English | Telugu
సుమ `క్యాష్` షో లో పృథ్వీ రచ్చ రచ్చ
Updated : Apr 25, 2022
యాంకర్ సుమ హోస్ట్ గా వ్యవహరిస్తున్న క్యాష్ షో ఈటీవీలో పాపులర్ షోగా ప్రేక్షకాదరణ పొందుతున్న విషయం తెలిసిందే. ఈ వారం తాజాగా ఎపిసోడ్ ముగ్గురు హీరోలు, ఓ హీరోయిన్ ఈ షోలో రచ్చ రచ్చ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోని ఇటీవల విడుదల చేశారు. ఏప్రిల్ 30న రాత్రి 9:30 గంటలకు ఈ షో ప్రసారం కానుంది. ఈ వారం గతంలో హీరోలుగా ఓ వెలుగు వెలిగిన `పెళ్లి` ఫేమ్ పృథ్వీ, `6టీన్స్` ఫేమ్ రోహిత్, సీతారాముల కల్యాణం చూతమురారండి` ఫేమ్ వెంకట్, హీరోయిన్ ప్రేమ అతిథులుగా హాజరయ్యారు.
ఈ నలుగురు క్యాష్ షోలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. వెంకట్, రోహిత్, ప్రేమలని మించి పృథ్వీ చేసిన రచ్చ నవ్వులు పూయిస్తోంది. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ప్రేమని ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు. సుమ ఈ నలుగురికి చిన్న టాస్క్ ఇచ్చింది. సినిమాలో హీరోయిన్ ప్రేమ కూరగాయలు కోస్తుంటే వేలు తెగుతుంది. అప్పుడు హీరో ఎలా బిహేవ్ చేస్తాడు అనేది టాస్క్. ముందు వెంకట్ ని రంగంలోకి దించేస్తుంది సుమ.. చాలా రోజుల తరువాత హీరోయిన్ కనిపించడంతో వెంకట్ ఓ రేంజ్ లో సీన్ ని రొమాంటిక్ గా రక్తి కట్టించే ప్రయత్నం చేశాడు. ఈ దశలో ప్రేమ వేలుని నోట్లో పెట్టుకుని జుర్రేశాడు.
ఇక హారర్ కథ అయితే అని సుమ అనగానే పృథ్వీ ఎంట్రి ఇచ్చాడు. దెయ్యంలా ప్రవర్తిస్తూ ప్రేమని భయపెట్టే ప్రయత్నం చేశాడు. అదే ఫ్యాక్షన్ సినిమా అయితే అంటూ సుమ అనడంతో సీన్‌లోకి రోహిత్ వ్చేశాడు. ప్రేమ వేలు తెగిందని బాధపడుతుంటే ఆ వేలు రక్తంతో తిలకం దిద్దుకున్నట్టుగా రోహిత్ నటించి షాకిచ్చాడు. ఆ తరువాత పృథ్వీకి సరదాగా కొన్ని ప్రశ్నలు అడిగింది సుమ. వెంటనే రెడీ అయిపోయి టక టక సమాధానాలు చెప్పేశాడు. వెంకటేష్, నాగార్జు ఇద్దరిలో ఎవరికి కో స్టార్ గా నటించడం ఇష్టం అని అడిగితే నాగార్జున అని చెప్పేశాడు. అంతే కాకుండా నేనే నాగార్జునని లవ్ చేశానని, తను అమ్మాయి అయితే పెళ్లి చేసుకునేవాడినని షాకిచ్చాడు.
ఆ తరువాత తన జీవితంలో జరిగిన ఓ విషాదకర సంఘటనని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు పృథ్వీ. నటుడిగా బిజీగా వున్న సమయంలో తనకు బాబు పుట్టాడని, ఒక రోజు తనకి బాగాలేకుంటే హాస్పిటల్ కు తీసుకెళితే పిల్లాడి మెంటల్ కండీషన్ బాగాలేదన్నారుని అది విన్న తరువాత ఈ సినిమాలు, డబ్బు, అవార్డులు ఎందుకనిపించిందని, ఆ తరువాత కొన్ని రోజుల పాటు డిప్రెషన్ కు లోనయ్యానని ఎమోషనల్ అయ్యారు పృథ్వీ. ఈ ఎపిసోడ్ ఏప్రిల్ 30న రాత్రి 9:30 గంటలకు ప్రసారం కానుంది.