బెస్ట్ జర్నలిస్ట్ అవార్డుల ప్రకటన ...

బెస్ట్ జర్నలిస్ట్ 2008, 2009, 2010 సంవత్సరాలకుగాను అవార్డులను ప్రకటించారు. నార్ల లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డులు డా.తుర్లపాటి కుటుంబరావు (2008), పి.వామనరావు (2009) డి.సీతారాం (2010). ఉత్తమ జర్నలిస్టులు నందిరాజు రాధాకృష్ణ (2008), సిఆర్. గౌరీ శంకర్ (2009), దొంతు రమేష్ బాబు (2010),  ఏం.ఏ.రహీం బెస్ట్ జర్నలిస్ట్ ఫోటోగ్రాఫర్ అవార్డులు, శ్రీధర్ నాయుడు(2008),  కె. భాష్కర రావు (2009) విశాఖ,  టి.శ్రీనివాస రెడ్డి (2010) విజయవాడ, కాసా సుబ్బారావు బెస్ట్ రూరల్ జర్నలిస్ట్ అవార్డ్,  టి.వి.సత్యనారాయణ (2008)బి.శ్రీనివాస రావు (2009) కరీం నగర్, చింతామణిశేఖర్ (2010), చిత్తూరు ఉత్తమ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అవార్డు  రెహనా బేగం (2008)

గాంధీభవన్ లో అంజయ్య ఫోటో ఉండాల్సిందే ...

కాంగ్రెస్ యువనేతల ప్రమాణ స్వీకారంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి సోదరుడు వై.ఎస్. వివేకానంద రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు సార్లు కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చిన తన సోదరుడు వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఫోటో లేకపోవడం తనను బాదిస్తుందని అన్నారు. ఈ రోజు డిప్యూటీ సిఎం దామోదర్ మాట్లాడుతూ గాంధీభవన్ లో వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఫోటో ఉంటే తెలంగాణాకు చెందిన దివంగత ముఖ్యమంతి టంగుటూరి అంజయ్య ఫోటో కూడా తప్పక వుండాల్సిందే అని అన్నారు. వై.ఎస్. కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు, అలాగే నిథుల పంపకంలో మూడు ప్రాంతాలలో సమతుల్యత ఉండాలని అన్నారు.

ఇంజనీరింగ్ సీట్ల ఫీజులపై డిప్యూటీ సిఎం వివరణ

తెలంగాణాలో మెడికల్ కాలేజీలలో మెడికల్ సీట్లు పెంచాలని, ఫీజులు పెంచాలని ప్రైవేట్ ఇంజనీరింగ్ మరియు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న అనగా 31-07-12 ప్రైవేట్ ఇంజనీరింగ్ మరియు మెడికల్ కాలీజీ యాజమాన్యాలు మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఈ విషయంపై చర్చలు జరిపి సాయంత్రం ఈ సంవత్సరం ఇంజనీరింగ్ ఫీజు పెంచే యోచనను మానుకున్నారు. అలాగే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఫీజులు యథాతథంగా వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ స్పందిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే ఇంజనీరింగ్ ఫీజులు తీసుకోవాలని, మెడికల్ సీట్లు రాకపోవడంలో వైఫల్యానికి సమిష్ట బాధ్యత తమదేనని వివరణ ఇచ్చారు.

గగన్ నారంగ్‌కు 50 లక్షల నజరానా ప్రకటించిన సిఎం

లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం పతకం గెలుచుకున్న హైదరాబాదీ షూటర్ గగన్ నారంగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. కుమారుడు పతకం సాధించిన సంతోషంలో ఉన్న గగన్ తండ్రి బిఎస్ నారంగ్ ఇవాళ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా సిఎం నజరానాపై ప్రకటన చేశారు. ఇప్పటికే హర్యానా ప్రభుత్వం నారంగ్‌కు కోటి రూపాయల నజరానా ప్రకటించగా... కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్ హోదాను ఇచ్చేందుకు నిర్ణయించింది. లండన్ గేమ్స్‌లో 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్ ఈవెంట్‌లో కాంస్యం సాధించడం ద్వారా తొలి పతకం  భారత్ ఖాతాలో చేరింది.  

విద్యార్థినులపై టీచర్ లైంగిక వేధింపులు

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన  ఉపాధ్యాయుడు  కీచకుడుగా మారాడు. కామంతో కళ్లు మూసుకుపోయి విద్యార్థినులపై  లైంగిక వేధింపులకు పాల్పడుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. హైదరాబాద్ అంబర్‌పేటలోని నాలెడ్జీ హైస్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేసే ప్రేమ్‌రాజ్‌ విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.విషయం తెల్సుకున్న తల్లిదండ్రులు ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు. అయితే సదరు మాస్టారి ఫోటో, వివరాలు కూడా స్కూల్‌లో లేకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్కూల్ ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రిన్సిపల్‌ శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని, స్కూల్‌కు తాళం వేశారు. పరారీలో ఉన్న ప్రేమ్‌రాజ్ కోసం గాలిస్తున్నారు.

రైలు ప్రమాద బోగిని పరిశీలించిన ఫోరెన్సిక్ బృందం

నెల్లూరులో జరిగిన తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద స్థలానికి రైల్వే ఫోరెన్సిక్ నిపుణుల బృందం మంగళవారం ఉదయం నెల్లూరు చేరుకుంది. అగ్ని ప్రమాదానికి గురియైన ఎస్-11 బోగీని రైల్వే నిపుణుల బృందం పరిశీలించింది. బోగి నుంచి కొన్ని నమూనాలను సేకరించింది. కాలిన మృతు దేహాలను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరిచారు. వీటిలో 13 మృతదేహాలను గుర్తించి వాటిని వారి బంధువులకు అప్పగించారు. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25 వేల పరిహారాన్ని ప్రకటించారు. దక్షిణ మధ్య రైల్వే భద్రతా కమిషనర్ డీకె సింగ్ విచారణ జరిపి ఈ ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోనున్నారు.