జగన్ కు జైల్లో రాఖీ కట్టిన షర్మిల
posted on Aug 2, 2012 @ 2:51PM
అక్రమ ఆస్తుల కేసులో చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని సోదరి షర్మిల ఈరోజు ఉదయం చంచల్ గూడ జైల్లో ములాఖత్ సమయంలో కలుసుకున్నారు. ఈ రోజు రాఖీ పండుగ కావడంతో షర్మిల జగన్‌ను కలిసి జైలులోనే అతనికి రాఖీ కట్టింది. వైయస్ విజయమ్మ, జగన్ సతీమణి వైయస్ భారతి కూడా జగన్ ను జైలులో కలుసుకున్నారు.