English | Telugu
రాగసుధ సీడీ రాధాకృష్ణ చేతికి.. ఏం జరగనుంది?
Updated : Apr 26, 2022
మరాఠీ సీరియల్ `తులా ఫఠేరే`. రొమాంటిక్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సీరియల్ ఆధారంగా తెలుగులో నిర్మించిన సీరియల్ `ప్రేమ ఎంత మధురం`. బొమ్మరిల్లు` వెంకట్ శ్రీరామ్, వర్ష హెచ్ కె ప్రధాన జంటగా నటించారు. ఇతర పాత్రల్లో రామ్ జగన్, జయలలిత, బెంగళూరు పద్మ, జ్యోతిరెడ్డి, విశ్వమోహన్, రాధాకృష్ణ, కరణ్, ఉమాదేవి, మధుశ్రీ, అనూషా సంతోష్, కావ్యశ్రీ, సందీప్, రాజీవ్ చంద్ర, శ్రీధర్ తదితరులు నటించారు. గత కొంత కాలంగా విజయవంతంగా సాగుతూ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఈ మంగళవారం ఎపిసోడ్ ఏ మలుపు తిరగనుందో ఓ సారి చూద్దాం. రాగసుధ తన అక్క చావు రహస్యం కోసం వెతుకుతున్న సీడీ అనుకి దొరుకుతుంది. అయితే అది చూడాలని ప్లాన్ చేసుకున్న అను, ఆర్య వర్థన్ జంట మాన్సీ కారణంగా చూడలేకపోతారు. ఆ తరువాత రోజు ఆఫీస్ కు వెళ్లిన అను ఆ సీడీని కావాలనే డస్ట్ బీన్ లో పడేస్తుంది. అది కాస్తా అవకాశం కోసం ఎదురుచూస్తున్న రాధాకృష్ణకు దొరుకుతుంది. దాన్ని ల్యాప్ టాప్ లో వేసి ఆడియో అందులో రాజనందిని వద్దు ఆర్య అంటూ అరుస్తున్న అరుపులు వింటాడు.
వెంటనే ఆర్య క్యాబిన్ కి వెళ్లి అక్కడ ఎవరున్నారో కూడా గమనించకుండా ఆర్య వర్థన్ మనిషే కాదు.. నరరూప రాక్షసుడు.. ఆర్య వర్థన్ ఏ మాత్రం జాలీ, దయా లేకుండా ఓ ఆడదాన్ని దారుణంగా చంపేసిన శాడిస్టు అని రంకెలేస్తాడు. ఇదంతా ఆర్య పక్కనే వుండి వింటున్న అను షాకవుతుంది. ఆర్య కు ఏం జరుగుతోందో అర్థం కాదు. ఆ తరువాత ఏం జరిగింది? రాధాకృష్ణకు ఆర్య వర్థన్ - జెండే ఎలాంటి సన్మానం ఏర్పాటు చేశారు? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.