నీలిమ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
posted on Aug 2, 2012 @ 4:33PM
ఇన్ఫోసిస్ లోని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నీలిమ మృతిపై మిస్టరీ ఇంకా వీడలేదు. నీలిమ మృతదేహానికి గురువారం పోస్టుమార్టం పూర్తి చేశారు. నీలిమ శరీరంపై బలమైన గాయాలున్నట్లు వైద్యులు నిర్ధారించారు. నీలిమ పోస్టుమార్టంను వైద్యులు చిత్రీకరించారు. ఆతర్వాత నీలిమ బ్లడ్ శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు వైద్యులు పంపారు. తుది నివేదిక వచ్చాకే వివరాలు వెల్లడిస్తామని వైద్యులు తెలిపారు. నీలిమది హత్యేనని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించిన సంగతి తెలిసిందే.