English | Telugu
తిలోత్తమ కుట్ర.. భర్తతో వనవాసానికి త్రినయని
Updated : Apr 26, 2022
బుల్లితెర పై ప్రసారం అవుతున్న సీరియల్ `త్రినయని`. జరగబోయేది ముందే తెలిసిపోయే వరం వున్న త్రినయని జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల సమాహరమే ఈ సీరియల్ కన్నడ నటులు చందు గౌడ, అషికా గోపాల్ పదుకోన్ ప్రధాన జంటగా నటించారు. దైవ శక్తికి దుష్ట శక్తికి మధ్య సాగే సమరం నేపథ్యంలో ఈ సీరియల్ ఆద్యంతం ఉత్కంఠభరింతంగా సాగుతోంది. తిలోత్తమ కారణంగా తల్లిని పోగొట్టుకున్న విశాల్ ఆ విషయం తెలియకపోవడంతో తిలోత్తమని తల్లిగా ఆరాధిస్తుంటాడు.
ఈ మంగళవారం ఎపిసోడ్ ఎలాంటి మలుపులు తిరిగిందో చూద్దాం. ఆస్తిని నయని నుంచి తన హస్తగతం చేసుకోవాలని పథకం పన్నిన తిలోత్తమ.. కసితో కలిసి విశాల్‌ని, నయనని తంత్రికుడి దగ్గరికి దీసుకెళ్లి విశాల్ తల్లి ఆత్మని బంధించాలని ప్లాన్ చేస్తుంది. అదే క్రమంలో విశాల్ ని కూడా అంతం చేయాలని కుట్ర పన్నుతుంది. విషయం తెలిసిన నయని నితదీయడంతో ఆస్తి పత్రాలపై సంతకం చేస్తావా లేదంటే తల్లి ఆత్మని బంధించి విశాల్ ని అంతం చేయమంటావా తేల్చుకో అంటుంది. చేసేది లేక నయని ఆస్తి పత్రాలపై సంతకం చేస్తుంది.
ఇంటికి వచ్చాక విషయాన్ని బయటపెట్టి నయని తనకు ఇంటి నుంచి వెళ్లిపోవాలని వుందని ఆస్తిని అప్పగించి చెప్పిందని తిలోత్తమ, కసి నాటకం మొదలుపెడతారు. ఇది కుట్ర అని హాసిని వాదించినా నయని మాత్రం ఎక్కడ తాన భర్త విశాల్ ప్రాణాలు తీస్తుందోనని ఎదురు చెప్పదు. నయని చేసిన పని వెనక ఏదో కారణం వుందని నమ్మిన విశాల్ తన చేసిన పనిని సమర్థిస్తాడు. కట్ చేస్తే తిలోత్తమ , కసి ఇద్దరు కలిసి నయనని ఇంటి నుంచి వెళ్లగొట్టాలని మళ్లీ నయని సంతకం పెట్టిన పేపర్ ని అడ్డుపెట్టుకుని తనని ఇంటి నుంచి వెళ్లిపోయేలా చేస్తారు. తనతో పాటు తాను కూడా బయటికి వెళ్లిపోతానని విశాల్ నిర్ణయించుకోవడంతో ముందు షాక్ తిన్న తిలోత్తమ ఇది మరీ మంచిదని సంతోషిస్తుంది.
కట్టుబట్టలతో రాముడి వెంట సీత అడవులకు వెళ్లినట్టు తాను కూడా నయని వెంట వెళ్లిపోతానని, తన తల్లి ఫొటో తీసుకుని బయటికి వెళ్లిపోతాడు విశాల్. నయనితో కలిసి తన తాత కట్టించిన లేబర్ కాలనీలో వుండటానికి వెళతారు.. అక్కడికి వచ్చిన కసి, వల్లభ 5 వేలు అడ్వాన్స్ కడితేనే అక్కడ వుండనిస్తామని కండీషన్ పెడతారు. దీంతో అంతా తలా 5 వందలు వేసి కడతామని కాలనీ వాసులు ముందుకొస్తారు కానీ నయని మాత్రం అందుకు అంగీకరించదు. తన భర్త ప్రేమగా ఇచ్చిన పట్టీలు తాకట్టుపెట్టుకుని డబ్బులు ఇమ్మంటుంది. ఆ తరువాత ఏం జరిగింది? కసి అందుకు అంగీకరించిందా? లేబర్ కాలనీలో నయని, విశాల్ ఎలాంటి కష్టాలు పడ్డారు అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.