ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ సుదర్శన్ ఆచూకి లభ్య౦
posted on Aug 3, 2012 @ 12:50PM
ఆర్.ఎస్.ఎస్.మాజీ ఛీఫ్ సుదర్శన్ క్షేమంగా ఉన్నారని ఆచూకి దొరికింది. మైసూరులోని తాను ఉంటున్న ఇంటికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నారని తెలిసింది. మైసూర్‌లో మార్నింగ్ వాక్‌కు వెళ్లిన ఆయన ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటు౦బ సభ్యులు, అనుచరులు ఆయన ఆచూకి కోసం వెదుకులాట మొదలు పెట్టారు. సుదర్శన్ అదృశ్యంపై మైసూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదు చేశారు. చివరికి ఆయన ఆచూకి దొరకడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. మార్నింగ్ వాక్‌కు వెళ్లిన సుదర్శన్ తిరిగి వచ్చేటప్పుడు కళ్ళు తిరగటంతో ఒక చోట కూర్చుని ఉండిపోయారని తెలిసింది.