English | Telugu
హిమ పెళ్లికి సౌందర్య ప్లాన్.. రగిలిపోతున్న స్వప్న
Updated : Apr 26, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `కార్తీక దీపం`. గత కొంత కాలంగా మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నఈ సీరియల్ ని తాజాగా కొత్త తరంతో మొదలుపెట్టిన విషయం తెలిసిందే. గత కొన్ని వారాలుగా గాడి తప్పిన ఈ సీరియల్ ఇప్పుడిప్పుడే ట్రాక్ లో కి వస్తోంది. మంగళవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. హిమ మామిడితోటలో మామిడి కాయలు కోయడానికి ప్రయత్నిస్తుండగా ఇంతలో అక్కడికి వచ్చిన నిరుపమ్ .. హిమని ఎత్తుకుని మామిడి కాయలు కోయిస్తాడు. నిరుపమ్ చేసిన పనికి హిమ ఆశ్చర్యపోతుంది.
ఇదంతా చాటుగా చూసిన స్వప్న వీరి ఆగడాలు రోజు రోజుకూ మితిమీరిపోతున్నాయని వెంటనే వెళ్లి హిమపై సీరియస్ అవుతుంది. కట్ చేస్తే ఆనందరావు, సౌందర్ కలిసి కారులో వెళుతుండగా నాకు శౌర్య దొరికినట్టు కల వచ్చింది అని చెబుతాడు. ఈ కల నిజమైతే ఎంత బాగుండు అని అనడంతో సౌందర్య కూడా అవును అంటుంది. ఇంతలో జ్వాల (శౌర్య) వెనకవైపు నుంచి వచ్చి కారుని ఢీ కొడుతుంది. అది చూసిన సౌందర్య చూసుకుని నడపవచ్చుకదా అని సీరియస్ అవుతుంది. ఆ మాటలకు జ్వాల `సీనియర్ సిటిజన్స్ అని కౌంటర్ వేయడంతో ఆనందరావు నవ్వేస్తాడు.
కట్ చేస్తే ఆటో డ్యామేజీకి ఎంతవుతుందో చెప్పు ఇస్తా అని సౌంద్య అంటుంది. నీ కారు కైన డ్యామేజీ ఎంతో చెప్పు నేనూ ఇస్తానని జ్వాల ఎదుఉ ప్రశ్నిస్తుంది. అప్పుడు జ్వాలని చూసి నిన్ను చూస్తే నా మనవరాలిని చూసినట్టుగానే వుందని ఆనందరావు ఫీలవుతాడు. కట్ చేస్తే స్వప్న జరిగింది తలుచుకుని కోనంతో రగిలిపోతూ వుంటుంది. అదే సమయంలో ఆనందరావు రావడంతో నా బాధ ఎవరికి చెప్పుకోవాలో .. ఎవరిపై చూపించాలో అర్థం కావడం లేదు డాడీ అంటుంది. ఇదిలా వుంటే హిమకు పెళ్లి చేయాలని సౌందర్య ప్రయత్నాలు ప్రారంభిస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది?.. స్వప్న ఎలా రియాక్ట్ అయింది అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.