అందమైన చర్మం కోసం చర్మసంరక్షణ ఇలా...!

 

 అందమైన చర్మం కోసం చర్మసంరక్షణ ఇలా...!

ఆడవారికి చర్మ సంరక్షణ మీద చాలా శ్రద్ధ ఉంటుంది. అందుకోసం ఎన్నో ఫాలో అవుతుంటారు. వాటిలో చర్మ సంరక్షణ కోసం బోలెడు వాణిజ్య ఉత్పత్తులను వాడుతుంటారు. చర్మానికి సహజత్వాన్ని ఇచ్చే బోలెడు ఉత్పత్తులు మార్కెట్ లో ఉంటున్నాయి. కొనుగోలు చేయడం నుండి వాటిని ఉపయోగించడం వరకు చాలామంది పొరపాట్లు చేస్తుంటారు. 

మార్కెట్ లో బాగా అమ్ముడుపోతున్న ఉత్పత్తులను కొని వాడాలని ఎవరికి ఎంత ఆరాటం ఉన్నా చర్మ తత్వాన్ని అనుసరించి మాత్రమే ప్రొడక్ట్స్ కొనుగోలు చేయాలి అనే విషయాన్ని మరచిపోకూడదు. అలాగే వాటిని వాడే విషయంలో కొన్ని జాగ్రత్తలు, సరైన సమయం ముఖ్యం. వాడుతున్న  ఉత్పత్తి ఏదైనా చర్మం మీద పూయగానే అది చర్మంలోకి ఇంకిపోవడానికి కూడా సరైన సమయం ఇవ్వాలి.

ఏముండాలి??

హైలురోనిక్ యసిడ్ అనే పదార్థం ఉన్న ఉత్పత్తులను వాడితే చర్మం హైడ్రేటింగ్ గా ఉంటుంది.

రెటోనోల్ అనే పదార్థం ఉన్న ఉత్పత్తులు వాడితే చర్మం యవ్వనంగా ఉంటుంది. దీన్నే యాంటీ ఏజింగ్ అంటారు.

చర్మం ఆరోగ్యవంతంగా ఉండటానికి విటమిన్-సి అవసరం అవుతుంది.

స్కిన్ టోన్ మెరుగు పరచడానికి యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఉత్పత్తులు అవసరం. అలాగే సన్ స్క్రీన్ సెలక్షన్ కూడా బాగుండాలి.

అండర్ ఐ సీరమ్, పిగ్మెంటేషన్, మొటిమల కోసం సెబోరియా వంటి పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.

ఉత్పత్తులను సరైన క్రమంలో అప్ప్లై చేయడం నుండి వాటికి కేటాయించవలసిన సమయం వరకు అన్నీ గమనించుకోవాలి.

పాటించాల్సినవి!!

నిజం చెప్పాలంటే ముఖారవిందం కోసం తాపత్రయపడేవాళ్ళు ఎక్కువ. అందంగా కనిపించడం కోసం మేకప్ వేయడం సహజం. 

మొదట అందరూ  లిక్విడ్ అప్లై  చేస్తుంటారు. దాన్ని మార్చి లిక్విడ్ నుండి క్రీమ్ ను చేంజ్ అవ్వాలి. దీనివల్ల పైపూతగా పూసేవి చర్మంలోకి వెళ్లకుండా ఈ క్రీమ్ సహాయపడుతుంది.

స్కిన్ కేర్ విషయంలో వాడే ప్రొడక్ట్స్ ఏవైనా సరే చాలా పలుచని పోరలాగా ఉండాలి. అంతే తప్ప పెద్ద పెద్ద మొత్తం పూసేయకూడదు.

ఇలా అప్లై చేయాలి!!

మొదట క్లెన్సర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత టోనర్ ఉపయోగించడాలి. 

సీరమ్, ఐ క్రీమ్ ఉపయోగించాలి. వీటి తరువాత మాశ్చరైజర్, సన్ స్క్రీన్ వాడాలి. సన్ స్క్రీన్ తరువాత మేకప్ కూడా వేసుకోవచ్చు.

చాలా మంది ఉదయం ఒక విధముగా, రాత్రి ఒక విధంగా చర్మ సంరక్షణ ఫాలో అవుతారు.

డే టైమ్!!

డే టైమ్ లో ఫస్ట్ క్లెన్సర్ ఉపయోగించాలి. దాని తరువాత విటమిన్-సి సీరమ్ అప్లై చేయాలి. దాని తరువాత స్పాట్ ట్రీట్మెంట్(మొటిమలు, పిగ్మెంటేషన్ ఉన్న ప్రాంతాల్లో జాగ్రత్తలు) దీని తరువాత మాశ్చరైజర్ అప్లై చేయాలి. మాశ్చరైజర్ అప్లై చేసిన తరువాత లాస్ట్ లో సన్ స్క్రీన్ తో ఫీనిషింగ్ టచ్ ఇవ్వాలి.

నైట్ టైమ్!!

చాలామంది ఉదయం సమయాల్లో తీసుకునే జాగ్రత్తలు రాత్రి సమయం తీసుకోరు. కానీ రాత్రి సమయంలో జాగ్రత్తే చాలా ముఖ్యం.

ఉదయమంతా మేకప్ తో మునిగిన ముఖచర్మాన్ని రాత్రిపూట ఒకటికి రెండు సార్లు క్లీన్ చేయాల్సి ఉంటుంది.

మొదట కొబ్బరి నూనె లేక వాజిలైన్ వంటివి ఉపయోగించి ముఖం మీద మేకప్ తొలగించాలి.

ఆ తరువాత క్లెన్సర్ సహాయంతో ముఖాన్ని రెండోసారి శుభ్రం చేసుకోవాలి. అప్పటికి కానీ ముఖం మీద మేకప్ తాలూకూ రంగులు పోవు.

వీటి తరువాత కళ్ళ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఐ లాషెస్ తాలూకూ  రసాయనాలు, ఐ లైనర్, ఐ షాడో, కాటుక వంటివన్నీ శుభ్రం చేయాలి.

వీటి తరువాత ముఖం మీద ఉండే మొటిమలు, పిగ్మెంటేషన్ మొదలైన వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.ముఖాన్ని శుభ్రం చేసుకునేటప్పుడు మొటిమల మీద గట్టిగా రుద్దడం చేయకూడదు. 

వీటన్నిటి తర్వాత యాంటీ ఏజింగ్ కోసం ఏదైనా అప్లై చేసి చివరగా మాశ్చరైజర్ రాసుకుని పడుకోవాలి.

ప్రముఖ మోడల్స్, సెలెబ్రిటీస్ మొదలైనవారు ఈ స్కిన్ కేర్ ని రొటీన్ గా మార్చేసుకుని ఉంటారు. మరి అందమైన చర్మం కావాలంటే ఆ మాత్రం కష్టపడక తప్పదుగా.

                                     ◆నిశ్శబ్ద.