English | Telugu
అనిల్‌ని కాపాడి హమీదాకు షాకిచ్చిన బిగ్‌బాస్
Updated : May 1, 2022
బిగ్‌బాస్ నాన్ స్టాప్ రియాలిటీ షో ఎండింగ్ కు చేరుకుంటోంది. ఇటీవల ఫ్యామిలీ ఎపిసోడ్ తో హౌస్ భావోద్వేగాలతో బరువెక్కిపోయింది. ఇంటి సభ్యులు తమ కుటుంబ సభ్యులు రావడంతో ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం హౌస్ లో అషురెడ్డి, అరియానా, నటరాజ్ మాస్టర్, అనిల్, మిత్రశర్మ, యాంకర్ శివ, బిందు మాధవి, హమీదా, అఖిల్, బాబా భాస్కర్ వున్నారు. అయితే ఇందులో నామినేషన్స్ లో మాత్రం అషురెడ్డి, అఖిల్, బిందు మాధవి మినహా అంతా వున్నారు.
అయితే ఇటీవల మహేష్ విట్టా ఎలిమినేషన్ నుంచి హౌస్ లో ఎలిమినేట్ అవుతున్నవారు.. ఓటింగ్ కారణంగా కాకుండా బిగ్ బాస్ ఇష్టానుసారమే ఎలిమినేషన్ జరుగుతోందని క్లారిటీ వచ్చేసింది. దీంతో ఈ వారం కూడా ఎవరు ఎలిమినేట్ అవుతారన్న దానిపై చాలా వరకు క్లారిటీ లేదు. ఎందుకంటే బిగ్‌బాస్ ఓటింగ్ తో కాకుండా ఇష్టాను సారం నచ్చని వారిని ఎలిమినేట్ చేస్తూ వెళుతున్నాడు కాబట్టి ఈ వారం కూడా తనకు నచ్చని వారినే ఎలిమినేట్ చేస్తాడన్నది అందరికి అర్థమైంది.
ఫైనల్ గా అదే జరిగింది కూడా. ఫినాలే దగ్గరపడుతున్న సమయంలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. దీనిపై చర్చ కూడా జరిగింది. ఈ క్రమంలోనే హౌస్ నుంచి హమీదా ఎలిమినేట్ అవుతున్నట్టుగా బిగ్ బాస్ ముందే లీకులు ఇచ్చేయడంతో అంతా ఊహించిందే జరిగింది. గత ఎనిమిది వారాలుగా ఎలిమినేషన్ విషయంలో లీకులే నిజమవుతూ వచ్చాయి. ఈ వారం కూడా అదే జరిగింది. దీని ప్రకారం హమీదాని ఎలిమినేట్ చేసేశారు. అయితే అనిల్ ని కాపాడటం కోసమే హమీదాని ఎలిమినేట్ చేయడం ఇక్కడ గమనార్హం. దీంతో బిగ్ బాస్ నాన్ స్టాప్ పై నెటిజన్ లు దారుణంగా కామెంట్ లు చేయడం మొదలు పెట్టారు.