసేజ్ ప‌బ్లిక్ లోకి వెళ్లింది. చివ‌రికి ఎలాగైనా స‌రే చిత్ర ప‌రిశ్ర‌మ  ఏపీకి రావాల‌న్న కోణంలో రోజా భ‌ర్త ఆర్కే సెల్వ‌మ‌ణి ద్వారా కోలీవుడ్ ని ఒప్పించి.. త‌డ‌, దొర‌వారిస‌త్రం వంటి స‌రిహ‌ద్దు గ్రామాల్లో వారికి  విరివిగా భూములిస్తామ‌న్న ఆశ క‌ల్పించారు. ఆపై మ‌ద‌న‌ప‌ల్లి హార్స్ లీ హిల్స్ ద‌గ్గ‌ర యాత్ర ద‌ర్శ‌కుడు మ‌హి వీ రాఘ‌వ‌న్ కి భూములు ఇస్తార‌న్న టాక్ కూడా వినిపించింది.  ఎక్క‌డో పాత‌బ‌డ్డ నాటు తుపాకీలాంటి విజ‌య్ చంద‌ర్, ఆపై నోటు దురుసు ఎక్కువ‌గా ఉండే పోసాని, పదవి ఆశచూపిఆలీ వంటి వారిని పోగేసి.. ఇక్క‌డ సినిమా ప‌రిశ్ర‌మ రావాల‌న్న కోణంలో పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నాలు సాగించారు. కానీ అది ఎంత మాత్రం సాధ్య ప‌డ‌లేదు స‌రిక‌దా రివర్స్ అయ్యింది. నిజంగా సినిమా వారినంటూ అంత‌గా ఆహ్వానించాలంటే అందుకు త‌గిన కుటుంబాల నుంచి కొంద‌ర్ని ఎంపిక చేయాలి..  వారికంటూ మంచి మంచి సినిమా ప‌ద‌వులు ఇవ్వాలి..  ఆపై ఎప్ప‌టి  నుంచో పెండింగ్ లో ఉన్న నంది అవార్డులును ఇచ్చి స‌త్క‌రించాలి. ఇంకా టికెట్ల ధ‌ర‌ల విష‌యంలో స‌ర‌ళీకృత విధానాల‌ను ప్ర‌వేశ పెట్టి వారి మ‌న‌సు చూర‌గొనాలి.  ఇలా  ఎన్నో మార్గాలుండ‌గా వాట‌న్నిటినీ వ‌దిలి పెట్టి జ‌గ‌న్ త‌న‌దైన ఫ్యాక్ష‌న్ పాలిట్రిక్స్ తో సినిమా వారిని భ‌య పెట్టాల‌ని చూశారు. బేసిగ్గా సినిమా వాళ్లు ఎక్క‌డుంటారంటే, పాల‌నా ప‌రంగా మంచి, మ‌ర్యాద మ‌న్న‌న‌, ఆపై కూల్ వెద‌ర్ ఎక్కువ‌గా ఉండే ప్రాంతాల్లో ఉండ‌టానికి ఇష్ట‌ప‌డ‌తారు. వారిని అంత స‌జావుగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అదే జ‌గ‌న్ ఏం చేశారు. త‌న అనుభ‌వ రాహిత్యంతో పాయింట్ బ్లాంక్ లో గ‌న్ను పెట్టి అర‌వై నాలుగు క‌ళ‌లు ప్ర‌ద‌ర్శించ‌మంటే ఎలా సాధ్యం కాదో స‌రిగ్గా అలాగే బిహేవ్ చేశారు. చివ‌రికి ఏమైందంటే.. జ‌గ‌న్ని వెళ్లి మేం క‌ల‌వ‌డ‌మా? వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఎలాగూ ఆయన ఓడిపోతారు.. మారిన ముఖ్య‌మంత్రిని వెళ్లి క‌లుద్దాంలే.. అంటూ నిర్మాత‌ల మండ‌లి భావించేంతగా వారిని  హ‌డ‌లెత్తించారు. ఇప్పుడు తుగ్ల‌క్ మ‌రో వార‌సుడు ట్రంప్ల‌క్ విష‌యానికి  వ‌ద్దాం.. ఇత‌గాడు ఎంత‌టి ఘ‌నుడంటే.. మార్క్ జుక‌ర్ బ‌ర్గ్, టిమ్ కుక్ ని అటుంచితే.. అక్క‌డికి వ‌చ్చిన స‌త్యానాదెళ్ల‌, సుంద‌ర్ పిచాయ్ వంటి వారికి ఇక్క‌డ ఉద్యోగాలు వ‌ద్ద‌ని చెప్పేంత పిచ్చితనం ఉంది ఆయనకు . మ‌ళ్లీ వాళ్ల‌నే ఎదురు కూర్చోబెట్టి.. అమెరికాలో మీరెంత పెట్టుబ‌డులు పెడ‌తార‌ని అడుగుతారు. భార‌తీయ వ‌స్తువులు వ‌ద్దు, భార‌తీయ వ్య‌క్తులు వారి వారి మేద‌స్సులు వ‌ద్దు వ‌ద్దంటూనే వారినే ఎదుట కూర్చోబెట్టి మీ బిజినెస్ ప్లాన్స్ ఎలా ఉన్నాయ్.. అమెరికాలో ఎంత‌లేసి పెట్టుబ‌డులు పెడ‌తార‌ని అడ‌గ‌టం.. క‌రెక్టేనా? అన్న‌ది ఒక ప్ర‌శ్న కాగా.. ఇప్ప‌టి వ‌ర‌కూ ట్రంప్ ఎలాంటి వ్యాపారం చేశారో తెలీదు కానీ.. ఈ భ‌య‌పెట్టి, బ్లాక్ మెయిల్ చేసి, రాంగ్ కామెంట్లు గుప్పించి.. వారి చేత మొండిగా పెట్టుబ‌డులు పెట్టించ‌డం అన్న‌ది క‌రెక్టేనా? అని ట్రంప్ త‌న‌కు తాను ఎందుకు చెక్ చేసుకోరు? ఇందుకేగా ఇత‌డ్ని తుగ్ల‌క్ వార‌సుడ‌న్న‌ది అంటున్నారు చాలా మంది. భార‌త్ పై  అద‌న‌పు సుంకాల‌ను వేసి.. ఆపై వార్ని తాము చైనాకు కోల్పోతున్నామ‌ని బాధ ప‌డుతూ.. త‌ర్వాత సారీ చెప్పి మీరు మ‌ళ్లీ అమెరికాకు ఎగుమ‌తులు చేసుకోవ‌చ్చ‌ని.. ఇలా  ర‌క‌ర‌కాల వేషాలు.. కేవ‌లం తుగ్ల‌క్ పూనిన వారికి మాత్ర‌మే సాధ్యం అన్న‌ది చాలా మంది అంటోన్న మాట‌. మ‌రి మీరేమంటారు?

ఉప రాష్ట్రపతి ఎన్నిక.. ఓటింగ్ కు బీఆర్ఎస్ దూరం?

తెలంగాణ రాజకీయ యవనిక నుంచి బీఆర్ఎస్ క్రమంగా కనుమరుగౌతోందా? రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో ఆ పార్టీ తడబాటే అందుకు నిదర్శనమా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. మాటల మాంత్రికుడిగా, అపర చాణక్యుడిగా పదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారం చలాయించి తిరుగులేని నేతగా గుర్తింపు పొందిన బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక్క ఓటమి.. అధికారం దూరం కావడంతో రాజకీయంగా క్రియాశీల పాత్రపోషించడానికి ముందు వెనుకలాడుతున్నారు. పొలిటికల్ డెసిషన్స్ తీసుకునే విషయంలో తడబాటుకు గురౌతున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కే పరిమితమై.. ఎంపిక చేసుకున్న నాయకులతో మంతనాలకే పరిమితమౌతున్నారు. ఈ  పరిస్థితుల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కవిత ఎపిసోడ్ లో కూడా ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వినా మరేం చేయలేక మౌనం వహించడమే ఇందుకు నిదర్శనమంటున్నారు.  ఇక  మంగళవారం (సెప్టెంబర్ 9)న జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నిక విషయంలో కూడా ఎటువైపు అన్న నిర్ణయం తీసుకోలేక మొత్తంగా  ఓటింగ్ కు దూరం కావాలని కేసీఆర్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు  ఉప రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఓటింగ్ కు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.  ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఓటింగ్ కు దూరంగా ఉండాలన్న సూత్రప్రాయ నిర్ణయానికి బీఆర్ఎస్ వచ్చినట్లు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మరి కొద్ది మంది నాయకులతో మంతనాలు జరిపిన కేసీఆర్.. ఉప రాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్ కు పార్టీ సభ్యులు దూరంగా ఉండాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.   తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుత పరిస్థితుల్లో  ఇటు ఎన్డీయేకు లేదా అటు ఇండియా కూటమికి ఎవరికి మద్దతు ఇచ్చినా రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు తప్పవని  భావించిన బీఆర్ఎస్ అగ్రనాయకత్వం ఓటింగ్ కు దూరంగా ఉండడమే మేలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.   అదే ఇప్పుడు బీఆర్ఎస్ రాజకీయంగా నిర్ణయాలు తీసుకునే విషయంలో తబడాటుకు గురౌతోందన్న పరిశీలకులు విశ్లేషణలకు కారణమైంది. 

హస్తినకు లోకేష్.. ఉపరాష్ట్రపతి ఎన్నికలో రాష్ట్ర ఎంపీలకు మార్గదర్శనం?

లోకేష్ ప్రాధాన్యత ఇటు రాష్ట్రంలో.. అటు కేంద్రంలో రోజురోజుకూ పెరిగుతున్నది. ఇక ఇప్పుడు కేంద్రంలో లోకేష్ చక్రం తిప్పడానికి స్వయంగా చంద్రబాబే ఆమోదం తెలిపేశారు. తన స్థానంలో లోకేష్ ను ఉప రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా తెలుగుదేశం ఎంపీలకు మార్గదర్శనం చేసి, వారు ఎన్డీయూ కూటమి అభ్యర్థికే ఓటు వేసేలా పర్యవేక్షణ చేయడానికి లోకేష్ ను హస్తినకు పంపుతున్నారు. లోకేష్ ఢిల్లీలో సోమవారం (సెప్టెంబర్ 8) సాయంత్రం తెలుగుదేశం, జనసేన ఎంపీలతో భేటీ అవుతారు. వారంతా ఎన్డీయే అభ్యర్థికే ఓటు వేసేలా పర్యవేక్షించడంతో పాటు వారికి అందుకు అనుగుణంగా శిక్షణ కూడా ఇస్తారు.   పర్యవేక్షణ, శిక్షణ ఎందుకంటే.. ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేసే విధానం ఒకింత భిన్నంగా ఉంటుంది. అందుకే తెలుగుదేశం, జనసేన ఎంపీలకు ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఓటువేసే విధానంపై అవగాహన కల్పించడంతో పాటు, శిక్షణ కూడా ఇవ్వాలన్న చంద్రబాబు సూచన మేరకు లోకేష్ ఆ బాధ్యతన భుజస్కంధాలపై వేసుకున్నారు. ఇక సోమవారం (సెప్టెంబర్ 8) రాత్రి హస్తినలోనే బస చేసి.. మంగళవారం (సెప్టెంబర్ 9) ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియను పరిశీలిస్తారు. ఈ మేరకు తెలుగుదేశంపార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు టీడీపీ ఎంపీలకు సమాచారం ఇచ్చారు.  వాస్తవానికి సీఎం చంద్రబాబే స్వయంగా ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. అయితే బుధవారం ( సెప్టెంబర్ 10) అనంతపురంలో నిర్వహించే సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమంలో పాల్గొనాల్సిన నేపథ్యంలో చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుని బదులుగా నారా లోకేష్‌ను పంపిస్తున్నారు. 

సుప్రీం కోర్టులో తెలంగాణ బీజేపీకి చుక్కెదురు

తెలంగాణ బీజేపీకి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కొత్తగూడెం సభలో రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీజేపీ ప్రతిష్ఠను దెబ్బతీశాయని ఆరోపిస్తూ ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు గతేడాది హైదరాబాద్‌ ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని రేవంత్‌రెడ్డి అప్పట్లో తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై కోర్టు ప్రజాప్రాతినిధ్య చట్టం కింద కేసు కొనసాగుతుందని తెలిపింది. దీనిపై రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ ప్రసంగాలు అతిశయోక్తులతో ఉండేవేనని, వాటిని పరువు నష్టంగా పరిగణించలేమంటూ ట్రయల్‌ కోర్టు ఆదేశాలను హైకోర్టు రద్దు చేసింది. అయితే హైకోర్టు తీర్పును బీజేపీ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. బీజేపీ సుప్రీంకోర్టులో వేసిన పరువు నష్టం పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా పిటిషనర్ ను రాజకీయ పోరాటాలకు కోర్టును వేదిక చేసుకోవద్దంటూ మందలించింది. 

సినిమా ప్రమోషన్ కు అధికార యంత్రాంగం దుర్వినియోగం.. పవన్ పై మాజీ ఐఏఎస్ పిటిషన్ పై విచారణ 8న

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై 8న విచారించనున్నట్లు హైకోర్టు పేర్కొంది. తన సినిమా ప్రమోషన్ కు అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారనీ, మంత్రిగా కొనసాగుతూ సినిమాలు చేస్తున్నారనీ పేర్కొంటూ, ఆయనపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గత నెల 19న పిటిషన్ దాఖలు చేశారు.    ప్రభుత్వ భద్రతా సిబ్బంది, అధికారిక వాహనాలు, ఇతర వనరులను సినిమా కార్యక్రమాలకు వినియోగించడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుంద‌ని విజయ్ కుమార్ తన  పిటిష‌న్‌లో పేర్కొన్నారు. ఉపముఖ్యమంత్రి సినిమాల్లో నటన కొనసాగించడాన్ని అనైతికం, రాజ్యాంగవిరుద్ధమై చర్యగా ప్రకటించాలని ఆ పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్   గ‌త నెల‌లో హైకోర్టు ముందు విచారణకు వచ్చింది.  విచారణ సందర్భంగా రాష్ట్ర హోంశాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది జయంతి , ఉపముఖ్యమంత్రిని వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చడంపై అభ్యంతరం తెలిపారు. వ్యాజ్యం మొదటిసారి విచారణకు వచ్చిందని, అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు వినిపిస్తారన్నారు. వ్యాజ్యాన్ని పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్‌ జోతిర్మయి ప్రతాప సీబీఐ, ఏసీబీ తరపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల పేర్లను కేసుల విచారణ జాబితాలో (కాజ్‌లిస్ట్‌) పేర్కొనకపోవడాన్ని తప్పుపట్టారు. వారి పేర్లను చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను  వాయిదా వేశారు.  ఈ పిటిషన్ పై మ‌రోసారి హైకోర్టులో వాద‌న‌లు జ‌రుగ‌గా..ఈ కేసును సోమవారం (సెప్టెంబర్  8) విచారిస్తామ‌ని హైకోర్టు ప్ర‌క‌టించింది.  దీంతో ఈ కేసు విచారణ పట్ల సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  

జపాన్‌ ప్రధాని రాజీనామా...ఎందుకంటే?

  జపాన్  దేశ ప్రధాన మంత్రి షిగెరు ఇషిబా రాజీనామా చేశారు. జులైలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో  లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ కూటమి పరాజయం చెందింది. దీనికి బాధ్యత వహించాలంటూ సొంత పార్టీ నేతల నుంచి ఇటీవల ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ఇషిబా తన పదవికి రాజీనామా చేశారు. అంతర్గత విభేదాలకు స్వస్తి పలికేందుకు  షిగెరు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచరం. అక్టోబర్‌లో జపాన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ ఏడాది జూలైలో జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్‌ ఎగువసభలో అధికార సంకీర్ణ సర్కారు మెజారిటీని సాధించలేకపోయింది.  అంతకుముందు దిగువ సభలోనూ మెజారిటీ కోల్పోయింది. దాంతో సొంత పార్టీ సభ్యుల నుంచి ప్రధానిపై ఒత్తిడి పెరిగింది.ఈ నేపథ్యంలో పార్టీ నాయకత్వ మార్పు కోసం ముందస్తు ఎన్నికలు నిర్వహించాలా? వద్దా? అనే అంశంపై సెప్టెంబర్‌ 8న చర్చించి నిర్ణయం తీసుకునేందుకు లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే మీడియా సమావేశం నిర్వహించిన ఇషిబా.. ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. పార్టీకి ప్రత్యామ్నాయ నేతను ఎన్నుకునేందుకుగాను ఎన్నికలు నిర్వహించే ప్రక్రియను మొదలు పెడుతున్నట్లు చెప్పారు.  

త్యాగానికి తగిన గుర్తింపు.. పిఠాపురం వర్మ ఎదురు చూపులు ఫలించనున్నాయా?

ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా... ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి అంత భారీ మెజారిటీతో గెలిచారంటే అందుకుర  ఆ నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జ్ చేసిన త్యాగం ఒక ప్రధాన కారణం. ఈ విషయంలో ఎటువంటి సందేహానికీ తావు లేదు.  అయితే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరిన తరువాత నియోజకవర్గంలో పరిస్థితి మారింది.  గత ఎన్నికలలో జనసేనాని పవన్ కల్యాణ్ కోసం తన పిఠాపురం సీటును త్యాగం చేసి, ఆయన విజయం కోసం కృషి చేసిన వర్మకు నియోజకవర్గంలో అవమానాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా జనసేనలో వైసీపీయుల చేరికలు వర్మకు  వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యేలా చేశాయి. గత ఎన్నికల సందర్భంగా వర్మ త్యాగానికి కచ్చితంగా తగిన గుర్తింపు ఇస్తాననీ, ఎమ్మెల్సీ పదవిని కట్టబుబతానని తెలుగుదేశం  అధినేత చంద్రబాబు  అప్పట్లో పిఠాపురం వర్మకు స్పష్టమైన హామీ ఇచ్చారు. అయితే.. అది ఇప్పటికీ కార్యరూపం  దాల్చ లేదు. అయినా వర్మ నమ్ముకున్న పార్టీని అంటిపెట్టుకుని, తన అసహనాన్నీ, అసంతృప్తినీ బయటపెట్టకుండా ఓపికగా ఎదురు చూశారు. మరో వైపు నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా జనసేన వైసీపీ వారిని పార్టీలోకి చేర్చుకుంటూ ఆయనను ఇబ్బందులకు గురి చేసినా ఓర్చుకున్నారు.   ఆ ఓర్పుకు, సహనానికి ఇప్పుడు ప్రతిఫలం లభించనుందని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. అతి త్వరలో పిఠాపురం వర్మకు కీలక పదవి లభించే అవకాశాలున్నాయని అంటున్నారు. వర్మకు తాజాగా ఇద్దరు గన్ మెన్ లను కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఇందుకు తార్కానమంటున్నారు.   మూమూలుగా అయితే ఏదో ఒక చట్ట సభలో సభ్యుడిగా ఉన్నవారికి మాత్రమే గన్ మెన్లను కేటాయించడం  రివాజు. అలా కాకపోతే.. సంఘ విద్రోహక శక్తులు, అంటే నక్సలైట్లు, ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉన్నవారికి గన్ మెన్లను కేటాయిస్తారు. కానీ అయితే పిఠాపురం వర్మ ప్రస్తుతం చట్టసభ  సభ్యుడు కారు. ఆయనకు నక్సలైట్లు, ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి లేదు. అయినా మాజీ ఎమ్మెల్యే పిఠాపురం వర్మకు ప్రభుత్వం ఇద్దరు గన్మెన్లను కేటాయించడం ఆయనకు త్వరలో కీలక పదవి దక్కబోతోందనడానికి తార్కానంగా చెబుతున్నారు పరిశీలకులు. ఆయనకు కేటాయించిన గన్ మెన్లు విధుల్లో చేరడం కూడా జరిగిపోయింది. ఇప్పుడు తెలుగుదేశం వర్గాలు, వర్మ అభిమానులలో జరుగుతున్న చర్చ  ఏమిటంటే..  వర్మను ఎమ్మెల్సీగా చేసి చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడమే కాకుండా, కేబినెట్ లోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇందుకు ఆధారంగా వారు ఇటీవల పిఠాపురం వర్మ ఉండవల్లిలో చంద్రబాబుతో భేటీ అయ్యారనీ, ఆ భేటీ తరువాతే ఆయనకు ప్రభుత్వం గన్ మెన్లను కేటాయించిందనీ అంటున్నారు. అలాగే పిఠాపురం వర్మ త్యాగానికి  తగిన గుర్తింపు, పదవి ఇవ్వాలని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా భావిస్తున్నారనీ అంటున్నారు.  చూడాలి మరి వర్మకు దక్కనున్న పదవి ఏమిటో?

కవిత ఆరోపణల తర్వాత కేసీఆర్‌తో హరీశ్ రావు భేటీ

  మాజీ మంత్రి హరీశ్ రావు  లండన్ నుంచి తిరిగివచ్చిన ఆయన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. తనపై వచ్చిన ఆరోపణల విషయంలో హరీశ్ రావు, కేసీఆర్‌కు పూర్తి వివరణ ఇచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ వివాదంలో బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా హరీశ్‌రావుకు మద్దతుగా నిలవడం గమనార్హం. పార్టీ సోషల్ మీడియా ఖాతాల ద్వారా హరీశ్‌రావుకు బాసటగా పోస్టులు పెట్టడంతో ఈ వ్యవహారంలో కేసీఆర్ మద్దతు ఆయనకే ఉందనే ప్రచారం జరుగుతోంది.  ఈ పరిణామాల మధ్య కేసీఆర్, హరీశ్ రావు భేటీపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కేటీఆర్ కూడా అక్కడే ఉండటంతో ముగ్గురూ సమావేశం అయ్యారు. కవిత ఇటీవల హరీశ్‌రావుతో పాటు ఎంపీ సంతోష్‌రావుపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వారిద్దరూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో టచ్‌లో ఉన్నారని, కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చి పార్టీని తమ చేతుల్లోకి తీసుకునేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఈ కామెంట్స్ పట్లా బీఆర్‌ఎస్ పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.  

గైర్హాజరే జగన్ నిర్ణయం.. వైసీపీ ఎమ్మెలేలు శిరసావహిస్తారా అన్నదే అనుమానం?!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఎన్నిరోజులు జరుగుతాయి అన్నదానిపై క్లారిటీ అయితే ఇంకా రాలేదు కానీ, వారం రోజుల పాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుగుదేశం కూటమి వర్గాల ద్వారా తెలుస్తోంది. అయినా అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలి అన్న విషయాన్ని పక్కన పెడితే.. ఈ సారైనా వైసీపీ సభ్యులు, ముఖ్యంగా జగన్ హాజరౌతారా లేదా అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ, ఆసక్తి నెలకొని ఉంది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి 15 నెలలు అయ్యింది. ఈ కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాలకు ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన లభిస్తోంది.  అది పక్కన పెడితే.. చంద్రబాబు వైసీపీ అధినేత జగన్ కు ఓ సవాల్ విసిరారు.. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు సిద్ధమా అన్నదే ఆ సవాల్. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడుతూ, అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్న వైసీపీ సభ్యులపై అనర్హత వేటు వేలాడుతోందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి కూడా అసెంబ్లీకి గైర్హాజర్ అవ్వాలన్న నిర్ణయం తీసుకుంటే.. జగన్ పై వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు తిరుగుబాటు చేసైనా సరే సభకు హాజరు అవ్వాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అన్నిటికీ మించి జగన్ స్వయంగా పులివెందులలో ఉప ఎన్నికను ఎదుర్కొంటే పరాభవం తప్పదన్న భయంలో ఉన్నారన్న ప్రచారం సైతం సాగుతోంది. పులివెందుల తెలుగుదేశం ఇన్ చార్జ్ బీటెక్ రవి అయితే ఒక అడుగు ముందుకు వేసి పులివెందులలో ఉప ఎన్నికను స్వాగతిస్తున్నానని కూడా ప్రకటించేశారు. ఈ నేపథ్యంలో అనివార్యంగా.. అంటే కనీసం శాసనసభ సభ్యత్వాలను కాపాడుకుందుకైనా వైసీపీ అసెంబ్లీకి హాజరు కావడానికి నిర్ణయం తీసుకుంటుందని పరిశీలకులు భావించారు. అయితే జగన్ మాత్రం అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకున్నారు. జగన్ ఇటీవల వైసీపీ నేతలతో జరిపిన సమావేశంలో హోదా లేకుండా సభకు వెళ్లడం వల్ల ప్రయోజనం లేదని వ్యాఖ్యానించారు.  జగన్ ఈ నిర్ణయం పట్ల పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది.  ఏది ఏమైనా అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరే వైసీపీ విధానమని జగన్ కుండబద్దలు కొట్టేయడంతో.. ఇప్పుడు ఆయన కాకుండా వైసీపీకి చెందిన మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలలో ఎందరు ఆయన నిర్ణయాన్ని సమర్ధించి సభకు హాజరౌతారు? ఎందరు గైర్హాజరౌతారు అన్న విషయంపై రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున  చర్చ జరుగుతోంది. ఇక  రాజ్యాంగం ప్రకారం స్పీకర్ కు, సభకు సమాచారం ఇవ్వకుండా అరవై పని దినాలు సభకు హాజరు కాకపోతే అనర్హత వేటు వేయవచ్చు. అసెంబ్లీలో ప్రమాణం చేసిన తర్వాత వైసీపీ సభ్యులు హాజరు కాలేదు. ఒక్క రోజు హాజరు వేయించుకోవడానికి గవర్నర్ ప్రసంగానికి వచ్చారు కానీ.. అది ఉభయ సభల సంయుక్త సమావేశం కావడంతో  ఆ హాజరు చెల్లదని తేలింది.  ఆ తరువాత తర్వాత కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు రహస్యంగా అసెంబ్లీకి వచ్చి సంతకాలు పెట్టేసి జారుకున్నారు. ఈ విషయం స్పీకర్ దృష్టికి రావడంతో దానిపై సీరియస్ అయిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు.. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా సంతకాలు పెట్టి వెళ్లిన విషయం తన దృష్టికొచ్చిందని సభలోనే ప్రకటించి అవన్నీ దొంగ సంతకాలంటూ రూలింగ్ ఇచ్చారు. దీంతో తాము దొంగచాటుగా వెళ్లి పెట్టిన సంతకాలు కూడా చెల్లవా? ఈ సారి సభకు హాజరు కాకపోతే అనర్హత వేటు తప్పదా? అన్న భయం వైసీపీ ఎమ్మెల్యేలలో వ్యక్తం అవుతోంది. అందుకే పార్టీ అధినేత ఆదేశాలను ధిక్కిరించైనా అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  అనర్హత వేటు కోసం భయం వద్దు సభ జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాలలో పర్యటించడం, ప్రభుత్వ తీరును ఎండగట్టడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని జగన్ చేసిన దిశానిర్దేశం వైసీపీ ఎమ్మెల్యేలకు అంతగా రుచించడం లేదంటున్నారు.   ఇంత కాలం వైసీపీ ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరైనా.. తమతమ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలపై ప్రశ్నలను సభకు పంపారు. అయితే ఈసారి అలా కుదరదని స్పీకర్ అయ్యన్నపాత్రులు స్పష్టం చేశారు.  సభకు రాకుండా ప్రశ్నలు  అడిగితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రశ్నలకు సభలో సమాధానం ఇవ్వరు. దీంతో అసలు వైసీపీ వాయిసే వినబడని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక అనర్హత వేటు పడితే... ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ టికెట్ పై విజయం సాధించడం సాధ్యం కాదన్న భయం కూడా వైసీపీ ఎమ్మెల్యేలలో వ్యక్తం అవుతున్నది. చూడాలి మరి ఈ సారి జగన్ గైర్హాజర్ నిర్ణయానికి ఆయన పార్టీ ఎమ్మెల్యేలు కట్టుబడి ఉంటారో లేదో?

తాడిపత్రి లోకి ప్రవేశించిన పెద్దారెడ్డి

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి పోలీసు రక్షణ మధ్య శనివారం (సెప్టెంబర్ 6) తాడిపత్రికి చేరుకున్నారు. తాడిపత్రిలో తన భద్రతకు అయ్యే వ్యయం తానే భరిస్తానని  పెద్దారెడ్డి దేశ సర్వోన్నత న్యాయస్థానానికి హామీ ఇచ్చి మరీ తాడిపత్రి ఎంటీకి అనుమతి పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే  మూడు వందల పోలీసులల భద్రతతో ఆయన తాడిపత్రిలో ఎంటర్ అయ్యారు.  వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో  తాడిపత్రిలో పెద్దారెడ్డి , ఆయన అనచరులు చేసిన దాడులు, దౌర్జన్యాల కారణంగా తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ఆ కారణంగానే ఎన్నికలలో పరాజయం తరువాత ఆయన తాడిపత్రిలోకి అడుగుపెట్టే అవకాశం కూడా లేకపోయింది. ఎన్నికలలో ఓటమి తరువాత ఓ సారి రహస్యంగా తాడిపత్రిలో అడుగుపెట్టినప్పటికీ, వెంటనే పోలీసులు ఆయనను బయటకు తీసుకువెళ్లారు.  ఆ తరువాత ఆయన ఎన్నిసార్లు ప్రయత్నించినా తాడిపత్రిలో మాత్రం అడుగుపెట్టలేకపోయారు. భద్రతా కారణాల దృష్ట్యా పెద్దారెడ్డి తాడిపత్రి ఎంట్రీకి హైకోర్టు కూడా అనుమతి నిరాకరించడంతో ఆయన సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఆయన పిటిషన్ విచారణ సందర్భంగా పోలీసులు భద్రతా సమస్యలు అని చెప్పడంతో..  తన భద్రతకు అయ్యే వ్యయం అంతా తానే భరిస్తానని పెద్దారెడ్డి సుప్రీం కోర్టుకు తెలిపారు.  ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు పెద్దారెడ్డి తాడిపత్రి ఎంట్రీకి అనుమతి ఇచ్చింది. దీంతో దాదాపు 15 నెలల తరువాత  మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెట్టగలిగారు.   ఈ 15 నెలలలో జరిగినదేమిటన్నది ఒక్కసారి చూస్తే.. పంతాలు పట్టింపులు ఎంత కష్టనష్టాలు కలిగిస్తాయో తాడిపత్రి ఘటన చూస్తున్నాం.ఇటీవల  మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ని తాడిపత్రిలోకి రాకుండా మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి అడ్డుకున్నారు. ఆ ఇరు కుటుంబాల మధ్య ఉన్న వివాదం ఈ పరిస్థితికి కారణం అయింది… ఏడాది కిందట ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి కూటమి పాలన ఏర్పడింది. అప్పటి నుంచి సుమారు 15 నెలలుగా పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రాకుండా మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి అడ్డుకుంటున్నారు. పోలీసులు కూడా శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా పెద్దారెడ్డికి అనుమతి నిరాకరించారు. దీంతో పెద్దారెడ్డి చేసేది ఏమీలేక  హైకోర్టును ఆశ్రయించి తాడిపత్రిలోకి  ప్రవేశించేందుకు అనుమతి పొందారు . ఆ తరువాత పెద్దారెడ్డి పోలీసులకు సమాచారం ఇచ్చి తాడిపత్రిలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. కోర్టు అనుమతి ఉన్నప్పటికీ  స్థానికంగా తెలుగుదేశం కార్యకర్తలు జెసి అభిమానులు, ప్రజలు పెద్దారెడ్డిని తాడిపత్రిలో ప్రవేశించకుండా అడ్డుకున్నారు. పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చే రోజునే జేసీ ప్రభాకరరెడ్డి అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్బంగా తాడిపత్రి కి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. ఇరువర్గాలను అదుపు చేసేందుకు పోలీసులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. చివరికి పోలీసులే కోర్టును ఆశ్రయించి శాంతిభద్రతల సమస్య ఉందని పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించ వద్ధని కోరారు. దీనికి కోర్టు కూడా సమ్మతి  తెలిపింది. దీంతో చేసేది ఏమీ లేక పెద్దారెడ్డి తాడిపత్రిలో ప్రవేశించకుండా  వెనుతిరిగారు. పెద్దారెడ్డి ఎలాగైనా తాడిపత్రిలోకి ప్రవేశించాలని పట్టుదలతో  సుప్రీంకోర్టును ఆశ్రయించి  అనుమతి పొందారు. కోర్టు కూడా పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి ప్రవేశించేందుకు అవసరమైన భద్రతను కల్పించాలని పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు శనివారం పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించారు.  ఈ సందర్బంగా  ఎటువంటి శాంతి భద్రత సమస్య ఎదురుగా కాకుండా భారీగా  పోలీసులను రంగంలోకి దింపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దీంతో పెద్దారెడ్డి సుమారు 15 నెలల తర్వాత తాడిపత్రిలోకి ప్రవేశించారు. ఎడాదిపైగా తాడిపత్రి కి దూరంగా ఉన్న పెద్దారెడ్డి ఎట్టకేలకు తన సొంత ఇంటికి చేరుకున్నారు. పెద్దారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాడిపత్రిలోకి అనుమతించలేదని హెచ్చరించిన జేసి ప్రభాకర్ రెడ్డి కూడా పరిస్థితులకు  అనుగుణంగా మౌనం దాల్చారు.  ఇంకా కొంత కాలం నియోజకవర్గానికి దూరంగా ఉంటే రాజకీయ మనుగడే ప్రశ్నార్థకమౌతుందన్న భయంతోనే పెద్దారెడ్డి తాడిపత్రి ఎంట్రీ కోసం పట్టుపట్టారని చెప్పాల్సి ఉంటుంది.  గత 15 నెలలుగా నియోజకవర్గానికి దూరంగా ఉంటుండటంతో తాడిపత్రిలో వైసీపీ ఇన్ చార్జిగా మరో వ్యక్తిని నియమించాలని జగన్ యోచిస్తున్నట్లు తెలియడంతో పెద్దారెడ్డి తనకు కల్పించే పోలీసు భద్రతకు అయ్యే వ్యయం భరిస్తానని చెప్పి మరీ నియోజకవర్గంలోకి అడుగుపెట్టడానికి కోర్టు అనుమతి పొందారు. ఇంత కష్టపడి తాడిపత్రిలోకి ఎంట్రీ ఇచ్చినా నియోజకవర్గంలో ఆయన రాజకీయం చేయగలిగే పరిస్థితి ఉంటుందా అంటే పరిశీలకులు అనుమానమే అంటున్నారు. 

ఏపీ లిక్కర్ స్కామ్ నిందితుడు మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో అరెస్టై రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ మిథున్ రెడ్డికి స్వల్ప ఊరట లభించింది. విజయవాడలోని ఏసీబీ కోర్టు ఆయనకు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. ఈ నెల 9న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎంపీగా తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి మధ్యంతర బెయిలు మంజూరు చేయాల్సిందిగా ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్  విచారించిన ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిలు మంజూరు  చేసింది. ఈ నెల 11న తిరిగి సరెండర్ కావాలని ఆదేశిస్తూ మిథున్ రెడ్డికి ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేయడానికి అవకాశం కల్పిస్తూ మధ్యంతర బెయిలు మంజూరు చేసింది.  

టీచ‌ర్ కాబోయి పొలిటీషియ‌న్ అయిన చంద్రబాబు?

కూట‌మి ప్ర‌భుత్వం శుక్రవారంసెప్టెంబ‌ర్ 5న గురుపూజోత్స‌వం నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా రాధాకృష్ణ‌న్ గురించి మాట్లాడిన చంద్రబాబు ఆయ‌న మా జిల్లాలోని రేణిగుంట స్కూల్లో ప‌ని చేసిన‌ట్టు  విన్నాన‌ని అన్నారు. ఆపై ఏయూకి వైస్ ఛాన్స్ ల‌ర్ గా ఆపై ఉప‌రాష్ట్ర‌ప‌తి, రాష్ట్ర‌ప‌తిగా సేవ‌లందించార‌ని అల‌నాటి జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకున్నారు. ఇక ప‌నిలో ప‌నిగా త‌న కుమారుడు లోకేష్ చ‌దువు సంధ్యలు ఎలా సాగాయో కూడా చెప్పుకొచ్చారు చంద్ర‌బాబు. త‌న కుమారుడు మొద‌ట ఎలా ఉండేవారు. ఇప్పుడు ఎలా ఉన్నార‌న్న కామెంట్ చేశారు. మాములుగా అయితే రాజ‌కీయ నాయ‌కుల పిల్ల‌లు పెద్ద‌గా చ‌ద‌వ‌క పోయేవార‌ని.. కానీ లోకేష్ అలాక్కాదు.. బుద్ధిగా చ‌దువుకుని.. స్టాన్ ఫోర్డ్ స్థాయికి మెరిట్ ద్వారా వెళ్లారు. అక్క‌డి  నుంచి వ‌ర‌ల్డ్ బ్యాంక్, సింగ‌పూర్ సీఎం ఆఫీస్ వంటి చోట్ల ప‌ని చేసే రేంజ్ కి ఎదిగారు. ఇదంతా ఆయ‌న స్వ‌యం కృషి. లోకేష్ ని ఈ విధంగా తీర్చిదిద్ద‌డంలో ఆయ‌న త‌ల్లి భువ‌నేశ్వ‌రి పాత్ర ఎంతో ముఖ్య‌మైన‌ద‌ని అన్నారు సీఎం చంద్రబాబు. స‌రిగ్గా అదే స‌మ‌యంలో తాను లెక్చ‌ర‌ర్ కావ‌ల్సింద‌ని అన్నారు. త‌న వ‌ర్శిటీలో ఈ దిశ‌గా వైస్ చాన్స‌ల‌ర్ అడిగార‌ని, అయితే తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న‌ట్టు చెప్పాన‌ని అన్నారు. ఆయ‌న త‌న‌ను గెలుస్తావా? అని కూడా అడిగార‌ని.. గెలిచి వ‌చ్చి మీతో మాట్లాడ‌తాన‌ని తాను అన్నాన‌నీ.. అలా తాను ఎమ్మెల్యేగా గెల‌వ‌డం మాత్ర‌మే కాదు మంత్రి  ఆపై ముఖ్య‌మంత్రి కాగ‌లిగాన‌నీ.. లేకుంటే ఈ పాటికి మీలాగ నేను కూడా ఒక టీచ‌ర్న‌యి ఉండేవాడ్న‌ని గ‌తాన్ని గుర్తు చేసుకున్నారు ఏపీ సీఎం చంద్ర‌బాబు.