English | Telugu
సుధీర్‌ని డిస్టర్బ్ చేయొద్దంటూ రష్మీకి వార్నింగ్!
Updated : Apr 27, 2022
రష్మీ గౌతమ్ - సుడిగాలి సుధీర్ జంట ఎంత పాపులర్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరూ జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షోలలో చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. వీరి మధ్య వున్న కెమిస్ట్రీని చూసి ఇప్పటికి వీరికి రోజా రెండు సార్లు జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ స్టేజ్ లపై పెళ్లిచేసి ఆ ముచ్చట తీర్చుకున్నారు కూడా. అంతగా పాపులర్ అయి బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోందీ జంట. మళ్లీ ఎక్స్ ట్రా జబర్దస్త్ లో ఈ జంట సందడి చేయడం మొదలు పెట్టింది.
ఇదిలా వుంటే రష్మీ గౌతమ్ ఈ మధ్య పదే పదే సుడిగాలి సుధీర్ ఇంటికి వెళ్తోందట. ఇదే విషయాన్ని సుధీర్ బయటపెట్టడంతో మరోసారి సుధీర్ ఇంటికి వెళ్లొద్దంటూ ఆటో రాంప్రసాద్.. రష్మీ గౌతమ్ కు అందరి ముందే వార్నింగ్ ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే... ఎక్స్ ట్రా జబర్దస్త్ కు సంబందించిన తాజా ప్రోమోని విడుదల చేశారు. శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్ లో సుడిగాలి సుధీర్ కొడుకుగా, ఆటో రాంప్రసాద్ తండ్రిగా కనిపించారు.
ఇద్దరు కలిసి స్కిట్ చేశారు. ఇదే క్రమంలో రష్మీ గౌతమ్ ని చూస్తూ ఆటో రాంప్రసాద్ 'ఎవర్రా అమ్మాయి?' అని సుధీర్ ని అడిగితే.. 'ఏమో నాన్నా రోజూ మన ఇంటికొచ్చి షుగర్ కావాలి.. సాల్ట్ కావాలి అని అడుగుతోంది నాన్నా' అన్నాడు సుధీర్ .. వెంటనే రష్మీ దగ్గరికి వెళ్లిన ఆటో రాంప్రసాద్ .. 'చూడమ్మా పద్దతైన అబ్బాయిలుండే ఫ్యామిలీ.. తనని డిస్టర్బ్ చేయొద్దు.. మా ఇంటికి రావొద్దు' అంటూ వార్నింగ్ ఇచ్చాడు. కట్ చేస్తే శాంతి స్వరూప్ లేడీ గెటప్ లో ఎంట్రీ ఇచ్చేసి సుడిగాలి సుధీర్‌ని చెరుకు రసంలా పిప్పి పిప్పి చేసి వదిలేస్తాడు. అది చూసిన రష్మీ .. 'సుధీర్ యూ పిప్పి పిప్పీ' అంటూ కౌంటర్ వేసేసింది. దీంతో రోజా, పూర్ణ పగలబడి నవ్వేశారు. ఈ ఎపిసోడ్ శుక్రవారం రాత్రి 9:30 గంటలకు ప్రసారం కానుంది.