మచ్చలేని చర్మానికి భలే చిట్కాలు!
మచ్చలేని చర్మానికి భలే చిట్కాలు!
అమ్మాయిలు అందానికి కేరాఫ్ అడ్రస్ లు. అయితే అమ్మాయిలను నస పెట్టె విషయాలు కొన్ని ఉంటాయి. అందానికి ఏమాత్రం ఆటంకంగా ఏదైనా అనిపించినా అమ్మాయిలకు చెప్పలేనంత ఖంగారు పుడుతుంది. ముఖం మీద మొటిమ అయినా, అక్కడక్కడా అనుకోకుండా ప్రత్యక్షం అయ్యే మచ్చలు అయినా చాలా చిరాకు తెప్పిస్తాయి. ఏదో ఒక మచ్చ అయితే పర్లేదు, చందమామ మీద చిన్న కుందేలులా బానే ఉంటుంది. ఇక అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం వాటిని భరించలేనంత చిరాకు వస్తుంది అమ్మాయిలకు.
చర్మరంధ్రాలలో దుమ్ము, మురికి, జిడ్డు వంటివి పేరుకునిపోవడం వల్ల సాదారణంగా ముఖం మీద తెల్ల మచ్చలు, నల్లమచ్చలు వస్తూనే ఉంటాయి చాలామందిలో. అయితే ఆ మచ్చలు రాకుండా ఉండటానికి వచ్చినవి మాయమయ్యేలా చేసే మ్యాజిక్ చిట్కాలు కూడా ఉంటాయి. ముఖానికి ఏదేదో పూసి రాసి పోగొట్టడమే పరిష్కారం కాదు ఇంకా వేరే చమక్కులు ఉంటాయి.అవి తెలుసుకుంటే మచ్చలకు బై బై చెప్పవచ్చు.
క్లెన్సింగ్ అండ్ స్క్రబ్బింగ్!!
ప్రతి పదహాయిదు రోజులకు ఒకసారి ముఖానికి క్లెన్సింగ్ ఇంకా స్క్రబ్ చేయడం వల్ల మృతకణాలు తొందరగా తొలగిపోతాయి. మృతకణాల వలనే మచ్చలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతి 15 రోజులకు ఒకసారి తాజా వెజిటబుల్ జ్యుస్ తో చర్మాన్ని క్లెన్స్ చేసుకోవాలి.
క్లెన్సింగ్ కోసం తక్కువ చెక్కరలు ఉన్న ఆరంజ్, దానిమ్మ, ఆపిల్ వంటి పండ్ల రసాలు కూడా ఉపయోగించవచ్చు.
మచ్చలు ఏర్పడటానికి కొన్ని రకాల ఆహారాలు కారణం అవుతాయి. నూనెలో వేయించిన పదార్థాలు, చీజ్, చాక్లెట్స్, బేకరీ ఫుడ్స్ మొదలైనవి కనీసం ఆరునెలల పాటు అవాయిడ్ చెయ్యాలి. ఇలా చేయడం వల్ల శరీరం శుద్ధి అవుతుంది.
జింక్, విటమిన్-ఎ, విటమిన్-సి మొదలైన విటమిన్స్ తప్పనిసరిగా రోజువారీ ఆహారంలో భాగంగా ఉండేలా చూసుకోవాలి.
కొవ్వులు తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారంలో చిరుధాన్యాలు, మొలకలు, డ్రై ఫ్రూట్స్, తాజా ఆకుకూరలు, కూరగాయలు తప్పనిసరిగా తీసుకోవాలి.
అద్బుతమైన ఆహారాన్ని రెగులర్ గా తీసుకోవడం వల్ల ఎంతో గొప్ప చర్మం సొంతమవుతుంది. ముఖ్యంగా చర్మం ఎంతో అద్భుతంగా ఉండాలంటే చర్మ కాంతిని మెరుగుపరిచే, పాడైన చర్మాన్ని రిపేర్ చేసే తాజా జ్యుసులు తీసుకోవాలి. క్యారెట్, టమాటా కాంబినేషన్ జ్యుస్ ఎంతో గొప్పగా సహాయపడుతుంది.
బీట్రూట్ లో ఉండే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని క్లెన్స్ చేయడంలో అద్భుతంగా పని చేస్తుంది. కాబట్టి దాన్ని డైట్ లో భాగం చేసుకోవాలి. బీట్రూట్ జ్యుస్ గా తీసుకున్నా మంచి ప్రయోజనం ఉంటుంది.
ఈ చిట్కాలు అన్ని పాటిస్తే ముఖం మీద ఏ రకమైన మచ్చలు రావు. అన్నిటికంటే ముఖ్యంగా ఒత్తిడిలేని జీవితాన్ని సంపాదించాలి. ఒత్తిడి మనిషికి మానసిక సమస్యలని మాత్రమే కాదు శారీరక సమస్యలను కూడా సృష్టిస్తుంది. మచ్చలేని జీవితమే కాదు, మచ్చలేని చర్మం కూడా సాధ్యమే మరి.
◆నిశ్శబ్ద.