English | Telugu

అన్ స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ తో ఐపీఎల్

Publish Date:Mar 28, 2023

త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2023 కోసం నటసింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌ తో స్టార్ స్పోర్ట్స్ తెలుగు ప్ర‌త్యేక ప్రోమోను రూపొందించింది. తాజాగా విడుద‌ల చేసిన ఈ ప్రోమోలో బాల‌కృష్ణ‌ త‌న‌దైన శైలిలో తెలుగు ప్ర‌జ‌ల‌ను ఉద్దేశిస్తూ మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లంతా కుటుంబ స‌భ్యులు, స్నేహితుల‌తో క‌లిసి టెలివిజ‌న్‌లో ప్ర‌సార‌మ‌య్యే 'ఇన్‌క్రెడిబుల్ ప్రీమియ‌ర్ లీగ్'ను వీక్షించాల‌ని కోరుతూ, క్రికెట్ మ‌రియు ఐపీఎల్ ప‌ట్ల‌ అభిమానాన్ని ప్రోమోలో వ్య‌క్త‌ప‌రిచారు. 'NBK 108' సెట్స్‌లో స్టార్ స్పోర్ట్స్ ఎక్స్‌ప‌ర్ట్స్ ‌ఎం.ఎస్.కె. ప్రసాద్, వేణుగోపాలరావుతో కలిసి బాలకృష్ణ గల్లీ క్రికెట్ ఆడారు. స్టార్ స్పోర్ట్స్ ప్ర‌జెంటర్‌ వింధ్య అంపైర్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఈ సంద‌ర్భంగా స్టార్ స్పోర్ట్స్ ఎక్స్‌ప‌ర్ట్స్‌తో స‌ర‌దాగా గ‌డిపిన బాలకృష్ణ‌.. తన క్రికెట్ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మార్చ్ 31న ఐపీఎల్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో తెలుగు కామెంటేటర్ గా బాలకృష్ణ అలరించనున్నారని సమాచారం.

Fans Furious with the Adipurush Update from Om Raut?

Publish Date:Mar 28, 2023

Pan India star Prabhas' film Adipurush has good expectations when it was announced and the team killed the buzz with each update. Directed by Om Raut, this film is based on Ramayana. The film which was planned to release in June 16, 2023 is currently busy with the VFX work.    From the moment teaser released everyone criticized the worst VFX and now It is heard that the Adipurush team spending more on VFX for this project.   The audience and fans are eagerly waiting for any update from the film. But today producer Bhushan Kumar and director Om Raut visited Vaishno Devi. A photo related to that was shared by the makers to the fans who are screaming for a solid update.   Fans are now furious with the director Om Raut and team Adipurush negligence. It appears that team is planning for Special update on Sri Rama Navami. It remains to be seen how makers will turn around all the negativity surrounding the film.   In this movie, Kriti Sanon plays the role of Sita, Saif Ali Khan plays the role of Ravana, and Sunny Singh plays the role of Laxman. Bhushan Kumar of T Series bankrolled this project.

ఎన్టీఆర్ 'దేశోద్ధారకులు' విడుదలై నేటికి 50 వసంతాలు

Publish Date:Mar 28, 2023

  శకపురుషుడు నందమూరి తారకరామారావు నటించిన తొలి రంగుల సాంఘిక చిత్రం 'దేశోద్ధారకులు'. ఎన్టీఆర్ మేనత్త కుమారుడు, అభిరుచి కలిగిన నిర్మాత, దర్శకునిగా పేరున్న యు. విశ్వేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రానికి సి.యస్. రావు దర్శకత్వం వహించారు. దీప్తి ఇంటర్నేషనల్ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమాలో తారకరాముని జోడీగా అప్పటి అగ్ర తార వాణిశ్రీ నటించారు. ప్రేక్షకుల విశేషాదరణ పొందిన దేశోద్ధారకులు సినిమా సరిగ్గా 50 ఏళ్ల క్రితం.. 1973 మార్చి 29న విడుదలైంది. కె.వి. మహదేవన్ స్వరాలు కూర్చిన ఈ సినిమాలోని పాటలన్నీ పాపులరే. తెలుగులో తొలి పూర్తి కలర్ ఫిల్మ్ 'లవకుశ' (1963)లో నటించిన ఎన్టీఆర్ తన తొలి కలర్ సోషల్ ఫిలింలో నటించడానికి ఏకంగా పదేళ్ల కాలం తీసుకోవడం గమనార్హం. ఆ రోజుల్లో తెలుగు నిర్మాతలకు కలర్ ఫిల్మ్ లభించేది కాదు. పేరున్న సంస్థలు, ల్యాబ్‌లకు మాత్రమే కోటా లభించేది. ఎన్టీఆర్‌తో కలర్ ఫిల్మ్ తీయాలని విశ్వేశ్వరరావు నిర్ణయించుకున్నారు. డైరెక్టర్ ఎల్వీ ప్రసాద్‌ను ఈ విషయం చెబితే, ఆయన కలర్ ఫిల్మ్ ఇప్పించారు. 'దేశోద్ధారకులు' నిర్మించడానికి రూ. 35 లక్షలు వెచ్చించారు. అప్పట్లో అంత బడ్జెట్ అంటే చాలా ఎక్కువ. ఈ విషయంలో నిర్మాత నాగిరెడ్డి ఆయన మందలించారు కూడా. సినిమా ఫలితంపై భరోసా ఉండటంతో విశ్వేశ్వరరావు ఆందోళన పడలేదు. ఆయన నమ్మకం నిజమై రికార్డు స్థాయి వసూళ్లు వచ్చాయి. 30 రోజుల్లోనే 30 లక్షలు వసూలు చేసిన సినిమాగా నిలిచింది 'దేశోద్ధారకులు'. 12 కేంద్రాల్లో 100 రోజులు నడిచిన ఈ చిత్రం కడపలో 210 రోజులు ఆడింది. గోపాలరావు అలియాస్ గోపి చందరంగంలో నిపుణుడు. పోటీలో పోలీస్ కమిషనర్ ప్రభాకర రావును ఓడించడమే కాకుండా ఆయన కుమార్తె రాధ హృదయాన్నీ కొల్లగొడతాడు. ప్రజాబంధుగా పేరుపొందిన రాజభూషణం నిజానికి ఒక దుష్టుడు. కుట్రపన్ని గోపి అన్నయ్య ఆంధ్రా నేషనల్ బ్యాంక్ ఏజెంట్ అయిన రాజారావును దొంగ నోట్ల నేరంపై జైలుకు వెళ్లేట్లు చేస్తాడు. ఆ తర్వాత తన తండ్రికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుస్తాయి గోపికి. తండ్రి చావు వెనుక ఉన్నది ప్రభాకరరావు అని భావించిన గోపి ఆయనతో ఘర్షణ పడతాడు. ఆ సందర్భంలో ప్రభాకరరావు మరణిస్తాడు. తండి చావుకు గోపి కారణమని అతడిని ద్వేషిస్తుంది రాధ. గోపి జైలుపాలవుతాడు. తర్వాత అతను బ్రౌన్ దొర పేరుతో విదేశాల నుంచి వస్తాడు. రాధకు తన సెక్రటరీగా ఉద్యోగం ఇస్తాడు. ఆ తర్వాత అసలు దొంగలను అతను ఎలా బయటపెట్టాడనేది క్లైమాక్స్. మబ్బులు రెండు భేటీ అయితే మెరుపే వస్తుందీ, స్వాగతం దొరా సుస్వాగతం, కోరుకున్న దొరగారు కొంగు పట్టుకున్నారు, ఈ వీణకు శృతిలేదు, ఆకలయ్యి అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్లు, ఇది కాదు మా ప్రగతి పాటలు ఇంకా ఇంకా వినాలనిపిస్తాయి. ఈ పాటలను ఆత్రేయ, ఆరుద్ర, శ్రీశ్రీ, విశ్వేశ్వరరావు, మోదుకూరి జాన్సన్ రాశారు. "పనిచెయ్యకుండా పుచ్చుకునేది జీతం, చేస్తానని పుచ్చుకునేది లంచం, చేసి పుచ్చుకునేది లాంఛనం" లాంటి డైలాగ్స్ బాగా పేలాయి. మహారధి, మోదుకూరి జాన్సన్ ఈ చిత్రానికి మాటలు రాశారు. ఎన్టీఆర్ క్యారెక్టర్ డిజైన్, ఆ క్యారెక్టర్‌ను ఎన్టీఆర్ పోషించిన విధానం ఈ సినిమా విజయానికి దోహదం చేశాయి. నాయిక రాధ పాత్రలో వాణిశ్రీ చులాగా ఇమిడిపోయారు. ఎన్టీఆర్, వాణిశ్రీ ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ సూపర్బ్ అనింపించేట్లు ఉంటుంది. మెయిన్ విలన్‌గా నాగభూషణం తనదైన డైలాగ్ డిక్షన్‌తో అదరగొట్టగా, మితగా విలన్ పాత్రధారులు రాజనాల, సత్యనారాయణ, త్యాగరాజు తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. నిజాయితీగా బతకాలనుకొని, చివరకు పిచ్చివాడైపోయే పాత్రలో పద్మనాభం మెప్పించారు. సీబీఐ ఆఫీసర్‌గా రావు గోపాలరావు కనిపిస్తారు.

ఓటీటీలే నిల‌బెట్టాయంటున్న ఫ్యామిలీమేన్ స్టార్‌!

Publish Date:Mar 27, 2023

విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందిన సినిమాల‌లో ఎక్కువ‌గా క‌నిపించిన న‌టుల్లో మ‌నోజ్ బాజ్‌పాయ్ ఒక‌రు. త‌న 30 ఏళ్ల కెరీర్‌లో కొన్ని సంద‌ర్భాల్లో అనుమానాలు ఇబ్బందిపెట్టాయ‌ని అన్నారు. ఇండిపెండెంట్ సినిమాల‌కు నూక‌లు చెల్లాయ‌ని కూడా కుమిలిపోయిన‌ట్టు తెలిపారు. అయితే స‌రిగ్గా అలాంటి స‌మ‌యంలోనే ఓటీటీ ఆదుకుంద‌ని అన్నారు. 2019లో ది ఫ్యామిలీ మేన్ సీరీస్‌తో ఓటీటీలో అడుగుపెట్టారు మ‌నోజ్ బాజ్‌పాయ్‌. ``న‌టుడిగా కంటిన్యూ అవుతున్న స‌మ‌యంలో ఎక్క‌డో న‌మ్మ‌కాన్ని కోల్పోయాను. ఇండిపెండెంట్ సినిమాకు కాలం చెల్లింద‌నే అనుకున్నా. జ‌నాలు ఆ సినిమాల మీద ఆస‌క్తి చూప‌క‌పోవ‌డంతో, ఇక అంతే సంగ‌తులు అని అనిపించింది. ఇండిపెండెంట్ సినిమాకు స‌పోర్ట్ చేయ‌డం మంచిదా?  కాదా?  అనే అనుమానాలు కూడా నాకు వ‌చ్చాయి. కానీ ఓటీటీ వాట‌న్నిటినీ తుడిచిపెట్టింది. ఫ్యామిలీమేన్‌కి  ముందు కూడా చాలా మంది చాలా సీరీస్‌ల‌కోసం అడిగారు. అయితే దాని మీద నాకు అప్ప‌ట్లో అవ‌గాహ‌న లేదు. అందుకే ఒప్పుకోలేదు. కానీ ఫ్యామిలీ మేన్ ఫ‌స్ట్ సీజ‌న్ స‌క్సెస్ ఎవ‌రూ ఊహించ‌నిది. ఆ స‌క్సెస్ చూసి చాలా మంది ఇండిపెండెంట్ సినిమాల‌ను ఓటీటీల్లో విడుద‌ల చేసి ధైర్యంగా ముందుకు న‌డిచారు`` అని అన్నారు. మ‌నోజ్ బాజ్‌పాయ్ ఇప్పుడు ప‌లు సీరీస్‌ల‌లో న‌టిస్తున్నారు. ``నాకే కాదు, చాలా మంది హోప్ ఇచ్చింది ఓటీటీ. న‌చ్చిన సినిమాల‌ను చేసినా ఆత్మ‌సంతృప్తి మిగులుతుంద‌ని ప్రూవ్ చేసింది. కంటెంట్ న‌మ్మి చేసే సినిమాల‌ను ఆడియ‌న్స్ ఆద‌రిస్తార‌నే భ‌రోసాఇచ్చింది. అందుకే మేక‌ర్స్ కూడా థియేట‌ర్ల‌ను దృష్టిలో పెట్టుకుని మాత్ర‌మే కాదు, మంచి కంటెంట్‌ని ఆద‌రించే వారి కోసం కూడా సినిమాలు చేస్తున్నారు`` అని అన్నారు. మ‌నోజ్ బాజ్‌పాయి రీసెంట్ ప్రాజెక్ట్ ది వ‌య‌ల్ - ఇండియాస్ వ్యాక్సిన్ స్టోరీ. ఇందులో మ‌నోజ్ నెరేట‌ర్ పాత్ర పోషించారు. 

Vikram Vedha Hindi Trailer: Hrithik and Saif Amps up the Hype

Publish Date:Sep 8, 2022

The teaser of Pushkar-Gayatri's action-thriller Vikram Vedha was launched on August 24. The teaser emerged as a pleasant surprise to viewers with action packed visuals and an engaging story featuring Hrithik Roshan as Vedha and Saif Ali Khan as Vikram. From then everyone is eagerly waiting for the trailer. Today makers released action packed trailer. When it comes to the trailer, it was extraordinary in every way. Hrithik Roshan has wowed everyone with his rugged look and intense action, while Vikram as a determined cop has everyone in awe. The original essence was maintained, and Pushkar Gayathri astonished everyone with their unique action. The pulsating background score that stunned everyone in the original was also employed brilliantly in the Hindi version.   Everyone was impressed by Hrithik Roshan's rugged look and menacing aura. The mass appeal of Sai Ali Khan as a determined cop keeps everyone spellbound. Both leads are seen in never-seen-before avatars.   Helmed by Pushkar & Gayatri the film is produced by Bhushan Kumar & S. Sashikanth and Reliance Entertainment. Vikram Vedha is presented by Gulshan Kumar, T-Series, and Reliance Entertainment in association with Friday Filmworks & Jio Studios and a YNOT Studios Production. Vikram Vedha will have a global release on 30th September 2022.

త్వరలో జీ తెలుగులో సూపర్ క్వీన్ సీజన్ 2

Publish Date:Mar 28, 2023

సూపర్ క్వీన్ సీజన్ 2 త్వరలో జీ తెలుగులో ప్రసారం కావడానికి సిద్దమయ్యింది. ఇప్పుడు దానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహిళల కోసమే ప్రత్యేకించి రూపొందిస్తున్న ఎన్నో షోస్ లో ఇది కూడా ఒకటి. జీవితంలో ఎదురయ్యే అవరోధాలు, అవమానాలు ఎన్ని ఉన్నా ఎంతమంది వెనకగా నవ్వుకున్నా వెనకడుగు వేయకుండా.. జీవితంలో సక్సెస్ తో బుద్ది చెప్పి ఆడియన్స్ మనస్సులో ఒక ప్రత్యేక  స్థానాన్ని సంపాదించుకున్న బుల్లితెర నటీమణులతో ‘సూపర్‌ క్వీన్‌’ అనే షో స్టార్ట్ అయ్యి సీజన్ 1 ని సక్సెస్ ఫుల్ గా  పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు సీజన్ 2 రాబోతోంది. ఇందులో పల్సర్ బైక్  కండక్టర్ ఝాన్సీ, నటి విద్యురామన్, మౌనిక యాదవ్, ప్రియాంక చౌదరి, యాంకర్ ప్రశాంతి, సుహాసిని, ఎస్తేర్, జబర్దస్త్ పవిత్ర, లిఖిత మూర్తి, అనాలా సుష్మిత..రాబోతున్నారు. ఇక ఈ షోకి హోస్ట్ గా ప్రదీప్ వ్యవహరిస్తున్నాడు.  "నా ప్రయాణం నా కోసం కాదు...నా గమ్యం నాది కాదు, నేను అనే పదం తప్ప..నేను అనే నిజం తెలీదు, నా ఓటమి ఎదురుగా వేల మంది, నా గెలుపు వెనక నెన్నొక్కతిని, నా భయం నా ఓటమి ఎందరిని ఓడిస్తుందో అని, నా భాగ్యం నా గెలుపు ఎంత మందిని కుంగదీస్తుందో అని , నా నవ్వు కొందరిని బాధపెడుతోంది, నా బాధ ఎందరికో నవ్వునిస్తుంది, అందరూ ఉన్నా ఒంటరిని నేను..ఐనా నేను రాణిని నా జీవితానికి మహారాణిని" అంటూ యాంకర్ ఉదయభాను బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఇచ్చింది. "వాళ్ళ ఆవేదన సముద్రమంత లోతు..వాళ్ళ ఆప్యాయత కొండంత ఎత్తు... సివంగుల మధ్య సమరం ఆరంభం" అంటూ ఒక టాగ్ లైన్ ఇచ్చాడు ప్రదీప్...మరి ఈ సీజన్ 2 లో కంటెస్టెంట్స్ ఎలా పార్టిసిపేట్ చేస్తారో ఎవరు సూపర్ క్వీన్ అవార్డు ని అందుకుంటారో తెలియాలంటే కొన్ని డేస్ వెయిట్ చేయాల్సిందే.

తారక్‌తో బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ భారీ పాన్ ఇండియా మూవీ!

Publish Date:Mar 26, 2023

బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ టీ సిరీస్ దృష్టి తెలుగు హీరోలపై పడింది. ఇప్పటికే ప్రభాస్ తో 'ఆదిపురుష్'ని రూపొందిస్తున్న ఈ సంస్థ.. ఇటీవల అల్లు అర్జున్ హీరోగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించింది. ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం తన 30వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఆ తర్వాతి సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ రెండు ప్రాజెక్ట్ ల తర్వాత తారక్ చేయబోయే సినిమా గురించి ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది. టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఓ భారీ పాన్ ఇండియా మూవీ కోసం ఎన్టీఆర్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దర్శకుడు, ఇతర విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశముందని సమాచారం.

Sudha Kongara & Hombale project is going to be Biggest Multistarrer

Publish Date:Jul 12, 2022

Even though it came before 'KGF,' Hombale Films became well-known with that film. The films are being announced, completed, and ready for release as a result of the momentum created by that film. Production is currently working on 'Salaar' in Telugu and 'Tyson' in Malayalam. Other pan-India films have also just been announced.   However, a film directed by Sudha Kongara was recently announced. Except for the fact that they stated that it will be a big film, they did not mention the casting. There are some new rumours floating around about this. If those rumours are true, this combination will be spectacular. According to sources, Sudha Kongara project is going to be multi starrer.  Furthermore, the names of those heroes are currently being spread.   According to the latest rumours, this film would star Suriya and Dulquer Salman, who have established as star heroes in the South with a string of superhits. According to industry reports, Surya, who has become acquainted of Sudha Kongara's direction in 'Akaasham Nee Haddura,' responded OK without even hearing the story. It is stated that discussions about this film are ongoing, and that full details will be released soon. Pre-production work will begin soon.   Hombale is synonymous with big-budget films. This film is expected to be in the same budget range as the previous one. Suriya's film is also popular in Telugu. Dulquer films have a cult following in the South. This combination is surely going to be crazy.

Ranbir and Alia in love

Publish Date:May 10, 2018

కబ్జా

Publish Date:Mar 17, 2023

బలగం

Publish Date:Mar 3, 2023

KGF Chapter 2

Publish Date:Apr 14, 2022

RRR

Publish Date:Mar 25, 2022

Radhe Shyam

Publish Date:Mar 11, 2022

Clap

Publish Date:Mar 11, 2022

Aadavallu Meeku Joharlu

Publish Date:Mar 4, 2022