నైట్ పార్టీలకు సీక్రెట్ మేకప్ ఇదిగో….
నైట్ పార్టీలకు సీక్రెట్ మేకప్ ఇదిగో….
పార్టీలు అంటేనే చాలా ప్రత్యేకం. యువతకు ఈ పార్టీల విషయంలో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. పార్టీలలో ఎంత ధూమ్ ధామ్ గా ఎంజాయ్ చేద్దామా అని ఎదురుచూస్తూ ఉంటారు. ఎవరెవరు ఎప్పుడు పార్టీలకు పిలుస్తారా అని చూసేవారు కూడా కొందరు. అయితే పార్టీలు అంటే సాధారణంగా బయటకు, కాలేజిలకు, మార్కెట్ లకు వెళ్ళిపోయినట్టు కాదు. పార్టీలలో జరిగే సందడి ఎంతో అక్కడికి వచ్చేవారు అంతే గ్రాండ్ గా ఉంటారు. మరి వారి మధ్యన కాజువల్ గా వెళ్ళిపోతే స్పెషల్ గా నిలిచేది ఎలా?? అందులోనూ పార్టీలలో అమ్మాయిలు ఎంతో స్పెషల్ కూడా.
ఈ పార్టీలలో డే పార్టీలు, నైట్ పార్టీలు అని రెండు రకాలుగా ఉంటాయి. చీకటి వేళ వెలుగుల్లో అమ్మాయిలు మరింత ఆకర్షణగా కనిపించాలంటే తప్పక కొన్ని మేకప్ టిప్స్ ఫాలో అవ్వాలి. నైట్ పార్టీలకు సాధారణంగా వేసుకునే బేసిక్ మేకప్ పనికిరాదు. దీనికి ప్రత్యేకమైన మేకప్ వేసుకోవాలి. దానికి ఉపయోగించాల్సినవి ఏంటంటే...
లిప్ షేడ్...
పగటి సమయంలో పార్టీలకు అయితే న్యూడ్ బీజ్ లాంటి రంగులతో మేకప్ మ్యానేజ్ చేయచ్చు కానీ రాత్రి పార్టీలకు అది చెల్లదు. దీనికోసం ముదురు ఎరుపురంగు లిప్ స్టిక్ లు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అందుకే అలాంటి రంగులే ఎంచుకోవాలి.
ఐ షాడో..
నైట్ పార్టీస్ లో స్పెషల్ గా షైన్ అవ్వాలంటే ఐ షాడో ఎంపిక అదిరిపోవాలి. ముఖ్యంగా చీకట్లో మెరిసిపోవడానికి వాడే ఐ షాడో గ్లిట్టర్ ఉన్నది వాడాలి.
బేస్ ఫిక్సింగ్..
వేసుకునే మేకప్ చెక్కుచెదరకుండా ఉండాలంటే మేకప్ సెట్టింగ్ స్ప్పే వాడాలి. ఒక వేళ అది అందుబాటులో లేకపోతే ఫౌండేషన్ మీద కాంపాక్ట్ పౌడర్ అద్దుకోవాలి. అలాగే బేస్ ఫిక్స్ చేయడంలో జాగ్రత్తలు పాటించాలి. దీనికోసం కొంత ఫౌండేషన్, బ్యూటీ బ్లెండర్ రెండూ కలిపి వాడుకోవాలి.
ఐ లైనర్..
మేకప్ ఎంత జాగ్రత్తగా బాగా వేసుకున్నా ఆ మేకప్ లుక్ అదిరిపోవాలి అంటే కనురెప్పలకు నియాన్ ఐ లైనర్ బెస్ట్ ఎంపిక. దీన్ని వాడితే చాలా బాగుంటుంది.
షార్ప్ లుక్…
షార్ప్ లుక్ పెట్టుకోవడం వల్ల చాలా ఆకర్షణ ఉంటుంది. ముక్కు, బుగ్గలు, కనుబొమ్మలు వీటిని చెక్కినట్టుగా ఉండేలా షార్ప్ లుక్ ఉండటం కోసం బ్రౌంజర్ తో కాంటూర్ చేసుకోవాలి.
బ్లషర్..
సాధారణంగా బ్లషర్ వేసుకున్నప్పుడు అది కొన్ని గంటలకే చెదిరిపోతుంది. అందుకే బ్లషర్ ను చెక్కిళ్ళకు కూడా అప్లై చేసుకోవాలి.
ఐ లాషెస్…
కనురెప్పలు అందంగా కనబడటం కోసం ఐ లాషెస్ ఉపయోగించవచ్చు. దీని కోసం ఫాల్స్ ఐ లాషెస్ ఉపయోగించవచ్చు. లేదా దాని బదులు మస్కారా ఉపయోగించవచ్చు.
హైలైటర్…
ఈ హైలైటర్ మేకప్ చివర్లో ఫీనిషింగ్ టచ్ ఇస్తుంది. దీన్ని చెక్కిళ్ళు, బ్రో బోన్ మీదా అప్లై చెయ్యాలి.
పైన చెప్పుకున్నవి అన్ని నైట్ పార్టీస్ కోసం వేసుకునే మేకప్ లో చేర్చితే చీకటి రాత్రిలో జిగేలు మని మెరుస్తారు. మీరే స్పెషల్ అట్రాక్షన్ అవుతారు.
◆నిశ్శబ్ద.