ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్‌ సుదర్శన్‌ ఆచూకి లభ్య౦

ఆర్‌.ఎస్.ఎస్‌.మాజీ ఛీఫ్ సుదర్శన్ క్షేమంగా ఉన్నారని ఆచూకి దొరికింది. మైసూరులోని తాను ఉంటున్న ఇంటికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నారని తెలిసింది. మైసూర్‌లో మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన ఆయన ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటు౦బ సభ్యులు, అనుచరులు ఆయన ఆచూకి కోసం వెదుకులాట మొదలు పెట్టారు. సుదర్శన్‌ అదృశ్యంపై మైసూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు కూడా నమోదు చేశారు. చివరికి ఆయన ఆచూకి దొరకడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన సుదర్శన్ తిరిగి వచ్చేటప్పుడు కళ్ళు తిరగటంతో ఒక చోట కూర్చుని ఉండిపోయారని తెలిసింది.    

ఇన్ఫోసిస్ నీలిమ మృతి కేసులో కీలక మలుపులు

ఇన్ఫోసిస్ ఉద్యోగిని నీలిమ అనుమానాస్పద మృతి కేసు పలు కీలక మలుపులు తిరుగుతుంది. నీలిమ చనిపోడానికి ఐదు నిమిషాల ముందు వచ్చిన ఫోన్ నెంబరు ఎవరిదనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నీలిమ భవనంపై నుంచి కిందకు పడగానే తొలుత గమనించిన సెక్యూరిటీ గార్డు రమేష్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. నీలిమ మృతిపై గాంధీ డాక్టర్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నీలిమ పది అంతస్థుల మెడ నుంచి కిందపడినట్టు అనిపించటం లేదని డాక్టర్లు అంటున్నారు. అయితే పది అంతస్తుల మేడి నుంచి దూకితే శరీర బాగాలు డామేజ్ అవ్వలి, కాని డాక్టర్లు ఆమెకు తీవ్ర రక్త స్రావం, శరీర బాగాలు డామేజ్ కాలేదని అంటున్నారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమల రావు మాట్లాడారు. కాల్ లిస్టును సేకరించామని చెప్పారు. నీలిమ మృతికి ముందు ఎవరెవరితో మాట్లాడిందనే విషయాలపై ఆరా తీశామని చెప్పారు. నీలిమ కేసులో తాము ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని చెప్పారు. పూర్తిస్థాయిలో పోస్టుమార్టం వివరాలు బయటకు వచ్చాకే అన్నీ వెల్లడిస్తామన్నారు.  

నీలిమ మృతి మిస్టరీ: పోలీసులు అదుపులో 3 ఉద్యోగులు

ఇన్ఫోసిస్ ఉద్యోగిని నీలిమ మృతి మిస్టరీ ఇంకా వీడలేదు. గాంధీ ఆస్పత్రిలో గురువారం ఫోరెన్సిక్ వైద్యులు విక్రమాదిత్య, విజయ్ సాగర్ నేతృత్వంలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహం కుడి చేతికి తీవ్ర గాయాలు ఉన్నాయని, నీలిమ తనంతటతానే దూకి చనిపోలేదని, అనుమానాస్పద స్థితిలో కింద పడిపోయి ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు. అయితే నీలిమ ఫోన్ కాల్‌లిస్ట్ ఆధారంగా ముగ్గురు ఇన్ఫోసిస్ ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. కాగా విదేశాల్లో ఉన్న నీలిమ సోదరుడు శుక్రవారం హైదరాబాద్ చేరుకోనున్నారు.ఆయన వచ్చేవరకు మృతదేహాన్ని గాంధీ మార్చురీలో భద్రపరుస్తున్నారు.

ఎమ్మార్ కేసులో కోనేరు ప్రసాద్‌కు బెయిల్‌

జగన్ అక్రమాస్తులరే సంబంధించి ఎమ్మార్ కేసులో ప్రధాన నిందితుడు కోనేరు ప్రసాద్‌కు గురువారం కొన్ని షరతులతో కూడి బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది. ఐదు లక్షల రూపాయల పూజీ కత్తు, రాష్ట్రం విడిచి వెళ్లరాదని, కేసు దర్యాప్తుకు అందుబాటులో ఉండాలని షరతులు విధిస్తూ బెయిల్ మంజూరు చేసింది. బెయిల్‌కు సంబంధించిన కోర్టు పేపర్లు సిద్ధంకాగానే ఈ సాయంత్రంలోగా కోనేరు విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. గత తొమ్మిది నెలలుగా కోనేరు జైల్లో ఉంటున్న విషయం తెలిసిందే. కాగా కోనేరు గతంలో కూడా ఒక సారి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అప్పుడు ఆయన అయ్యప్ప మాల వేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్కార్ట్‌తో కూడిన బెయిల్ మంజూరయిన విషయం తెలిపిందే.

5 రోజు అన్నా దీక్ష, క్షిణిస్తున ఆరోగ్యం

   జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సామాజిక కార్యకర్త అన్నా హజారే చేపట్టిన అమరణ నిరాహార దీక్ష గురువారం నాటికి ఐదో రోజుకు చేరింది. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షిణించడంతో డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న అన్నా తిరస్కరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ లోక్ పాల్ బిల్లు వచ్చే వరకు దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా తనకు మద్దతు వస్తోందని, అంచేత దీక్ష విరమించేది లేదని అన్నా పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొందరు మహిళలు హాజరేకు ఈ ఉదయం రాఖీలు కట్టారు. కాగా అన్నా దీక్ష సందర్భంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.