ముఖానికి కొబ్బరినూనె రాసి రాత్రంతా అలాగే ఉంచితే ఏమవుతుందో తెలుసా?
ముఖానికి కొబ్బరినూనె రాసి రాత్రంతా అలాగే ఉంచితే ఏమవుతుందో తెలుసా?
కొబ్బరి నూనె ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన చర్మ సంరక్షణ పదార్ధం. దీన్ని చాలా మంది ఆయిల్ బేస్డ్ మేకప్ రిమూవర్‌గా, అండర్ ఐ మాయిశ్చరైజర్‌గా ఇంకా నైట్ క్రీమ్‌గా కూడా ఉపయోగిస్తున్నారు, అయితే రాత్రిపూట ముఖం మీద కొబ్బరి నూనెను అప్లై చేయడం వల్ల గొప్ప బాడీ మాయిశ్చరైజర్‌గా పని చేస్తుందా?? అనే ప్రశ్న చాలా మందిలో ఉంది.
సహజంగానే పెద్దవాళ్ళు చలికాలంలో చలికి ఒళ్ళు పగలకుండా కొబ్బరి నూనె శరీరానికి అప్లై చేస్తుంటారు. కొంతమంది ఎంత నూనె పూసినా పెద్దగా పలితం కనిపించలేదని చెబుతుంటారు. ఎన్నో బ్యూటీ ఉత్పత్తులలో కొబ్బరి నూనెను ఉపయోగిస్తుంటారు. ఇలాంటి కొబ్బరి నూనె విషయంలో ఉన్న ప్రశ్నకు సమాధానం ఏంటి??
భారతీయుల జీవన విధానంలో కొబ్బరి నూనె!!
కొబ్బరి నూనె యాంటీ బాక్టీరియల్ అయినందువల్ల ఇది ఎన్నో రకాలుగా వినియోగించబడుతుంది. ముఖ్యంగా కొబ్బరి నూనెను ఉష్ణమండల ప్రాంతమైన భారతదేశం, శ్రీలంక వంటి దేశాల ప్రజలు శతాబ్దాలుగా వివిధ మార్గాల్లో ఉపయోగిస్తున్నారు. అంతే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ చర్మ సంరక్షణ పదార్థాల జాబితాలో కొబ్బరి నూనె అగ్రభాగంలో ఉంటుంది. ఇది చర్మ మంటను తగ్గించడానికి, పాడైన చర్మాన్ని నయం చేయడానికి మరియు వృద్ధాప్యాన్ని మందగించడానికి ఎంతో శ్రేష్ఠమైనదని, అందుకే చర్మసంరక్షణలో కొబ్బరి నూనె ఉపయోగించబడుతుందని నమ్ముతారు. ఇది చర్మం, జుట్టు ఇంకా మొత్తం ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న మల్టీఫంక్షనల్ ఆయిల్ బయటి చర్మాన్ని రిపేర్ చేయడంలో ఇది గొప్పగా హెల్ప్ అవుతుంది. పొడి చర్మానికి ఉత్తమమైనది.
జుట్టుకు కొబ్బరి నూనె వల్ల కలిగే ప్రయోజనాల గురించి మన అమ్మమ్మలు, బామ్మలు ఎప్పటి నుండో చెప్పకపోయినా వాటిని మన జీవితాల్లో భాగం చేశారు. చలికి శరీరానికి పూసుకోవడం, వంటనూనెగా వాడటం, జుట్టుకు ఉపయోగించడం మన పెద్దలకు సహజమైన విషయం. అయితే కొబ్బరి నూనె చర్మంపై ఒక తేలిక పొరను ఏర్పరుస్తుంది. అది సులభంగా పొడిబారదు. దీనిలో ఉన్న చిక్కదనం కారణంగా చర్మరంద్రాలను కప్పి ఉంచి చలి నుండి చర్మాన్ని రక్షిస్తుంది.
కొబ్బరి నూనె మాశ్చరైజర్ గ్ గా పని చేస్తుందా??
అవును కొబ్బరి నూనె గొప్ప శరీర మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఇది మీ చర్మాన్ని రిపేర్ చేస్తుంది చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. మృదువైన మొటిమలు లేని చర్మం కోసం, దీన్ని సున్నితమైన మాయిశ్చరైజర్‌గా ఉపయోగించవచ్చు. అయితే ఈ నూనెలో అణువులు పెద్ద పరిమాణాన్ని కలిగి ఉండటం వలన చర్మంలోకి చొచ్చుకుపోకుండా కేవలం రంధ్రాలను మాత్రమే కప్పి ఉంచుతుంది. అందువల్ల ఇది చర్మాన్ని డీప్ గా మాశ్చరైజ్ చేయదు.
ఇలా కొబ్బరి నూనెను కేవలం జుట్టుకు మాత్రమే కాకుండా సౌందర్య ఉత్పత్తిగా కాకుండా నేరుగా మాశ్చరైజర్ లా కూడా ఉపయోగించవచ్చు. రాత్రి సమయంలో ముఖానికి రాసుకుని అలాగే వదిలేస్తే అది గొప్ప మాశ్చరైజర్ గా పని చేస్తుంది. ముఖం చర్మాన్ని మృదువుగా, మచ్చలు, మొటిమలు లేకుండా మారుస్తుంది.
◆నిశ్శబ్ద.