రాజశేఖరరెడ్డి సమాధికి రాఖీ కట్టిన కొండా సురేఖ
posted on Aug 2, 2012 @ 12:38PM
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధికి రాఖీ కట్టారు. రక్షాబంధన్ పండుగ సందర్బంగా ఈ రోజు ఉదయం ఇడుపులపాయలకు వెళ్లి వైఎస్సార్ ఘాట్ ను సందర్శించారు. అక్కడే ఆమె రక్షాబంధన్ జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆడపడుచుల కోసం రాజశేఖరరెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని అన్నారు. త్వరలోనే జగన్ బయటకు వస్తారని ఆమె అన్నారు.