ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్స్‌లోకి విజేందర్
posted on Aug 3, 2012 @ 10:29AM
భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ లండన్ ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్స్‌లోకి ప్రవేశించాడు. చివరి క్షణం వరకూ హోరాహోరీగా జరిగిన 75 కిలోల ప్రీ-క్వార్టర్ ఫైనల్ ఫైట్‌లో అమెరికా బాక్సర్ టెరెల్ గాషాను ఓడించాడు. మొత్తం మూడు రౌండ్ల పాటు జరిగిన ఫైట్‌లో విజేందర్ 16-15 పాయింట్లతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌లోకి ఎంటరయ్యాడు.