జగన్ ని కలిసిన విజయమ్మ, భారతి
posted on Aug 2, 2012 @ 12:12PM
అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ, జగన్ సతీమణి వైయస్ భారతి గురువారం ములాఖత్ సమయంలో కలిశారు. ఓబుళాపురం మైనింగ్ కేసులో మూడో నిందితుడు బిపి ఆచార్యకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో చుక్కెదురు అయింది. తనకు బెయిల్ ఇవ్వాలన్న ఆచార్య పిటిషన్‌ను హైకోర్టు గురువారం కొట్టి వేసింది.