వర్షాకాలంలో సన్ స్క్రీన్ వాడాలా..అసలు నిజాలేంటి.!

వర్షాకాలంలో సన్ స్క్రీన్ వాడాలా?  అసలు నిజాలేంటి? వర్షాకాలం వచ్చేసింది. వర్షాలు వేడి నుండి ఉపశమనం కలిగించినప్పటికీ, అవి అనేక కొత్త చర్మ సమస్యలను కూడా వెంట తెస్తాయి. వర్షా కాలంలో సరైన చర్మ సంరక్షణ చాలా అవసరం, కానీ వర్షాకాలంలో ఎండ ఉండదు కాబట్టి సన్‌స్క్రీన్ అవసరం లేదని చాలా మంది అనుకుంటారు. ఈ కారణంగా, చాలా మంది వర్షాకాలంలో తమ స్కిన్ కేర్ రొటీన్  నుండి సన్‌స్క్రీన్‌ను పూర్తిగా అవాయిడ్ చేస్తారు. కానీ ఇలా చేయడం సరైనదేనా? వర్షాకాలంలో సన్‌స్క్రీన్‌ను వాడకుండా ఉండాలా? దీని గురించి చర్మ సంరక్షణ నిపుణులు ఏం చెప్తున్నారు?  వివరంగా తెలుసుకుంటే.. వర్షాకాలంలో సన్ స్క్రీన్.. స్కిన్ కేర్ నిపుణుల అభిప్రాయం ప్రకారం వర్షాకాలంలో ఎండ లేకపోయినా, మేఘాలు దట్టంగా ఉన్నప్పటికీ సూర్యుని నుండి వెలువడే UVA , UVB కిరణాలలో ఎక్కువ భాగం భూమిని చేరుతుంది. ముఖ్యంగా,  ముడతలు, చర్మంపై మచ్చలు , దీర్ఘకాలిక చర్మ నష్టానికి కారణమయ్యే UVA కిరణాలు, మేఘాలను దాటుకుని మరీ రాగవట.  ఇంటి బయటకు వెళ్లేటప్పుడు ఈ కిరణాల నుండి రక్షణ కోసం వర్షాకాలంలో కూడా సన్ స్క్రీన్ ను వాడటం చాలా అవసరం. అయితే, ప్రతి ఒక్కరి చర్మం భిన్నంగా ఉంటుంది. అందువల్ల, చర్మ రకం, బయట గడిపే సమయం , చేసే పనుల  ఆధారంగా సన్‌స్క్రీన్‌ను ఎంచుకోవాలి. వర్షాకాలంలో సన్‌స్క్రీన్ వాడాలా వద్దా, ఏ సన్‌స్క్రీన్ ఉత్తమమైనది, ఎంత మోతాదులో పూయాలి , ఏ తప్పులు చేయకూడదు.. ఇవన్నీ తెలుసుకోవాలి. వర్షాకాలంలో ఏ సన్ స్క్రీన్ ఎంచుకోవాలి.. బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్‌ను ఎంచుకోవాలి.  SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నది చాలా మంచి  ఎంపికగా పరిగణించబడుతుంది.  PA+++ లేదా PA++++ రేటింగ్ ఉన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది.  జిడ్డు చర్మం ఉన్నవారు జెల్ లేదా మ్యాట్ ఫినిష్ వాడాలి,  పొడి చర్మానికి, తేమను అందించే ఫార్ములాను ఎంచుకోవాలి.  చెమట పట్టినా లేదా తేలికపాటి వర్షం పడినా, వాటర్ ఫ్రూప్ సన్ స్క్రీన్ ఎంచుకోవాలి. సన్ స్క్రీన్ ఎలా పూయాలి.. ముఖం శుభ్రం చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ రాయాలి,  దీని తర్వాత, తగినంత సన్‌స్క్రీన్‌ను రాసుకోవాలి.  బయటకు వెళ్లే ముందు సుమారు 15-20 నిమిషాల ముందు రాసుకోవాలి.  ఎక్కువసేపు ఆరుబయట ఉన్నట్లయితే, ప్రతి 2-3 గంటలకు మళ్లీ పూయాలి.  ఎక్కువ చెమట పట్టిన తర్వాత, వర్షంలో తడిచిన తర్వాత లేదా ముఖం కడుక్కున్న తర్వాత మళ్లీ రాసుకోవాలి. ఈ స్కిన్ కేర్ టిప్స్ తప్పనిసరి.. ముఖాన్ని రోజుకు రెండుసార్లు శుభ్రం చేసుకోవాలి,  చర్మ రకానికి అనుగుణంగా తేలికపాటి మాయిశ్చరైజర్‌ను వాడాలి,  తగినంత నీరు త్రాగాలి,  సమతుల్య ఆహారం తీసుకోవాలి,  తడి చర్మాన్ని ఎక్కువ సేపు తేమగా ఉంచకూడదు,  వర్షంలో కూడా గొడుగు లేదా టోపీని వాడాలి.                             *రూపశ్రీ.  

మొటిమల నుండి టానింగ్ వరకు.. ముల్తానీ మట్టి చేసే మ్యాజిక్ ఇది!

మొటిమల నుండి టానింగ్ వరకు.. ముల్తానీ మట్టి చేసే మ్యాజిక్ ఇది! చర్మ సంరక్షణలో చాలా మంది ముల్తానీ మట్టి వాడుతుంటారు. ఇది అదనపు నూనెను పీల్చుకుని, చర్మాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. చాలామంది ముల్తానీ మట్టిని  ముఖ , చర్మ సంరక్షణకు సహజమైన ఎంపికగా భావిస్తారు. అందుకే నేటికీ అందుబాటులో ఉన్న అనేక ఫేస్ ప్యాక్‌లు మరియు చర్మ సంరక్షణ ఉత్పత్తులలో ముల్తానీ మట్టిని ఉపయోగిస్తున్నారు. అయితే ముల్తానీ మట్టి అందరికీ ఒకే విధంగా పని చేయదు, అలాగే అన్ని చర్మాలకు ఒకే విధంగా ఫలితాన్ని ఇవ్వదు. సరైన పద్దతిలో ఉపయోగిస్తే.. ముల్తానీ మట్టి చర్మం మీద మొటిమల నుండి, ట్యానింగ్ వరకు.. చాలా విధాలుగా ఉపయోగపడుతుంది.  దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. జిడ్డు చర్మానికి, మొటిమలకు.. ముల్తానీ మట్టి అదనపు నూనెను పీల్చుకోవడానికి సహాయపడుతుంది. అందుకే జిడ్డు చర్మం ఉన్నవారు దీనిని ఫేస్ ప్యాక్‌గా ఉపయోగిస్తారు. అదనపు నూనెను తగ్గించడం వల్ల కొంతమందిలో మొటిమల సమస్యలు కూడా తగ్గుతాయి.  అయితే, మొటిమలకు అనేక కారణాలు ఉంటాయి. కాబట్టి అన్నిసార్లు మొటిమలు తగ్గించడంలో ఇది సహాయపడుతుందని చెప్పలేం. బ్లాక్ హెడ్స్, టానింగ్.. చర్మంపై ఉన్న మురికిని, అధిక నూనెను తొలగించడంలో ముల్తానీ మట్టి సహాయపడుతుంది. ఇది బ్లాక్‌హెడ్స్ తక్కువగా కనిపించేలా చేయడంలో సహాయపడుతుంది. ఎండలో చర్మం కమిలిన తర్వాత, పెరుగు, కలబంద జెల్ లేదా రోజ్ వాటర్‌తో చేసిన ఫేస్ ప్యాక్ చర్మానికి తాజాదనాన్ని ఇస్తుంది. అయితే..  చర్మంపై ఉన్న నల్లదనం ఎంత వేగంగా పోవడమనేది వ్యక్తి యొక్క చర్మంపై ఆధారపడి ఉంటుంది. మచ్చలు,  పిగ్మెంటేషన్.. నార్మల్ స్కిన్ కేర్ లో భాగంగా ముల్తానీ మట్టిని ఉపయోగించడం వల్ల చర్మం శుభ్రంగా, తాజాగా ఉండేందుకు సహాయపడుతుంది. కొందరు దీనిని పసుపు, కలబంద జెల్ లేదా చందనం పొడితో కలిపి అప్లై చేసుకుంటారు.  నల్ల మచ్చలు లేదా పిగ్మెంటేషన్ తగ్గించుకోవడానికి కూడా ముల్తానీ మట్టిని వాడతారు.   వారానికి కనీసం రెండుసార్లు వాడుతూ ఉంటే.. కొన్ని వారాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఓపెన్ పోర్స్.. ముల్తానీ మట్టి చర్మానికి స్పష్టమైన మరియు మ్యాట్ రూపాన్ని ఇవ్వడానికి సహాయపడుతుంది, దీనివల్ల చర్మ రంధ్రాలు పెద్దవిగా కాకుండా చిన్నవిగా మారతాయి.  వీటినే ఓపెన్ పోర్స్ అంటూ ఉంటారు.  అయితే  ఇది రంధ్రాల పరిమాణాన్ని శాశ్వతంగా తగ్గించదు. ముఖం కడుక్కున్న తర్వాత తేలికపాటి మాయిశ్చరైజర్ రాసుకోవడం, పగటిపూట సన్‌స్క్రీన్ పూసుకోవడం వంటివి చేస్తే ముఖ చర్మ రంధ్రాలు చిన్నవిగా మారతాయి. సరైన విధంగా ఎలా వాడాలి.. ముల్తానీ మట్టిని రోజ్ వాటర్, పెరుగు లేదా కలబంద జెల్‌తో కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి.  ఈ ఫేస్ ప్యాక్‌ను ముఖానికి 10-15 నిమిషాల పాటు అప్లై చేయాలి. పూర్తిగా ఆరిపోకముందే గోరువెచ్చని నీటితో కడిగివేయాలి. వారానికి ఒకటి లేదా రెండు సార్లు దీనిని ఉపయోగించడం సరిపోతుంది.                           *రూపశ్రీ.

వర్షం నీరు జుట్టుకు హాని చేస్తుందా.. అసలు నిజాలు ఇవీ!

వర్షం నీరు జుట్టుకు హాని చేస్తుందా.. అసలు నిజాలు ఇవీ! వేసవిలో ఎండలు బాగా ఇబ్బంది పెట్టిన తర్వాత వచ్చే వర్షాకాలం చాలా ఊరట ఇస్తుంది. చాలామంది వర్షంలో తడవడాన్ని ఇష్టపడతారు కూడా. కానీ అమ్మాయిలు వర్షానికి భయపడతారు. చాలామంది వర్షంలో  తడిస్తే హెయిర్ ఫాల్ అవుతుందని, డాండ్రఫ్ వస్తుందని అనుకుంటారు. ఈ కారణాలతోనే వర్షం అంటే ఇష్టం ఉన్నా వర్షంలో తడవడానికి భయపడతారు. పైగా వర్షంలో తడిస్తే వెంటనే ఇంటికి వచ్చి మళ్లీ తలస్నానం చేయాలని కూడా అంటుంటారు. కానీ ఇవన్నీ నిజమేనా? వర్షం గురించి ఉన్న అపోహలు, వాస్తవాలు ఏమిటో తెలుసుకుంటే.. వర్షంలో తడిస్తే జుట్టు రాలుతుందా? వర్షపు నీరు మాత్రమే జుట్టు రాలడానికి ప్రత్యక్ష కారణం కాదని అంటున్నారు నిపుణులు.  ఒత్తిడి, పోషకాహార లోపాలు, హార్మోన్ల మార్పులు, జన్యుపరమైన కారణాలు , కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా జుట్టు రాలడానికి కారణం కావచ్చు. తల చర్మం ఎక్కువసేపు తడిగా ఉన్నా లేదా తల చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోకపోయినా జుట్టు రాలే సమస్య పెరుగుతుందట. తొలకరి జల్లులు ఎక్కువ నష్టం కలిగిస్తాయా? వేసవి కాలం కారణంగా చాలా కాలం తర్వాత పడే వర్షాలను తొలకరి జల్లులు అంటారు. చాలాకాలం పొడి వాతావరణం తర్వాత కురిసే తొలినాళ్ల వర్షాలు వాతావరణంలోని దుమ్ము, కాలుష్య కారకాలను కిందకు తీసుకుని వచ్చే అవకాశం ఉంటుంది.  అలాంటి తొలి వర్షంలో ఎక్కువ సేపు తడవకుండా ఉండటం హెయిర్ కేర్ విషయంలో ఒక మంచి జాగ్రత్త. అయితే, ప్రతీ తొలి వర్షం ఒకేలా ఉండదు.  స్థానిక కాలుష్యం, వాతావరణ పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటుంది. వర్షంలో తడిచిన తర్వాత జుట్టు కడుక్కోవడం అవసరమా?  కలుషితమైన గాలిలో పడిన వర్షం లో తడిస్తే.. జుట్టును తేలికపాటి షాంపూతో లేదా  శుభ్రమైన నీటితో కడుక్కోవడం చాలామంచిది.  ఇది దుమ్ము, ధూళి , ఇతర కణాలను తొలగించడానికి సహాయపడుతుంది. ఎక్కువగా షాంపూ చేయడం , లేదా పదే పదే తలకు షాంపూ  చేసుకోవడం  కూడా జుట్టును పొడిబారేలా చేస్తుంది. వర్షపు నీరు జుట్టును పొడిగా మారుస్తుందా? వర్షపు నీరు జుట్టును పొడిగా మార్చడం అందరి విషయంలో జరగదు.  జుట్టు ఇప్పటికే  పొడిగా ఉన్నా,  జుట్టుకు ఎలాంటి ప్రోడక్ట్ వాడుతున్నారనే విషయం మీద, వర్షం తర్వాత హెయిర్ ను ఏ విధంగా కేర్ తీసుకుంటారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అవసరమైతే తేలికపాటి కండీషనర్ లేదా సీరమ్ ఉపయోగించవచ్చు. తడి జుట్టుకు మళ్లీ షాంపూ చేయవచ్చా? తడి జుట్టును ఎక్కువసేపు కట్టి ఉంచడం వల్ల తల చర్మంలో తేమ నిలిచి ఉంటుంది. దీనివల్ల దురద, దుర్వాసన లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరగవచ్చు.  ముందుగా జుట్టును పూర్తిగా ఆరబెట్టుకోవడం మంచిది. వర్షంలో తడిశాక హెయిర్ కేర్ ఎలా ఉండాలి? వర్షంలో తడిశాక  ఇంటికి చేరుకున్న వెంటనే  జుట్టును శుభ్రమైన నీటితో కడుక్కోవాలి.  టవల్‌తో మెల్లగా అద్దాలి, అంతే తప్ప , గట్టిగా రుద్దకూడదు.  హెయిర్ డ్రైయర్ ఉపయోగిస్తే ఉష్ణోగ్రతను తక్కువగా ఉంచాలి. తడి జుట్టును బలంగా దువ్వకూడదు.  తల చర్మాన్ని ఎక్కువ సేపు తడిగా ఉంచకూడదు.  అవసరమైతే  వారానికి ఒకసారి డీప్ కండిషనింగ్ చేయాలి. వీళ్లకు జాగ్రత్త తప్పనిసరి.. తల చర్మం జిడ్డుగా ఉండేవారు,  ఇప్పటికే చుండ్రు ఉన్నవారు,  తల చర్మం సున్నితంగా ఉన్నవారు. తరచుగా ఫంగల్ ఇన్ఫెక్షన్లకు గురయ్యే వ్యక్తులు, జుట్టుకకు ఎక్కువ రసాయన ఉత్పత్తులు వాడేవారు వర్షంలో తడిసిన తరువాత జుట్టు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.                                   *రూపశ్రీ.

కనుబొమ్మలు, కనురెప్పలు దట్టంగా పెరగాలంటే ఏం చేయాలి!

కనుబొమ్మలు, కనురెప్పలు దట్టంగా పెరగాలంటే ఏం చేయాలి! ముఖారవిందాన్ని పెంచడంలో కళ్లు ప్రధాన పాత్ర వహిస్తాయి.  అమ్మాయిలు అందంలో బాగంగా కళ్లకు కూడా చాలా ప్రాధాన్యత ఇస్తారు. కంటి అందాన్ని పెంచడంలో కనుబొమ్మలు,  కనురెప్పలు కీలక  పాత్ర పోషిస్తాయి. కళ్లు  అందాన్ని పెంచడమే కాకుండా, మీ వ్యక్తిత్వానికి ఒక ప్రత్యేకమైన ఆత్మవిశ్వాసాన్ని కూడా అందిస్తాయి. అందుకే అమ్మాయిలు  తమ కళ్లను సంరక్షించుకోవడానికి, కనుబొమ్మలను తీర్చిదిద్దుకోవడానికి , కనురెప్పలను దట్టంగా చేసుకోవడానికి రకరకాల బ్యూటీ ప్రోడక్ట్స్ వాడుతుంటారు.   అయితే, మార్కెట్లో లభించే అనేక ఉత్పత్తులు చాలా ఖరీదు మాత్రమే కాదు.. చాలా రసాయనాలతో ఉంటాయి. ఇవి మంచి చేయకపోగా కళ్లకు హాని చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా ఇంట్లోనే కళ్లు, కనుబొమ్మలు దట్టంగా పెరిగేలా చేయడానికి  కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. ఆముదం.. ఆముదం నూనెను చాలా కాలంగా వెంట్రుకల సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. దానిలో ఉండే కొవ్వు ఆమ్లాలు జుట్టుకు పోషణ అందించడంలో సహాయపడతాయి. ఎలా ఉపయోగించాలి? పడుకునే ముందు దూదితో  కనుబొమ్మలకు, కనురెప్పలకు కొద్దిగా ఆముదం నూనె రాయాలి. ఉదయం శుభ్రమైన నీటితో కడిగేయాలి. ప్రయోజనాలు.. కనుబొమ్మలు మరింత ఒత్తుగా, దట్టంగా మారతాయి. . కనురెప్పల వెంట్రుకలకు తేమ అందుతుంది.  జుట్టు రాలడం సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. అలోవెరా.. చర్మ, జుట్టు సంరక్షణకు కలబందను చాలా ప్రజాదరణ పొందిన ఇంటి  చికిత్సగా పరిగణిస్తారు. ఎలా అప్లై  చేయాలి? శుభ్రమైన బ్రష్‌ను ఉపయోగించి తాజా కలబంద జెల్‌ను  కనుబొమ్మలకు , కనురెప్పలకు రాయాలి. 20-30 నిమిషాల తర్వాత కడిగేయాలి. ప్రయోజనాలు.. జుట్టుకు తేమ అందుతుంది.  కనుబొమ్మలు, కనురెప్పలు ఆరోగ్యంగా కనిపిస్తాయి. కళ్ల చుట్టూ ఉన్న చర్మం కూడా చల్లబడుతుంది. గ్రీన్ టీ బ్యాగ్.. కళ్ల కింద ఉబ్బుగా లేదా అలసటగా అనిపిస్తే, గ్రీన్ టీ బ్యాగులు ఉపయోగపడతాయి. ఎలా ఉపయోగించాలి? గ్రీన్ టీ బ్యాగ్‌లను ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా అయ్యే వరకు ఉంచాలి. తర్వాత  10-15 నిమిషాల పాటు కళ్లపై ఉంచుకోవాలి. ప్రయోజనాలు.. కంటి వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. కళ్ళకు తాజాదనం కలిగిన అనుభూతి ఉంటుంది.   కళ్ల కింద నల్లటి వలయాల సమస్య నుండి ఉపశమనం లభించే అవకాశం కూడా ఉంటుంది. విటమిన్-ఇ.. విటమిన్ ఇ చర్మానికి, జుట్టుకు మేలు చేస్తుంది. ఇది బ్యూటీ ప్రోడక్ట్స్ తయారీలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు.    ఎలా ఉపయోగించాలి? విటమిన్ ఇ క్యాప్సూల్ నుండి నూనెను తీసి,  కనుబొమ్మలకు , కనురెప్పలకు సున్నితంగా రాయాలి. ప్రయోజనాలు.. జుట్టుకు పోషణ లభిస్తుంది. కనురెప్పలు మరింత దట్టంగా మారతాయి.  కనుబొమ్మల సహజ మెరుపు పెరుగుతుంది.                                       *రూపశ్రీ.

చర్మం మీద ముడతలు తగ్గాలంటే.. ఉదయాన్నే ఈ ఒక్క టిప్ ఫాలో అయిపోండి..!

 చర్మం మీద ముడతలు తగ్గాలంటే.. ఉదయాన్నే ఈ ఒక్క టిప్ ఫాలో అయిపోండి..! ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కాంతివంతమైన, మచ్చలేని చర్మాన్ని కోరుకుంటున్నారు.ముఖ్యంగా అమ్మాయిలకు మచ్చలేని, కాంతివంతమైన చర్మం కావాలని చాలా కోరికగా ఉంటుంది.  దీనిని సాధించడానికి, ఇందుకోసం అమ్మాయిలు  మార్కెట్లో దొరికే చాలా రకాల రసాయన ఉత్పత్తులను ప్రయోగిస్తుంటారు. అయితే  ఈ  రసాయన ఉత్పత్తులను  పూసిన తర్వాత కూడా ఎటువంటి  మార్పు కనిపించదు,  పైగా కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల చర్మం మరింత దారుణంగా కూడా మారుతుంది.కానీ కొన్ని ఇంటి చిట్కాలతో ముఖ చర్మాన్ని చాలా కాంతివంతంగా మార్చుకోవచ్చు.  ఉదయాన్నే కొన్ని టిప్స్ పాటిస్తే ఇది సాధ్యమవుతుంది. ఆ టిప్స్ ఏంటో తెలుసుకుంటే.. మీరు ఉదయం నిద్రలేవగానే ఈ సులభమైన ఐస్ ప్యాక్‌ను మీ ముఖానికి పెట్టుకోవచ్చు. ఈ చిట్కా మీ ముఖానికి కాంతినిస్తుంది. ఇది సన్నని గీతలను కూడా తగ్గించవచ్చు. మెరిసే చర్మం కోస ఇంట్లోనే పాటించాల్సిన చిట్కా.. మెరిసే చర్మం కోసం ఉదయం నిద్రలేవగానే  ఒక గిన్నె తీసుకుని, దానిలో ఐస్ క్యూబ్స్ ను వేయాలి. అందులో నీటిని కూడా వేయాలి. తర్వాత ముఖాన్ని ఆ చల్లని నీటిలో ముంచాలి. ఈ చిట్కా  ముఖానికి మెరుపును తెస్తుంది. ప్రయోజనాలు..  ఉదయం కనీసం 15 నుండి 20 సార్లు ఈ నీటిలో  ముఖాన్ని ముంచాలి. చల్లటి నీటిలో ముఖాన్ని ముంచడం వల్ల  చర్మ రంధ్రాలు కుంచించుకుపోయి, చర్మం బిగువుగా మారుతుంది. చల్లటి నీటికి గురికావడం వల్ల ఉబ్బు , సన్నని గీతలు తగ్గుతాయి. 25 ఏళ్ల తర్వాత ముఖంపై సన్నని గీతలు కనిపిస్తాయి కాబట్టి, ఈ చికిత్స 25 ఏళ్లు పైబడిన మహిళలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ చికిత్స చిన్న పిల్లలకు తగినది కాదు. ఐస్ వాటర్ థెరపీ ముఖంపై అధిక నూనెను నియంత్రించడంలో సహాయపడుతుంది. తక్షణ మెరుపు కోసం ఐస్ వాటర్ థెరపీని ప్రయత్నించవచ్చు.                              *రూపశ్రీ.

వర్షాకాలంలో మొటిమలు పెరుగుతున్నాయా.. ఈ సింపుల్ స్కిన్ కేర్ ను ఫాలో అయిపోండి!

వర్షాకాలంలో మొటిమలు పెరుగుతున్నాయా.. ఈ సింపుల్ స్కిన్ కేర్ ను ఫాలో అయిపోండి! వర్షాకాలం వేడి నుండి ఉపశమనాన్ని తెస్తుంది, కానీ అనేక సమస్యలను కూడా తెస్తుంది, వాటిలో ఒకటి మొటిమలు. ఈ కాలంలో చిన్న, ఎర్రటి లేదా చీముతో నిండిన మొటిమలు చాలామందికి వస్తుంటాయి. కానీ వర్షాకాలానికి, మొటిమలకు మధ్య ఉన్న సంబంధం చాలా మందికి తెలియదు. అసలు అవి ఎందుకు వస్తాయో..  వాటిని ఎలా వదిలించుకోవాలో కూడా చాలామందికి తెలియదు.  వర్షాకాలంలో వచ్చే మొటిమల ఆట కట్టించడానికి చాలా సింపుల్ స్కిన్ కేర్ టిప్స్ ను పాలో అవ్వచ్చు. అసలు వర్షాకాలంలో మొటిమలు ఎందుకు వస్తాయి, వీటిని నివారించడానికి ఏ స్కిన్ కేర్ పాటించాలి? తెలుసుకుంటే.. వర్షాకాలంలో మొటిమలు.. వర్షపు నీటికి ఆమ్ల గుణం ఉండటం వల్ల అది చర్మానికి చికాకు కలిగించి, ఎరుపుదనాన్ని కలుగజేస్తుంది. తేమ కారణంగా చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి, దీనివల్ల చర్మం నేరుగా కాలుష్యం, ధూళి కణాలు , మురికితో రియాక్ట్ అవుతుంది. గాలిలోని తేమలో వృద్ధి చెందే వైరస్‌లు , బ్యాక్టీరియా మొటిమలకు కారణమవుతాయి. మరీ ముఖ్యంగా  ఈ కాలంలో తీసుకునే అనారోగ్యకరమైన జంక్ ఫుడ్ సెబమ్ ఉత్పత్తిని పెంచుతుంది. జిడ్డు చర్మం మొటిమలు రావడానికి మరింత ఎక్కువ కారణం అవుతుంది. మొటిమలను ఎలా నివారించాలి? తేలికగా ఉండే, pH సమతుల్యత గల క్లెన్సర్‌ను ఉపయోగించి, రోజుకు కనీసం రెండుసార్లు  ముఖాన్ని కడుక్కోవాలి. ఇది అదనపు నూనె, మురికి , కాలుష్యాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. ముఖం కడుక్కున్న తర్వాత, మొటిమలను నివారించే టోనర్‌ను అప్లై చేయాలి. టీ ట్రీ , కలబంద వంటి పదార్థాలు చాలా బాగా పని చేస్తాయి. చనిపోయిన చర్మాన్ని తొలగించడానికి వారానికి రెండుసార్లు  చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేసుకోవాలి.  చర్మ రకాన్ని బట్టి ఎక్స్‌ఫోలియేటర్‌ను ఎంచుకోవాలి. తేమతో కూడిన వాతావరణంలో కూడా చర్మానికి తేమ అవసరం.  ఇందుకోసం, తేలికైన , చర్మరంధ్రాలను మూసివేయని మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. బయటకు వెళ్లే ముందు SPF 30 కంటే ఎక్కువ ఉన్న బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్‌ను రాసుకోవడం మర్చిపోకూడదు. ముఖ్యంగా ముఖాన్ని పదేపదే తాకడం మానుకోవాలి,  ముఖ చర్మం అత్యంత సున్నితంగా ఉంటుంది , దానిని పదేపదే తాకడం వల్ల చేతులకు ఉన్న మురికి  ముఖానికి అంటుకుని మొటిమలకు కారణం అవుతుంది.  జుట్టును శుభ్రంగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం, అలాగే జుట్టు ముఖానికి తగలకుండా చూసుకోవాలి. ఎందుకంటే జిడ్డుగా ఉండే జుట్టు  చర్మాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. మొటిమలు రావడానికి కారణం అవుతుంది. వర్షాకాలంలో మొటిమలకు చెక్ పెట్టాలంటే పై చెప్పుకున్న జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి.                               *రూపశ్రీ.

మీ దగ్గర మ్యాక్సీ స్కర్ట్ ఉందా.. ఈ టాప్స్ తో మీ రూపమే మారిపోతుంది!

మీ దగ్గర మ్యాక్సీ స్కర్ట్ ఉందా?  ఈ టాప్స్ తో మీ రూపమే మారిపోతుంది!  ఫ్యాషన్ ప్రపంచంలో కొన్ని వస్త్రాలు ఎప్పటికీ ట్రెండ్ నుండి బయటకు వెళ్లవు, వాటిలో మ్యాక్సీ స్కర్ట్ ఒకటి. ఇది సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా, చాలా సొగసుగా ఉంటుంది. అంతకంటే  మల్టీ పర్పోస్ వేర్ గా కూడా సహాయపడుతుంది.   కాలేజీకి వెళ్లినా, ఆఫీస్ మీటింగ్‌కైనా, స్నేహితులతో కాఫీ డేట్‌కైనా, లేదా పార్టీకి వెళ్లాలన్నా మ్యాక్సీ స్కర్ట్ చాలా బాగా సెట్ అవుతుంది.  ఈ స్కర్ట్ అన్ని సందర్భాలలో స్టైలిష్ గా కనిపించేలా చేస్తుంది. చాలా మంది మహిళలు మ్యాక్సీ స్కర్ట్‌లను కొనుగోలు చేసినప్పటికీ, వాటితో ఏ టాప్‌ను జత చేయాలనే విషయంలో చాలా ఇబ్బంది పడుతుంటారు. సరిగా మ్యాచ్ కాని  టాప్‌ను ఎంచుకోవడం వల్ల  మొత్తం లుక్  పాడైపోతుంది. కానీ స్కర్ట్ లోకి మంచి టాప్ సెలెక్ట్ చేసుకుని ధరించినప్పుడు.. మహిళలు ఎంతో ఆత్మవిశ్వాసంగా కనిపిస్తారు.  మ్యాక్సీ స్కర్ట్ కు ఏ టాప్స్ బాగుంటాయో తెలుసుకుంటే.. ఫ్యాషన్ నిపుణుల అభిప్రాయం.. మ్యాక్సీ స్కర్ట్‌తో ఎల్లప్పుడూ  శరీర పైభాగాన్ని సమతుల్యం చేస్తూ, నడుము ఆకృతిని స్పష్టంగా చూపించే టాప్‌ను ఎంచుకోవాలని ఫ్యాషన్ నిపుణులు చెబుతున్నారు. ఫిట్టెడ్ షర్టులు, బేసిక్ టీ-షర్టులు, పెప్లమ్ టాప్‌లు, వెస్ట్‌కోట్‌లు , ఆఫ్-ది-షోల్డర్ టాప్‌లు ఈ రోజుల్లో సోషల్ మీడియాలో,  స్ట్రీట్ ఫ్యాషన్‌లో బాగా ప్రాచుర్యం పొందాయి. మ్యాక్సీ స్కర్ట్‌ను కొత్తగా , స్టైలిష్‌గా మ్యాచ్ చేయాలనుకుంటే కింది ఫ్యాషన్ గైడ్  చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఫ్లోయీ మ్యాక్సీ స్కర్ట్‌తో బేసిక్ టీ-షర్ట్.. వదులుగా ఉండే మ్యాక్సీ షర్ట్ ఉంటే, వేసవి కాలంలో దాన్ని చాలా స్టైలిష్‌గా , సౌకర్యవంతంగా ధరించవచ్చు. ఈ రకమైన స్కర్ట్ కాలేజీకి, కాఫీ డేట్‌కి, ప్రయాణానికి లేదా వీకెండ్ ట్రిప్ కు  చాలా అనువుగా ఉంటుంది. కానీ ఈ స్కర్ట్‌కు ఏ టాప్ జత చేయాలో  అర్థం కాకపోతే, చాలా సింపుల్‌గా ఉండే టాప్‌ను ఎంచుకోవాలి.  ఒకవేళ ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియకపోతే ఒక సాధారణ తెల్లటి టీ-షర్టు , వదులుగా ఉండే మ్యాక్సీ స్కర్ట్ చాలా కంఫర్ట్ గానూ, స్టైలిష్ గానూ ఉంటుంది. పెప్లమ్ టాప్‌తో మ్యాక్సీ స్కర్ట్.. పెప్లమ్ టాప్స్ నడుమును హైలైట్ చేస్తూ, శరీరాకృతిని మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి.  మ్యాక్సీ స్కర్ట్ వదులుగా ఉంటే, దానితో పెప్లమ్ టాప్ చాలా బాగుంటుంది. ఇది బ్రంచ్ డేట్, షాపింగ్ , ఫ్యామిలీ మీటింగ్స్  వంటి సందర్భాలకు చక్కటి లుక్ ఇస్తుంది. ఆప్-ద- షోల్డర్ టాప్స్.. పార్టీకి లేదా డేట్ నైట్‌కి సిద్ధమవుతున్నట్లయితే, స్కర్ట్‌తో పాటు   ఆఫ్-షోల్డర్ టాప్‌ను ఎంచుకోవచ్చు. ఒకే  రంగు స్కర్ట్ ఉంటే, దానితో నలుపు లేదా ఎరుపు రంగు టాప్ ధరిస్తే బాగుంటుంది.  ఈ లుక్‌ను పూర్తి చేయడానికి స్టేట్‌మెంట్ చెవిపోగులను జోడిస్తే బాగుంటుంది.  హై హీల్స్ లుక్ ను మరింత మెరుగుపరుస్తాయి. ఈ రకమైన శైలి  ట్రెండ్రీ గా, అట్రాక్షన్ లుక్ ను ఇస్తుంది.  అలాగే ఇది ఫోటోస్ కు మరింత అద్బుతంగా కనిపిస్తుంది. ఫార్మల్ షర్డ్ తో.. ఈ రోజుల్లో ఆఫీస్ ఫ్యాషన్‌లో మ్యాక్సీ స్కర్ట్, షర్ట్ కాంబినేషన్  బాగా ప్రాచుర్యం పొందుతోంది.  లుక్ స్టైలిష్‌గా కనిపించడానికి  షర్ట్‌ను కొద్దిగా ప్యాంటులోపలికి టక్ చేసుకోవాలి. దీనితో పాటు బెల్ట్ వాడాలి.  అలాగే, న్యూడ్ లేదా బ్లాక్ హీల్స్ ధరించాలి.  ఆఫీసు, మీటింగ్స్  లేదా వృత్తిపరమైన కార్యక్రమాలకు ఇది మంచి లుక్ గా నిలుస్తుంది.   వెస్ట్ కోట్ తో శాటిన్ మ్యాక్సీ షర్డ్..  పవర్ డ్రెస్సింగ్ ఇష్టమైతే, వెస్ట్‌కోట్ , శాటిన్ మ్యాక్సీ స్కర్ట్ కాంబినేషన్ తప్పకుండా ట్రై చేయాల్సిందే. ఇది పాతకాలపు రిచ్  ఫ్యాషన్ రూపాన్ని ఇస్తుంది కాబట్టి ట్రెండ్‌లో ఉంది. చాలా నాజూకుగా, గ్రాండ్ గా కూడా  కనిపిస్తుంది. సోషల్ మీడియాలో దీనికి ఆదరణ రోజురోజుకీ పెరుగుతోంది. శరీరాన్ని బట్టి స్కర్ట్ స్టైలింగ్..  పొట్ట ముందుకు పొడుచుకుని ఉంటే, హై-వేస్టెడ్ మ్యాక్సీ స్కర్ట్‌ను ఎంచుకోవాలి. దానిని పెప్లమ్ టాప్‌తో జత చేయాలి. ముదురు రంగులను ఎంచుకోవాలి.  పొట్టిగా ఉన్నవాళ్లు మోనోక్రోమ్ లుక్‌ను ఎంచుకోవాలి. హై-వేస్టెడ్ స్కర్ట్‌ను ఎంచుకుని, దానికి ప్లాట్‌ఫామ్ హీల్స్‌ను జత చేయాలి.  శరీరాకృతి బొద్దుగా ఉంటే, శరీరానికి అతుక్కుపోయే టాప్స్ ధరించాలి. మరీ వదులుగా ఉండే టాప్స్‌ను ధరించడం మానుకోవాలి. ఈ  మిస్టేక్స్ చేయకండి.. ఓవర్‌సైజ్డ్ స్కర్ట్‌ను ఓవర్‌సైజ్డ్ టాప్‌తో ధరించకూడదు. మరీ పొడవుగా ఉండి నేల మీద ఈడ్చుకుపోయే స్కర్టులను ఎంచుకోవద్దు.   ఒకే దుస్తులలో చాలా ప్రింట్లను కలపవద్దు. తప్పుడు పాదరక్షలు మొత్తం రూపాన్ని పాడుచేస్తాయి. కాబట్టి పాదరక్షల ఎంపిక కూడా జాగ్రత్త వహించాలి.                                 *రూపశ్రీ.

వర్షాకాలంలో ముఖానికి ఏ క్రీమ్ ఉత్తమమైనదో తెలుసా!

వర్షాకాలంలో ముఖానికి ఏ క్రీమ్ ఉత్తమమైనదో తెలుసా! వాతావరణం మారిన ప్రతిసారి శరీరంలో మొదటగా ఇబ్బంది పడేది చర్మమే. చర్మం ప్రత్యక్షంగా ప్రభావానికి లోనవుతుంది.  ముఖ్యంగా వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల చర్మం జిగటగా మారడం మొదలవుతుంది. అందువల్ల  సీజన్ కు తగ్గట్టుగా ఫేస్ క్రీమ్ ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. వర్షాకాలంలో చర్మానికి తగిన క్రీమ్ ను ఎలా ఎంచుకోవాలో.. ఏ క్రీమ్ బాగుంటుందో తెలుసుకుంటే..  ఇలాంటి వాడకండి.. ఫేస్ క్రీములు చాలా రకాలుగా ఉంటాయి. వాటి టెక్చర్ ను బట్టి ఏ చర్మానికి ఏది బాగుంటుందనే విషయం తెలుసుకోవచ్చు.  వర్షాకాలంలో బరువుగా, జిడ్డుతో కూడుకున్న క్రీములను పూయడం వల్ల చర్మ సమస్యలు మరింత పెద్దవి అవుతాయి. అందుకే బరువుగా ఉన్న క్రీములు వాడకూడదు.  దానికి బదులు తేలికపాటి క్రీమ్స్ వాడాలి. జిడ్డు చర్మం వారు.. వర్షాకాలంలో జిడ్డు చర్మం ఉన్నవారు జెల్ ఆధారిత క్రీములను ఉపయోగించాలి.   పొడి చర్మం. పొడి చర్మం ఉన్నవారికి వర్షాకాలంలో వాతావరణం కారణంగా చర్మం మరింత పొడిబారి  చర్మం పగుళ్లు వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వారు  మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాసుకోవాలి. వర్షాకాలంలో ఇవే బెస్ట్.. వర్షాకాలంలో ముఖానికి తేలికైన జిడ్డులేని, వాటర్ బేస్డ్ క్రీములు ఉత్తమంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడతాయి. అయితే అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. వర్షాకాలంలో చర్మం కోసం ఏదైనా కొత్త క్రీమ్ కొనాలని అనుకుంటే ముందుగా చర్మం రకం తెలుసుకుని ఆ తర్వాత క్రీమ్ కొనుగోలు చేయడం, దాన్ని వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.                                     *రూపశ్రీ.

జుట్టు వేగంగా పెరగడానికి అమ్మమ్మల కాలం నాటి సీక్రెట్ టిప్.. ఒక్కసారి ట్రై చేయండి!

జుట్టు వేగంగా పెరగడానికి అమ్మమ్మల కాలం నాటి సీక్రెట్ టిప్.. ఒక్కసారి ట్రై చేయండి! ఈ రోజుల్లో జుట్టు విరిగిపోవడం, బలహీనంగా మారడం సర్వసాధారణ సమస్యగా మారింది. జుట్టు రాలడం నుండి ఉపశమనం పొందడానికి  అన్ని రకాలుగా ప్రయత్నిస్తారు, మార్కెట్లో లభించే షాంపూలు,  లోషన్లు,  ఆయిల్స్.. ఇళా చాలా ట్రై చేస్తారు. కానీ ఇన్ని చేసిన తర్వాత కూడా వారి జుట్టులో ఎటువంటి చెప్పుకోదగ్గ ఫలితం కనిపించదు. అలాంటి వారికి అమ్మమ్మల కాలం నాటి సీక్రెట్ టిప్ బాగా పని  చేస్తుంది. జుట్టు రాలడాన్ని చాలా తొందరగా కంట్రోల్ చేసే అమ్మమ్మల చిట్కా.. ప్రతి ఒక్కరూ ఉపయోగించవచ్చు.  ఆ టిప్ ఏటో.. దాన్ని ఎలా అప్లై చేయాలో తెలుసుకుంటే.. కొబ్బరి నూనె.. కొబ్బరినూనె అందరికీ తెలిసిందే.. ఇందులో కొత్తగా ఏముందని అందరికీ అనిపిస్తుంది.  కానీ కొబ్బరి నూనెను అప్లై చేయడమే అసలైన సీక్రెట్.  చాలామంది జుట్టుకు నూనెను కొన్ని సెకెన్లలో చకాచకా అప్లై చేసి జడ వేసుకుంటారు.  కానీ అమ్మమ్మల కాలంలో జుట్టుకు నూనె పెట్టే విధానం పూర్తీగా విభిన్నం. పైగా కొబ్బరి నూనెలో ఉల్లిపాయ రసాన్ని జోడిస్తే జుట్టు మరింత మెరుగ్గా మారుతుంది. కొబ్బరి నూనె ఉల్లిపాయ రసం.. జుట్టు సంరక్షణకు ఉల్లిపాయ రసం చాలా మేలు చేస్తుంది. ఉల్లిపాయ రసంలో ఉండే సల్ఫర్, జుట్టు సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.  జుట్టుకు కొబ్బరి నూనె , ఉల్లిపాయ రసం రాయడం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గించవచ్చు. జుట్టు సంరక్షణ కోసం,  కొబ్బరి నూనెతో పాటు ఉల్లిపాయ రసాన్ని కూడా ఉపయోగించవచ్చు. దీనివల్ల జుట్టు పొడిబారడం కూడా తగ్గుతుంది. ఎలా అప్లై చేయాలి? రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను, అంతే పరిమాణంలో ఉల్లిపాయ రసంతో కలపాలి. దీనిని  నెత్తికి పట్టించి, ఒక గంట పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత, తేలికపాటి షాంపూతో మీ జుట్టును కడగాలి. దీనిని వారానికి రెండుసార్లు చేయడం వల్ల జుట్టు రాలడం చాలా తగ్గుతుంది. కొబ్బరినూనె అలోవెరా.. కలబంద జెల్ రాయడం వల్ల తలపై దురద , చికాకు తగ్గుతాయి. కలబందను ఉపయోగించడం వల్ల చుండ్రు కూడా తగ్గుతుంది. కొబ్బరి నూనె , కలబంద జెల్ కలిపి  జుట్టుకు రాయడం వల్ల దెబ్బతిన్న జుట్టును బాగుచేయడంలో సహాయపడుతుంది.  జుట్టు చాలా పొడిగా ఉంటే,  కొబ్బరి నూనె , కలబంద జెల్ ను  జుట్టుకు రాసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలి? రెండు టీస్పూన్ల కలబంద జెల్ ను,  రెండు టీ స్పూన్ల  కొబ్బరి నూనెను తీసుకోవాలి. వాటిని బాగా మిక్స్ చేయాలి.  ఈ పేస్ట్‌ను  జుట్టుకు పట్టించాలి. 45 నిమిషాల తర్వాత, తేలికపాటి షాంపూతో  జుట్టును కడగాలి. పైన పేర్కొన్న రెండు సీక్రెట్ టిప్స్ జుట్టు రాలడాన్ని ఆపడంలో చాలా సహాయపడతాయి.  జుట్టు పెరగడానికి కూడా తోడ్పడతాయి.                                       *రూపశ్రీ..

ఈ స్ర్కబ్ రాస్తే చాలు.. పాదాల మీద నలుపు, డెడ్ స్కిన్ పోయి కాంతివంతమవుతాయి!

ఈ స్ర్కబ్ రాస్తే చాలు.. పాదాల మీద నలుపు,  డెడ్ స్కిన్ పోయి కాంతివంతమవుతాయి! ఎండ తగలడం వల్ల చర్మం నల్లబడుతుంది. చేతులు, పాదాలపై ఇది ఎక్కువగా కనిపిస్తుంది. పాదాలపై చెప్పుల గుర్తులు పడతాయి, చేతులు కూడా నల్లగా అవుతాయి. వేసవిలో చెప్పులు, హీల్స్ ధరించడం వల్ల పాదాలు నల్లబడతాయి. దీన్నే టానింగ్ అంటారు.  నల్లబడిన పాదాలను తిరిగి కాంతివంతంగా మార్చుకోవడానికి, పాదాల మీద ఉండే మృత చర్మ కణాలు తొలగడానికి ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. టానింగ్ తొలగించే స్ర్కబ్ ఏంటో.. దాన్ని ఎలా తయారు చేసుకుని వాడాలో తెలుసుకుంటే.. శనగపిండి స్ర్కబ్.. టానింగ్‌ను తొలగించడానికి,  శనగపిండితో చేసిన స్క్రబ్‌ను ఉపయోగించవచ్చు. ఈ స్క్రబ్‌ను ఉపయోగించడం వల్ల  పాదాలపై ఉన్న టానింగ్ చాలా తగ్గుతుంది. ఈ స్క్రబ్‌ను ఎలా తయారు చేయాలంటే.. స్ర్కబ్.. కావలసిన పదార్థాలు..  పాదాల నుండి టానింగ్ , మృత చర్మాన్ని తొలగించడానికి,  శనగపిండి స్క్రబ్‌ను ఉపయోగించవచ్చు. శనగపిండి స్క్రబ్‌ను ఉపయోగించడం వల్ల టానింగ్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. ఈ స్క్రబ్‌ను తయారు చేయడం చాలా సులభం. స్క్రబ్‌ను తయారు చేయడానికి, రెండు షాంపూ ప్యాకెట్లు, రెండు టీస్పూన్ల బేకింగ్ సోడా , నిమ్మరసం తీసుకోవాలి. అన్నింటినీ బాగా కలిపి మెత్తని పేస్ట్ లాగా తయారు చేయండి. ఎలా వాడాలి.. తయారు చేసిన స్ర్కబ్ ను  వెంటనే  పాదాలకు అప్లై చేయాలి. 10 నుండి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత పాదాలను శుభ్రమైన నీటితో కడగాలి. ఈ ప్యాక్‌ను వారానికి 2 నుండి 3 సార్లు అప్లై చేయాలి. దీనివల్ల చర్మం నల్లబడటం  తగ్గుతుంది. చేతుల టానింగ్..  చేతులపై ఉన్న నల్ల మచ్చలను, టానింగ్ ను తొలగించడానికి ఈ  స్క్రబ్‌ను ఉపయోగించవచ్చు. ఈ స్క్రబ్ చనిపోయిన చర్మాన్ని తొలగించడంలో సహాయపడుతుంది.  చేతులు మరియు పాదాల చర్మం నల్లగా మారినట్లయితే, ఈ స్క్రబ్‌ను ఉపయోగించవచ్చు. టానింగ్ ఎలా తగ్గించాలి? బేకింగ్ సోడా చనిపోయిన చర్మాన్ని, మురికిని తొలగించి,  చర్మాన్ని స్ఫటికంలా నిర్మలంగా ఉంచుతుంది. శనగపిండి చర్మాన్ని సహజంగా ఎక్స్‌ఫోలియేట్ చేసి, టానింగ్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. షాంపూ కూడా చనిపోయిన చర్మాన్ని తొలగించడంలో సహాయపడుతుంది.  చర్మం టానింగ్‌ను తగ్గించుకోవాలనుకుంటే, ఈ స్క్రబ్‌ను ఉపయోగించవచ్చు.                                 *రూపశ్రీ

చర్మానికి హాని కలిగించే స్కిన్ కేర్ టిప్స్.. వీటితో జాగ్రత్త!

చర్మానికి హాని కలిగించే స్కిన్ కేర్ టిప్స్.. వీటితో జాగ్రత్త!  ఈ రోజుల్లో స్కిన్ కేర్ అమ్మాయిల లైఫ్ స్టైల్ లో  ఒక ముఖ్యమైన భాగంగా మారింది. దుమ్ము, కాలుష్యం , మారుతున్న వాతావరణం కారణంగా, చర్మం నిరంతరం బయట నుండి నష్టాన్ని ఎదుర్కొంటుంది, అందుకే  చర్మాన్ని సరిగ్గా జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. అయితే సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలామంది అమ్మాయిలు చర్మానికి మేలు కలించడం కంటే.. చర్మానికి హాని కలిగించే స్కిన్ కేర్ టిప్స్ ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు. చర్మానికి హాని కలిగించే కొన్ని సాధారణ స్కిన్ కేర్ టిప్స్ ఉన్నాయని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు.  సాధారణంగా ఎంతో మంచివి అనుకునే ఆ టిప్స్ కారణంగానే నేటికాలంలో చాలామంది చర్మ సమస్యలు ఎక్కువ ఎదుర్కుంటున్నారు. కాబట్టి, చర్మానికి హాని కలిగించే సాధారణ స్కిన్ కేర్ మిస్టేక్స్  ఏమిటో తెలుసుకుంటే.. సన్ స్క్రీన్.. చర్మవ్యాధి నిపుణుల అభిప్రాయం ప్రకారం సన్ స్క్రీన్ ఖచ్చితంగా వాడాలి. UV కిరణాలు చర్మాన్ని త్వరగా వృద్ధాప్యం చెందేలా చేస్తాయి, చర్మంపై మచ్చలను పెంచుతాయి,  చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. అయితే ఎండలో వెళ్తున్నప్పుడు తప్ప చాలా మంది  సన్ స్క్రీన్ అవసరం లేదని అనుకుంటారు, కానీ సాధారణ రోజులలో ముఖ్యంగా వర్షం పడే  రోజులలో కూడా దీనిని ఉపయోగించడం ముఖ్యం. ఇంటి చిట్కాలు.. నిమ్మరసం, టూత్‌పేస్ట్ లేదా ఇతర వంటగది చిట్కాలను నేరుగా ముఖానికి పూస్తుంటారు. దీనివల్ల చర్మం కమిలిపోవడం,  రంగు మారడం,  చర్మంపై మచ్చలు పెరగడం వంటివి జరిగేలా చేస్తాయి. ఇలాంటి  చికిత్సలు ముఖ్యంగా మొటిమలు వచ్చే లేదా సున్నితమైన చర్మానికి హానికరం. సోషల్ మీడియా టిప్స్.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే చర్మ సంరక్షణ చిట్కాలు ఎక్కువగా ఫ్రూవ్ కానివే అయి ఉంటాయి.  చాలామంది వ్యూస్ కోసం పిచ్చి పిచ్చి టిప్స్ చెబుతూ ఉంటారు. మొటిమలు, హైపర్‌పిగ్మెంటేషన్ లేదా ఎగ్జిమా వంటి సమస్యలకు సరైన,  ఫ్రూప్ చేయబడిన ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. అంతేకానీ సోషల్ మీడియాలో చూసి ఎప్పుడూ అనుసరించకూడదు. స్కిన్ కేర్ అంటే.. చాలామంది  అమ్మాయిలు  తమ చర్మ సంరక్షణను కేవలం ముఖానికే పరిమితం చేసుకుంటారు, కానీ మెడ, ఛాతీ , చేతులపై కూడా చర్మం తొందరగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఈ భాగాలకు మాయిశ్చరైజర్ , సన్‌స్క్రీన్ రాయడం కూడా చాలా అవసరం. ఫేస్ వాష్.. పదే పదే  ముఖం కడుక్కోవడం లేదా కఠినమైన సబ్బులను వాడటం వల్ల చర్మపు పొర దెబ్బతిని, చర్మం పొడిబారడం, సెన్సిటివిటీ పెరగడం, చివరికి మొటిమలు కూడా రావడం జరుగుతుంది. క్రీమ్స్, లోషన్లు...  తడి చర్మంపై క్రీములు, లోషన్లు వంటి పదార్థాలను పూయడం వల్ల వాటి ప్రభావాలు తీవ్రమై, మంట , చికాకు కలిగే ప్రమాదం పెరుగుతుంది. రెటినోల్ , ఎక్స్‌ఫోలియేటింగ్ యాసిడ్‌ల విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం. ముఖం తుడితే విధానం.. టవల్‌తో ముఖాన్ని రుద్దుతూ తుడుస్తూంటారు.  ఇలా  తుడుచుకోవడం చర్మానికి హానికరం. దీనివల్ల చర్మంపై లైట్ గా  వాపు , మచ్చలు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. అందువల్ల, ముఖాన్ని మెల్లగా తట్టడం ద్వారా తుడుచుకోవాలి. ఇదే మంచి పద్దతి. స్కిన్ కేర్ ప్రోడక్ట్.. చాలా పవర్పుల్ గా  పనిచేసే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ను  అకస్మాత్తుగా వాడటం చర్మానికి హానికరం కావచ్చు. ఇది చర్మపు రక్షణ పొరను దెబ్బతీసి, చికాకు లేదా రియాక్షన్స్ కు  కారణం అవుతుంది. పైన చెప్పుకున్న స్కిన్ కేర్ పద్దతులు అందరూ చాలా సాధారణం అనుకుంటారు. కానీ ఇవి చర్మానికి మేలు చేయకపోగా హాని ఎక్కువ చేస్తాయి. కాబట్టి జాగ్రత్త పడాలి.                                *రూపశ్రీ.

ప్రతి రాత్రి ముఖానికి కుంకుమాది తైలం రాసుకుంటే ఏం జరుగుతుంది.. ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..!

ప్రతి రాత్రి ముఖానికి కుంకుమాది తైలం రాసుకుంటే ఏం జరుగుతుంది.. ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..! ఆయుర్వేదంలో చర్మ సంరక్షణ కోసం చాలా రకాల పద్దతులు ఉన్నాయి.  లేపనాలు,  తైలాలు.. క్రీములు కూడా ఉంటాయి.  కానీ చర్మం కోసం ఆయుర్వేదంలో చాలా గొప్ప తైలం ఉంది.  అదే కుంకుమాది తైలం.  ఇది  చర్మానికి ఒక అద్భుతమైన చికిత్స చేస్తుంది.  దీనిని ప్రతిరోజూ రాసుకుంటే, మచ్చలు, సన్నని గీతలు, పొడిబారడం, మొటిమలు మొదలైన ముఖ సమస్యలన్నీ క్రమంగా తొలగిపోతాయి.  ఇది చర్మాన్ని చాలా కాలం పాటు యవ్వనంగా, మచ్చలేనిదిగా ఉంచుతుంది. కుంకుమాది తైలంలో కుంకుమపువ్వు మాత్రమే కాకుండా, చర్మానికి మేలు చేసే అనేక ఇతర మూలికలు కూడా ఉంటాయి. కుంకుమ పువ్వు నూనె లేదా కుంకుమాది తైలం ఏది మేలు? కుంకుమపువ్వు చర్మానికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలుసు. అయితే కుంకుమాది నూనె మంచిదా లేక కుంకుమపువ్వు నూనె మంచిదా అనే ప్రశ్న తలెత్తుతుంది. కుంకుమాది నూనె అంటే ఇతర మూలికలు లేదా నూనెలతో కలిపి తయారు చేసిన కుంకుమపువ్వు నూనె. మనం స్వచ్ఛమైన కుంకుమపువ్వు నూనెను ముఖానికి రాసుకున్నప్పుడు, అది చర్మంలోకి తగినంత లోతుగా చొచ్చుకుపోదు, దానివల్ల వచ్చే మెరుపు కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. కుంకుమాది నూనెలో నువ్వుల నూనె, కుంకుమపువ్వు, మంజిష్ఠ, లొద్దుగ , అతిమధురం, చందనం..  చర్మం యొక్క లోపలి పొరలలోకి చొచ్చుకుపోయే అనేక ఇతర మూలికలు ఉంటాయి. ఈ పదార్థాలన్నీ చర్మానికి అత్యంత ప్రయోజనకరమైనవి. అంతేకాకుండా, కుంకుమపువ్వు యొక్క గుణాలు కూడా చర్మం  లోపలి పొరలలోకి చొచ్చుకుపోయి, లోపలి నుండి ప్రయోజనాలను అందించి, దీర్ఘకాలం పాటు కాంతిని నిలుపుతాయి. కుంకుమాది నూనె చర్మంలోకి శోషించబడి, లోపలి పొరల నుండి పిగ్మెంటేషన్‌ను తొలగిస్తుంది, వాపును తగ్గిస్తుంది, చర్మ స్థితిని  మెరుగుపరుస్తుంది , చర్మాన్నిఎక్కువ కాలం యవ్వనంగా ఉంచుతుంది. ఇంట్లోనే కుంకుమాది తైలం ఇలా చేస్కోవచ్చు.. సుమారు 100 మిల్లీలీటర్ల కోల్డ్ ప్రెస్డ్ నువ్వుల నూనె తీసుకోవాలి. అందులో కొంత కుంకుమపువ్వు కలపాలి, కుంకుమపువ్వు మంచి నాణ్యతగా ఉన్నది తీసుకుంటేనే మంచి ఫలితం ఉంటుంది. తరువాత, చిటికెడు మంజిష్ఠ వేరు పొడి, కొంచెం లొద్దుగ వేరు, అర చెంచా అతిమధురం పొడి లేదా వేరు ముక్కలు,   కొన్ని చుక్కల స్వచ్ఛమైన చందనం నూనె కలపాలి. చందనం నూనె బదులు చందనం పొడి లేదా చందనం ముక్క ఉన్నా సరిపోతుంది. ఈ పదార్థాలన్నింటినీ మందపాటి అడుగు ఉన్న పాత్రలో వేసి, మధ్యమధ్యలో కలుపుతూ, 30 నుండి 40 నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడికించాలి. నూనెను ఎక్కువ సేపు మరిగించకూడదు. అది మాడిపోకుండా చూసుకోవాలి.  తరువాత మంటను ఆపివేసి, చల్లారనివ్వాలి. సూనె చల్లారిన తర్వాత, ఒక పలుచని కాటన్  వస్త్రం ఉపయోగించి దానిని ఒక పాత్రలోకి వడకట్టాలి. నూనె డైరెక్ట్ సూర్యరశ్మికి గురికాకుండా ఉండేందుకు, దానిని ముదురు రంగు సీసాలో ఉంచాలి.  ఈ నూనె మూడు నెలలు కదపకుండా,  సూర్యరశ్మి తగలకుండా వెలుతురు ఎక్కువగా లేని ప్రాంతంలో స్టోర్ చేయాలి. ఇలా చేస్తే 3 నెలల తర్వాత అద్బుతమైన రిజెల్ట్ ఇచ్చే  కుంకుమాది తైలం తయారైనట్టే. ప్రయోజనాలు.. కుంకుమాది నూనె ఒకటి రెండు చర్మ సమస్యలకు మాత్రమే కాకుండా చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోయి అనేక రకాల సమస్యలను పరిష్కరిస్తుంది. చర్మాన్ని ప్రకాశవంతం చేయడమే ఈ నూనె  పని.  దీన్ని రోజూ రాసుకుంటే, కొన్ని వారాల్లోనే  చర్మంపై ఉన్న మచ్చలు లేదా గందరగోళంగా ఉన్న చర్మపు రంగు మెరుగుపడుతుంది. మంజిష్ఠ , అతిమధురం మెలనిన్ రియాక్షన్ ను తగ్గిస్తాయి. దీని అర్థం, చర్మానికి ముదురు రంగును ఇచ్చే మెలనిన్ తక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుంది.  నల్ల మచ్చలు, హైపర్‌పిగ్మెంటేషన్ వంటివి మెల్లిగా తగ్గుతాయి. ఈ నూనె ప్రత్యేకంగా మొటిమల మచ్చలు, మెలస్మా , సూర్యరశ్మి వల్ల ఏర్పడే మచ్చలకు చికిత్స చేస్తుంది. నువ్వుల నూనె చర్మానికి లోతుగా తేమను అందించి, తేమను నిలుపుతుంది. అందువల్ల చాలా పొడిగా,  పొలుసులుగా ఉండే చర్మం ఉన్నవారు కుంకుమాది నూనె రాసుకుంటే చాలామంచి ప్రయోజనం ఉంటుంది. కుంకుమాది నూనెలోని లొద్దుగ,  చందనంలో ఉండే చల్లదనాన్నిచ్చే గుణాలు మొటిమల బారిన పడే చర్మానికి ఉపశమనాన్ని అందిస్తాయి. వాటిలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. కుంకుమపువ్వులో యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి.  ఈ నూనెలోని ఇతర మూలికలలో చర్మాన్ని రిపేర్ చేసే గుణాలు ఉన్నాయి. ఇవన్నీ కలిసి కొల్లాజెన్‌ను మెరుగుపరచడానికి, చర్మంపై ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి , క్రమంగా సన్నని గీతలను తగ్గించడానికి పనిచేస్తాయి. కుంకుమాది తైలంలో  కళ్ల చుట్టూ సున్నితంగా మర్దన చేయడం వల్ల నల్లటి వలయాలను తగ్గించుకోవచ్చు . కళ్లలో పిగ్మెంటేషన్ మరియు బలహీనత కారణంగా ఈ నల్లటి వలయాలు ఏర్పడతాయి. ఎలా ఉపయోగించాలంటే.. కుంకుమాది నూనెను రాత్రిపూట ఉపయోగించడం ఉత్తమం, ఎందుకంటే ఇది చర్మాన్ని బాగుచేసే నూనె.  రాత్రిపూట మెరుగైన ఫలితాలను అందిస్తుంది. రాత్రి సమయమే చర్మం తనను తాను బాగుచేసుకునే సమయం, కాబట్టి ఈ నూనెను ఉపయోగించడానికి ఇది సరైన సమయం. కుంకుమాది తైలం  ఉపయోగించేటప్పుడు క్రింది విషయాలను గుర్తుంచుకోవాలి.. చర్మాన్ని బాగుచేయడానికి కుంకుమాది తైలం రాసుకున్న తర్వాత, ముఖానికి మరే ఇతర మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ లేదా మేకప్ మొదలైనవి రాసుకోకూడదు. ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని, కొన్ని చుక్కల కుంకుమాది నూనెను అరచేతిలో వేసుకుని గోరువెచ్చగా చేసుకోవాలి. ఆ తర్వాత, దానిని ముఖంపై వృత్తాకార కదలికలతో సున్నితంగా రాయాలి. రాసిన తర్వాత, అది చర్మంలోకి ఇంకడానికి కొంత సమయం ఇచ్చి, ఆ తర్వాతే నిద్రపోవాలి.  పగటిపూట కుంకుమాది నూనెను పూయాలనుకుంటే, కేవలం ఒక చుక్క తీసుకుని మాయిశ్చరైజర్‌లో కలపాలి. దానిపై తప్పకుండా బ్రాడ్-స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్‌ను పూయాలి.  కుంకుమపువ్వు ఫోటోసెన్సిటివిటీకి కారణం కావచ్చు, అంటే దానిని పూసిన తర్వాత సూర్యరశ్మికి గురికావడం వల్ల చర్మ సమస్యలు తలెత్తవచ్చు. అందుకే కుంకుమాది తైలం వాడిన తర్వాత ఎండలోకి వెళ్లకూడదు. మెరుగైన ఫలితాల కోసం 4 నుండి 5 వారాల పాటు నిరంతరం వాడండి.                                          *రూపశ్రీ.

జుట్టు రకాన్ని బట్టి ఏ నూనెలు మంచివి.. ఏ నూనెలు ఎంచుకోవాలో తెలుసా!

జుట్టు రకాన్ని బట్టి ఏ నూనెలు మంచివి.. ఏ నూనెలు ఎంచుకోవాలో తెలుసా! నేటికాలంలో జుట్టు సంబంధిత సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. కొందరు ఎక్కువ  జుట్టు రాలే సమస్యతో బాధపడుతుంటే, మరికొందరు చుండ్రు , జిడ్డుగల తల చర్మంతో ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది జుట్టు బాగా పొడిబారి, చిక్కుపడిపోతుంది, చాలామందికి జుట్టునుహెల్తీగా మెయింటైన్ చేయడం చాలా కష్టమవుతుంది.  ఎక్కువ శాతం మంది హెయిర్ కేర్ కోసం మార్కెట్లో లభించే వివిధ రకాల నూనెలను ఎంచుకుంటారు.   కానీ ప్రతి నూనె ప్రతి రకమైన జుట్టుకు సరైన ఫలితాలు ఇవ్వలేదు.  హెయిర్ కేర్  నిపుణుల అభిప్రాయం ప్రకారం జుట్టు రకాన్ని బట్టి  ఏ నూనె అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందో నిర్ణయించుకోవాలి. తప్పుడు నూనెను ఉపయోగించడం వల్ల జుట్టు సమస్యలు తగ్గడానికి బదులుగా  మరింత తీవ్రమవుతాయి. అందువల్ల, ఏ జుట్టుకు ఎలాంటి నూనెను ఎంచుకోవాలి?  వివరంగా తెలుసుకుంటే.. పొడి, చిక్కుగా, గరుకుగా ఉండే జుట్టు..  జుట్టు పొడిగా, పెళుసుగా , సులభంగా విరిగిపోయేదిగా ఉంటే చాలామంచి నూనెలు ఎంచుకోవాలి.  నువ్వుల నూనె, బాదం నూనె,  ఆముదం నూనె చాలా బాగా పనిచేస్తాయి.  ఈ నూనెలు జుట్టుకు లోతైన పోషణను అందించడంలో సహాయపడతాయి. వీటిలో ఉండే కొవ్వు ఆమ్లాలు , విటమిన్లు తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి, దీనివల్ల జుట్టు పొడిబారడం , విరిగిపోవడం తగ్గుతుంది. పలుచగా ఉండి,  బాగా రాలిపోయే జుట్టుకు..  చిన్న వయసులోనే ఎక్కువగా జుట్టు రాలడం, జుట్టు పలచబడటం లేదా తెల్ల జుట్టుతో బాధపడుతుంటే, మూడు రకాల నూనెలు ఉపయోగకరంగా ఉంటాయి. కొబ్బరి నూనె,  భృంగరాజ్ నూనె, ఉసిరి నూనె బాగా సహాయపడతాయి. ఈ నూనెలు తల చర్మానికి ఉపశమనం కలిగించి, జుట్టు కుదుళ్లను బలపరుస్తాయి. క్రమం తప్పకుండా మసాజ్ చేయడం వల్ల తల చర్మానికి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. జిడ్డు,  చుండ్రు జుట్టుకు.. జిడ్డుగల తల చర్మం ఉన్నవారు తరచుగా జిగట, దురద , చుండ్రు వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఇలాంటి వారికి ఆవ నూనె, వేప నూనె, టీ ట్రీ ఇన్ఫ్యూజ్డ్ ఆయిల్ బాగా సహాయపడతాయి.  ఈ నూనెలలో తల చర్మాన్ని శుభ్రంగా ఉంచడానికి , అధిక నూనెను నియంత్రించడానికి సహాయపడే గుణాలు ఉంటాయి. హెయిర్ ఆయిల్ రాసేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు.. జుట్టుకు అధికంగా నూనె రాయకూడదు. నెత్తిని సున్నితంగా మసాజ్ చేయాలి, అంతే తప్ప రుద్ది రుద్ది తలకు నూనె పెట్టకూడదు.  తలకు నూనె పెట్టాక నూనెను ఎక్కువ సేపు అలాగే ఉంచకూడదు. చాలా మందికి వారానికి ఒకటి నుండి రెండు సార్లు నూనె రాసుకోవడం సరిపోతుందని అనుకుంటారు. అలాగే తల చర్మం ఎలా ఉందో దాన్ని బట్టి  నూనెను ఎంచుకోవాలి. ఆహారం కూడా ముఖ్యం.. ఆరోగ్యకరమైన, దృఢమైన జుట్టుకు కేవలం తల నూనె మాత్రమే సరిపోదు. ప్రోటీన్, ఐరన్, బయోటిన్, విటమిన్ సి , ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారం కూడా చాలా అవసరం.  తగినంత నీరు త్రాగడం, ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా జుట్టు ఆరోగ్యానికి కీలక పాత్ర పోషిస్తాయి.                                *రూపశ్రీ.

వాంపైర్ ఫేషియల్.. సెలబ్రిటీలు చేయించుకునే ఈ ఫేషియల్ గురించి మీకు తెలుసా!

వాంపైర్ ఫేషియల్.. సెలబ్రిటీలు చేయించుకునే ఈ ఫేషియల్ గురించి మీకు తెలుసా! నేటికాలంలో ప్రతి ఒక్కరూ అందమైన, కాంతివంతమైన , యవ్వనంగా కనిపించే చర్మాన్ని కోరుకుంటున్నారు. అందుకే స్కిన్ కేర్ కు చాలా ప్రాధాన్యత పెరిగింది. ఇక బ్యూటీ ట్రీట్మెంట్స్ కు కూడా వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు కూడా ఖర్చు చేస్తుంటారు.  అయితే ఈ మధ్య కాలంలో  "వాంపైర్ ఫేషియల్" అని పిలువబడే  ఒక బ్యూటీ ట్రీట్మెంట్ చాలా వైరల్ గా మారింది. ఈ పేరు వింతగా అనిపించినప్పటికీ ఇది చర్మాన్ని తిరిగి యవ్వనంగా మార్చే కొత్త స్కిన్ ట్రీట్మెంట్ పద్దతిలో ఒకటిగా పరిగణించబడుతోంది. వాంపైర్ ఫేషియల్ అంటే.. వాంపైర్ ఫేషియల్స్ ను ప్లేట్‌లెట్-రిచ్ ప్లాస్మా (PRP) ఫేషియల్స్ అని కూడా పిలుస్తారు, ఇందులో ఒక వ్యక్తి యొక్క సొంత రక్తాన్ని ఉపయోగిస్తారు. రక్తం నుండి ప్లేట్‌లెట్స్ , గ్రోత్ ఫ్యాక్టర్స్‌ను సంగ్రహించి చర్మానికి పూస్తారు, ఇది చర్మాన్ని రిపేర్ చేయడంలో చర్మాన్ని తిరిగి యవ్వనంగా మార్చడానికి కొత్త చర్మ కణాలను  పునరుత్పత్తి చేసే ప్రక్రియను ఉత్తేజపరిచే ప్రయత్నం చేస్తుంది. అందుకే దీనిని యాంటీ-ఏజింగ్ , చర్మాన్ని తిరిగి యవ్వనంగా మార్చే చికిత్సగా ప్రచారం చేస్తున్నారు. చాలా మంది సన్నని గీతలు, ముడతలు, మొటిమల మచ్చలు, పెద్ద రంధ్రాలు , కాంతిహీనమైన చర్మం.. మొదలైన వాటిని  తగ్గించుకోవడానికి ఈ ట్రీట్మెంట్ ను ఎంచుకుంటారు. అయితే ఇది ఏదో  మ్యాజిక్ ట్రీట్మెంట్ కాదు,  దీని ఫలితాలు మనిషి చర్మ రకాన్ని బట్టి,  వారి ఆరోగ్య పరిస్థితిని మీద ఆధారపడి ఉంటుందట. వాంపైర్ ఫేషియల్ గురించి స్పష్టంగా.. వాంపైర్ ఫేషియల్ అనేది శస్త్రచికిత్స అవసరం లేని ఒక బ్యూటీ  ప్రక్రియ. దీనిలో వ్యక్తి  సొంత రక్తం నుండి సేకరించిన PRPని ఉపయోగిస్తారు. ప్లేట్‌లెట్స్‌లోని వృద్ధి కారకాలు శరీర సహజ మరమ్మత్తు ప్రక్రియలో పాత్ర పోషిస్తాయి. ఈ సూత్రం ఆధారంగా, PRPని మైక్రోనీడ్లింగ్ లేదా ఇతర పద్ధతులతో కలిపి చర్మంపై ఉపయోగిస్తారు. చర్మం మరింత తాజాగా, ఆరోగ్యంగా , యవ్వనంగా కనిపించడంలో సహాయపడటమే దీని లక్ష్యం. ప్రాసెస్ ఎలా ఉంటుందంటే.. వ్యక్తి చేయి నుండి కొద్ది మొత్తంలో రక్తం తీసుకోవడంతో ఈ ప్రక్రియ మొదలవుతుంది. ఆ తర్వాత PRPని వేరు చేయడానికి రక్తాన్ని ఒక ప్రత్యేక యంత్రంలో తిప్పుతారు.మొదట ముఖంపై మైక్రోనీడ్లింగ్ చేస్తారు, దీనివల్ల చర్మంలో అత్యంత సన్నని మార్గాలు ఏర్పడతాయి. ఆ తర్వాత PRPని ముఖానికి పూస్తారు, తద్వారా చర్మం దానిని మరింత బాగా గ్రహిస్తుంది.  ఈ మొత్తం ప్రక్రియకు సాధారణంగా 45 నుండి 90 నిమిషాల సమయం పడుతుంది. ప్రయోజనాలు.. వాంపైర్ ఫేషియల్స్ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయని చెబుతారు.  ఇది సన్నని గీతలు , ముడతలు తక్కువగా కనిపించేలా చేస్తుంది. కొంతమంది మొటిమల మచ్చలు, చర్మం బాలెన్స్ లేకుండా ఉండటం మరియు చర్మం కాంతిహీనతలో కూడా మెరుగుదల ఉంటుంది.  అదనంగా, చర్మం మరింత బిగువుగా, నునుపుగా , కాంతివంతంగా మారే అవకాశం ఉంటుంది. ప్రమాదాలు,  దుష్ప్రభావాలు.. ప్రతి కాస్మెటిక్ ప్రక్రియ లాగే, వాంపైర్ ఫేషియల్స్‌లో కూడా కొన్ని ప్రమాదాలు ఉండే అవకాశం ఉంది. చికిత్స తర్వాత లైట్ గా ఎరుపు, వాపు, సెన్సిటివిటీ లేదా మంట వంటివి ఏర్పడవచ్చు. ఈ లక్షణాలు సాధారణంగా కొన్ని రోజుల్లో తగ్గిపోతాయి. ఈ ప్రక్రియను శుభ్రమైన , గుర్తింపు పొందిన  క్లినిక్‌లో నిర్వహించకపోతే, ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా పెరగవచ్చు. అందువల్ల, ఈ చికిత్సను అర్హత పొందిన క్లినిక్ లో,  శిక్షణ పొందిన నిపుణుడి దగ్గర మాత్రమే చేయించుకోవడం మంచిది. ఈ ట్రీట్మెంట్ తీసుకోవడానికి ముందు వైద్యుడి సలహా తీసుకోవడం ఎంతో మంచిది.                                         *రూపశ్రీ.

వేసవిలో ఆయిల్ స్కిన్ వేధిస్తోందా.. ఈ చిట్కాలతో భలే ఉపశమనం ఉంటుంది!

వేసవిలో ఆయిల్ స్కిన్ వేధిస్తోందా.. ఈ చిట్కాలతో భలే ఉపశమనం ఉంటుంది! వేసవి రాకతో, చర్మానికి సంబంధించిన అనేక సమస్యలు పెరగుతాయి. మండే ఎండ, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, చెమట , గాలిలోని తేమ చర్మాన్ని జిగటగా , నూనెగా మారుస్తాయి. ముఖ్యంగా, ఇప్పటికే జిడ్డు చర్మం ఉన్నవారు వేసవిలో తమ ముఖంపై నూనె, చెమట , దుమ్ము పేరుకుపోయే సమస్యను తరచుగా ఎదుర్కొంటారు. ఇది ముఖం నిర్జీవంగా కనిపించేలా చేయడమే కాకుండా, మొటిమలు, బ్లాక్‌హెడ్స్ , ఇతర చర్మ సమస్యల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అయితే, కొన్ని సులభమైన చర్మ సంరక్షణ చిట్కాలను పాటించడం ద్వారా వేసవిలో కూడా  చర్మాన్ని తాజాగా, నిర్మలంగా , కాంతివంతంగా ఉంచుకోవచ్చు.  ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. శుభ్రత.. చర్మంపై  అధికంగా నూనె , మురికి ఉంటే దాన్ని తొలగించడానికి తేలికపాటి ఫేస్ వాష్ ఉపయోగించాలి. పదే పదే  ముఖం కడుక్కోవడం మానుకోవాలి, ఎందుకంటే దీనివల్ల  చర్మం మరింత నూనెను ఉత్పత్తి చేస్తుంది.  ఉదయం,  రాత్రి పూట ముఖాన్ని శుభ్రం చేసుకోవడం మంచిది.  నిర్మలమైన చర్మం మొటిమల ప్రమాదాన్ని తగ్గించడంలో రోజులో ఉదయం, రాత్రి ముఖం శుభ్రం చేసుకోవడం ఎంతో సహాయపడుతుంది. మాయిశ్చరైజర్.. వేసవిలో కూడా చర్మాన్ని తేమగా ఉంచుకోవడం ముఖ్యం. ఇందుకోసం మాయిశ్చరైజర్ రాయాలి. చాలామంది మాయిశ్చరైజర్ కేవలం చలికాలంలోనే అవసరం అనుకుంటారు.  కానీ అన్ని కాలాల్లో చర్మానికి తగినట్టు మాయిశ్చరైజర్ ఎంచుకోవడం మంచిది.  వేసవిలో తేలికైన , జెల్ ఆధారిత మాయిశ్చరైజర్లు మంచి ఎంపిక అవుతాయి. ఇది చర్మానికి అదనపు జిడ్డును చేర్చకుండా, తేమగా ఉంచుతుంది. చర్మానికి ఉండే  సహజ సమతుల్యత కాపాడుతుంది. సన్ స్క్రీన్.. తీవ్రమైన సూర్యరశ్మి చర్మానికి హాని కలిగిస్తుంది. ఇది వేసవిలో చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది.  బయటకు వెళ్లే 20 నిమిషాల ముందు సన్‌స్క్రీన్ రాసుకోవాలి.  SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సన్‌స్క్రీన్‌ను ఎంచుకోవాలి. ఇది చర్మం నల్లబడటాన్ని , అకాల వృద్ధాప్య లక్షణాలను నివారించడంలో సహాయపడుతుంది. ఫేస్ ప్యాక్.. ముల్తానీ మట్టి, రోజ్ వాటర్ , దోసకాయ వాడకం చర్మాన్ని చల్లబరుస్తుంది. ఇది అధిక నూనెను నియంత్రించడంలో సహాయపడుతుంది.  వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఫేస్ ప్యాక్ వేసుకోవాలి.  చర్మం మరింత శుభ్రంగా, తాజాగా అనిపిస్తుంది. నీరు.. శరీరాన్ని తగినంత తేమగా ఉంచుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది.  శరీరం నుండి విష పదార్థాలను తొలగించడంలో నీరు సహాయపడుతుంది.  వేసవిలో 8-10 గ్లాసుల నీరు త్రాగాలి. లేదా అవసరాన్ని బట్టి ఇంకా ఎక్కువగా త్రాగడం కూడా మంచిదే.  నీరు బాగా తాగడం వల్ల చర్మం తేమగా మారుతుంది.  తేమగా ఉన్న చర్మం తాజాగా, కాంతివంతంగా కనిపిస్తుంది.                               *రూపశ్రీ.

హెన్నా పెట్టుకున్న తర్వాత జుట్టు పొడిబారిపోతోందా.. ఇలా చేస్తే చాలా మృదువుగా ఉంటుంది!

హెన్నా పెట్టుకున్న తర్వాత జుట్టు పొడిబారిపోతోందా.. ఇలా చేస్తే చాలా మృదువుగా ఉంటుంది!  జుట్టుకు హెన్నా లేదా గోరింటాకు పెట్టుకోవడం ఈనాటి కాలం పాటిస్తున్న హెయిర్ కేర్ పద్దతి కాదు. అమ్మమ్మలు ఎన్నో ఏళ్లుగా తెల్ల జుట్టును కవర్ చేయడానికి హెన్నాని లేదా గోరింటాకును వాడుతున్నారు. హెన్నా ఒక సహజ కండీషనర్‌లా పనిచేసి, జుట్టు పై పొరను బిగుతుగా చేసి, దానిని మృదువుగా, మెరిసేలా , పట్టులా చేస్తుంది. హెన్నా జుట్టుకు అందమైన రంగును కూడా ఇస్తుంది. హెన్నాని వాడటం వల్ల తెల్ల జుట్టును దాచడానికి కూడా సహాయపడుతుంది. హెన్నాకు చల్లదనాన్నిచ్చే గుణం ఉంది,  దానిని తలకు పట్టించడం వల్ల తల చర్మానికి వేడి నుండి ఉపశమనం లభిస్తుంది. వేసవి కాలంలో హెన్నాని వాడటం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే కొందరిలో హెన్నా ఉపయోగించిన తర్వాత  జుట్టు చాలా పొడిగా మారుతుంది.  ఇలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అసలు హెన్నా పెట్టుకోవడం వల్ల జుట్టు పొడిగా ఎందుకు మారుతుంది?  తెలుసుకుంటే.. హెన్నా జుట్టును ఎందుకు పొడిగా చేస్తుంది? తెల్ల జుట్టును కప్పిపుచ్చడానికి హెన్నా పెట్టుకోవడం చాలా ప్రయోజనకరం. హెన్నాలోని పదార్థాల మధ్య సమతుల్యతను పాటించడం చాలా ముఖ్యం. పదార్థాలు సరిగ్గా బాలెన్స్ గా లేకపోతే,  జుట్టు పొడిబారిపోతుంది. హెన్నాకు పెరుగు, కలబంద , ఉసిరికాయలను కలపాలి. హెన్నా పెట్టుకునే సమయం.. చాలామంది హెన్నా పెట్టుకునేటప్పుడు తరచుగా పొరపాట్లు చేస్తుంటారు. హెన్నాను 8 నుండి 10 గంటల పాటు ఉంచుకోవడం వల్ల జుట్టు పొడిబారి, నిర్జీవంగా మారుతుంది. హెన్నాను  జుట్టుపై కేవలం 3 నుండి 4 గంటల పాటు మాత్రమే ఉంచుకోవాలి. పరిశుభ్రత.. జిడ్డుగా లేదా చెమటగా ఉన్న జుట్టుకు హెన్నా పెట్టకూడదు. మురికి జుట్టుకు హెన్నా పెట్టడం చాలా పెద్ద తప్పు. హెన్నాను ఎల్లప్పుడూ శుభ్రమైన జుట్టుకే పెట్టాలి. ఈ తప్పులన్నీ చెడు ఫలితాలకు దారితీయవచ్చు. మొదటగా జుట్టును షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత జుట్టు ఆరిన తర్వాత మరుసటి రోజు శుభ్రంగా ఉన్న జుట్టుకు హెన్నా పెట్టుకోవాలి. కొబ్బరినూనె లేదా ఆముదం.. హెన్నా మిక్స్ తయారు చేసుకున్నప్పుడు అందులో ఒక స్పూన్ కొబ్బరి నూనె లేదా ఆముదం అందులో కలపాలి.  ఇలా కలపడం వల్ల జుట్టుకు హెన్నా పెట్టుకున్న తర్వాత జుట్టు పొడిగా కాకుండా చాలా మృదువుగా ఉంటుంది. పైన చెప్పుకున్న టిప్స్ పాటిస్తే.. జుట్టుకు హెన్నా పెట్టినా  జుట్టు పొడిబారదు. తెల్లజుట్టు కూడా చాలా బాగా కవర్ అవుతుంది.                           *రూపశ్రీ.

చిన్న వయసులోనే జుట్టు నెరిసిందా.. ఇలా చేస్తే మళ్లీ నల్లగా మారిపోతుంది!

చిన్న వయసులోనే జుట్టు నెరిసిందా.. ఇలా చేస్తే మళ్లీ నల్లగా మారిపోతుంది!  ఈ రోజుల్లో చిన్న వయసులోనే జుట్టు నెరవడం ఒక సాధారణ సమస్యగా మారుతోంది. గతంలో వయసు పెరిగే కొద్దీ మాత్రమే తెల్ల జుట్టు కనిపించేది, కానీ ఇప్పుడు 20 నుండి 30 ఏళ్ల మధ్య వయసున్న యువతలో ఈ సమస్య వేగంగా పెరుగుతోంది. మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు , పెరుగుతున్న కాలుష్యం దీనికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. చాలా మంది తెల్ల జుట్టును కవర్ చేసుకోవడానికి హెయిర్ డైలు , రసాయన ఉత్పత్తులను ఉపయోగిస్తారు, కానీ వాటిని ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల జుట్టుకు మరింత నష్టం జరగవచ్చు. చిన్న వయసులోనే జుట్టు నెరసిపోవడం వల్ల  ఆందోళన పడేవారు జుట్టుకు రంగు వేయాల్సిన అవసరం లేకుండా,  నెరిసిన జుట్టును క్రమంగా నల్లగా మార్చడానికి కొన్ని సహజమైన ఇంటి చిట్కాలను పాటించవచ్చు.  అవేంటో తెలుసుకుంటే.. ఉసిరి, కరివేపాకు.. ఉసిరి జుట్టుకు చాలా మేలు చేస్తుంది.  దీనిలో ఉండే విటమిన్ సి , యాంటీఆక్సిడెంట్లు జుట్టును బలోపేతం చేయడానికి సహాయపడతాయి. ఉసిరి నూనె లేదా ఉసిరి పొడిని హెయిర్ మాస్క్‌గా ఉపయోగించవచ్చు. కరివేపాకు జుట్టుకు కూడా మేలు చేస్తుంది. కొబ్బరి నూనెలో కరివేపాకును మరిగించి, ఆ నూనెను  జుట్టుకు పట్టించడం వల్ల జుట్టుకు పోషణ అంది, తెల్ల జుట్టు సమస్యను తగ్గించవచ్చు. ఉసిరి, కొబ్బరినూనె.. ఉసిరి జుట్టుకు చాలా మేలు చేస్తుంది.  దానిలో ఉండే విటమిన్ సి జుట్టుకు పోషణ అందించడంలో సహాయపడుతుంది. ఎలా ఉపయోగించాలి.. రెండు టీస్పూన్ల ఉసిరి పొడి తీసుకోవాలి. దీన్ని కొబ్బరి నూనెతో కలిపి కొద్దిగా వేడి చేయాలి.  అది చల్లారిన తర్వాత, జుట్టు కుదుళ్లకు పట్టించాలి. ఒక గంట తర్వాత కడగాలి.  దీనిని వారానికి రెండుసార్లు ఉపయోగించడం ప్రయోజనకరంగా ఉంటుంది. కరివేపాకు హెయిర్ ఆయిల్.. కరివేపాకు జుట్టు కుదుళ్లను బలపరిచి, సహజ రంగును కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఎలా తయారు చేయాలి.. కొబ్బరి నూనెలో 10-15 కరివేపాకు ఆకులను వేయాలి.  ఆకులు నల్లబడే వరకు వేడి చేయాలి.  చల్లార్చి, జుట్టుకు మసాజ్ చేయాలి.  దీనిని రాత్రిపూట ఉంచుకుని, ఉదయం కడిగేయవచ్చు. బ్లాక్ టీ.. బ్లాక్ టీ  జుట్టుకు సహజమైన ముదురు రంగును ఇవ్వడానికి సహాయపడుతుంది. ఎలా ఉపయోగించాలి? రెండు కప్పుల నీటిలో రెండు టీస్పూన్ల టీ ఆకులను వేసి మరిగించాలి. చల్లారిన తర్వాత జుట్టుకు పట్టించాలి.  30 నిమిషాల తర్వాత మామూలు నీటితో కడగాలి. ఈ చిట్కా జుట్టుకు మెరుపును కూడా పెంచుతుంది. మెహందీ, కాఫీ ప్యాక్.. జుట్టుకు సహజమైన రంగును ఇవ్వడానికి హెన్నాని ప్రాచీన కాలం నుండి ఉపయోగిస్తున్నారు.   ప్యాక్‌ను ఎలా తయారు చేయాలి?   కాఫీ పొడిని హెన్నా పొడితో కలపాలి.  నీళ్ళు పోసి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. రెండు గంటల తర్వాత జుట్టుకు పట్టించాలి. ఇది జుట్టుకు లేత సహజమైన గోధుమ-నలుపు రంగును ఇస్తుంది. ఆహారం.. చిన్నవయసులో జుట్టు తెల్లబడటానికి విటమిన్ బి12, ఇనుము మరియు ప్రోటీన్ లోపాలే కారణం.   కాబట్టి ఇవి లోపించకుండా.. ఆహారంలో ఈ పోషకాలు ఉండేలా చూసుకోవాలి.                             *రూపశ్రీ.

తలస్నానం చేయడానికి 5నిమిషాల ముందు ఈ పని చేస్తే చాలు.. జుట్టు రాలడం ఆగిపోతుంది!

తలస్నానం చేయడానికి 5నిమిషాల ముందు ఈ పని చేస్తే చాలు.. జుట్టు రాలడం ఆగిపోతుంది! ఈ రోజుల్లో చాలా మంది జుట్టు రాలడం సమస్యతో బాధపడుతున్నారు. జుట్టు రాలడం ఒక పెద్ద సమస్యగా మారింది. జుట్టు రాలడాన్ని నియంత్రించడానికి  అన్ని రకాలుగా ప్రయత్నిస్తారు, కానీ  ఎన్ని ప్రయత్నాలు చేసినా  జుట్టు రాలడంలో  చెప్పుకోదగ్గ మార్పు కనిపించదు. అయితే జుట్టు రాలడం తగ్గించుకోవడానికి తలకు షాంపూ చేయడానికి ఐదు నిమిషాల ముందు ఒకే ఒక పని చేయడం వల్ల చాలా బాగా పనిచేస్తుంది.  కేవలం జుట్టు రాలడం తగ్గడమే కాదు.. జుట్టు ఒత్తుగా,  నేచురల్ గా నల్లగా మారుతుంది కూడా.  అసలు జుట్టు రాలడానికి కారణాలు ఏమిటి? జుట్టు రాలడాన్ని ఆపడంలో  ప్రభావవంతంగా పని చేసే ఆ చిట్కా ఏంటో తెలుసుకుంటే.. జుట్టు రాలడానికి  కారణాలు.. కాలుష్యం, దుమ్ము , అనారోగ్యకరమైన ఆహారం వల్ల జుట్టు రాలుతుంది.   ఆవనూనే.. జుట్టు సంరక్షణ కోసం ఆవ నూనెను ఉపయోగించవచ్చు. షాంపూ చేయడానికి ముందు రోజు రాత్రి  జుట్టుకు ఆవ నూనెను రాసి, బాగా మసాజ్ చేయవచ్చు. మరుసటి రోజు షాంపూతో తలస్నానం చేయవచ్చు.  ఒకవేళ కుదరకపోతే కనీసం తలస్నానం చేయడానికి 5నిమిషాల ముందైనా సరే.. గోరువెచ్చని ఆవనూనెతో మసాజ్ చేసుకుని ఆ తర్వాత తలస్నానం చేయవచ్చు. పోషణ.. భారతదేశంలో ఆవ నూనెను శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు.  తల చర్మానికి పోషణ అందించడానికి  దీనిని ఉపయోగించవచ్చు. ఆవ నూనెలో ఒమేగా-3 , ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇందులో విటమిన్ ఇ , యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి, ఇవి జుట్టు పొడిబారడాన్ని తగ్గిస్తాయి. తేమ.. నూనెతో జుట్టుకు మర్దన చేయడం తేమను నిలుపుకోవడానికి సహాయపడుతుంది. జుట్టుకు నూనె రాయడం వల్ల పొడిబారడం తగ్గి, సహజంగా మృదువుగా మారుతుంది. చుండ్రు.. ఆవ నూనెతో తలకు మర్దన చేయడం వల్ల తల చర్మం పొడిబారడం తగ్గుతుంది. ఇది చుండ్రును కూడా తగ్గిస్తుంది. ఆవ నూనెను పూయడం ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించడంలో కూడా సహాయపడుతుంది.                          *రూపశ్రీ.

జుట్టుకు వేసుకున్న రంగు త్వరగా వెలిసిపోతుందా? ఈ సీక్రెట్ టిప్స్ ఫాలో అవ్వండి!

జుట్టుకు వేసుకున్న రంగు త్వరగా వెలిసిపోతుందా?  ఈ సీక్రెట్ టిప్స్ ఫాలో అవ్వండి! హెయిర్ కలర్ నేటికాలంలో చాలామంది జుట్టు సంరక్షణలో ఉపయోగిస్తున్న ఒక పద్దతి.  జుట్టు కొత్తగా ఫ్యాషన్ గా కనిపించాలన్నా, జుట్టుకు కొత్త హెయిర్ కలర్ ట్రై చేయాలనుకున్నా ఇది మంచి మార్గం. అయితే జుట్టుకు రంగు వేసిన తర్వాత చాలామంది రంగు తొందరగా వెలిసిపోతోందని కంప్లైంట్ చేస్తుంటారు. కానీ రంగు వేసిన తర్వాత జుట్టును ఎంత కేరింగ్ గా చూసుకుంటే జుట్టుకు వేసిన రంగు అంత ఎక్కువ కాలం నిలుస్తుంది. జుట్టుకు రంగు వేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుంటే.. ఈ సమయం ముఖ్యం.. రంగులలోని రసాయనాలు చర్మ రంధ్రాలను తెరుస్తాయి. అందువల్ల జుట్టును కడిగే ముందు 48 నుండి 72 గంటల సమయం ఇవ్వాలి. ఇది రంగు కణాలు  జుట్టులోకి సరిగ్గా ఇంకడానికి, రంగు వెలిసిపోకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. అలాగే, స్విమ్మింగ్ పూల్ లేదా టబ్‌లో  జుట్టు తడవకుండా చూసుకోవాలి. సల్పేట్ లేని ఉత్పత్తులు.. జుట్టును ఎల్లప్పుడూ సల్ఫేట్ లేని షాంపూ , కండిషనర్‌తో కడగాలి. రంగు వేసిన జుట్టు కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఉత్పత్తులను వాడాలి. సల్ఫేట్లు  జుట్టును పొడిబారేలా చేసి, రంగు త్వరగా వెలిసిపోయేలా చేస్తాయి. వారానికి రెండు నుండి మూడు సార్లు షాంపూ చేస్తే సరిపోతుంది. సాధారణ షాంపూ కంటే డ్రై షాంపూ ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. సన్ లైట్ ప్రొటెక్షన్.. ఎక్కువసేపు ఎండలో ఉండటం మానుకోవాలి.  తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే, వెడల్పాటి అంచుగల టోపీ లేదా గొడుగును ఉపయోగించాలి.  జుట్టును ఎండ నుండి రక్షించుకోవడానికి హెయిర్ సన్‌స్క్రీన్ కూడా ఒక మంచి ఎంపిక. తేమ.. రంగు వేసిన జుట్టు త్వరగా పొడిబారిపోతుంది, అలాగే దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి తేమను నిలుపుకోవడానికి ప్రయత్నించాలి. దీని కోసం మాయిశ్చరైజింగ్ క్రీమ్ లేదా డీప్ కండిషనింగ్ ట్రీట్‌మెంట్‌ను ఉపయోగించాలి. హెయిర్ స్టైలింగ్ పరికరాలు.. రంగు వేసిన జుట్టు ఇప్పటికే కొద్దిగా దెబ్బతిని ఉంటుంది, హెయిర్  స్టైలింగ్ పరికరాలు అయిన హెయిర్ డ్రైయర్,  స్ట్రెయిటనర్ వంటివి  దానిని మరింత దెబ్బతీస్తాయి.  తప్పనిసరిగా స్టైలింగ్ సాధనాలను ఉపయోగించాల్సి వస్తే, హీట్ ప్రొటెక్టెంట్‌ను అప్లై చేయాలి. . ఇది  జుట్టుకు , సాధనాల నుండి వెలువడే వేడికి మధ్య ఒక రక్షణ పొరను ఏర్పరుస్తుంది. స్ప్లిట్ కటింగ్.. జుట్టు చివర్లు చిట్లిపోతే హెయిర్ డై వాటికి అంటుకోదు, పైగా రంగు త్వరగా వెలిసిపోతుంది. క్రమం తప్పకుండా జుట్టును ట్రిమ్ చేయడం వల్ల చివర్లు చిట్లిపోయే సమస్య తగ్గుతుంది .  ప్రతి 6-8 వారాలకు ఒకసారి  జుట్టును ట్రిమ్ చేసుకోవచ్చు.                               *రూపశ్రీ.

నల్లమచ్చలకి కోజిక్ యాసిడ్ వాడుతున్నారా? ఈ నిజాలు తెలుకోకుంటే నష్టపోతారు!

నల్లమచ్చలకి కోజిక్ యాసిడ్ వాడుతున్నారా?  ఈ నిజాలు తెలుకోకుంటే నష్టపోతారు! సోషల్ మీడియాలోని చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్‌ లు   కోజిక్ యాసిడ్ అనే పదాన్ని వాడటం విని ఉంటారు.  ముఖ్యంగా బ్యూటీ ఉత్పత్తుల గురించి యూట్యూబ్, ఇన్స్టా వంటి ప్లాట్ఫామ్ లలో చాలా ఎక్కువగా ప్రమోషన్లు చూస్తుంటాం. వాటిలో కోజిక్ యాసిడ్ గురించి కూడా చాలా చెబుతుంటారు. చర్మం మీద పాత మచ్చలైనా లేదా ఎండకు కమిలిపోయిన చర్మమైనా కోజిక్ యాసిడ్ వాడితే చాలా మంచి ఫలితం ఉంటుంది.  అయితే ఇది అందరికీ సరైనదైనా అనే విషయం చాలా మందికి తెలియదు.  కానీ మచ్చలేని చర్మం కోసం కోజిక్ యాసిడ్ వాడాలని అనుకునేవారు, ఇప్పటికే వాడుతున్నవారు కోజిక్ యాసిడ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. అవేంటంటే.. కోజిక్ యాసిడ్ చర్మం పై ఎలా పనిచేస్తుందంటే.. కోజిక్ యాసిడ్ ప్రధానంగా చర్మంలో మెలనిన్ ఉత్పత్తిని నెమ్మదింపజేయడం ద్వారా పనిచేస్తుంది. ఇది మొటిమల మచ్చలు, సూర్యరశ్మి వల్ల ఏర్పడే మచ్చలు, చర్మం నల్లబడటం , మెలస్మా వంటి  సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. దీనికి తేలికపాటి యాంటీఆక్సిడెంట్ గుణాలు కూడా ఉన్నాయి, వీటిని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మం కాంతివంతంగా ,  చర్మం మొత్తం బాలెన్స్డ్ గా  మారుతుంది. కోజిక్ యాసిడ్, విటమిన్-సి కాంబినేషన్.. కోజిక్ యాసిడ్,  విటమిన్-సి లను కాంబినేషన్ గా  ఉపయోగించవచ్చు, ఎందుకంటే రెండూ చర్మంపై ఉన్న మచ్చలు డల్ గా ఉన్న చర్మం పై పనిచేస్తాయి. విటమిన్ సి చర్మానికి బయటటి నుండి నష్టం జరగకుండా కాపాడుతుంది. ఇక  కోజిక్ యాసిడ్ మెలనిన్‌ను తగ్గిస్తుంది. అయితే సున్నితమైన చర్మం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే రెండింటినీ అధికంగా వాడటం వలన చికాకు కలగవచ్చు. నెమ్మదిగా మొదలుపెట్టాలి. అలాగే సన్‌స్క్రీన్ ఉపయోగించడం మరచిపోకూడదు. చర్మానికి నష్టం? స్టెరాయిడ్ క్రీముల లాగా  కోజిక్ యాసిడ్  చర్మాన్ని పల్చగా చేయదు. అయితే దీనిని రెగ్యులర్ గా  లేదా అధిక మోతాదులో వాడితే, చర్మం ఎర్రబడటం, దురద, పొడిబారడం లేదా పొట్టు రాలడం వంటి సమస్యలు రావచ్చు. సురక్షితంగా ఉండటానికి, ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసి, తక్కువ గాఢత ఉన్న ప్రోడక్ట్ తో మొదలుపెట్టడం మంచిది.   మోతాదు.. నార్మగా ఉపయోగించడం కోసం 1% నుండి 2% కోజిక్ యాసిడ్  సురక్షితమైనదిగా , ప్రభావవంతమైనదిగా పరిగణించబడుతుంది. 4% కంటే ఎక్కువ ఉంటే అవి చర్మాన్ని చికాకు కలిగించి ప్రమాదాన్ని పెంచవచ్చు. దీనిని నియాసినామైడ్ లేదా సెరామైడ్‌ల కాంబినేషన్ గా వాడితే చర్మానికి మంచిది.                        *రూపశ్రీ.