English | Telugu
శౌర్య కోసం సౌందర్య శపథం.. జ్వాలకు షాకిచ్చిన హిమ!
Updated : Apr 27, 2022
బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియల్ `కార్తీకదీపం`. కార్తీక్, దీప పాత్రలని ఎండ్ చేయడంతో ఈ సీరియల్ గత కొన్ని వారాలుగా కొత్త తరంతో కొత్త మలుపు తీసుకుంది. అయినా వంటలక్క స్థాయిలో మాత్రం రాణించలేకపోతోంది. గత కొన్ని రోజులుగా ఆసక్తికర మలుపులతో సాగుతున్న ఈ సీరియల్ బుధవారం మరింత ఆసక్తిని రేకెత్తించబోతోంది. ఈ రోజు హైలైట్స్ ఏంటీ.. సీరియల్ ఎలా వుండబోతోంది అన్న విషయాల్ని ఇప్పుడు చూద్దాం.
శౌర్య ఇప్పుడు ఎలా వుంటుందో బొమ్మ గీయించి తనని పట్టుకోవాలని సౌందర్య ఓ ఆర్టిస్ట్ ని కలవడానికి వస్తుంది. అదే సమయంలో అక్కడికి చేరుకున్న జ్వాల (శౌర్య) .. సౌందర్య నుంచి హిమ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. మీరు అందరూ హ్యాపీగా వున్నారు. ఒకరు మాత్రం పారిపోయారు అంటూ సౌందర్యను బాధపెట్టేలా మాట్లాడుతుంది. అది సహించని సౌందర్య .. వెంటనే జ్వాలతో గొడవకు దిగుతుంది. ఈ క్రమంలో 'నీ మనవరాలు నాలాంటి అమ్మాయే అయితే ఏం చేస్తావ్?' అని అడుగుతుంది జ్వాల.. 'ఐదు నిమిషాలే నిన్ను భరించలేకపోతున్నా.. నువ్వే నా మనవరాలని తెలిస్తే అమ్మా ఇక్కడి నుంచి వెళ్లిపో అని చెబుతా'అంటుంది సౌందర్య.
దీంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్వాల. కట్ చేస్తే.. జ్వాల వాళ్ల ఇంట్లో తన కోసం హిమ ఎదురుచూస్తూ వుంటుంది. జ్వాల రాగానే 'ఎక్కడికైనా బయటికి వెళదాం' అంటుంది. 'మీ డాక్టర్ సాబ్ తో కలిసి నాగార్జున సాగర్ కు వెళ్లి వద్దాం' అంటుంది. డాక్టర్ సాబ్ వస్తాడా? అనుకుంటూ జ్వాల వెళ్లడానికి సిద్ధమవుతుంది. హిమ, జ్వాల ఇద్దరూ మాట్లాడుకుని వెళ్లడానికి రెడీ అవుతారు. అయితే ఇదే సమయంలో హిమ .. జ్వాలకు షాకిస్తుంది. 'శౌర్య దొరికే సమయం వచ్చింది. ఆర్టిస్ట్ కి చిన్నప్పటి ఫోటోతో పోలికలు చెప్పి బొమ్మ గీయిస్తాను' అని చెప్పి షాకిస్తుంది. అది విని జ్వాల ఎలా రియాక్ట్ అయింది?.. హిమ పెళ్లి కోసం శౌర్య ఎక్కడ వున్నా వెతికి పట్టుకొస్తానని సౌందర్య చేసిన శపథం నెరవేరుతుందా? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.