మహిళల కోసం గొప్ప సంపాదనా మార్గాలు!

మహిళల కోసం గొప్ప సంపాదనా మార్గాలు! సొంత సంపాదన ప్రతి మహిళ ఆశ. సొంతంగా డబ్బు సంపాదించుకోవడం, ఆర్థికంగా మెరుగు పడటం. తన అవసరాలకు తను హాయిగా సంతోషంగా, స్వేచ్ఛగా ఖర్చుపెట్టుకోగలగడం ప్రతి మహిళకూ ఎంతో అవసరం కూడా. ప్రతి రూపాయికి ఇంట్లో మగవాళ్ల ముందు, పెద్దవాళ్ళ ముందు చెయ్యి చాపడం మహిళలకు ఇబ్బందిగానే ఉంటుంది. ముఖ్యంగా సగటు మధ్యతరగతి మహిళలు ఇంటి ఖర్చులను, అన్ని రకాల ఆర్థిక అవసరాలను చక్కబెడుతూ ఉండటం వల్ల వారి దగ్గర మిగిలేది ఏమి ఉండదు. ఇంకా చెప్పాలంటే వారు చేసే చిన్న చిన్న పనుల ద్వారా సంపాదించే డబ్బును కూడా ఇంటి అవసరాలకు ఉపయోగిస్తారు.  మహిళలు ఇంటి పట్టున ఉంటూ సంపాదించడానికి ఆసక్తి చూపుతారు. అలాంటి వారికి కొన్ని సంపాదనా మార్గాలు ఇవిగో…… యోగా ట్రైనర్!! దీనికి అనుభవం ఉంటే ఖచ్చితంగా గొప్ప సంపాదనా మార్గం అవుతుంది. కాస్త టెక్నాలజీ తోడైతే ఆన్లైన్ లో యోగా పాఠాలు చెప్పేయొచ్చు. నేటి కాలంలో మనుషులు ఎక్కువ మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. వీటికి యోగ, మెడిటేషన్ అనేది గొప్ప సొల్యూషన్. చాలామంది శారీరకంగా జిమ్ లో కష్టపడటం కంటే మానసికంగా ఫిట్ గా ఉండటానికి యోగ, ధ్యానం గొప్ప పరిష్కార మార్గాలని తెలుసుకున్నారు. యోగాకు ప్రాధాన్యత పెరిగిన నేటి కాలంలో యోగ శిక్షకులుగా ఇంట్లోనే ఉంటూ సంపాదించవచ్చు మహిళలు. కెరీర్ కౌన్సిలర్స్!! జీవితం మీద మంచి అవగాహన ఉన్నవారు కెరీర్ కౌన్సిలర్ లుగా మారవచ్చు. ముఖ్యంగా కొన్ని రకాల కోర్స్ లు కూడా అందుబాటులో ఉంటాయి ఇవి. వాటిని పూర్తి చేస్తే కౌన్సిలర్ లు గా కొత్త ఉద్యోగం మొదలుపెట్టేయచ్చు. విద్యార్థులు, నిరుద్యోగులు సరైన అవగాహన లేక సందిగ్ధంలో ఉన్నవారు ఎంతో మంది ఉంటారు. పెద్ద పెద్ద కౌన్సిలర్ల దగ్గరకు వెళ్లలేక ఆలోచనల్లో పడిపోయి ఉంటారు. ఇలాంటి వాళ్లకు మంచి సలహాలు సూచనలు అందిస్తుంటే జీవితంలో తృప్తి కూడా దొరుకుతుంది. టీచింగ్!! ఆన్లైన్ లో క్లాసులు తీసుకోవడం ఇప్పటి కాలంలో రొటీన్. ఎక్కడో దూరంగా ఉండి సరైన ఉపాధ్యాయులు దొరకని వారు ట్యూషన్ కోసం ఆన్లైన్ టీచింగ్ ను అప్రోచ్ అవుతారు. కేవలం విద్యార్థులకు మాత్రమే టీచ్ చేయడం టీచింగ్ కాదు. వంట, డాన్సింగ్, మ్యూజిక్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్ ఇలా చాలా రకాల విషయాలు ఆన్లైన్ లో టీచ్ చేయవచ్చు. బేకరీ ఫుడ్స్!! కేక్ లు, స్నాక్స్ వంటివి చక్కగా చేయడం వచ్చి ఉంటే వాటిలో మీ సృజనాత్మకతను మేళవించి బేకరీ ఐటమ్స్ ను తయారు చేసి అమ్మవచ్చు. ప్రస్తుత కాలంలో ఈ బేకరీ ఫుడ్స్ కు మంచి డిమాండ్ ఉంది. కాబట్టి వీటిని ఫాలో అవచ్చు. కంటెంట్ రైటర్!! ఇంట్లోనే ఉంటూ చేయదగిన మంచి పని ఇది. కథలు, వ్యాసాలు చక్కగా రాయగలిగితే మంచి భవిష్యత్తు ఉంటుంది. మహిళల గురించి, పిల్లల గురించి, సమాజం గురించి, విద్య, ఉద్యోగం, కెరీర్ టిప్స్, గైడెన్స్, ఫ్యామిలీ కౌన్సెలింగ్, డెవోషనల్ ఇలా చాలా రకాల విషయాలు ఉంటాయి. ఆసక్తిని బట్టి మంచి మంచి టాపిక్స్ ఇవ్వచ్చు. డే కేర్ సర్వీస్!! చాలా మంది తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్ళిపోతే చిన్న పిల్లలను చూసుకునేవారు వుండరు. ఇలాంటి వారి కోసం డే కేర్ సర్వీస్ లు ఉంటాయి. పిల్లలతో గడపడం, పిల్లలను చూసుకోవడం ఇష్టముంటే డే కేర్ సర్వీస్ ను స్టార్ట్ చేయవచ్చు. ఇది మంచి వ్యాపారమవుతుంది కూడా. అయితే చట్టపరంగా కొన్ని అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది వాటిని పూర్తి చేస్తే సరిపోతుంది. ఇలా మహిళలకు మంచి సంపాదనా మార్గాలు ఉన్నాయి. ఇవన్నీ ఎంతో విభిన్నమైనవి కూడా.                                      ◆నిశ్శబ్ద.

మహిళలు లావుగా ఉంటే ఫిట్నెస్ గా లేనట్టా?

మహిళలు లావుగా ఉంటే ఫిట్నెస్ గా లేనట్టా? అమ్మాయిలు అందంగా, నాజూగ్గా ఉండాలనేది చాలామంది అభిప్రాయం. అయితే కొందరు మహిళలు ఎక్కువగా తినకపోయినా అధికంగా బరువు పెరుగుతారు. అందరిలోనూ ఇలాంటి సమస్య ఉండదు. అందుకే లావుగా కనబడితే చాలు అదేదో జబ్బులున్నట్టు, ఒళ్ళంతా కొలెస్ట్రాల్ పేరుకుపోయినట్టు అందరూ ఫీలైపోతారు. కొందరైతే ఓ అడుగు ముందుకేసి తిండి కట్టుకోమని, వ్యాయామం చేయమని, బరువు తగ్గడానికి ఇదిగో చిట్కాలు అని బోలెడు సలహలు కూడా ఇస్తారు. అయితే లావుగా ఉండటం అంటే అనారోగ్యంతో ఉండటమా?? లావు, సన్నం అనేవి కేవలం ఆహారం మీద చాలా తక్కువ మంది విషయంలో ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మహిళలు ఎక్కువగా ఆహారం తీసుకున్నా మగవారి కంటే శారీరక శ్రమ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి తినే ఆహారంలో కేలరీలు కరగడం పెద్ద కష్టం కాదు.  మరి మహిళలు బరువు పెరుగుతున్న కారణాలు ఏంటి??  మహిళలు బరువు పెరుగుతున్న కారణాలే వారి ఆరోగ్య పరిస్థితిని నిర్ణయిస్తాయి. బరువు అనేది ఒక్కొక్కరిలో ఒకో కారణం వల్ల పెరుగుతుంది. జన్యు కారణాలు!! తల్లిదండ్రుల నుండి సంక్రమించే జన్యువుల వల్ల లావుగా ఉండేవారు చాలామంది ఉంటారు. వీరు సహజంగానే చిన్నతనం నుండి లావుగా, బొద్దుగా ఉంటారు. తమ శరీర పరిస్థితిని చూసుకుని తిండి కట్టేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. జన్యు సమస్యల వల్ల లావుగా ఉండేవారు ఆందోళన పడకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే ఎలాంటి భయాలు పెట్టుకొనవసరం లేదు. రోజువారీ వ్యాయామం, శరీరానికి తగిన శారీరక శ్రమ ఉండేలా చూసుకుంటే చాలు. హార్మోన్ సమస్యలు!! మహిళల్లో హార్మోన్ సమస్యల వల్ల బరువు పెరిగిన వారే అధికం. వీరికి చిన్నతనం నుండి బరువు అనేది సమస్యగా ఉండదు. మహిళలకు ఋతుక్రమం మొదలయ్యే దశ నుండి ఈ సమస్య మొదలవుతుంది. ముఖ్యంగా పెళ్లి, ప్రసవం తరువాత శారీరకంగా చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. నెలసరి సమస్యలు, మెనోపాజ్ దశలు దానికి తగ్గట్టు ప్రస్తుతం ఇంటా, బయటా కూడా పనులు చేసుకుంటూ, వాటిని సక్రమంగా నిర్వర్తించాలనే ఒత్తిడి వల్ల కూడా బరువు  పెరుగుతారు.  ఆహారం!! ఆహారం వల్ల బరువు పెరిగేవారిలో చాలావరకు దిగువ, మధ్యతరగతి గృహిణులు ఉంటారు. ఎందుకంటే ఇంట్లో ఉంటూ కుటుంబాన్ని చక్కబెట్టే ఆడవారు ఆహారం వృధా అయితే భరించలేరు. నేటి తరం పిల్లలు చాలావరకు సాయంత్రం అవ్వగానే ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడుతున్నారు. ఫ్రెండ్స్ తో బయట తిన్నానని కొడుకు, ఆఫీసు వాళ్ళు, వృత్తి రీత్యా బయట తినాల్సి వచ్చిందని భర్త చెప్పే కారణాలకు సగటు గృహిణి ఏమి అనలేదు. అలాగని వండిన ఆహారాన్ని చూస్తూ చూస్తూ చెత్తబుట్టలో వేయలేదు. అందుకే చాలావరకు ఆహారాన్ని అలాగే ఉంచి మరుసటిరోజు తింటూ ఉంటారు. ఇంకా వృధా అయిపోతోందనే కారణం వల్ల ఆకలి లేకపోయినా తింటుంటారు. ఇవన్నీ బరువు పెరగడానికి కారణాలు అవుతాయి. అది మాత్రమే కాకుండా సగటు మధ్యతరగతి మహిళలు హార్మోన్లు ఇంకా ఇతర అనారోగ్య సమస్యల గురించి పెద్దగా పట్టించుకోరు. వాటి పరీక్షలు, ఖర్చులకయ్యే డబ్బు పిల్లల కోసం, ఇంటి అవసరాల కోసం ఉంటాయనే ఆలోచనతో ఉంటారు.  పై కారణాలు అన్నీ గమనిస్తే మహిళలు లావుగా ఉండటం అనేది ఫిట్నెస్ లేకపోవడం కాదు. మహిళలు లావు కావడానికి గల కారణాల మీద మహిళల ఆరోగ్యం, వారి ఫిట్నెస్ ఆధారపడి ఉంటుంది.                                        ◆ నిశ్శబ్ద.

జీవితంలో స్త్రీలు ఎందుకు ముఖ్యం?

జీవితంలో స్త్రీలు ఎందుకు ముఖ్యం? ప్రతి వ్యక్తి జీవితంలో స్త్రీ ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనిషి సామాజికంగా ఎదగడానికి, ఆర్థిక అవసరాలకు మగవాడి అండ ఉండాలేమో కానీ వ్యక్తిత్వానికి బీజం వేయడానికి ఇంకా చెప్పాలంటే మనిషి జననం, బాల్యం, ఆ బాల్యంలో బుడిబుడి అడుగుల బీజం. వీటికి ఖచ్చితంగా ఆడవాళ్లే ఎక్కువ బాధ్యత వహిస్తారు. గర్భవతి అయిన స్త్రీ సుఖంగా, సంతోషంగా ఉండాలి. మంచి మాటలు వినాలి. మంచి ఆలోచనలు చేయాలి. భర్త, ఇతరబంధువులు ఆమెకు కష్టం కలగకుండా చూడాలి. ఆమె కోరికలు తీర్చాలి. ఆమె ఎటువంటి ఒత్తిడికి గురి కాకూడదు. ఎటువంటి ఆందోళనలు చెందకూడదు. ఇందుకోసం రకరకాల పద్ధతులను ఏర్పరచారు. శిశువు జననం తరువాత ప్రథమగురువు 'తల్లి' అని నిర్దేశించారు. తల్లి పాడే లాలిపాటలు, జోలపాటలు, బుజ్జగింపులు, ప్రేమచర్యలు సర్వం పిల్లవాడి వ్యక్తిత్వ వికాసంలో ప్రథమపాఠాలు. ఆపై తండ్రి ప్రేమ, బంధువుల అనురాగం, పెద్దల మార్గనిర్దేశనం పిల్లవాడిని వేలు పట్టుకుని ఉత్తమవ్యక్తిత్వం వైపు నడిపించే అంశాలు. బాల్యంలో ఇంట్లో, నేర్చుకున్న అంశాల నిగ్గు తేల్చుకుని, స్వీయవ్యక్తిత్వాభివృద్ధికి రాచబాట నిర్మించుకోవటం పాఠశాలకు వెళ్ళటంతో ప్రారంభమౌతుంది. అంత వరకూ తానే కేంద్రబిందువుగా ప్రపంచం నడుస్తుందనుకున్న పిల్లవాడు సమాజంలో అడుగుపెడతాడు. పాఠశాలలో తనలాంటి అనేకకేంద్రబిందువులను చూస్తాడు. వారికీ, తనకూ భేదాన్ని గుర్తిస్తాడు. ప్రతి వ్యక్తీ ఎవరికి వారు ప్రత్యేకమైనా, ఎలాగైతే ఏ నీటి బిందువుకు ఆ నీటి బిందువు ప్రత్యేకం అయినా, జలప్రవాహంలో మిళితమై ప్రవహిస్తుందో, అలా తానూ సామాజిక స్రవంతిలో ఒక భాగం అని గ్రహిస్తాడు. అతడికి ఈ గ్రహింపునిచ్చేది. అధ్యాపకులు, తోటి విద్యార్థులు, సామాజిక వాతావరణం, పాఠ్యాంశాల వంటివి. అంతవరకూ తాను నేర్చుకున్నవాటికీ, ఇప్పుడు నేర్చుకుంటున్న వాటికీ నడుమ తేడాలు గుర్తిస్తాడు. తాను నమ్ముతున్నవాటిని, ఎదురుగా కనబడుతున్నవాటితో పోలుస్తాడు. అతడి అంతరంగంలో సంఘర్షణ చెలరేగుతుంది. ఈ సంఘర్షణ ఫలితంగా అతడి వ్యక్తిత్వం రూపు దిద్దుకుంటుంది. ఇక్కడ మనసు ప్రాధాన్యం స్పష్టంగా తెలుస్తుంది. ఆ మనసుపై శిశువు జననం నుంచీ పడిన ప్రభావాలు ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటాయి. అందుకే మన పూర్వికులు శిశువు మనసుపై మంచి ముద్రలు వేసేందుకు అనేక విధాలైన నియమాలను, సూత్రాలను ఏర్పాటు చేశారు. ఇవన్నీ ప్రతిఒక్కరికి ఎంతో ముఖ్యమైన అంశాలు. ఎన్ని తరాలు మారినా అందరికీ వర్తించే విషయాలు. ఆడవారి పాత్ర సమాజంలోనూ, ఇంట్లోనూ ఎంతో ఉన్నా ఆడవారిని గౌరవించకపోవడం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. తగిన గుర్తింపు అనేది ఉండదు ఆడవారికి. తన కుటుంబం కోసం చేసిన పనికి గుర్తింపు ఏంటి అని చాలామంది అనుకుంటారు కానీ గుర్తింపు అంటే ఆ వ్యక్తిని గౌరవించినట్టు అనే విషయాన్ని మరవకూడదు. అందుకే ఆడవారికి గుర్తింపు ఇవ్వడమంటే వారి కష్టాన్ని గౌరవించినట్టు అని అర్థం.  గుర్తింపు, గౌరవం అనేవి తన కర్తవ్యాన్ని మరింత ఇష్టంగా, మరింత బాధ్యతతో చేయడానికి దోహదపడే గొప్ప బహుమానం. ఆడవారిని గౌరవించే ఇల్లు ఎలాంటి కలహాలకు తావు లేకుండా ఉంటుందనేది ఒప్పుకోవలసిన విషయం కావాలంటే అలాంటి ఇళ్లను ఒకసారి గమనిస్తే ఆ విషయం స్పష్టమవుతుంది.  యత్ర నార్యస్తు పూజ్యంతే-రమంతే తత్ర దేవతాః||  అన్నారు. అంటే ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివాసముంటారు అని అర్థం. అంటే దేవతలున్నచోట ఐశ్వర్యం, సంతోషం, ఆనందం ఉంటాయని అర్థం.                                        ◆నిశ్శబ్ద.

గర్భవతుల దగ్గర ఈ తప్పులు చేయద్దు!

గర్భవతుల దగ్గర ఈ తప్పులు చేయద్దు! మహిళలకు మరొక జన్మ అమ్మ కావడం అంటారు. పెళ్ళైన వాళ్ళు గర్భం ధరించాక తొమ్మిది నెలలు బిడ్డను మోస్తారు. ఆ తొమ్మిది నెలలలో వారిలో శారీరక, మానసిక మార్పులు చోటుచేసుకుంటాయి. ఆ మార్పుల వల్ల స్వతహాగా వారి ప్రవర్తనలో  కూడా కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. తినే విషయం నుండి వారి రోజువారీ పనులు, అలవాట్లు వంటివి చాలా మార్చుకోవాల్సి ఉంటుంది. గర్భవతులు ఉన్న ప్రతి ఇంట్లో పెద్దవాళ్ళు తోడుగా ఉండటం పరిపాటి. ఉద్యోగాల పేరుతో దూరంగా ఉన్నా నిరంతరం ఫోన్స్ రూపంలో అందుబాటులోనే ఉంటారు వాళ్ళు. ఇంట్లోకి ఒక కొత్త ప్రాణం రాబోతోందనే వారి తాపత్రయాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే గర్భవతులు విషయంలో చేయకూడని పనులు కొన్ని ఉంటాయి. వాటిని తప్పక తెలుసుకోవాలి. ఆంక్షలు పెట్టకూడదు!! అది చేయకు, ఇది చేయకు. అలా ఉండకు, ఇలా ఉండకు లాంటివి పదే పదే చెప్పకూడదు. ఒక్కసారిగా లైఫ్ స్టైల్ చేంజ్ అయితే వారిలో గందరగోళం నెలకొంటుంది. పదే పదే చెప్పడం వల్ల చెప్పే విషయాలు మంచికి చెబుతున్నాం అనే భావన కంటే ఆంక్షలు పెడుతున్నాం అనే ఫీలింగ్ ఏ ఎక్కువ కలిగిస్తుంది. కేవలం గర్భవతుల విషయంలోనే కాదు పిల్లల విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. అయితే గర్భవతులను ముందే ప్రత్యేకంగా చూస్తుంటారు దానికి తగ్గట్టు ఇలా చేయడం వల్ల వారిలో అసహనం స్థాయిలు పెరిగిపోతాయి. తిండి దగ్గర మరీ బంధనాలు వేయొద్దు!! ఆహారమే అమృతం. గర్భవతుల విషయంలో ఈ ఆహారం పాత్ర మరింత ముఖ్యమైనది. ఏమి తినాలి ఏమి తినకూడదు అనేవి చాలా గట్టిగా చెబుతుంటారు. అయితే సహజమైన, తాజా ఆహార పదార్థాలు ఏవైనా మితంగా తీసుకుంటే ఏ నష్టమూ జరగదు. అలాగని అన్నీ తినెయ్యమని చెప్పడం లేదు. కానీ వైద్యుల సలహాతో చక్కగా తినొచ్చు. నిజానికి శరీరంలో చోటు చేసుకునే మార్పుల వల్ల కొన్ని పదార్థాలు తినాలని అనిపించవు, కొన్ని తినాలని అనిపిస్తాయి. పోషకాలున్నాయని తిను తిను అని పదే పదే బలవంతం చేయకూడదు. ప్రేమ కొద్దీ చెప్పినా అది ఒకోసారి అతి అనిపిస్తుంది. బిడ్డ గురించి మాట్లాడకూడదు!! కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి మాట్లాడుతుంటే అమ్మాయిలు మురిసిపోతారని అనుకుంటారు చాలామంది. అత్తలు, మామలు, పెద్దవాళ్ళు కడుపులో బిడ్డ గురించి మాట్లాడుతూ పుట్టిన తరువాత బిడ్డ కోసం అలా చేస్తాం, ఇలా చేస్తాం, మా మనవడు అలా ఉండాలి ఇలా ఉండాలి, అలా చదివిస్తాం, మీకంటే గొప్పగా చేస్తాం. వంటి విషయాలు పొరపాటున కూడా గర్భవతుల ముందు మాట్లాడకూడదు. బిడ్డ ఎప్పుడూ తన బిడ్డగానే ఉండాలని అనుకుంటుంది ప్రతి అమ్మాయి. ఇతరుల జోక్యం ఎక్కువగా ఉంటుందనే మాటలు ఆమె మనసును కుదురుగా ఉండనియ్యవు. కేరింగ్ ఎవరిమీద?? భర్త, అత్తమామ, తల్లిదండ్రులు, ఇతరులు  ఇలా అందరూ కడుపులో బిడ్డ గురించి జాగ్రత్తలు చెబుతూనే ఉంటారు. అయితే ఒక విషయం తెలుసుకోవాలి. బిడ్డ మాత్రమే జాగ్రత్తగా ఉండాలి అనే ధోరణి మాటల్లో కనిపించకూడదు. అలా కనిపిస్తే వీళ్లకు నా కడుపులో బిడ్డ కావాలి తప్ప నేను కాదు. బిడ్డ పుట్టగానే ఈ ప్రేమలు, జాగ్రత్తలు, ఆప్యాయతలు అన్నీ మాయమైపోతాయేమో అనే ఫీలింగ్ అమ్మాయిలలో వచ్చేస్తుంది. అందుకే కేరింగ్ ఏదైనా అమ్మాయిల విషయంలో చూపించాలి. వారి కోణం నుండే మాట్లాడాలి. కాబట్టి గర్భవతుల దగ్గర మాట్లాడటంలో కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఏమైనా వారి మనసు నొచ్చుకుంటే గందరగోళంలో పడి తన కడుపులో బిడ్డ మీద నిర్లక్ష్యం ఏర్పడే ప్రమాధముంటుంది.                                        ◆ నిశ్శబ్ద.

వివాహం తరువాత అమ్మాయిల కోసం ఏడు సూత్రాలు!

వివాహం తరువాత అమ్మాయిల కోసం ఏడు సూత్రాలు! భారతీయ వ్యవస్థలో పెళ్లి అనేది చాలా అపురూపమైన వేడుక. విభిన్న దృవాల్లాంటి మనుషులు ఒకేచోట కలిసి జీవించడానికి బీజం వేసేది ఇదే. ఒకప్పుడు నెలరోజుల ముందే పెళ్లి ఇళ్ళు కళకళలాడేవి, ఆ తరువాత అది తగ్గింది వారం రోజుల పెళ్లికి వచ్చింది. ఆ తరువాత అదీ తగ్గి మూడురోజుల పెళ్లిగా స్థిరపడింది. ఉద్యోగాల పేరుతో పెళ్లి జంట దూరందూరంగా ఉండటం, చేసే ఉద్యోగాలు ప్రయివేటు సంస్థలవి కావడం వల్ల సమయం చాలా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.  అయితే నేటికాలం కాబోయే భార్యాభర్తలు పెళ్లి ఫిక్స్ అయింది మొదలు దొరికే ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుంటూ షాపింగ్ ల కోసం, ఫంక్షన్ హాల్స్ కోసం, ఫోటో షూట్స్ కోసం, చాలా హంగామానే చేస్తున్నారు. వీళ్ళ వాలకం చూసి ఇక వీళ్ళ దాంపత్యం వందేళ్లు అనుకునేవాళ్ళు కూడా ఉంటారు. అయితే ఆ పెళ్లి, బంధువులు, హంగామా అంతా అయిపోయిన తరువాత కొత్త జంట కలసి జీవించడంతోనే నిజమైన కొత్త ప్రయాణం  మొదలవుతుంది. ఇంకా చెప్పాలంటే కొత్త ఇంట్లో కొత్త వ్యక్తుల మధ్య ఉండాల్సింది ఆడపిల్లలే.  ఏడు అడుగులతో ఒక వ్యక్తికి భార్యగా మారి, ఆ జీవితాన్ని కూడా సంతోషంగా గడపడానికి అమ్మాయిలకు ఏడు సూత్రాలు ఇక్కడున్నాయి. అంగీకారం!! పెళ్లి అయిపోయిన తరువాత ప్రతిదీ ఆక్సిప్ట్ చేయడం తెలుసుకోవాలి. ఎందుకంటే తన విషయాలను తను ఎలాగైనా డీల్ చేసుకోవచ్చు కానీ ఒక కొత్త సర్కిల్ లోకి వచ్చి జీవితాంతం అక్కడే ఉండాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా అన్నిటినీ ఆక్సిప్ట్ చేయాలి. ఇతరులు, పరిస్థితులు, ఇతర వ్యవహారాలు నచ్చలేదని వాటిని ఆపేయడం అంటూ జరగదు. ఎందుకంటే ఇతరులు వారి పనులను తమకోసం ఆపుకోరు అనే నిజాన్ని గ్రహించాలి. గౌరవించాలి!! చిన్నప్పటి నుండి ఎదుటివారిని గౌరవించాలి అనే మాటను వింటూనే ఉన్నాం దాన్ని పాటిస్తూనే ఉన్నాం. అయితే ఆ పరిస్థితులు వేరు ఈ పరిస్థితులు వేరు. అందరినీ గౌరవిస్తూ ఉంటే వారు కూడా తిరిగి గౌరవాన్ని ఇస్తారు అనే విషయాన్ని మరచిపోకూడదు. అంటే ఇక్కడ ప్రవర్తన ఎలా ఉంటుందో దానికి తగిన గౌరవం లభిస్తుంది. కొత్త మనుషుల మధ్య కొన్ని విషయాలు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చని విషయాలను అవమానంగా మాట్లాడకుండా గౌరవంగా వివరించి చెప్పుకోవాలి. అదే అనుకువ అనే పేరుతో కూడా పిలవబడుతుంది. అభిమానం!! కొత్త ఇంట్లో కొత్త మనుషుల మధ్య ఉన్నపుడు వారికోసం చేసుకునే సర్దుబాట్లు, వారికిచ్చే గౌరవం మొదలైనవి వారి నుండి ప్రేమను తీసుకువస్తాయి. ఆ ప్రేమను మనసు తెరచి స్వీకరించడం నేర్చుకోవాలి. నేను ఇక్కడ అతడికి భార్యను మిగిలినవారితో నాకేంటట అని అనుకుని నిర్లక్ష్య ధోరణి కలిగి ఉంటే అభిమానం కనుమరుగవుతుంది. సౌకర్యవంతంగా ఉండటం!! కొత్తచోటు కాబట్టి వాతావరణం దగ్గర నుండి భోజనం, నిద్ర వంటి విషయాల్లో కూడా ఎన్నో తేడాలు ఉంటాయి. అయితే వాటివల్ల ఇబ్బంది పడిపోవద్దు. అవన్నీ అలవాటు పడటానికి సమయం పడుతుందని అందరితో మనసువిప్పి చెప్పాలి. ఆ తరువాత మెల్లిగా మీకు సరిపడే వాతావరణం సృష్టించుకోవాలి. అయితే అది మిగిలిన వారికి ఇబ్బంది కలిగించకూడదని గుర్తుపెట్టుకోండి. పుట్టింటి వైపు చూడద్దు!! చాలామంది కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు చిన్న సమస్య వచ్చినా పేరెంట్స్ కు కాల్ చేసి భోరున ఏడుస్తూ సమస్య చెబుతారు, లేదంటే పుట్టింటికి వెళతారు. అది జరిగితే అత్తింట్లో మీ స్థానం విలువ తగ్గే అవకాశాలు ఉంటాయి. సమస్య ఏదైనా సరే దాన్ని ఎలా పరిష్కరించవచ్చో ఆలోచించాలి. దాన్ని అత్తింటి వారితోనే చర్చించాలి.  తొందర వద్దు!! వివాహబందంలో ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, కొత్త ప్రాంతాలకు అలవాటు పడటానికి సమయం పడుతుంది. కాబట్టి దాన్ని అర్థం చేసుకుని మెల్లిగా వాటిని ఓన్ చేసుకోవాలి. అంతేకానీ నాలుగు రోజులు ఉండి నాకు ఇక్కడ బాలేదు, నచ్చలేదు అనడం. ఇక్కడి వాళ్ళు వేరుగా ఉన్నారు, వీళ్ళ ప్రవర్తన బాలేదు అనడం సమంజసం కాదు. ఆర్థిక దారి వదిలేయొద్దు!! చాలామంది పెళ్లి అవ్వగానే ఉద్యోగాలు వదిలేస్తారు, కొందరు అత్తింటి వారి డిమాండ్స్ కోసం ఉద్యోగాలు వదిలేస్తారు. మరికొందరు పెళ్లయ్యాక సంపాదన గోల ఎందుకు భర్త ఉన్నాడు, ఆయన సంపాదనా ఎక్కువుందిలే అనుకుని వదిలేస్తారు. కానీ ఆడవాళ్లు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కోల్పోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. చిన్న చిన్న వాటికి కూడా భర్త దగ్గర చెయ్యి చాపడం మొదట్లో బాగున్నా తరువాత చాలా ఇబ్బంది కలిగిస్తుంది. కనీసం ఇంట్లో ఉంటూనే సంపాదించడం అయినా ముఖ్యం. ఈ కాలంలో ఆడవాళ్లు యూట్యూబ్ నుండి, ఆన్లైన్ బిజినెస్ ల ద్వారా, ఇంట్లో ఉంటూనే పని చేయడానికి ఒప్పుకునే సంస్థల సహకారంతో బానే సంపాదిస్తున్నారు. కాబట్టి సంపాదన వదిలిపెట్టద్దు. ఇలా అమ్మాయిలు ఇవన్నీ పాటిస్తే వివాహం తరువాత వారి జీవితం సంతోషంగా ఉంటుంది.                                      ◆నిశ్శబ్ద.

స్త్రీలను చెడుగా చూపించదానికి  కారణాలివే!

స్త్రీలను చెడుగా చూపించదానికి  కారణాలివే! మన జీవితంలో పరిచయాలు, స్నేహాలు అనేవి సాధారణమైనవి. అయితే ఇప్పటి జనరేషన్ లో స్త్రీ, పురుష స్నేహం అనేది వ్యతిరేకించాల్సిన అంశం కూడా కాదు. స్త్రీ, పురుషుల స్నేహం కూడా ఎంతో సాధారణం అయిపోయింది. కుటుంబాలకు కూడా తెలిసి ఇలా స్నేహంలో ఉన్నవారున్నారు.  అయితే స్నేహం కావచ్చు, పరిచయం కావచ్చు, వేరే ఇతర బంధం కావచ్చు. దానిలో ఒక మగవాడిది తప్పైతే, ఆ విషయం బయటకు తెలిస్తే చాలామటుకు కేవలం ఆ వ్యక్తిని మాత్రమే నిందించడం, అతడిని చెడ్డవాడిగా చూసి వదిలేయడం చేస్తారు. కానీ అదే స్థానంలో ఒక ఆడపిల్ల ఉంటే ఆమెను ఎన్ని రకాలుగా అనాలో అన్నిరకాలుగా నిందిస్తారు, నడవడిక, ప్రవర్తన, తల్లిదండ్రుల పెంపకం నుండి పూర్తిగా స్త్రీలవైపు మళ్లడం, పూర్తిగా స్త్రీ జాతిని నిందించడం చాలామంది అలవాటు. ఇలా ఒక తప్పు జరిగినపుడు కేవలం ఆ వ్యక్తులను మాత్రమే కాకుండా పూర్తిగా ఆ జాతి మొత్తాన్ని నిందించడం న్యాయమేనా??  స్త్రీజాతి ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలలో ఇదీ ఒకటి. సాధారణంగా ఏ సోషల్ మీడియా లోనో ఎవరో ఆడవాళ్లు అసభ్య దుస్తులు వేసుకోవడం, లేదా ఏదైనా తప్పు చేసి దొరికిపోవడం గురించి చూస్తే అందరూ కేవలం ఆమెను కాకుండా మొత్తం స్త్రీజాతిని నిందించడం బాగా గమనించవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుంది??  ఆడవాళ్లు ఒకరిమీద మరొకరు అసూయతో ఉండటమే మొదటి కారణం!! ఆశ్చర్యపోవాల్సిందేమి లేదు. ఎక్కడైనా ఒక ఆడదాని విజయం గురించి చర్చ జరిగితే మరొక ఆడది దాన్ని మనస్ఫూర్తిగా అభినందించే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ముఖ్యంగా ప్రతి ఇంట్లో తండ్రి తరువాత బాధ్యత అంతా కొడుకుదే అనేవాళ్ళు ఆ బాధ్యతను కూతురుకి ఇవ్వడానికి అయినా ఆలోచన చేస్తారా అంటే చేయరు. కారణం కొడుకు ఉండగా కూతురుకి హక్కు ఏమిటని వాదిస్తారు. అలాగే పెళ్లయ్యాక అత్తింట్లో అత్త స్థానాన్ని కోడలు భర్తీ చేయాలని అనుకుంటారు, కానీ అత్తలు మాత్రం కొడళ్లను మనస్ఫూర్తిగా అభినందించే సందర్బాలు, ఇంటి బాధ్యతను పూర్తిగా కోడళ్ల చేతిలో పెట్టే పరిస్థితులు అరుదు. కారణం కొడుకు తన చెయ్యి దాటిపోతారని, తనకు విలువ తగ్గుతుందని. ఆఫీసుల్లోనూ, పనుల్లోనూ, ఇంటా బయట ఎక్కడ చూసినా ఎదుటి ఆడదాన్ని చూసి సంతోషపడేవాళ్ళు తక్కువ. అమ్మాయిల మధ్య స్నేహం నిలబడదు అనేది నిజమా పుకారా? సాధారణంగా చాలామంది  రెండు కొప్పులు ఒకచోట ఇమడవు అంటారు. అంటే ఇద్దరు ఆడవాళ్లు ఆరోగ్యకరంగా కలిసుండటం జరగదని. నిజానికి దీన్ని ఒక పుకారుగా ప్రచారం చేసినవాళ్లే దాన్ని చాలామంది మెదళ్ళలో ఇరికించారు. అబ్బాయిలకు మల్లే అమ్మాయిలు కూడా మంచి స్నేహితులుగా ఉంటారు. అయితే సున్నితత్వం వల్ల చిన్న విషయాలకు కూడా తొందరగా డిస్టర్బ్ అయిపోయి స్నేహాన్ని వదులుకోవడానికి సిద్ధమవుతారు. ఇవి మాత్రమే కాకుండా జీవితంలో కొన్ని పరిస్థితులలో ఆడవారి వల్లనే నష్టాన్ని చవిచూడటం వల్ల ఆడవారు వేరే ఆడవారితో స్నేహానికి విముఖంగా ఉంటారు. భావోద్వేగాలే మూలకారణం!! స్త్రీలలో భావోద్వేగాలు ఎక్కువ. వాటిని వ్యక్తం చేయడం కూడా ఎక్కువ. ముఖ్యంగా మగవారికిలా బయట ప్రపంచంతో అనుబంధం అంతగా ఉండదు. దానివల్ల తాము ఎవరినైనా స్నేహితులుగా భావిస్తే వారితో అన్ని చెప్పేసుకుంటారు. అయితే అవతలి వాళ్ళు వాటిని తమ వరకు ఉంచుకోకుండా ప్రచారపరంపరలో పడిపోతారు. సరిగ్గా ఈ అంశం వల్లనే స్త్రీలకు ఒకరంటే మరొకరు ఎడముఖం పెడముఖంగా ఉంటారు.  స్త్రీలు ఒకరికొకరు తోడుగా నిలబడితేనే సాధికారత ఏదైనా సాధ్యమవుతుంది. దీనికోసం ఇలాంటి అపార్థాల తెరలు తొలగించేసుకోవాలి. ఇంటిలో పరువంతా ఆడవాళ్లదేనని, ఒకరు తప్పు చేస్తే దాన్ని స్త్రీజాతి మొత్తం ఆపాదించి మాట్లాడే వైఖరిని, స్త్రీల పట్ల సమాజంలో తొందరగా దొర్లిపోయే మాటలను అరికట్టాలంటే పరిష్కారాలు ఎక్కడో లేవు. వాటిని  స్త్రీలు మాత్రమే చేయగలరు. ఈ ప్రపంచం స్త్రీలకు స్త్రీలను శత్రువులుగా చూపిస్తున్నంత కాలం స్త్రీలు సాధికారత సాధించలేరు. కాబట్టి స్త్రీలు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి.                                    ◆నిశ్శబ్ద.

మరకలు పోగొట్టేద్దాం... మెరిపించేద్దాం...!

మరకలు పోగొట్టేద్దాం... మెరిపించేద్దాం...! మనం నచ్చిన బట్టల పైన కానీ, ఏదైనా వస్తువుల పైన కానీ మరకలు పడిన లేదా జిడ్డుగా మారి దుర్వాసన వచ్చేలా అయితే మనకు చాలా బాధగా ఉంటుంది కదా! మరి అలాంటపుడు ఆ మరకల నుండి, దుర్వాసనల నుండి మన వస్తువులను ఎలా కాపాడుకోవాలో ఒకసారి చూద్దామా...!   చెమట మరకలు :- చెమట మూలంగా షర్టులు, బ్లౌజులు మరకలతో దారుణంగా తయారవుతాయి. చూడడానికి కూడా ఎంతో అసహ్యంగా ఉంటాయి. అందువల్ల ముందుగా ఆ మరకల వద్ద లిక్విడ్ డిటర్జెంట్ సబ్బుతో రుద్ది, ఆ తర్వాతే సబ్బుతో ఉతికి చూడండి. మరీ మొండి చెమట మరకలైతే మాత్రం వెనిగర్ తో కేవలం ఆ ప్రాంతాన్నిమాత్రమే రుద్ది, ఆ తర్వాత మాములుగా సబ్బుతో కడిగేయవచ్చు. వెనిగర్ లేకుండా గోరువెచ్చని నీటిలో నాలుగు ఆస్పరిన్ బిళ్ళలు వేసి, ఆ నీటిలో దుస్తులు నానబెట్టి ఉతికేయండి. మరకలు మాయమైతాయి. తెల్లని దుస్తులైతే మాత్రం కాస్త హైడ్రోజెన్ పెరాక్సైడ్ ను మరకలపై కొద్దిగా రాసి అయిదు నిముషాల తర్వాత ఉతకండి.   లిప్ స్టిక్ బాల్ పెన్ మార్క్స్ :- ముందుగా మరకపడిన బట్టను ఓ పాత టవల్ పై ఉంచండి. మరకపైకి వచ్చేలా ఉంచి ఓ చిన్న పాత గుడ్డను ఆల్కాహాలులో ముంచి దాన్ని మరకపై తట్టినట్టుగా పదేపదే చేయండి. ఆ తర్వాత వాష్ చేయండి. మరకలు మరీ జిడ్డుగా అంటుకున్నట్లుగా అనిపిస్తే కిరోసిన్ తీసుకుని మరకపై పూసి అయిదు నిముషాల తర్వాత శెనగపిండితో గట్టిగా రుద్ది కడిగేయండి.   కార్పెట్ పై క్యాండిల్ చుక్కలు :- అందమైన, ఖరీదైన కార్పెట్ పై క్యాండిల్ చుక్కలు పడితే... అందుకే ఓ స్టీలు గిన్నెలో ఐసుముక్కలు వేసి దాన్ని ఈ క్యాండిల్ చుక్కలపై కాసేపు ఉంచండి. చల్లదనానికి ఈ క్యాండిల్ వ్యాక్స్ మరింతగా గట్టిగా మారుతుంది. అప్పుడు ఏదైనా స్పూన్ మొనతో దానిని చెక్కేసి బ్రష్ తో శుభ్రంగా తొలగిస్తే సరిపోతుంది.   డిన్నర్ ప్లేట్ లపై పసుపు రంగు :- ప్లాస్టిక్ ప్లేట్లపై పసుపు మరకలు తొలగించాలంటే ప్లేట్లను గోధుమ పిండితో గట్టిగా రుద్ది కడిగేయండి చాలు. నిత్యం వాడే బకెట్లు మగ్ లపై ఉండే జిడ్డు మరకలు పోవాలంటే ముందుగా వాటిని కిరోసిన్ లో తడిపిన గుడ్డతో గట్టిగ తుడిచి, ఆ తర్వాత సబ్బుతో కడగాలి.   ప్లాస్కు దుర్వాసన:- ప్లాస్కు లో దుర్వాసన పోవాలంటే నాలుగైదు కోడిగుడ్డు పెంకులను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వాటిని ప్లాస్కులో వెయ్యాలి. దానిపై వేడినీటిని పోసి మూతపెట్టాలి. మధ్యమధ్యలో బాగా కదిలిస్తూ ఓ గంటన్నర పాటు ఉంచండి. ఆ తర్వాత సబ్బుతో కడిగేయండి. ఇక పొడిగా ఉండేలా తుడుచుకున్న తర్వాత ఓ చెంచాడు పంచదార అందులో వేసి మూతపెట్టి దాచుకోండి. దుర్వాసన రాకుండా తాజాగా ఉంటుంది.  

స్త్రీల ఆరోగ్యానికి 9 రకాల మల్టీవిటమిన్...

స్త్రీల ఆరోగ్యానికి 9 రకాల మల్టీవిటమిన్... స్త్రీలలో సహజంగా విటమిన్ లోపం వస్తూ ఉంటుంది నెలసరి సమస్యలు లేదా ఇతర అనారోగ్య సమాస్యలు స్త్ర్రేలలో రక్తహీనత బలహీనంగా ఉండడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. బలహీనంగా ఉన్నప్పుడు మల్టి విటమిన్స్ వాడాలన్న అలోచాన లో ఉంటారు.అసలు మల్టీవిటమిన్స్ ఎక్కడ నుంచి వాడాలి అన్నది పెద్ద సందేహాం. అసలు స్త్రీల అనారోగ్యానికి 9 రకాల మల్టి విటమిన్స్ వాడవచ్చునని వాటి పికలోఅనుసరించాల్సిన పద్దతుల పై కొన్నిసూచనలు మీకోసం. సహజంగా స్త్రీలలో చాలామంది విటమిన్ మినరల్స్ లోపంతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా విటమిన్ డి కాల్షియం మీరు తీసుకునే ఆహారం కూడా మీకు సహాయపడుతుంది.మల్టి విటమిన్ ద్వారా పూర్తి పోషక విలువలు అందుతాయని ఆశిద్దాం. ఉదాహరణకు మల్టి విటమిన్ సప్లిమెంట్స్ వాడాలంటే ఎవరైతే గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలకు పాలిచ్చే తల్లులు, బాలింతలు,చూలింతల కు మల్టి విటమిన్ పిల్స్ డాక్టర్స్ సూచిస్తారు. గర్భిణిగా ఉన్నప్పుడు మానసికంగా బలంగా ఉండడం కోసం మార్పుల కోసం,విటమిన్ లోపం ఉంటుంది . అత్యవసర సమయంలో బలహీనులు కాకుండా, శరీరంలో పెరుగుదల కొన్ని సందర్భాలలో వ్యతిరేకం కావచ్చు తల్లికి బిడ్డకి సమస్య కావచ్చు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదనంగా జరిగిన పరిశోదనలో గర్భిణి స్త్రీలలో ఐరన్ శాతం తక్కువగా ఉంటుంది. డి హెచ్ ఎ ఫోలిక్ యాసిడ్ విటమిన్ డి తక్కువగా ఉంటుంది. విటమిన్ డి అవసరం. కొంత మంది గర్భిణీ స్త్రీలు లేదా ఇతర మహిళలు తీసుకున్న ఆహారం శరీరంలో ఇమడ కుండా వాంతులు అవుతూ ఉంటాయి. వారు తప్పనిసరిగా శాఖా హారులు లేదా వారికి ఫుడ్ ఎలర్జీ ఉండి ఉండవచ్చు. వారు సత్వరం కోలుకో డానికి మల్టి విటమిన్ ద్వారా కోల్పోయిన విటమిన్ పొందవచ్చు. వయస్సులో ఉన్నవారికి న్యుట్రీ యంట్స్ అవసరం. న్యూట్రి యన్ల మార్పు కూడా అవసరం .మల్టి విటమిన్ ద్వారాకోల్పోయిన న్యూట్రి యాంట్స్ పొందవచ్చు. న్యూట్రి యాంట్ గ్యాప్ ను నిప వచ్చు. కింద పేర్కొన్న విటమిన్లు ఒక క్రై టీరియా ప్రకారం నిర్దేసించ బడింది. వెట్టింగ్... అన్నిరకాల ఉత్పత్తులు వేట్టిగా ఉండాలి. హెల్త్ లైన్ స్టాండర్డ్స్ కు అనుగుణంగా ఉండాలి. నాణ్యత... ఉత్పత్తుల నాణ్యత ను తయారీ నుంచే క్షుణ్ణంగా నాణ్యతను పరిశీలించాలి. ఇంగ్రీడి యం ట్స్... ఉత్పత్తులలో నాణ్యత తో కూడుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా? లేక కృత్రిమ మైనవి వాడుతున్నారా లేదా తెలుసుకోవాలి. ప్రతి ఒక్క ప్రోడక్ట్ లో ఎన్నిరకాల న్యూట్రియాంట్స్ వాడుతున్నారు. అన్న విషయం నిశితంగా గమనిస్తాం.  ఆరోగ్యమే ప్రధానం... ఉత్పత్తులు రకరకాల అవసరాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా? అన్నది పరీక్షించాలి. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని అందరికీ మల్టి విటమిన్స్ అవసరమా కాదా ? కొందరికి వారు తీసుకునే ఆహారం ద్వారానే మల్టీ విటమిన్స్ అందుతాయి. మల్టి విటమిన్ తీసుకునే ముందు నిపుణులైన ఆరోగ్య కార్యకర్తలు వైద్యుల సలహా తీసుకోండి.  స్త్రీ ఆరోగ్యానికి ఉత్తమైన మల్టి విటమిన్స్ ఏవో చూద్దాం... 18..49 సంవత్సరాల మధ్య వయస్సులకు రితువల్ తప్పనిసరి.  బెస్ట్ మల్టి విటమిన్స్ లో గమ్మీ...ఒళ్లీ ది పర్ఫెక్ట్ మల్టి . బెస్ట్ విమెన్ మల్టి విటమిన్స్ ఫర్ అత్లేట్స్...అప్తిమం న్యూట్రియాన్...ఆప్టి విమెన్. బెస్ట్ గ్లుటిన్ -ఫ్రీ విమెన్ మల్టి విటమిన్...గార్డెన్ ఆఫ్ లైఫ్...విటమిన్ కోడ్ విమెన్. బెస్ట్ ప్రినేటల్మల్టి విటమిన్...ఫుల్ వెల్. బెస్ట్ విమెన్..మల్టి విటమిన్ ఫర్ విమెన్...యాభై సంవత్సరాలు పై బడిన వారికి...తోర్నే విమెన్ మల్టి 5౦. బెస్ట్ విమెన్ మల్టి విటమిన్ --సులభంగా అరిగేందుకు...న్యు చాప్టర్ వాన్ డైలీ ఎన్రీ విమెన్ మల్టి. బెస్ట్ వేజన్...ఉమెన్స్ మల్తివితమిన్...గలైన్ ఆఫ్. లైఫ్ మైక్రెండ్ ఆర్గానిక్స్ విమెన్ మల్టి. బెస్ట్ విమెన్ మల్టి విటమిన్ సబ్ స్క్రాప్ షన్స్...కేర్ ఆఫ్ ఉమెన్స్ కేర్ ప్యాక్ . స్త్రీలు మల్టి విటమిన్ ను ఎలా ఎంచుకోవాలి ?... నేడు చాలా రకాల మల్టి విటమిన్స్ అందుబాటులో ఉన్నాయి. ఏ మల్టి విటమిన్ తీసుకోవాలి,ఎ మల్టి విటమిన్స్ అందుబాటులో ఉనాయి.ఈవితమిన్ తీసుకోవాలి,ఎ ప్రొడక్ట్స్ ఎంచుకోవాలి? అర్ధం కాని సనస్య గా ఉంటుంది.  వయస్సు జీవితం లో ఎదశ... మల్టి విటమిన్స్ ప్రత్యేకంగా వివిధ వయస్సుల వారికి వారి వారి న్యూట్రి యాంట్స్ అవసరాలకు అనుగుణంగా వయస్సుకు తగ్గట్టుగా తయారు చేసారు. ఎవరైతే గర్భిణీలు పాలిచ్చే తల్లులు... గర్భస్థ సమయం లో ప్రసవం తరువాత అవసరాలకు అనుగుణంగా విటమిన్లు అందుబాటులో ఉన్నాయి.  ఆహార నియమాలు ఎలర్జీలు... ఆయా మల్టి విటమిన్ల ఉత్పత్తులలో ఉన్న ఇంగ్రీడి యాంట్స్ లేబుళ్ళను చదవండి.మీకు ఫుడ్ ఎలర్జీ ఆహార నియమాల ఆధారంగా నిర్ణయించుకోండి. న్యుట్రీ షియాంట్స్ శాతం ఎంత ఉందొ గమనించండి...సహజంగా మెగా డోసులు విటమిన్లను మినరల్స్ ను వైద్య రంగ నిపుణులు సూచించిన విధంగా వాడండి .  ఎన్ని పిల్ల్స్ ను కొనాలి... మీరు వాడే విటమిన్స్ ను గుర్తుంచుకోవ డం కష్టంగా ఉంటె రోజుకి ఒకటి అదనంగా తీసుకుంటున్నారో గమనించండి.మింగేందుకు ఇబ్బంది గా ఉంటె కాస్త నమల గ్లిగేవి గంమీగా ఉండేవి వాడండి.  బడ్జెట్... కొన్ని ఉత్పత్తులు రోజుకు మల్టిపుల్ పిల్ల్స్ వాదాలంటూ సూచిస్తే మీ బడ్జెట్ కు అనుగుణంగా ఉన్నాయో లేదో చూసుకోండి. నాణ్యత క్వాలిటీ... మీరు తీసుకునే సప్లిమెంట్స్ తరచుగా పరీక్షించాలా లేదా నాణ్యత సరైన క్వాలిటీ ఇంగ్రీడియంత్స్ ఉన్నాయా లేదా మూడో పార్టీ ద్వారా సంస్థలు ప్రీక్షించయా లేదా యు ఎస్ పి కంట్రోలర్ ల్యాబ్స్ వంటి అంశాల పై దృష్టి పెట్టాలి.  ధరలను పరిశీలించాలి... సాధారణంగా ధరల కింద డాలర్ గుర్తును ఉంచు తారు అంటే దాని ఆర్ధం మనం కొనుగోలు చేసే ధరలో ఉందా లేదా? డాలర్ల లో ఉందా అన్న విషయం గ్రహించాలి. గుర్తుంచుకోవాల్సిన విష యం రోజుకి రెండు పిల్స్ ఒక్క ప్రోడక్ట్ 8 పిల్ల్స్ వదమంటూ సూచిస్తారు. ధరల నుంచి ఆధారంగా కొనదమా మానడమా అన్న విషయాన్ని నిర్ణయించుకోండి. మీ ఇతర ఖర్చులకన్నా మందుల ఖర్చు ఎక్కువగా ఉండా అన్న విష యం గమనించండి. తడిసి మోపెదయ్యే ఖర్చుల విష్యం లో ఆచి తూచి అడుగు వేయండి.

గ్రీన్ కాఫీతో బరువు తగ్గడం ఖాయం!

  గ్రీన్ కాఫీతో బరువు తగ్గడం ఖాయం!     ఆరోగ్యానికి గ్రీన్ టీ మంచిదని మనకి తెలిసిందే. మరి గ్రీన్ కాఫీ గురించి ఎంతమందికి తెలుసు? ఇంకా చాలామందికి తెలియదు. ఎందుకంటే దీని వాడకం ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. రోస్ట్ చేయని కాఫీ గింజల్ని నానబెట్టి, వాటి నుంచి ఎక్స్ ట్రాక్ట్ చేసేదే గ్రీన్ కాఫీ. దీనిలో క్లోరోజెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ ను బాగా కరిగిస్తుంది. అంతేకాదు... ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని కూడా మెరుగు పరుస్తుందట.   దానివల్ల చక్కెర వ్యాధి వచ్చే అవకాశాలు కూడా బాగా తగ్గుతాయి. ఇది రక్త ప్రసరణను మెరుగు చేస్తుంది. డీటాక్సిఫికేషన్ కి ఉపయోగపడుతుంది. ఆకలిని కూడా అదుపు చేస్తుందట. తద్వారా ఫుడ్ తక్కువ తీసుకుంటాం కాబట్టి బరువు పెరిగే ప్రమాదం తగ్గిపోతుంది. ఇది మెదడును కూడా ఫ్రెష్ గా ఉంచుతుందట. కాబట్టి గ్రీన్ కాఫీని హ్యపీగా తాగేయమంటున్నారు వైద్యులు.     మార్కెట్లో గ్రీన్ కాఫీ మూడు రకాలుగా దొరుకుతోంది. పౌడర్ రూపంలో, డ్రై చేసి ఫ్రీజ్ చేసిన గింజలు, గ్రాన్యూల్స్... ఇలా మూడు రూపాల్లో లభ్యమవుతోంది. వీటితో దేన్ని వాడినా ఫర్వాలేదు. అయితే వీలైనంత వరకూ షుగర్ కానీ తేనె కానీ కలుపుకోకుండా తాగితేనే మంచిది.   మరింత ఉపయోగకరంగా ఉండటానికి పుదీనా ఆకులను కానీ, దాల్చినచెక్క కానీ, అల్లం కానీ వేసి మరిగించి తాగితే మరీ మంచిదట. కాస్త పసుపు కలిపి తాగినా కూడా చాలా మంచిదంటున్నారు. అయితే ఆహరం తిన్న వెంటనే మాత్రం ఎప్పుడూ తాగకూడదట.    రోజుకు ఓ మూడు కప్పులు గ్రీన్ కాఫీ తాగితే వెయిట్ లాస్ చాలా త్వరగా జరుగుతుందని, అంతకు మించి తాగకపోవడం మంచిదని కూడా సూచిస్తున్నారు. ఇంకెందుకాలస్యం... వెంటనే గ్రీన్ కాఫీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వండి మరి! - Sameera

బొప్పాయి బ్రెస్ట్ మిల్క్ ను పెంచుతుందా

బొప్పాయి బ్రెస్ట్ మిల్క్ ను పెంచుతుందా   ‘నేను పుష్టిగా భోజనం చేసినా మా బాబుకి పాలు సరిపోవట్లేదు’ అని కొత్తగా తల్లయిన వాళ్ళు అనటం మనం వింటూనే ఉంటాం. అన్నం ఎక్కువగా తినేస్తే పాలు సమృద్దిగా పడతాయి అనుకోవటం పొరపాటే. మనం తీసుకునే ఆహారంలో పాలను ఉత్పత్తి చేసే పదార్థాలు అదిక శాతం ఉండేలా చూసుకోవాలి. మనకి అందుబాటులో ఉండే కొన్ని రకాల కూరగాయల్లో, మెంతులు, వెల్లుల్లి, తులసి, వాము, కాకరకాయి, బొప్పాయి మొదలైన వాటిలో పాలను ఉత్పత్తి చేసే గుణం అధికంగా ఉంటుంది. వీటిని మన రోజువారి ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలు ఇక ఏ దిగులు ఉండదు. మెంతులు ఈ సమస్యకి ఒక మంచి పరిష్కారం. బాలింతకు ఎక్కువగా మెంతిపొడి, మెంతికూర మొదలైనవి పెట్టాలి. నార్త్ ఇండియన్స్ అయితే మెంతులతో చేసిన హల్వా తినిపిస్తూ ఉంటారు. మెంతులను నేతిలో వేయించి, పోసి చేసి వంతులు గోధుమ పిండిని కలిపి వాటిలో పంచదారపొడి వేసి హల్వా లా తయారు చేస్తారు.     సోంఫు కూడా బాలింతలకు మంచిది. పాలు తాగే పిల్లలకి కడుపులో నొప్పి లేదా గ్యాస్ కు సంబందించిన సమస్యలు దీని వల్ల బాగా తగ్గుముఖం పడతాయి. తల్లి ఈ సోంఫుని ఎంత తింటే పిల్లలకి అంత మంచిది. దీనిని పొడిగా చేసుకుని కూరల్లో తినచ్చు లేదా నీళ్ళల్లో వేసి కాచుకుని కషాయంలా కూడా తీసుకోవచ్చు. వెల్లుల్లి పాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేందుకే కాదు పాలకు మంచి రుచిని కూడా తెచ్చిపెడుతుందని ఒక అధ్యయనం తేల్చి చెప్పింది. వెల్లుల్లి తిన్న తల్లుల పిల్లలు తల్లి దగ్గర ఎక్కువ పాలు తాగారట. ఈ వెల్లుల్లిని బాలింత తినే అన్ని వంటకాల్లో కలుపుకోవచ్చు. అలాగే వాము కూడా పాలు పడటంలో ఎక్కువ సహాయం చేస్తుంది. వాము పొడిలో కాని కషాయంలో కాని తేనె కలిపి తినిపిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.యుటరస్ కి సంబంధించి  ఏదైనా సమస్య ఉన్నా అది కూడా తగ్గుతుంది. అన్నింటికన్నా ముఖ్యమైనడి బొప్పాయి పండు. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు దీన్ని అస్సలు తినకూడదని చెప్తారు అదే పండు డెలివరీ అయ్యాకా మాత్రం ఎక్కువగా తినాలి. ఇందులో తగినన్ని ప్రోటీన్స్, విటమిన్స్ ఉండటమే కాకుండా పాలు సమృద్దిగా తయారుకావటానికి దోహదం చేస్తాయి. బాలింతలు దీన్ని ఎంత తింటే అంత మంచిది. ఓట్స్ లో ఐరన్, కాల్షియం, ఫైబర్ ఇంకా విటమిన్ బి ఎక్కువగా ఉండటంవల్ల దీనిని తీసుకుంటే డిప్రెషన్ కూడా తగ్గుతుందిట. కొత్తగా తల్లి అయిన వాళ్ళలో తెలియని భయం ఉంటుంది. అలాంటి సమస్యలన్నీ ఓట్స్ తినటం వల్ల పోతాయని తేల్చి చెప్పాయి కొన్ని అధ్యయనాలు. వీటితో పాటు బ్రెడ్ తింటే కూడా మంచిది. తల్లులు తీసుకునే ఆహారంలోనే ఏది పాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుందో తెలుసుకుని తీసుకుంటే చాలు, పిల్లలకి పోత పాలు పట్టాల్సిన పని ఉండదు. ..కళ్యాణి

వందేళ్లనాటి ఈ చిట్కాతో సంతానం ఖాయమట!

  వందేళ్లనాటి ఈ చిట్కాతో సంతానం ఖాయమట!     సంతానలేమి... ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న సమస్య! ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందా అని తిరగని చోటు ఉండదు. చికిత్స కోసం పెట్టే ఖర్చుకి లెక్క ఉండదు. కానీ నెదర్లాండ్స్, ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు దీనికో పరిష్కారాన్ని కనుగొన్నారు. వందేళ్లనాటి ఓ చిన్నపాటి చికిత్సతో సంతోనలేమికి చెక్ పెట్టవచ్చని నిరూపించారు. ఒకప్పుడు సంతానలేమి ఉన్న స్త్రీలలో, సంతానాన్ని ఉత్పత్తి చేసే భాగాలలో ఏదన్నా లోపం ఉందా అని తెలుసుకునేందుకు ఓ పరీక్ష చేసేవారట. దీన్ని hysterosalpingography (HSG) అంటారు. ఇందులో భాగంగా Fallopian tubes స్పష్టంగా కనిపించేందుకు అందులోకి ఏదన్నా ద్రవపదార్థాన్ని పంపేవారు. సాధారణంగా ఇందుకోసం గసగసాల నుంచి తీసిన నూనెని (iodised poppy seed oil) నింపేవారు. ఆశ్చర్యంగా ఇలా గసగసాల నూనెతో Fallopian tubesని శుభ్రం చేయగానే చాలామందిలో సంతానం కలుగుతుండేది. అంటే పరీక్ష కాస్తా చికిత్సగా మారిపోయిందన్నమాట! ఎప్పుడో 1914లో మొదలైన ఈ తరహా పరీక్ష క్రమేపీ మరుగునపడిపోయింది. ఇప్పుడు సంతానలేమికి కారణాలను పరీక్షించేందుకు, లోపాలను సవరించేందుకు ఆధునికమైన చికిత్సలు అందుబాటులోకి వచ్చేశాయి. కానీ ఆస్ట్రేలియాలోని అడిలైడ్ విశ్వవిద్యాలయం, నెదర్లాండ్స్లోని 27 వైద్య బృందాలతో కలిసి మళ్లీ ఆనాటి చికిత్సలోని ప్రామాణికతను గమనించే ప్రయత్నం చేశారు. ఇందుకోసం సంతానలేమితో బాధపడుతున్న 1119 మంది స్త్రీలను ఎంచుకున్నారు. ప్రయోగం కోసం ఎంచుకున్న స్త్రీలలో కొందరి Fallopian tubesని గసగసాల నూనెతో ఫ్లష్ చేశారు. మరికొందరికి కేవలం మామూలు నీటితో ఫ్లష్ చేశారు. ఆరునెలలు తిరిగేసరికి నూనెతో చికిత్స పొందినవారిలో 40 శాతం మంది సంతానాన్ని పొందారు. నీటితో ఈ చికిత్సని పొందినవారు 29 శాతం మంది మాత్రమే సంతానాన్ని పొందారు. ఈ చికిత్సలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ నమోదు కాకపోవడం మరో విశేషం. ఇంతకీ ఈ చికిత్స ఇంతలా విజయవంతం కావడానికి స్పష్టమైన కారణం ఏమిటో మాత్రం పరిశోధకులు కనిపెట్టలేకపోయారు. బహుశా Fallopian tubesలో అడ్డుగా నిలిచే మలినాలను తొలగించడం వల్ల సంతానం సాధ్యపడుతూ ఉండవచ్చని మాత్రం భావిస్తున్నారు. గసగసాల నూనె వల్ల అందులో చేరిన ఇన్ఫెక్షన్లు కూడా తగ్గిపోయేందుకు ఆస్కారం లభిస్తూ ఉండవచ్చు. అదీ విషయం! ఇక మీదట సంతానం కోసం ఎవరన్నా తమ దగ్గరకు వచ్చినప్పుడు వైద్యులు ఒకేసారి IVFలాంటి ఖరీదైన చికిత్సల జోలికి పోకుండా... ముందుగా ఈ చిన్నపాటి చిట్కాను పాటించి చూడాలని పరిశోధకులు కోరుతున్నారు. సంతానం కోసం వైద్యులని సంప్రదించేవారు కూడా ఓమారు ఈ చికిత్స గురించి వైద్యుని సంప్రదించాలని సూచిస్తున్నారు. గసగసాల నుంచి తీసిన నూనె ఇప్పటికీ Lipiodol® Ultra-Fluid పేరుతో ఎలాగూ అందుబాటులోనే ఉంది. - నిర్జర.  

పనులు పెండింగ్ లో పడుతున్నాయా..

పనులు పెండింగ్ లో పడుతున్నాయా..     చెయ్యాలనుకునే పనుల లిస్టు పెరుగుతూ మీకు టెన్షన్ తెచ్చిపెడుతోందా. అయితే కొన్ని కిటుకులు పాటిస్తే చాలు,పనులన్నీ చకచకా అయిపోయి మీ టెన్షన్ ని దూరం చేస్తాయి. దీనికోసం ముందుగా మనం చెయ్యాలనుకున్న పనుల జాబితా మన బుర్రలో కాకుండా ఒక పేపరుపై పెట్టి వరుసగా రాసుకోండి. అందులో ఇంటికి సంభందించిన పనులన్నీ ఒక వైపు,బయటకెళ్ళి చెయ్యాల్సినవి మరో వైపు, అలాగే ఇంట్లో వాళ్ళ సహాయంతో చేసేవి ఇంకోవైపు చక్కగా డివైడ్ చేసి పెట్టుకోండి. ఇలా డివైడ్ చేసుకోవటం వల్ల మనం చెయ్యాల్సిన పనులపట్ల ఒక అవగాహన ఏర్పడుతుంది.       ఇంట్లో చెయ్యాల్సిన పనులలో దేనికి ఎక్కువ ప్రిఫెరెన్సు ఇవ్వాలనుకుంటున్నారో దాని మీద ముందుగా దృష్టి పెట్టండి. ఇలా మన ప్రిఫెరేన్సు కి అనుగుణంగా పనుల లిస్టులో కాస్త మార్పులు చేర్పులు చేసుకోవటం వల్ల పనులు తొందరగా అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. అన్ని పనులని ఒకేసారి తలచుకోవటం వల్ల వచ్చే అలజడి తగ్గి మనకు తెలియకుండానే పనులు చకచకా అయిపోతాయి. ఇక బయట చెయ్యాల్సిన పనుల లిస్టులో కూడా ఆ పనుల కోసం వెళ్ళాల్సిన ప్లేస్ పేరు పక్కన రాసుకోండి. ఎక్కువగా ఏ ప్లేస్ కి వెళితే చాలా  పనులు పూర్తి చెయ్యచ్చో మనకి క్లియర్ గా అర్ధమవుతుంది. దానికి తగ్గట్టుగా వెళితే మన లిస్టులో పనులూ తగ్గుతాయి. మీకున్న పనులకి ఇంట్లో వాళ్ళ సాయం కూడా తోడయితే ఇంకా హాయి కదా. మొహమాటం పక్కన పెట్టి కాస్త ఆప్యాయంగా అడిగి చూడండి. చేసే పనులు ఎన్ని ఉండి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని దానికి అనుగుణంగా వెళితే కొండంత పనయినా చిటికెలో చేసి చూపించే సత్తా మీ సొంతమవుతుంది.   ..కళ్యాణి 

భర్తని ఎన్నుకునే హక్కు 5 శాతం మందికే

భర్తని ఎన్నుకునే హక్కు 5 శాతం మందికే! కాలం మారిందని గొప్పగా చెప్పుకొంటున్నాం. పురుషులతో సమానమైన హక్కులను సాధించేందుకు స్త్రీలు ప్రయత్నిస్తున్నారనీ, వారి ప్రయత్నానికి సమాజం మొత్తం అండగా నిలబడిందనీ వ్యాసాలు రాస్తున్నాం. కానీ స్త్రీల పరిస్థితి ఏమాత్రమూ..... మారలేదని ఓ సర్వే తేల్చి చెబుతోంది. National Council of Applied Economic Research అనే సంస్థ University of Marylandతో కలిసి భారతీయ మహిళల స్థితిగతుల మీద ఓ సర్వేను నిర్వహించారు. ఇందుకోసం వారు 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 34 వేలమంది స్త్రీల నుంచి వివరాలను సేకరించారు. వీరంతా కూడా 15 నుంచి 81 ఏళ్ల వయసులోపు వారే! ఈ సర్వేలో తేలిన విషయాలతో సామాజికవేత్తలకి నోట మాట రాలేదు. - దాదాపు 80 శాతం మంది స్త్రీలు తాము వైద్యుడి దగ్గరకు వెళ్లాలంటే ఇంట్లోవారి అనుమతి తీసుకోక తప్పదని చెప్పారు. అది భర్తయినా కావచ్చు, అత్తమామలు అయినా కావచ్చు. మొత్తానికి అనుమతి లేనిదే ఆరోగ్యం కోసం బయటకు వెళ్లడం అసాధ్యం అన్నమాట. - వైద్యుడి దగ్గరకు వెళ్లడం సంగతి అలా ఉంచితే... ఆఖరికి ఉప్పు, పప్పుల కోసం కిరాణా దుకాణానికి వెళ్లడానికి కూడా వారికి అనుమతి కావాల్సిందే! 58 శాతం స్త్రీలు తాము పచారీల కోసం బయల్దేరేటప్పుడు కూడా ఇంటి యజమాని అనుమతి తీసుకోవాల్సిందే అని తేల్చి చెప్పారు. - ఇంట్లో ఏ వంటకం చేయాలో నిర్ణయించే అధికారం 93 శాతం స్త్రీలకి ఉంది. ఆగండాగండి! ఆ శాతాన్ని చూసి సంబరపడకండి. దాదాపు 50 శాతం సందర్భాలలో ఇంట్లో ఏ వంట చేయాలని చేసే నిర్ణయంలో భర్త కూడా పాలు పంచుకుంటాడట. - వైద్యం దగ్గర్నుంచీ వంట వరకూ పరిస్థితి ఇలా ఉంటే ఇక కుటుంబ విషయంగా భావించే పెళ్లిళ్ల సంగతి చెప్పేదేముంది! కేవలం ఐదంటే ఐదు శాతం ఆడవారికి మాత్రమే తమ భర్తలను ఎన్నుకొనే అధికారం ఉందట. - మన దేశంలో పెద్దలు కుదిర్చే పెళ్లిళ్లే అధికంగా ఉంటాయి కాబట్టి అందులో వధూవరుల పాత్ర తక్కువ కావడం అంత ఆశ్చర్యం కాకపోవచ్చు. కానీ పెళ్లి కుదిరిన తరువాత కూడా వారిద్దరి మధ్యా ఒక మాటా మంతీ జరగకపోవడం విచిత్రం. దాదాపు 65 శాతం మంది ఆడవారు పెళ్లిరోజునే తనకి కాబోయే భర్తని మొదటిసారి చూసినట్లు చెప్పారు. బీహార్లో అయితే ఇది 94 శాతంగా ఉంది. విస్మయాన్ని కలిగించే విషయం ఏమిటంటే... స్త్రీల అక్షరాస్యతతో కానీ, పురుషులతో పోలిస్తే వారి నిష్పత్తితో కానీ ఈ శాతాలలలో పెద్దగా మార్పు రాలేదు. ఉదాహరణకు స్త్రీపురుష నిష్పత్తి ఎక్కువగా ఉండే చత్తీస్‌ఘడ్‌తో పోలిస్తే, వెనకబడిన రాష్ట్రమైన మేఘాలయలలో స్త్రీల పరిస్థితులు మెరుగ్గా కనిపించాయి. ఇన్నాళ్లూ ప్రభుత్వాలు స్త్రీలలో అక్షరాస్యత పెరిగితేనో, ఆర్థికంగా వారి పరిస్థితి మెరుగుపడితేనో వారు సాధికారతని సాధిస్తారని భావిస్తూ వచ్చాయి. కానీ ఆడవారి పరిస్థితి మెరుగుపడాలంటే సామాజికంగానే మార్పులు రావాలనీ... అందుకు అనుగుణమైన ప్రయత్నాలు మొదలుపెట్టాలనీ ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.                 - నిర్జర.

స్వభావాన్ని చెప్పే పండ్లు

  మన దగ్గరి వ్యక్తుల మనస్తత్వాలని ఎలా అర్థం చేసుకోవచ్చో సరదాగా నేర్చుకుందామా? ఎదుటి వ్యక్తికీ నచ్చిన పండు ఏదో తెలుసుకుంటే... దాని బట్టి వారి స్వభావం గురించి అంచనా వేయచ్చట. మన ఇష్టాయిష్టాలు సహజంగా మన స్వభావం, మనస్తత్వం పై ఆధారపడే ఏర్పడతాయి అంటున్నారు నిపుణులు. కాబట్టి ఆ ఇష్టాయిష్టాలు మన స్వభావానికి అద్దం పడుతాయన్నమాట. సరే నచ్చే పండుని బట్టి వారి స్వభావాన్ని ఎలా అంచనా వేయచ్చో తెలుసుకుందాం.   ఆరెంజ్ : ఆరెంజ్ ను అమితంగా ఇష్టపడే వ్యక్తుల స్వభావం ఎలా వుంటుందో చూద్దాం. వీరు చాలా సహనంగా ఉంటారు. పట్టుదల ఎక్కువ. వీరి పనితీరు నెమ్మదిగా అనిపించినా కష్టపడే తత్వం వీరి స్వంతం. ఏ బంధంలోనైనా వంద శాతం ఇస్తారు. నమ్మకస్తులు ఎవరైనా ఈ వ్యక్తులపై పూర్తి భరోసా పెట్టవచ్చు. వీరిని ఫ్రెండ్ గా పొందని వారు అదృష్టవంతులనే చెప్పాలి.   ఆపిల్ : ఆపిల్ అంటే చాలా ఇష్టమని అన్నారనుకోండి... వాళ్ళు ది బెస్ట్ టీం లీడర్స్ అని అర్థం చేసుకోవాలి. అంటే ముందుండి ఓ టీంని నడిపించే నాయకత్వ లక్షణాలు వీరి స్వంతం. ఉన్నదున్నట్టు ఎదుట వ్యక్తి మొహంపై చెప్పేస్తారు. కాస్త పోగరుబోతుల్లా కనిపిస్తారు. కాని వీరి స్వబావం అది కాదు నిజానికి. కాని మాట కాస్త కరుకుగా ఉంటుంది. వీరిలో నాయకత్వ లక్షణాలుంటాయి కానీ, వీరి లైఫ్ ను వీరే సరిగ్గా, సమర్థవంతంగా నిర్వహించుకోవటంలో కంగారు పడతారు. మామిడి : మామిడి పండును ఇష్టపడే వ్యక్తుల స్వభావం చాలా స్పష్టంగా ఉంటుంది. వీరి ఆలోచనలలో చాలా క్లారిటి వుంటుంది. వీరిని, వీరి ఆలోచనలని, పద్దతులని ప్రభావితం చేయటం అంత సులువు కాదు. వీరి ఇష్టాయిష్టాలు కూడా చాలా బలంగా ఉంటాయి. వీరి జీవితం ఎంతో చక్కగా సాగిపోతుంది. అయితే నచ్చిన వారి దగ్గర పిల్లల్లా మారిపోతారు.. అల్లరి చేసి ఆనందిస్తారు. బొప్పాయి : ఈ పండును ఇష్టపడే వ్యక్తులు మన స్నేహితులయితే చాలు. మన పెదవులపై చిరునవ్వు ఎప్పుడూ విరుస్తునే వుంటుంది. మంచి హాస్య స్వభావులు నవ్వుతూ, నవ్విస్తూ ఉంటారు. ఇతరులతో ఎంతో దయగా ఉంటారు. కొత్త వ్యక్తులతో ఇట్టే కలిసిపోగలరు. సఖులూ. ఫైనాఫిల్, అనాస : వీళ్ళు ఏ పని చేయాలన్నా నిర్ణయం తీసుకుంటే చాలు... వెంటనే మొదలు పెట్టేస్తారు. ధైర్యం ఎక్కువ తనపై తనకుండే నమ్మకమే అందుకు కారణం. వీరికి దేనినైనా సాధించటం ఎంతో తేలిక. అయినా వ్యక్తిగతంగా వీరు ఎవరితోనూ తొందరగా కలవలేరు. కాని ఒకసారి స్నేహితులయితే ఎంతో విలువనిస్తారు ఆ బంధానికి ... కాని వీరిలో బంధంలో ఉండేవారు ఒక్కటి అర్థం చేసుకోవాలి. వీరికి మనసులోని అభిమానాన్ని బయటకి చూపించటం రాదు. నల్ల ద్రాక్ష : వీళ్ళు మృదు స్వభావులు, కాని ముక్కుపై కోపం వుంటుంది. ఎంత తొందరగా కోపం వస్తే, అంత త్వరగా చల్లారిపోతారు. వీరితో ఉండటానికి ఎవరైనా ఇష్టపడతారు. వీరికి జీవితాన్ని ఎంత అందంగా, ఆనందంగా ఉంచుకోవాలో బాగా తెలుసు. ప్రతీ క్షణాన్ని ఆనందంగా గడపడానికి ఇష్టపడతారు. సీతాఫలం : వీళ్ళు చాలా లక్ష్యాలు కలిగి ఉంటారు. చాలా తెలివైన వారు. విజయాల కోసం కష్టపడతారు. అయితే ఎదుటి వ్యక్తుల లోని లోపాలని ఇట్టే పసిగడతారు. దాంతో వీరికి శత్రువులు కూడా ఎక్కువే. వీరు అభిమానాన్ని పైకి చూపరు. ఎదుటివారు అర్థం చేసుకోవాలి. అరటి పండు : వీళ్ళు ఎదుటివారిపై ఎంతో ఇష్టాన్ని చూపిస్తారు. అందరితో ఎంతో మంచిగా ఉంటారు. మంచి సంబంధ బాంధవ్యాలను కలిగి ఉంటారు. అయితే తమ విషయానికి వచ్చేసరికి వారిపై వారికీ నమ్మకం తక్కువ. పక్కవారి తోడుకోసం చూస్తుంటారు. స్వభావసిద్ధంగా వీరు విజయాలకంటే వ్యక్తులకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు.

మహిళలూ బి అలర్ట్!! 

 మహిళలూ బి అలర్ట్!!  మహిళలు మహారాణులు. ప్రస్తుత కాలంలో ఇంటా, బయట, ఏ వ్యవహారాలలో అయినా మహిళలదే పైచేయి. చాలా కుటుంబాల్లో ఏదైనా నిర్ణయం తీసుకోవడం నుండి, అది అమలు జరిగేదాక ఆ ఇంటి ఆడవాళ్ళ పాత్ర చాలా ఉంటుంది. ఎంత అంటే అక్షయపాత్ర అంత. వాళ్ళు ఏ పని చేయాలి అంటే ఆ నైపుణ్యాన్ని చాలా సులువుగా సంపాదించేసుకోగలుగుతారు. ఇలా అల్ రౌండర్ మహిళలే కాకుండా సాధారణ గృహిణీలు కూడా అప్డేట్ అవుతున్నారు. వీళ్ల జీవితంలో ఈ ఎదుగుదల వల్ల కలిగే హుషారులో చాలామంది, బాధ్యతల్లోనూ, పనులలోనూ మునిగిలిపోయి కొన్ని మర్చిపోతున్నారు. పర్యవసానంగా వాళ్లకు బోలెడు ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. చాపకింద నీరులా మహిళలను చుట్టుముట్టే సమస్యలు ఇవే!! వంటింటి విషాదం!! ప్రతి ఇంట్లో మిగిలి పదార్థాలు పడేయలేక, తినలేక ఇబ్బంది పడేది ఆ ఇంటి గృహిణి అనేమాట జగమెరిగిన వాస్తవం. భర్త బయట పార్టీ లో తింటాడు, పిల్లలు కాస్త పెద్దవాళ్ళు అయి ఉంటే వాళ్ళు ఫ్రెండ్స్ తో చాట్స్, పిజ్జా లు, బర్గర్లు తింటారు. ఇంట్లో అందరికోసం వండి కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తే వాళ్ళందరూ మాకొద్దు అని తినకుండా పోతే, అప్పుడు అదంతా చెత్త కుప్పలో పడెయ్యలేక, ఆ వంట చేయడానికి పడిన కష్టం గుర్తొచ్చి, దాన్ని అలాగే పెట్టేసి. మరుసటిరోజు అదే తిండి తాను తింటూ భర్త, పిల్లలకు  వేడి వేడిగా వడ్డిస్తున్న మాతృమూర్తులు ఎందరో!! ఇలా తాజా ఆహారం తీసుకోక కేవలం కార్బోహైడ్రేట్స్ మాత్రం ఎక్కువగా శరీరంలోకి పోతూ డయాబెటిస్ కు గురవుతున్న మహిళలు అనేకం, అలాగే కుటుంబ సమస్యల గూర్చి ఒత్తిడికి లోనవుతూ కూడా దీన్ని కొనితెచ్చుకుంటున్నవాళ్ళు ఉన్నారు. వాటర్ వార్నింగ్!! మహిళలు ఇంట్లో ఉన్న వాళ్ళైతే పర్లేదు. ఈకాలంలో చాలామంది మహిళలు అధిక విద్యతో సంబంధం లేకుండా కుటుంబాలకు చేదోడుగా ఉండటానికి, ప్రస్తుత కాలంలో ఇల్లు సమస్యలు లేకుండా గడవడానికి ఏదో ఒక ఉద్యోగం చేస్తూనే ఉంటారు. వీళ్ళు, మరియు పాఠశాల విద్యార్థినిలు ఎదుర్కొనే సమస్య గురించి చెప్పుకుంటే నవ్వాలో, ఏడవాలో కూడా అర్థం కాదు. ఇంటి బయట అడుగు పెట్టాక గమ్యం చేరెవరకు ఎక్కడా ప్రభుత్వం పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చేయదు, ఎక్కడైనా ఉన్న డబ్బు పెట్టాల్సిందే. బయట బాత్రూమ్ వెళ్లాలనే సమస్య తప్పించుకోవడానికి మహిళలు చేసే పని మంచినీళ్లు ఎక్కువగా తాగకపోవడం. దీనివల్ల చాపకింద నీరులా కిడ్నీ సమస్యలు వస్తాయి. భారతదేశంలో అధికశాతం మంది మహిళలు ఎదుర్కొనే సమస్య ఇదే. హార్మోనల్ ప్రోబ్లేమ్స్!! మహిళల్లో ఎక్కువగా కనిపించే థైరాయిడ్ సమస్య దాని ద్వారా ఊబకాయం చాలా మంది మహిళల్లో కనిపిస్తుంది. కేవలం దీంతో వదిలిపోకుండా ఈ ఊబకాయం రానురాను శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ పెంచి అవి మహిళల్లో రొమ్ము కాన్సర్ కు కారణం అవుతాయి అనే ఆశ్చర్యం వేస్తుంది. హార్మోన్ సమస్యల వల్ల డిప్రెషన్, అనవసర ఫోబియాలు, pcod, గర్భాశయ సమస్యలు ఇలా ఒకదానికొకటి అల్లుకుపోతుంటాయి ఈ సమస్యలు అన్ని. ఇవన్నీ కూడా మహిళల ఋతుచక్రం మీద ప్రభావం చూపించి మానసికంగా మహిళలను దిగజారుస్తాయి. రక్తంతో యుద్ధం!! నిజమేనండీ బాబు. భారతదేశంలో అధికశాతం మంది మహిళలు ఎదుర్కొంటున్న మరో సమస్య రక్తహీనత. ఐరన్, కాల్షియం లోపాలు, సరిపడినంత ఎముక సామర్థ్యము, హిమోగ్లోబిన్ స్థాయిలు లేక బలహీనంగా, వాటి ద్వారా ఇతర సమస్యలు కూడా ఎదుర్కొంటున్న ఆడవాళ్లు ఎందరో. ముఖ్యంగా పోషకాహార లోపం వల్ల శారీరక దృఢత్వం లేక గాజుదేహాల్లా మారుతున్న ఆడవాళ్లు అధికం. ఇలా ఇన్ని సమస్యలు ఉన్నా ప్రపంచంలో పోటీలో ఆగకుండా పరిగెత్తాలని ఆరటపడుతూ ఉన్న మహిళలకు యాడ్స్ లో అందంగా చూపించే ఆహారాలు, ఎనర్జీ డ్రింకులు శక్తిని ఇవ్వవు. ప్రకృతిపరంగా లభించే ఆహారమే ఆరోగ్యం, అందం, ఆనందం కూడా. కాబట్టి మహిళలూ బి అలర్ట్!!మీ ఆరోగ్యం మీ చేతుల్లో!! ◆ వెంకటేష్ పువ్వాడ  

ఆ రోజుల్లో సెలవు ఇస్తే ఏం!

ఆ రోజుల్లో సెలవు ఇస్తే ఏం!     స్త్రీలు మగవారితో సమానంగా అన్ని బాధ్యతలూ పంచుకుంటున్న రోజులివి. తాము ఏ రంగంలోనూ తక్కువ కాదని రుజువు చేస్తున్న యుగం ఇది. కానీ తమకి చేయూతగా నిలుస్తున్న ఆడవారిని సమాజం ఎంతవరకూ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తోంది అంటే జవాబు కష్టమే! వారికి మాత్రమే ప్రత్యేకమైన సమస్యలని పట్టించుకునేవారు కానీ, సహానుభూతితో స్పందించేవారు కానీ ఎవరున్నారు అంటే కనిపించేవారు తక్కవే! అందుకు ఉదాహరణే స్త్రీలు తమ రుతుక్రమం సమయంలో ఎదుర్కొనే సెలవు సమస్య!   ఎందుకీ బాధ స్త్రీలు తమ పీరియడ్స్‌ సమయంలో శారీరికమైన ఇబ్బందులను ఎదుర్కొంటారన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సమయంలో వారి గర్భాశయం చుట్టూ ఉన్న రక్తనాళాల మీద విపరీతమైన ఒత్తిడి ఏర్పడుతుంది. దీనికి తోడు prostaglandins అనే రసాయనాలు కూడా విడుదల కావడంతో పొత్తికడుపు చుట్టూ ఉన్న కండరాలు కుంచించుకుపోయి మరింత బాధకి దారితీస్తాయి. కేవలం కండరాల నొప్పులే కాదు, పీరియడ్స్‌ సమయంలో రకరకాల ఆరోగ్య సమస్యలు మహిళలను చుట్టుముట్టే అవకాశం ఉంది. వాంతులు, విరేచనాలు, తలనొప్పి, వెన్నునొప్పి, క్రుంగుబాటు వంటి ఇబ్బందులెన్నింటినో ఎదుర్కోవలసి రావచ్చు. రుతుక్రమంలో వచ్చే ఇలాంటి సమస్యలని వైద్య పరిభాషలో dysmenorrhoea అంటారు.   మరోసారి వెలుగులోకి గత వారం బీబీసి రేడియో చేసిన ఒక సర్వేతో ‘పీరియడ్స్ సమయంలో ఉద్యోగం’ అనే సమస్య మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ సర్వేలో పాల్గొన్న దాదాపు వేయిమంది చెప్పిన విషయాలు ఈ సమస్య తీవ్రతని తేల్చిచెప్పాయి. ఈ వేయిమందిలో 52 శాతం మహిళలు, పీరియడ్స్‌ సమయంలో వచ్చే నొప్పి తమ విధి నిర్వహణ మీద ప్రభావితం చేస్తోందని చెప్పారు. వారిలో ఒక మూడో వంతు మందైతే ఆ నొప్పి కారణంగా సెలవు తీసుకోవాల్సి వచ్చిందని వాపోయారు. ఏతావాతా ప్రతి పదిమందిలో తొమ్మిదిమంది తాము ఏదో ఒక సమయంలో పీరియడ్స్‌ నొప్పుల కారణంగా, ఉద్యోగ వేళల్లో ఇబ్బందిపడ్డామని చెప్పుకొచ్చారు. పీరియడ్స్‌ వల్ల వచ్చే నొప్పితో తరచూ ఇబ్బండి పడటం వల్ల, ఉద్యోగాన్ని మానివేసినవారూ లేకపోలేదు.   వింత సమస్య పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పుల గురించి మహిళలు యాజమాన్యం దగ్గర చెప్పునేందుకు జంకుతారు. యాజమాన్యమేమో దీనిని స్వయంగా పట్టించుకునే చొరవా చూపదు. ఫలితంగా కార్మికులలో సగభాగమైన మహిళలు ఈ బాధతోనే ఉద్యోగాలను నెట్టుకొస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఈ సమస్య గురించి గొంతుకలు వినిపిస్తున్నాయి. ఈ సమస్య చాలా సహజమైనదన్న విషయం యాజమాన్యం గుర్తించాలనీ, పీరియడ్స్‌ సమయంలో మహిళలు సెలవు తీసుకునే అవకాశాన్ని కల్పించాలనీ వాదనలు వినిపిస్తున్నాయి. మహిళలకు కనుక ఇలాంటి సెలవులు అందుబాటులో ఉంటే వారు మరింత సమర్థవంతంగా విధులను నిర్వహిస్తారని, యాజమాన్యం తమకు అండగా ఉందన్న తృప్తితో ఉంటారనీ పలువురు సూచిస్తున్నారు.   సాధ్యమేనా! జపాన్‌, ఇండోనేషియా, తైవాన్‌ వంటి దేశాలలో ఇప్పటికే మహిళలు రుతుక్రమంలో సెలవులు తీసుకునే సౌలభ్యం ఉంది. జపాన్‌లో అయితే దాదాపు 70 సంవత్సరాలుగా ఈ చట్టం అమలులో ఉంది. ఇక కెనడా, ఇంగ్లండ్‌ వంటి దేశాల్లో కూడా ఈ సెలవులను అమలుచేయాలన్న ఉద్యమాలు బలపడుతున్నాయి. మన దేశంలో ఒకటీ అరా సంస్థలు ఇలాంటి సెలవులను ఇస్తున్నప్పటికీ, చట్టబద్ధంగా మహిళలకు ఇలాంటి సెలవులు లభించాలంటే మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరగవలసి ఉంది. పైగా మహిళలకు ఇలాంటి సెలవులు ఇవ్వడం వల్ల చిన్న తరహా పరిశ్రమలకు నష్టం వాటిల్లుతుందనీ, పారిశ్రామికవేత్తలు మహిళలకు ఉద్యోగాలను ఇచ్చేందుకు జంకుతారనీ వాదించేవారికి మన వద్ద కొదవు లేకపోవడంతో... అసలు ఈ సౌలభ్యం మన దేశంలో వచ్చే అవకాశం ఉందా అన్నది అనుమానమే! అప్పటివరకూ బహుశా మహిళాలోకం మౌనంగా ఈ బాధని భరించాల్సిందేనేమో!   - నిర్జర.  

చేతులున్నవారి మీద ఆమెది పైచేయి

    చేతులున్నవారి మీద ఆమెది పైచేయి   అసలే ఆడపిల్ల! ఆపై రెండుచేతులూ లేకుండా పుట్టింది. పోనీ కుప్పలకుప్పలుగా డబ్బులున్నాయా అంటే మధ్యతరగతి కుటుంబమయ్యే. ఇదీ ‘దామినీ సేన్‌’ పరిస్థితి. మరొకరు ఆమె స్థానంలో ఉంటే ఏం జరిగేదో కానీ... దామినీ మాత్రం తానేమిటో నిరూపించుకుంది. ప్రతి విషయంలో ఇతరులతో పోటీపడుతూ- ఏకంగా ఓ ప్రపంచ రికార్డునే సాధించింది. దామినికి పుట్టుకతోనే చేతులు లేకపోవడంతో ఆమెకు చదువు ఎలాగా అన్న సమస్య మొదలైంది. పసి దామినికి స్నానం చేయించడం, బట్టలు తొడగడం వంటి పనుల్లో అయితే తల్లి సాయపడగలదు. కానీ ఆమెతో అక్షరాలను రాయించేదెలా! అందుకోసం ఆమె తల్లి మాధురీ సేన్ ఒక నిర్ణయం తీసుకుంది. దామినీ కాళ్లతోనే అక్షరాలను దిద్దించాలనుకుంది. కానీ ఎలా! అందుకోసం ముందు తనే కాళ్లతో అక్షరాలు రాసే ప్రయత్నం చేసింది. అందులో కాస్త నేర్పు సాధించాక అదే విద్యను దామినీకి నేర్పింది.     దామినీకి అక్షరాలు వచ్చేశాయి సరే! మరి ఆమెను బడిలో చేర్చేదెలా? అన్నది మరో సవాలు. చేతులు లేని దామినిని చేర్చుకునేందుకు పాఠశాల యజమాన్యాలు మొదట నిరాకరించాయి. కానీ ‘ఒక్కసారి ఆమెను చేర్చుకుని చూడండి. ఆమెను బడిలో కూర్చోబెట్టి చూడండి..’ అంటూ దామిని తండ్రి అభ్యర్థనను మన్నించక తప్పలేదు. నిజంగానే ఒక్కసారి చేర్చుకున్నాక దామిని మిగతా విద్యార్థులతో ఏమాత్రం తీసిపోదన్న విషయం ఉపాధ్యాయులకు అర్థమైంది. దామిని ఒకో తరగతినే దాటుకుంటూ రెండేళ్ల క్రితం ‘మా బంజారి గురుకుల్ విద్యాలయ(రాయ్‌పూర్)’లో పదో తరగతిని కూడా పూర్తిచేసింది. అది కూడా 80 శాతం మార్కులతో! ఇంతాచేసి దామిని కోసం పాఠశాల యాజమాన్యం ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమీ చేయాల్సి వచ్చేది కాదు. ఆమె కాళ్లతో నోట్స్‌ రాసుకునేందుకు కాస్త విడిగా కూర్చోనిస్తే సరిపోయేది!     దామిని చదువులోనే కాదు! మిగతా ఏ విషయంలోనూ ఇతరులకు తీసిపోదు. దామినిని చూస్తే ఆమెకు చేతులు లేవన్నది ఉత్తమాటే అనిపిస్తుంది. తన రెండు కాళ్లతోనే తలదువ్వుకోవడం, బట్టలు ఉతకడం, పాలు తాగడం దగ్గర్నుంచీ వంట చేయడం వరకూ అన్ని పనులూ చేసేస్తుంది. ఇదంతా ఒక ఎత్తయితే కాళ్లతో చకచకా బొమ్మలు గీసేయడం మరో ఎత్తు. మొదట్లో ఏదో కూతురు సరదా పడుతోంది కదా అని దామని తల్లిదండ్రులు ఆమెను బొమ్మలు గీసేందుకు ప్రోత్సహించేవారు. కానీ కార్టూన్లతో మొదలుపెట్టిన దామినిలోని చిత్రలేఖనం భారీ బొమ్మలు గీసే స్థాయికి చేరుకుంది. అంతేకాదు! కాలితో ఒక గంటలో అత్యధిక బొమ్మలు (38) గీసిన చిత్రకారిణిగా ప్రపంచ రికార్డుని సొంతం చేసుకుంది.     దామిని ప్రస్థానంలో ఆమె తల్లిదండ్రులు, చెల్లెలు అండగా ఉన్నారన్న మాట నిజమే! అయితే స్వతహగా ఆమెలో సానుకూల దృక్పథం లేకపోతే ఎవరెంతగా ప్రోత్సహించినా ఉపయోగం ఉండేది కాదు కదా! ఆ ఆత్మవిశ్వాసమే దామిని మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. మొదట్లో తాను కాళ్లతో పనిచేయడాన్ని నేర్చుకున్నప్పుడు, జనం నవ్వుతారేమో అన్న ఆలోచన వచ్చిందనీ... కానీ ఇతరుల గురించి కాకుండా తన గురించి ఆలోచించడంతో ముందుకు సాగిపోయానని చెబుతుంది. అంతేకాదు! ‘మనమీద మనకి నమ్మకం ఉంటే, ప్రపంచం ఏమనుకుంటుందో అన్న ఆలోచన అడ్డుపడదని’ అంటోంది. ‘భగవంతుడు ఒక అందమైన జీవితాన్ని ప్రసాదించాడనీ... ఆ జీవితంతో ఏదో ఒకటి సాధించాలనీ’ ఆలొచింపచేసేలా మాట్లాడుతోంది.   దామిని ప్రస్తుతం డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. మున్ముందు తనబోటివారికి సాయంగా నిలిచేందుకు IAS సాధించడమే తన లక్ష్యమని చెబుతోంది. దామిని ప్రతిభ, పట్టుదల ఎరిగినవారికి, ఆమె తన లక్ష్యాన్ని సాధిస్తుందన్న విషయంలో ఎలాంటి అనుమానమూ లేదు. చేతులు ఉండికూడా మనం చేయలేని పనిని దామిని అలవోకగా సాధించి చూపుతుందని... ఆమె నేస్తాల నమ్మకం. నిజమే కదా!     - నిర్జర.

అక్కడ ఆడవారికి సమాన జీతం ఇవ్వాల్సిందే!

  అక్కడ ఆడవారికి సమాన జీతం ఇవ్వాల్సిందే!     స్త్రీ ఆకాశంలో సగం అంటారు. కానీ నేల మీద మాత్రం తగిన ప్రాముఖ్యత ఇవ్వరు. అడ్డాకూలీల దగ్గర నుంచీ ఆఫీసర్ల వరకూ ఆడవారు చేసే పనికి చాలీచాలని వేతనమే లభిస్తుంది. ఈ విషయం మన కళ్ల ముందు కనిపించేదే! ఇది నిజమని రుజువుచేసేందుకు కావల్సినన్ని పరిశోధనలు కూడా జరిగాయి. నోరు తెరిచి అడిగినా కూడా ఆడవారికీ జీతాలు పెరగవనీ, సున్నితంగా ఉండే ఆడవారి జీతాలు అస్సలు మెరుగుపడవనీ గణాంకాలు రుజువుచేస్తున్నాయి. ఈ సోత్కర్షంతా ఎందుకంటే ఐస్లాండ్లో జరిగిన ఓ విప్లవం గురించి చెప్పుకోవడం కోసం!   మిగతా దేశాలతో పోలిస్తే ఐస్లాండ్లో జీవన పరిస్థితులు మెరుగ్గానే ఉంటాయి. అందుకే సంతోషకరమైన దేశాలలో ఐస్లాండ్ ఎప్పుడూ ముందే ఉంటుంది. అక్కడ స్త్రీపురుషుల మధ్య వివక్షా తక్కువగానే ఉంటుంది. మహిళా ఉద్యోగులు, పురుష ఉద్యోగుల జీతాల మధ్య 14 శాతం మాత్రమే వ్యత్యాసం కనిపిస్తుంది. కానీ అక్కడి ఆడవారు ‘తక్కువ వ్యత్యాసం’తో సరిపెట్టుకోలేదు. అసలు వివక్షే లేని సమాజం కావాలని ఉద్యమించారు.   గత అక్టోబరులో ఐస్లాండ్లోని మహిళా ఉద్యోగులు... తమకు సమానమైన జీతాలు కావాలని డిమాండ్ చేస్తూ విధులను బహిష్కరించారు. ఆ తరువాత విధులలో చేరినా... తక్కువ జీతాలను తీసుకునేందుకు నిరాకరించారు. వీరి ఆవేదనను ప్రభుత్వం కూడా అర్థం చేసుకుంది. ఇక మీదట స్త్రీపురుషు ఉద్యోగులందరికీ సమానంగా జీతాలు ఇవ్వాలంటూ చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై అక్కడ 25మంది కంటే ఎక్కువమంది ఉద్యోగులు ఉన్న ప్రతి సంస్థా... తాము సమానమైన వేతనాలను చెల్లిస్తున్నామంటూ ఒక ధృవపత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. దీంతో చట్టబద్ధంగా సమాన వేతనాలని అమలు చేస్తున్న తొలిదేశంగా ఐస్లాండ్ చరిత్ర సృష్టించింది.   ఉద్యోగరంగంలో స్త్రీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం ఐస్లాండ్కి కొత్తేమీ కాదు. 50 మందికి మించి ఉద్యోగులు ఉన్న సంస్థల బోర్డులో కనీసం 40 శాతం మంది మహిళా సభ్యులుండాలని ఇప్పటికే ఓ నిబంధన ఉంది. ఇలాంటి నిబంధనల వల్లే world economic forum ఐస్లాండ్లో మహిళా సాధికారత అత్యుత్తమం అంటూ కితాబు ఇచ్చింది. ఇక మహిళలకు సమాన వేతనాలతో ఐస్లాండ్ మరే దేశానికీ అందనంత ఎత్తుకి చేరుకుంది.   ఐస్లాండ్ని చూసి మన దేశం ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. ఒకపక్క భారతదేశంలో స్త్రీని దేవతగా పూజిస్తారని డప్పు కొడుతూనే వీలైనంతగా అణచివేతకి గురిచేయడం కనిపిస్తుంటుంది. పార్లమెంటులో మూడోవంతు రిజర్వేషన్ కోసం రూపొందిన బిల్లు దాదాపు 20 ఏళ్లుగా దుమ్ముకొట్టుకుని ఉంది. ఇక సమాన ఉద్యోగాలు, వేతనాలు గురించి ఏమని చెప్పుకోగలం. - నిర్జర.  

ఆడవాళ్లు ఏం చేసినా తప్పేనా!

ఆడవాళ్లు ఏం చేసినా తప్పేనా!     స్త్రీ పట్ల సమాజం ధోరణ ఎప్పుడూ చిత్రంగానే ఉంటుంది. వారిని ఓ పక్క దేవతగా పొగుడుతూనే... ఆటవస్తువుగానే చూస్తుంటుంది. స్త్రీ స్వేచ్ఛ గురించి మాట్లాడుతూనే సంకెళ్లు వేస్తుంది. ఆడవారి పట్ల ఈ ద్వంద్వ వైఖరికి సాక్ష్యంగా ఇప్పుడు ఏకంగా ఓ పరిశోధనే వెలుగులోకి వచ్చింది. ఈ మధ్యకాలం అంతా మెటర్నటీ లీవ్ గురించే మాట్లాడుతున్నారు. ఆడవాళ్లు పిల్లల్ని కన్న తరువాత ఎంతకాలం మెటర్నిటీ లీవ్ ఉంటే మంచిది? దాని కోసం ప్రభుత్వాలు ఏం చేయాలి? అంటూ తెగ ఉపన్యాసాలు వినిపిస్తున్నాయి. కానీ మెటర్నటీ లీవ్ తీసుకునే ఆడవారి గురించి సమాజం ఏమనుకుంటుంది? అన్న ఆలోచన వచ్చింది ఇంగ్లండులోని కొందరు పరిశోధకులకి. ఆలోచన వచ్చిందే తడవుగా ఓ 137 ఆడవారినీ, 157 మగవారినీ తమ ప్రయోగం కోసం ఎన్నుకొన్నారు. ప్రయోగంలో భాగంగా అభ్యర్థులందరికీ ఈమధ్యనే బిడ్డను కన్న ఒక స్త్రీ గురించి చెప్పారు. కాకపోతే ఆమె తన పిల్లవాడిని చూసుకునేందుకు మెటర్నటీ లీవ్ తీసుకుందని కొందరితో చెబితే, మెటర్నటీ లీవ్ పూర్తిగా వాడుకోకుండా ఆఫీసుకి వెళ్తోందని మరికొందరితో చెప్పారు. ఆ తర్వాత ఆ మహిళ గురించి తమ అభిప్రాయం ఏమిటంటూ వారిని ప్రశ్నించారు. అనూహ్యంగా రెండు సందర్భాలలోనూ సదరు వ్యక్తి చేసిన పనిని అభ్యర్థులు తప్పుపట్టారు. మెటర్నటీ లీవ్ని ఉపయోగించుకున్న సందర్భంలోనేమో ఆ వ్యక్తికి ఉద్యోగం పట్ల అంతగా నిబద్ధత లేదన్న అభిప్రాయం వ్యక్తమైది. మెటర్నటీ లీవ్ను వద్దనుకుని ఉద్యోగంలో చేరిన సందర్భంలోనేమో... తల్లిగా తన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఏతావాతా రెండు సందర్భాలలోనూ స్త్రీ నింద పడాల్సి వచ్చింది! ఈ అభిప్రాయాలను వ్యక్తం చేసినవారంతా కూడా 33 ఏళ్ల సగటు వయసున్న యువతే కావడం గమనార్హం. వారిలో దాదాపు సగం మంది స్త్రీలు ఉండటం మరో వైపరీత్యం! పైగా వీరంతా అభివృద్ధి చెందాయని చెప్పే ఇంగ్లండ్, అమెరికా దేశవాసులు కావడం మరో విచిత్రం. మెటర్నటీ లీవ్ పట్ల సమాజపు ధోరణ తెలుసుకునేందుకు ఈ పరిశోధన జరిగి ఉండవచ్చు. కానీ బిడ్డను కనేందుకు, తన జీవితాన్ని పణంగా పెట్టే సందర్భంలోనే ఆడవారి పట్ల ఇలాంటి వివక్ష ఉంటే... ఇక రోజువారీ సందర్భాలలో వారి పట్ల సమాజ ధోరణి ఎలా ఉంటుందో ఇక చెప్పేదేముంది! - నిర్జర.    

అమ్మతో కాసేపు

  అమ్మతో కాసేపు   గోరుముద్దలు - గోరింటాకులు, పాల బుగ్గలు - పట్టుపావడాలు, చందమామ కథలు - చద్దిఅన్నాలు ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మ మనకిచ్చే తీపి జ్ఞాపకాలు ఎన్నో లెక్కకి కూడా అందవు. మనసు వాకిటిని తడితే చాలు దొర్లుకుంటూ వచ్చే తల్లి తలపులకు ఆనకట్ట వెయ్యటం కొంచెం కష్టమే. స్కూల్ నుంచి వచ్చాకా అక్కడ జరిగినవన్నీ అమ్మకి చెప్పకపోతే  నిద్ర పట్టదు. మనం సైకిల్ తొక్కినా అమ్మ చూడాలి, చెట్టెక్కి గెంతాలన్నా అమ్మే చూడాలి. మొత్తానికి మనం ఏం చేసినా అమ్మ పక్కనే ఉండాలి. మనతో ఇంతలా అల్లుకుపోయిన అమ్మని విడిచి దూరంగా వెళ్ళాల్సి వస్తే మన ప్రాణాలని ఎవరో తెలియకుండా లాగేసుకుంటునట్టు ఉండదూ. ఎన్నేళ్ళు వచ్చినా మనం ఇంకొకరికి అమ్మ అయినా మన అమ్మ మీదున్న ప్రేమ ఇసుమంతైనా తగ్గదు.   పెద్ద చదువులకి వెళ్ళాకా పెద్ద ఉద్యోగాలు వచ్చాకా అమ్మతో గడిపే సమయం కరువవుతుంటే ఏం చేయటం. నిజంగానే మీకు అమ్మతో కాసేపు గడపి ఆమెని సంతోషంగా ఉంచాలంటే  ఎలా ప్లాన్ చేసుకోవచ్చో చూద్దామా.   అమ్మకి ఇష్టమైన కాఫీని ఆమె లేచే లోపే తయారుచేసి రెడీగా ఉంచితే? లేవగానే ఒక చిరునవ్వుతో కాఫీని అందించి చూడండి. తనకోసం ఎవరెస్ట్ శిఖరాన్ని గుమ్మం ముందు తెచ్చి ఉంచితే ఎంత ఆశ్చర్యపోతుందో అంత ఆశ్చర్యాన్ని, దాని వెనక ఆనందాన్ని అమ్మ కళ్ళల్లో చూడచ్చు.     అలాగే తనకిష్టమైన ప్లేస్ ఏముందో తెలుసుకుని ఆ ప్లేస్ కి సడన్ గా తీసుకెళ్ళి ఆమె కళ్ళల్లోకి తొంగి చూడండి. ఆ రోజంతా అమ్మని అంటిపెట్టుకుని ఉండి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ బయటనే చేసి ఇంటికి తిరిగి రండి. అంతలా తిరిగి వచ్చినా అమ్మ కళ్ళల్లో కనిపించని నీరసాన్ని చూసి మీకు నీరసం రావాలి.   అమ్మకిష్టమైన వ్యక్తులని ఇంటికి పిలిచి సర్ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేసి ఆమెకి ఆనందాన్ని ఇవ్వచ్చు. ఎప్పుడూ మన పనులతో బిజీగా ఉండే ఆవిడ తనకిష్టమైన వాళ్ళతో గడిపుతూ ఎలా సేద తీరుతుందో మీ కళ్ళతో మీరే చూడచ్చు.   ఒక మంచి ఫోటో ఆల్బం కొని  అమ్మకి సంబందించిన అన్నీ ఫొటోస్ పెట్టి  దాన్ని గిఫ్ట్ గా ఇవ్వచ్చు. తనే మరిచిపోయిన ప్రపంచాన్ని తన కళ్ళ ముందు పరవచ్చు. ప్రతిక్షణం  మనకోసమే అలోచించి తన ఉనికినే మర్చిపోయే అమ్మకి ఆనందాన్ని గుర్తుచేద్దాం.   ఇలా ఒక రోజు అమ్మని ఆనందంలో ముంచెత్తి మిగిలిన రోజుల్లో తన గురించి ఆలోచించకుండా ఉండటం మాత్రం ఎంతమాత్రం సబబు కాదు. నిజంగా అమ్మంటే ప్రేముంటే ప్రతిరోజూ ఆమె గురించి ఆలోచిద్దాం. ప్రతి క్షణం ఆమెని సంతోషంగా ఉంచుదాం.   కళ్యాణి