English | Telugu
యష్ ని ఆడుకోవడం మొదలు పెట్టిన వేద
Updated : Apr 27, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మల బంధం`. గత కొన్ని నెలల క్రితం స్టార్ మా లో ప్రారంభమైన ఈ సీరియల్ అనూహ్యంగా మహిళా ప్రేక్షకుల ఆదరణ పొందుతూ విజయవంతంగా దూసుకుపోతోంది. నిరంజన్, డెబ్జాని మోడక్ జంటగా నటించారు. ఇతర ప్రధాన పాత్రలలో బెంగళూరు పద్మ, జీడిగుంట శ్రీధర్, ఆనంద్, ప్రణయ్ హనుమండ్ల, మిన్ను నైనిక తదితరులు నటించారు. తల్లి భారమని వదిలించుకున్న ఓ పాప, ఆ పాప కోసం తపించే ఓ యువతి.. తన పాప కోసం అదే యువతిని పెళ్లి చేసుకున్న యువకుడు.. ఇలా ముగ్గురి నేపథ్యంలో సాగే ఓ అందమైన రొమాంటిక్ ఫ్యామిలీ కథగా ఈ సీరియల్ ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతోంది.
యష్ కారణంగా కూల్ డ్రింక్ లో కలిపిన మందు తాగిన వేద హ్యాంగోవర్ తో బాధపడుతూ వుంటుంది. టాబ్లెట్ కావాలని యస్ ని అడుగుతుంది. దీనికి టాబ్లెట్ అవసరం లేదని, నిమ్మరసం తాగితే సరిపోతుంది. తాగి తలకెక్కింది దిగుతుంది అంటాడు. కట్ చేస్తే.. అంతా పొద్దున్నే టిఫిన్ చేస్తూ వుంటారు. ఈ లోగా వేద ఎక్కడ యష్ అని మాలిని అడుగుతుంది. ఇంకా రూమ్ లోనే వుందంటాడు. అప్పుడు మాలిని అంతా నీవల్లే జరిగింది అంటుంది. ఇంతలో అక్కడికి వేద వస్తుంది. అది గమనించిన మాలిని టిఫిన్ చేయమని చెబుతుంది. తరువాత తింటానని, తనకు తల నొప్పిగా వుందంటుంది. ఇంతలో యష్ చెంప కందిపోయి వుండటాన్ని గమనించిన మాలిని ఆ దెబ్బ ఏంటి అని అడుగుతుంది. ఓ గండు పిల్లి కరిచిందంటాడు యష్.. ఇది ఖచ్చితంగా లేడీ గండుపిల్లే అంటుంది కంచు. ఈ సంభాషణలో హ్యాంగోవర్ అనే మాట బయటికి వస్తుంది.
ఇది విన్న ఖుషీ హ్యాంగోవర్ అంటే ఏంటి డాడీ అని యష్ ని అడుగుతుంది. దీంతో కోపంతో ఊగిపోయిన వేద నువ్వు చేసిన పనికి ఎలా అడుగుతోందో చూడు` అని కోపంగా యష్ ని చూస్తూ ఎవరికి తెలియకుండా సైగ చేస్తుంది. అది గమనించిన కంచు నవ్వుకుటుంది. కట్ చేస్తే .. వేద తన తల్లి సులోచన దగ్గరికి వెళ్లి పార్టీలో తను తాగిన మైకంలో అసభ్యంగా ప్రవర్తించానా? అని అడుగుతూ బాధపడుతుంది. అలాంటిది ఏమీ లేదని, కాకపోతే ఇంటికి వచ్చిన గెస్ట్ లలో ఇద్దరు నిన్ను అవమానించాలని చూశారని, అప్పుడు యష్ నీ గురించి గొప్పగా చెప్పాడంటుంది.
కట్ చేస్తే.. యష్ దగ్గరికి వచ్చిన వేద నాతో తప్పు చేయించినందుకు సారీ చెప్పండి అని పట్టుబడుతుంది. నీకు నేను సారీ చెప్పడం ఏంటని యష్ సీరియస్ అవుతాడు. ఇదే సమయంలో ఇద్దరి మధ్య మళ్లీ గిల్లికజ్జాలు మొదలవుతాయి. ఇక నుంచి నేను నీకు టార్చర్ అంటే ఏంటో చూపిస్తానని యష్ ఛాలెంజ్ చేస్తాడు. నేను కూడా చూపిస్తానని వేద ఛాలెంజ్ చేస్తుంది. ఇద్దరు కలిసి ఆఫీస్ లకు బయలుదేరతారు. ఈ లోగా వేద కాళ్ల దగ్గర యష్ కారు కీస్ పడిపోతాయి. అవి ఇవ్వమని యష్ అంటే ఇవ్వను మీరే తీసుకోండి అని బెట్టుచేస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది? వేద కాళ్ల వద్ద పడిన కీస్ తీసుకున్నాడా? ఇద్దరిలో ఎవరు తగ్గారు.. ఎవరు ఓడారు అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.