ఈ రెండు విషయాలే పిల్లలను చురుగ్గా ఉంచుతాయి!

ఈ రెండు విషయాలే పిల్లలను చురుగ్గా ఉంచుతాయి! జీవితంలోకి పిల్లలు వచ్చాక తల్లిదండ్రులుగా బాధ్యతలు పెరుగుతాయి. కేవలం పిల్లల అవసరాలు తీర్చడం మాత్రమే కాకుండా పిల్లలను మంచి నడవడిక కలిగిన వారిగా తీర్చిదిద్దడం పెద్దలకు ఒక సవాల్ అనుకోవచ్చు. కొంచెం ఎదిగిన పిల్లలకు అయితే ఏదైనా చెప్పడం, వారికి  తగిన విధంగా మార్గాలు వెతకడం కొంచెం ఓపిక తెచ్చుకుంటే సాధ్యమవుతుంది. కానీ అయిదు సంవత్సరాల లోపు పిల్లలకు ఏ విషయమైనా అర్థం చేసుకునే సామర్థ్యము ఉండదు. వారిని ఓ మంచి నడవడికలోకి తీసుకెళ్లాలన్నా, వారిని ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తగా చూసుకోవాలన్నా ప్లే స్కూల్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే పిల్లలు ప్లే స్కూల్ కి వెళ్ళిపోతే ఇక వారు దారిలోకి వచ్చేసినట్టే అనుకోవడం చాలా పొరపాటు.  మరేం చెయ్యాలి అనేది అందరి సందేహం!! సన్నద్ధం చెయ్యాలి!! పిల్లలను ప్లే స్కూల్ కి పంపడానికి ముందు వారిని ఇంట్లోనే సన్నద్ధం చెయ్యాలి. వారితో ఆటలు ఆడించడం ద్వారా చిన్న చిన్న మెథడ్స్ పూర్తి చేయడం, కార్డ్ బోర్డ్ లతో పజిల్స్ చేయించడం. బొమ్మలు చూపించి వాటిని గుర్తుపట్టించడం వంటివి చెయ్యాలి. నిద్రతో జాగ్రత్త!! ప్రతి ఒక్కరికీ వయసు తగ్గట్టు నిద్ర చాలా అవసరం. అయితే ఈ కాలం పిల్లలు అంత త్వరగా పడుకోరు. తల్లిదండ్రులు పనులలో పడి అర్ద రాత్రులు వరకు మేలుకుని ఉండటంతో పిల్లలు కూడా వారినే అనుకరిస్తారు. అందుకే పిల్లలకు సరైన నిద్రలేకపోవడం చాలా సమస్యలు తెచ్చి పెడుతుందని పిల్లల ఆరోగ్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలవాటు చేస్తున్న చేటు!! మీ పిల్లలకు మీరే చేటు చేస్తున్నారు. దాన్ని ఎంచక్కా అలవాటు చేస్తున్నారు కూడా. ఎవరూ తమ పిల్లలను తాము పాడుచేసుకోరు కదా అనే ఆలోచన తళుక్కున మెరుస్తుంది. కానీ చెబుతున్న మాట నిజం. పెద్దలు చేస్తున్న పనులలో పిల్లలు అడ్డు వస్తున్నారనో, వారు అల్లరి చేస్తున్నారనో, వారిని కనిపెట్టుకుని ఉండటం కష్టమవుతోందనో ఇలా బోలెడు కారణాలు ఉన్నాయి తల్లిదండ్రులు చేస్తున్న పని మొబైల్స్ చేతికి ఇవ్వడం. మొబైల్స్ లో ఏ కార్టూన్ ఛానెల్ నో ఓపెన్ చేసి వారి చేతిలో పెట్టేసి పెద్దవాళ్ళు వారి మానాన వారు పనులు చేసుకుంటూ ఉంటారు.  పెద్దలు గమనించాల్సిన విషయం ఒకటుంది. పిల్లలు తమ జీవితంలోకి వస్తున్నారని తెలిసినప్పటి నుండే వారికంటూ సమయాన్ని ఇవ్వగలిగేలా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే పిల్లల విషయంలో పెద్దలు న్యాయం చేసినట్టు అవుతుంది.  జాగ్రత్తలు!! పిల్లల విషయంలో పెద్దవాళ్ళు తీసుకోవలసిన జాగ్రత్తల్లో వారి ఆహారం, నిద్ర చాలా ముఖ్యమైనవి. పిల్లల వయసుకు తిండి, నిద్ర మాత్రమే ముఖ్య అవసరాలు. అలాగని పిల్లలు తిండి తినట్లేదనే కారణంతో కుర్కురే, బిస్కెట్స్ వంటి స్నాక్స్ ను. పిల్లల కోసం వండే సమయం ఉండట్లేదనే కారణంతో ప్యాకింగ్ చేయబడిన ఆహారాన్ని ఎంపిక చేసుకుంటే చాలా పెద్ద తప్పిదం జరిగిపోతుంది. ఇన్స్టంట్ ఫుడ్స్ పిల్లలకు అసలు ఇవ్వకూడదు. ఎలాంటి పోషకాలు లేని ఆహారాన్ని పిల్లలకు ఇవ్వడమనేది చాలా బాధపడాల్సిన విషయం. పిల్లలకు పొరపాటున ఆ తిండి అలవాటు అయిపోతే ఇక వారిని సాధారణ ఆహారం వైపుకు తీసుకురావడం చాలా కష్టమవుతుంది. అందుకే పిల్లలకు ఎప్పుడూ ఆరోగ్యకరమైన, పోషకాలు కలిగిన తాజా ఆహారాన్ని మాత్రమే ఇవ్వాలి. ఇక నిద్ర విషయానికి వస్తే ఇప్పటికాలం భార్యాభర్తలకు ఎన్ని పనులున్నా ఎవరో ఒకరు రాత్రి తొమ్మిది గంటలలోపు పిల్లలతో కలసి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. పెద్దవాళ్ళు పక్కన ఉంటే పిల్లలు తొందరగా నిద్రపోతారు. అలాగే పిల్లలకు చిన్న చిన్న నీతి కథలు చెబుతూ నిద్రపుచ్చవచ్చు. అదే వారిలో నైతిక వ్యక్తిత్వానికి బీజమవుతుంది.  ముఖ్య విషయం!! అందరూ తెలుసుకోవలసిన మరొక ముఖ్య విషయం ఏమిటంటే పిల్లలు ప్రతిరోజు కనీసం 10 గంటల పాటు నిద్రపోతే వారు ప్లే స్కూల్ కు వెళ్ళాక చాలా చురుగ్గా అన్ని నేర్చుకుంటారు. శాస్త్రజ్ఞుల పరిశోధనల్లో ఈ విషయం నిరూపితమైంది కూడా.  పిల్లలకు వారి వయసుకు తగినట్టుగా మంచి ఆహారం, మంచి నిద్ర ఇవ్వగలిగితే, వారికి కొంత సమయం కేటాయించి వారిలో నైతిక విలువలు పెంపొందించగలిగితే వారి భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా ఉండదు అనే మాట అక్షరాల నిజం.                                       ◆నిశ్శబ్ద.

చిన్న పిల్లలకు ఏర్పడే ప్రమాదాలు

  చిన్న పిల్లలకు ఏర్పడే ప్రమాదాలు     చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో పెద్దలు, పిల్లలను ఓ కంటకనిపెడుతూ ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే చిన్నారులకు అపాయాన్ని గురించి ఆలోచించే వయస్సుండదు. అనుకోకుండా కొన్ని ప్రమాదాలు ఏర్పడితే, మరికొన్నింటిని ప్రమాదమేమో అని తెలియకుండా కొని తెచ్చుకునేవి కొన్ని. పిల్లలకు ప్రమాదం కలిగితే పెద్దలు అతిగాభరా పడుతూ పిల్లల్లో భయాన్ని కలిగించకుండా, వెంటనే ప్రథమచికిత్స పద్ధతులను పాటించాలి.   ఆ తర్వాత పిల్లల వైద్యునికి చూపించి, అవసరమయితే చికిత్సచేయించాలి. మందులు వాడాలి. అందువల్ల, ఏ ప్రమాదానికి ఏవిధమైన ప్రథమ చికిత్స జరపవలసినదీ పెద్దలకు సరైన అవగాహన ఉండాలి జారిపడితే : పిల్లలు నేలమీద, మెట్లమీద నుంచి ఎత్తుగా ఉండే అరుగుల మీద నుండి జారిపడి దెబ్బలు తగుల్చుకోవచ్చు. దెబ్బ తగిలిన నొప్పికంటే, భయంతో పిల్లలు ఏడ్చేస్తారు. పిల్లల ఏడుపునకు కంగారు పడకూడదు. పిల్లలను భయపడవద్దని బుజ్జగిస్తూ, ఏం జరిగిందో, ఎక్కడ ఏవిధంగా పడిందీ, దెబ్బ ఎక్కడ తగిలిందీ తెలుసుకోవాలి. చర్మం చీరుకుపోయి రక్తం వస్తుంటే డెట్టాల్‌ నీటితో చర్మాన్ని శుభ్రంగా కడిగి, టించర్‌ను దూదితో అద్దాలి. రక్తం ఆగకుండా వస్తుంటే, తడిబట్టతో కొంతసేపు నొక్కి ఉంచాలి. ఆ తర్వాత వైద్యుని వద్దకు తీసుకువెళ్ళి వైద్య సలహా ప్రకారంగా కట్టుకట్టించడమో, మందులు ఇవ్వడమో చేయాలి.   కాలినప్పుడు : చిన్నారులను వేడి వస్తువుల దగ్గరకు రానీయకుండా, వంటింట్లో పరుగులు తీయకుండా చూసుకుంటుండాలి. వేడి నీళ్ళతో ఆడాలని చేయి పెట్టినా చేతులు కాలి, లేత చర్మానికి బొబ్బలొస్తాయి.. వెంటనే పిల్లల చేతులు మీద ధారగా చన్నీళ్ళను పోయాలి. ఆ తర్వాత చల్లని నీళ్ళతో తడిపిన బట్టను చర్మం మీద ఉంచి, వెంటనే డాక్టర్‌ వద్దకు తీసుకెళ్ళాలి. చిన్నపిల్లలకు అందనంత ఎత్తులో వేడి కుక్కర్‌ను, వేడి పాత్రలను, బాణలిలాంటి వాటిని ఉంచాలి. డైనింగ్‌ టేబుల్‌ మీద, టేబుల్‌ క్లాత్‌కు క్రిందకు వేలాడుతున్నట్లుగా వేయకూడదు.   చిన్నపిల్లలున్న ఇంట్లో, ఆ టేబుల్‌ క్లాత్‌ను పిల్లలు లాగి, టేబుల్‌ మీద ఉం చిన పాత్రలను, వేడి పదార్థాలను మీద వేసుకునే ప్రమాదం ఉంటుంది. వారి చర్మం కాలే ప్రమాదముంటుంది. పిల్లలకు చర్మంకాలినప్పుడు చర్మం మీద చల్లటి నీటిని ధారగాపోయడమే సరైన పద్ధతి. తేనె పూయడం లాంటివి చేయకూడదు. డాక్టర్‌కు చూపించాలి. వెంటనే, బొబ్బలను చిదపకూడదు. చర్మాన్ని రబ్‌చేయకూడదు.   సుకుంటే : పెద్దల నిర్లక్ష్యం, అశ్రద్ధ, మతిమరుపు వల్ల కూడా చిన్నారులకు పదునైన వస్తువులు కోసుకునే ప్రమాదం వుంది. కూరలు తరిగే కత్తిపీట, చాకు, కత్తెర, బ్లేడు లాంటి పరికరాలను వాడిన తర్వాత, వాటిని పిల్లలకు అందుబాటులో లేకుండా జాగ్రత్తగా ఉంచాలిపిల్లలు ఆడే ఆట వస్తువుల వల్ల కూడా వారికి చర్మం కోసుకుని లోతుగా దిగే ప్రమాదం ఏర్పడ వచ్చు. పదునుగా వుండే ఆట వస్తు వులు, రేకు లున్న ఇనుప బొమ్మలు, మేకులు, స్క్రూలు లాంటివి ఉన్న బొమ్మలు పిల్లలకు ఆటవస్తువులుగా కొనకూడదు. ఇవ్వకూడదు. గాజు సీసాలు, గాజుపాత్రలు పిల్లలకు అందనంత ఎత్తులో ఉంచాలి. పొరపాటుగా పిల్లలు కోసుకుని నెత్తురు కారుతుంటే, చల్లటి నీటితో తడిపిన బట్టను చుట్టాలి. లేదా ఐస్‌ ముక్కలను బట్టలో ఉంచి రక్తం కారుతున్న ప్రదేశంలో ఒత్తిపెట్టి ఉంచితే రక్తం కారటం ఆగిపోతుంది. లోతుగా కోసుకుంటే! ఆ భాగాన్ని ఎత్తుగా వుంచి, చల్లటినీటితో తడిసిన బట్టను ఉంచాలి. రక్తస్రావం ఆగిపోయిన తర్వాత, పరిశుభ్రమైన బట్టతో తెగిన ప్రదేశంలో చర్మాన్ని కప్పి, ఒదులుగా చుట్టి, ఆ తర్వాత వైద్యుని వద్దకు తీసుకువెళ్ళి చూపించి, వైద్య సలహా తీసుకోవాలి. అవసరమైన చికిత్సను చేయించాలి.   కీటకాలు కుడితే : కొన్ని రకాల కీటకాలలో కొంత విషపదార్థం ఉంటుంది. అటువంటి విషకీటకాలు కుడితే పిల్లలకు ఎలర్జీ కలిగి, ఆ తర్వాత కుట్టిన చర్మం మీద అమిత బాధకలుగుతుంది. గొంగళి పురుగులు లాంటివి కుడితే, చర్మం మీద పాకితే దురదలు, దద్దుర్లు వచ్చి పిల్లలకు బాధ కలుగుతుంది. అప్పుడు, గోరువెచ్చని నీటితో స్నానం చేయించి, దద్దుర్లు, దురద తగ్గటానికి గొంగళిపురుగు పాకిన ప్రదేశంలో విభూదిని బాగా రుద్దాలి. కొన్ని విషకీటకాలు కుడితే ఎలర్జీ ఏర్పడటమే కాకుండా, మరికొన్ని తీవ్రమైన మార్పులు వస్తాయి. దద్దుర్లు ఎర్రగా మారినప్పుడు, ఊపిరి పీల్చుకోవడంతో ఇబ్బంది కలిగినప్పుడు పెదాలు నల్లబడటం, నాలుక తడారిపోవడం లాంటి లక్షణాలు ఏర్పడితే ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా పిల్లలను వైద్యుని వద్దకు తీసుకెళ్ళాలి. అవసరమైన వైద్య సహాయాన్ని పిల్లలకు అందించాలి.   మందులు, రసాయనాలు : మందులు, క్లీనింగ్‌లోషన్స్‌ పిల్లలకు అందనంత ఎత్తుగా ఉంచాలి. పిల్లలు ఏమైనా మందులు తాగినా, మందుబిళ్ళలు తిన్నా వాటిని కక్కించాలని, ఉప్పునీళ్ళు త్రాగించడం, మంచినీళ్ళు ఎక్కువగా త్రాగించడం చేయకూడదు. అలా చేసినట్లయితే కడుపులో చేరిన మందులు, వెంటనే రక్తంలో చేరే ప్రమాదం ఉంది. బిడ్డకు ప్రాణాపాయ స్థితి ఏర్పడవచ్చు. ఇటువంటివి జరిగినప్పుడు, తక్షణమే వైద్య సహాయం పొందడం చాల అవసరం. కీటకాలను సంహరించే మందులను అమిత భద్రంగా ఉంచాలి. మందును స్ప్రే చేసినప్పుడు పిల్లలను ఆ ప్రదేశానికి దూరంగా ఉంచాలి. దోమలు, నల్లులు, ఎలుకలు, బొద్దింకలు చీమల సంహారక మందులను పిల్లలు నిద్ర పోయిన తర్వాత ఉపయోగించి, పిల్లలు నిద్రలేవకుండా క్లీన్‌ చేసేయ్యాలి.   వాటిని పిల్లలకు తెలియకుండా దాచాలి. పిల్లలకు ఏర్పడే కొన్ని ప్రమాదాలకు తక్షణ ప్రథమచికిత్స చేయాలి. మరికొన్ని ప్రమాదాలకు ఎంతమాత్రం ఆలస్యం జరగకుండా వైద్య చికిత్స జరగాలి. ముఖ్యంగా, పిల్లలకు ప్రమాదాలు జరిగినప్పుడు పెద్దలు, ఆందోళన, గాభరా పిల్లల ఎదుట ప్రదర్శించకూడదు. పనులు చేసే టప్పుడు చిన్న పిల్లలున్నారన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మరుపు, అ శ్రద్ధ, నిర్లక్ష్యం లేకుండా ప్రవర్తించాలి. పిల్లలకు జరిగే ప్రమాదాలు ప్రాణా పాయ స్థితికి చేరకుండా తక్షణమే, చర్యలు తీసుకోవాలి.  

నిత్య నేర్పిన జీవిత పాఠం

నిత్య నేర్పిన జీవిత పాఠం     1 * మొన్న మా పక్కింటి పాపాయి నుంచి నేనో మంచి విషయం నేర్చుకున్నానండి. ఏడేళ్ళు వుంటాయి 2వ తరగతి చదువుతోంది- వాళ్ళ క్లాసు వాళ్ళని పిక్నిక్ కి తీసుకువెళ్తున్నారని పదిరోజుల ముందు నుంచి అపార్ట్ మెంట్ అంతా తిరిగి అందరికి చెప్పింది. అరోజు తేసుకువెళ్ళటానికి కొత్త బ్యాగు,లంచ్ బాక్సు వంటివి వాళ్ళమ్మతో కొనిపించుకుంది. తీరా పిక్నిక్ ఒకరోజు ముందు తనకి విపరీతమైన జ్వరం. మర్నాటికి ఏమాత్రం తగ్గినా పంపిచేస్తానంది వాళ్ళ అమ్మ. కాని పాపం తగ్గలేదు. మర్నాడు ఉదయం 6 గంటలకి తను స్కూలు దగ్గరకి వెళ్ళాలి. వెళ్ళుతుందో, లేదో,తనకి ఎలా వుందో కనుక్కుందామని వాళ్ళంటికి వెళ్ళాను. అప్పటికే లేచి సోఫాలో కుర్చుని వుంది. ఇంకా జ్వరం తగ్గలేదు, నాకు చాలా బాదేసింది. పాపం ఎప్పటినుంచో సరదా పడుతోంది కదా అనిపించింది. 2  *  మా పక్కింటి నిత్య వాళ్ళ అమ్మ కళ్ళల్లో అయితే కన్నీళ్ళు ఆగటం లేదు. ఎంత సరదా పడిందో, ఇప్పుడే రావాలా ఈ జ్వరం. లాస్ట్ ఇయర్ నేనే చిన్నదని పంపించలేదు. ఈ సంవత్సరం ఇలా అయ్యింది పాపం. అంటూ ఆమె కన్నీళ్ళు పెట్టుకోగానే ఆ సిసింద్రీ టక్కున లేచి వాళ్ళమ్మ మెడచుట్టూ చేతులు వేసి ఏమందో తెలుసా "అమ్మ నా ఫ్రెండ్స్ తో పిక్నిక్ కి వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకన్నాను. కాని కుదరలేదు కదా ఈరోజు అమ్మతో పిక్నిక్ చేసుకుంటాను. ఏముంది అందులో. " నేనూ, వాళ్ళమ్మ ఒక్క నిమిషం అలా నిలబడిపోయాం. ఎక్కడ అది ఏడ్చి గోల చేస్తుందో అని నేనూ ఎంత భయపడ్డానో, అలాంటిది అంత తేలికగా తను అలా అనేసరికి భలే ఆశ్చర్యపోయాను. అనటమే కాదు తను అరోజుంతా వాళ్ళమ్మతో ఎంచక్కా ఎంజాయ్ చేసింది కూడా. 3 * ఒకోసారి పిల్లలు మనకి జీవితపాటాలని నేర్పిస్తారు. తను కోరుకున్నది జరగకపోయినా తను ఆనందంగా ఉండగలనని చెప్పకనే చెప్పింది మా నిత్య. తను కొనుక్కున కొత్త బ్యాగులో బిస్కెట్లు, చాక్లెట్లు, చిప్స్ వంటివి పెట్టుకుని వచ్చి వాళ్ళమ్మని కూడా బాగా తయారవ్వమని వాళ్ళ బాల్కనీలో పాటలు పెట్టుకుని అక్కడే టిఫిన్, భోజనం చేసి వాళ్ళమ్మతో రకరకాల గేమ్స్ అడుకుందట సాయంత్రం దాకా.  పైగా ఫొటోలు కూడా తీయమందట, మర్నాడు వాళ్ళమ్మగారు ఈ విశేషాలన్ని చెబుతూ, నా కూతురుతో నాకు ఇది ఓ మంచి అనుభవం. ఎంత ఎంజాయ్ చేసానో చెప్పలేను. తన ప్రవర్తన చూసి గర్వపడుతున్నాను అని చెప్పరు. 4 * ఎన్నోసార్లు మనం కోరుకున్నవి, కోరుకున్నట్టు జరగకపోతే ఎంతో మదనపడిపోతాం. వెంటనే చిరాకు, కోపం వచ్చేస్తాయి. ఎప్పుడూ ఇంతే అంటూ మన జీవితాన్ని, కాలాన్ని నిందిస్తాం. కాని పోనిలే కోరుకున్న విధంగా జరగ పోతేనేం, జరుగుతున్న దానిని ఆనందంగా స్వీకరిద్దాం అని ఆలోచించం. నిత్య ఇంట్లో ఉన్న సమయాన్ని ఏడుస్తూ గడపలేదు. తనుకున్న అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంది. వాళ్ళమ్మతో కలసి ఓ రోజంతా హాయిగా గడపచ్చు అనుకుంది. అలాగే చేసింది కూడా ఆరోజు తన దృష్టిలో ఆనందంగా గడిపినట్టే. తను ముందు నుంచి కోరుకున్నట్టు కాకపోయినా సరే ఆరోజు ఓ మంచి జ్ఞాపకంగా మిగుల్చుకోగలిగింది. 5 * మన జీవితపు ప్రయత్నంలో అన్ని అనుకున్నట్టు, మనం ఆశించినట్టు జరగవు ఒక్కోసారి. అంతమాత్రాన చిన్నబుచ్చుకుని, మనసుని కష్టపెట్టుకోనక్కర్లేదు. జరగని విషయాన్ని పదే పదే గుర్తుచేసుకుంటే  వేరే దారులు కనిపించవు ఎప్పటికి, సరే ఈ దారి పూర్తిగా మూసుకుపోయింది, మరి వేరే దారి ఉందేమో చూద్దాం అనుకుంటే తప్పకుండా వేరే దారి కనిపించక మానదు. మనం గట్టిగ కళ్ళుమూసుకుని దారులన్ని ముసుకుపోయాయినుకుంటే ఎప్పటికీ మూసుకునే వుంటాయి. మన అడుగుల వడిని అపే అడ్డంకి ఏదైనా ఎదురయితే మరింత ఉత్సహంగా వేరే దారి వైపు వడివడిగా అడుగులు వేయగలిగితే మనకి " జీవించటం" వచ్చినట్టే.

లంచ్ బాక్స్ మీదే పిల్లల ఆరోగ్యం ఆధారపడి వుంటుంది..

లంచ్ బాక్స్ మీదే పిల్లల ఆరోగ్యం ఆధారపడి వుంటుంది..   ఎదిగే పిల్లల ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే వారి ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. ఇంట్లో ఉంటే బతిమాలో..బామాలో ఏదో రకంగా తినిపించవచ్చు. మరి స్కూళ్లకి వెళ్లే పిల్లల సంగతేంటి. లంచ్ బాక్స్ మీదే పిల్లల ఆరోగ్యం ఆధారపడి వుంటుంది..తినే పిల్లలయితే ఓకే.. కానీ తినని పిల్లలయితే కష్టం. అలాంటి వారి విషయంలో కాస్త జాగ్రత్తగా బాక్స్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. మరి వారికి లంచ్ బాక్స్ ఎలా ప్రిపేర్ చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి... అనే విషయంలో డాక్టర్ జానకి శ్రీనాథ్ ఈ వీడియో ద్వారా కొన్ని సలహాలు చెబుతున్నారు. అవెంటో మీరూ తెలుసుకోండి..  https://www.youtube.com/watch?v=82CsdQjBnug  

ప్రపంచ వ్యాప్తంగా 2 మిలియన్ల పిల్లలు ఆస్తమా బారిన పడుతున్నారు.... 

ప్రపంచ వ్యాప్తంగా 2 మిలియన్ల పిల్లలు ఆస్తమా బారిన పడుతున్నారు.... ప్రపంచ వ్యాప్తంగా 2 మిలియన్ల పిల్లలు ఆస్తమా బారిన పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పరిశోదనలో 1.8 మిలియన్ల బాలల మరణాలు కేవలం వాయు కాలుష్యం వల్లే అని మీకు తెలుసా? వాయు కాలుష్యం ఆస్తమాకు కారణాలు ...... ప్రపంచం అభివృద్ధి సాదిస్తోంది. యాంత్రికరణ తో పరిశ్రమలు స్థా పించారు. ఉత్పాదకత పెరిగింది పంపిణీ పెరిగింది రవాణా వచ్చింది. పచ్చటి అరణ్యాలు నాశనం చేస్తూ కాలుష్యం పెంచుకుంటూ చుట్టూ కాలుష్య కసారాల మధ్య జీవితాన్ని గడిపేస్తూ చిన్నారుల భవితవ్యాన్నిఆరోగ్యాన్ని చిదిమేస్తున్నాం . తత్ఫలితంగా నేడు ప్రపంచ  వ్యాప్తంగా పిల్లలు ఆస్తమా బారిన పడుతున్నారన్న విషయాన్ని ఇప్పటికీ గ్రహించడం లేదు.దీనిఫలితంగా 2 మిలియన్ల కొత్త పిరియాడిక్ ఆస్తమా కేసులు చోటు చేసుకోవడం ముఖ్యంగా ప్రపంచ వ్యాప్త్గంగా పెద్ద పెద్ద నగరాలలో జరుగుతున్నట్లు ఒక పరిశోదన వెల్లడించింది. ఒక పరిశోదనలో పిరియాడిక్ అస్తమా కేసులు భారంగా మారాయి. దాదాపు 13, ౦౦౦ పట్టణాలలో  లోస్ ఏంజిలిస్, ముంబాయి వంటి నగరాలు ముందువరుసలో ఉండడం నిపుణులు పేర్కొన్నారు. పిల్లలలో ఆస్తమాకు కారణాలు.... నిపుణులు చేస్తున్న పరిశోదనలో నైట్రోజన్ డయాక్సైడ్ పిల్లలో అత్యంత ప్రమాదకరం గా ఉండడమే ఆస్తమాజు ప్రాధాన కారణం అవుతుందని నిపుణులు తమ పరిశోదనలో వెల్లడించారు. అక్యుపెష నల్ హెల్త్ జార్జియా వాషింగ్ టన్  విశ్వ విద్యకయానికి చెందిన ప్రకృతి పర్యావరణ వేత్తప్రొఫెసర్  సుసాన్ అనాన్ బర్గ్  మాట్లాడుతూ అందరికీ కాలుష్య రహి వాతావరణం కల్పించడం లో మనం విఫల మయ్యా మని అన్నారు. కాలుష్య రహిత వాతావరణం కల్పించడం అత్యంత కష్ట తరంగా మారిందని పిల్లలకు  సంపూర్ణ ఆరోగ్యం అందించడం  లో విఫల మౌతున్నామని ఆవేదన వ్యక్తం చేసారు. పిల్లలో ఆస్తమాకు దారి తీస్తున్న కారకాలు ఇవే .... అనెన్ బెర్గ్ బృందం పరిశోదనలో నైట్రోజన్ డయాక్సైడ్ ఎన్ ఓ2  కాలుష్యం వాహనాల పొగ గొట్టాల నుండే వస్తోందని గుర్తించారు. ముఖ్యం గా విద్యుత్ ఉత్పాదక పరిశ్రమలు, పారిశ్రామిక వాడలు, 2౦౦౦ -2౦19 వరకు పరిశీలించారు. ఆస్తమ దీర్ఘ కాలిక వ్యాధి ఊపిరితిత్తుల నాళాలలో ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది.అని వైద్యులు గుర్తించారు. పరిశోదన లోని కీలక అంశాల ను ఈ బృందం గమనించింది. 1) ప్రపంచ వ్యాప్తంగా 1.85 మిలియన్ల పిల్లలో పిడియాట్రిక్స్ ఆస్తమా కేసులు ఉండవచ్చని వేసిన అంచనా కేవలం  కార్బన్ డయాక్సైడ్ ద్వారా మాత్రమే అని 2౦19 సంవత్సరం లో పేర్కొన్నారు. అందులో 2/3 వంతు గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ఉండటం గమనార్హం. 2) గ్రామీణ పట్టణ ప్రాంతాలలో చేపడుతున్న పట్టణీకరణ, పారిశ్రామికీ కరణ, కారణంగానే కార్బన్ డై యాక్సైడ్ కారణంగా నిర్ధారించారు. అ త్యధిక శాతం లో పెరిగిపోతున్న వాయు కాలుష్యం వల్లే పిల్లలకు కాలుష్యం లేని వాతావరణం అందించడం కష్ట సాధ్య మౌతోందని గుర్తించారు. ఈ రకమైన సమస్య అత్యధిక ఆదాయం ఉన్న దేశాలలో అంటే యుఎస్, వంటి దేశాలలో ప్యాండమిక్  ఆస్తమా విస్తరిస్తోంది. ప్రధానంగా ఆయా అభివృద్ధి చెందిన దేశాలలో గాలి నాణ్యత పెరగక పోగా యూరప్, యుఎస్ దేశాలలో కాలుష్యం ప్రత్యేకంగా ఎన్ ఓ2 కార్బన్ డయాక్సైడ్ దక్షిణ ఆశియ దేశాలలో ఆస్తమా కేసులు పెరగడాన్ని పరిశోధకులు గమనించారు. ముఖ్యంగా సహారా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ లలో పిడియాట్రిక్ ఆస్తమా కేసులు కేవలం వాయు కాలుష్యం వల్ల వేల సంఖ్యలో సామాన్యుల ప్రజా ఆరోగ్యం పెనుభారంగా మారిందని. గతంలో జరిగిన పరిశోదనలో పరిశోధకులు కార్బన్ డయాక్సైడ్ వల్ల 13% ప్రపంచ వ్యాప్తం గా ఆస్తమా వల్ల 5౦% పెరిగిందని ప్రపంచ వ్యాప్తంగా 25౦ నగరాలలో ఈ పరిస్థితి నెలకొంది. మొత్తం మీద చూస్తే పిరియాడిక్ ఆస్తమా కేసులు కార్బన్ డయాక్సైడ్ 2౦% తగ్గిందని 2౦౦౦ సంవత్సరం లో 16% 2౦19 లో కొంత వాతావరణం లో కాలుష్యం తగ్గడం  వల్ల యు ఎస్ లో పిల్లలు కొంత ఆరోగ్యం మెరుగు పడినట్లు నిపుణులు గుర్తించారు. ప్రత్యేకంగా ఎవరైతే ఇరుగు పొరుగు దేశాలు ఉంటాయో వారి మధ్య  రోడ్డు రవాణా పారిశ్రామిక ప్రాంతాలు ఉంటాయో అయాప్రాంతాలలో వాయు కాలుష్యం ఉన్నట్లు గుర్తించారు. కాగా అధిక ఆదాయం ఉన్న దేశాలలో మరిన్ని పరి శోదనలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచం లోని కొన్ని భాగాలలో ప్రాణాలు హరించే రాసాయనాలు లేకుండా చేయడం, వాహానాలు వెదజల్లే విష వాయువులుపూర్తిగా నిషేదిన్చాల్సిన అవసరం ఉంది. వాహనాలు వేద జల్లే కార్బన్ డై ఆక్సైడ్ పిల్లల కు హానికారకం గా ఉందని దీనిప్రభావం తోనే పిల్లలు ఆస్తమా బారిన పడు తున్నారని నిపుణుల బృందం అభిప్రాయ పడింది. మరొక పరిశోదనలో వేరినోక్ సదర్ ల్యాండ్ అమెన్ బర్గ్ వారి బృందం 1. 8 మిలియన్ల కంటే ఎక్కువగానే  అనారోగ్యం పాలయ్యారని  కార్బన్ డయాక్సైడ్  అధిక మోతాదులో ఉండడం    ఆందోళణ కలిగిస్తోందని  నిపుణులు వెల్లడించారు. 2౦19 లో నే ఇది జరగడం బాధాకరం అని అన్నారు. ఆధునిక పరిశీలనలో 86% పెద్దలు, పిల్లలు పట్టణ ప్రాంతాలాలో నివసిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా డబ్ల్యు హెచ్ ఓ సూచన లను మార్గదర్సకాలను అనుసరించక పోవడం విస్మరించడం వల్లే  తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కార్బన్ డయాక్సైడ్ లేకుండా ఆరోగ్యం గా ఉండాలంటే ...... ఆస్తమా కు కారణ మౌతున్న వాహనాల ఇంధనం వల్ల కాలుష్యం వె ద  జల్లు తున్న కారణంగా దీని బారి నుండి బయట పడాలంటే సిలాజాల ఇంధనం నడిచే వాహనాల ను రవాణా కు వాడడం ద్వారా కాలుష్యం తగ్గు ముఖం పట్టించ వచ్చు పిల్లలలో శ్వాస కోశ సంబంధిత సమస్యలు తగ్గి పిల్లలు,పెద్దలు గాలి పీల్చు కునే వీలు ఉంటుంది. అదే వారికి మనం ఇవ్వ గలిగే పెద్దడివిడెంట్ శ్వాస కొస సంబందిత  ఆస్తమా కేసులు తగ్గి మరణాలు తగ్గించడమే అని అనెన్ బెర్గ్ అన్నారు. ఇదే సమయం లో గ్రీన్ హౌస్ గ్యాస్ ను తగ్గించాలి అప్పుడే ఆరోగ్యంగా ఉండగలిగే వాతావరణం సాధ్యం. ఎం ఓ2 కార్బన్ డయాక్సైడ్ సాంద్రత స్థితి వల్ల వ్యాధి మరింత భారంగా మారింది. దాదాపు 13, ౦౦౦ పట్టనాలాలో ప్రపంచ వ్యాప్తంగా పల్స్ నిర్వహించారు.  పిల్లల,పెద్దలా ఆస్తమాకు కారణ మౌతున్న కార్బన్ డయాక్సైడ్ ను నిషేదించడం,లేదా వినియోగించకపోవడం, కాలుష్యానికి కరనమౌతున్న ఉద్గారాల ను పర్స్రమలను పూర్తిగా నిషేదించడం కీలకం ఈదిశాగా ప్రపంచ దేశాలు తమ పారిశ్రామిక విధనానీ భవిష్యత్తు ప్రణాలికను సిద్ధం చేసుకోవాలి. అని నిపుణులు సూచిస్తున్నారు.                                                                           

పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే...

  పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే...?     వయసు పెరిగేకొద్దీ జ్ఞాపకశక్తి తగ్గుతుంటుంది. దీనితో పలు ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. సాధారణంగా పిల్లలు చదివిన విషయాలను గుర్తుంచుకుంటారేమో గానీ, అదే పరీక్ష సమయంలో చదివిన విషయాలను మరచిపోతుంటారు. పరీక్షలొస్తున్నాయంటే చాలు పిల్లలు మానసిక ఆందోళనకు, ఒత్తిడికి గురవుతుంటారు. వాళ్ళు మామూలు సమయాల్లో ఎంత బాగా చదివినా, ఆందోళన వల్ల, భయం వల్ల పరీక్షల్లో తగిన ఫలితాన్ని సాధించలేకపోతారు. ఇలాంటి పిల్లల కోసం తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏమిటే చూద్దామా....! * పరీక్షలు సమీపిస్తున్నాయంటే పిల్లల్లో ఒక విధమైన భయానికి లోనవుతుంటారు. అలాంటి వారికి పోషకాలు గల ఆహారం వారి తల్లిదండ్రులు తప్పక ఇవ్వాలి. * పిల్లలకు మంచి ఆహారంతోపాటు విటమిన్‌ బి12, విటమిన్‌బి6, విటమిన్‌ సి, ఇ, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఉన్న ఆహారాన్ని ఇవ్వాలి. * పరీక్షల సమయంలో కొవ్వు పదార్థాలను వీలైనంతవరకు తగ్గించడం చాలా మంచిది. ఎక్కువ ఫ్యాట్‌ ఉండే పదార్థాలను తీసుకోవడం వల్ల చురుకుదనం లోపిస్తుంది. * నేరేడు పండులో జ్ఞాపకశక్తిని పెంచే యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా వుంటాయి. ద్రాక్ష, చెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌ అధికంగా ఉండడం వల్ల రోజూ ఒక గ్లాస్‌ ద్రాక్ష జ్యూస్‌ తీసుకోవడం ఎంతో మంచిది. * అలాగే ఆపిల్స్‌లో కూడా విటమిన్లతోపాటు కాల్షియం, క్వెర్‌సిటిన్‌, ఆంథోసియానిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల మతిమరుపు సమస్యను తప్పించుకోవచ్చు. * ఇక పాలకూర వాడకం కూడా జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. బొప్పాయి, అరటిపండులో ఉన్న పోలేట్‌, మెగ్నీషియం, పోటాషియం, విటమిన్‌ బి6 మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ పండ్లలోని పిండిపదార్థం మెదడును ఎక్కువసేపు చురుకుగా ఉండేటట్లు చేస్తాయి. * తేనె వాడకం వల్ల యాంగ్జైటీ తగ్గి జ్ఞాపకశక్తి వృద్ది చెందుతుంది. పిల్లల్లో జ్ఞాపకశక్తి పెంపొందాలంటే, వారు పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలంటే వారికి పోషకాహారం తప్పక అందించాలి.

మీ పిల్లలకి డబ్బు గురించి తెలుసా...

మీ పిల్లలకి డబ్బు గురించి తెలుసా?     చాలామంది తల్లిదండ్రులు డబ్బు అనేది తమకు సంబంధించిన విషయం అనుకుంటారు. పిల్లలకు దాని గురించి తెలియాల్సిన అవసరం లేదనుకుంటారు. దానివల్ల ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో వారికి తెలియదు. డబ్బు గురించి చెప్పకుండా, డబ్బు విలువ గురించి తెలియజెప్పకుండా పెంచడం వల్ల పిల్లలకు అయితే డబ్బు వ్యవహారాలు తెలియకుండా పోతాయి. లేదంటే వాళ్ల దృష్టిలో డబ్బు లోకువైపోతుంది. ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేయడం, డబ్బు కోసం తప్పుడు దారులు తొక్కడం కూడా జరుగుతుంది. ఇలాంటివి జరక్కూడదంటే పిల్లలకు డబ్బు గురించి తెలియాలి. మీది మధ్య తరగతి కుటుంబం అయితే కచ్చితంగా తెలిసి తీరాలి. - మీరు బడ్జెట్ ప్లాన్ చేసుకునేటప్పుడు పిల్లల్ని కూడా ఇన్ వాల్వ్ చేయండి. దేనికి ఎంత కేటాయిస్తున్నారో, ఎందుకు అంతే కేటాయిస్తున్నారో వాళ్లకు తెలియనివ్వండి. - ఇంట్లోకి కావలసిన వస్తువులు, సరుకులు కొనేటప్పుడు పిల్లల్ని వెంట తీసుకెళ్లండి. ఏం కొంటున్నారు, తక్కువలో వచ్చేలా ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు వంటివి వాళ్లకి తెలిసేలా చేయండి. - అప్పుడప్పుడూ సరుకులు తెమ్మని పిల్లలకే చెప్పండి. ఇచ్చిన డబ్బులో వీలైనంత ఎక్కువ మిగిలిస్తే ప్రైజ్ ఇస్తానని చెప్పండి. - పిల్లలకు మొదట్నుంచీ పొదుపు చేయడం నేర్పండి. కిడ్డీ బ్యాంక్ లో ఎంతో కొంత జమ చేస్తూ ఉండమని చెప్పండి. అది నిండిన ప్రతిసారీ వాళ్లకు అవసరమైనదేదైనా కొనుక్కునేలా చేయండి. దానివల్ల అవసరాలు తీర్చుకోవాలంటే డబ్బు దాచుకోవాలన్న విషయం తెలుస్తుంది. - వేరే వాళ్ల దగ్గరున్న వస్తువుల్ని చూసి పిల్లలు మారాం చేస్తుంటారు. అవి మీరు కొనే పరిస్థితుల్లో లేకపోతే కోప్పడకండి. ఎందుకు మీరు కొనలేరన్నది చెప్పండి. మీ బడ్జెట్లో దాన్ని రీప్లేస్ చేసి చూపించండి. వాళ్లే శాటిస్ ఫై అవుతారు. అలా చేయకుండా కోప్పడితే వాళ్లలో బాధ, అసంతృప్తితో పాటు దాని మీద ఆశ కూడా మిగిలిపోతుంది. - పిల్లలతో అప్పుడప్పుడూ బిల్స్ కట్టించండి. దానివల్ల దేనికెంత అవుతుందో తెలుస్తుంది, వేటినెంత జాగ్రత్తగా వాడాలో తెలుస్తుంది. - ఇతరులకు ఇవ్వడం కూడా నేర్పించండి. వాళ్ల చేతులతో లేనివాళ్లకి ఇప్పించండి. నీ దగ్గరున్న దాన్ని ఇతరులకి కూడా పంచాలి అని చెప్పండి. - డబ్బు గురించి చెప్పాలి కానీ మరీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపించకండి. డబ్బు అవసరమే కానీ అదే జీవితం అన్న ఫీలింగ్ పిల్లలకు రానివ్వకూడదు. కాబట్టి డబ్బుకి ఎంత విలువ ఇవ్వాలన్నది స్పష్టంగా చెప్పాలి. గొప్ప పనులు చేయడం కోసం ఆస్తి పాస్తుల్ని సైతం కాదనుకున్న వాళ్ల కథలను చెప్తూ ఉండండి. చిన్నపిల్లలకు ఇవన్నీ ఎందుకు అని చాలామంది అనుకుంటారు. కానీ ఏదైనా చిన్నతనంలోనే నేర్పాలి. బాల్యంలో నేర్చుకున్నవే వాళ్లను జీవితాంతం ముందుకు నడిపిస్తాయన్న విషయం గుర్తుంచుకోండి. - Sameera  

అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న పిల్లలు!

అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న పిల్లలు! 1 69  పిల్లలలో పెరుగుతున్న అంతుచిక్కని హెపటైటిస్ వ్యాధి-డబ్ల్యు హెచ్ ఓ హెచ్చరిక. అమెరిక సంయుక్త రాష్ట్రాలు యునైటెడ్ కింగ్ డం దేశాలలో అంతుచిక్కని హెపటైటిస్ కేసులు పెరుగుతున్నట్లు గుర్తించారు. ఇక్కడ ఒక విషయం గుర్తించాలి అతిగా తగారో లివర్ సమస్యలు తప్పవు. అని అందరికీ తెలుసు కాని పిల్లలలో అంతు చిక్కని హెపటైటిస్ వ్యాధితో బాధపడుతున్నారు.ప్రతి నలుగురిలో ఒకరు లివర్ దిజార్దర్ తో సతమత మౌతున్నారు. అది గుండె పోటుకు దారి తీస్తుంది.కిడ్నీలో రాళ్లు తొలగించేందుకు వాటిని పగల గొట్టేందుకు ఆల్కాహాల్ లివర్ డిసీజ్ పిల్లలో పెరగడం పట్ల డబ్ల్యు హెచ్ఓ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.లివర్ ఇన్ఫెక్షన్ పెరగడం పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యు ఎస్,యు కే ల లో ఎక్యుట్ హేప టై టిస్ పెరగడం వల్ల పిల్లలు ఆసుపత్రిలో చేరుతున్నారు. కొన్ని కేసులలో లివర్ ట్రాన్స్ ప్లాంట్స్ పెరగం గమనార్హం కాగా మరణాలు లేకపోవడాన్ని. ఒక శుభ పరిణామంగా పేర్కొన్నారు. పిల్లలో హేప టైటిస్ తీవ్రత అక్యుట్ హెపటైటిస్ కేసులు పెరగడం అదీ 1 సం నుండి 6 సం లోపు పిల్లలో అక్టోబర్ 2౦21 న గుర్తించారు. రాష్ట్ర ప్రజా ఆరోగ్య శాఖ ఏప్రిల్ 5 న డబ్ల్యు హెచ్ ఓ గుర్తించింది. ఇందులో 1౦ సంవత్సరాల లోపు పిల్లలు స్కాట్ ల్యాండ్ లో గుర్తించారు.యు కే లో 74 విర్లాండ్ లో ప్రతి 5 గురిలో ౩ గ్గురికి అంటే 22  నెలల నుండి 1౩ సం స్పెయిన్ లో కనుగొన్నారు. యు ఎస్ యురప్ అచి నో  వైరస్ గా గుర్తించారు.దీనివల్ల పిల్లలలో తీవ్ర అనారోగ్యానికి గురి అవుతున్నారు.అయితే ఈ వైరస్ అరుదైనది గా పేర్కొన్నారు. ఆరోగ్యంగా ఉన్నవారిలో హెపటైటిస్ వస్తుందని గుర్తించారు. అచినో వైరస్ చాలా సహజం ప్రజలలో విస్తరిస్తోంది.హెపటై టిస్ లివర్ లో వచ్చే ఇంఫ్లామేషణ్ వైరస్ వల్ల అనారోగ్యానికి కారణం గా గుర్తించారు. యు ఎస్ కు చెందిన సి డి సి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నివారణా సంస్థ జాండీస్ అంటే పచ్చకామెర్లు,తీవ్ర విరేచనాలు,వాంతులు,కడుపులో నొప్పి,వంటి లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. కొంతమంది పిల్లలు లివర్ నిపుణులను సంప్రదించగా లివర్ ట్రాన్స్ ప్లాంట్ చేయాలనీ సూచించారు. రానున్న రోజులలో మరిన్ని కేసులు పెరగ వచ్చని డబ్ల్యు హెచ్ ఓ అంచనా వేస్తోంది.అయితే సి డి సి,డబ్ల్యు హెచ్ ఓ పరిశోదనలు చేస్తోంది. దీనికికారణం అదేనో వైరస్ లేదా కోరోనా వైరస్ అన్న అంశం పై పరిశోదనలు చేస్తున్నారు. జాతీయ స్థాయి లో అత్యంత కీలక మైన అంశం ఏమిటి అంటే అన్ని కేసులు రిపోర్ట్ కాలేదని అయితే ఇప్పటికి అందిన సమాచారం ప్రకారం 169 కేసులు డబ్ల్యు హెచ్ ఓ గుర్తించింది.అయితే సి డి సి మరోకోణం లో వినియోగిస్తుంది.ఈ విషయం పై వైద్యులు,ఆరోగ్య శాఖలు,గుర్తించాలని. వివిధ క్లస్టర్ లలో రోగులను గుర్తించాలని రోగం ప్రభుత్వం సి డి సి అధికార ప్రతినిధి క్రిస్టాన్ పేర్కొన్నారు.పిల్లాలు ఎప్పటికప్పుడు వ్యాక్సిన్  వేయించుకోవడం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కీలక మని సూచించారు.

Child Health Care Tips

Child Health Care Tips   Here you will find a health care tips for child that will be useful, beneficial, and most importantly give you and your children peace of mind.   * Baby Massage : Baby massage is a good old tradition of nurturing the infants, followed by people since centuries. Take few drops of olive oil in your palm and apply it in the circular motion. But be careful your child body is delicate so do not give pressure to your hands while massaging. * Growing Teeth : Make small pieces of potato and cool them in your fridge. Give you child pieces of cold potato and tell him to place them inside his mouth on the tooth that is paining. The cold will sooth the pain. This works well with cucumber too. Find Doctor. * Skin Care : Your baby could suffer from various skin problems if you do not provide proper protection to the baby skin. Use products that are especially for soft and sensitive baby skin. Apply soft and gentle soap and shampoos which does not contains hard chemicals & use only branded products. Baby’s skin absorbs lotion easily so avoid strong moisturizers. According to season you should use body lotion (mild) cream for baby skin. * Bath Time : Before you take your baby for bath, get everything that you need at one place. Never leave your baby alone in water. Use only gentle baby soap. A soft towel or cloth should be used to dry your baby. Sponge bath is more suitable for newborn babies as their skin is very delicate. * Leg Bicycling : Just keep your baby on his back and firmly hold his legs in a half bent position. Next, start moving his legs in a manner, as if he is paddling a bicycle. See that you do it gently. Maintain a steady pace, neither do it too fast, nor make it too slow. This will help in controlling your baby constipation. * Cold Treatment : Use a cool mist humidifier in your infants bedroom. A humidifier adds moisture to the air, which helps ease your baby’s congestion and cough. Use water only. Do not add any oils or medicines to the humidifier unless directed by your pediatrician.  * Fever Cure :  Take a dry cloth, dip it into the vessel making it completely wet and drain out the excess water. Place it on the baby’s forehead for two minutes and repeat the process. You should be doing this three to four times in a day for at least 20 to 25 minutes. This will help lower the temperature to a great extent. * Earache : Oils can be very soothing to an inflamed eardrum. Place a few drops of olive oil, castor oil or mineral oil into your child’s ear. You can also gently warm the oil first, but be very careful not to make it too hot because that could damage the eardrum.  

జాతీయ తల్లి పిల్లల సంరక్షణ దినోత్సవం...

జాతీయ తల్లి పిల్లల సంరక్షణ దినోత్సవం తల్లి పిల్ల ఆరోగ్య సంరక్షణపై అవగాహన అవసరం .ప్రతి ఏటా ఏప్రిల్ నెల రెండవ వారం లో జాతీయ తల్లి పిల్ల సంరక్షణ దినోత్సవాన్ని కేంద్రం నిర్వహిస్తుంది.దినోత్సవం యొక్క లక్ష్యం స్త్రీలు గర్భస్థ సమయం లో మహిళల ఆరోగ్యం పై దృష్టి పెట్టడం తో పాటు శిశు జన్మ సంబంధమైన సమాచారం ఇతర అం శాల పై అవగాహన కల్పించడం లక్ష్యం.తల్లి పిల్ల సంరక్షణ దినోత్సవానికి గుర్తుగా రిబ్బన్ ను ఎలియన్స్ ఇండియా రూపొందించింది.భారత ప్రభుత్వం ఏప్రిల్ రెండవ వారం లో అంటే11 న ఈ అంశానికి అత్యంత ప్రాధాన్యత గల అంశం గా పేర్కొంది.స్త్రీలు గర్భాస్తసమయంలో   ఏమిచేస్తే మహిళలు పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.వారిలో సకారాత్మక భావన లు  ఎలాకలిగించాలి.దీనిపై పూర్తిగా తెలుసుకోవడం అవగాహన కల్పించుకోవడం అవసరమని నిపుణులు భావిస్తున్నారు.మహిళలు గర్భస్థ సమయంలో పుస్తకాల పై దృష్టిని కేంద్రీకరించడం ఈ కారణంగా పిల్లల,మహిళల  మానసిక ఆరోగ్యంపై తీవ్రప్రభావం ఉంటుంది. ఈ అంశంపై వివిదరకాల మాధ్యమాల ద్వారా గర్భిణీ స్త్రీలు గర్భవతులుగా ఉన్నప్పుడు. పుస్తకాలు ఎందుకు ఎందుకు చదవాలో మీకు వివరిస్తాను. గర్భిణీలు పుస్తకాలు చదవడం ఎందుకు?... 1) గర్భినిగా ఉన్నప్పుడు మహిళలలో సకారాత్మక భావన ఆలోచనలు పెంచేపుస్త్సకాలు చదవాలి అదే సమయం లో గర్భం లో ఉండే పిల్ల వాడిలో సకారాత్మక ఆలోచనలు వస్తాయి. 2)గర్భిణి గా ఉన్నప్పుడు మహిళలు మూడ్ స్వింగ్ సమస్యలు ఎదుర్కుంటారు. తీవ్రైబ్బందులు పడతారు ఈ సమయం లో పుస్తకాలు చదవడం ద్వారా మనసుకు శాంతి లభిస్తుంది.మూడ్ బాగుంటుంది. ౩) గర్భిణీలు అప్పుడే గర్భంలో ఉన్న శిశువు పై ఆధార పడిన పుస్తకాలు చదవడం ద్వారా ప్రసవ సమయంలో మహిళలు మానసికంగాసిద్ధం కగాలుగుతారు. 4) గర్భిణీలు ఆసమయంలో చదవడం ద్వారా మెదడు బాగా చురుకుగా పనిచేస్తుంది. 5) గర్భిణీలు పుస్తకాలు చదవడం ద్వారా గర్భస్థ శిశువు లో భాషా పరిజ్ఞానం అందుతుంది.   గర్భిణి గా ఉన్నప్పుడు ఎలాంటి పుస్తకాలు చదవాలి?...   1) శిశువు సంరక్షణ ఆరోగ్యానికి సంబందించిన పుస్తకాలు. 2) గర్భావస్త సంబంధిత పుస్తకాలు. ౩) ఆధ్యాత్మిక పుస్తకాలు. 4) శ్రీ భాగావత్ గీత. 5) అన్నిటికీ మించి సామగ్రపోషకాహారం అటు తల్లి బిడ్డకు అలవాటు చేయడం.   సామగ్రంగా ప్రతినెలా గర్భంలో ఉన్న శిశువు పెరుగుదల,ఇతర అనారోగ్య సమస్యలు,సందేహాలు ఉంటె డాక్టర్ ను అడిగితేలుసుకోవడం.గర్భస్థ శిశువు పెర్గుదల కదలికలు,మీరు ఎదుర్కుంటున్న సమస్యలు వీటిపై సమాగ్రఆ వగాహన,ప్రసవ అనంతరం శిశు సంరక్షణశిశువు కు ఎదురయ్యే అనారోగ్య సమాస్యలను సమార్ధవంతంగా ఎదుర్కోడానికి జాతీయ తల్లి బిడ్డ ఆరోగ్యం సంరక్షణ పై అవగాహన కలిగి ఉండడం అవసరం.                                                  

మీ పిల్లలకు ఆహారం మారుస్తూ ఉంటే ఆరోగ్యంగా ఉంటారు

మీ పిల్లలకు ఆహారం మారుస్తూ ఉంటే ఆరోగ్యంగా ఉంటారు   బాల్యంలో తిన్న ఆహారమే జీవితం పై ప్రభావం చూపిస్తుందని వైద్యులు అంటున్నారు. బాల్యంలో ముఖ్యంగా అంటే అమ్మ కడుపులో ఉన్నపుడు గర్భిణీలు తీసుకునే ఆహారమే పిల్లలో  జీవితాంతం ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా అమ్మ ప్రేమతోనో ఆప్యాయతతోనో పెట్టె ఆహారం ఆరేళ్ళ పాటు ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది నిజంతల్లీ పెట్టె గోరుముద్దలో తల్లిపాలలో స్వచ్చత ఉంటుంది.. కల్మషం లేని స్వార్ధం ఉంటుంది. అందులోను నా పిల్లలు నాలుగుకాలాల పాటు  ఆరోగ్యంగా ఉండాలనే స్వార్ధం కనిపిస్తుంది. ఈ  విషయంలో జంతువులు సైతం అలాగే వ్యవహరిస్తాయని నిరూపిస్తున్నారు యునివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిసోదకులు.వెల్లడించారు. సహజంగా పిల్లలు బాల్యంలో జుంగ్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారని అన్నారు.. అంటే చాక్లెట్లు ,బిస్కెట్లు, కొవ్వు ఉన్న ఆహార పదార్ధాలు  తినడానికి ఇష్ట పడతారని వ్వైద్యులు  విశ్లేషించారు. ఆహారమే వాళ్ళను జీవితాంతం ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుంది.  కొందరు పిల్లలు అసలు ఆహరం తీసుకోడానికి ఇష్టపడరని, ఇంకొందరు  తినడానికి మారం చేస్తారని, అసలు ఆహరం  ఎక్కువగా తినే వాళ్ళు ఉంటారని, పరిశీలించారు.. అయితే అలా ఆహరం తీసుకున్నవారిలో  కాస్త వ్యాయామం  చేస్తే ఆరోగ్యంగా ఉంటారని తెలుస్తోంది. ఈ పరిశోదనలో ఎలుకలపై యు సి రేవేర్సిదే రరేసేర్చేర్స్  చేసిన పరిశోధనలో పెరుగు తో ఉన్న బ్యాక్టీరియాను తగ్గించాలని ఈ బ్యాక్టీరియా తిన్న ఎలుకా అనారోగ్యం పాలైన విషయాన్ని నిపుణులు  గుర్తించారు. ముఖ్యంగా  పాశ్చాత్య ఆహారం అటు పిల్లలు, ఇటు ఎలుకలు తిన్నప్పుడు పాశ్చాత్య ఆహరం తిన్న ఎలుకలు పిల్లలలో కొవ్వు పదార్ధాలు ఉన్నాయని చక్కర పదార్ధాలు పెరుగుతున్నాయని యుక్త వయస్సు వచ్చేసరికి ఆరు సంవత్సరాలు ఆహరం వారిని  కాపాడుతుందని.. వాళ్ళకి పూర్తిగా బలాన్ని ఇస్తుందని అన్నారు. అందుకే గర్భిణీ స్త్రీలను ఎక్కువగా ఆహరం తీసుకోమని పెద్దలు చెప్పడాన్ని మనం గమనించవచ్చు..  ముఖ్యంగా అమ్మ తిన్నా ఆహారం మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతుందని అంటున్నారు వైద్యులు. అంశాన్ని యు సి ఆర్ ఎవల్యుష్ణరీ ఫి జియోలజిస్ట్  తెర్దరే గార్లాండ్  వివరించారు. ఫంగస్ బ్యాక్టీరియా ప్యారసైట్ వైరస్ అటు మానవ శరీరంలో ఇటు జంతువులలో ఉంటాయని అన్నారు. మైక్రో ఆర్గనిజమ్స్ పేగులలో ఉంటాయి. అత్యవసర సమయంలో అత్యవసరమైన విటమిన్స్ అందిస్తుంది.  ఆరోగ్యవంతమైనా శరీరానికి పాతోజనిక్ సమతుల్యంగా అవయవాలు సక్రమంగా పని చేస్తాయని అన్నారు .అయితే  శరీరంలో ఆహారం సమతౌల్యం లోపించినప్పుడే  యాంటీ  బయోటిక్స్ లేదా ఆనారోగ్యం  వస్తుంది. అనారోగ్యమైన ఆహారం వల్ల అనారోగ్యనికి దారి తీస్తుందని అనున్నారు వైద్యులు. వివిధరకాల ఆహారాలను  రకరకాల ఎలుకలకు ఇచ్చి వాటి పని తీరును పరిశీలించారు ఈ మూడురకాల ఆహారాలను ఇచ్చిన మూడు వారాల తరువాత  ఎలుకలు సామాన్యంగానే ఉన్నాయని.. మరల అవి వ్యాయామం చేశాయని వారిలో బ్యాక్టీరియా ఉన్న విషయాన్ని గమనించి నట్లు తెలిపారు . కాగా పాశ్చాత్య ఆహరం తీసుకున్న ఎలుకల్లో తక్కువే అని , స్టాండర్డ్ ఆహరం తీసుకున్న ఎలుకలు చక చక పరుగులు తీశాయని బ్యాక్టీరియా చాలా సున్నితంగా ఉంటుందని. మీరు, మీ పిల్లలకు  ఆహారం మారుస్తూ ఉంటె పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు.. మీరు మీఆహారం గురించి కాదు. మీ పిల్లల ఆహరం పైనా శ్రద్ధ చూపాలని సరైనా ఆహరం తీసుకుంటే పిల్లలో మార్పు కనిపిస్తుంది. అని నిపుణులు  సూచించారు. పిల్లలు ఆహరం తినడం లేదని కొట్టడం ఎక్కువగా మందులు వాడడం  మంచిది కాదని వైద్యులు  సూచించారు.

పిల్లల మనసుని మార్చే రంగులు

పిల్లల మనసుని మార్చే రంగులు రంగుల ప్రభావం మన మనసుపై పడుతుందంటే నమ్మసక్యంగా లేదు కదూ, కాని ఇది అక్షరాల నిజమని చెప్తున్నారు శాస్త్రజ్ఞులు. మనం పిల్లల గదికి వేసే రంగుల ప్రభావం వారి మీద చాలా ఉంటుందిట. ముభావంగా ఉండే పిల్లల్లో హుషారుని నింపాలన్నా, హైపెరాక్టివ్ పిల్లల్ని కుదురుగా కూర్చోబెట్టాలన్నా ప్రత్యేకమైన రంగులు ఉపయోగిస్తే చాలట. వారి ప్రవర్తనా విధానంలో మెల్లిగా మార్పులు చేసుకుంటాయట. ఇది వింటే కాస్త కొత్తగా అనిపిస్తున్నా దీనికి సంబంధించి పిల్లలపై చేసిన పరిశోధనలు మంచి ఫలితాలని ఇచ్చాయని నొక్కి చెప్తున్నారు శాస్త్రజ్ఞులు. మరి మీ పిల్లల మనస్తత్వానికి ఎలాంటి రంగు ఎక్కువగా వాడాలో ఎంచుకోండి. ఇంటిలో వాళ్ళ రూమ్ కి వేసే కలర్, వాళ్ళ స్కూల్ బాగ్ కలర్, వాళ్ళు వేసుకునే బట్టల కలర్ ఇలాంటి వాటికి ఏ సమయంలో ఎలాంటివి ఎంచుకోవాలో ఒక నిర్ణయానికి రావచ్చు.     * రెడ్ కలర్ - ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడకుండా నలుగురిలో కలవటానికి ఇబ్బంది పడే పిల్లల రూం కి ఎరుపు రంగు వేస్తె వాళ్ళల్లో హుషారు పెరుగుతుందిట. ఎందుకంటే ఎరుపు మనిషి మెదడులో రక్త ప్రసరణ త్వరగా జరిగేలా చేస్తుందిట. అదే హైపెరాక్టివ్ పిల్లల రూంలో ఎరుపు రంగు వేస్తే  గనక ఇక వాళ్ళని ఆపటం ఎవరితరము కాదు. వాళ్ళ హుషారు రెండింతలు పెరిగి చదువు మీద ధ్యాస తగ్గి ప్రవర్తనలో విపరీతధోరణులు చోటుచేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి కాస్తంత జాగ్రత్త సుమా.     * ఆరంజ్ కలర్ - పిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచగల శక్తి ఈ నారింజ రంగుకి ఉందట. ఎవరి మీదా ఆధారపడకుండా వాళ్ళు స్వతంత్రంగా ఆలోచించటానికి దోహదపడుతుందట. అన్నివిషయాలలో పిల్లలు  మీ మీద ఆధారపడుతుంటే మీరు ఈ రంగుని ఎంచుకోవచ్చు.   * గ్రీన్ కలర్ - పిల్లల్లో కాన్సంట్రేషన్ పెరగాటికి ఈ రంగు బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. వారిలో చదువుపట్ల ఆసక్తిని కూడా పెంపొందిస్తుందిట. వాళ్ళల్లో ఉన్న యంగ్జైటి తగ్గి వాళ్ళని ఎప్పుడూ కూల్ గా ఉంచుతుంది కూడా.     * బ్లూ కలర్ - ఎరుపు రంగుకి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది ఈ నీలం రంగు. అది మెదడులోని రక్త ప్రసరణని రెట్టింపు చేసి గుండె వేగంగా కొట్టుకునేలా చేస్తే ఈ నీలం రంగు పిల్లల మెదడు చాలా ప్రశాంతంగా ఉండేలా చేస్తుందిట. నిద్రకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నా అవి కూడా దూరమయ్యి హాయిగా నిద్ర పడుతుందిట కూడా. హైపేరాక్టివ్నెస్ ఎక్కువగా ఉండే పిల్లల కోసం ఎక్కువగా ఈ రంగుని ఎంచుకున్నట్లయితే వారిలో దూకుడు స్వభావం తగ్గుతుందని చెప్తున్నారు.   *  ఎల్లో కలర్ - పిల్లల్లో ఏకాగ్రత పెరగటానికి పసుపు రంగు ఉపయోగపడుతుందిట. వారు స్థిరంగా కూర్చుని చదవాలన్నా లేడిన ఏదైనా పని కుదురుగా చేయాలన్నా ఈ రంగుని ఎంచుకోవచ్చు అని సలహా ఇస్తున్నారు నిపుణులు.   ఇలా రంగులు మనిషి పైన వాటి ప్రభావాన్ని చూపిస్తాయని ఎన్నో అధ్యయనాలు రుజువు చేసాయి. రంగుల పట్ల కాస్తంత అవగాహన ఉంటే చాలు మన పిల్లల మనసుని మనం సునాయాసంగా మార్చుకుని హ్యాపీ గా ఉండచ్చు. కేవలం గదికి వేసే రంగులే కాదు వారి కోసం వాడే ప్రతి వస్తువుని సరిపడే రంగులలో మనం ఎంచుకున్నట్లయితే వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడరు మనని ఇబ్బంది పెట్టరు.  - కళ్యాణి

బాలల క్యాన్సర్‌పై శ్రద్ద చూపరా..?

బాలల క్యాన్సర్‌పై శ్రద్ద చూపరా..? క్యాన్సర్ పిల్లల బాల్యాన్ని మింగేస్తోందా? అవును పిల్లలో క్యాన్సర్ నానాటికీ పెరుగుతుందని.. ఇప్పటికే పేదరికంలో మగ్గుతున్న దేశాలలో 8 2 % బాలలు క్యాన్సర్ బారిన పడి బలైపోయరని లెక్కలు చెపుతున్నాయి. ఇప్పటికే 7 మిలియన్ల బాలలు క్యాన్సర్ తో బాధపడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. క్యాన్సర్ పై జరిపిన  పరిశోదనలో  సంవత్సరాలు జీవించాల్సిన  బాల్యం మొగ్గలోనే పూర్తిగా ఎదగకుండానే మధ్యలో రాలిపోవడం పై నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాల్యంలోనే అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోడం వల్ల వారి ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిస్తోందని అన్నారు. పిల్లల అనారోగ్య సమస్యలపై దృష్టి పెట్టకపోవడం సకాలంలో గుర్తించకపోవడం, క్యాన్సర్ కు సరైన చికిత్స అందుబాటులో లేకపోవడం వల్లె బాలలు మరణిస్తున్నారని నిపుణులు చెపుతున్నారు..  బాల్యంలో క్యాన్సర్ పై జరిగిన పరిశోదన అంశాలను ల్యాన్ సెంట్ ఆంకాలజీలో ప్రచురించారు. క్యాన్సర్‌తో ఆర్ధికంగా చితికిపోయిన మధ్యతరగతి కుటుంబాలలోని దేశాలలో బాలలు కుటుంబం సైతం జీవించడం  కష్టసాధ్యంగా మారిందని దీని వల్ల 4౦ సంవత్సరాలకంటే  ఎక్కువ కాలం జీవించడం సాధ్యం కావడంలేదని నిపుణులు తెలిపారు. ఆర్ధికంగా బలంగా ఉన్న ధనిక దేశాలలో 8౦ % బాల బాలికలు క్యాన్సర్ ను గుర్తించిన  తరువాత 5 సంవత్సరాలు జీవించగలిగారు. క్లినికల్ ఫెల్లోగా ఉన్న లిం పోర్స్  సెంట్ జూడ్ చిల్డ్రన్  రీసెర్చ్ ఆసుపత్రికి చెందిన సమన్వయ కర్త యు ఎస్ ఎ కు చెందిన మేమ్బిస్ మాట్లాడుతూ ప్రపంచం పై బాలబాలికల క్యాన్సర్  భారం పడిందని అన్నారు.దీని వల్ల అంగ వైకల్యంతో బాధ పడుతున్న సంవత్సరాలుగా క్యాన్సర్ తో యుద్ధం చేస్తున్నారని  దీని వల్ల బాల్యం పై తీవ్ర ప్రభావం చూపిస్తోందని అన్నారు. బాల్యంలో వచ్చే అనారోగ్యం క్యాన్సర్ను ఏ  మాత్రం నిర్లక్యం చేసినా , కాన్సర్  చికిత్స చేసే  సమయంలో సరిగ్గా  ఫాలో అప్ చేయకపోయినా చికిత్సను వాయిదా వేసినా సరైన మందులు లేకపోయినా మరణించడం పై నిపుణులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. అభివృద్ధిచెందుతున్న దేశాలు పిల్లల విషయంలో క్యాన్సర్ భారంగా మారిందని..  ఈ వ్యాధి మధ్య తరగతి, ఆదాయం సరిగ్గలేనివారికీ, ఆర్ధికంగా బలంగా లేని నిరుపేదలు ఉన్న దేశాలలో 8 2 % ఆర్ధిక సహాయం చేస్తున్నాయని అయితే ప్రపంచ వ్యాప్తంగా బాలల క్యాన్సర్ ను గుర్తించడంలో సరైన సదుపాయాలు లేకపోవడం అధిక జనాభా పెరగడంతో, యువత పై ఉన్న ఆరోగ్య శ్రద్ధ బాలలపై లేదని 2 ౦ 1 7 లో సామాజికంగా వెనుక బడిన దేశాలలో 3 8 % బాలురు. కొత్తగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు . 1 ,5 9 ,6 ౦ ౦ కేసులు పెరిగాయని అంటే ప్రతి రోజూ 6 ౦ % గా ఉందని ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశంగా నిపుణులు విశ్లేషించారు. ఇప్పటికీ 1 9 5 దేశాలలో పిల్లలో క్యాన్సర్ గుర్తించామని నిరుపేద దేశాలలో 1 1 . 5 % మిలియన్లు పిల్లలు క్యాన్సర్ భారీనపడుతున్న పట్టించుకొకపోడం బాధాకరమని స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. బాలల క్యాన్సర్ పై  ప్రజలకు అవగాహన కల్పించాలి అని నిపుణులు పేర్కొన్నారు.

అనుబంధంతో అల్లుకోండి

అనుబంధంతో అల్లుకోండి   పిల్లలతో మంచి అనుబంధం పెంచుకోవాలంటే ఏం చేయాలి..? అమ్మలందరి ప్రశ్న అదే... ఎందుకంటే వాళ్ళని బెదిరించి, బయపెట్టి మాట వినేలా చేసే రోజులు పోయాయి. చిన్నతనంలో అమ్మ ఏం చెబితే అదే వేదం. అమ్మ చెంగుపట్టుకు తిరుగుతూ, అమ్మ చెప్పే కథలు వింటూ.. అమ్మే లోకంగా వుంటారు పిల్లలు. ఆ సమయంలో నయాన్నో, భయాన్నో వాళ్ళు చెప్పినట్టు వినేలా చేయచ్చు. కాని కాస్త పెరిగి ప్రిటీన్స్ లోకి వచ్చాకా, ఎదురుతిర గటాలు, అలకలు, అబ్బో అమ్మకి బోల్డంత ఓపిక కావాలి. కానీ ఆ పేచీలు లేకుండా చేయటానికి కొన్ని చిట్కాలు వున్నాయి. వాటితో పిల్లలతో అనుబంధం కూడా పెరుగుతుంది.. దాంతో పేచీలు తగ్గుతాయి అంటున్నారు నిపుణులు.. నిజానికి అమ్మలందరికి ఈ చిట్కా తెలిసే వుంటుంది. కాని పని కుదరదనో, ఇంకేదో కారణాలు చెప్పి తప్పించుకుంటారు. అలా కాకుండా... అది చాలా ముఖ్యమైనది అని గుర్తించి పాటిస్తే మాత్రం మంచి ఫలితాలు వస్తాయి... అని భరోసా ఇస్తున్నారు నిపుణులు. మరి వారు సూచిస్తున్న ఆ సూత్రాలు ఏంటో చెప్పనా ... పిల్లలతో సమయం గడపటం :- ఈ మాట చెప్పగానే... రోజు చేసేది అదే కదా అంటారని తెలుసు...కాని సమయం గడపటం అంటే... రోజూ వారి పనుల మద్య వాళ్ళతో మాట్లాడటం కాదు.. అచ్చంగా వాళ్ళతో మాత్రమే గడపటం. దానికి అమ్మ కొన్ని సమయాలని ఫిక్స్ చేసుకోవాలి. సాధారణంగా ఉదయాన్నే నిద్రలేపేటప్పుడు.. హడావుడిగా టైం అయిపోయింది అంటూ పిల్లలని లేపుతుంటారు.. అలా కాకుండా, ఓ పది నిమిషాల ముందు పిల్లలని లేపండి. పక్కన కూర్చుని ఓ నాలుగు మాటలు సరదాగా మాట్లాడండి, అప్పుడు చూడండి చక, చకా ఎలా రెడీ అవుతారో... అలాగే ఉదయం వాళ్ళు వెళ్ళేదాకా వాళ్ళతో అవి, ఇవి మాట్లాడుతూ వుండాలి. అవి చాలా సాధారణ విషయాలు.. పేపర్ లో న్యూస్ గురించో, ఇంట్లో మొక్కల గురించో, వాళ్ళ ఫ్రెండ్స్ గురించో చాలా, చాలా క్యాజ్యువల్ టాక్ జరగాలి.  ఇక వీలైతే కాకుండా, వీలు చేసుకుని మరీ పిల్లలతో ఆడిపాడాలి. ఆటలు పిల్లలతోనా? అనద్దు.. క్రికెట్ నుంచి షటిల్ దాకా, అలాగే కారమ్స్, యూనో ఇలా ఎన్నో గేమ్స్ వున్నాయి .. వాటిలో ఏదో ఒకటి ఆడండి. మ్యూజిక్ వినటం ఇష్టంగా వుంటుంది పిల్లలకి. వాళ్ళతో కలసి పాటలు వినటం, వాళ్ళు డాన్స్ చేస్తుంటే చేయలేకపోయినా చూడటం అన్నా చేయాలి. ఇక రంగులంటే పిల్లలతో పాటు మనకి ఇష్టమేగా.. డ్రాయింగ్, కలరింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇలా పిల్లలతో కలసి ఏమేం చేయచ్చో అన్నీ చేయటమే. సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళకి ఓ ఫ్రెండ్ లా వాళ్ళ అల్లరిలో భాగం కావాలి. దీని వల్ల లాభం ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఒక్కసారి చేసి చూడండి.. పిల్లలు ఎలా అమ్మా, అమ్మా అంటూ చుట్టూ తిరుగుతారో చూడండి. వాళ్ళకి కావాల్సింది ఓ ఫ్రెండ్ లాంటి అమ్మ. ఎప్పుడూ ప్రశ్నలు వేస్తూ, జాగ్రత్తలు చెబుతూ, అప్పుడప్పుడు కోప్పడుతూ, అమ్మ వాళ్ళకి పరాయిగా కనిపిస్తుంది. అర్ధం చేసుకోదు అనుకుంటారు. కాదు బంగారం నీతోనే నేనూ.. నీలా ఆడిపాడి అల్లరి చేస్తాను.. అని వాళ్ళకి తెలిసేలా చేస్తే చాలు... పసివాళ్ళుగా మారిపోయి గారాబాలు పోతారు. ఎంతయినా, ఎన్ని వున్నా వాళ్ళకి కావాల్సింది అమ్మే. ఆ అమ్మ పెద్దయ్యారు అంటూ మీ పనులు మీరు చేసుకోండి, మీ ఆటలు మీరు ఆడుకోండి అంటుంటే, అమ్మ కావాలి అని బయటకి చెప్పటం ఎలాగో తెలియక మొండికేస్తుంటారు. అది పోవాలంటే మళ్ళీ చిన్న పిల్లలప్పుడు పిల్లలతో ఎలా ఎలా ఆడిపాడారో అలా చేయటమే. -రమ