బామ్మల ఫ్యాషన్ లో మేకప్ భళా!

 

బామ్మల ఫ్యాషన్ లో మేకప్ భళా!

మార్పు అనేది సహజం. అన్నింటిలో మార్పు వచ్చినట్టు మనిషి శరీరం కూడా కాలంతో పాటు మార్పుకు లోనవుతుంది. మధ్య వయసు పోయి వృద్ధాప్యం సమీపించే కొద్దీ శరీరంలో అంతర్గత అవయవాల పనితీరు మాత్రమే కాకుండా బయటకు కనిపించే చర్మం ముడతలు పడటం, జుట్టు రంగు మారడం, శారీరకంగా రూపం మారడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళల్లో వయసు పెరిగేకొద్ధి శరీరం మీద ఆసక్తి తగ్గుతుంది. కనిపించే తెల్ల జుట్టును, చర్మపు ముడుతలను దాచాలని చూసేవారు కొందరు ఉంటారు అంతే. అయితే వయసు అయిపోయేకొద్ది ఇలాంటి ఆసక్తి వధులుకోవాల్సిన అవసరం ఏమి లేదు. బామ్మలు కూడా  బిందాస్ గా అందంగా తయారవచ్చు. అయితే వయసుకు తగిన అలంకారం అందంగా, హుందాగా ఉంచుతుంది. అలాంటి టిప్స్ ఇవి..

కన్సిలర్!!

ఎన్నో రకాలుగా ఎన్నో ఫాలో అయినా చాలామంది విషయంలో కంటికింద కనిపించే ఐ బ్యాగ్స్ మాత్రం ఎబ్బెట్టుగా ఉంటాయి. వాటిని దాచాలని అనుకున్నా దాచలేరు. అయితే విటమిన్ ఇ ఆధారిత ప్రొడక్ట్స్ ఉపయోగిస్తే కంటి కింద ఐ బ్యాగ్స్ ను తగ్గించొచ్చు. 

ఐ లైనర్!!

సందేహం లేకుండా అన్ని వయసుల వాళ్ళు వాడదగినది ఐ లైనర్. ఎంత మేకప్ వేసుకున్నా ఐ లైనర్ లేకపోతే కళ ఉండదు. యంగ్ గా ఉన్నప్పుడు నలుపు రంగు ఐ లైనర్ బాగా నప్పుతుంది కానీ వయసు పెరిగేకొద్దీ వీటిని ఇతర షేడ్స్ తో కలిపి ఉపయోగిస్తే చాలా బాగుంటుంది.

ఐ లాషెస్!!

చూడగానే ఇట్టే ఆకట్టుకునేవి కళ్ళు అయితే ఆ కళ్లకున్న కనురెప్పలు ఎన్నో కథలు చెబుతాయి. చాలామంది వీటి గురించి అసలు శ్రద్ధ తీసుకోరు. కనురెప్పలు తీర్చిదిద్దితే చాలా తొందరగా ఆకట్టుకుంటారు. చిన్న వయసు వారే కాదు బామ్మలూ తమ కనురెప్పలు అందంగా తీర్చిదిద్దవచ్చు. వీటిని తీర్చిదిద్దడం వల్ల ముఖం వయసు తగ్గినట్టు కనిపిస్తుంది.

లిప్ బామ్!!

బామ్మలకు ఆధరాల అందం ఎందుకని నిర్లక్ష్యం చేయద్దు. చూడగానే ఆకట్టుకునేవాటిలో కళ్ళు మొదటివి అయితే పెదవులు రెండవది. నవ్వగానే సాగిపోయే పెదవులు తాజాగా, అందంగా కనబడితే అట్రాక్ట్ అవ్వనిది ఎవరు?? పెదవులకు మాశ్చరైజింగ్ ఇవ్వడంతో పాటు చక్కని రంగును ఇచ్చే లిప్ బామ్ లు బోలెడుంటాయి మార్కెట్ లో. వాటిని ఉపయోగించెయ్యాలి మరి.

సన్ స్క్రీన్!!

వయసు పెరిగే కొద్దీ చాలా సున్నితమైన వాటికి చర్మం ప్రభావానికి గురవుతుంది. చర్మంలోపల ఎలాస్టిన్ గుణం తగ్గిపోయి చర్మం సాగిపోతుంది. ముఖ్యంగా బయటకు వెళితే అన్నిరకాల వయసుల వారికి చర్మం దెబ్బతినడం చూస్తూనే ఉంటాం. అందుకే సన్ స్క్రీన్ వాడటం ఎంతో ముఖ్యం. 

మంచి నీరు!!

మానవ శరీరానికి మంచి ఔషధం, పోషకం ఏదైనా ఉందంటే అది మంచి నీరే. అన్ని వయసుల వారు శరీరానికి సరిపడినంత మంచినీరు తాగడం ఎంతో ముఖ్యం. మంచి నీరు శరీరాన్ని తాజాగా ఉండేలా చేస్తుంది. 

శుభ్రత!! 

చర్మ సంరక్షణలో ఎలా శుభ్రం చేసుకుంటున్నాం అనేది కూడా ముఖ్యం. మంచి క్లెన్సర్ ఉపయోగించాలి. అలాగే చర్మాన్ని మెత్తటి పొడి బట్టతో తుడుచుకోవాలి. చర్మాన్ని రుద్దకూడదు. మేకప్ ముందు తరువాత కూడా దీన్ని పాటించడం ముఖ్యం.

ఇలా బామ్మలు కూడా బ్యూటీ టిప్స్ ఫాలో అయితే వయసును తగ్గించుకుని అమ్మాయిల్లా అట్రాక్ట్ అవుతారు.

                                        ◆నిశ్శబ్ద.