5 రోజు అన్నా దీక్ష, క్షిణిస్తున ఆరోగ్యం
posted on Aug 2, 2012 @ 2:22PM
జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సామాజిక కార్యకర్త అన్నా హజారే చేపట్టిన అమరణ నిరాహార దీక్ష గురువారం నాటికి ఐదో రోజుకు చేరింది. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షిణించడంతో డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న అన్నా తిరస్కరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ లోక్ పాల్ బిల్లు వచ్చే వరకు దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా తనకు మద్దతు వస్తోందని, అంచేత దీక్ష విరమించేది లేదని అన్నా పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొందరు మహిళలు హాజరేకు ఈ ఉదయం రాఖీలు కట్టారు. కాగా అన్నా దీక్ష సందర్భంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.