ఫ్లోరల్ ఫ్యాషన్... లేటెస్ట్ ప్యాషన్

Publish Date:Sep 19, 2022

ఫ్లోరల్ ఫ్యాషన్... లేటెస్ట్ ప్యాషన్!   ఒకప్పుడు పువ్వులు తలలో పెట్టుకుని మురిసిపోయేవారు. కానీ ఇప్పుడు పూలు ఒళ్లంతా పూయించుకుంటున్నారు. అర్థం కాలేదా? ఈ ఫొటోలు చూడండి అర్థమైపోతుంది. ఒకప్పుడు చిన్నపిల్లలకి పువ్వుల పువ్వుల గౌన్లు కుట్టించేవారు. కానీ ఇప్పుడు పెద్దవాళ్లకే ఈ పువ్వుల పిచ్చి పట్టుకుంది. ఆ పిచ్చి కాస్తా ఫ్యాషనైపోయింది. దాంతో ఎక్కడ చూసినా పువ్వులే. చీరలు, స్కర్ట్స్, జాకెట్స్, ఫ్రాక్స్, అనార్కలి సూట్స్... డ్రెస్ ఏదైనా సరే పూలు ఉండాల్సిందే. బట్టలు మాత్రమే కాదు... హ్యాండ్ బ్యాగ్స్, శాండిల్స్, హ్యాట్స్ లాంటి వాటన్నిటి మీద పూల డిజైన్సే. ఈ ఫ్లోరల్ ఫ్యాషన్ అందరికీ ఎంత ప్రీతి పాత్రమైపోయిందంటే... చివరికి అబ్బాయిలు కూడా పూల చొక్కాలు వేసుకుని మురిసిపోతున్నారు. ఇక సెలబ్రిటీల సంగతి చెప్పాల్సిన పని లేదు. బాబు బంగారం సినిమాలోని ఓ పాటలో నయనతార కట్టిన ఫ్లోరల్ శారీస్ ఎంత అందంగా ఉంటాయో. బాలీవుడ్ భామలైతే ప్రతి అకేషన్ కీ ఫ్లోరల్ డిజైన్స్ ఉన్న దుస్తుల్నే ప్రిఫర్ చేస్తున్నారు.     కాటన్, సిల్క్, క్రేప్ తదితర మెటీరియల్స్ పై రంగురంగుల పూలను చూస్తోంటే నిజంగానే మతిపోతోంది. కుసుమాల అందాలు చూడటానికి రెండు కన్నులూ చాలవనిపిస్తోంది. నిజానికి పూల డిజైన్ల కోసమని ప్రత్యేక ధరలేమీ లేవు. ఆ డిజైన్ ఏ మెటీరియల్ మీద వేశారన్నదాన్ని బట్టే రేటు. అందుకే ఓ చక్కని ఫ్రాక్ ఐదు వందల లోపే వచ్చేస్తోంది. చూడచక్కని చీర ఏడెనిమిదొందలకే దొరికేస్తోంది. మరింకా ఆలోచిస్తున్నారేంటి... మీరు కూడా వెంటనే ఓ మాంచి ఫ్లోరల్ డ్రెస్ కొనేయండి మరి!   - Sameera  
[

Beauty

]

ముఖానికి కొబ్బరినూనె రాసి రాత్రంతా అలాగే ఉంచితే ఏమవుతుందో తెలుసా?

Publish Date:Sep 22, 2022

ముఖానికి కొబ్బరినూనె రాసి రాత్రంతా అలాగే ఉంచితే ఏమవుతుందో తెలుసా? కొబ్బరి నూనె ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన చర్మ సంరక్షణ పదార్ధం. దీన్ని చాలా మంది ఆయిల్ బేస్డ్ మేకప్ రిమూవర్‌గా, అండర్ ఐ మాయిశ్చరైజర్‌గా ఇంకా నైట్ క్రీమ్‌గా కూడా ఉపయోగిస్తున్నారు, అయితే రాత్రిపూట ముఖం మీద కొబ్బరి నూనెను అప్లై చేయడం వల్ల గొప్ప బాడీ మాయిశ్చరైజర్‌గా పని చేస్తుందా?? అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. సహజంగానే పెద్దవాళ్ళు చలికాలంలో చలికి ఒళ్ళు పగలకుండా కొబ్బరి నూనె శరీరానికి అప్లై చేస్తుంటారు. కొంతమంది ఎంత నూనె పూసినా పెద్దగా పలితం కనిపించలేదని చెబుతుంటారు. ఎన్నో బ్యూటీ ఉత్పత్తులలో కొబ్బరి నూనెను ఉపయోగిస్తుంటారు. ఇలాంటి కొబ్బరి నూనె విషయంలో ఉన్న ప్రశ్నకు సమాధానం ఏంటి?? భారతీయుల జీవన విధానంలో కొబ్బరి నూనె!! కొబ్బరి నూనె యాంటీ బాక్టీరియల్ అయినందువల్ల ఇది ఎన్నో రకాలుగా వినియోగించబడుతుంది. ముఖ్యంగా కొబ్బరి నూనెను  ఉష్ణమండల ప్రాంతమైన భారతదేశం, శ్రీలంక వంటి దేశాల ప్రజలు శతాబ్దాలుగా వివిధ మార్గాల్లో ఉపయోగిస్తున్నారు. అంతే కాదు  ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ చర్మ సంరక్షణ పదార్థాల జాబితాలో కొబ్బరి నూనె అగ్రభాగంలో ఉంటుంది. ఇది చర్మ మంటను తగ్గించడానికి, పాడైన చర్మాన్ని నయం చేయడానికి మరియు వృద్ధాప్యాన్ని మందగించడానికి ఎంతో శ్రేష్ఠమైనదని, అందుకే చర్మసంరక్షణలో కొబ్బరి నూనె ఉపయోగించబడుతుందని నమ్ముతారు.  ఇది  చర్మం, జుట్టు ఇంకా మొత్తం ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న మల్టీఫంక్షనల్ ఆయిల్  బయటి చర్మాన్ని రిపేర్ చేయడంలో ఇది గొప్పగా హెల్ప్ అవుతుంది. పొడి చర్మానికి ఉత్తమమైనది. జుట్టుకు కొబ్బరి నూనె వల్ల కలిగే ప్రయోజనాల గురించి మన అమ్మమ్మలు, బామ్మలు ఎప్పటి నుండో చెప్పకపోయినా వాటిని మన జీవితాల్లో భాగం చేశారు. చలికి శరీరానికి పూసుకోవడం, వంటనూనెగా వాడటం, జుట్టుకు ఉపయోగించడం మన పెద్దలకు సహజమైన విషయం. అయితే   కొబ్బరి నూనె చర్మంపై ఒక తేలిక పొరను ఏర్పరుస్తుంది. అది సులభంగా పొడిబారదు. దీనిలో ఉన్న చిక్కదనం కారణంగా చర్మరంద్రాలను కప్పి ఉంచి చలి నుండి చర్మాన్ని రక్షిస్తుంది.  కొబ్బరి నూనె మాశ్చరైజర్ గ్ గా పని చేస్తుందా?? అవును కొబ్బరి నూనె గొప్ప శరీర మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.  ఇది మీ చర్మాన్ని రిపేర్ చేస్తుంది చర్మం పొడిబారకుండా కాపాడుతుంది.  మృదువైన మొటిమలు లేని చర్మం కోసం, దీన్ని సున్నితమైన మాయిశ్చరైజర్‌గా  ఉపయోగించవచ్చు. అయితే ఈ నూనెలో అణువులు పెద్ద పరిమాణాన్ని కలిగి ఉండటం వలన చర్మంలోకి చొచ్చుకుపోకుండా కేవలం రంధ్రాలను మాత్రమే కప్పి ఉంచుతుంది. అందువల్ల ఇది చర్మాన్ని డీప్ గా మాశ్చరైజ్ చేయదు.   ఇలా కొబ్బరి నూనెను కేవలం జుట్టుకు మాత్రమే కాకుండా సౌందర్య ఉత్పత్తిగా కాకుండా నేరుగా మాశ్చరైజర్ లా కూడా ఉపయోగించవచ్చు. రాత్రి సమయంలో ముఖానికి రాసుకుని అలాగే వదిలేస్తే అది గొప్ప మాశ్చరైజర్ గా పని చేస్తుంది. ముఖం చర్మాన్ని మృదువుగా, మచ్చలు, మొటిమలు లేకుండా మారుస్తుంది.                                            ◆నిశ్శబ్ద.
[

Health

]

మహిళల్లో జుట్టు నెరిసిపోవడానికి అయిదు ప్రధాన కారణాలు!

Publish Date:Sep 23, 2022

మహిళల్లో జుట్టు నెరిసిపోవడానికి అయిదు ప్రధాన కారణాలు! ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో జుట్టు తొందరగా రంగుమారి తెల్లబడటం కూడా ఒకటి. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరిలోనూ ఈ సమస్య ఎదురవుతోంది. కొందరేమో ఇది పోషకాహార లోపం అంటారు. మరికొందరు వంశపార్యపరం అని అంటారు. ఇంకొందరు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అలా అంటారు. ఇలా ఎవరికి తెలిసిన కారణాలు వారు చెప్పుకున్నా వారిలో ఖచ్చితంగా ఏదో ఒక లోపం ఉండటం వల్లనే అలా జరిగిందని డాక్టర్ల దగ్గరకు పరిగెత్తేవారు కొందరు అయితే, మార్కెట్ లో దొరికే నూనెలు, షాంపూలు పిచ్చిగా వాడేవారు కొందరు. మరికొందరు అయితే ఇక విసిగిపోయామంటూ జుట్టుకు రంగేసుకుని ఏ చింతా లేకుండా గడిపేస్తున్నారు.  అయితే ఆడవారిలో జుట్టు ఎందుకు తొందరగా నెరిసిపోతుంది??  సాధారణంగా అయితే మహిళల్లో జుట్టు పొడవు ఉంటుంది కాబట్టి జుట్టు నెరిసిపోతే తొందరగా ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. జుట్టు నెరిసిపోవడం అనేది ముసలితనానికి సూచన. వయసు పైబడే కొద్దీ జుట్టు తెల్లబడటం అనుభవంలోకి వచ్చే విషయమే. అయితే జుట్టు చిన్న వయసులోనే తెల్లబడటం ఎందుకు జరుగుతుంది?? ఈ ప్రశ్నకు పోషకాహార నిపుణులు కొందరు చెప్పిన అయిదు కారణాలు ఉన్నాయి.  జన్యుపరంగా… కొన్నిసార్లు జుట్టు తెల్లబడటం అనేది జన్యు పరమైన కారణాల వల్ల సంభవిస్తుందని పోషకార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తాతల నుండి తల్లిదండ్రులకు, వారి నుండి పిల్లలకు ఇలా ఓ దశ తరువాత జుట్టు తెల్లబడటం అనేది జరుగుతూ వస్తే అది జన్యుపరమైన కారణం అని అర్థం. దీనికి చాలా వరకు పరిష్కారాలు లేనట్టే చెబుతారు. కెఫిన్ ఆధారిత పదార్థాలు!! కాఫీ, టీ వంటివి రోజులో రొటీన్ చాలామందికి. ఆడవారు పని నుండి రిలీఫ్ కోసం ఇంట్లో ఎక్కువ కాఫీ తాగేస్తారు. ఇంకొంత మందికి ఇవి సమయానికి గొంతులో పడకపోతే పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తారు. అయితే ఇందులో ఉండే కెఫిన్ జుట్టు రంగు మారడానికి కారణం అవుతుంది. అందుకే కాఫీలు, టీలు ఎక్కువ తీసుకునే వారిలో జుట్టు తొందరగా నెరిసిపోతుంది. ఇవే కాదు ధూమపానం, మద్యపానం చేసేవారికి కూడా ఇదే సమస్య ఉంటుంది. అలాగే నూనెలో వేయించిన పదార్థాలు కూడా పోషకాలు జుట్టు కుదుళ్లకు చేరకుండా అడ్డుపడతాయి. ప్రోటీన్ లోపం!! పోషకాలు శరీర ఆరోగ్యానికే కాదు, జుట్టు చర్మం, వెంట్రుకలు మొదలైన వాటికి కూడా అవసరం అవుతాయి. మొదటే ఆడవారిలో పోషకాల లోపం ఉంటుంది. దానికి తగ్గట్టు జుట్టు కోసం అందాల్సిన పోషకాలు లభించకపోతే తొందరగా వెంట్రుకలు ప్రభావానికి లోనవుతాయి.  సాధారణంగా మనం తినే ఆహారంలో మనకు లభించే పోషకాల కంటే జుట్టు, చర్మం, గోర్లు మొదలైనవాటికి వేరే పోషకాలు అవసరం అవుతాయి. శరీరంలో ఒకో భాగానికి ఒకో పోషకం అవసరమైనట్టు జుట్టుకు తగిన పోషకాలు అందించినప్పుడే దాని పెరుగుదల బాగుంటుంది. బయోటిన్ లోపం ఉంటే జుట్టు పెరగదు, అలాగే దాని సామర్థ్యము తగ్గుతుంది. చిన్నవయసులోనే తెల్లబడుతుంది. డిప్రెషన్!! నిజంగా నిజమే!! ఒత్తిడి జుట్టు రాలిపోయేలా చేస్తుందని చాలామంది అంటారు. ఎంతోమందిలో ఆ విషయం నిజమయ్యింది కూడా.  అయితే ఎక్కువ కాలం కొనసాగే ఒత్తిడి కేవలం జుట్టు రాలిపోవడానికే కాదు జుట్టు నెరిసిపోవడానికి కూడా కారణం అవుతుంది. ఆడవారిలో ఈ సమస్య స్పష్టంగా కనబడుతుంది కూడా. ఖనిజాల లేమి!! కాపర్, సెలినియం, ఐరన్, కాల్షియం, విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్ వంటి విటమిన్లు శరీరానికి తగిన మోతాదులో లేకపోతే జుట్టు తొందరగా నెరిసిపోతుంది. ఇలా ప్రతి వయసు వారిలో కూడా జుట్టు నెరిసిపోవడానికి కారణాలు ఉన్నా మహిళల్లో ఇలాంటివి చాలా తొందరగా ఏర్పడతాయి. ఇవన్నీ పరిష్కారం చెసుకుంటే జుట్టును తిరిగి నలుపు రంగులోకి మార్చుకోవచ్చు. అయితే ఓపిక సరైన డైట్ చాలా అవసరం.                                          ◆నిశ్శబ్ద.

కాలుష్యం వల్ల ప్రెగ్నెన్సీ పోతుందా

Publish Date:Sep 21, 2022

కాలుష్యం వల్ల ప్రెగ్నెన్సీ పోతుందా..?   ఇంట్లోంచి అడుగు బయట పెట్టాలంటే చాలు ఒక యుద్దానికి వెళుతున్నంత హంగామా- ఒక స్కార్ఫ్, గ్లోవ్స్, షేడ్స్... ఇలా చాలా సిద్ధం చేసుకుంటుంటాం. కాలుష్యం గురించిన భయం అలాంటిది మరి. ఈ కాలుష్యం పుట్టిన పిల్లలకే కాదు, కడుపులో ఉన్న బిడ్డకి కూడా ప్రమాదమేనట. అదేంటో తెలుసుకోవాలంటే మాత్రం ఈ వీడియో చూడండి........  https://www.youtube.com/watch?v=-YtONTv7XUI    
[

Yoga

]

యోగాలో మహిళలకు అద్భుతమైన సాధన మార్గం!

Publish Date:Sep 17, 2022

యోగాలో మహిళలకు అద్భుతమైన సాధన మార్గం! రాత్రి అంతా హాయిగా నిద్రపోయి  ఉదయాన్నే లేచిన తరువాత మనిషికి ఎంతగానో రిలాక్స్ గా ఉంటుంది. ఉదయాన్నే ఉన్న తాజాదనం రోజు మొత్తంలో ఎప్పుడూ ఉండదు. కానీ దీన్ని అసలు గుర్తించనే గుర్తించరు మహిళలు. ఉదయం లేచిన నుండి పనుల వెంట, ఉద్యోగాల వెంట, అన్ని చక్కదిద్దుతూ తమని తాము సరిగ్గా పట్టించుకోరు కూడా. అలాంటి మహిళలు ప్రతి రోజూ ఉదయాన్ని ప్లాన్ చేసుకోవడం వల్ల రోజు మొత్తం అద్భుతమైన అనుభూతిని పొందుతారు. యోగాలో ఒక భాగమైన ఆధ్యాత్మికత అనేది గొప్ప పాత్ర పోషిస్తుంది. మహిళలను మానసికంగా ఎంతో దృఢంగా ఉండేలా చేస్తుంది.  పైగా దీనికి ఎక్కువ సమయం కూడా అవసరం లేదు. అధ్యాత్మికతలో ధ్యానం దే అగ్రస్థానం. ఈ ధ్యానం వల్ల శారీరకంగా  అంతర్గతంగా గొప్ప సామర్థ్యము ప్రోగవుతుంది. ఇది ఎంతో మంది అనుభవం ద్వారా సాధించేది. అందుకే మాటల్లో చెప్పడం తక్కువ అవుతుంది యోగా ద్వారా పొందే మేలు గురించి. ప్రతి రోజూ ఉదయాన్నే కొద్దిసేపు ధ్యానం చేయడం వల్ల ఒకటి కంటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. అందరూ ధ్యానం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందని అనుకుంటారు. అది నిజమే అయినప్పటికీ దానికి మించిన లాభాలు ధ్యానం వల్ల కలుగుతాయి. ఎన్నో ఏళ్ల నుండి శరీరాన్ని అంటిపెట్టుకున్న దీర్ఘకాల వ్యాధులు ధ్యానం ద్వారా తగ్గుతాయంటే ఆశ్చర్యమేస్తుంది కానీ అది ముమ్మాటికీ నిజం. దీన్ని సైన్స్ కూడా ఆమోదించింది. ధ్యానం వల్ల ఒత్తిడి, నిరాశ, ఆందోళన తగ్గడంతో పాటు, జ్ఞాపకశక్తి పెరగడం, శరీరంలో ఉన్న రోగాల తాలూకూ కణాలు నశించడం జరుగుతుంది. ప్రతిరోజూ కనీసం 2 నుండి 5 నిమిషాలు ధ్యానంతో మొదలుపెట్టి మెల్లగా సమయాన్ని పెంచుకుంటూ ధ్యానంలో నిమగ్నమవచ్చు.  ప్రతిరోజూ ఉదయాన్నే చేసే 5 నిమిషాల ధ్యానం రోజు మొత్తాన్ని సమర్థవంతంగా నిర్వహించే శక్తిని ఇస్తుంది.  రాత్రంతా మెదడు తరంగాలు ఆల్ఫా ఫ్రీక్వెన్సీలో ఉన్నందు వల్ల  ఉదయాన్నే మేల్కొన్న తరువాత ధ్యానం చేయడానికి సరైన సమయం అవుతుంది. అది  ఉపచేతన మనస్సును రీప్రోగ్రామింగ్ చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది.  రోజు మొత్తంమీద నియంత్రణను కలిగి ఉండటంలో ధ్యానం సహకరిస్తుంది. అంతే కాదు ప్రతిరోజు ఉదయమే ధ్యానం చేయడం వల్ల కలిగే ఫలితాలు ఇదిగో ఇవే…. మానసిక స్థితిని పెంచుతుంది:  ధ్యానం ఆనందం, ఆశావాదం, సంతృప్తి మొదలైన భావోద్వేగాలను మెరుగుపరిచే హార్మోన్లను విడుదల చేస్తుంది. అందుకే ధ్యానం మహిళలకు ఎంతో ముఖ్యం.  అవగాహనను మెరుగుపరుస్తుంది:  భావోద్వేగాల గురించి తెలుసుకోవడంలో ధ్యానం గొప్పగా సహాయపడుతుంది.  మీరు ఎలా అనుభూతి చెందాలనుకుంటున్నారో మీకు మీరే నిర్ణయించుకోవచ్చు. ఎప్పుడైతే ఎంపిక మీది అవుతుందో అప్పుడు మానసికంగా శక్తివంతులు అవుతారు. ఇలా పెరిగే స్వీయ-అవగాహన జీవితం మీద నిర్ధిష్టమైన స్పష్టత ఏర్పరిచి దాన్ని వృద్ధి చేస్తుంది. ఇలాంటి స్పష్టత ఉంటే రోజును ఎవరికి వారు సులభంగా తీర్చిదిద్దుకోగలుగుతారు.   ఆందోళనను తగ్గించి మనస్సును ప్రశాంతపరుస్తుంది:  ధ్యానం లోతైన ప్రశాంతతను కలిగిస్తుంది. మనిషి అలవాటైపోయిన కొన్ని చెడు మార్గాలను మెల్లగా తగ్గించడంలో సహాయపడుతుంది. మనిషి మనసు చాలా అల్లరిది. దాన్ని కోతితో పోల్చడం అందరికీ తెలిసినదే. అలాంటి అల్లరి మనసును నియంత్రణలో ఉంచే గొప్ప మార్గం ద్యానమే. రోజువారీ అసంబద్ధమైన అలవాట్లు మెల్లిగా తగ్గిపోయి, ఒక మంచి మార్గం ఏర్పాటవుతుంది ధ్యానం వల్ల. ఒత్తిడి, ఆందోళనను నివారిస్తుంది:  ధ్యానం అనేక రకాల వైద్యం ప్రయోజనాలను కలిగి ఉన్న పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది.  ఇది గుండె మరియు శ్వాస వేగాన్ని తగ్గిస్తుంది.  ఇది కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది, అంతేకాదు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. పైన చెప్పుకున్నవి మాత్రమే కాకుండా ఏకాగ్రతను పెంచుతుంది. శరీరంలో ఉత్సాహం స్థాయిలు పెంచుతుంది. సంతృప్తిగా ఉండేందుకు సహాయపడుతుంది. ఆరోగ్యాన్ని గొప్పగా మారుస్తుంది. మైగ్రేన్, రక్తపోటు వంటి సమస్యలను తగ్గిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ల నియంత్రణను క్రమపద్ధతిలో ఉంచుతుంది. అందుకే మహిళలు సమయం లేదనే సాకు చెప్పకుండా ప్రతిరోజు ఉదయం 5 నిమిషాలు అయినా ధ్యానం చేసుకోవడం ఉత్తమం.                                        ◆నిశ్శబ్ద.

The extreme Power of Yoga

Publish Date:Sep 2, 2022

ఈ రెండు విషయాలే పిల్లలను చురుగ్గా ఉంచుతాయి!

Publish Date:Sep 12, 2022

ఈ రెండు విషయాలే పిల్లలను చురుగ్గా ఉంచుతాయి! జీవితంలోకి పిల్లలు వచ్చాక తల్లిదండ్రులుగా బాధ్యతలు పెరుగుతాయి. కేవలం పిల్లల అవసరాలు తీర్చడం మాత్రమే కాకుండా పిల్లలను మంచి నడవడిక కలిగిన వారిగా తీర్చిదిద్దడం పెద్దలకు ఒక సవాల్ అనుకోవచ్చు. కొంచెం ఎదిగిన పిల్లలకు అయితే ఏదైనా చెప్పడం, వారికి  తగిన విధంగా మార్గాలు వెతకడం కొంచెం ఓపిక తెచ్చుకుంటే సాధ్యమవుతుంది. కానీ అయిదు సంవత్సరాల లోపు పిల్లలకు ఏ విషయమైనా అర్థం చేసుకునే సామర్థ్యము ఉండదు. వారిని ఓ మంచి నడవడికలోకి తీసుకెళ్లాలన్నా, వారిని ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తగా చూసుకోవాలన్నా ప్లే స్కూల్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే పిల్లలు ప్లే స్కూల్ కి వెళ్ళిపోతే ఇక వారు దారిలోకి వచ్చేసినట్టే అనుకోవడం చాలా పొరపాటు.  మరేం చెయ్యాలి అనేది అందరి సందేహం!! సన్నద్ధం చెయ్యాలి!! పిల్లలను ప్లే స్కూల్ కి పంపడానికి ముందు వారిని ఇంట్లోనే సన్నద్ధం చెయ్యాలి. వారితో ఆటలు ఆడించడం ద్వారా చిన్న చిన్న మెథడ్స్ పూర్తి చేయడం, కార్డ్ బోర్డ్ లతో పజిల్స్ చేయించడం. బొమ్మలు చూపించి వాటిని గుర్తుపట్టించడం వంటివి చెయ్యాలి. నిద్రతో జాగ్రత్త!! ప్రతి ఒక్కరికీ వయసు తగ్గట్టు నిద్ర చాలా అవసరం. అయితే ఈ కాలం పిల్లలు అంత త్వరగా పడుకోరు. తల్లిదండ్రులు పనులలో పడి అర్ద రాత్రులు వరకు మేలుకుని ఉండటంతో పిల్లలు కూడా వారినే అనుకరిస్తారు. అందుకే పిల్లలకు సరైన నిద్రలేకపోవడం చాలా సమస్యలు తెచ్చి పెడుతుందని పిల్లల ఆరోగ్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలవాటు చేస్తున్న చేటు!! మీ పిల్లలకు మీరే చేటు చేస్తున్నారు. దాన్ని ఎంచక్కా అలవాటు చేస్తున్నారు కూడా. ఎవరూ తమ పిల్లలను తాము పాడుచేసుకోరు కదా అనే ఆలోచన తళుక్కున మెరుస్తుంది. కానీ చెబుతున్న మాట నిజం. పెద్దలు చేస్తున్న పనులలో పిల్లలు అడ్డు వస్తున్నారనో, వారు అల్లరి చేస్తున్నారనో, వారిని కనిపెట్టుకుని ఉండటం కష్టమవుతోందనో ఇలా బోలెడు కారణాలు ఉన్నాయి తల్లిదండ్రులు చేస్తున్న పని మొబైల్స్ చేతికి ఇవ్వడం. మొబైల్స్ లో ఏ కార్టూన్ ఛానెల్ నో ఓపెన్ చేసి వారి చేతిలో పెట్టేసి పెద్దవాళ్ళు వారి మానాన వారు పనులు చేసుకుంటూ ఉంటారు.  పెద్దలు గమనించాల్సిన విషయం ఒకటుంది. పిల్లలు తమ జీవితంలోకి వస్తున్నారని తెలిసినప్పటి నుండే వారికంటూ సమయాన్ని ఇవ్వగలిగేలా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే పిల్లల విషయంలో పెద్దలు న్యాయం చేసినట్టు అవుతుంది.  జాగ్రత్తలు!! పిల్లల విషయంలో పెద్దవాళ్ళు తీసుకోవలసిన జాగ్రత్తల్లో వారి ఆహారం, నిద్ర చాలా ముఖ్యమైనవి. పిల్లల వయసుకు తిండి, నిద్ర మాత్రమే ముఖ్య అవసరాలు. అలాగని పిల్లలు తిండి తినట్లేదనే కారణంతో కుర్కురే, బిస్కెట్స్ వంటి స్నాక్స్ ను. పిల్లల కోసం వండే సమయం ఉండట్లేదనే కారణంతో ప్యాకింగ్ చేయబడిన ఆహారాన్ని ఎంపిక చేసుకుంటే చాలా పెద్ద తప్పిదం జరిగిపోతుంది. ఇన్స్టంట్ ఫుడ్స్ పిల్లలకు అసలు ఇవ్వకూడదు. ఎలాంటి పోషకాలు లేని ఆహారాన్ని పిల్లలకు ఇవ్వడమనేది చాలా బాధపడాల్సిన విషయం. పిల్లలకు పొరపాటున ఆ తిండి అలవాటు అయిపోతే ఇక వారిని సాధారణ ఆహారం వైపుకు తీసుకురావడం చాలా కష్టమవుతుంది. అందుకే పిల్లలకు ఎప్పుడూ ఆరోగ్యకరమైన, పోషకాలు కలిగిన తాజా ఆహారాన్ని మాత్రమే ఇవ్వాలి. ఇక నిద్ర విషయానికి వస్తే ఇప్పటికాలం భార్యాభర్తలకు ఎన్ని పనులున్నా ఎవరో ఒకరు రాత్రి తొమ్మిది గంటలలోపు పిల్లలతో కలసి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. పెద్దవాళ్ళు పక్కన ఉంటే పిల్లలు తొందరగా నిద్రపోతారు. అలాగే పిల్లలకు చిన్న చిన్న నీతి కథలు చెబుతూ నిద్రపుచ్చవచ్చు. అదే వారిలో నైతిక వ్యక్తిత్వానికి బీజమవుతుంది.  ముఖ్య విషయం!! అందరూ తెలుసుకోవలసిన మరొక ముఖ్య విషయం ఏమిటంటే పిల్లలు ప్రతిరోజు కనీసం 10 గంటల పాటు నిద్రపోతే వారు ప్లే స్కూల్ కు వెళ్ళాక చాలా చురుగ్గా అన్ని నేర్చుకుంటారు. శాస్త్రజ్ఞుల పరిశోధనల్లో ఈ విషయం నిరూపితమైంది కూడా.  పిల్లలకు వారి వయసుకు తగినట్టుగా మంచి ఆహారం, మంచి నిద్ర ఇవ్వగలిగితే, వారికి కొంత సమయం కేటాయించి వారిలో నైతిక విలువలు పెంపొందించగలిగితే వారి భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా ఉండదు అనే మాట అక్షరాల నిజం.                                       ◆నిశ్శబ్ద.

మహిళల కోసం గొప్ప సంపాదనా మార్గాలు!

Publish Date:Sep 24, 2022

మహిళల కోసం గొప్ప సంపాదనా మార్గాలు! సొంత సంపాదన ప్రతి మహిళ ఆశ. సొంతంగా డబ్బు సంపాదించుకోవడం, ఆర్థికంగా మెరుగు పడటం. తన అవసరాలకు తను హాయిగా సంతోషంగా, స్వేచ్ఛగా ఖర్చుపెట్టుకోగలగడం ప్రతి మహిళకూ ఎంతో అవసరం కూడా. ప్రతి రూపాయికి ఇంట్లో మగవాళ్ల ముందు, పెద్దవాళ్ళ ముందు చెయ్యి చాపడం మహిళలకు ఇబ్బందిగానే ఉంటుంది. ముఖ్యంగా సగటు మధ్యతరగతి మహిళలు ఇంటి ఖర్చులను, అన్ని రకాల ఆర్థిక అవసరాలను చక్కబెడుతూ ఉండటం వల్ల వారి దగ్గర మిగిలేది ఏమి ఉండదు. ఇంకా చెప్పాలంటే వారు చేసే చిన్న చిన్న పనుల ద్వారా సంపాదించే డబ్బును కూడా ఇంటి అవసరాలకు ఉపయోగిస్తారు.  మహిళలు ఇంటి పట్టున ఉంటూ సంపాదించడానికి ఆసక్తి చూపుతారు. అలాంటి వారికి కొన్ని సంపాదనా మార్గాలు ఇవిగో…… యోగా ట్రైనర్!! దీనికి అనుభవం ఉంటే ఖచ్చితంగా గొప్ప సంపాదనా మార్గం అవుతుంది. కాస్త టెక్నాలజీ తోడైతే ఆన్లైన్ లో యోగా పాఠాలు చెప్పేయొచ్చు. నేటి కాలంలో మనుషులు ఎక్కువ మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. వీటికి యోగ, మెడిటేషన్ అనేది గొప్ప సొల్యూషన్. చాలామంది శారీరకంగా జిమ్ లో కష్టపడటం కంటే మానసికంగా ఫిట్ గా ఉండటానికి యోగ, ధ్యానం గొప్ప పరిష్కార మార్గాలని తెలుసుకున్నారు. యోగాకు ప్రాధాన్యత పెరిగిన నేటి కాలంలో యోగ శిక్షకులుగా ఇంట్లోనే ఉంటూ సంపాదించవచ్చు మహిళలు. కెరీర్ కౌన్సిలర్స్!! జీవితం మీద మంచి అవగాహన ఉన్నవారు కెరీర్ కౌన్సిలర్ లుగా మారవచ్చు. ముఖ్యంగా కొన్ని రకాల కోర్స్ లు కూడా అందుబాటులో ఉంటాయి ఇవి. వాటిని పూర్తి చేస్తే కౌన్సిలర్ లు గా కొత్త ఉద్యోగం మొదలుపెట్టేయచ్చు. విద్యార్థులు, నిరుద్యోగులు సరైన అవగాహన లేక సందిగ్ధంలో ఉన్నవారు ఎంతో మంది ఉంటారు. పెద్ద పెద్ద కౌన్సిలర్ల దగ్గరకు వెళ్లలేక ఆలోచనల్లో పడిపోయి ఉంటారు. ఇలాంటి వాళ్లకు మంచి సలహాలు సూచనలు అందిస్తుంటే జీవితంలో తృప్తి కూడా దొరుకుతుంది. టీచింగ్!! ఆన్లైన్ లో క్లాసులు తీసుకోవడం ఇప్పటి కాలంలో రొటీన్. ఎక్కడో దూరంగా ఉండి సరైన ఉపాధ్యాయులు దొరకని వారు ట్యూషన్ కోసం ఆన్లైన్ టీచింగ్ ను అప్రోచ్ అవుతారు. కేవలం విద్యార్థులకు మాత్రమే టీచ్ చేయడం టీచింగ్ కాదు. వంట, డాన్సింగ్, మ్యూజిక్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్ ఇలా చాలా రకాల విషయాలు ఆన్లైన్ లో టీచ్ చేయవచ్చు. బేకరీ ఫుడ్స్!! కేక్ లు, స్నాక్స్ వంటివి చక్కగా చేయడం వచ్చి ఉంటే వాటిలో మీ సృజనాత్మకతను మేళవించి బేకరీ ఐటమ్స్ ను తయారు చేసి అమ్మవచ్చు. ప్రస్తుత కాలంలో ఈ బేకరీ ఫుడ్స్ కు మంచి డిమాండ్ ఉంది. కాబట్టి వీటిని ఫాలో అవచ్చు. కంటెంట్ రైటర్!! ఇంట్లోనే ఉంటూ చేయదగిన మంచి పని ఇది. కథలు, వ్యాసాలు చక్కగా రాయగలిగితే మంచి భవిష్యత్తు ఉంటుంది. మహిళల గురించి, పిల్లల గురించి, సమాజం గురించి, విద్య, ఉద్యోగం, కెరీర్ టిప్స్, గైడెన్స్, ఫ్యామిలీ కౌన్సెలింగ్, డెవోషనల్ ఇలా చాలా రకాల విషయాలు ఉంటాయి. ఆసక్తిని బట్టి మంచి మంచి టాపిక్స్ ఇవ్వచ్చు. డే కేర్ సర్వీస్!! చాలా మంది తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్ళిపోతే చిన్న పిల్లలను చూసుకునేవారు వుండరు. ఇలాంటి వారి కోసం డే కేర్ సర్వీస్ లు ఉంటాయి. పిల్లలతో గడపడం, పిల్లలను చూసుకోవడం ఇష్టముంటే డే కేర్ సర్వీస్ ను స్టార్ట్ చేయవచ్చు. ఇది మంచి వ్యాపారమవుతుంది కూడా. అయితే చట్టపరంగా కొన్ని అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది వాటిని పూర్తి చేస్తే సరిపోతుంది. ఇలా మహిళలకు మంచి సంపాదనా మార్గాలు ఉన్నాయి. ఇవన్నీ ఎంతో విభిన్నమైనవి కూడా.                                      ◆నిశ్శబ్ద.

Sankranthi Muggulu With Flowers

Publish Date:Jan 16, 2022

Sankranthi Muggulu With Flowers Rangoli Design which resembles lovely and fairly in your limit. It is facilitated to draw at your house.You will certainly likewise add shades of your choice and this makes your home looks very beautiful.

Pongal Muggulu

Publish Date:Jan 13, 2022